4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము
133 - అధ్యాయము
శౌనక ఉవాచ:
సూత ఉవాచ :
శౌనక ఉవాచ :
సూత ఉవాచ :
శానకుడిట్లన్నాడు - నేటికి నాజన్మసఫలమైంది. నా బ్రతుకు మంచి బ్రతుకైంది. బ్రహ్మవైవర్త ఫలము ఏ విఘ్నాలు లేకుండా మోక్షానికి కారణమవటము. (1) ఓవత్స! అభయమివ్వు, ఓతండ్రి! నాకభయమివ్వు. నివేదించవలసినది కొంచెమున్నదని నేను కోరుతున్నాను. (2) సూతుడిట్లా – ఓమహాభాగ! భయాన్ని వదిలి నీకేంకావాలో దానిని ప్రశ్నించు. గోప్యమైనదాన్ని మనోహరమైనదాన్ని అంతానీకు చెబుతాను. (3) శౌనకుడిట్లా - ఇప్పుడు పురాణముల లక్షణము వినదలిచాను. వాటిసంఖ్యను కూడా వినదలిచాను. దాని ఫలాన్ని వినదలచాను, ఓపుత్రక (4) సూతుడిట్లా – ఓశౌనక! ఇతిహాసము, పురాణములు విస్తారమైనవి. సంహితలు, పంచరాత్రములు ఉన్నదున్నట్లు చెబుతాను. (5) సర్గము (సృష్టి) ప్రతిసర్గము, వంశములు, మన్వంతరాలు, అనువంశముల చరిత్ర అని పురాణములకు ఐదు లక్షణాలు, ఓవిప్ర! (6) ఇవి ఉపపురాణముల లక్షణాలు కూడా అని బుధులు అన్నారు. మహాపురాణముల లక్షణాన్ని నీకు చెబుతున్నాను. (7) సృష్టి, విసృష్టి, వాటి ఉనికి, వాటిపాలన, కర్మల వాసన, మనువుల వార్త క్రమంగా ఉంటాయి. (8) ప్రళయముల వర్ణన, మోక్షనిరూపణము. హరికీర్తనము, విడివిడిగా వేదముల విషయము (9) పదికన్నా ఎక్కువగా లక్షణములని పెద్దలన్నారు. పురాణముల సంఖ్యను నీకు చెబుతున్నాను తెలుసుకో (10) పరమైన బ్రహ్మ పురాణము పదివేలు (శ్లోకాలు కావచ్చు) పద్మపురాణము ఏబదిఐదువేలు అని అన్నారు. (11) విష్ణుపురాణము ఇరవైమూడువేలని బుధులున్నారు శివపురాణము ఇరువది నాలుగువేలని చెప్పారు. (12) శ్రీమద్భాగవతము పద్దెనిమిది వేల గ్రంథమని తెలిపారు. నారదపురాణము ఇరువది ఐదువేలని చెప్పారు. (13) మార్కండేయ పురాణము తొమ్మిదివేలని పండితులన్నారు. పది హేనువేల నాల్గు వందల గ్రంథము (14) పరమమైన అగ్ని పురాణము రుచిరమైనదని చెప్పారు. పదునాల్గువేల ఐదువందల గ్రంథము (15) పురాణ శ్రేష్ఠమైన భవిష్య పురాణమని అన్నారు. బ్రహ్మవైవర్త పురాణము పద్దెనిమిదివేలు.
