4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము
100 - అధ్యాయము
మూII శ్రీనారాయణ ఉవాచ :
శ్రీనారాయణుడిట్లన్నాడు :
ఇక అదితి, దితి, దేవకి, రోహిణి, రతి, సరస్వతి, సావిత్రి, పతివ్రత, యశోద (1) లోపాముద్ర, అరుంధతి, అహల్య తారక వీరంతా పార్వతిని చూచి వేగంగా మందిరం నుండి వెళ్ళారు. (2) ఒకరినొకరు పలకరించుకొని, మళ్ళీ మళ్ళీ కౌగిలించుకొని, నమస్కరించి రత్న నిర్మిత మందిరంలోకి ప్రవేశించారు. (3) ఈశ్వరిని రమ్యమైన రత్నసింహాసనమందు కూర్చోబెట్టారు. మాలతో వస్త్రంతో రత్నభూషణములతో అలంకరించారు. (4) ఇంద్రుడు తెచ్చిన మనోహరమైన పారిజాతపుష్పాన్ని ఆమె (పార్వతి) పాదపద్మమందు దేవకి భక్తి పూర్వకంగా సమర్పించింది. (5) పాపటలో సిందూరపు చుక్కను నొసట చందనపు చుక్కను పెట్టింది. వారికి కస్తూరి కుంకుమాదులను అంతట పెట్టింది. (రామకృష్ణులు) (6) మధురమైన ఆహారమును భుజింపచేసింది. మంచివాసనగల చల్లని నీరును ఇచ్చింది. శ్రేష్ఠమైన అందమైన కర్పూరం మొదలగు మంచి వాసన గల తాంబూలాన్ని ఇచ్చింది. (7) పాదపద్మముల గోళ్ళపై పారాణి అద్దింది. కుంకుమ రాగాన్ని ఇచ్చింది. తెల్లని చామరలతో వీచింది. (8) మునిపత్నులు క్రమంగా పార్వతీ దేవిని పూజించారు. పతిపుత్రులు గల ఆసతులను శాస్త్ర ప్రకారంగా పూజించింది. (9) రాజకన్యలు దేవకన్యలు, మనోహరమైన నాగకన్యలు, మునికన్యలు, బంధువుల కన్యలు(లను) ఆసువ్రత పూజింపచేసింది. (10) రకరకాలైన మధురమైన వాద్యములు కుతూహలంతో వాయింపచేసింది. మంగళకార్యం చేయించింది. బ్రాహ్మణులను భుజింపచేసింది. (11) మథురాగ్రామదేవతను భైరవిని పూజించింది. షష్ఠిని (పార్వతి) మంగళ చండికను షోడశ ఉపచారములతో పూజించింది. (12) పుణ్యప్రదమైన, స్వచ్చమైన, స్వస్త్యయనమను మంగళకార్యాన్ని చేయించింది. వసుదేవుని భార్య వేదములను చదివించింది. (13) బంగారు కలశములందలి స్వర్గంగ నీటితో పుత్రవాత్సల్యముగల ఆమె బలరామకృష్ణులకు, స్నానం చేయించింది. (14) వస్త్రము చందనము మాలలతో వారికి ఆమె వేషం వేసింది. శ్రేష్ఠరత్నముల సారమైన వానితో నిర్మించిన అందమైన భూషణములతో అలంకరించింది. (15) తల్లి అలంకరించిన భూషణములతో కూడిన బలరాముడు, కృష్ణుడు దేవమునీంద్రులున్న సభకు వచ్చారు (తేబడ్డాడు), ఓ నారద! (16) ఆ జగన్నాథుని చూచి బ్రహ్మ శంభువు శేషుడు, ధర్ముడు, భాస్కరుడు వీరంతా వేగంగా లేచారు.(17)
బ్రహ్మఉవాచ :
శ్రీమహాదేవ ఉవాచ :
అనంత ఉవాచ :
దేవా ఊచుః
మునీంద్రా ఊచుః
