మార్కండేయ మహా పురాణము
130 - దమ చరిత్రము
మార్కండేయుడు:
నరిష్యంతస్య తనయో దుష్టారిదమనో దమః శక్ర స్యేవ బలం తస్య దయా శీలం మునే రివ బాభ్రవ్యా మింద్రసేనాయాం స జజ్ఞే తస్య భూభృతః నవ వర్షాణి జఠరే స్థిత్వా మాతు ర్మహాయశాః యద్ద్రాహయామాస దామ మాతరం జఠరే స్థితః దమశీలశ్చ భవితా యతశ్చాయం నృపాత్మజః తత స్త్రికాల విజ్ఞానం సహితస్య పురోహితః దమ ఇత్యకరో న్నామ నరిష్యంత సుతస్య తు స దత్తో రాజపుత్రస్తు ధనుర్వేద మశేషతః జగృహే సుర రాజస్య స కాశా ద్వృష పర్వణః
మార్కండేయుడు:
నరిష్యన్తుని పుత్రుడు దముడు అతడు దుర్వృత్తులగు శత్రువులను అణచి వేయును. అతనికి ఇంద్రునితో సమానమగు బలము, మునులతో సమానమగు దయ మరియు శీలము ఉన్నది. నరిష్యంతుని వలన బభ్రుని కన్య ఇంద్రసేన గర్భము నుండి దముడు జన్మించెను. ఈ మహాశయుడు తొమ్మిది సంవత్సరములు తల్లి యొక్క జఠర మందు ఉండెను. ఈ రాకుమారుడు ఈ విధముగా జఠర మందున్న సమయమున ఈతని తల్లి ఇంద్రియ నిగ్రహమును అవలంభించ వలసి వచ్చెను. మరియు “ఈ రాజపుత్రుడును స్వయముగా ఇంద్రియ నిగ్రహ శీలుడే యగును” అని తలచి త్రికాలజ్ఞులగు పురోహితులు ఆ నరిష్యంతుని కుమారునికి “దముడు” అని నామకరణము చేసిరి. రాజపుత్రుడగు దముడు అసుర రాజగు వృషపర్వుని వద్ద సంపూర్ణముగా ధనుర్వేద విద్యలను గ్రహించెను.
దుందుభే ర్దైత్యవర్యస్య తపోవన నివాసినః సకాశా జ్జగృహే కృత్స్న మస్త్రగ్రా మం చ తత్త్వతః శక్తేః సకాశా ద్వేదాశ్చ వేదాంగా న్యఖిలాని చ తథార్షిషేణా ద్రాజర్షే ర్జగృహే యోగ మాత్మవాన్ తం స్వరూపం మహాత్మానం గృహీతాస్త్రం మహాబలమ్ స్వయంవరే కృతా పిత్రా జగృహే సుమనా పతిమ్ సుతా దశార్ణాది పతే ర్బలిన శ్చారువర్మణః పశ్యతాం సర్వభూతానాం యే యే తదర్థ ముపాగతాః తస్యాం చ సానురాగో భూ న్మద్ర రాజస్య వై సుతః సుమనాయాం మహానందో మహా బల పరాక్రమః తథా విదర్భాదిపతేః పుత్రః సంక్రందనస్యచ వపుష్మా న్రాజపుత్రశ్చ మహాధను రుదారదీః
మరియు తపోవన నివాసి, దైత్య శ్రేష్టుడు అగు దుందుభి వద్ద నుండి అన్ని అస్త్ర ప్రయోగములు మరియు సంహార సహితముగా గ్రహించెను. అతడు శక్తి అను ముని వద్ద సంపూర్ణ వేద వేదాంగములు మరియు ఆత్మ వంతుడైన ఆర్ష్ణిషేణుని వద్ద యోగ విద్యను గ్రహించెను. దశార్దాధిపతి, మహాబలుడు నగు చారుకర్ముని కన్య “సుమన” తండ్రి ద్వారా స్వయంవర మందు నియోగింపబడి తన కోరికపై వచ్చియున్న రాజు లందరి యెదుటనే మహా బలవంతుడు, అస్త్ర ధారుడు అగు దముని తన ఇష్టానుసారము ఆ మహాత్ముని పతిగా వరించినది. మద్ర రాజ పుత్రుడు, మహా బలవంతుడు నగు మహానందుడు, విదర్భాదిపతి సక్రందుని పుత్రుడగు వపుష్మానుడు మరియు మహాధనుడను పేరు గల ఉదార చేతనుడగు రాజు యొక్క పుత్రుడు ‘సుమన’ యడల అనురాగము కలిగి యుండిరి.
