4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము
32 - బ్రహ్మమోహినీ సంవాదము
శ్రీకృష్ణ ఉవాచ - శ్రీకృష్ణుడు వలికెను :
మోహినీ యొక్క స్తోత్రముతో మన్మథుడు సంతసించి స్వయముగా ఆకాశమందు నిలిచి బోణము నెక్కు పెట్టెను. మంత్ర పూతమైన ఆ మహాస్త్రమును సంతోషముతో తండ్రి (బ్రహ్మ) పైకి విసిరెను. ఆ కామాస్త్రముతో బ్రహ్మ మనస్సు చలించి కాముకుడయ్యెను. మోహినీ ముఖములోనికి ఒక క్షణకాలము మాటి మాటికి చూచుచు వ్యామోహము పొందెను. అప్పుడా వీధాత జ్ఞానము పొంది శ్రీహరిని స్మరించుచు మోహినిని చూచుట చాలించెను. తన మనస్సుతో మన్మధునీ చరిత్రనంతను తెలిసికొనెను. బ్రహ్మ క్రోధముతో విహ్వలుడై (తన నిగ్రహము తప్పి) కుమారుడైనను వానిని (మన్మధుని శపించెను.
ఓ కాముడా! యావనము వలన పిచ్చి ఏర్పడిన వాడా! మూడుడా! ఐశ్వర్యము చేత గర్వించినవాడా! తండ్రినైన నన్ను హేళన చేయుట వలన (తిరస్కారముతో అవమానించుట వలన) నీ దర్చము {గర్వము) మున్ముందు భంగము కాగలదు అనెను. మన్మధుడది విని తన ప్రయత్నము వ్యర్థమై వేగముగా వసంతునితో గూడి పారిపోయెను. బ్రహ్మశాపమునకు భయపడి కంఠము పెదవులు దవడలు ఎండిపోయిన మన్మథుడు పారిపోయెను.
ఆ జగత్కర్త తన విషయములో మదన బాధ గలదై చిరునవ్వుతో వంకర చూపుతో తనను చూచుచున్న మోహినీతో ఇట్లు పలికెను.
బ్రహ్మోవాచ - బ్రహ్మ వలికెను :
ఓ తల్లీ! మోహినీ! నీవు వెళ్లిపొమ్ము, ఇక్కడ నావద్ద) నీ కర్మలన్నియు నిష్ఫలమగును (వ్యర్థము). నీ అభిప్రాయము తెలిసికొంటిని. ఆ పనికి నేను యోగ్యుడను కాను. నీవు కోరిన పని వేదమందు ఛీ కొట్టబడినది. ఆ నింద్యకర్మను చేయుటకు నేనసమర్థుడను. ఈ ప్రపంచములో ఒక కట్టుబాటు ఏర్చరచు వేదకర్తనైన నేను స్వయముగా ఎట్రీ కర్మ చేయుదును? వేద పఠనము చేయు నాకు ఇంతకంటే నింద్యము అపకీర్తి కల్గించునది ఏది? చేరవచ్చిన కాముకురాలైన స్త్రీ కాముకులకు విడువగూడనిది అని వేదమందు వినవచ్చినను.
తపస్విజనుల కెల్లవేళల ఆమె త్యాజ్యురాలే అగును. విశేషించి జారిణియైన స్త్రీ అందరికి పరిత్యజింపదగినదే. తన కోరిక తీర్చుకొనుట యందు మాత్రమే ఆసక్తురాలగు జారిణి పరుల యొక్క ధనమును ఆయుష్యమును కీర్తిని ఇతర సత్కార్యములను నశింపజేసి మాటి మాటికీ దుఃఖము నిచ్చును. సర్వాపదలకు బీజరూపిణి ఐన జారిణి క్రొత్తగా హత్యలకు పూనుకొన్న వారికంటే క్రూరురాలు. మెరుపులోని ప్రకాశము నీటియందు గీసిన రేఖ (గీత) లోభి స్నేహము పరద్రోహము వలన లభించు సంపద ఎట్టీవో కులటా ప్రేమ కూడ అటువంటిదే (చంచలము) అట్టి స్త్రీ అన్ని క్రూరజంతువుల కన్న ఆపదలకు మూలమైనది.
