4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము

Table of Contents

83 - అధ్యాయము

మూ!! నందఉవాచ-

శ్రీభగవానువాచ:

నందుడిట్లన్నాడు - వేదములకు, బ్రహ్మాదులకు నీవే కారణము ఓపుత్ర! అంతా చెప్పు. నీకు క్షేమం కలగని, నిన్ను కాక ఎవరిని అడుగుతాను. (1) బ్రాహ్మణుని ధర్మము, క్షత్రియ వైశ్యశూద్రుల ధర్మము, సన్యాసుల ధర్మము, యతిబ్రహ్మచారుల ధర్మము ఏమిటో చెప్పు. (2) విప్రుల, విధవస్త్రీల, వైష్ణవుల, సజ్జనుల, పతివ్రతల స్త్రీల ధర్మాలేవి. అదంతా చెప్పు (3) గృహస్థుల, ఇల్లాండ్ర ధర్మము, విశేషించి శిష్యుల ధర్మము, పుత్రుల, కన్యల ధర్మము తలిదండ్రుల విషయంలో ఏమిటి చెప్పు. (4) స్త్రీ జాతి ఎన్ని విధాలు భక్తులు ఎన్ని రకాలు, ఓ ప్రభు! బ్రహ్మాండము ఎన్ని విధాలు. వందనము ఆచరించటమెట్లా? నిత్యమైనదేది, కృత్రిమమైనదేది, అంతాక్రమంగా చెప్పండి. (5) శ్రీభగవంతుడిట్లన్నాడు - బ్రాహ్మణుడెప్పుడూ సంధ్యతో పవిత్రుడౌతాడు. ఎప్పుడూ నన్ను సేవిస్తాడు. (6) ఎప్పుడూ నా ప్రసాదాన్ని తింటాడు. ఎప్పుడూ నివేదన చేయకుండా తినడు. అట్లా తింటే అన్నము మలముతో సమానము. నీరు మూత్రంతో సమానము, విష్ణు నివేదన కాని దిట్లా (7) విష్ణుప్రసాదం తిన్న బ్రాహ్మణుడు జీవన్ముక్తుడు. ఎప్పుడు తపస్సు యందు ఆసక్తి కనపరుస్తాడు. శుచి, శాంతుడు, శాస్త్రవేత్త (8) వ్రతతీర్థముల ఆశ్రయించేవాడు, ధర్మ మాచరించేవాడు, అనేక విషయాలు బోధిస్తాడు. గురు సేవచేసి విష్ణు మంత్రాన్ని స్వీకరిస్తాడు (9) ఆతని అనుజ్ఞపొంది ఆపై మంచి గృహస్థుడౌతాడు. నిత్యపూజల దక్షిణను గురువుకు నివేదిస్తాడు. (10) గురుపోషణ ఎల్లప్పుడూ చేయాలి, అనుమానం లేదు. నమస్కరించదగిన వారందరిలో తండ్రి గొప్ప గురువు. (1) తండ్రికన్న నూరింతలెక్కువ తల్లి. తల్లికన్న నూరింతలెక్కువ దేవత. దేవతలకన్న నాల్గింత లెక్కువ మంత్రము నిచ్చేవాడు, తంత్రము నిచ్చేవాడు. (12) భగవాన్ నారాయణుడు, గురువు ప్రత్యక్షమైన ఈశ్వరుడు. సురునకు అని ఆతని నుద్దేశించి ఇవ్వాలి, అని శ్రుతిలో విన్పిస్తోంది. (13) తన గురువు ఎదురుగా భుజించేవాడు. జనార్దనుడు స్వయంగా దేహధారియై వచ్చినట్టు. గురువు బ్రహ్మ గురువు, విష్ణువు, శివుడు స్వయంగా గురువే. (14) దేవతలంతా ఎల్లప్పుడూ ఆనందంతో గురువు యందుంటారు. గురువు ఆనందిస్తే హరి ఆనందిస్తాడు. ఆతడు ఆనందిస్తే దేవతలంతా ఆనందిస్తారు. (15) గురువు శిష్యులను పుత్రునితో సమానంగా ప్రేమగా చూడకపోతే, ఆశీర్వదించకుండా తింటే బ్రహ్మహత్యా పాపాన్ని పొందుతాడు. (16) తన ధర్మాన్ని పాటించే విప్రుడు, బ్రాహ్మణుడు ఎల్లప్పుడూ శుచియే. విష్ణువును సేవించేవిప్రుడు ఎప్పుడూ శుచి. ఇతరుడు ఎప్పడూ అశుచియే. (17) వృషభము ఎక్కే బ్రాహ్మణుడు, శూద్రులకు వంటవండే బ్రాహ్మణుడు, నంబి బ్రాహ్మణుడు, సంధ్యాహీనుడు, దుర్బలుడు, (18) బ్రాహ్మణుడు పగలు నిద్రించేవాడు, శూద్ర శ్రాద్ధాన్నాన్ని భుజించేవాడు, శూద్రశవాన్ని మోసేవాడు ఇలాటి బ్రాహ్మణులు శూద్ర సములు. (19) శాలగ్రామ మహామంత్రాన్ని జపించి, విధానంగా పూజించి, ఆశాల గ్రామపాదోదకాన్ని త్రాగి, నైవేద్య శేషాన్ని భుజించాలి. (20) హరిపాదోదకాన్ని త్రాగిన నరుడు తీర్థస్నానం చేసిన వాడౌతాడు. పాపాలన్నిటినుండి ముక్తుడై ఆతడు విష్ణులోకానికి వెళ్తాడు.