తే తదా తం వృతం దృష్ట్వా దుష్టాదమనం దమమ్ మంత్రయా మాసురన్యోన్యం తత్రానంగ విమోహితాః ఏతా మవ్యబలా త్కన్యాం గృహీత్వా రూపశాలినీమ్ గృహం యామ స్తస్యేయ మస్తకం యం గ్రవాష్యతి భర్తృ బుద్ధ్యా వరారోహా స్వయంవర విధానతః తస్యేచ్చయానో భవిత్రీ భార్యా ధర్మోప పాదితాః అథనేచ్చతి సా కంచి దస్మాకం మదిరేక్షణా తత స్తస్య భవిత్రీ సా యో దమం ఘాతయిష్యతి
కాని దుష్టులగు వైరులను అణచి వేయు నట్టి ఆ దముని రాజ కన్య వరించినది. అది చూచి వారు కామ బాణములచే మోహితులై పరస్పరము ఈ విధముగా పరామర్షించు కొనసాగిరి. “మనము ఈ రూపవతి యగు కన్యను ఇతని వద్ద నుండి బలవంతముగా గ్రహించి మన గృహమునకు తీసుకొని పోవుదము” “పిమ్మట ఈ వరారోహ స్వయంవర విధానానుసారము మనలో ఎవరిని ఇచ్చగించునో, వారికి ఈ కన్య విధానముగా భార్య యగును.” మరియు ఒకవేళ ఈ మదిరేక్షణ మనలో ఎవరినీ కూడా తన ఇష్టానుసారముగా గ్రహింపని యెడల, మనలో ఎవరు ఆ దముని సంహరించునో, వానికి ఈ కన్య భార్య యగును.
మార్కండేయుడు:
ఇతి తే నిశ్చయం కృత్వా త్రయః పార్దివ నంద నాః జగృహు స్తాం సుచార్వగీం దమపార్శ్వానువర్తినీమ్ తతః కేచి న్నృపా స్తేషాం యే తత్పక్షా విచుకృశుః చుకృశు శ్చాపరే భూపాః కేచి న్మథ్యస్థతాం గతాః తతో దమ స్తా న్భూపాలా నవలోక్య సమంతతః అనాకులమనా వాక్య మిద మాహ మహామునే!
మార్కండేయుడు:
ఆ రాజ పుత్రులు మువ్వురు ఈ విధముగా నిశ్చయించుకొని దముని పార్శ్వ భాగ మందున్న ఆ సుందరిని గ్రహించిరి. అట్లు జరుగగానే దముని వైపు ఎంతో మంది రాజులు నిందించు చుండిరి. మరికొందరు రాజులు కోపచిత్తులైరి. ఇంకొందరు మధ్యస్థము అవలంభించిరి. ఓ మహామునీ! అటు పిమ్మట ఆ రాజు లందరు నాలుగు వైపుల స్థితు లగుట చూచి వ్యాకుల చిత్తుడై దముడు వారితో ఇట్లనెను.
దముడు:
భో భూపాః ధర్మకృత్యేషు యద్వదంతి స్వయంవరమ్ దశార్ణపతినా భూపాః కృతే ధర్య్మే స్వయంవరే అధర్మో వాథ హి ధర్మోవా యదేభి ర్గృహ్యతే బలాత్ యద్యధర్మో న మే కార్య మన్యభార్యా భవిష్యతి ధర్మో వా తదలం ప్రాణై ర్యే రక్షంతే రిలంఘనే
దముడు:
“ఓ భూపాలులారా! స్వయంవరమును ఏ ధర్మ కార్యము లందు లెక్కించుదురు? వాస్తవానికి అది ధర్మమా? లేక అధర్మమా? మీరు ఈ స్వయంవర మందు ప్రాప్తించిన కన్యను బలవంతముగా గ్రహించిరి. ఒకవేళ స్వయంవరము అధర్మము నందు లెక్కించినచో, దీని వలన నేను చేయవలసిన దేమియు లేదు. ఈమె అన్యుల భార్య యగును. లేక ఈ స్వయంవరమును మీరు ధర్మముగా నిశ్చయించినచో, ఈ శత్రు లాంచితమగు ప్రాణధారణ యొక్క ఆవశ్యకత ఏమున్నది?
తతో దశార్ణాధిపతి శ్చారువర్మా నరాధిపః నిః శబ్దం కారయిత్వాత త్సదః ప్రాహ మహామునేః దమేన యదిదం ప్రోక్తం ధర్మాధర్మాశ్రితం నృపాః తద్వదధ్వం యథా ధర్మో మమాస్య చ న లుప్యతే
ఓ మహామునీ! అనంతరము దశార్నాధిపతి, మహారాజు నగు చార్మువర్మ సభను నిశ్శబ్దముచేసి ఇట్లు పలికెను. “ఓ రాజులారా! దముడు ధర్మా ధర్మ సంబంధమున ఏ విషయమును చెప్పెనో, మీరందరూ దాని సంబంధమున దేని వలన మీ ధర్మమునకు లోటు కలుగదో, అట్టి దానిని తెలుపుడు.”
మార్కండేయుడు:
తతః కేచి న్మహీపాలా స్తమూచు ర్వసుధాధివమ్ పరస్పరానురాగేణ గాంధర్వో విహితో విధిః క్షత్రియాణాం వర మయం న విట్సూద్ర ద్విజన్మనామ్ ధను మాశ్రిత్య నిష్పన్నః స చాస్యా దుహితు స్తవ. ఇతి ధర్మా ద్దమ స్యైషా దుహితా తవ పార్థివః యోన్యథా వర్తతే మోహా త్కామాత్మా సంప్ర వర్తతే
మార్కండేయుడు:
“అప్పుడు చాలా మంది రాజులు ఆ రాజుతో నిట్లు పలికిరి. పరస్పరానురాగము వలన గాంధర్వ వివాహము సంపన్న మగును.” ఈ వివాహము క్షత్రియుల పక్షమున శ్రేష్ఠము. సూద్ర వైశ్యుల పక్షము నందు యీ విధానము లేదు. దమునితో మీ కుమార్తె యొక్క గాంధర్వ వివాహము సంపన్న మయ్యెను. అందువలన ఓ రాజా! పైన చెప్పిన ధర్మానుసారము మీ కుమార్తె దమునికి భార్య అయినది. ఎవరు కామాసక్తు లగుదురో వారు మొహమునకు వశులై ఈ విధానమును విరోదించుదురు.