అట్టి కుంటనెవడు మిక్కిలి మూఢుడై విశ్వసించునో వానికడుగడుగున ఆపదయే. సరే నీవేమో మంచీ రూపము గల ధన్యురాలవు. కాముకుల చేత వంచింపబడితివి. నీవు యువకులకు భోగలక్ష్మీ స్వరూపురాలవు. తపస్విజనులకు విషము వంటిదానవు. అప్సరసలలో శ్రేష్ఠురాలవు. ఎల్లప్పుడు స్థిరముగా నుండు యౌవనము గలదానవు. ఓ సుందరీ! నీవు కోరెడి కర్మకు యోగ్యుడైన పడుచువానిని చూచుకొనుము. స్త్రీలలో నీవు మంచి నైపుణ్యము గలదానవు, నీకు తగిన విదగ్గుని (కామ విద్యా నిపుణునిని వెదకుము, నేనేమో ముసలితనముతో పీడింపబడువాడను. వృద్ధుడను. తపస్విని, విష్ణుభక్తీ గల బ్రాహ్మణుడను. నేను స్వతంత్రుడను గాను. పరాధీనుడను (విష్ణువుకు అధీనమైన ప్రవర్తన గలవాడను. ఇట్టి నాకు జారిణుల యందు ఆసక్తి యెక్కడ? ఓ బిడ్డా! తండ్రినైన నన్ను వదిలి శీఘ్రముగా పొమ్ము, పేరును బట్టి (వ్యవహారమును బట్టి కూడ) నేను జగత్పష్టను. అందువలన ఎల్లప్పుడు నీకు తండ్రిని. కాముకురాలవు కామవిద్యలో నిపుణురాలవు ఐన నీవు చంద్రుని మిత్రుడైన మన్మథునిని జయంతునిని నలకూబరుని దేవవైద్యులైన అశ్వినీ దేవతలను చంద్రపుత్రుడైన బుధుని సుందరులైన దితి పుత్రులను కామశాస్త్ర నిపుణులు రతికర్మలో ఆరితేరినవారు ఎందరో ఉండగా వారందరిని వదిలి పెట్టి నన్ను పొంద వచ్చితివీ!
ఎల్లప్పుడు సంభోగ విషయములో పురుషుడు స్త్రీని ప్రార్థించును. ఒకవేళ స్త్రీయే పురుషుని వద్దకు కోరిపోయిన యెడల అది విపరీతము మరియు మోసపుచ్చుట యగును. అన్నీ రత్నములలో దుర్లభమును శ్రేష్ఠమునై నది స్త్రీరత్నము. భర్తయును తన భార్యను ప్రార్థించును కానీ భార్య భర్తను ఆ విషయమున ప్రార్థించదు. స్త్రీ జాతి యందే స్వయముగా పురుషుని గోరి చేరవచ్చిన స్త్రీలు తిరస్కార యోగ్యలు. స్వయముగా చేరవచ్చిన రత్నము గూడ స్వల్పమైన వెలగలదియే దూరముగా విడిచి పెట్టబడును. కాబట్టి సదా పురుషుడు స్త్రీని చేరబోవునే తప్ప స్త్రీ తన ప్రియుని జేరబోదు. ఇక లోకాచారమందు వేదముందు గానీ పరుని ప్రియునిగా భావించి స్త్రీ చేరబోదు. ఏ వ్యక్తియైనను తన వస్తువును శాస్త్రమున చెప్పబడిన మర్యాద పూర్వకముగా యోగ్యకాలమందు అనుభవించునో వాడు పూజ్యుడు. పరుల వస్తువుల యందేవనీకాసక్తి ఉండునో వాడు పూజ్యుడు కాడు.