అను శాలగ్రామశిలను తోయముతో (నీరు) అభిషేకమొనర్చినవారు, వారు అన్ని తీర్థములలో స్నానం చేసినట్లే. అన్ని యజ్ఞములలో ఆతడు దీక్ష వహించినట్లే (22) ఓ ప్రజ! గంగా జలముకన్న శాలగ్రామ జలము పదింతలెక్కువ పుణ్యకారి. ఆ జలాన్ని రోజు సేవించిన విప్రుడు జీవన్ముక్తుడు, దేవతలతో సమమైనవాడు. (23) విష్ణువునకు నివేదించిన దానిని భుజించుట బ్రాహ్మణుల నిత్యవిధి. ప్రయత్నపూర్వకముగా విష్ణుపూజ, విష్ణుపాదోదకమును, సేవించుట చేయాలి. (24) ప్రతిరోజు మూడు పూటల భక్తితో విష్ణుపూజను చేసిన వారు, ఏకాదశిరోజున భుజించనివారు, నా జన్మ నక్షత్రమందు భుజించనివారు, (25) ఓ తండ్రి! శివరాత్రినాడు, శ్రీరామనవమినాడు తిననివారు నియమంగా ఉన్నవారు (ప్రతి) అలాటి బ్రాహ్మణుడు జీవన్ముక్తుడు. (26) భూమి పై ఎన్ని తీర్ధములున్నాయో అవి విప్రపాదోదకంలో నాల్గవ వంతుతో సమానం. విప్రపాదోదకాన్ని సేవించిన, నరుడు, తీర్థము నందు స్నానం చేసిన వాడితో సమానము. (27) ఏప్రపాదముల ఉదకంతో భూమి ఎంత కాలం తడిసి ఉంటుందో అంతకాలం పితరులు పుష్కర పత్రమందు (తామరాకు) జలము తాగుతారు. (28) విష్ణుప్రసాదాన్ని తినేవాడు భూమిని పవిత్రపరుస్తాడు. తీర్థములను, నరులను పవిత్ర పరుస్తాడు. ఆ బ్రాహ్మణుడు జీవన్ముక్తుడు. (29) ఆతడు అన్ని తీర్థములలో స్నానం చేసినట్లే. అన్ని వ్రతముల ఫలాన్ని పొందుతాడు. అడుగడుగునా అశ్వమేధ ఫలమును పొందుతాడు, నిశ్చయము. (30) అగ్ని వాయువులతో సమానుడాతడు. పవిత్రుడు తేజస్సులో సూర్యునితో సమానం. యమదూతనుకాని యముణ్ణి కాని ఆతడు కలలోకూడా చూడడు. (31) విష్ణువుతో పాటు ఆతని ప్రక్కన ఉంటూ ఈ విష్ణు భక్తుడు వైకుంఠమందు ఆనందిస్తాడు. విష్ణువును సేవించిన విప్రునకు క్రిందపడటం (రావటం) ఉండదు. (32) విష్ణుమంత్రోపాసన చేసే బ్రాహ్మణుడే వాడే వైష్ణవుడు. బ్రాహ్మణుడు, వైష్ణవుడు, ప్రాజ్ఞుడైనవాడు. వానికన్న పరుడైన పురుషుడు లేడు. (33) వేదంలో చెప్పబడ్డ లేదా పురాణంలో లేదా తంత్రంలో చెప్పబడ్డ వారెవరైనా మునిఐనవాడు శుచి, శైవుడైనా, శాక్తుడైనా, వైష్ణవుడైనా,ఆతనిని విచారించి స్వీకరించాలి (గురువుగా) (34) గురు ముఖం నుండి ఈ విష్ణు మంత్రము ఎవని చెవిలో పడుతుందో ఆ వైష్ణవుని చాలా పవిత్రమైనవానిగా, బుద్ధిమంతులు చెబుతారు. (35) మంత్రాన్ని గ్రహించినంత మాత్రంచేత నరుడు జీవన్ముక్తుడౌతాడు. బ్రహ్మాండ భాండాన్ని చీల్చుకొని హరిపదమును చేరుకుంటాడు. (36) పూర్వీకులైన ఏడు తరాలను, పరులైన ఏడు తరాల వారిని, మాతామహాదులైన