మార్కండేయ మహా పురాణము
50 - భువనకోశ మందు స్వాయంభువ మన్వంతర కథనము.
క్రౌష్టుకి:
స్వాయంభువం త్వయా ఖ్యాత మేత న్మన్వంతరం చ యత్ తదహం భగవాన్ స్సమ్యక్ శ్రోతు మిచ్చామి కథ్యతామ్ మన్వంతర ప్రమాణం చ దేవా దేవర్షయ స్తథా యే చ క్షితీశా భగప న్దేవేంద్ర శ్చైవ య స్తథా
క్రౌష్టుకి:
హే భగవాన్! తమరు ఎట్టి స్వాయంభువ మన్వంతర విషయమును వర్ణించితిరో దానిని బాగుగా విన వలెనని కోరు చున్నాను. గాన చెప్పుము. హే బ్రాహ్మన్! మన్వంతర ప్రమాణము దేవతలు, దేవర్షులు, క్షత్రియులు, దేవేంద్రుడు, వీరి కథను విస్తార సహితముగా వర్ణింపుడు.
మార్కండేయుడు:
మన్వంతరాణాం సంఖ్యాతా సాధికా హ్యేక సప్తతిః మానుషేణ ప్రమాణేన శృణు మన్వంతరం చ మే త్రింశత్కోత్యస్తు సంఖ్యతా సహస్రాణి చ వింశతిః సప్త షష్టి స్తథా న్యాని నియుతాని చ సంఖ్యయా మన్వంతర ప్రమాణం చ ఇత్యేత త్సాధికం వినా అష్టో శత సహస్రాణి దివ్యయా సంఖ్యయా స్మృతమ్
మార్కండేయుడు:
మన్వంతరముల యొక్క సంఖ్య కొంచెము అధికముగా డెబ్బది ఒకటి మహా యుగముల, ముప్పది కోట్ల, అరువది ఏడు లక్షల, ఇరువది వేల వర్షములు. మానవుని మానముచే ఒక మన్వంతరమునకు గడుచును. ఈ మన్వంతరము యొక్క ప్రమాణము అధికము కాకుండా దేవతలకు ఎనిమిది లక్షలు, దేవమానముచే నగును.
ద్వి పంచాశ త్తథాన్యాని సహ సాణ్యధికాని చ స్వాయంభువో మనుః పూర్వం మనుః స్వారోచిష స్తథా ఔత్తమ స్తామసశ్చైవ రైవత శ్చాక్షుష స్తథా షడేతే మనవోతీతా స్తథా వైవస్వతోదునా సావర్ణాః పంచ రౌచ్యాశ్చ భౌత్యాశ్చాగామిన స్త్వమీ ఏతేషాం విస్తరం భూయో మన్వంతర పరిగ్రహే వక్ష్యే దేవా నృషీం శ్చైప దేవేంద్రాః పితరశ్చ యే ఉత్పత్తి సంగ్రహం బ్రాహ్మన్! శ్రూయతా మస్య సంతతిః యచ్చ తేషా మభూత్క్షేత్రం తత్పుత్రాణాం మహాత్మనామ్ మనోః స్వాయంభువస్యాసన్ దశపుత్రాస్తు తత్సమాః
యాబది రెండు వేల సంవత్సరములు ఒక మన్వంతరము నందు గడచి పోవును. మొదటి వాడు స్వాయంభువు. రెండవది స్వారోచిష మన్వంతరము. ఉత్తమ, తామస, రైవత, చాక్షుష అను ఆరు మన్వంతరములు గడచి పోయెను. ఈ సమయమున వైవస్వత మన్వంతరము జరుగుచున్నది. పంచసావర్ణులు, రౌచ్య, భౌత్యులు, రాబోవు వారు. వీరి సంపూర్ణ వృత్తాంతము మన్వంతరముల యొక్క వర్ణన ముందు విస్తార రహితముగా నీకు చెప్పుదును. హే బ్రాహ్మన్! దేవతా, ఋషి ఇంద్ర, పితరులు ఎవరెవరు మన్వంతరమున ఉండిరో వారందరి పుట్టుక మరియు సంతాన రహితముగా వర్ణించి చెప్పెదను వినుము. ఆ మహాత్ములగు పురుషులకు ఏ ఏ స్థానములు ఉన్నవో ఎట్టి సంతానము కలిగినవో వానిని కూడ చెప్పుదును. స్వాయంభువ మనువునకు పది మంది పుత్రులు కల్గిరి. తండ్రితో సమానముగా ఉండిరి.
