4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము
115 - అధ్యాయము
మూ॥నారాయణ ఉవాచ :
రక్షకా ఊచుః
శ్రీమహాదేవ ఉవాచ :
నారాయణుడిట్లా – ఇక రక్షకులు భయపడి, ప్రభువైన బాణునితో వారు చెప్పారు. స్కందుని, గణేశుని, దుర్గను సాష్టాంగంగా దండమువలె నమస్కరించి అన్నారు. (1) రక్షకులిట్లా - కాలము దుష్టమైంది. ఇది మిక్కిలి దాటరానిది. బాలిక స్వతంత్రురాలు, పౌడ, ఇప్పుడు భర్తను కోరుతున్నది. (2) ఓ నాధ! సంగము తగనివానితో సంగమము సాధువులకు దుఃఖకారణము. నరులకు ఎల్లప్పుడు సహవాసము వల్ల గుణములు దోషములు కలుతాయి. (3) చిత్రలేఖ స్వయంగా దూతి, పరుడైన వరుని తీసుకువచ్చింది.వాడు రణశూరుడు, మహావీరుడు, రాజశ్రేష్ఠుడు, మహారథుడు. (4) యువకుడు, వ్యాధిహీనుడు, కందర్పుని కన్న సుందరుడు. సంభోగం చేయించింది. రాత్రింబగళ్ళు వారు గమనించలేదు. (5) ఇప్పుడు నీకన్య ఆ ఉష, సతి, గర్భవతి, కులజురాలు, కులము వారికి కాలుతున్న (మండుతున్న) నిప్పులాటిది. (6) దౌహిత్రుడో లేదా దౌహిత్రియో నీకిప్పుడు కలిగింది. కన్యను చూడు, ఆమె మహాప్రౌఢ, నగరంనకు చెందింది. నాగరులతో కూడింది. (7) ఆమె అవయములన్నింటా నఖక్షతములున్నాయి, వరునకు అధీనమైనది, చాలా చంచల. పురుషునితో కూడింది. ఎప్పుడూ రహస్యంగా రతి సంగమం చేసేది. (8) చిరునవ్వుతో, ఓరచూపులతో, చంచలమైన కనులతో చూచేది. ఈరకమైన మాటలను భటులవలన విని సిగ్గుపడి అప్పుడు బాణుడు కోపగించాడు. (9) యుద్ధం చేయటానికి నిశ్చయించాడు. శివుడు మాటిమాటికి వారించాడు. గణేశుడు, స్కందుడు, పార్వతి వీరు వద్దన్నారు. (10) భైరవి భద్రకాళి యోగినులు ఎల్లప్పుడూ వద్దన్నారు. ఎనిమిదిమంది భైరవులు, ఏకాదశ రుద్రులు, (11) భూతకోటి, ప్రేతములు, భేతాళురు, బ్రహ్మరాక్షసులు, పిశాచములు (కూష్మాండ) యోగీంద్రులు, రుద్రేంద్రులు, రుద్రులు, చండాదులు (12) కోటరి, గ్రామ దేవత వీరంతా వద్దన్నారు తల్లి, పిల్లవాడి హితంకోరి చెప్పినట్లుగా చెప్పారు. మూడుడు, తనకుతాను పండితుడని భావించుకునే బాణునితో శంకరుడన్నాడు. నీతిశాస్త్ర బద్దమైన, హితమైన, సత్యమైన, పరిణామంలో సుఖం కలిగించే మాటచెప్పాడు. (13) శ్రీమహాదేవుడిట్లో - ఓబాణ! ఈ పురాతనకథను చెబుతాను, విను. (14) భూభారాన్ని తగ్గించే కొరకు భారతమందు ఈశ్వరుడు స్వయంగా జన్మించాడు. రాజేంద్రులందరిని చంపి ద్వారక యందున్నాడు. (15) ఆతని వెంట్రుకలందు లోకములున్నాయి. ఆతడు సత్, ఈశ్వరుడు. అందుకే వాసుదేవుడని ప్రసిద్ధిచెందినాడు అని తెలిసినవారంటారు.(16)
