4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము

Table of Contents

80 -  అధ్యాయము

మూ!! శ్రీకృష్ణ ఉవాచ :

తారకోవాచ -

శ్రీ కృష్ణుని వచనమిట్లా - ఇదివరలో, గురుపత్ని తార ఉండింది. నవయౌవ్వనవతి ఆమె. రత్నభూషణములతో అలంకరించుకుంది. శ్రేష్ఠమైన సన్నని వస్త్రముల ధరించింది, ఆసతి (1)మంచి పిరుదులు కలది, చిరునవ్వుతో అందమైనది, సుందరి, మనోహరమైనది. మాలతీ మాలలతో భూషింపబడిన పెద్ద కేశసంపదతో అందమైనది. (2) సిందూరపు చుక్కతో పాటు అందమైన చందన బిందువులతో, దానికింద కస్తూరి బిందువుతో నొసటిమధ్యభాగం కలిగి వెలిగిపోతోంది. (3) రత్నములతో ఇంద్రసారమణులతో నిర్మించిన, ధ్వనించే కాలి అందెలతో శోభిస్తోంది, అందమైన ఓరచూపులు గలది, శ్యామలవర్ణము గలది అందమైన కాటుకతో ప్రకాశిస్తోంది. (4) అందమైన సారరూపమైన ముత్యములవంటి పలువరుసలతో అందమైనది. రత్నకుండలముల జంటతో అందమైన చెక్కిళ్ళతో వెలిగేది. (5) స్త్రీలలో సాటిలేనిది, బాల, గజేంద్రమువలె మెల్లని నడక గలది, చాలా సుకుమారమైనది, చంద్రుని వంటి ముఖముగలది, కామునకు ఆధారము, కాముకి (6) స్వర్గమందలి మందాకినీ తీరమందు ఆమె స్నానం చేసి, నిగనిగలాడే వస్త్రం ధరించింది శ్రేష్టమైనది. ఆమె, గురువు పాదాన్ని స్మరిస్తూ తన ఇంటికి వెళ్ళటానికి సిద్ధంగా ఉంది. (7) ఆమె అవయవములన్నిటిని చూచి, మన్మథ బాణంతో పీడితుడై, భాద్రపదమాస చవితి యందు చంద్రుడు చైతన్యాన్ని కోల్పోయాడు, ఓప్రజ! (8) తిరిగి క్షణంలో మేల్కొని రథంలో కూర్చొని రసికుడు, బలవంతుడైన ఆతడు , తారకను (తార) చేతితో పట్టుకొని రథం పై ఎక్కించుకున్నాడు. (9) కామంతో ఉన్మత్తుడై ఆ స్త్రీని కౌగలించుకొని, ముద్దాడాడు. శృంగారం చేయటానికి సిద్ధపడ్డ ఆతనితో గురుపత్ని ఇట్లా అంది. (10) తారవచనమిట్లా- నన్నొదులు, నన్నొదులు, ఓ చంద్ర! నీవు దేవతలలో కులనాశకుడవు. నేను గురుపత్నిని బ్రాహ్మణిని పాతివ్రత్య ధర్మాన్ని ఆచరిస్తున్నదాన్ని. గురువు భార్యను పొందితే, నూరు బ్రహ్మహత్యలు చేసిన పాపము (11) గురువు భార్య, విప్రుని భార్య, ఆమెపతివ్రత కూడా ఐతే, ఆమెను పొందితే వేయి బ్రహ్మహత్యలు చేసిన పాపఫలము వస్తుంది. (12) నీవు కొడుకువు, నీతల్లిని నేను, ఓ సురశ్రేష్ఠ! ధైర్యం వహించు, వ్యర్ధుడ! నీగురించి వింటే సుర గురువు నిన్ను భస్మం చేస్తాడు. (13) పుత్రునికన్న అధికుడవు, శిష్యుడవు, నాస్వామికి నీవు ఇష్టమైన వాడివి. ఓ పాపిష్టుడ! నీ ధర్మాన్ని రక్షించుకో. తల్లినైన (లాంటి) నన్ను ఇట్లా వదిలి పెట్టు.(14) నన్నెత్తుకుపోతే స్త్రీవధ పాపాన్ని నీకు కల్గిస్తాను. తార మాటను అతిక్రమించి, ఆమెను భోగించడానికి ఉద్యమించిన వానిని (15) ఏ కోరికలేని ఆపతివ్రత తార కోపంతో శపించింది. రాహువుతో మింగబడి, మేఘములతో కప్పబడినీవు, చూస్తే పాపం కల్గించేవాడినౌతావు. (16) కలంకితుడవు, క్షయగ్రస్తుడవు ఔతావు అనుమానం లేదు అని చంద్రుని శపించి,వెంటనే వేగంగా ఆమె కామదేవుని శపించింది. (17) ఓకాముడ! ఒక తేజస్సుకలవాని వల్ల నీవు భస్మమౌతావు అని . చంద్రుడు తారనుగ్రహించి, రమించాడు, ఓ ప్రజ! (18) తన కొమ్ముయందు ఆమెనుంచుకొని, దుఃఖిస్తున్నదాన్ని, ఏడుస్తున్నదాన్ని తీసుకొనివెళ్ళిపోయాడు. జనంలేని ప్రతిరమ్యమైన చోట, మనోహరమైన ప్రతిపర్వతంలో (ఆమెతో) రమించాడు.