యై రియం పృథివీ సర్వా సప్త ద్వీపా సపర్వతా ససముద్రా కరవతీ ప్రతి వర్షం నివేశితా స్వాయంభువేంతరే పూర్వ మాధ్యే త్రేతాయుగే తథా ప్రియవ్రతస్య పుత్రై స్తైః పౌత్రైః స్వాయంభువస్య చ ప్రియవ్రతా త్ప్రజావత్యాం వీరా త్కన్యా వ్యజాయత కన్యా సా తు మహాభాగా కర్దమస్య ప్రజాపతేః కన్యే ద్వే దశ పుత్రాంశ్చ సమ్రాట్ కుక్షీ చ తే ఉభే తయో ర్వై భ్రాతరః శూరా ప్రజాపతి సమా దశ ఆగ్నీ ధో మేథాతిథిశ్చ వపుష్మాంశ్చ తథా పరః జ్యోతిష్మాన్ ద్యుతిమాన్ భవ్యః సవనః సప్త ఏవ తే
వీరు భూమిని సప్త ద్వీపములు గాను, పర్వతములతో కూడినవియు రత్నాకరములగు సముద్రములతో వర్ష విభాగములు చేసిరి. పూర్వ మందు స్వాయంభువ మన్వంతర మనగా త్రేతాయుగ ఆరంభ మందు ప్రియవ్రతుని పుత్రులు స్వాయంభువు యొక్క పౌత్రులు ఇట్లు చేసిరి. కర్దమ ప్రజాపతికి “ప్రజాపతి” అను పేరు గల మహాభాగ యగు కన్య యొక్క గర్భము నందు ప్రియవ్రతుని వలన పది మంది పుత్రులు, ఇద్దరు కన్యలు జన్మించిరి. ఈ ఇద్దరు కన్యలు సమ్రాట్, కుక్షి అను పేర్లను ధరించిరి. మరియు పది మంది సోదరులు మహా శూరులు. ప్రజాపతితో సమానముగా నుండిరి. వారి పేర్లు ఆగ్నీధ్ర, మేథాతిధి, వపుష్మాన్, జ్యోతిష్మాన్, ద్యుతిమాన్, భవ్య, సవన, మేధ, అగ్ని బాహు, మిత్రులు అనువారు.
మేథాగ్ని బాహుమిత్రాస్తు త్రయో యోగాపరాయణాః జాతిస్మరా మహాభాగా న రాజ్యాయ మనో దధుః ప్రియవ్రతో భ్యషించ త్తాన్ నృపః సప్తమ పార్థివాన్ ద్వీపేషు తేన ధర్మేణ ద్వీపాంశ్చైవ నిభోద మే జంబూ ద్వీపే తథాగ్నీ థ్రం రాజానం కృతవా న్పితా ప్లక్ష ద్వీపేశ్వర శ్చాపి తేన మేధాతిథిః కృతః శాల్మలేస్తు వపుష్మంతం జ్యోతిష్మంతం కుశాహ్వయే కౌంచ ద్వీపే ద్యుతిమంతం భవ్యం శాకాహ్వయేశ్వరమ్ పుష్కరాధిపతిం చాపి సరవం కృత్వా న్సుతమ్ మహావీతో దాతకిశ్చ పుష్కరాధిపతేః సుతౌ ద్విధా కృత్వా తయో ర్వర్షం పుష్కరే సన్యవేశయత్ భవ్యస్య పుత్రాః సప్తాస న్నామత స్తా న్నిబోధ మే
ఓ మహాభాగా! అందరి కంటే చిన్న వారైన మేధా, అగ్నిబాహు మిత్రులు జాతిస్మరు లైనందున రాజ్యము చేయలేదు. యోగ పరాయణులైరి. అప్పుడు మిగిలిన ఆ ఏడుగురు పుత్రులకు రాజైన ప్రియవ్రతుడు ఏడు ద్వీపాల రాజ్యము నిచ్చెను. వారు కూడా ధర్మ సహితులై ఏడు ద్వీపాలను రాజ్యము చేయుట ప్రారంభించిరి. ఇప్పుడు నేను ఆ ద్వీపముల పేర్లు కూడా వర్ణించెదను వినుము. రాజగు