ఓ అబలా! వినుము. ఈ ముల్లోకములలో ఎవనికెవడు శత్రువు ఇంద్రియముల కారణముననే శత్రుత్వ మేర్పడును. కనుక తన ఇంద్రియములన్నియు తనకు శత్రువులు. వేదమున చెప్పబడినట్లాచరించుట వలన సర్వజగత్తు (జగత్తులోని జీవులు) మిత్రమగును. వేదమునకు విరుద్ధముగా చేయబడినప్పుడు మిత్రుడే శత్రువగుట నిశ్చయము. వేదోక్తముగా (వేదమున చెప్పబడినటు) కర్మలోనర్చిన వానిని గూర్చి శ్రీహరి ప్రసన్నుడుగా నుండును. శ్రీహరి సంతుష్టుడైనప్పుడు జగమంతయు సంతుష్టి చెందును. అతడు కోపించినచో జగమంతయు శత్రువగును.
ఈ సృష్టిలో కులలో జాతీయనీ సాధ్వి జాతీయనీ ఎక్కడున్నది? అంతయు తన కర్మాచరణను బట్టియే కులట - సాధ్వి అగుచున్నది. స్త్రీజాతియన్నది నారాయణుని చేత నిర్మించబడిన ప్రకృతి యొక్క అంశయే. దుష్టశీలము గల జారిణి నింద్య అగును. మంచి శీలము గల స్త్రీ పతివ్రతగా ప్రశంసించబడును. పతివ్రతలు జారిణులు సామాన్యులు అని స్త్రీలు మూడు విధములు. అట్టి స్త్రీ జాతులలో స్వయముగా పర పురుషుని ప్రియునిగా భావించి (పరస్త్రీకి ప్రియుడైన వానిని} చేరబోవునట్టిది లేదు. ఈ ప్రపంచములో పరుని చూచి స్వయముగా తానలంకరించుకొని రతి కొరకు వానిని చేరబోవుచు, కులమునకు కల్మషము తెచ్చునట్టి స్త్రీ ఉండదు. తాను సాధింపలేని భక్ష్య ద్రవ్యమును (అనుభవింపదగిన వస్తువును) చూచినదై క్షోభ చెందిన స్త్రీకి కేవలము తన వైకల్యము వలన అది సాధింపబడదు. కేవలము సాధారణ వస్తువు లభించవచ్చును” అని ఇట్లు పలికి ఆ జగత్కర్త (సృష్టికర్త బ్రహ్మ} మాటలు విరమించెను. అప్పుడు ఆ మోహినీ కోపముతో పెదవులు వణకుచుండగా మాట్లాడుటకు పూనుకొనెను.
మోహిన్యువాచ - మోహిని పలికెను :
ఓ జగత్కర్తా! ఇప్పుడు నీ చరిత్ర అంతయు తెలిసికొంటిని. నీవు నాకు నీతిని బోధించితివీ కానీ నా మనస్సు కుదుట బడుట లేదు. ఏ క్షణమున నీవు నాకంట బడితివో అప్పుడే నీయందు నాకు విశేష లక్షణము కన్పించినది. నీ ముఖమును చూడగనే నాకు ముందు పరిచయ మున్న జారులందరినీ మరచిపోతిని. నా దేహము కామాగ్నితో దగ్ధమైనది. నిన్ను వదిలి పోవుటకు (కోరిక తీరక) పూనుకొనగా నన్ను రంభ నిషేధించి ఇటువంటి సలహా ఇచ్చెను. అప్పుడు మన్మథుని సహాయముతో నీ వద్దకు వచ్చితిని, అతడు నీ శాపముతో తన ప్రయత్నము వ్యర్థము కాగా వసంతునితో బాటు వెళ్లిపోయెను. నీచేత ఎంతగా బెదరింపబడినను నేనిక్కడి నుండి పోవుటకశక్తురాలనైతిని. ఓ విభూ! ఇప్పుడు నా సర్వాంగములందు కదలలేని స్థితి ఏర్పడినది. ఓ కృపాసాగరా! నన్ను దయజూడుము. సన్ను చంపదగదు.