తథాపరే తథా ప్రాచు ర్మహాత్మనో హీ భూభృతామ్ పక్షే యే భూభృతో విప్రః దశార్ణాధిపతిం వచః మోహా త్కిమాహు ర్దర్మోయం గాంధర్వం క్షత్ర జన్మనః న త్వేష శాస్తా నాన్యో హి రాక్షసః శస్త్రజీవినామ్ బలా దిమాం యో హరతి హత్వా తు పరిపన్థినః తస్యైషా రాక్షసేన వివాహేనావనీశ్వరాః ప్రధానతర ఏషోత్ర వివాహ ద్వితయే మతః క్షత్రియాణా మతో ధర్మో మహానందాదిభి కృతః
ఓ విప్రుడా! పిమ్మట విపక్షమున గల రాజులు మహాత్ముడగు దశార్నాధిపతితో నిట్లు పలికిరి. “వీరు మోహ వశులై ఏమేమో చెప్పు చున్నారు. యీ గాంధర్వ వివాహము క్షత్రియుల పక్షమున ప్రశస్త మైనది కాదు. అంతియే గాక అన్య వివాహములును ప్రశస్తములు కావు. కేవలము క్షత్రియులకు రాక్షస వివాహ మొక్కటియే ప్రసస్త మైనది. “ఓ అవనీశ్వరులారా! ఏ పురుషుడు ఎదుటి పక్షము వారిని నాశనము చేసి బలాత్కారముతో ఈ కన్యను గ్రహింప గలడో, రాక్షస వివాహ విధానానుసారము ఈ కన్య ఆతనిని పొందును.” “క్షత్రియుల సంబంధమున ఈ ఇద్దరి వివాహ మధ్యమున ఎప్పుడయితే రాక్షస వివాహమే ప్రధాన మగునో, అప్పుడు మహానందుడు, మొదలగు రాజ పుత్రులు ధర్మ వ్యవహారమునే చేసిరి.”
మార్కండేయుడు:
అథ ప్రోచుః పూనా ర్భూపా యై పూర్వ ముదితో నృపః పరాస్పరానురాగేణ జాతి ధర్మాశ్రితం వచః
మార్కండేయుడు:
ఎవరు మొదటి రాజుల ఎదుట పరస్పరానురాగము మరియు జాతి ధర్మ విషయ సంబంధమగు వచనములు చెప్పిరో, ఆ రాజు లందరు తిరిగి ఇట్లు చెప్పసాగిరి.
సత్యం శస్తో రాక్షసోపి క్షత్రియాణాం పరో విధిః కి త్వసౌ జావక స్వామ్యే కుమార్యానుమతో వరః హత్వా తు పితృ సంబంధం బలేన హ్రియతే హి యా స రాక్షసో విధిః ప్రోక్తో నాత్ర భర్తృకరే స్థితా పశ్యతాం సర్వభూపానా మనయా యద్వృతో దమః గాంధర్వస్యేహ నిష్పత్తో వివాహో రాక్షసోత్ర కః? వివాహితాయాః కన్యాయాః కన్యాత్వం నైవ విద్యతే కన్యాయాశ్చ వివాహే న సంబంధః పృథివీశ్వరాః త ఇమే బలా దేనాం దమా దాదాతు ముద్యతాః బలిన స్తే యది తతః కుర్వంతు న తు సాధుతత్
“నిజమే క్షత్రియుల పక్షమున రాక్షస వివాహము ప్రశస్తమైనది. మరియు శ్రేష్టమగు విధానము. కాని ఈ రాజ కన్య తండ్రి ఆధీనములో నుండి యౌవనావస్థ యందు దముని వరించెను.” పితృ పక్షము వారిని ఓడించి కన్యను గ్రహించి నట్లయితే దానిని రాక్షస వివాహమని అందురు. కాని పతి యొక్క హస్తగత మగు కన్యను హరించుట వలన అది రాక్షస వివాహము కాదు. రాజు లందరూ చూచు చుండగా ఎప్పుడయితే సుమనా దేవి దమునిని వరించినదో, అప్పుడు ఈ వివాహము గాంధర్వ విధానముగా సంపన్న మైనది. రాక్షస వివాహము కాదు. వివాహిత కన్యకు కన్యాత్వము ఉండదు. ఓ రాజులారా! వివాహము సంబంధము చేతనే కన్యా సంబంధము తెలుసుకొన దగుచున్నది. ఎవడైతే దముని యొక్క హస్తము నుండి బల పూర్వకంగా గ్రహించుట యందు ఉద్యుక్తులై యుండునో వారు బల మందలి గౌరవముచే అట్లు చేసినను అది మంచి పని కాదు.
