మార్కండేయ మహా పురాణము
40 - మృత్యు సమయ లక్షణములు
దత్తాత్రేయుడు:
అరిష్టాని మహారాజ శృణు వక్ష్యామి తాని తే ఏషా మాలోకనా న్మృత్యుం నిజం జానాతి యోగవిత్ దేవమార్గం ధృవం శుక్రం సోమచ్చాయా మరుంధతీమ్ యో నపశ్యే న్నజీవే త్స నరః సంవత్సరా త్పరమ్ ఆరశ్మి బింబం సూర్యస్య వహ్నిం చైవాంశుమాలినమ్ దృష్ట్వైకాదశ మాసేభ్యో నరో నోర్ఘ్యం తు జీవతి వాన్తే మూత్ర పురీషే చ యః స్వర్ణం రజతం తథా ప్రత్యక్షం కురుతే స్వప్నే జీవే త్స దశమాసికమ్ దృష్ట్వా ప్రేత పిశాచా దీన్ గంధర్వ నగరాణి చ సువర్ణ వర్ణా న్వృక్షాంశ్చ నవమాసా న్స జీవతి
దతాత్రేయుడు:
ఓ మహారాజా! ఇప్పుడు నీకు సమస్త అరిష్టములను చెప్పెదను వినుము. యోగి వీటి నన్నింటిని చూచి తన మృత్యువును ఎరుంగ వలెను. ఏ పురుషుడు దేవ మార్గమున ధృవుని, శుక్రుని, సోముని, అరుంధతిని మరియు తన నీడను చూడ లేక పోవునో, అతడు ఒక సంవత్సరమునకు మృత్యు ముఖము నందు పడును. ఏ పురుషుడు సూర్య బింబమును కాంతి హీనముగా మరియు అగ్నిని సూర్యునిగా చూచునో, అతడు పదునొకండు నెలల కంటే ఎక్కువ జీవించలేడు. స్వప్న మందు మూత్రము, పురీషము మరియు వమనము వీటి యందు సువర్ణము గాని వెండిని గాని దర్శించినచో అట్టి పురుషుడు కేవలము పది నెలలు మాత్రమే జీవించును. ఏ పురుషుడు ప్రేత , పిశాచాదులను, గాంధర్వ నగరమును, బంగారు రంగు గల వృక్షములను చూచునో, అతడు కేవలము తొమ్మిది నెలలు మాత్రమే జీవించును.
స్థూలః కృశః కృశః స్థూలో యోకస్మా దేవా జాయతే ప్రక్రుతేశ్చ నివర్తేత తస్యాయుశ్చాష్ట మాసికమ్ ఖండం యస్యపదం పార్ష్ణ్యాం పాదస్యాగ్రే చ వా భవేత్ పాంసు కర్ధమయో ర్మధ్యే సప్త మాసాన్స జీవతి గృధః కపోతః కాకోలో వాయసో వాపి మూర్ధని క్రవ్యాదో వా ఖదో నీలః షణ్మాసాయుః ప్రదర్శకః హన్యతే కాక పంక్తీభిః పాంసు వర్షేణ వా నరః స్వాం ఛాయా మన్యథా దృష్ట్వా చతుః పంచ స జీవతి అనభ్రే విద్యుతం దృష్ట్వా దక్షిణాం దిశ మాశ్రితామ్ రాత్రా వి ద్ర ధను శ్చాపి జీవితం హి త్రిమాసికమ్
ఏ హఠాత్తుగా స్థూలుడై మరల కృశించి మరియు కృశించి తిరిగి హఠాత్తుగా స్థూలుడగునో అతని ఆయుష్షు ఎనిమిది మాసముల పర్యంతము అవశిష్టమని ఎరుంగ వలెను. ఆ తరువాత ప్రకృతి భ్రష్టుడగును. బురద యందు కాలు వేసినచో ఎవరి యొక్క కాలి మడిమ గాని లేక కాలు యొక్క అగ్ర భాగము యొక్క చిహ్నము గాని ఖండిత మైనట్లు కనిపించునో, అతడు కేవలము ఏడు నెలలు జీవించును. గ్రద్ద, పావురము, గుడ్లగూబ, కాకి లేక క్రవ్యాదులు లేక ఇతరము లైన నీల వర్ణము కలవి, మాంసాహారి పక్షులు ఎగిరి శిరస్సు నందు కూర్చున్న యెడల ఆరు మాసముల వరకే ఆయువుండు నని ఎరుంగ వలెను. ఎవడు కాకశ్రేణి వలన మరియు ధూళి వలన దెబ్బను పొందునో, ఎవడు తన శరీర నీడను విపరీతముగా చూచునో, అతడు నాలుగు నెలలు లేక ఐదు మాసములు జీవించి యుండును. దక్షిణ దిక్కున మేఘములు లేకుండా మెరుపులను చూసినచో మరియు రాత్రి కాల మందు ఇంద్ర ధనస్సును చూచుట వలన కేవలము రెండు లేక మూడు నెలలు జీవించి యుండును.