వారిని ఏడుతరాలవారిని, సోదరులను విష్ణు భక్తుడు ఉద్ధరిస్తాడు. అట్లాగే వారి సంతానాన్ని ఆ తరువాతి వారి సంతానాన్ని ఉద్దరిస్తాడు. (37) క్షేత్రమందు పురశ్చరణ పూర్వకముగా నారాయణుని (మంత్రాన్ని) జరిపించాలి. వేయిమంది పురుషులను, అవలీలగా తనను ఉద్ధరించుకుంటాడు. (38) ఓ ప్రజేశ్వర! మంత్రమును గ్రహించినంత మాత్రముననే వచ్చే ఫలమిది. పురశ్చరణ సహవాసం వల్ల నూర్ల నూర్లపురుషులను ఉద్దరిస్తాడు. (39) “ఏకాంతిక” వైష్ణవుడు (విశేష నియమాలీతనికి) లక్షమంది పురుషుల నుద్ధరిస్తాడు. విష్ణుపదమందు తన క్రియల, సంకల్పముల బహిష్కరించాలి (40) ద్విజులు, దేవతలు నా ప్రాణములు, భక్తుడు ప్రాణముకన్న ఎక్కువ ప్రియమైనవాడు. విశ్వంలో ప్రియమైన వానిలో నాకు భక్తునికన్న ప్రియమైనవాడు, పరుడు లేదు. (41) తేజస్సు గల గురువును చూచి అన్ని విధాల రక్షించగల సమర్థుడైన గురువును చూచి ఆతని వద్ద మంత్రాన్ని గ్రహించాలి. కనుక మంత్రం గ్రహించేముందు గురువు విషయంలో విచక్షణుడై ప్రవర్తించాలి. (42) వయస్సులో తక్కువైన (తనకన్న) వాడు, జ్ఞానహీనుడు, విద్యాహీనుడు, అట్లాగే జాతిహీనుడు ఇట్టివారి నుండి గురుమంత్రాన్ని ఎప్పుడూ స్వీకరించరాదు.

మూరుని నుండి, ఆశ్రమ పాలన (గృహస్థాది) (భ్రష్ట) చేయని వాని నుండి, తండ్రి నుండి, సన్యాసి నుండి శాస్త్రార్థము, అక్షత(లు), మంత్రము ఎప్పుడూ తీసుకొనరాదు. (44) రోగి, వంశహీనుడు, భార్యాహీనుడు, అట్లాగే మంత్రము నుండిజారినవాడు (మంత్రశుద్ధిలేనివాడు) వీరినుండి ఎప్పుడూ మంత్రాన్ని గ్రహించరాదు. (45) విష్ణుభక్తి లేని వాని నుండి విష్ణుమంత్రాన్ని గ్రహించరాదు శైవుడు, శాక్తుడు, వైష్ణవుడైనబ్రాహ్మణుడు వీరి నుండి విష్ణుమంత్రం గ్రహించరాదు. (46) తక్కువ వయస్సు వాని నుండి గ్రహిస్తే అల్పాయుస్కుడు, జ్ఞానహీనుని నుండి గ్రహిస్తే అపండితుడు, విద్యాహీనుని నుండి గ్రహిస్తే మూర్ఖుడు ఔతాడు. జాతి హీనుని నుండి మంత్రాన్ని గ్రహిస్తే నాశనము నందుతాడు. (47) మూరుని వల్లనైతే మూర్ఖుడు, ఆశ్రమహీనుని నుండి మంత్రగ్రహణం చేస్తే వెంటనే దుఃఖితుడౌతాడు. తండ్రి నుండైతే కీర్తినాశనము సంన్యాసినుండైతే మృత్యువు సంభవిస్తాయి. (48) రోగగ్రస్తునినుండైతే వ్యాధి వస్తుంది. వంశహీనుని నుండి స్వీకరిస్తే నిర్వంశుడౌతాడు స్త్రీ హీనుని నుండి మంత్రం స్వీకరిస్తే భార్యాహీనుడౌతాడు, మంత్రం నుండి జారినవానినుండి మంత్రం స్వీకరిస్తే వానితో సమానుడౌతాడు (మంత్రం నిష్ప్రయోజనం) (49) విష్ణుభక్తిలేని