నీ ఆలింగన మాత్రము చేతనే నా మదన జ్వరము తొలగిపోవుననుట నిశ్చయము. నీ కర్మను బట్టి నీవు జగత్కర్తవు. నేను నా కర్మను బట్టి కులటను. జీవులు కర్మచేత సాధింపబడువారు కనుక సత్చురుపులు గర్వించరు. ఒకడు వాహనమెక్కిపోవును. కొందరు (జీవులు} వానిని మోయుదురు. పాలన కర్మ ద్వారా రాజు పన్నులు స్వీకరించును. పాలితులైన ప్రజలు పన్నులు చెల్లింతురు. ఒకడు సింహాసనాధిపతియగును. కొందరు సాధారణ రోజులుగా నుందురు. కర్మను బట్టి కొందరు వాహకులు (మోయువారు) మరికొందరు వాహనములను పోషించువారగుదురు. (అశ్వములు మొదలగు వానిని) ఒకడు తన కర్మఫలమును బట్టి ఆడపంది కడుపునబడును. ఒకడు మెత్తని శయ్యలను ఉత్తమ జీవి గర్భమును పొందును. కొందరు నీ పుత్రులగుదురు. కొందరు హరి భక్తి నాచరించి ఆ కర్మవలన విష్ణువు యొక్క పార్షదులు (వైకుంఠములోని పరివారము అగుదురు. కర్మ దోషము వలన కొందరు మలములో పురుగులగుదురు. తమ తమ ధర్మకార్యముల వలన కొందరు రాజులు స్వర్గమునకేగుదురు. మరికొందరు నరకమునకు పోయి అక్కడ మలమూత్రములందు బడి కర్మఫలము తీర్చుకుందురు. కర్మను బట్టీయే ఒకడు స్వయముగా దేవతలలో శ్రేష్టుడై ఇంద్రులకింద్రుడగును.
కర్మ మూలముననే కొందరు సురలు కొందరు నరులు కొందరు క్షుద్ర జంతువులు కొందరు వర్ణము చేత శ్రేష్ఠులైన బ్రాహ్మణులు కొందరు భూమిపతులు వైశ్యులు శూద్రులు కొందరు ప్లేచ్ఛ జాతులుగా జన్మింతురు. కొందరు తమ సత్కర్మ చేత విద్వాంసులు జ్ఞానము వలన సర్వము చూడగలవారునగుదురు. మరికొందరు మూర్ఖులు గ్రుడ్డివారు అంగ విహీనులు అగుదురు. కొందరు కర్మఫలము వలన శిష్యులకు శాస్త్రము బోధించు వారగుదురు. కొందరు గురుముఖమున (గురువ చెప్పుట వలన) పఠించి సర్వ విషయములను తెలిసికొందురు. కర్మ వలననే కొందరు స్థావర (చెట్లు తీగలు పర్వతములు} జంగమ (తిరుగునట్టి జీవులు) దేహములను ధరింతురు.
ఒకతపస్వీ గాని హంతకుడు గాని బ్రహ్మవగు నీవు గాని తన కర్మ వలననే అట్టి వారగుదురు. ఒక స్త్రీ సాధ్వియై ఇహ పరలోకములలో పూజ్యురాలు అగుట గూడ తన కర్మవలననే సుమా. మరియొక స్త్రీ వేశ్యయై తన శరీరమమ్ముకొని ఆహారము భుజించుటయు ఆ కర్మవలననే జరుగుచున్నది.