పార్వత్యువాచ :
గణేశ ఉవాచ :
స్కంద ఉవాచ :
ధాతకు విధాత (సృష్టికర్త) భగవాన్ చక్రపాణి స్వయంగా భూమి పైనున్నాడు. బ్రహ్మ విష్ణు శివాదులకు ఈశ్వరుడు, ప్రకృతికి పరుడు (17) నిర్గుణుడు, నిరీహుడు, భక్తులననుగ్రహించే కొరకు రూపధారి. పరమైన బ్రహ్మ పరమైనస్థానము, దేహికి పరమమైన ఆత్మ (18) ఆతడు శరీరంనుండి వెళ్ళిపోతే జీవుడు శవమే. ఆతనితో యుద్ధం ఔతుంది. శస్త్రముతో సమానుడు, మహాకాశము, దిశలెట్లాగో ఆతడట్లా, ఓమూడుడ! (19) ఆతడు ఆత్మ నిరాకారుడు, ధ్యానమునకు కారణమైనవాడు, దేహమందుండువాడు. ఆతని కొడుకు అనిరుద్ధుడు. గొప్పబలపరాక్రమములు గలవాడు. (20) స్వయంగా ముల్లోకములను కూడా నశింపచేయుటకు, క్షణంలో, సమర్థుడు. దేవతలు, దైత్యులు, బలవంతులు, మహారథులు అంతా (21) వారంతా అనిరుద్ధుని కళలో పదహారవ భాగానికి కూడా తగరు. సమానమైన ధనము, సమానబలము కలవారికి (22) వివాహము మిత్రత్వము తగును. ఒకడు బలిసి, ఒకడు బక్కచిక్కి ఉంటే వారికి స్నేహముతగదు. బలి నీతండ్రి దైత్యులందరికీ సారభూతుడు, మహారథుడు. (23) అతడు క్షణకాలంలో సుతలానికి తీసుకుపోబడ్డాడు. అదిహరికళ, పరిపూర్ణతముడైనపురుషునకు అందరు అంశభాగములే. ఆతడు బృందావనేశ్వరుడు. కృష్ణుడు, పరమాత్మ ఆతని కళలే. (24) పార్వతి ఇట్లా అంది - ధ్యాననిష్ఠుడు తన హృదయపద్మంలో రాత్రింబగళ్ళు ధ్యానిస్తాడు. (25) బ్రహ్మ, మహేశ్వరుడు, శేషుడు, సనాతనుడైన భగవంతుని ధ్యానిస్తారు. దినేశుడు, గణేశుడు, యోగీంద్రులకు గురువైన వానిగురువు కూడా పరమాత్మను, భగవంతుని సనాతనుని ధ్యానిస్తారు. (26) సనత్కుమారుడు, కపిలుడు, నరుడు, నారాయణుడు వీరంతా తమ హృదయపద్మమందు సనాతనుడైన భగవంతుని ధ్యానిస్తారు. (27) మనువులు, మునీంద్రులు, సిద్దేంద్రులు, యోగులలో శ్రేష్టులు, ధ్యానమునకు అసాధ్యుడైన సనాతనుడైన, భగవంతుని ధ్యానిస్తారు. (28) అన్నిటికి ఆది, అన్నిటికి బీజము, సర్వేశ్వరుడు, పరాత్పరుడు వీరంతా సనాతనుడైన భగవంతుని జ్ఞానులంతా ధ్యానిస్తారు. (29) గణేశుడిట్లా - దురదృష్టము, వైష్ణవుడు మహాత్ముడు ఐన బలికి, ధీమంతుడైన ప్రహ్లాదునికి ఇటువంటి కొడుకు ఇట్టి మూడుడు ఎట్లా పుట్టాడు. (30) స్కందుడిట్లా - ఓ అన్నా! హిరణ్యకశిపుని కథ వినలేదా, హిరణ్యాక్షునికథ, మధుకైటభుల కథ వినలేదా ఆ మహాత్ముడు, ఆదైత్యులంతా నీకన్న ముందున్నవారు. మహాబలపరాక్రమములు కలవారు. (31) క్రమంగా విష్ణువు అవలీలగా వారిని యమసదనానికి పంపించాడు, భగవంతుడు, నాశకుడు, ప్రభువు స్వయంగా నారాయణుడే. (32) ఆతని నుండి రక్షించేవాడు ఎవడున్నాడు, ఓభాత! శుభం కొరకు మరలిపో. వారిమాటవిని అసురేశ్వరుడు వారితో ఇట్లన్నాడు. (33)
కోటర్యువాచ:
కోపంతో ముఖము కళ్ళు ఎర్రబడగా, ధనుస్సును ధరించిన యమునిలా, ఓతల్లి పార్వతి! చెప్తా విను. ఓతండ్రి! మహేశ్వర, విను. (34) ఓగణపతి! భాత! ఓకార్తిక! భ్రాత! విను. ప్రాణులకు శుభము అశుభము అనేది, ప్రాక్తన కర్మలననుసరించే (35) చేసిన కర్మకన్న వేరైన కార్యము ఎవరికుంది. కాలం దాపురించక పోతే, నూరు బాణాలతో కొట్టినా చావడు. (36) కాలం సమీపిస్తే గడ్డిపోచ మొదలు తాకించినా బ్రతకడు. ఎవని వలన ఎవనికి చావు విధాత ఇదివరలో వ్రాశాడో (37) అదే నిత్యము, సత్యము. ఆ బిందువును ఎవడు తప్పిస్తాడు. యుద్ధంలో భీరువైనవాని జీవనం వ్యర్థము. (38) జయిస్తే కీర్తివస్తుంది. చస్తే స్వర్గానికి పోతాడు. శివుడు రక్షిస్తున్న నగరంలోకి ప్రవేశించి కన్యను తీసుకుపోయాడు. (39) పార్వతి, గణేశుడు, బలి వీరితో యుద్ధంలో కన్యను ఎవడు గ్రహిస్తాడు. బ్రతికినవాని కెవనికి ధైర్యం. (40) నీకూతురు గర్భవతి అని సభలో రక్షకుడు చెప్పాడు. ఇది నాకు వజ్రతుల్యమైన మాట. మిక్కిలి శ్రుతికటువైనమాట. (41) అందువల్ల అనిరుద్ధుని చంపి, కన్యకను చంపుతాను. లేదా మండుతున్న అగ్నిలో శరీరాన్ని విడిచి పెడతాను. (42) కోటరీ ఇట్లా అంది - ఓ వత్స! చెబుతాను విను. నేను కూడా నీకు ధర్మం ప్రకారం తల్లిని. చెడుచావుగల కొడుకుతో కూడా తలిదండ్రులకు అడుగడుగునా దుఃఖమే. (43) కన్య ఇతరులతో తీసుకుపోబడ్డది కనుక ఆమెను ఇతరులకు ఇవ్వలేము. శ్రీకృష్ణుని పౌత్రునకు ప్రద్యుమ్నుని సుతునకు (44) అనిరుద్ధునకు, గొప్పవానికి స్వేచ్ఛగా (నీఇష్టంతో) కన్యకను ఇవ్వు. ఈ భారతవర్షంలో ఏడు తరాల పితరులతో గూడా పవిత్రుడవౌతావు. (45) నీసర్వస్వాన్ని అరణంగా ఇవ్వు. నీకు భూమిలో గొప్ప కీర్తి వస్తుంది. లేకున్న యుద్ధమధ్యంలో మాధవుడు నిన్ను చంపుతాడు. (46) సుదర్శన చక్రంతో చంపుతుంటే నిన్ను రక్షించటానికి సమర్థుడెవడున్నాడు. కోటరి మాటను విను, దైత్యపుంగవుడు కోపగించాడు. (47) ఓముని! రథమెక్కి హరిపౌత్రుడున్న చోటికి వెళ్ళాడు. శంకరుని ఆజ్ఞతో స్కందుడు సేనాపతిగా వెళ్ళాడు. (48) బాణుడు స్వస్త్యయనము చేశాడు గణేశుడు శివుడు స్వయంగా చేశారు. పార్వతి కోటరి (గ్రామదేవత) బాణునకు శుభాశీస్సులందించారు. (49) ఎనిమిది మంది భైరవులు, పదకొండు మంది రుద్రులు అందరుచేత శస్త్రములు ధరించి చంపేవాళ్ళయ్యారు. (50)
