4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము
110 - అధ్యాయము
శ్రీనారాయణ ఉవాచ :
యశోదోవాచ :
శ్రీభగవానువాచ :
అను ॥ శ్రీనారాయణుని వచనమిట్లా –
వచ్చినవారు ఇట్లా వెళ్ళిపోయాక మంగళకర్మ సాంగముగా అయ్యాక నందుడు యశోదతో కూడి పుత్రుని సమీపమునకు వెళ్ళాడు. (1) యశోద ఇట్లా - ఓ మాధవ! నీ తండ్రినందునకు నీవు జ్ఞానాన్ని ఇచ్చావు . ఓవత్స! కృపానిధి! తల్లినైన నా పై కూడా దయజూపు. (2) భూమిని ఉద్ధరించుటకు కారణమైన వాడ! మహాభాగ! నన్ను ఉద్ధరించు. భయంకరమైన భవాబ్దిని (పుట్టుకను) దాటటానికి భయపడుతున్నాను, అందులో పడి ఉన్నాను. (3) ఆప్రకృతి మాయగలది. పుట్టుక అనే సాగరాన్ని దాటటానికి నీవే ఓడవు. కర్ణధారుడివి నీవే. భక్తులను ఉత్తీర్ణులను (పైకి తీయటం) చేసేవాడ! ఓ దయామయుడ! (4) యశోధ అన్న ఈ మాటలను విని పురుషోత్తముడు నవ్వాడు. జ్ఞానులకు, గురువులకు గురువైన ఆతడు భక్తితో తల్లితో ఇట్లన్నాడు. (5) భగవంతునివచనమిట్లా - ఓ తల్లి సిద్ధియోగాత్మకమైనది, జ్ఞానము విషయాత్మకమైనది. భక్త్యాత్మక జ్ఞానము శ్రేష్టమైనది. అది నా దాస్యమునకు కారణమౌతుంది, శుభమైనది (6) జ్ఞానము ఐదు రకాలని అన్నారు.వేదాలన్నిటి యందు సమ్మతమైనది భక్త్యాత్మకమైనది అన్నిటికన్న పరమైనది. వాటి లక్షణాలను విను. (7) ఆకలి దప్పులను ఇతరమైన వాటిని ఖండించటము, తనలో శోధించుకొనుట, నాడి శోధనము, చక్రముల భేదించుట (8) ఆ పిదప, శక్తి కుండలినీలతో కూడిన ఈశ్వరుని చింతించుట ఇంద్రియములను అణచుట, లోభాదులను త్రుంచుట. (9) మూలధారము స్వాధిష్టానము మణిపూరము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞా ఇవి ఆరుచ క్రములుగా చెప్పబడ్డాయి. స్త్రీలకు తెలుసుకొనుటకు కష్టసాధ్యమైనదిది. మూర్ఖులకు అసలు తెలియదు, విశేషించి, ఓ సాధ్వి యోగాత్మక జ్ఞానము సిద్దులకు సాధ్యమయ్యేది, వారు కోరుకునేది. (11) ప్రాణులన్నిటికి తమ విషయంలో జ్ఞానము అట్లాగే కోరతగినది. నా స్వేచ్ఛతో సజ్జనులంతా తెలుసుకుంటారు. (12) అన్ని కర్మలలో సిద్ధ్యాత్మకమైనది సిద్ధులకు ఏర్పరుపబడినది. సిద్ధుల ముప్పది నాల్గింటిలో సాధన బోధనకూడా వారికే నియుక్తమైంది. మోక్షాత్మకమైన జ్ఞానము సిద్ధము, మిక్కిలి నిర్వాణమునకు కారణము.(13)
అను! నివృత్తి మార్గమును ఆరూఢుడైన భక్తుడు దానినికోరడు. భక్త్యాత్మక జ్ఞానమును రాధనీకు ఇస్తుంది. (14) ఆమె పై మనుష్యభావము నుంచకు. నా ఆజ్ఞను చేస్తుందామె. నందునకిచ్చిన జ్ఞానాన్ని దానినికూడా నీకు ఇస్తుంది. (15) నందునితో కూడా ఆదరంగా నంద ప్రజానికి వెళ్ళు., ఓతల్లి అని పలికి వినయం చూపిస్తూ హరి, అభ్యంతరానికి వెళ్ళాడు. (16) నందుడు యశోదతో కూడా కదలీ వనానికి వెళ్ళాడు. అక్కడే రాధను చూచాడు. ఆమె నిద్రపోతోంది. ఆభరణాలేవి