ఘ్రుతే తైలే తథాదర్శే తోయే వా నాత్మన స్తనుమ్ యః పశ్యే దశిరస్కాం వా మాసా దూర్థ్వం న జీవతి యస్య బస్తసమో గంథో గాత్రే శవసమోపి వా తస్యార్థ మాసికం జ్ఞేయం యోగినో నృప జీవితమ్ యస్య వై స్నాత మాత్రస్య హృత్పాద మవశుష్యతే పిబతశ్చ జాలం శోషో దశాహం సోపి జీవతి నంభిన్నో మారుతో యస్య మర్మస్థానాని కృన్తతి హృష్యతే నాంబు సంస్పర్శా త్తస్య మృత్యు రుపస్థితః ఋక్ష వాసర యానస్థో గాయన్యో దక్షిణాం దిశమ్ స్వప్నే ప్రయాతి తస్యాపి స మృత్యుః కాలమిచ్చతి
నెయ్యి, తైలము, దర్పణము, మరియు వీటి యందు కన్నులుంచి చూచినచో తన ప్రతిరూపము కనిపించనిచో మరియు తన దేహమును శిరస్సు లేకుండా మొండెముగా చూసినచో ఒక మాసము కంటే అధిక కాలము అతడు జీవింప జాలడు. ఓ రాజా! ఎవని గాత్రము నుండి శవము వలే దుర్గంధము వెలువడునో, ఆ యోగి కేవలము అర్థ మాసము జీవించి యుండును. స్నానము చేయుట తోడనే ఎవని హృదయము మరియు కాళ్ళు ఎండిపోవునో, మరియు జలమును త్రాగిన వెంటనే తిరిగి తృష్ణచే ఎవని కంఠము శుష్క మగునో, అతడు కేవలము పది రోజులు మాత్రమే జీవించును. వాయువు చిన్నాభిన్నమై ఏ పురుషుని మర్మ స్థానమును విభిన్నము చేయునో, మరియు జలమును స్ప్రుశించుటచే ఎవనికి రోమాంచము కలుగదో అతనికి మృత్యు కాలము సమీపించదని తెలియ వలెను. ఏ పురుషుడు స్వప్నము నందు ఋక్ష, వానర యానములందు ఎక్కి పాడుచు దక్షిణ దిక్కుగా పోవునో అతనికి మృత్యువు అతి దగ్గరగా వచ్చినట్లు గ్రహింప వలెను.
రక్త కృష్ణాంబరధరా గాయంతీ హసతీ చయమ్ దక్షిణాశాం నయేన్నారీ స్వప్నే సోపి న జీవతి నగ్నం క్షపణకం స్వప్నే హసమానం మహాబలమ్ ఏవం సంవీక్ష్య వల్గంతం విద్యా న్మృత్యు ముపస్థితమ్ ఆమస్తక తలాద్యస్తు నిమగ్నం పంకసాగరే స్వప్నే పశ్య త్యథాత్మానం స సద్యో మ్రియతే నరః కేశాంగారం స్తథా భస్మ భుజంగా న్నిర్జలాం నదీమ్ దృష్ట్వా స్వప్నే దశాహాత్తు మృత్యురేకాదశే దినే కరాలై ర్వికటైః కృష్ణైః పురుషై రుద్యతాయుథైః పాషాణై స్తాడితః స్వప్నే సద్యో మృత్యుం లభేన్నరః
స్వప్న మందు ఎర్రని వస్త్రములు ధరించిన స్త్రీ హాస్య ముఖముతో గానము చేయుచు ఎవరిని దక్షిణ దిక్కునకు తీసికొని పోవునో, అతడు వెంటనే మృత్యు ముఖము నందు పడవలసి వచ్చును. స్వప్న మందు మహాబలుడు, నాస్తికుడు, నగ్నుడు, బౌద్ధ సన్యాసి వీరిని ఒంటరిగా నవ్వుచు వెళ్ళుచుండగా చూచినచో మృత్యు కాలము చాలా దగ్గరగా ఉన్నదని తెలియ వలెను. ఏ పురుషుడు స్వప్నము నందు తన దేహమును మస్తక పర్యంతము పంక సాగరమందు ఉన్నట్లుగా చూచునో, అతనికి వెంటనే మృత్యువు కలుగును. స్వప్న మందు కేశములు, నిప్పు, భస్మము, సర్పము మరియు ఎండిపోయిన నది ఇవన్నియు చూచుటచే పది దినముల తరువాత పదు నొకండవ దినమున మృత్యువు కలుగును. స్వప్న మందు భయంకరమగు, వికటాకారమగు, నల్లని రంగు గల పురుషుడు శస్త్రములను ధరించి వచ్చి పాషాణముతో కొట్టు చున్నట్లు చూచిన వెంటనే అతనికి మృతువు సంభవించును.