దూత ఉవాచ :
బాణ ఉవాచ :
ఇంతలో దూత అనిరుద్ధునితో ఇట్లన్నాడు. పార్వతితో బాణపత్నితో ప్రేరితుడై త్వరగా చెప్పాడు. (51) దూత ఇట్లా - అనిరుద్ధా, లే, క్షేమకరమైన పార్వతి మాటను విను. ఓవత్స! యుద్ధసన్నద్ధుడవుకా, యుద్ధం చేయి. బయటికిరా. అని (52) ఉషభయపడి ఏడుస్తూ, పార్వతి సతిని త్రాసముతో స్మరించింది. ఓమహామాయ! కోరిన నాప్రాణేశ్వరుని రక్షించు, రక్షించు. (53) అభయమిచ్చేదాన! ఘోరమైన దారుణమైన సంగ్రామమందు అభయమివ్వు. నీవే జగత్తునకంతా తల్లివి. నీ స్నేహము అంతట సమానము. (54) అట్లాగే అనిరుద్ధుడు యుద్ధమునకు సిద్దుడై శస్త్రమును చేత ధరించాడు. ఉష ఇచ్చిన రథాన్నిచేరి ఎక్కాడు, ఆనందంతో. (55) బయటికి వచ్చి శిబిరం నుండి (వచ్చి) సమర్థుడైన ఆతడు బాణుని చూచాడు. యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు. శస్త్రము చేత ఉంది. ముఖము కళ్ళు చాలా ఎర్రగా ఉన్నాయి. (56) బాడు అనిరుద్ధుని చూచి కోపంతో అతనితో ఇట్లన్నాడు. ఘోరమైన యుద్ధమధ్యంలో మండిపోతూ విషపు మాటలన్నాడు. (57) బాణుడిట్లా - ఓవీర! మహాదుష్టుడ! నీతి శాస్త్రాన్ని వదిలినవాడ! చంద్రవంశమునకు నిపువంటి వాడ! పుణ్యక్షేత్రమందు అపకీర్తి తెచ్చేవాడ! (58) నీ తండ్రి శంబరుని చంపి, ఆతని కామినిని తీసుకవచ్చాడు. ఆ పిదప నీవే పుట్టావు. చేటు చేయటంలో నీకులము సమర్థమైంది. (59) నీ (తండ్రి తండ్రి) తాత వాసుదేవుడు మధురలో క్షత్రియుడు. గోకులంలో వైశ్యపుత్రుడు. పేరు నందనందనుడు, అని (60) బృందావనంలో గోపుడైన నందుని పశురక్షకుడు. గోపికలకు సాక్షాత్తుజారుడు. దుష్టుడు, పరమలంపటుడు. (61) పూతనను వెంటనే చంపాడు. ఆడదానిని చంపాడు, అధార్మికుడు. మథురకు వచ్చి మైథునంతో కుబ్జను చంపాడు. (62) దుర్భలుడైన నరకుని చంపి మనోహరమైన స్త్రీ సమూహమును స్వీకరించాడు యోనిలుబుడు. తనకొడుకును అతినిష్టురంగా చంపాడు. (63) మానవుడైన భీష్మకుని జయించి, దుర్బలుడైన ఆతని కొడుకును కూడా జయించి, దేవతలకు యోగ్యురాలైన ఆతని కన్యను రుక్మిణిని తీసుకొచ్చాడు. (64) సత్రాజిత్తుసూర్యుని భృత్యుడు. ఆతడు ఆ దేవుని నుండి మణి శ్రేష్ఠమును పొందగా ఉపాయంగా చంపి, మణి, కన్యకను స్వీకరించాడు. (65) కురు, పాండవులకు దారుణమైన యుద్ధాన్ని చేయించాడు, యుధిష్ఠిరుని యజ్ఞమందు ఆతడు శిశుపాలుని చంపాడు. (66)