అన్ని పురాణముల సారాన్ని బుధులిట్లా చెబుతారు.లింగపురాణము పదకొండువేలు . (17) వరాహపురాణము ఇరువది నాలుగువేలు. పరమైనస్కందపురాణము ఎనుబది ఒక్కవేల ఒక వంద గ్రంథము (18) శ్రేష్టమైనది, అని సజ్జనులు నిర్ణయించారు.వామనపురాణము పదివేలు. కూర్మపురాణము పది హేడు వేలు (19) మత్స్యపురాణము పదునాలువేలని పండితులన్నారు. గరుడపురాణము పందొమ్మిది వేలు అన్నారు. (20) బ్రహ్మాండపురాణము పన్నెండువేలు పరమైనదన్నారు. ఈ విధంగా పురాణముల (శ్లోకముల) లెక్క నాలుగు లక్షలన్నారు. (21) పద్దెనిమిది పురాణములకు ఇట్లాగే అని బుధులు తెలిపారు. ఇట్లా ఉపపురాణాలు పద్దెనిమిదన్నారు. (22) భారతమితిహాసము. వాల్మీకి రామాయణము కావ్యము. కృష్ణమాహాత్మ్య పూర్వకమైన పంచరాత్రములు ఐదు (23) వాసిష్ఠము, నారదీయము, కాపిలము, గౌతమీయము, సనత్కుమారీయము, ఇట్లా పంచరాత్రములు ఐదు. (24) కృష్ణభక్తితో కూడిన సంహితలు ఐదు. బ్రహ్మ సంహిత, శివసంహిత, ప్రహ్లాద సంహిత, (25) గౌతమ సంహిత, కుమార సంహిత అని ఐదు చెప్పారు.ఇట్లా విడివిడిగా క్రమంగా అంతా నీకు చెప్పాను. (26) ఇట్లా విపులమైన శాస్త్రముంది. నాకు కూడా వచ్చినట్లుగా చెప్పాను. గోలోకంలో రాసమండలమందు ఈపురాణాన్ని చెప్పాడు. (బ్రహ్మవైవర్తం) (27) సాక్షాత్తు భగవంతుడైన శ్రీవిష్ణువు తన భక్తుడైన బ్రహ్మకు చెప్పగా, బ్రహ్మధర్మునకు, ధర్మిష్ఠుడైన ధర్ముడు నారాయణమునికి , (28) నారాయణుడు నారదునకు, నారదుడు నాకు భక్తునకు చెప్పాడు. ఓమునిశ్రేష్ఠ! నేను వరిష్టుడవైన నీకు దాన్ని చెబుతున్నాను. (29) ఇష్టమైన బ్రహ్మవైవర్త మహాపురాణము చాలా దుర్లభమైనది. ఇది విశ్వముల సమూహాన్ని, జీవులంతా పరమాత్మను ఆత్మగా గలవారని వర్ణిస్తుంది. (30) కర్మలు చేసేవారి కర్మలకు ఆ బ్రహ్మ, సాక్షి అని చెబుతుంది. ఆ బ్రహ్మను వర్ణించారిందులో. ఆతని ఉత్తమమైన విభూతిని (సంపదను) వర్ణించాకిందులో (31) అందువల్ల ఇది బ్రహ్మవైవర్తమైంది అని ఇట్లా పండితులంటారు. పుణ్యప్రదమైనది, మంగళమైనది. మంగళాన్నిఇచ్చేది ఈ పురాణము (32) చాలా దాచతగినది. రహస్యమైనది. ఇందులో అంతా రమ్యమే నిత్యనూతనమే. హరిభక్తినిచ్చేది. దుర్లభమైన హరిదాస్యాన్నిచ్చేది (33) సుఖానిచ్చేది, బ్రహ్మనిచ్చేది, సారమైనది. శోకసంతాపముల నుండి రక్షించేది. నదులలో గంగవలె వెంటనే ముక్తినిచ్చేది, శుభమైనది .