సూర్యోదయే యస్య శివా క్రోశంతీ యాతి సంముఖమ్ విపరీతం పరీతం వాస సద్యో మృత్యు మృచ్చతి యస్య వై భుక్త మాత్రస్య హృదయం బాధ్యతే క్షుదా జాయతే దన్త ఘర్షశ్చ స గతాయు ర్నసంశయః దీప గంథం న యో వేత్తి త్రస్య త్యహ్ని తాథా నిశి నాత్మానం పరనేత్రస్థం వీక్షతే న స జీవతి శక్రాయుధం చార్థ రాత్రే దివా గ్రహగణాం స్తథా దృష్ట్వా మన్యేత సంక్షీణ మాత్మ జీవిత మాత్మ విత్ నాస్మికా వక్రతామేతి కర్ణయో రణ మనోనతీ నేత్రం చ వామం స్రవతి యస్య తస్యాయురు ద్గతమ్
సూర్యోదయ కాలమందు ఏ వ్యక్తి ఎదుట, వెనుక లేక నాలుగు వైపుల గ్రద్ధ తిరుగునో అతడు వెంటనే మృత్యు ముఖము నందు పడిపోవును. భోజనము చేసిన వెంటనే మరల ఎవ్యక్తికి ఆకలి కలుగునో మరియు దంత ఘర్షణ కలుగునో అట్టి వ్యక్తి ఆయుష్యము నిస్సందేహముగా తీరిపోవును. ఎవని నాసిక యందు దీప గంధము తెలియదో, పగలు, రాత్రులందు కూడ భయమును పొందునో ఇతరుల నేత్రము లందు తన ప్రతిబింబమును చూడలేక పోవునో, అట్టి వానికి జీవితము అంతమైనట్లు గ్రహింప వలెను. అర్థరాత్రి సమయ మందు ఇంద్ర ధనుస్సు మరియు పగలు గ్రహణమును చూచునో, ఆత్మవంతుడగు పురుషుడు ఆయువు క్షీణమైనదని ఎరుంగ వలెను. ఎవని నాసిక వంకరగా అగునో, రెండు చెవులు పైకి క్రిందికి అగుచుండునో మరియు ఎడమ కంటి నుండి ఆశ్రువులు కారుచుండునో, అట్టి వాని ఆయుర్దాయము తీరి పోయినదని తెలుసుకొన వలయును.
ఆరక్త తామేతి ముఖం జిహ్వా వా శ్యామతాం యదా తదా ప్రాజ్ఞో విజానీయా న్మృత్యు మాసన్న మాత్మనః ఉష్ట్ర రాసా భయానేన యస్స్వప్నే దక్షిణాం దిశమ్ ప్రయాతి తం చ జానీయా త్సద్యో మృత్యం నరేశ్వరః పిధాయ కర్ణౌ నిర్ఘోషం న శృణో త్యాత్మ సంభవమ్ నశ్యతే చక్షుషో ర్జ్యోతి ర్యస్య సోపి న జీవతి పతతో యస్య వైగర్తే స్వప్నే ద్వారం పిదీయతే నచోత్తిష్ఠతి యశ్శ్వభ్రా త్తదంతం తస్య జీవితమ్ ఊర్ధ్వా చ దృష్టి ర్న చ సం ప్రతిష్టా రక్తా పూనా స్సంపరివర్తమానా ముఖస్య చోస్మా శిశిరా చ నాభిః శంసంతి పుంసా మపరం శరీరమ్
ముఖము లోహిత (ఎర్రని) రంగు గాను, నాలుక శ్యామ వర్ణము గాను మారినట్లయితే బుద్ధిమంతుడగు పురుషుడు తనకు మృత్యువు దగ్గరలో నున్నదని ఎరుగ వలెను. ఎవడు స్వప్నము నందు ఒంటె, గాడిద, బండి ఎక్కి దక్షిణ దిక్కుగా వెళ్ళునో, అతడు వెంటనే మరణించును. ఇందు సందేహము లేదు. రెండు చెవులను మూసి నప్పుడు స్వీయ శబ్దము ఎవరికి వినిపించదో, మరియు ఎవరి యొక్క కన్నుల యందలి జ్యోతి తొలగి పోవునో అట్టి పురుషుడు వెంటనే జీవితమును వదలి పెట్టును. ఎవడు స్వప్నమందు గోతిలో పడిపోయి బయటకు వచ్చుటకు ద్వారమును పొందలేక పోవునో, వెంటనే లేచుటకు అసమర్థుడగునో అతని ఆయుశ్యము తీరినదని తలంచ వలెను. ఎవడి దృష్టి ఊర్ధ్వ భాగమందు నిలువదో, ఎర్రని వర్ణము కలిగి మాటి మాటికి కోపముతో చంచలమై యుండునో మరియు ముఖము వేడిగా ఉండి నాభి ప్రదేశము చల్లగా ఉండునో అతడు ఈ దేహమును విడిచి వేరొక శరీరమును గ్రహింప వలసి యుండును.