అనిరుద్ద ఉవాచ :
దంతవక్రునిసాల్వుని, జరాసంధుని, దారుణంగా చంపాడు. భూమియందు రాజసమూహమును అతిదారుణంగా చంపాడు. (67) నరకుణ్ణి ఉపాయంగా చంపి ఆతని సర్వస్వాన్ని ఆతడు హరించాడు. దుర్బలుడై, రాజులకు భయపడి, సముద్రుని శరణువేడాడు. (68) భార్యమాటతో అన్నను ఇంద్రుని జయించి, స్వర్గంలో దుర్లభమైన పారిజాతమును, దాని పుష్పాన్ని తీసుకున్నాడు. (69) అధర్మిష్ఠుడై తల్లిసోదరుడైన కంసుని చంపి, ఆతని సర్వస్వాన్ని తీసుకున్నాడు. ఇంకా నీకేం చెప్పాలి. (70) యుద్ధంలో భల్లుకాన్ని జయించి, దాని కన్యను స్వీకరించాడు. అతని తండ్రి, చెల్లెలైన కుంతి భూలోకంలో నలుగురికి భార్య. (71) ద్రౌపది భ్రాతృపత్ని అట్లాగే ఐదుగురికి కామిని కూడా. గుంపులో ఉండేవాడు, యోగిలుబుడు. ఎప్పుడు మిక్కిలి లంపటుడు. (72) అతని కన్న పెద్దవాడు బలదేవుడు. ఎల్లప్పుడు కల్లును తాగుతాడు. ఈప్సితమునకై భాతృపత్నిని యమునను పిలుస్తాడు. (73) ఆతనిచెల్లెలును ఇంద్రునికొడుకు కుంతిపుత్రుడు తీసుకుపోయాడు. మాతులుని బిడ్డయైన సుభద్రకు కులక్రమాన్ని చక్కగా చెప్పాడు. (74) బాణుని మాటను విని, కాముని పుత్రుడు కోపగించాడు. ఓముని! యధార్థమైన, యోగ్యమైన ప్రత్యుత్తరము చెప్పాడు. (75) అనిరుద్ధుడిట్లో - నాతండ్రి కామదేవుడు బ్ర్మపుత్రుడు ఇది వరలో శుచిగా ఉండేవాడు. ఆతని అస్త్రంతో త్రైలోక్యము ఎల్లప్పుడు వశీభూతమైనది, విను. (76) తన కర్మవల్ల శివుని కోపాగ్నితో భస్మమైనాడు. అందరికి పరమాత్మయైన కృష్ణుని కొడుకిప్పుడు (77) నాతల్లిరతి పతివ్రత. పతి శోకంతో ఇప్పుడు శంబరుడు బలవంతంగా తీసుకుపోగా ఆతని ఇంట్లో ఉన్నది. (78) ఛాయను మాయావతిని ఇచ్చింది. మాయతో శయనమందున్నాడు. రతిని తన ధర్మాన్ని రక్షిస్తూ ధర్మసాక్షిగా ఆ ఇంట్లో ఉంది. (79) శత్రువైన శంబరుని చంపి తన ప్రియమైన సతిని గ్రహించి ద్వారకకు వచ్చాడు. దీనికి చంద్రసూర్యులు సాక్షి. (80) పితామహుడైన (తాత) వాసుదేవుని గూర్చి నీకేం తెలుసు మూడునివలె ఉన్నావు. ఆతనిని గూర్చిసజ్జనులు తెలుసుకోలేరు. నాలు వేదములకే తెలియదు. (81) నివసించేవారందరికి ఆతడు వాసము. ఆతని రోమములందు విశ్వముంది. నివాసానికి దేవుడు పరబ్రహ్మ కనుకనే వాసుదేవుడని చెప్పబడ్డాడు. (82) ఇప్పుడు నీవు సాక్షాత్తుగా శంకరుని భృత్యుడవు అతన్నే అడుగు. కృష్ణునకు భృత్యుడైన బలికి పుత్రుడవు. కింకరుని కొడుకువు. (83)