మార్కండేయుడు:
తచ్చ్యుత్వాసౌ దమః కోప కషాయీకృతలోచనః ఆరోపయామాస థను ర్వచనం చేద మబ్రవీత్ మమాపి భార్యా బలిభిః పశ్యతో హ్రియతే యది తత్కులేన భుజాభ్యాం వా కోగుణః కలేశ జన్మనః దిజ్మ మాస్త్రాణి దిక్చౌరం దిక్చరాం దిక్చరాసనమ్ దిగ్వ్య ర్ధం మే కులే జన్మ మరుతస్య మహాత్మనః యది భార్యా మిమే మూడాః సమాదాయా బలాన్వితాః ప్రయా తి జీవతో దిక్తాం మమ వ్యర్థమనుష్యతామ్ ఇత్యుక్త్వా తా న్మహీపాలా న్మహానంద సుఖాం బలీ అథాబ్రవీత్తదా సర్వాన్మహారి దమనో దమః
మార్కండేయుడు:
దముడు యీ మాటను విని కోపముచే ఎఱ్ఱ బడిన నేత్రములు కలవాడై ధనుష్టంకారము చేసి ఇట్లు పలికెను. నేను చూచు చుండగా బలవంతుడైన వాడు బలాత్కారముగా నా భార్యను అపహరించిన యెడల అప్పుడు నేను నపుంసకుడనై జన్మించెదను. నా కుల గౌరవము నా భుజ బలము ఇంకా ఏమున్నది? నేను జీవించి యుండగా ఈ మూఢుడు బలపూర్వకముగా నా భార్యను అపహరించుకు పోయినచో నా అస్త్రములు, శౌర్యము, శర సమూహము శరాసనము వ్యర్థములు మహాత్ముడగు మర్తు మహారాజు యొక్క వంశ మందు నేను జన్మించుట వ్యర్థ మగును. అట్టి నా జన్మ నిరర్థకము. బలవంతుడు శతృ దమనుడునగు దముడు యీ మాట చెప్పి మరల మహా నందుడు మొదలగు సమస్త రాజులతో ఇట్లనెను. ఓ రాజులారా ! యీ కన్య అత్యంత మనోహర మదిరేక్షణ సత్కులోత్పన, సుందరీ, బాలిక, ఎవరికి భార్య కాదో వారి జన్మ నిరర్థకము.
ఏషాతిశోభనా భాలా చార్వంగీ మదిరేక్షణా కిం తస్య జన్మనా భార్యా నయస్యేయం కులోద్భవా ఇతి సంచింత్య భూపాలా స్తథా యతత సంయుగే యథా నిర్జిత్య మా మేతాం పత్నీం కురుత మానినః ఇత్యాభాష్య తత స్తత్ర శరవర్ష మముంచత చాదయా పృథివీ పాలాం స్తమసేవ మహీరుహాన్ తేపి వీరా మహీపాలాః శరశక్త్యష్టిపాణయః ముముచు స్తత్ప్రయుక్తాంశ్చ దమ శ్చిచ్చేద లీలయా తేపి తత్ప్రహితాన్ బాణాం స్తేషాం చాసౌ శరోత్కరాన్ చిచ్చేద పృథివీశానాం నరిష్యంతాత్మజో మునే
మీరందరూ ఈ ప్రకారం ఆలోచించుకొని ఎవరు నన్ను ఓడించి యీమెను భార్యగా స్వీకరించ గలరో వారు యుద్ద మందు ప్రయత్నము చేయుడు. దముడు యిట్లు చెప్పి ఆ కాలమున వృక్షములను చీకటి క్రమ్మినట్లు రాజులను బాణ వర్షముచే ఆచ్చాదించెను. అపుడు అందరు రాజులు కూడ శరములు, శక్తులు, యష్టులు, ముద్గరములు మొదలగు వాటిని వేయసాగిరి. కాని దముడు లీలా పూర్వకముగా అన్ని అస్త్రములను ఖండించెను. ఓ మునీశ్వరా! ఆ సమయ మందు రాజ సమూహము దముడు వేయుచున్న అస్త్రములను ఖండించెను. మరియు నరిష్యంత పుత్రుడగు దముడు కూడా వారి సమస్త అస్త్రములను చేదించెను.