స్వప్నేగ్నిం ప్రవిశేద్యస్తు న చ నిష్క్రమతే పునః జల ప్రవేశా దపి వా తదంతం తస్య జీవితమ్ యశ్చాభి హన్యతే దుష్టై ర్భూతై రాత్రా వథో దివా స మృత్యుం సప్త రాత్రంతే నరః ప్రాప్నో త్యసంశయమ్ స్వవస్త్ర మమలం శుక్లం రక్తం పశ్య త్యథోసితమ్ యః పుమా మృత్యు మాసన్నం తస్యాపి హాయ్ వినిర్దిశేత్ స్వభావ వైపరీత్యం తు ప్రకృతేశ్చ విపర్యయః కథయంతి మనుష్యాణాం సమాసన్నౌ యమాంతకౌ యేషాం వినీతః సతతం యేస్య పూజ్యతమా మతాః తానేవ చావజానాతి తానేవ చ వినిదంతి దేవాన్నార్చయతే వృద్ధా గురూన్ విప్రాంశ్చ ని దతి మాతా పిత్రో ర్న సత్కారం జామా తౄణాం కరోతి చ యోగినా జ్ఞాన విదుషా మన్యేషాం చ మహాత్మనామ్ ప్రాప్తేతు కాలే పురుష స్తద్విజ్ఞేయం విచక్షణైః
ఎవడు స్వప్నము నందు అగ్ని లేక జలము యందు ప్రవేశించి తిరిగి బయటకు రాలేక పోవునో అతని జీవితము అంతమైనదని గ్రహింప వలెను. ఎవడు పగలు గాని దుష్ట భూత గణాలతో దెబ్బలను పొందునో ఆ రోజు నుండి ఎడవ రోజు రాత్రి అతడు మృత్యు ముఖము నందు పడును. ఎవడు తన తెల్లని వస్త్రములు ధరించియు దానిని ఎర్రని వర్ణముగా లేక కృష్ణ వర్ణముగా చూచునో అతడు మృతువు సమీపమునకు వెళ్ళును. విపరీత స్వభావము మరియు ప్రక్రుతి యొక్క విపరీతములు కలిగిన యెడల యముడు మరియు అంతకులు ఆ మనిషి వద్దకు వచ్చెదరు. బుద్ధిమంతులగు వారు నిశ్చయముగా ఎరుగ వలసిన దేమంటే కాలమాసన్న మైనప్పుడు పూజనీయు లైన పురుషులను మరియు ఎవరి ఎదుట వినయముగా నుండుట ఉచితమో వారిని అవమానించుట, చేయునో, దేవతలను పూజించుట యందు విముఖుడౌనో, వృద్ధులను, బ్రాహ్మణులను నిందించునో, తల్లి దండ్రులను గౌరవించుట యందు మరియు అల్లుని గౌరవించుట యందు, విముఖు డగునో మరియు యోగులు, జ్ఞానులు, ఇతర మహాత్ములు వీరిని అగౌరవ పరచుటకు ఉద్యుక్తు డగునో అట్టి పురుషునికి మృత్యువు సమీపించును.
యోగినాం సతతం యత్నా దరిష్టా న్యవనీపతేః సంవత్సరాం తే తజ్ఞే యం ఫలదాని దివానిశమ్ విలోక్యావిశదా చైషాం ఫలపంక్తిః సుభీషణా విజ్ఞాయ కార్యో మనసి స చ కాలో నరేశ్వరః జ్ఞాత్వా కాలం చ తం సమ్యగభయ స్థాన మాశ్రితః యు జీత యోగీ కాలో సౌ యథా నాస్యా ఫలో భవేత్
ఓ అవనీ పతీ! యోగి గణాలు ప్రయత్న శీలురై నిరంతరము ఎరిగి యుండ వలెను. “ఈ అరిష్టము లన్నియు సంవత్సరాంత మందు పగలు గాని రాత్రి గాని ఫలితము కలుగ జేయును. అతి భీషణ మగు అట్టి ఫలితాల యందు చక్కగా దృష్టిని ఉంచ వలెను. ఈ ఫలితముల న్నింటిని చక్కగా తెలుసుకొని వాటి రాకను ఎల్లప్పుడు మనస్సు నందు ఉంచుకొన వలెను. ఈ విధముగా యోగి ఉపస్థిత మైన కాలమును తెలుసు కొని బాగుగా నిర్భయ స్థానమగు ఆశ్రమ మందు యోగ మందు అభినివిష్టుడవ వలెను. అట్లు చేసినచో కాలము యొక్క బలము నిలువదు.
దృష్ట్వా రిష్టం తథా యోగీ త్యక్త్వా మరణజం భయమ్ తత్స్వ భావం తదా లోక్య కాలో యావ ద్విపాకదః తస్య భాగే తథైవాహ్నో యోగం యుంజీత యోగవిత్ పూర్వాహ్ణే చాపరాహే చ మధ్యాహ్నే చాపి తద్దినే యత్ర వా రజనీ భాగే తదరిష్టం నిరీక్షితమ్ తత్త్రైవ తావద్యుంజీత యావత్ప్రాప్తం హి తద్దినమ్ తతస్త్యక్త్వా భయం సర్వం జిత్వా యం కాల మాత్మవాన్ తత్త్రైవా వసథే స్థిత్వా యత్ర వా స్థైర్య మాత్మనః యుంజీత యోగం నిర్జిత్య త్రీన్ గుణా పరమాత్మని తన్మయ శ్చాత్మనా భూత్వా చిద్వృత్త మాపి సంత్యజేత్
అరిష్టములను చూచుట తోడనే యోగి భయమును వదలి ఆ అరిష్టముల స్వభావము గురించి యోచన చేసి ఏ సమయ మందు అరిష్టములు కలుగునో, యోగి అయిన పురుషుడు ఆ సమయ మందే యోగ మందు నివృత్తుడవ వలెను. ఆరోజు పూర్వాహ్ణ మందు గాని, లేక రాత్రి కాల మందే యోగ నిష్టుడు అవవలెను. ఎప్పటి వరకు ఇదే విధముగా యోగ ప్రక్రియలు ఆచరింప వలెను. అతడు ఆత్మవంతుడై అన్ని భయాలను వర్జించి ఆ కాలమును ఓడించి ఆ గృహము నందు లేక అన్య ప్రదేశము లందు మనస్సును స్థిరముగా నుంచ వలెను. అట్టి ప్రదేశము లందు నివసించు మూడు గుణములను జయించి యోగ యుక్తుడై పరమాత్మ యందు చిత్తముతో అభి భూతుడై మరియు ఆత్మను తన్మయము చేసి అంత మందు చిత్త వృత్తిని కూడ విసర్జింప వలెను.