ప్రియవ్రతుడు అగ్నీధ్రుని జంభూ ద్వీపమునకు రాజును చేసెను. మేధాతిథికి ప్లక్ష ద్వీపము యొక్క రాజ్యము నిచ్చెను. వపుష్మానుని శాల్మిలి ద్వీపానికి, జ్యోతిష్మానుని కుశ ద్వీపానికి, ద్యుతిమానుని క్రౌంచ ద్వీపానికి, భవ్యుని శాక ద్వీపానికి, రాజులను చేసెను. సవనుని పుష్కర ద్వీపానికి, అధిపతిని చేసెను. అప్పుడు ఈ పుష్కరాదిపతి యగు సవనునికి మేధావి , ధాతకి అను పేరు గల ఇద్దరు పుత్రులు కల్గిరి. ఆ ఇద్దరు పుత్రులకు మహారాజగు సవనుడు పుష్కర ద్వీపమును రెండు భాగములు చేసి పంచి ఇచ్చెను. శాక ద్వీప రాజగు భవ్యునికి ఏడుగురు పుత్రులు కలిగిరి. వారి పేర్లను చెప్పెదను వినుము.
జలదశ్చ, కుమారశ్చ, సుకుమారో మణీవకః కుశోత్తరోథ మేథావీ సప్తమస్తు మహాద్రుమః తన్నామకాని వర్షాణి శాకద్వీపే చకార సః తథా ద్యుతిమతః సప్త పుత్రా స్తాం స్తు నిబోధ మే కుశలో మనుగ శ్చోష్ణః ప్రాకారశ్చార్థ కారకః మునిశ్చ దుందుభి శ్చైవ సప్తమః పరికీర్తితః తేషాం స్వనామధేయాని క్రౌంచ ద్వీపే తథా భవన్ జ్యోతిష్మతః కుశద్వీపే పుత్రా నామాంకి తాని వై (తత్రాపి సప్త వర్షాణి తేషాం నామాని మే శృణు)
తస్యాపి సప్త పుత్రాస్తు జ్ఞేయా స్తేపి మహౌజనః ఉద్భితం వైణవం చైవ సురధం లంబనం తథా ధృతిమ త్ప్రాకరం చైవ కపిలం చాపి సప్తమమ్ వపుష్మతః సుతాః సప్త శాల్మలేశస్య చాభవన్
జలద, కుమార, సుకుమార, మణీవక, కుశోత్తర, మేధావి, మహాద్రుములు అను పేర్లు గలిగి ఉండిరి. అప్పుడు శాక ద్వీపమును ఏడు భాగములు చేసి ఆ రాజు ఏడుగురు పుత్రులకు ఇచ్చెను. అది సప్త భాగములు, సప్త వర్షములు అన్న పేర్లతో ప్రసిద్ధి చెందినవి. ఈ విధముగా క్రౌంచ ద్వీపము యొక్క రాజగు ద్యుతిమానునికి కూడా ఏడుగురు పుత్రులు కలిగిరి. వారి పేర్లను కూడ చెప్పెదను వినుము. కుశల, మనుగ, ఉష్ణ, ప్రాకార, అర్థకారక, ముని, దుందుభులు అను పేర్లు గలిగి ఉండిరి. ఈ ఏడుగురిని అనుసరించి క్రౌంచ ద్వీపమును కూడ ఏడు భాగములు చేసెను. జ్యోతిష్మానుడు గూడ ఏడుగురు పుత్రులకు నామానుసారము కుశ ద్వీపమును ఏడూ భాగములు చేసి పంచి పెట్టెను. ఇక్కడ కూడా ఏడు వర్షములు చేయబడెను. వాని పేర్లను నా వలన వినుము. వాటి పేర్లు ఇవి. ఉద్భిద, వైష్ణవ, సురథ, లంబన, ధృతిమాన, ప్రాకార, కపిలులు మరియు శాల్మలి ద్వీప రాజగు వపుష్మానుడు కూడ ఏడుగురు పుత్రులను పొందెను.