వాని నుండి ఐతేనరుడు భక్తిహీనుడౌతాడు. శైవుని నుండి లేదా శాక్తుని నుండి స్వీకరిస్తే విష్ణువు పై భక్తి పెరగదు. (50) వైష్ణవ బ్రాహ్మణుడు శుద్దుడు పక్వానాన్ని ఇవ్వటానికి సమర్థుడు. హరికి పక్వాన్నం ఇవ్వటానికి ఇతర జనులు అసమర్థులు. (51) ఓంకార ఉచ్ఛారణము, హోమము, శాలగ్రామశిల యొక్క పూజ, నాకు పక్వాన్నము ఇవ్వటము ఇవి బ్రాహ్మణుడు కాక ఇతరుడుచేస్తే అధఃపతితుడౌతాడు. (52) ఉదాసీనుడు, దురాచారుడు వీరినుండి బుద్దిమంతుడు మంత్రం స్వీకరించరాదు. ఒకవేళ విధివశాత్తు గ్రహిస్తే, ధనహీనుడౌతాడు, నిశ్చయము. (53) బ్రాహ్మణుడు ఎల్లప్పుడు మాంసం లేని హవిష్యాన్ని భుజించాలి. ఆమిషం వదిలితే (మాంసం), సూర్యునివలె తేజస్వంతుడౌతాడు. (54) రోజు కొత్తకుండతో పాకాన్ని చేయాలి లేదా పది హేనురోజుల వరకు చేయాలి. ఆపై బుద్దిమంతులు దానిని పారవేయాలి (వాడరాదు), (55) పూజచేసేవాడు, పాకస్థానాన్ని శుద్ధిచేసి వంటచేసి, పూజాస్థానాన్ని శుద్ధిచేసి విప్రుడు భక్తితో నాకు నివేదన చేయాలి. (56) అట్లా నివేదనచేసి, బ్రాహ్మణునకు ఆదరపూర్వకంగా పెట్టి, తినాలి. నివేదించకుండా, తింటే ఆ బ్రాహ్మణుడు సురాపానం చేసినవాడౌతాడు. (57) సూర్యుచంద్రుల గ్రహణమందు, జాతమృత ఆశౌచములందు అశుచి కల్గినందువల్ల వెంటనే వంటపాత్రలను పారవేయాలి. (58) భవ్రమైన ద్రవ్యము, అన్నము విడువాలి. ఉతికిన వస్త్రములు ధరించి, పాదప్రక్షాళనచేసుకొని పరిష్కరింపబడిన (శుద్ది) స్థానంలో భుజించాలి. (59) సూర్యుడున్నప్పుడు, బ్రాహ్మణ జాతివారు రెండుసార్లు భుజించరాదు. (పగలు ఒకపూటనే భోజనం చేయాలి) లేకున్న ఆతని కర్మ అంతా నిష్పలమౌతుంది. తింటే నరకానికి వెళ్తాడు. (60) యాత్ర, యుద్ధము, నదీతీరము, రెండు సార్లు భోజనము, మైథునము వీటిని హవిష్యం తినే వాడు, సంయమం గలవాడు (నియమవంతుడు) శ్రాద్దంరోజున విడిచి పెట్టాలి (చేయరాదు), (61) ద్విజునకు, విష్ణుభక్తునకు, పండితునకు పాత్రమును ఇవ్వాలి. వృషలీపతికి, శూద్రులకు యాజి (యాగం) యైనవానికి ఇవ్వరాదు. (62) సంధ్య హీనునకు, దుష్టునకు, వృషభం ఎక్కేవానికి (వ్యాపార బ్రాహ్మణుడు) ప్రయత్నపూర్వకముగానైనా, చిలుకలమ్మే వానికి, దేవలునకు (నంబి) ఎప్పుడూ ఇవ్వరాదు. (63) వారికి పాత్రదానంచేస్తే ఆ బ్రాహ్మణుడు నరకానికి వెళ్తాడు. పాత్రను తిని (భోంచేసి) ఆరోజు మైథునమాచరిస్తే నరకానికి పోతాడు. (64) ఓ తండ్రి అందరికన్న పాతకి కన్యను అమ్మేవాడు. వెలతీసుకొని ఇచ్చేవాడు (కన్యను) మహారౌరవ నరకానికి పోతాడు.