తతః పరమ నిర్వాణ మతీంద్రియ మగోచరమ్ యద్భుద్దే ర్య న్న చాఖ్యాతుం శర్యతే త త్సమశ్నుతే ఏ తత్సర్వం సమాఖ్యాతం తవాలర్క యథార్థవత్ ప్రాప్స్యసే యేన తద్భ్రహ్మ స క్షేపా త్తన్ని భోధ మే శశాంకరశ్మి సంయోగా చ్చంద్రకాంత మణిః పయః సముత్సృజతి నాయుక్తః సోపమా యోగినః స్మృతా యథార్కరశ్మి సంయోగా దర్క కాంతో హుతాశనమ్ ఆవిష్కరోతి నైకః స న్నుపమా సాపి యోగినః పిపీలికాఖునకుల గృహ గోదా కపింజలాః వసంతి స్వామివ ద్గేహే ధ్వస్తే యాంతి తతోన్యతః
ఇట్లు చేయుట వలననే అతడు ఇంద్రియాతీత మగు బుద్ధికి అగోచరమగు మరియు హశ్యమునకు అతీతము అయిన పరమ నిర్వాణ లాభమును పొంద గలుగును. ఓ అలర్కా! నేను యధార్థముగా నీకు ఇవన్నియు వర్ణించితిని. ఇప్పుడు ఏ ఉపాయముచే బ్రహ్మ పదార్థ లాభము కలుగునో దానిని సంక్షిప్తముగా చెప్పుచుంటిని, వినుము. చంద్రుని కిరణముల సంయోగము చేతనే చంద్రకాంత మణి నుండి జలము వెలువడును. చంద్రుని కిరణముల సహితముగా సంయోగము జరిగినట్లయితే జలము ఎప్పుడును వెలువడదు. ఇదే యోగి యోక్క యోగ సిద్ధికి ఉపాయము. అనగా యోగ మందు మనస్సును నిలుపనిచే యోగి హృదయ మందు ఆనంద రసము సంచరించదు. యోగ మందు మనస్సును నిలిపినపుడే అతడు ఆనందమును పొందును. సూర్యుని కిరణముల సంయోగముతో సూర్యకాంతి మణి నుండి అగ్ని పుట్టును. ఇది కూడా యోగ సిద్ధికి మరియొక ఉపాయము అనగా యోగమందు చిత్తము లేనిచో ఎప్పుడును యోగి బ్రహ్మ సాక్షాత్కారమును పొంద లేడు. చీమ, ఎలుక, ముంగిస, ఆవు, కపింజలము, పావురము ఇవన్నియు గృహ యజమానితో సమానముగా నుండును. అనగా ఆస్థాన మందు ఎల్లప్పుడు నివసించును. వాటికి నష్టము వాటిల్లి నప్పుడు ఇతర స్థానములకు పోవును.
దుఃఖం తు స్వామినో ద్వంసే తస్య తేషాం న కించన వేశ్మనో యాత్ర రాజేంద్ర సోపమా యోగ సిద్ధయే మృద్దేహికాల్ప దేహాపి ముఖాగ్రేణా ప్యణీయసా కరోతి మృద్భార చాయ ముపదేశః స యోగినః పశు పక్షి మనుష్యాద్యైః పత్ర పుష్ప ఫలాన్వితమ్ వృక్షం విలుప్యమానం తు దృష్ట్వా సిధ్యంతి యోగినః రురుశావ విషాణాగ్ర మాలక్ష్య తిలకాకృతిమ్ సహా తేన వివర్ధంతం యోగీ సిద్ధి మవాప్నుయాత్ ద్రవ పూర్ణ ముపాదాయ పాత మారోహతో భువః తుంగమంగం విలోక్యోచ్చై ర్విజ్ఞాతం కిం న యోగినా
గృహస్థుడు ద్వంశమైనను దుఃఖమును పొందడు. ఓ రాజేంద్రా! ఇది యోగ సిద్ధికి మూడవ ఉపమానము అనగా స్వభావ సిద్ధముగా శరీరము వెనుక శరీరము యొక్క ఆవిర్భావము తిరుగుతూ ఉండును. అందువలన దాని కొరకు దుఃఖము మమతలకు వశీభూతులగుట క్షేమము కాదు. యోగి ఈ విషయములను తెలుసుకొని దుఃఖాదులను త్యజించి యోగ సాధన యందు మనస్సు లగ్నము చేయవలెను. చూడు! చీమ అత్యల్ప వస్తువు నైనను అత్యంత సూక్ష్మమగు తన నోటితో ప్రోగు చేయును. అది కూడా యోగికి ఒక ఉపదేశము. అనగా బ్రహ్మ సాధనము కఠిన కార్యము. కాని యోగ రూపముతో సామాన్య ఉపాయముల తోనే దానిని పొంద గలుగును. పశు, పక్షులు, మనుష్యులు, మొదలైనవి ఫలములను, పుష్పములను, పత్రాన్వితమగు వృక్షములను నష్ట పరచును. యోగి ఇది చూసి కూడా యోగ సిద్ధి పొందును. అనగా సమృద్ధ మగునప్పుడే నాశనము కలుగు సమయ మందు కాలము యొక్క చేతిలో తప్పక నష్టపడ వలసి వచ్చును. ఈ విధముగా తెలుసుకొని యోగి యోగ సాధన మందు నిర్ణయ లాభము చేయ వలెను. మృగ విషాణాదులందు