వర్తమానే తదా యుద్ధే దమస్య క్షితిపాత్మజైః ప్రవివేశ మహానందః ఖడ్గపాణి ర్యతో దమః తమాయాంతం దమో దృష్ట్వా ఖడ్గపాణిం మహామృదే ముమోచ శరవర్షాణి వర్షాణీవ పురంధరః తదస్త్రౌణి తత స్తాని శరజాలాని తత్క్షణాత్ మహానందః ప్రవిచ్చేద ఖడ్గేనాన్యా నవంచయత్ తతో రోషా త్సమారుహ్య తం దమస్య తదా రథమ్ మహానందో మహావీర్యో దమేన యుయుధే సహ బహుదా యుధ్యమానస్య మహానందస్య లాఘవాత్ దమో ముమోచ హృదయే శరం కాలానల ప్రభమ్
రాజ పుత్రులతో దమునకు ఈ ప్రకారముగా జరుగు చున్న సమయ మందు ఖడ్గ పాణియై మహానందుడు దమునకు సమ్ముఖముగా వచ్చెను. దముడు ఆ మహా యుద్ధరంగ మందు ఖడ్గ పాణియై వచ్చుచున్న వానిని చూసి ఏ ప్రకారముగా ఇంద్రుడు జలమును వర్షించునో, ఆ ప్రకారంబుగా బాణముల వర్షమును కురిపించెను. మహానందుడు ఆ కాలమున ఖడ్గముతో అతడు వేయుచున్న అస్త్ర సమూహమును, శర జాలమును చేదించెను. హస్త లాఘవముచే అతడు ఇట్లు శీఘ్రముగా చేయ గలిగెను. ఏ రాజులు కూడ ఇట్లు చేయలేదు. పిమ్మట మహా వీర్యవంతుడగు మహానందుడు క్రోధముతో దముడి యొక్క రథము మీదకి దూకి యుద్ధము చేయ నారంభించెను. మహానందుడు చాలా సేపు యుద్ధము చేసిన తరువాత దముడు హస్త లాఘవముచే అతని యొక్క హృదయమునకు కాలాగ్నితో సమానము, తేజో యుక్తమునగు బాణమును ఒదిలెను.
తం లగ్న మాత్మనోత్కృష్య విభిన్నేన తతో హృదా దమం ప్రతి విచిక్షేప మహానందోసి ముజ్జ్వలమ్ పతంతం చైవ ముల్కాభం శక్త్యా చిక్షేపం తం దమః శిరో వేతస పత్రేణ మహానందస్య చాచ్చినత్ తస్మిన్హతే మహానందే ప్రాచుర్యేణ పరాజ్మఖాః బభూవుః పార్థివా స్థస్తౌ వపుష్మాన్ కుండినాదిపః దమేన యుయుధే చాసౌ బలగర్వ మదాన్వితః దాక్షిణాత్య మహీపాల తనయో రణగోచరః యుధ్యమానస్య తస్యోగ్రం కరవాలం స వై లఘు చిచ్చేద సారథే శ్చైవ శిరః సంఖ్యే తథా ద్వజమ్
మహానందుడు హృదయము నందు గుచ్చు కొనిన యా బాణమును తనంతట తానే లాగించుకొని విభిన్న హృదయముతో దముని మీదకి ఉజ్జ్వల మగు కత్తిని వేసెను. దముడు పిడుగుతో సమానమగు ఆ కత్తిని శక్తి బాణమును వేసి వెంటనే వేతసపాత్ర బాణముచే మహానందుని శిరస్సును ఖండించెను. మహానందుడు హతుడైన పిమ్మట చాలా మంది రాజులు యుద్ధము నుండి తిరిగి పోయిరి. కుండినాది పతి యగు వపుష్మంతుడు అను రాజు మాత్రము నిలబడి యుండెను. దాక్షిణాత్య భూపాల కుమారుని బలము యొక్క గర్వముచే మదించిన వపుష్మంతుడు దమునితో యుద్ధము చేయ నారంభించెను. రణ రంగమందు దముడు తక్షణమే యుద్ధము చేయుచున్న వపుష్మంతుని యొక్క ఖడ్గమును సారథి యొక్క శిరస్సును ధ్వజమును ఖండించెను.
