4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము
121 - అధ్యాయము
మూII నారాయణ ఉవాచ:
బ్రాహ్మణ ఉవాచ:
శృగాల ఉవాచ :
నారాయణుడిట్లా - తన గణముతో కూడి కృష్ణుడు సుధర్మసభయందు ఉన్నాడు. అక్కడికి బ్రహ్మతేజస్సుతో వెలిగిపోతున్న విప్రుడు వచ్చాడు. (1) వచ్చిచూచి భక్తితో పురుషోత్తముని స్తుతించాడు. శాంతుడు, భీతుడుఐ, మధురంగా వినయపూర్వకంగా అన్నాడు. (2) బ్రాహ్మణుడిటాల్ల - శృగాలుడు (రాజు) వాసుదేవుడు, రాజేశుడు, మండలేశ్వరుడు, ఆతడు చెప్పిన మాటను నీకు చెప్తున్నాను. సావధానంగా విను (3) శృగాలుని వచనమిట్లా - వైకుంఠంలో వాసుదేవుణ్ణి, దేవతల ఈశుణ్ణి, నాలుచేతులు కలవాడిని. లక్ష్మీపతిని, జగత్తును పాలించేవాడిని, ధాతకు ధాతను (4) భూభారాన్ని తగ్గించడాకి బ్రహ్మ నన్ను ప్రార్థించాడు. భూమి పై భారతవర్షము (దేశము)నకు వెళ్ళుటనాపని. (5) వసుదేవుని కొడుకైన వాడు వైశ్యుడు (క్షత్రియుడు), అహంకరిస్తున్నాడు. జనమును జనముతో జయిస్తున్నాడు దుర్బలుని, బలముకలవానితో చంపించి గెలుస్తున్నాడు. పరస్పరము యుద్దంచేయించి రాజులను చంపాడు, మహాధూర్తుడు (6) దుర్యోధనుడు జరాసంధుడు, దుర్బలుడైన మరోరాజు, వీరిని భీమునితో చంపించాడు. భూమి పై అల్పునకు బలవంతునకు యుద్ధం చేయించాడు. (7) ద్రోణుడు, భీష్ముడు, కర్ణుడు, భూమి పై ఉన్న ఇతరులను బలవంతుడైన అర్జునునితో, అవలీలగా చంపించాడు. (8) దుర్బలులు, ప్రసిద్ధులు అప్రసిద్ధులు ఐన ఇతర రాజులందరిని, ప్రసిద్ధుడైన, బలవంతుడైన వానితో అవలీలగా చంపించాడు. (9) శిశుపాలుని, దంతవక్రుని, చిరకాల రోగియైన కంసుని, నాకొడుకు నరకుని, దుర్బలుడైన కేశుడను వానిని, ముర అనువానిని (10) స్వయంగా చంపాడు. సంకేతములతో, కపటంతో త్వరగా చంపాడు. నీ సంకేతంతో కపటంగా చంపారు. ధర్మయుద్ధంలో చంపలేదు. కపటస్వభావుడు, బాలుడు, అధార్మికుడు (11) పూతనను, కుబ్జను చంపాడు. ఆడవారిని వస్త్రం కొరకు చాకలిని చంపాడు. శిష్టుని అశిష్టుడై చంపాడు. మోసగాడు (12) దైత్యుడైన (దితిపుత్రుడు) హిరణ్యకశిపుని, మహాబలుడైన హిరణ్యాక్షుని, మధుకైటభులను చంపాడు. నేను సృష్టిరక్షకుడిని (13) నేనే బ్రహ్మను. నేనే స్వయంగా శివుడిని. నేనే విష్ణువును. జగద్రక్షకుడను. దుష్టులను అణచేవాడిని. (14) నా అంశంతో, కళతో ఉన్నవారేమనులంతా మునులుకూడా. నేనే స్వయంగా నారాయణుడిని, నిర్గుణుడిని. ప్రకృతికి పరుడను. (15) సిగ్గుతో, దయతలచి, మిత్రుడను బుద్ధితో క్షమించాను. గడిచిందిగడిచిందే. ఓభద్రుడ। నాతో యుద్ధం చేయి. (16) దూతద్వారా విన్నాను. చాలా పెద్దగా అహంకరించావు. ఆతనిని అణచుట యోగ్యము (చేయాలి). ఉన్నతమైన వానినిపడగొట్టుట తగును.