తీర్థములలో పుష్కరము శుద్ధమైనది. పురములలో కాశి. అన్ని దేశాలకన్న భారతవర్షము శుద్ధము వెంటనే ముక్తి నిచ్చేది శుభమైనది. (35) పర్వతములలో సుమేరుపు, పుష్పాలలో పారిజాతము, ఆకులలో తులసి పత్రము, వ్రతములలో ఏకాదశీ వ్రతము.(36) వృక్షములలో కల్పవృక్షము. దేవతలలో శ్రీకృష్ణుడు, జ్ఞానేంద్రులలో మహాదేవుడు, యోగీంద్రులలో గణేశ్వరుడు (37) సిద్ధేంద్రులలో కపిలుడు, తేజస్సులలో సూర్యుడు, వైష్ణవులలో అగ్రణి, భగవాన్ సనత్కుమారుడు, (38) రాజులలో రాముడు, ధనుర్దారులలో లక్ష్మణుడు, మహాపుణ్యవతి సతి దేవతాస్త్రీలలో దుర్గ. (39) కృష్ణుని ప్రేయసులలో ప్రాణాధికమైన రాధ. ఈశ్వరీలలో లక్ష్మి, పండితులలో సరస్వతి, (40) ఎట్లాగో అట్లాగే అన్ని పురాణములలో బ్రహ్మవైవర్త పురాణము సర్వశ్రేష్ఠము. దీనికంటే విశిష్టమైనది లేదు. ఇది సుఖమిచ్చేది. మధురమైనది. పుణ్యమునిచ్చేది. (41) ఇది సందేహాలను తొలగిస్తుందీ పురాణమని ప్రసిద్ధి. ఈలోకంలో సుఖాన్నిచ్చేది అన్ని సంపదలను బాగా ఇచ్చేది. (42) శుభమును పుణ్యమును ఇచ్చేది. విఘ్నములను నశింపచే సేది. హరిదాస్యమునిచ్చేది, పరలోకంలో ఆనందాన్నిచ్చేది. (43) యజ్ఞములు, తీర్థములు, వ్రతములు, తపస్సులు, భూప్రదక్షిణము, వీటితో ఫలమిచ్చేది. ఓపుత్రక! ఏకాగ్రతతో ఈ పురాణం వింటే (45) గుణవంతుడు, విద్వాంసుడు, వైష్ణవుడు విష్ణుభక్తుడు, ఐన కొడుకును పొందుతాడు. దుర్భగవింటే స్వామి సౌభాగ్యాన్ని పొందుతుంది. (46) చచ్చిన పిల్లలు గలది, కాకవంధ్య, మహావంధ్య పాపిని వీరంతా పురాణ శ్రవణం వల్ల చిరజీవులైన పుత్రులను పొందుతారు. (47) పుత్రులులేని వాడు పుత్రుణ్ణి పొందుతాడు. భార్యలేనివాడు ప్రియను పొందుతాడు. కీర్తిలేనివాడు మంచికీర్తిని పొందుతాడు. మూర్భుడు పండితుడౌతాడు. (48) రోగబాధితుడు రోగం నుండి ముక్తుడౌతాడు. బంధితుడు బంధముక్తుడౌతాడు. భయం కలవాడు భయవిముక్తుడౌతాడు. ఆపదలో నున్నవాడు ఆపదనుండి విముక్తుడౌతాడు. (49) అరణ్య ప్రాంతంలో భయపడ్డవాడు, దావాగ్నియందున్నవాడు విముక్తుడౌతాడు, నిశ్చయము. పాపము, కుష్టు, దారిద్ర్యము, రోగము, శోకము, దారుణము (50) ఇవన్నీ పురాణ శ్రవణం వల్లనే ఇవి లేకుండా పోతాయి. పుణ్యంలేనివాడు సగం శ్లోకము, శ్లోపాదము, ప్రయత్నంగా వింటే (51) లక్ష గోవులను దానం చేసిన పుణ్యాన్ని పొందుతాడు, అనుమానం లేదు. శుద్దకాలమందు, ఇంద్రియముల జయించి నాలు భాగముల ఈ పురాణాన్ని (52) సంకల్పంతో, భక్తితో, దక్షిణనిచ్చి వింటే, బాల్యంలో కౌమారంలో, యౌవనంలో, వార్ధక్యంలో (53) కోటిజన్మలనుండి సంపాదించిన పాపం నుండి ముక్తుడౌతాడు అనుమానం లేదు. రత్నములతో నిర్మించిన పల్లకిలో శ్రీకృష్ణ రూపాన్ని ధరించి (54) తప్పకుండా గోలోకానికి వెళ్ళి నిత్యము కృష్ణదాస్యాన్ని పొందుతాడు, నిశ్చయము. లెక్కలేనంత మంది బ్రహ్మలు పడిపోయినా, ఈతడు మాత్రం పడిపోడు (అంతకాలం అని) (55) పరమాత్మకు సమీపంలో పారదుడై (పక్కన ఉండి) చిరకాలం సేవ చేస్తాడు. బ్రహ్మ ఖండాన్ని విని, చక్కగా స్నానం చేసి, నిగ్రహంతో, శుచియై, (56) విని పాయసము, పిండి వంటలు, పండ్లు తాంబూలము ఇవన్నీ ఇచ్చి పురాణం చెప్పిన వానిని తినిపించి, ఆతనికి సువర్ణ(క)ము ఇవ్వాలి.