కొమ్ముల యొక్క అగ్రభాగము నువ్వు గింజ పరిమాణముతో నల్ల వర్ణముగా ఉన్నప్పటికీ దాని సంబంధముతో అది వృద్ధిని పొందును. అదే విధముగా అనుసరించి యోగి సిద్ధి లాభమును పొందును. అనగా యోగ చర్య ఎంత కష్టతర మైనను నెమ్మది నెమ్మదిగా అభ్యాసము చేయుటచే తప్పక కృత కృత్యుడగును. మరియు ఎల్లప్పుడూ మానవుడు ద్రవ పూర్ణమగు పాత్రను చేతి యందు ఉంచుకొని భూమి నుండి పైకి ఆరోహణ చేయు ఆ సమయ మందు అతని అంగముపై బాగుగా దృష్టిని ఉంచుట చేత యోగికి అజ్ఞాతమగు విషయ మేమియు ఉండదు.
సర్వస్వే జీవనాయాలం నిఖాతే పురుషస్య యా చేష్టాం తాం తత్త్వతో జ్ఞాత్వా యోగినః కృత కృత్యతా తద్గృహం య త వసతి తద్భోజ్యం యేన జీవతి యేన సంపద్యతే చార్థ స్తత్సుఖం మమతాత్రకా?
అభ్యర్థితోపి తైః కార్యం కరోతి కరణై ర్యథా తథా బుధ్యాదిభి ర్యోగీ పారక్యైః సాధయే త్పరమ్
మానవుడు జీవనము కొరకు తన సర్వస్వమును నష్ట పరచు పనులను చేయును. దానిని బాగుగా తెలుసు కొన్నట్లయితే యోగి కృత కృత్యుడు కాగలడు. ఏ ప్రదేశ మందు నివసించునో అదే గృహము. దేని ద్వారా ప్రాణ ధారణ కలుగునో అది భోజ్యము మరియు దేని ద్వారా అర్థ నిష్పన్న మగునో అది సుఖము అని చెప్పబడెను. అందుచేత ఈ విషయ మందు మమత పెంచుకొన వలసిన అవసరమేమున్నది? ఏ కారణము చేత తన కోరిక సిద్ధించునో, అదే విధముగా యోగి పార లౌకిక బుద్ధి చేతనే బ్రహ్మ యొక్క సాధన చేయ వలెను.
జడుడు:
తతః ప్రణమ్యా త్త్రి పుత్ర, మలర్కః స మహీపతిః ప్రశ్రయావనతో వాక్య మువాచాతి ముదాన్వితః దిష్ట్యా దేవైరిదం బ్రహ్మ పరాభిభవ సంభవమ్ ఉపపాదిత మత్యుగ్రం ప్రాణ సందేహదం భయమ్
జడుడు:
అనంతరము నరపతి యగు అలర్కుడు వినయముగా అత్రి నందనుడగు దత్తాత్రేయునికి ప్రణామము చేసి ఆనందముతో చెప్ప నారంభించెను. హే బ్రాహ్మన్! నా భాగ్యము వలన నాకు ఈ అత్యుగ్రము ప్రాణ సందేహము నందు పడవేయు భయంకర మగు శత్రువు నుండి విముక్తి లభించినది.
దిష్ట్యా కాశిపతేర్భూరి బలసంపత్పరాక్రమః యదుచ్చేదా దిహాయాతః స యుష్మత్సంగడో మమ దిష్ట్యా మందబలశ్చాహం దిష్ట్యా భృత్యాశ్చతామే హతః దిష్ట్యా కోశః క్షయం యాతో దిష్ట్యాహం భీతి మాగతః దిష్ట్యా త్వత్పాద యుగలం మమ స్మృతి పథం గతమ్ దిష్ట్యా త్వదుక్తయః పరవా మమ చేతసి సంస్థితాః దిష్ట్యా జ్ఞానం మమోత్పన్నం భవతశ్చ సమాగమాత్ భవతా చైవ కారుణ్యం దిష్ట్యా బ్రహ్మన్ కృతం మయి అనర్తో ప్యర్థతాం యాతి పురుషస్య శుభోదయే తథేద ముపకారాయ వ్యసనం సంగమాత్తవ
నా భాగ్య వశముననే కాశీ రాజు మహాబల పరాక్రమములతో సమృద్దుడైనాడు. ఆ కారణముచే నాకు మీ సాంగత్యము లభించినది. నా భాగ్యము చేతనే నేను బలహీనుడ నైనను, భృత్య గణాలు హతులైనారు. కోశాగారము క్షయమై పోయెను. మరియు భయము వ్యాపించినది. నా సౌభాగ్యము చేతనే మీ చరణ ద్వయము నా స్మృతి పథము నందు నిలిచినది. నా సౌభాగ్యము చేతనే మీ వాక్కు లన్నియు నా హృదయ మందు స్థానమును పొందినవి. మరియు నా సౌభాగ్యము వశమున మీతో సమాగమ లాభము కలుగుటచే జ్ఞానోదయము కలిగినది. హే బ్రాహ్మన్! సౌభాగ్య వశము చేతనే తమరు నా యందు దయ చూపినారు. పురుషునికి శుభోదయము కలిగిన యెడల అనర్థాలు కూడా అర్థ రూపములో పరిణితి చెందును. ఇట్టి భయంకర విపత్తు కూడా తమరితో కలియుటకు నా యెడల ఉపకార సాధన మైనది.