శృగాల ఉవాచ:
శ్రీకృష్ణ ఉవాచ :
అను ॥ యుద్ధము పరమధర్మము. ఇప్పుడు భూమిని శాసించేవాడిని నేను. శంఖము, చక్రము, గద, పద్మము, తీసుకొని, నేను చతుర్భుజుడనై (18) ఆ ద్వారకకు, స్వయంగా గణములతో కూడి యుద్ధానికి వెళ్లాను. కోరిక ఉంటే యుద్ధం చేయి, లేదా నన్ను శరణువేడు. (19) శరణాగతుడవై నన్ను శరణువేడకపోతే, క్షణంలో ద్వారకను భస్మం చేస్తాను. (20) నీబలముతో, పుత్రులతో, బంధువులతో, గణముతో కూడిన నిన్ను క్షణకాలంలో కాల్చివేయగల శక్తిగలవాణ్ణి, అవలీలగా ఎవరి సహాయంలేకుండా చేయగలను. (21) తపస్వి, వృద్ధుడు ఐన శంకరుని యుద్ధంలో జయించి, బ్రహ్మ శాపం వల్ల రోగియైన భగాంగుడైన ఇంద్రుని జయించి (22) మదించి ఉన్నావు. నిన్ను నీవెవీరునిగా భావించుకుంటున్నావు, పారిజాతం కారణంగా వ్యర్థంగా స్త్రీతో జయింపబడ్డావు. (ఆమెకు లొంగినావు) (23) లంపటుడవు, యోనిలుబుడవు, గోకులంలో రాధకు అధీనుడవు. ఇప్పుడు సత్యభామ మొదలగు స్త్రీలకు బంటుతో సమానుడవు. (24) అని పలికి బ్రాహ్మణుడు మౌనంగా నిలబడ్డాడు, ఓముని। తనగణములతో కూడి శ్రీకృష్ణుడు ఇదంతా విని, మిక్కిలి పెద్దగా ఆతడు నవ్వాడు (25). బ్రాహ్మణుని నాలు విధాలైన పదార్థాలతో భుజింపచేసి, పూజించి, మాటలనే బాణాల ద్వారా ఏర్పడ్డ మానసిక జ్వరంతో, దుఃఖంతో రాత్రిగడిపి (26) తెల్లవారగానే తన గణముతో కూడి, త్వరగా, ఆనందంతో రథమెక్కి, శృగాలుడను రాజున్న చోటికి, తనలీలా మాత్రంతో వెళ్ళాడు. (27) శృగాలుడు ఆ వార్తను విని, కృత్రిమమైన నాలుగు చేతులు ధరించి తన గణంతో కూడి స్వయంగా, యుద్ధమునకై హరి ఉన్నచోటికి వచ్చాడు. (28) మిత్రుడు అనే ఉద్దేశ్యముతో, కృష్ణుడు లౌకికమైన మాటలు మాట్లాడాడు. నవ్వుతూ, నేత్రములలో మంచి తనము ఉట్టిపడగా కౌగిలించుకున్నాడు. మధురంగా సంభాక్షించాడు. (29) రాజు నియంత్రణ చేశాడు. కృష్ణుడు దానిని అంగీకరించలేదు. కృష్ణునకు భయపడి, చూడగానే దంభమును వదిలి ఇట్లన్నాడు. (30; శృగాలుడిట్లా - నీ చక్రంతో నా శిరస్సును ఛేదించి, త్వరగా ద్వారకకు పో, ఈ దేహము పాపం కలది, అనిత్యము, నశించేది. పడిపోనీ (31) నేను భద్రుణ్ణి, నీ ద్వారం దగ్గర జయవిజయులవలె నేనొకణ్ణి. ఓసర్వజ్ఞ। నీకంతా తెలుసు. ఓప్రభు। ఆలసించకు. (32) లక్ష్మీ శాపంవల్ల భ్రష్టుడనైనాను. నా శాపకాలం పూర్తైంది. నూరు సంవత్సరాలకు శాపం చివర నీ భవనానికి వస్తాను. (33) అనగా శ్రీకృష్ణుడిట్లా - ఓమిత్రుడ। తొలుత నీవు నన్ను కొట్టు. ఆ తరువాతనే యుద్ధం చేస్తాను. అన్నీ తెలుసు. ఓవత్స, చాలా సుఖంగా వైకుంఠానికి వెళ్ళు.