అను ॥ దేవతలు, మునులు, కార్తికేయుడు, గణేశ్వరుడు, క్రమంగా విడివిడిగా పరమేశ్వరుని స్తుతించారు. (18) బ్రహ్మ ఇట్లా - ఓనాథ! నీవు అనిర్వచనీయుడవు. భక్తులను అనుగ్రహించే కొరకు రూపమెత్తిన వాడవు. వేదములు కూడా నిన్ను నిర్వచించలేదు. ఇక్కడ నిన్ను స్తుతించుటకు ఎవడు సమర్థుడు. (19) శ్రీమహాదేవుడిట్లన్నాడు - దేహములందు దేహివి, ఎప్పుడూ ఉన్నవాడివి, నిర్లిప్తుడవు. కర్మచేసే వారికర్మలకు శుద్ధసాక్షివి. నాశరహితుడవు, విభువువు రూపశూన్యుడవు, గుణశూన్యుడవు, నిర్గుణుడవు. ఏమని స్తుతించాలి. (20) అనంతుడిట్లా - ఓనాథ! నాకేమి తెలుసు, నేను అజ్ఞుణ్ణి, నీవు అనంతుడవు, ఈశ్వరుడవు. (21) అనంతకోటి బ్రహ్మాండములకు కారణము వు, దుఃఖనివారకుడవు. మహావిష్ణువు యొక్క రోమ(రంధ్ర) ములందు, జలములందు (22) అసంఖ్యాకములైన చిత్రములైన, కృత్రిమములైన విశ్వములున్నాయి. సజ్జనులు, దేవతలు, బ్రహ్మ విష్ణు శివాత్మకులు నీలో ఉన్నారు. (23) ప్రతిబింబములందు నీ అంశములే తీర్థములు, భారతము కూడా. బ్రహ్మాండములందు ఒక్కడిగా ఉన్న నేను సూక్ష్మమైన నాగస్వరూపుణ్ణి. (24) నీతో కూర్మమందు స్థాపించబడ్డాను. గజేంద్రమందు మశకమువలె. పరమాణువునకు పరమై సూక్ష్మమైనది విశ్వములలో ఎక్కడా లేదు. (25) (నీవుతప్ప) అలాగే మహావిష్ణువు కన్న పరమైన స్థూలము, సమముగాని ఎక్కడా లేదు. మహావిష్ణువున కన్న పరమైనవాడివి నీవు. నీకన్న పరమైనవాడు ఎవ్వడులేడు. (26) స్థూలము కన్న స్టూలతరుడవు, సూక్ష్మము కన్న సూక్ష్మతముడవు దేవుడవు గొప్పవాడివి నువ్వు. జలరూపుడవైనీవు స్వయంగా మహావిష్ణువునకు ఆధారభూతుడవు. (27) జలధార గోలోకము. నీవు స్థావర రూపము ధరించిన వాడవు. అందరికి ఆధారమైన మహావాయువు నీకు శ్వాసనిశ్వాసరూపము. (28) ఓవిభు! భక్తులను అనుగ్రహించే కొరకు దేహధారివైన, నిత్యుడవైన నీకు గాలి స్వరూపము. నీవు ఇదివరలో ఇచ్చిన అనేక వక్రములతో స్తుతించాలని ఉంది. నీసహవాసం వల్ల ఈశ్వర జ్ఞానము రాలేదు. (ఇవ్వలేదు) (29) దేవతలిట్లన్నారు - అనంతుడవైన నిన్ను స్తుతించుటకు, అనంతదేవుడు (శేషుడు) సమర్థుడుకానప్పుడు. (30) స్వయంగా బ్రహ్మ జ్ఞానాత్మకుడైన శివుడు సమర్థులు కానప్పుడు, సరస్వతి జడురాలైనప్పుడు నీ స్తోత్రాన్ని మేమేమి చేస్తాము. (31) మునీంద్రులిట్లన్నారు - వేదములు నిన్ను స్తుతించుటకు శక్తము కానప్పుడు ఈశ్వరుడవైన నిన్ను తెలుసుకొనుటకు శక్తము కానప్పుడు, మేము వేదములు తెలిసిన వారమైయుండి నీ స్తోత్రాన్ని ఏమి చేస్తాము. (32) ఈ స్తోత్రము మహాపుణ్యమైనది. దేవతలు మునులు చేశారు. శ్రద్ధతో, శుద్దుడై పూజాకాలమందు భక్తితో చదివినవాడు (33) ఈ లోకంలో సుఖమనుభవించి, నిరంజన జ్ఞానాన్ని పొంది, రత్న విమానము నెక్కి ఆతడు గోలోకానికి వెళ్ళుతాడు. (34)
అని శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమందు శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధ మందు నారాయణ నారద సంవాదమందు భగవదుపనయనమనునది నూరవ అధ్యాయము.