భిన్న ఖడ్గే గదాం సోథజగ్రాహ బహు కంటకామ్ తామప్యస్య స చిచ్చెద కరస్థా మేవ సత్వరః యావ ధన్య త్సమాదత్తే స వపుష్మా న్వరాయుధమ్ తావ చ్చరేణ తం విద్ధ్వాదమో భూమా వపాతయత్ స పాతిత స్తతో భూమే విహ్వాలాంగః సవేపదుః వినివృత్త మతి ర్యుద్దా ద్భభూవ క్షితిపాత్మజః తమాలోక్య తథా భూత మయాద్దమతి మాత్మవాన్ ఉత్సృజ్యా దయ సుమనాం సుమనాః ప్రయమే దమః తతో దశార్ణాధిపతిః ప్రీతిమా నకరో త్తయోః దమస్య సుమనాయాశ్చ వివాహం విధిపూర్వకమ్
అపుడు వపుష్మంతుడు ఖడ్గము చేదింప బడిన పిమ్మట బహు కంటకయుత మగు గదను గ్రహించి వేయ బోవగా అతని చేతిలో నుండగానే దముడు చేదించి వైచెను. తిరిగి వపుష్మంతుడు ఒక గొప్పదగు అస్త్రమును గ్రహించి వేయబోవు చుండగానే దముడు బాణములచే ఖండించి అతనిని భూమిపై పడవేసెను. రాజ పుత్రుడగు వపుష్మంతుడు భూమి యందు పడి విహ్వలాంగుడై శరీరము కంపించు చున్నందున యుద్ద మందలి ఆశ వదిలెను. మనస్వియగు దముడు అతని యవస్థను జూచి వదిలి పెట్టెను. ప్రసన్న చిత్తుడై సుమనా దేవిని తీసికొని పోయెను. అనంతరము దశార్ణాధిపతి ప్రసన్న చిత్తుడై దమునకు సుమనా దేవికి విధి పూర్వకముగా వివాహము చేసెను.
కృతదారో దామ స్తత్ర దశార్ణా ధిపతేః పురే స్థిత్వాల్పకాలం ప్రయయో సభార్యో నిజ మందిరమ్ దశార్ణాధిపతి శ్చాసౌ దత్త్వా నాగాం స్తురంగమాన్ రథగోశ్వఖరో ష్ట్రాంశ్చ దాసీ దాసాం స్తథా బహూన్ వస్త్రాలంకార చాపాది వరోవస్కర మానసమ్ అన్యై స్యైశ్చ తథా భాండైః పరిపూర్ణం వ్యసర్జయత్
దముడు వివాహ మైన పిమ్మట కొంత కాలముండి భార్యా సహితుడై తన గృహమునకు బోయెను. దశార్నాధిపతి ఆ సమయమున అనేకములగు ఏనుగులు, గుర్రములు, రథములు, గోవులు, ఖరములు, ఒంటెలు, దాస దాసీ పరివారము, వస్త్రములు, అలంకారములు, ధనుర్భాణములు మొదలగు అమూల్యములగు వస్తువులను ప్రీతి దాన పూర్వకముగా ధన రత్నాదులతో నింపిన భాండములతో సాగ నంపెను.
Summary of chapter 130 of the Mārkandeya Mahā Purana is as follows:
The magnificent Yajna of King Marutta is immortalized as the pinnacle of ancient royal grandeur. Sage Samvarta officiated as the chief priest, and the devas personally attended—Indra drinking the Soma juice, the Maruts serving food on golden vessels, and the Gandharvas singing celestial praises.