శేతశ్చ హరిత శ్చైవ జీమూతో రోహిత స్తథా వైద్యుతో మానస శ్చైవ కేతుమా న్సప్తమ స్తథా తథైవ శాల్మలే తేషాం సమ నామాని సప్త వై సప్త మేధాతిథేః పుత్రాః ప్లక్ష ద్వీపేశ్వరస్య వై యేషాం నామాంకితైర్వర్షేః ప్లక్ష ద్వీపస్తు సప్తధా పూర్వం శాకభవం వర్షం శిశిరం తు సుఖోదయమ్ ఆనందం చ శివా చైవ క్షేమకం చ ధృవం తథా ప్లక్ష ద్వీపాది భూతేషు శాక ద్వీపాంతిమేషు వై జ్ఞేయః పంచసు ధర్మశ్చ వర్లాశ్రమ విభాగజః నిత్యః స్వాభావిక శ్చైవ అహిసావిధి వర్జితః యాని కిం పురుషాధ్యాని వర్జయిత్వా హిమాహ్వయమ్ సుఖ మాయుశ్చ రూపం చ బలం ధర్మశ్చ నిత్యశః
వారి పేర్లు స్వేత, హరిత, జీమూత, రోహిత, వైద్యుత, మానస, కేతుమానులు అను పేర్లు గల వారై యుండిరి. వీరి పేర్లతో ఆ శాల్మలీ ద్వీపము కూడ ఏడు భాగములై వర్ష నామములతో ప్రసిద్ధి చెందెను. ప్లక్ష ద్వీపమును ఏడు భాగములు చేసి ఇచ్చెను. వీరందరి పేర్లతో వర్షములు విఖ్యాతి చెందినవి. వారి పేర్లు శాఖభవ, శిశిర, సుఖోదయ, ఆనంద, శివ, క్షేమక, ధృవులు, మరియు ప్లక్ష, శాల్మలి, కుశ, క్రౌంచ, శాక, ద్వీపములను, ఈ ద్వీపము లందు, ఎల్లప్పుడూ వర్ణాశ్రమ ధర్మాలు చేయు చుందురు మరియు సహజ స్వభావములతోనే అక్కడ హింసా విధి వర్ణితులు అనగా హింస ఉండదు.
పంచ స్వేతేషు పర్షేషు సర్వ సాధారణః స్మృతః ఆగ్నీద్రాయ పితా పూర్వం జంభూ ద్వీపం దదౌ ద్విజః తస్య పుత్రా బభూవుర్హి ప్రజాపతి సమా నవ జ్యేష్టో నాభి రితి ఖ్యాత స్తస్య కింపురుషోనుజః హరివర్ష స్తృతీ యస్తు చతుర్థోభూ దిలావృతః వశ్యశ్చ పంచమః పుత్రో హిరణ్యః షష్ఠ ఉచ్యతే కురుస్తు సప్తమ స్తేషాం భద్రాశ్వ శ్చాష్టమః స్మృతః నవమః కేతుమాలశ్చ తన్నామ్నా వర్ష సంస్థికిః
(మరియు హిమాలయమును వదిలి ఏ కింపురుషాది వర్షముల యందు సుఖము, పూర్ణాయువు రూపము, బలము, ధర్మము ఎల్లప్పుడు ఉండును.) ఓ ద్విజోత్తమా! సంపూర్ణ ధర్మములు ఈ ఐదు ద్వీపముల యందు సాధారణములు. అగ్నీధ్రునకు అతని తండ్రి జంభూ ద్వీపమును ప్రసాదించెను గదా! అతనికి ప్రజాపతితో సమానమగు తొమ్మిది మంది పుత్రులు జన్మించిరి. మొదటి వాని పేరు నాభి, రెండవవాడు కింపురుషుడు, మూడవవాడు హరివర్షుడు, నాల్గవ వాడు ఇలావృతుడు, ఐదవ వాడు వశ్యుడు, ఆరవ వాడు హిరణ్యుడు, ఏడవ వాడు కురువు, ఎనిమిదవ వాడు భద్రుడు, తొమ్మిదవ వాడు కేతుమాలుడను వీరందరి నామానుసారము వర్షములు కూడ విభజింప బడినవి.