అను! కన్యకు ఎన్ని వెంట్రుకలున్నాయో అంతకాలం, అన్ని సంవత్సరాలు,పితరులతో కూడా కుంభీపాక నరకంలో వండబడుతాడు. వానీపుత్రుడు, పురోహితుడు కూడా (66) అందువల్ల కన్యను మంచి పుత్రునకు విచక్షణడు, దానం చేయాలి ఆతడు శూద్రునితో సమానము. బ్రాహ్మణుడు ఆతని వంశజనులకు కన్య నివ్వరాదు.(67). ఓవ్రజేశ్వర! విప్ర వైష్ణవ ధర్మాన్ని చెప్పాను. పురాణములు, నాలుగు వేదములు చెప్పిన దానినిచెప్పాను. (68) క్షత్రియుడు, ద్విజార్చనము, నారాయణ పూజ చేయాలి. రాజ్యపాలనము. యుద్ధమందు నిర్భయంగా ఉండటము చేయాలి. (69) బ్రాహ్మణులకు రోజుదానము చేయాలి. శరణాగత రక్షణ చేయాలి. ప్రజలను కొడుకులలాగా చూచుకోవాలి. దుఃఖితులను రక్షించాలి. (70) శస్త్రాస్త్రములందు నైపుణ్యమును చూపాలి. యుద్ధమందు పరాక్రమం చూపాలి.ఎప్పుడు తపస్సు, ధర్మకృత్యము ప్రయత్నంగా రక్షించాలి. (71) తపస్సుధర్మము ఆచరించే పండితుని నీతిశాస్త్రజ్ఞుని ఎల్లప్పుడూ పరిపాలించాలి. ఎల్లప్పుడూ సజ్జనులు కలిగిన సభామధ్యంలో వారినుంచాలి. (72) హస్తి, గుర్రము, రథము, పదాతి సైన్యము అనే నాలు రకాల, సేనాంగ మునుంచాలి. కీర్తిగల, ప్రతాపవంతుడైనరాజు ప్రయత్నపూర్వకంగా ఎల్లప్పుడూ 'ఆనాల్గింటిని పాలించాలి. (73) యుద్ధంకై నియంత్రణ చేశాక దానంలో విముఖుడు కారాదు. రణంలో మరణించినవానికి స్వర్గము కీర్తి లభిస్తాయి. (74) వైశ్యులకు వాణిజ్యము, కృషి, రక్షణ ప్రధానము. బ్రాహ్మణ, దైవ అర్చనము, దానము, తపస్సు, వ్రత సేవనము ప్రధానము. (75) ఎప్పుడూ బ్రాహ్మణుని అర్చించుట శూద్ర ధర్మము అని విధించారు. ఆతని సేద్యము (పని) చేసి ఆతని ధనము గ్రహించుట వల్ల శూద్రుడు చండాలుడౌతున్నాడు. (76) వేలకోట్ల సంవత్సరాలు గద్దగా,నూరు జన్మలు పందిగా, నూరుజన్మలు పులిగా విప్రధనాన్ని అపహరిస్తే శూద్రుడు ఇట్లా జన్మిస్తాడు. (77) బ్రాహ్మణస్త్రీని పొందితే శూద్రుడు, తల్లిని పొందినంత పాతకి, బ్రహ్మయొక్క నూరు సంవత్సరాల కాలము వాడుకుంభీపాక నరకంలో వండబడుతాడు. (78) కుంభీపాక నరకంలో, కాగిన నూనెలో పాములచే రాత్రింబవళ్ళు కరువబడ్డాడు. యముడు కొడూ ఉన్నందువల్ల వికృతాకారమైన శబ్దాన్ని చేస్తాడు. (79) ఆ పిదప చండాల యోని ఔతాడు. ఏడు జన్మలు పాతకియై ఉంటాడు. ఏడు జన్మలు సర్పంగా, ఏడు జన్మలు జలగగా జన్మిస్తాడు. (80) వేయి కోట్ల జన్మలు మలమందు పురుగౌతాడు. ఏడు జన్మలు వ్యభిచారస్త్రీ యోనియందు పురుగౌతాడు. (81) ఆపాతకి ఏడు జన్మలలో గోవుల పుండులో పురుగౌతాడు. యోని నుండి యోనికి ప్రతియోనిలో ఇట్లా తిరుగుతాడు. నరుడుగా జన్మించడు (82) సంన్యాసుల ధర్మాన్నినేను' చెప్తున్నాను. నాముఖం నుండి విను. దండమును గ్రహించిన మాత్రం చేత నరుడు నారాయణుడౌతాడు. (83) పూర్వకర్మలు దగ్ధమౌతాయి. పరకర్మలనాశనమౌతుంది. నన్ను చింతిస్తూ నా మందిరానికి వస్తాడు. (84) సంన్యాసి పార స్పర్శవల్ల భూమి వెంటనే పవిత్రమౌతుంది. వైష్ణవునకు ఎట్లాగో అట్లా తీర్థములు సంన్యాసి వల్ల వెంటనే పవిత్రమౌతాయి. ఓ ప్రజ! (85) సంన్యాసి స్పర్శతో నరుడు పాపరహితుడౌతాడు. సంన్యాసికి భోజనం పెత్తే అశ్వమేధ ఫలాన్ని పొందుతారు. (86) నమస్కరించి, ప్రేమగా చూస్తే రాజసూయ ఫలం లభిస్తుంది. సంన్యాసుల,యుతుల బ్రహ్మచారుల వల్ల కలగిలే ఫలము సమానమే.