సుబాహు దుపకారీ మే స చ కాశిపతిః ప్రభో తయోః కృతేహం సంప్రాప్తో యోగీశ భవతో న్తికమ్ సోహం తవ ప్రసాదాగ్ని నిర్దగ్ధ జ్ఞాన కిల్బిషః తథా యతిష్యే యేనేదృగ్ భూయోహం దుఃఖ భాజనమ్ పరిత్యజిష్యే గార్హస్థ్య మార్తి పాదప కాననమ్ త్వత్తో నుజ్ఞాం సమాసాద్య జ్ఞాన దాతు ర్మహాత్మనః
హే ప్రభో! యోగీశ్వరా! ఎవరి కోసము నేను తమరి సన్నిధానమునకు వచ్చితినో ఆ సుబాహు, కాశీరాజులు ఇద్దరు నాకు పరమ ఉపకారులు. ఇందు సందేహము లేదు. మీ యొక్క ప్రసాద రూపమగు అగ్ని యందు నా అజ్ఞాన రూపమగు పాపము దగ్ధమై పోయినది. దేని వలన తిరిగి అట్టి దుఃఖము సంభవింపదో అట్టి అనుస్థానము నందు యత్నుడనై యుందును. హే బ్రాహ్మన్! మీరు జ్ఞాన దాతలు. మహాత్ములు. తమరి ఆజ్ఞ అయినచో నేను గృహస్థాశ్రమమును త్యజించెదను. ఆ ఆశ్రమము దుఃఖ రూపము గల వృక్షములతో నిండిన వనము వంటిది.
దత్తాత్రేయుడు:
గచ్చ రాజేంద్ర భద్రంతే యథా తే కథితం మయా నిర్మయో నిరహంకార స్తథా చర విముక్తయే
దత్తాత్రేయుడు:
ఓ రాజేంద్ర! నీవు ఇక వెళ్ళుము. నీకు మంగళమగు గాక. నేను నీకు ఏ విధముగా ఉపదేశము చేసితినో, నీవు మమతాహంకారములను వదలి ముక్తి లాభము కొరకు దాని ననుసరించి పనులు చేయుము.
జడుడు:
ఏవ ముక్తః ప్రణమ్యైన మాజగామ త్వరాన్వితః యత్ర కాశీపతి ర్బ్రాతా సుబాహు శ్చాస్య సో గ్రజః
జడుడు:
దత్తాత్రేయుడు ఇట్లు చెప్పిన తరువాత అలర్కుడు వారికి నమస్కరించి వెంటనే అగ్రజుడగు సుబాహుడు మరియు కాశీరాజు వద్దకు వెళ్ళెను.
సముత్పత్య మహాబాహుం సోలర్కః కాశిభూపతిమ్ సుబాహో రగ్రతో వీర మువాచ ప్రహసన్నివ రాజ్య కాముక కాశీశః భుజ్యతాం రాజ్య మూర్జితమ్ యథా చ రోచతే తద్వ త్సు బాహోః సంపర యచ్చ వా
అతడు మహాబాహుడగు కాశీ రాజు వద్దకు, సుబాహుని వద్దకు వచ్చి నవ్వుచు ఇట్లు చెప్పెను. ఓ కాశీరాజా! నీవు రాజ్య లాభమును కోరితివి. అందువలన ఈ సమృద్ధవంతమగు రాజ్యమును అనుభవింపుము. లేక సుబాహునికి ఇమ్ము. లేక నీకు ఏది ఇష్టమో అది చేయుము.