గోకులంలో వైశ్యపుత్రుడు ఓజ్ఞానదుర్బలుడ! దీనిని గూర్చి నీవు చెప్పు. క్షత్రియవైశ్యులకు ఎల్లప్పుడు పరస్పర భోజనము వేదవిహితము. (84) ద్రోణుడు ప్రజాపతి, శ్రేష్ఠుడు. ఆతని ప్రియసతి, ధర ఆతడు తపస్సుచేసి పరమాత్మయైన ఈశ్వరుని పుత్రునిగా పొందాడు. (85) ద్రోణుడు నందుడు. వైశ్యశ్రేష్ఠుడు. ఆ యశోద, సతి, ధర. రాధ వృషభానుని సుత, సుదాముని శాపకారణంగా ఐంది.(86) ముప్పది కోట్ల గోపికలను తీసుకొని భర్త ఆజ్ఞతో, పుణ్యప్రదమైన భారత క్షేత్రానికి, ఆమె గోలోకంనుండి వచ్చింది. (87) వారితో ఆతడు రమించాడు. ఆనందంతో తన భార్యలతో రమించాడు.రాధను వివాహమాడాడు, అందుకు బ్రహ్మపురోహితుడు. (88) ఆనందంతో కోటిమంది గోపికలు గోలోకం నుండి వచ్చారు. తేజస్సులో హరితో సమానమైనవారు హరికి వారు ప్రక్కన ఉండే వారలు, శ్రేష్టులు (89) గోపవేషమందున్న అతనికి గోరక్షణము అది హరిపనే. మాయకు ఈశడు ఆతడు మాయతో గోపుల శిశురక్షకొరకు అట్లా ఉన్నాడు. (90) ఓ అసుర! పూతన బాలకన్య, నీ చెల్లెలు. వామనుని చూచి ఆగొడ్రాలు మనస్సులో పుత్రునిగా భావించింది. (91) ఇట్టివాడు, ఇప్పుడునా కొడుకు ఐతే బాగుండునని. ఆ కొడుకును సుందరుని వక్షమందుంచుకొని పాలిస్తాను. (92) ప్రభువు భగవానుడు ఆమె మనస్సును పూర్తి చేశాడు. పాలిచ్చి ఆమె రత్నముల పల్లకిలో గోలోకానికి వెళ్ళింది. (93) కుఱ్ఱపూర్వ జన్మలో దురాత్ముడైన రావణుని చెల్లెలు. శ్రీరాముణ్ణి కామంతో కోరుకున్నది. ఆమె పూర్వం శూర్పణఖ, సతి (94) ధార్మిక శ్రేష్ఠుడైన లక్ష్మణుడు ఆమె ముక్కుకోశాడు. తపస్సుతో బ్రహ్మవరాన్ని పొందినది. ఈశ్వరుని ప్రియునిగా పొందింది. (95) ఆ పుణ్యంతో ఆతనిని పొంది గోలోకానికి ఆమె వెళ్ళిపోయింది. కృష్ణుని ఆలింగనముతో గోలోకంలో గోపిక ఐంది. (96) తనపూర్వమందలిప్రాక్తనకర్మతో నరకుడు హరిచేతనే చంపబడుతాడు. సూర్యచంద్రుల సాక్షిగా కన్యలను వివాహమాడాడు. (97) భీష్ముని కన్య మహాలక్ష్మి శ్రీకృష్ణుని ప్రియమైన భార్య. బ్రహ్మ అనుమతితో వైకుంఠం నుండి వచ్చింది, ఆ సాధ్వి (98) సత్రాజిత్తుకన్యయైన ఆసత్యభామ వసుంధర. ఆ రాజు ఆమణిని కృష్ణునకు అరణంగా ఇచ్చాడు. (99) హరిభూభారాన్ని తగ్గించడానికి వచ్చాడు. కురుపాండవుల యుద్దంతో భూభారాన్ని తగ్గించాడు. (100) శిశుపాల దంత వక్రులు జయవిజయులను వారు. వైకుంఠంలో శ్రీహరికి కూడా ఆరు ద్వారములందు ద్వారపాలకులు. (101) కుమారుని శాపం వల్ల పతితులైనారు. మూడు జన్మలను పొందారు. హిరణ్యకశిపుడు కూడా నీ పూర్వ పురుషుడే. (102)