అను!! సంన్యాసి, యతి, సాయంకాలమందు ఆకలిగొని గృహస్థుల ఇంటికి వెళ్ళాలి. మంచి అన్నంకాని చెడ్డ అన్నంకాని వారిచ్చింది. పారేయకూడదు. (88) మధుర ఆహారాన్ని యాచించరాదు. కోపగించరాదు. ధనం తీసుకోరాదు. ఒంటి (కే) వస్త్రంతో, కోరికలేకుండా ఉండాలి. (89) చలి, వేడిమి రెండు సమానమాతనికి, లోభమోహములు విడిచి పెట్టాలి. అక్కడ ఒక రాత్రి ఉండి, తెల్లవారి మరోచోటికి పోవాలి. (90) వాహనమెక్కటంచేస్తే గృహస్థుల ధనం తీసుకుంటే, ఇల్లు కట్టుకొని గృహం కలవాడైతే, మంచిదైన తన ధర్మం నుండి పతితుడౌతాడు. (91) కృషి, వ్యాపారము చేసి, చెడువృత్తిని చేసేవాడు, అట్టి సంన్యాసి ఆచారంను చెరిచినవాడౌతాడు. తన ధర్మంను పతితుడౌతాడు. (92) చెడ్డదికాని మంచిదికాని తన కర్మను ఆచరించినట్లైతే (పూర్వంది), తన ధర్మమందున్నా బహిష్కరింపబడి, నవ్వుల పాలౌతాడు. (93) భర్తలేని బ్రాహ్మణస్త్రీ ఎప్పుడూ, కామంలేనిది కావాలి. దినము చివర ఆమె ఒక పూట తినాలి. ఎప్పుడూ హవిష్యాన్నమునే తినాలి. (94) మంచి (దివ్యమైన) వస్త్రమును ధరించరాదు. గంధ ద్రవ్యమును, వాసనగల తైలములు వాడరాదు. పూలమాల, చందనము, శంఖము, సిందూర భూషణములు ధరించరాదు. (95) వాటిని వదలి, ఎప్పుడూ అమలినమైన (సాధారణమైన) వస్త్రం ధరించాలి. ఎప్పుడూ నారాయణుని స్మరించాలి. ఎప్పుడూ నారాయణుని సేవ చేయాలి. (96) వేరే భక్తి లేకుండా, ఎప్పుడూ నారాయణుని నామోచ్చారణ చేయాలి. పరపురుషుని ఎప్పుడూ ధర్మంగా పుత్రునితో సమంగా చూడాలి. (97) మధుర ఆహారాన్ని ఆమె తినరాదు. ఓప్రజ! ఆమె వైభవమును కూర్చుకోరాదు. ఏకాదశి, కృష్ణ జన్మాష్టమి ఈరోజు లందు తినరాదు. (98) శ్రీరామనవమియందు, శివరాత్రినాడు పవిత్రంగా ఉండాలి. ప్రేత శివసన్నిధి చేరితే, సూర్యచంద్రుల గ్రహణమందు (99) తినరాదు. భ్రష్టమైన ద్రవ్యమును వదలి, పరమైనదే తినాలి. తాంబూలమును, విధవన్రీ, యతి, బ్రహ్మచారి తినరాదు (100) సంన్యాసులకు గోమాంసము సురతో సమానము, అని శ్రుతులలో వినపడింది. ఎర్రని కూరను, సెనగలు, నిమ్మ, మోదుగ (101) గుండ్రని సొరకాయ, వీటిని వారు విడిచి పెట్టాలి. మంచం పై పడుకునే స్త్రీ, విధవ, భర్తను అధః పతితుని చేస్తుంది (102) పల్లకినెక్కితే (వాహనం) విధవ నరకానికి వెళ్తుంది. కేశముల సంస్కారము (అలంకరణ) శరీరాలంకరణ చేసుకోరాదు (103) కేశముల జడ జడలరూపంగా ఉండరాదు. వాటి క్షారాన్ని తీర్థములందు తప్ప (ఇతరత్ర) చేసుకోరాదు. తైలాంభ్యంగము చేయరాదు. అద్దం చూడరాదు (104) పరపురుషుల ముఖం చూడరాదు. యాత్ర,నృత్యము, మహోత్సవము, నాట్యము, పాడటము చేయరాదు. మంచివేషం గల పురుషుని, శుభమును చూడరాదు (105) సజ్జనుల ధర్మాన్ని వినాలి. సామవేదంలో చెప్పినదాన్ని వినాలి. పరమార్దమైన దానిని పరమైన (శ్రేష్ఠం) దానిని నీకు చెబుతున్నాను. మేలుకో (106) చదివించడం, చదవటం, శిష్యపాలనము, గురు సేవ, ఎప్పుడూ ద్విజుల దేవుళ్ళ అర్చన చేయాలి (107) సిద్ధాంత శాస్త్రములందు నైపుణ్యం సంపాదించాలి. వాటిని భావించాలి. ఆత్మ సంతుష్టుడు కావాలి. వాటిని వ్యాఖ్యానించాలి. పరిశుద్దుడై ఉండాలి. ఎప్పుడూ గ్రంథాభ్యాసం చేయాలి (చదవిందాన్ని వ్యాఖ్యానించాలి).