కాశి రాజు:
కిమలర్క పరిత్యక్తం రాజ్యంతే సంయుగం వినా క్షత్రియస్య న ధర్మోయం భవాంశ్చ క్షత్ర ధర్మవిత్ నిర్జితా మాత్య వర్గస్తు త్యక్త్వా మరణజం భయమ్ సందదీత శరం రాజా లక్ష్య ముద్దిశ్య వైరిణమ్ తం జిత్వా నృపతి ర్భోగా న్యథా భిలషితా న్వరాన్ భుంజీత పరమం సిద్ద్యై యజేత చ మహామఖః
కాశీ రాజు:
ఓ అలర్కా! నీవు యుద్ధము చేయక రాజ్యమును ఎందుకు త్యజించు చుంటివి? ఇది క్షత్రియులకు ధర్మము కాదు. నీవు క్షాత్ర ధర్మములను ఎరిగిన వాడవు. నరపతి అమాత్య వర్గాలను గెలిచి మరణ భయమును వదలి శత్రువును లక్ష్య సిద్దికై శర సంఘాతము చేయును. అతడు శత్రువులను ఓడించుటకు అభిలషించును. అతి ఉత్తమ భోగాలను అనుభవించాలని, అనేక శ్రేష్టము లైన యజ్ఞములు చేయవలెనని కోరెను.
అలర్కుడు:
ఏవ మీదృశకం వీరః మమాప్యాసీ న్మనః పురా సాంప్రతం విపరీతార్థం శృణు చాప్యత్ర కారణమ్ యథాయం భౌతికః సంఘ స్తథా న్తఃకరణం నృణామ్ గుణాస్తు సకలాస్తద్వ దశేషేష్వేవ జంతుషు చిచ్చక్తి రేక ఏవాయం యదా నాన్యోస్తి కశ్చన తదా కా నృపతేజ్ఞానా న్మిత్రారి స్రభు భృత్యతా తన్మయా దుఃఖ మాసాద్య త్వద్భయోద్భవ ముత్తమమ్ దతాత్రేయ ప్రసాదేనా జ్ఞానం ప్రాప్తం నరేశ్వరః నిర్జితేంద్రియ వర్గస్తు త్యక్త్వా సంగ మశేషతః మనో బ్రాహ్మణి సందాస్యే తజ్జయే పరమో జయః
అలర్కుడు:
ఓ వీరా! పూర్వము నాకును ఇదియే కోరిక ఉండినది. మరియు నా మనస్సు కూడా అట్లే కోరెడిది. కాని ఇప్పుడు దానికి ప్రతికూలముగా మారినది. దానికి కారణము వినుము. మనుష్య మాత్రునకు స్నేహము ఏ విధముగా భౌతిక మైనదో వారి అంతః కరణము మరియు గుణ సమూహములు కూడా అదే విధముగా భూతలముల సమిష్టి అయి ఉన్నవి. ఓ రాజా! కేవలము చిచ్చక్తి రూపమగు బ్రహ్మయే సత్యము. అట్లు కాక ఇతరు లెవ్వరును సత్యము కాదు. అట్లు జ్ఞాన లాభము కలిగిన యెడల శత్రువులు, మిత్రులు మరియు ప్రభువు, భ్రుత్యులు మొదలగు వారి కల్పనఎట్లు కలుగును? ఓ రాజా! నేను నీ వలన భయముచే అత్యంత దుఃఖమును పొందితిని. అట్టి సమయమున శ్రీ దత్తాత్రేయుని ప్రసాదము చేత జ్ఞానమును పొందితిని. ఇప్పుడు జితేంద్రియుడనై బాగుగా సమస్త బంధములను పరిత్యజించి మనస్సును పరబ్రహ్మ యందు నిలుపును. ఇంద్రియములను జయించి నప్పుడే సమస్తమును జయించ వచ్చును.
సంసాధ్య మన్యత్తత్సిధ్యై యతః కించి న్నవిధ్యతే ఇంద్రియాణి చ సంయమ్య తతః సిద్ధిం నియచ్చతి సోహం న తేరి ర్న మమాసి శత్రుః , సుబాహు రేషో న మమాపకారీ దృష్ట్వం మయా సర్వమిదం యథాత్మా అన్విష్యతాం భూప రిపు స్త్వయాన్యః ఇత్థం స తేనాభిహితో నరేంద్రో, హృష్టః సముత్థాయ తతః సుబాహుః దిష్ట్యేతి తం భాతర మాభినంద్య, కాశీశ్వరం వాక్యమిదం బభాషే
ఎవడిని మించిన గొప్పవాడు ఉండడో, అట్టి వాని కొరకు కాక ఇతరమైన వానిని కొలుచుట ఉచితము కాదు. జితేంద్రియుడై నప్పుడే సిద్ధి లాభమును పొంద గలుగును. ఓ రాజా! నేను నీకు శత్రువును కాను. నీవు నాకు విరోధివి కాదు. ఈ సుబాహుడు కూడా నాకు అపకారము ఏమియు చేయలేదు. ఇది నేను బాగుగా ఎరిగితిని. అందువలన ఇతర శత్రువులను వెదకుము. అలర్కుడు ఇట్లు చెప్పిన తరువాత కాశీరాజు అత్యంత సంతోషము చెందెను. మరియు సుబాహుడు సంతోషముతో లేచి “పరమ సౌభాగ్యము” అని చెప్పి సోదరుని అభినందిస్తూ కాశీ రాజుతో ఇట్లు చెప్ప దొడంగెను.
Summary of chapter 40 of the Mārkandeya Mahā Purana is as follows:
The narrative describes various mystical perfections and spiritual milestones that manifest during intense Yoga sadhana. The son sternly warns that siddhis such as lightness, levitation, and subtle perception are obstacles on the spiritual path, advising the true seeker to ignore all mystical phenomena and focus solely on ultimate Moksha.