అను!! ఆతని భౌతహిరణ్యాక్షుడు. ఆతడు వరుణుని జయించాడు. హరినృసింహరూపంగా వచ్చి అవలీలగా ఆతనిని చంపాడు. (103) వరాహ రూపంతో మరొకడు చంపబడ్డాడు. వారిపూర్వజన్మ కథను విను.రెండవ జన్మలో ఇదివరలో వారు రావణ కుంభకర్ణులు. (104) వారిద్దరిని శ్రీరాముడు చంపాడు. మిగిలిన జన్మ వారికి కలిలో, వారిద్దరు శ్రీకృష్ణునితో చంపబడ్డారు. వారు ఇద్దరు ధర్మపుత్రులు. (105) జరాసంధుడు, సాళ్వుడు, దుర్మార్గుడు కంసుడు ప్రాచీనులు. ఆతనిచే చంపదగినవారు,భూభారాన్ని తగ్గించడానికి (106) మాంధాత కొడుకుల మధ్యలో యవనుడు కూడా పూర్వకర్మననుసరించి చంపతగినవాడు లక్ష్మీశ్వరుడైన కృష్ణునకు ధనంతో పనేమి. (107) సత్యభామ ప్రతిజ్ఞ కారణంగా, పుణ్యకవ్రత కారణముగా పారిజాతాన్ని తెచ్చితన వ్రతాన్ని చేయించాడు. (108) దుర్గాంశ కలది స్వయంగా జాంబవతిదేవి, భల్లూకుని కూతురు. ఆమెను పెళ్ళాడాడు. తపస్సుతో భారతదేశంలో హరి (109) కుంతికి క్షేత్రజులైన పుత్రులు, కేవలము భర్త ఆజ్ఞతో పుట్టినవారే, పితృకర్మలలో మాంసము పెట్టుట మూడు యుగాలలో ప్రసిద్దము. కలిలోనిషిద్ధము. (110) యుధిష్ఠిరుడు ధర్మునీ పుత్రుడు. భీముడు పవనుని పుత్రుడు. ధర్మిష్ఠుడైన ఫాలునుడు మహేంద్రుని పుత్రుడు. భూమిలో విజయి (111) ఇదివర్లో శంభువు ఆతనికి పాశుపతాన్ని ఇచ్చాడు. అశ్వమేధయాగము, గోవధ సంన్యాసము, శ్రాద్దంలో పితరులకై మాంసం పెట్టుట.(112) మరిదితో సంతానాన్ని కనుట, ఈ ఐదు కలికాలంలో వదలాలి (యుగం) శంకరుని వరంతో ద్రౌపదికి ఐదుగురు భర్తలైనారు. (113) బలదేవుడు నిత్యము స్వచ్చమైన పూలమధువును తాగుతాడు. ధార్మికుడు, శుచియైన ఆయన స్నానం చేయాలని యమునా నదిలో స్నానం చేశాడు. (114) కృష్ణుడు సుభద్రను మహాత్ముడైన ఫాలునునకిచ్చాడు. మేనమామ కూతురును వివాహమాడుట దక్షిణదేశపు వారి సంప్రదాయము. (115) ఇతర ప్రాంతములలో ఇది తప్పు అనికమలోద్భవుడన్నాడు. (116)
అని బ్రహ్మవైవర్త మహాపురాణ శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధ మందు నారాయణ నారద సంవాదమందు బాణ అనిరుద్ధ సంవాదమందు నూటపది హేనవ అధ్యాయము.