వ్యవస్థపరిశుద్ది కొరకు (లేక) విచారణ చేయుటము (చర్చ) వేద సమ్మతమైనది. స్వయంగా శాస్త్రార్జాచరణ చేయాలి (109) దేవసంబంధి ఆహ్నికకార్యములందు నైపుణ్యము, వేద విహితాచరణము కోరతగినది. వేదములలో చెప్పిన వానిని భుజించుట, ఎప్పుడూ పవిత్రమైన నడక ఉండాలి. (110) ఓవ్రజేశ్వర! పతివ్రతల ధర్మాన్ని చెప్తాను విను. ప్రతిరోజు, భర్తమీద ఉత్సుకతతో, కోరికతో భర్త పాదోదకాన్ని సేవించాలి (111) భర్త అనుజ్ఞతో భక్తి భావంతో ఎప్పుడూ భుజించాలి. వ్రతము, తపస్సు, దేవార్చన వీటిని వదలి ప్రయత్నంగానైనా (112) భర్తచరణ సేవ చేయాలి (వదలటం, కాదు. ఇది ముఖ్యమని చెప్పటం). భర్త స్తుతి, చేయాలి. సంతోషపరచాలి. విరోధంతో సతి, ఆతని అనుజ్ఞలేకుండా ఏకర్మ చేయరాదు (113) సతి, ఎప్పుడూ, నారాయణుని కన్నను భర్తను పరమైన వాణ్ణిగా తలవాలి. పరపురుషుని ముఖం చూడరాదు. పరుడైన మంచి వేషం గల పురుషుని చూడరాదు. (114) యాత్ర మహోత్సవము, నృత్యము, నాట్యము, పాట, ఇతరుల క్రీడ, ఎప్పుడూ చూడరాదు, సువ్రతురాలు, ఓ ప్రజ!, (115) భర్త ఏదితింటే స్త్రీ అదే తినాలి, రోజూ. ఆతని సంగమును (తోడు) క్షణకాలం కూడా వదలరాదు, సువ్రత! (116) ఎదురు సమాధానం చెప్పరాదు భర్తకు, పతివ్రత. కోపంతో కొట్టినా శుద్ధురాలు కోపగించరాదు (117) ఆకలిగొన్న భర్తను భుజింపచేయాలి. పానీయము, భోజనము ఇవ్వాలి. నిద్రపోతున్న ఆతనిని లేపరాదు. పనులు పురమాయించరాదు (118) సతి, భర్త పై పుత్రుల పై కన్న నూరు రెట్లు ఎక్కువ స్నేహంచూపాలి. పతియే బంధువు, గతి, భర్త, దేవత, కులస్తీకి (119) స్వచ్ఛంగా (సున్నంలాగా) అమృతంలాగా భర్తను చూస్తే ఆ స్త్రీ శుభాన్ని పొందుతుంది, చిరునవ్వుతో ప్రయత్నంగా భక్తి భావంతో చూడాలి (120) సతియై స్త్రీ వేయిమంది పురుషులను ఉద్దరిస్తుంది (తన శక్తితో). పతివ్రత భర్త అన్ని పాపముల నుండి ముక్తుడౌతాడు (121) వ్రతంతో తేజ స్వంతులైన సతులకు కర్మ భోగము లేదు. కర్మ చేయనివాడూ, వారితోపాటు హరి మందిరమందు ఆనందిస్తాడు (122) భూమియందలి తీర్ధములన్ని సతీపాదములందున్నాయి. సర్వ దేవతల, మునుల తేజస్సు సతులలో ఉంది (123) తపస్వుల తపస్సు, ప్రతుల వ్రత ఫలము అదంతా సతులలో ఉంది, ఓ ప్రజ దాతల దానఫలము అదంతా సతులలో ఎప్పుడూ ఉంటుంది (124) స్వయంగా నారాయణడు, శంభువు, జగద్విధాత, దేవతలు, మునులు, అంతా వారిని చూచి ఎప్పుడూ భయపడుతారు (125) భూమి సతుల పాదధూళితో వెంటనే పవిత్రమౌతుంది. పతివ్రతకు నమస్కరిస్తే నరుడు పాతకం నుండి ముక్తుడౌతాడు (126) పతివ్రత క్షణకాలంలో ముల్లోకాలను భస్మంచేస్తుంది. ఆమె తన తేజస్సుతో ఈపని చేయసమర్ధురాలు. ఎప్పుడూ మహాపుణ్యవతి సతి (127) సతుల భర్త సాధువు (సజ్జనుడు) పుత్రుడు శంకారహితుడు. వానికి దేవతల నుండికాని యముని నుండికాని భయం లేదు (128) నూరు జన్మల పుణ్యంగల వారి ఇంట్లో పతివ్రత జన్మిస్తుంది. పతివ్రత తల్లి పవిత్రమైంది. అట్లాగే తండ్రి జీవన్ముక్తుడు (129) సతియైన స్త్రీ ప్రొద్దున్నే లేచి రాత్రి కట్టిన వస్త్రాన్ని విడిచి, భర్తకు నమస్కరించి, ఆనందంతో ఆతనిని స్తుతిస్తుంది.