నేను దేవతల నగరములో మిక్కిలి ఆదరింపబడి సురలకు అనుభవ యోగ్యమైన స్వర్గవేశ్యను. అట్టి వారి ఆలింగనము వలన కర్మల యొక్క ఖండనము (కర్మనాశము) జరుగును. మనస్సు జన్మపరంపరల స్వభావమే కారణముగా గలది. ఆ స్వభావము బహుజన్మల కర్మలే బీజముగా గలది. ఆ కర్మలన్నియు తరువాతి అనుభవములకు బీజము. ఈ అన్నింటికి కర్త శ్రీహరి. ఆ ప్రభువు స్వయముగా కర్మమూలముగా నియతమైన శాస్త్రము ద్వారా నియమించబడిన) ఫలమిచ్చుచున్నాడు. అన్నిటికంటే కర్మరూపియైన జనార్ధనుడు బలవంతుడన్నది శాశ్వత సత్యము. అయ్యా! ఏకారణముగా నేను నీ చేత నిందించబడితిని? ఎందుకు బెదరింపబడితిని? జగత్కర్తవు ఈశ్వరుడవైన నీ పాద పద్మములు దర్శింప వచ్చితిని. యోగులు స్వప్నమున గూడ ఎవని పాద ద్వంద్వమును చూడగలుగుచు లేరో ఆ ఈశ్వరుని పతిని జేసుకొను కోరికతో స్వయముగా వచ్చితిని. ఏ స్థానము ఇహపరములందును పొందరానిదో - ఎవని పాదధూళి చేత స్త్రీలు కీర్తితో ప్రకాశింతురో అట్టి స్థానమునకు వచ్చితిని అని పలికి మోహిని శీఘ్రముగా పోయి మనోహరుని ముందు నిలిచెను.
అప్పుడు ఆ కులటా భయము వలన జగత్కర్తయగు బ్రహ్మ వణికి పోయెను. మోహినీ చిరునవ్వు, వంకరచూపులతో కామభావము ప్రకటించుచు మన్మధ బాణ పీడితురాలైతన అంగములను ప్రదర్శించెను. ఇంతలో సర్వయోగము లెరిగిన - సర్వజ్ఞుడైన మన్మధుడావిర్భవించి బ్రహ్మమీద సమ్మోహనము (మిక్కిలి మోహము కల్గించునది) సముద్వేగము (మిక్కిలి ఉద్వేగము కల్గించునది) సృష్టిబీజమును, మనస్సు స్తంభింపజేయునది, ఉన్మత్త బీజము (పిచ్చికి మూలము) శరీరము మండించు జ్వలదము మాటి మాటికీ చైతన్యము హరింపజేయునది అగు పంచబాణములను ప్రయోగించెను. మదనుడిట్లు పంచబాణములను విసరి అంతరిక్షమున నిలిచి తన తండ్రియైన బ్రహ్మను ఇంకను సమ్మోహ పరచుటకు తన కింకరులను పంపెను. వసంతుని కోకిలలను తుమ్మెదలను మనస్సును హరించు సుగంధ వాయువును నియోగించి తాను లోన ప్రవేశించి బ్రహ్మలో మార్పు కళించెను. గండుకోయిల బ్రహ్మముందు ఇట్లని చెప్పరాని మధుర ధ్వనీతో కూసెను.
తుమ్మెద అతని ముందు నిలిచి సుందరముగా సూక్ష్మముగా ధ్వని చేసెను. ఓ ప్రియురాలా! రాధా! (కథ చెప్పెడి శ్రీకృష్ణుని పిలుపు మిక్కిలి చల్లగా నున్న సుగంధవాయువు మెల్లమెల్లగా మాటి మాటికి వీచెను. వసంతుడాప్రాంతమున సంతోషముతో విహరించెను. బ్రహ్మ నిలువెల్ల పులకించెను.
