మార్కండేయ మహా పురాణము
33 – మదాలస తుది బోధ
జడుడు:
స ఏవ మనుశిష్ట స్సన్ మాత్రా సంప్రాప్య యౌవనమ్ ఋతధ్వజ సుత శ్చక్రే సమ్యగ్దార పరిగ్రహమ్ పుత్రాం శ్చోత్పాదయామాస యఙ్ఞైశ్చాప్య యజ ద్విభుః పితౄశ్చ సర్వకాలేషు చకారా జ్ఞానుపాలనమ్ తతః కాలేన మహతా సంప్రాప్య చరమం వయః చక్రేభిషేకం పుత్రస్య తస్య రాజ్యే ఋతధ్వజః భార్యాయా సహ ధర్మాత్మా యియాసు స్తపసే వరమ్ అవతీర్ణో మహీరక్షో మహాభాగో మహీపతిః మదాలసా చ తనయం ప్రాపేదం పశ్చిమం వచః కామోపభోగ సంసర్గ ప్రహాణాయ సుతస్య వై
జడుడు:
తల్లిచే ఈ ప్రకారము ఉపదేశింప బడిన పిమ్మట ఋతధ్వజుని కుమారుడగు అలర్కుడు యౌవనము పొందగానే విధి ప్రకారముగా వివాహమాడెను. క్రమముగా పుత్రులను గనెను. వివిధములగు యజ్ఞములు చేసెను. నిరంతరము తండ్రి యొక్క ఆజ్ఞ ననుసరించి యుండెను. చాలా కాలము గడచిన పిమ్మట ధర్మాత్ముడగు ఋతధ్వజుడు వృద్దుడగుటచే భార్యా సహితుడై వనమునకు బోదలచి కుమారుడగు అలర్కునకు రాజ్య పట్టాభిషేకము చేసెను. అప్పుడు తల్లియగు మదాలస పుత్రునికి కామ భోగముల నుండి విరక్తి కలిగించ వలెనని తుది వాక్యములను ఇట్లు చెప్పెను.
మదాలస:
యదా దుఃఖ మసహ్యం తే ప్రియబందు వియోగజమ్ భవే త్తత్కుర్వతో రాజ్యం గృహ ధర్మావలమ్పినః దుఃఖాయతన భూతో హి మమత్వాలంబనో గృహీ తదాస్మా త్పుత్రః నిష్కృష్య మద్దత్తా దంగు లీయకాత్ వాచ్యం తే శాసనం పట్టే సూక్ష్మాక్షర నివేషితమ్
మదాలస:
కుమారా! ఎప్పుడు నీకు ప్రియమైన బంధువులచే అసహ్యమగు దుఃఖము కలుగునో లేక శత్రు బాధలు గాని, గృహ ధర్మావలంబివియై రాజ్యము చేయు నీకు ప్రియ బంధువుల వియోగము గాని కలుగ వచ్చును. అసహ్యమగు దుఃఖము కలుగ వచ్చును. గృహస్థుడు ఎల్లప్పుడు మమకారము కల వాడగుటచే దుఃఖితు డగుచున్నాడు. ఆ కారణము చేత గృహస్థ ధర్మావలంబివై రాజ్యము చేయుచుండ దుస్సహమగు దుఃఖము ప్రాప్తించి నపుడు నేను ఇచ్చు ఈ అంగుళీయకము నుండి పత్రమును బైటకు తీసి దాని మధ్య యందున్న సూక్ష్మమైన అక్షరములచే వ్రాయబడిన శాసనమును పఠించుము.
జడుడు:
ఇత్యుక్త్వా ప్రదతౌ తస్మై సౌవర్ణ సాంగుతీయమ్ ఆశిషశ్చాపి యా యోగ్యాః పురుషస్య గృహే సతః తతః కువలయాశ్వో సౌ సా చ దేవీ మదాలసా పుత్రాయ దత్త్వా తద్రాత్యం తపసే కాననం గతౌ
జడుడు:
మదాలస ఇట్లు చెప్పి తన సువర్ణాంగుళీయకమును ఇచ్చి గృహస్థాశ్రమ మందున్న వారికి యోగ్యములగు ఆశీర్వచనములను చేసెను. అనంతరము ఆ కువలయాశ్వుడు భార్యయగు మదాలసయు, ఆ రాజ్యమును పుత్రున కిచ్చి, తపస్సు కొరకు అడవికి బోయిరి.
Summary of chapter 33 of the Mārkandeya Mahā Purana is as follows:
Prince Subāhu allies with the powerful King of Kānshī and lays siege to Alarka's capital, stripping Alarka of his territory and wealth piece by piece. Reduced to dire distress and facing imminent total defeat, Alarka remembers his mother's parting gift and opens the sacred ring containing her hidden spiritual message.