శుక్ర ఉవాచ-

సరస్సుల నదీనదముల మనోహరమైన ప్రతితీరమందు, తుమ్మెదల ఝంకారము పికముల కూజితములు గల బాగా పుష్పించిన పుప్పోద్యానములందు (20) అందమైన పుష్పశయ్య యందు ఆమెతో కూడి ఆతడు రమించాడు. ఒంటినిండా చందనం పూసుకొని, మధుపానరతుడై ఆ సురడు (చంద్రుడు) రమించాడు. (21) సుఖసంభోగమందు ఆసక్తుడై రాత్రింబగళ్ళను మరచిపోయాడు. మయలపర్వతమందు, మలయానిలముతో కూడిన మలయారణ్యమందు (22) రథమందు, చందన వనమందు, పశ్చిమ సముద్రము సమీపంలోను, త్రికూటపర్వతమందు వటమూలమందు, అక్కడి చంద్ర సరోవరమందు (23) చందనము పూయబడ్డ, అందమైన శతపత్రముల (పూల) పత్రమందు, అందమైన చంపకోద్యానమందు చంపక పుష్పములగాలి వీస్తున్న చోట (24) పాలసముద్రము దగ్గరి పచ్చని ప్రదేశములందు, క్రౌంచ పక్షులుగల కాంచన పర్వతమందు, రత్నశైలమందు, మణిమయ ప్రదేశమందు, మణులతో చేసిన మందిరపు సుందర ప్రదేశములందు (25) మాణిక్యములు ముత్యముల సారభూతమైన వానితో వజ్రహారములతో శోభించిన ప్రదేశములందు, అందమైన వస్త్రములు, చిత్రములు గల చోట, తెల్లని చామరములతో అద్దములతో (26) అలంకరింపబడ్డచోట, రత్నదీపములతో అలంకరించబడ్డ, దేవక్రోడమందు (స్థలము) ప్రియస్థలమందు రమించాడు. వారుణమైన మదిరను తాగి(ఒకరకమైన గడ్డి నుండి తీసినమదిర), వరుణదేవితో కూడి (27) వరుణుడు రమించేచోట,తారతో కూడి ఆతడు రమించాడు. పావనమైన పవనముగల (గాలి) ఉద్యానమందు, పారిజాతపు గాలితో (28) మంచివాసనతో మోహితమైనచోట, నిర్మలమైన రత్నమాలా తీరమందు, ఋక్ష పర్వతమందు, కల్పవృక్ష వనమందు, వహ్నికి ప్రియమైన ఆశ్రమమందు (29) రమించాడు. సాలసంద్రపు ఒడ్డుయందు కామధేనువు పాలను తాగాడు. వహ్నిశుద్దమైన వస్త్రయుగమును అగ్ని ఆతనికి ఆనందంతో ఇచ్చాడు. (30) వరుణుడు రత్నమాలను గాలిరత్న ఛత్రమును ఇచ్చారు. అక్కడ, బలి గృహమునుండి వచ్చిన శుక్రుని చూచి (31) నమస్కరించి, అంతా చెప్పి, చంద్రుడు ఆతనిని శరణు వేడాడు. శుక్రుడు, నీతిగల యుక్తితో కూడిన మాటను చెప్పి ఆతనిని ఉద్బోధించాడు. ఆతడు (శుక్రుడు) అపేక్షలేనివాడు, మునిశ్రేష్ఠుడు, వేదవేదాంగపారగుడు. (32) శుక్రుని వచనమిట్లా - ఓవత్స! చెపున్నాను విను. తారను గురువునకు ఇచ్చేయుము. ఆతడు బ్రహ్మకు పౌత్రుడు, శంభుని గురు పుత్రుడు. (33) దేవతలతో పూజింపబడే వాడు నిశాపతి! ఆతనికి ఇవ్వు. ప్రియుడైన ఆయనకు ఆతని ప్రియను త్వరగా ఇచ్చి నీవు ఆతనిని శరణువేడు. (34) ఓ చంద్ర! నామాట ప్రకారం తల్లితో సమానమైన గురుపత్నిని విడిచి పెట్టు. పాపము, నాశాన్ని చేసుకో. పాపనివృత్తి గొప్పఫలము. (35) సతులను, గురుపత్నులను బలవంతంగా గ్రహిస్తే, నరుడు వేయి బ్రహ్మహత్యల పాపాన్ని పొందుతాడు. (36) బ్రహ్మయొక్క నూరుసంవత్సరముల కాలమువరకు కుంభీపాక నరకమందు వండబడుతారు. ఓ సుర! నారాయణుని స్థానమందు తృణము,పర్వతము రెండు సమానమే. (37) ఓ వత్స! హరిస్టానమందు నీవెంత వాడివి. బ్రహ్మకుకూడా కర్మభోగముంది. నారాయణుని ఆశ్రయించిన జీవులందరు సంసారమందు మూడు రకాలు. (38) అని బ్రహ్మవైవర్త మహాపురాణ మందు శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధమందు నారాయణ, నారద సంవాదమందు, భగవంతుడు నందుడు వీరి సంవాదమందు తారను హరించుట అనునది ఏనుబదవ అధ్యాయము.