మన్మధ బాణముల చేత చైతన్యము నశించి మిక్కిలి వంకర చూపులతో మోహిని బ్రహ్మను చూచి అతని భావము గుర్తించి మరల మరల నవ్వెను. సృష్టికర్త అన్ని బంధములకు మూలమైన ఆ సర్వమును తెలిసికొని తన మనస్సును అదుపులో పెట్టుకొన జాలక భయపడి శ్రీహరిని స్మరించెను. రెండు హస్తములతో తన కన్నుల ముందు శాంత రూపముతో మురళీధారియై పీతాంబరమును గట్టుకొన్న శ్రీకృష్ణుని మనస్సుతో స్తుతించెను. ఆ స్వామి కిశోర (బాల) రూపము నుండియు స్థిర యౌవనము గలిగి రత్నాలంకార భూషణములతో అతిశయించి మిక్కిలి సుందరముగా నుండి చిరునవ్వు చిందించుచు శ్యామ సుందరుడుగా నుండెను.
బ్రహ్మోవాచ - బ్రహ్మ పలికెను :
ఓ శ్రీహరీ! కామ సాగరమున మునిగిన నన్ను రక్షింపుము రక్షింపుము. ఈ సాగరము అపకీర్తయన్న జలముతో నిండి అనేక సంకటములు కల్గించుచు ఒడ్డుకు చేర శక్యము గానీ.. నీ పాద భక్తిని మరిపించుటకు కారణమైనది. ఆపదలనెడి మెట్లు కలదై దాటుటకశక్యమైనది. నిర్మల జ్ఞానమనెడి నేత్రమును మిక్కిలి మూసివేయునది. బహాజన్మలనెడి అలలతోను స్త్రీలనెడి దట్టమైన మొసళ్లతోను విషయాసక్తి అనెడీ లోతైన ప్రవాహముతోను ఘోరమైనది. ఆరంభమున అమృతము వలె నుండి అంత్యములో విష నీలయమైనది. యమాలయ ప్రవేశమునకు, ముక్తి ద్వారమును విస్మరణకు కారణమైనది. ప్రభూ! ఇట్టి మౌరసముద్రము నుండీ జ్ఞాన విజ్ఞాన సహితమైన బుద్ధియనెడి ఓడ ద్వారా నీవే నన్నుద్ధరింపుము. నీవే కర్ణధారుడవు (ఓడను నడుపు సాధనము ధరించినవాడు} ఓ మధుసూదనా! అనుగ్రహింపుము. ఓ మాధవా! ఈ సృష్టికర్మలో సావంటి వారెందరో నీ చేత నియోగింపబడిన విధులు {బ్రహ్మలు)న్నారు. నీవు విశ్వములకు అందలి జీవులకును ఈశ్వరుడవు. ఇది కర్మక్షేత్రము {భూలోకము) కాదు. కోరబడిన బ్రహ్మలోకము. ఐనప్పటికి నీ పాద భక్తిని మరిపించు కామమునందు మాకు కోరిక కలుగుచున్నది.
ఓ నాథా! కరుణా సముద్రుడా! దీనజనబంధూ! నీవు సమస్తము తెలిసిన మహాప్రభువువు. నాకీ దుష్ట స్వప్నము చూపించుము. నన్ను దయచూడుము. ఇట్లు సనాతనుడైన సృష్టి కర్త పలికి ముగించాను. నా పాదపద్మములను (శ్రీకృష్ణుని వాక్కులివి ధ్యానించి ధ్యానించి సన్నీట్లు పలుసార్లు స్మరించెను, బ్రహ్మచేత చేయబడిన ఈ స్తోత్రమును భక్తియుక్తుడై ఏపడు పఠించునో లేదా ఏసునో వాడు విషయములందు (సంసార భోగములందు) మునిగిపోడు. ఇది నిశ్చయము. వాడు నామాయను జయించి ఉత్తమ జ్ఞానమును పొందుట సత్యము. ఈ లోకమందును భక్తియుక్తుడై నా భక్తులలో శ్రేష్టుడగును.
ఇది బ్రహ్మవైవర్త మహాపురాణములోని శ్రీకృష్ణ జన్మఖండమందు నారాయణ నారదసంవాదరూపమైన దానిలో బ్రహ్మ మోహినీ సంవాదమును ముప్పది రెండవ అధ్యాయము సమాప్తము.