యాని కింపురుషాద్యాని వర్ణయిత్వా హిమాహ్వయమ్ తేషాం స్వభావతః సిద్దిః సుఖప్రాయా హ్యాయత్నతః విపర్యయో న తేష్వస్తి జరా మృత్యు భయం న చ ధర్మాధర్మో న తేష్వాస్తాం నోత్తమాధమ మధ్యమాః న వై చతుర్యు గావస్థా నాశ్రమా ఋతవో న చ ఆగ్నీధ్ర సూనో ర్నాభేస్తు ఋషభోభూ త్సుతో ద్విజ! ఋషభార్భరతో జజ్ఞే వీరః పుత్ర శతా ద్వరః సోభిషిచ్యరభః పుత్రం మహాస్రామ్రాజ్య మాస్థితః తపస్తేపే మహాభాగః పులహాశ్రమ సంశ్రయః హిమాహ్వం దక్షిణం వర్షం భరతాయ పితా దదౌ
హిమాలయము కాక కింపురుషాది వర్షముల యందుండు వారికి స్వభావము గానే సిద్ధి యత్నము లేకనే సుఖ లాభము కలుగు చుండును. విపర్యయ, జరా మృత్యు భయములు లేవు. అక్కడ ధర్మా ధర్మములు, ఉత్తమ, మధ్యమ, అథమ, విభాగములు లేవు. నాలుగు యుగాల విభిన్న అవస్థలు, ఋతు విభాగములు ఉండవు. ఆగ్నీధ్రుని కుమారుడగు నాభి యొక్క సంతానముగా ఋషభుడు కలిగెను. ఆ ఋషభుని యొక్క పుత్రుడు భరతుడు, ఋషభుడు పుత్రుని రాజ్య మందు అభిషిక్తుని జేసి సన్యాసమును స్వీకరించెను. అవధూత అయ్యెను. మరియు పులహాశ్రమ మందు నివాసము చేసి ఈ మహాభాగుడు తపస్సు చేసెను. హిమమను పేరుగల దక్షిణ వర్షమును భరతునకు ఇచ్చెను.
తస్మాత్తు భారతం వర్షం తస్య నామ్నా మహాత్మనః భరతః స్యాన్వభూత్పుత్రః సుమతిర్నామ ధార్మికః తస్మి న్రాజ్యం సమావేశ్య భరతోపి వనం యయౌ ఏతేషాం పుత్ర పౌత్రేస్తు సప్త ద్వీపా వసుంధరా ప్రియ వ్రతస్య పుత్రైస్తు భుక్తా స్వాయంభువేంతరే ఏష స్వాయంభువః సర్గః కథిత స్తే ద్విజోత్తమః పూర్వః మన్వందరే సమయ క్కిమన్య త్కథయామి తే
ఈ కారణమున అతని పేరు ననుసరించి భరత వర్షమని పేరు వచ్చెను. భరతునికి సుమతి అను పేరు గల ఒక ధార్మిక పుత్రుడు కలిగెను. అతడు కూడా సుమతికి రాజ్యము నిచ్చి అడవికి పోయెను. ఇతని యొక్క పుత్ర పౌత్ర గణాలు మరియు ప్రియవ్రతుని పుత్రా గణాలు స్వాయంభువ మన్వంతర మందు ఈ సప్త ద్వీపములతో నిండిన పృథ్విని అనుభవిస్తూ వచ్చు చున్నారు. ఈ స్వాయంభువ సర్గమను పూర్వ మన్వంతర మందు బాగుగా చెప్పబడెను. ఇప్పుడు అధికముగా ఏమి చెప్పుదును?
Summary of chapter 50 of the Mārkandeya Mahā Purana is as follows:
Mārkaṇḍeya narrates the appearance of Bhagavān Rudra from the forehead of Brahmā and the creation of the eleven Rudras. The text then introduces Svāyambhuva Manu, the first patriarch of humanity, and his divine queen Shatarūpā, whose descendants inaugurated the golden age of human civilization.