చందనము, తెల్లపూలమాల, మనోహరమైన సూక్ష్మవస్త్రము వాసుదేవునకు నివేదించి పురాణం చెప్పినవారికి (వాచకుడు) ఇవ్వాలి (58) వినసొంపైన , అమృతం వంటి ప్రకృతి ఖండాన్ని విని పెరుగన్నాన్ని ఆతనికి పెట్టి ఆతనికి బంగారం దానమివ్వాలి. (59) భక్తిపూర్వకముగా దూడతో కూడిన రమ్యమైన గోవును, గణపతి ఖండం విన్నతరువాత విఘ్ననాశకునకు ప్రయత్నంగా ఇవ్వాలి. (60) స్వర్ణయజ్ఞోపవీతము, తెల్లని గుర్రము చత్రము,మాల, స్వస్తికమైన నువ్వుల లడ్డూలు వాచకునకు ఇవ్వాలి. (61) కాలదేశ అనుగుణంగా లభించే పండిన పండ్లను ఇవ్వాలి. శ్రీకృష్ణ జన్మఖండమును భక్తుడు, భక్తితో విని పండ్లివ్వాలి. (62) రత్నములతో చేసిన ఉంగరమివ్వాలి, వాచకునకు. సన్నని వస్త్రము, మాల, ఉత్తమమైన బంగారు కుండలాలు ఇవ్వాలి.
మాలలు, శ్రేష్ఠమైన ఉయ్యల, పండినవి, పాలు, సర్వస్వాన్ని దక్షిణగా ఇవ్వాలి. తప్పక స్తుతి చేయాలి. (64) పరమ ఆదరంతో నూరుగురు బ్రాహ్మణులను భుజింపచేయాలి. బ్రాహ్మణుడు వైష్ణవుడు, శాస్త్ర నిష్ణాతుడు, పండితుడు ఐతే మంచిది. (65) ఇట్టి వాచకుని పెట్టుకుంటే శుద్ధము లేకున్న నిష్ఫలమౌతుంది. శ్రీకృష్ణుడంటే విముఖుడైన, దుష్టుడైన, బ్రాహ్మణుడైన, ఉపదేశమందని వానికన్న (66) శ్రీకృష్ణుని యందు భక్తికలవాని నుండి పురాణం వినకపోతే, భక్తిని పుణ్యాన్ని పొందడు. ఇదివరలో చేసిన పుణ్యమును పోగొట్టుకుంటాడు. (67) శ్రీకృష్ణభక్తి కలవాని నుండి పురాణం విన్నవాడు భక్తిని పుణ్యాన్ని పొందుతాడు, చివరలో శ్రీహరి స్థానానికి పోతాడు (68) గురు ముఖం నుండి వినిన దానినంతా నీకు దీనిని చెప్పాను. ఓవిప్రేంద్ర అనుమతి నివ్వు. నారాయణాశ్రమానికి వెళ్తాను. (69) విప్రసమూహాన్ని చూచి నమస్కారం చేయటానికి వచ్చాను. ఆపై మీ ఆజ్ఞతో బ్రహ్మవైవర్తాన్ని చెప్పాను. (70) బ్రాహ్మణులకు నమస్కారము. కృష్ణ పరమాత్మకు నమస్కారము శివునకు బ్రహ్మకు గణేశునకు నిత్యము నమస్సులు నమస్సులు (71) శరీరంతో, మనస్సుతో మాటతో మిక్కిలి భక్తితో రాత్రింబగళ్ళు, త్రిగుణముల కన్న పరుడైన రాధేశుని, సత్య స్వరూపుని, పరబ్రహ్మను భజించు (సేవించు) (72) సరస్వతిదేవికి నమస్కారము. పురాణ గురువునకు నమస్కారము. అన్ని విఘ్నములను నశింపచేసే దుర్గాదేవికి నమస్సులు, నమస్సులు (73) ఓ శౌనక! పుణ్యప్రదమైన మీ పాదపద్మముల చూచి, ఈవేళ దేవుడు, గణేశ్వరుడున్న సిద్ధాశ్రమానికి వెళ్లాను. (74) అని శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణమందు శ్రీకృష్ణజన్మఖండ ఉత్తరార్ధ మందు నారాయణ నారద సంవాదమందు సూతశౌనక సంవాదమందు నూట ముప్పది మూడవ అధ్యాయము. గ్రంథ సమాప్తి.