శృగాల ఉవాచ :
శ్రీభగవానువాచ :
శృగాల ఉవాచ :
శృగాలుడు పదిబాణములను మాధవుని పై వేశాడు. అవి నమస్కరించి, కాలరూపియైన ఆకాశంలోకి త్వరగా పోయాయి. (35) ప్రళయకాలమందలి అగ్ని జ్వాలవంటి గదను రాజు వేశాడు. కృష్ణుని శరీరం తగులగానే క్షణంలో విరిగిపోయింది. (36) కాలరూపమైన, చాలా దారుణమైన ఖడ్గము, ధనువు విసిరాడు, రాజు. కృష్ణుని శరీరం తగులగానే క్షణంలో విరిగిపోయింది. (37) మరలిన రాజును చూచి కృఫానిధి ఇట్లన్నాడు. ఇంటికిపోయి చాలా తీక్షమైన అస్త్రాన్ని తీసుకురా, ఓమిత్రుడ। అని (38) శృగాలుడిట్లాఆత్మ, ఆకాశము, అస్త్రముతో కొట్టబడదు. ఆత్మతో యుద్ధమేమిటి. భూమిని ఉద్ధరించేందుకు కారణమైనవాడ। భవసాగరము నుండి నన్ను ఉద్దరించు. (39) భవసాగరము విషమము (సమంకాదు). ఓనాథ। విషయములనే విషం అధికంగా ఉంది. నా మాయ అనే బేడెమును, నాకర్మల మోహజాలాన్ని ఛేదించు. (40) కర్మలకు ఈశ్వరుడవు నీవు. విధాతవు, ధాతకు కూడా శుభఫలములనిచ్చేవాడివి. అన్ని సంపదలనిచ్చేవాడివి. (41) ప్రాక్తనమైన వానికి కారణుడవు వాటిని ఖండించడంలో సమర్థుడవు వైకుంఠ గేహానికి (ఇంటికి) వెళ్తున్నాను. నీవైనఏడు ద్వారముల దగ్గరకు వెళ్తున్నాను. (42) ప్రాకృతమైన, పాంచ భౌతికమైన, నశ్వరమైన దేహాన్ని వదిలివెళ్లాను. మిత్రునిమాటనువిని (స్తుతిని) అమృతమువంటి మాటచెప్పాడు. (43) కృపతో, కృపానిధి యుద్ధంలో ఏడ్చినాడు. వెంటనే అక్కడ కృష్ణుని కన్నీటి బిందువుతో (44) దివ్యమైన బిందు సరమని పేరుగల తీర్థములకు శ్రేష్ఠమైన, ఉత్తమ తీర్థము వెలసినది. ఆనీరు తగిలినంత మాత్రాననే, నరుడు జీవన్ముక్తుడౌతాడు. ఏడు జన్మల నుండి ఆర్జించిన పాపం నుండి ముక్తుడౌతాడు. అనుమానం లేదు. (45) భగవండిట్లా - నీ ఈ బుధేమిటి. ఓ మిత్రుడ। నీనిర్మలమైన మన స్సేమిటి. మరి దూతద్వారా కఠినమైన దారుణమైన, మాట చెప్పించటమేమిటి? (46) శృగాలుడిట్లా - నేను అట్లా అన్నాను నీతో. అందువల్ల కోపంతో ఇక్కడివచ్చావు. లేకున్న నాథ। కలలో కూడా నీ దర్శనము దుర్లభము. (47) ఇంతలో యోగంతో ప్రాకృతదేహాన్ని విడిచి, కృష్ణుణ్ణి చూచి ఆనందంతో విమానంలో వైకుంఠానికి వెళ్ళాడు (48) అక్కడ చాలా పెద్దదైన ఏడు తాటిచెట్ల ప్రమాణంగల జ్యోతి కన్పించింది. పద్మములతో, పద్మతో పూజింపబడిన పద్మముల వంటి పాదములకు నమస్కరించి వెళ్ళాడతడు. (49) కృష్ణుడు ద్వారకకువెళ్ళి తల్లికి, తండ్రికి నమస్కరించి, తన గణములతో పాటు శ్రీకృష్ణుడు పరమమైన అద్భుతాన్ని త్వరగా చూచి (50) వికసించిన ముఖంతో శ్రీమాన్ ద్వారకకు అభిముఖంగా వెళ్ళాడు. పూలు చందనము వీనితో వాసనగల రుక్మిణి ఇంటికి వెళ్ళాడు. (51) పూలు చందనం గల పడక పై, ఆమెతో కూడా రాత్రిని గడిపాడు (రమించాడు) ఆ భైష్మి కృష్ణుని తన వక్షఃస్థలం పై ఉంచుకొని మూర్ఛను పొందింది. (52) అని శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమందు శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధ మందు నారాయణ నారద సంవాదమందు శృగాలవాసుదేవునకు ముక్తి నివ్వటమనునది నూట ఇరవై ఒకటవ అధ్యాయము.