అను ॥ఆ పై ఇంటిపని చేసి స్నానం చేసి ఉతికిన వస్త్రం ధరించి, తెల్లని పుష్పాన్ని తీసుకొని భక్తితో పతిని పూజించాలి (131) మంచి పవిత్రమైన నిర్మలమైన జలంతో స్నానం చేయించి ఆతనికి ఉతికిన వస్త్రాన్ని ఇచ్చి, ఆతని పాదములను ఆనందంతో కడగాలి. (132) ఆసనంలో కూర్చోబెట్టి, నొసట చందనం దిద్ది శరీరమంతా (సుగంధము) పూసి, కంఠమందు హారముంచి (133) సామవేదోక్త మంత్రంతో స్వచ్చమైన భోగద్రవ్యములతో భక్తితో పూజించి, భర్తను స్తుతించి, ఆనందంతో నమస్కరించాలి. (134) ఓం కాంతునకు, శాంతునకు నమస్సులు సర్వదేవతలకు ఆశ్రయమైన వానికి స్వాహా, ఈ మంత్రంతో పుష్పము చందనము ఇచ్చి (135) పాద్యము, అర్ఘ్యము, ధూపము, దీపము, వస్త్ర ము, నైవేద్యము ఉత్తమమైనది, జలము మంచి వాసనగలది శుద్ధమైనది ఇచ్చి, మంచివాసన గల తాంబూలమిచ్చి (136) చదువతగిన స్తోత్రములన్నీ చదవాలి నిర్ణయిచిన (వానిని). ఓంకాంతునకు, భర్తకు శిరస్సులో చంద్రుడుగల వాని (శివుని) స్వరూపడైన భర్తకు నమస్కారము (137) శాంతునకు దాంతునకు, దేవతలందరికి ఆశ్రయమైన వానికి నమస్సులు. బ్రహ్మ స్వరూపునకు, సతికి ప్రాణం వంటివాడైన వానికి నమస్సులు (138) నమస్కరించతగిన వానికి, పూజ్యునకు, హృదయమున కాధారమైన నీకు నమస్కారము. పంచప్రాణములకు అధిదేవుడవైన నీకు, కళ్ళకు కనుపాపలాంటి వాడవైన నీకు, జ్ఞానమునకు ఆధారమైన వానికి, భార్యకు, పరమ ఆనంద స్వరూపుడవైన నీకు నమస్కారము (139) పతిబ్రహ్మ పతివిష్ణువు. పతియే పరమేశ్వరుడు. పతి నిర్గుణమునకు ఆధారమైన బ్రహ్మరూపుడు. అట్టి నీకు నమస్కారము. (140) జ్ఞానంవల్లకాని అజ్ఞానంవల్లకాని చేసిన దోషాన్ని - క్షమించు, ఓ భగవన్! పత్నికి బంధువ! ఓ దయాసింధువ! దాసినైన నా దోషాన్ని క్షమించు (141) ఈ స్తోత్రము మహాపుణ్యప్రదమైనది. సృష్టికి మొదట్లో పద్మచేసింది. సరస్వతి, భూమి, గంగ, ఇదివరలో చేశారు, ఓ ప్రజ! (142) నిత్యము బ్రహ్మకొరకు సావిత్రి ఇదివరలో చేసింది. కైలాసంలో శంకరునికొరకు పార్వతి భక్తితో చేసింది (143) మునుల, సురల భార్యలు ఇదివరలో చేశారు. పతివ్రతలందరి స్తోత్రమిది. ఇది శుభకరమైనది (144) ఈ స్తోత్రము మహాపుణ్యమైనది. పతివ్రత వింటే, ఇతర పురుషులు, స్త్రీలు కాని వింటే అన్ని కోరికలను పొందుతారు (145) సంతానహీనుడు సంతానాన్ని పొందుతాడు. ధనహీనుడు, ధనాన్ని పొందుతాడు. రోగి రోగం నుండి ముక్తుడౌతాడు. బద్దుడు బంధం నుండి ముక్తుడౌతాడు (146) పతివ్రత స్తుతిస్తే తీర్థస్నానఫలాన్ని పొందుతుంది. ఓవ్రజేశ్వర! ఇది అన్ని తపస్సులకు, వ్రతములకు ఫలము (147) ఇట్లా స్తుతించి, నమస్కరించి ఆమె ఆతని అనుజ్ఞతో భుజిస్తుంది. ఓ ప్రజ! పతివ్రతా ధర్మాన్ని చెప్పాను. గృహిణులకు చెందినది (148) అని శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమందు శ్రీకృష్ణ జన్మఖండమందు ఉత్తరార్ధమందు నారాయణ నారద సంవాదమందు భగవంతుడు, నందుడు వీరి సంవాదమందు ఎనుబది మూడవ అధ్యాయము.