లేవు (వదిలింది) (17) తెల్లని వస్త్రం ధరించింది. ఆహారం తీసుకోవడం లేదు. ఉదర భాగమంతా కృశించింది. బురదయందున్న పద్మదళము పై, నీటియందున్న దాని పై, చందనం పూయబడిన దాని పై (18) నిద్రిస్తోంది. పెదవులు ఎండిపోయి ఉన్నాయి. కళ్ళలో కన్నీళ్ళున్నాయి. మూర్ఛపోయి ఉంది. పరమాత్మయైన కృష్ణుణి పాదపద్మములను ధ్యానిస్తున్నది. (19) బాహ్యజ్ఞానాన్ని విడిచి పెట్టింది. ఆతని యందే మనసును నిలిపింది. నవ్వుతున్న కాంతుని చూస్తోంది. ముఖాంబుజమును పైకెత్తిన అతనిని చూస్తోంది. (20) స్వప్నంలో కాంతుని దగ్గర ఉండి నవ్వుతోంది, ఏడుస్తోంది. తెల్ల చామరలు చేత ధరించిన సఖురాండ్రు, ఎల్లప్పుడు ఆమెను చుట్టూ సేవిస్తున్నారు. (21) శతకోటి గోపికలు రాత్రింబగళ్ళు ఆమెను రక్షిస్తున్నారు. వారంతా సావధానంగా ఉన్నారు. చేతవెదురు కర్రలు ధరించారు. వారు ఈశ్వరిని సేవిస్తున్నారు. (22) ఏడు ద్వారములందున్నారు. చుట్టూ ప్రాంగణములందూ ఉన్నారు గోపికలు. అట్టి ఆమెను చూచి, భార్యతో పాటు నందుడు కూడా ఆశ్చర్యపడ్డాడు. (23) మిక్కిలి భక్తితో దండమువలె పడిపోయి వినయముగా నమస్కరించాడు. ఆమె ఈశ్వరుని ఇచ్ఛతో,నిద్రను వదలి, త్వరగా మేల్కొన్నది. (24) క్షణంలో చైతన్యాన్ని పొందింది. ఆచేతన విషయజ్ఞానము లేనిది. ఎదురుగా దంపతులను చూచి ఆదరంగా సతి అడిగింది. సఖులున్న సభలో అక్కడే మధురంగా ఇట్లా అన్నది. (25)
మూ॥ రాధికోవాచ :
యశోదోవాచ :
అను ॥ రాధిక ఇట్లా అన్నది :
ఇక్కడికి వచ్చిన నీవెవరు లేదా ఏ ప్రయోజనంతో వచ్చావో చెప్పు. నాకు విషయజ్ఞానము (లౌకికమైనది) లేదు. నాకునరుడెవరో, పశువెవరో, తెలియదు. (26) నీ పేరేమిటో, భూమేదో రాత్రేదో, పగలేదో తెలియదు, విను. స్త్రీ ఎవరో, పురుషుడెవరో, నపుంసకుడెవరో ఈ భేదము నాకు తెలియదు. (అంతా నాకు సమానం అని) (27) రాధిక మాటను విని నందుడు ఆశ్చర్యపడ్డాడు. యశోద భయపడింది. గోపికతో మాట్లాడుతూ దగ్గరకు వెళ్ళింది. (28) రాధ సమీపంలో కూర్చున్నది. ప్రియమైన మాటలిట్లా అన్నది. నందుడు గోపిక ఇచ్చిన ఆసనం పై అక్కడ ఉన్నాడు. (29) యశోద ఇట్లా - ఓ రాధ! నీవు నిన్ను (ఆత్మను) చైతన్యపరుచుకో, ప్రయత్నపూర్వకముగా రక్షించుకో. మంచిరోజు వచ్చినప్పుడు నీ ప్రాణనాథుని చూస్తావు. (30) ఓ సురేశ్వరి! నీవల్ల ఈ విశ్వము, నీకులము పవిత్రమైంది. గోపికలు పుణ్యవతులు, నీ పాదపద్మములను సేవించారు కనుక (31) లోకములు, నీకీర్తిని పాడుతున్నాయి. తీర్థమువలె పవిత్రురాలవు, సుమంగళవు అని స్తుతిస్తున్నాయి. సజ్జనులు, నాలుగు వేదాలు, ప్రాచీనమైన పురాణములు (32) కీర్తిస్తున్నాయి. నేను యశోదను, ఈతడు నందుడు, ఓ బుద్ధి స్వరూపురాల! నన్ను గుర్తించు. నీవు వృషభానుని బిడ్డవు ఓ సువ్రత! నామాటను విను. (33) ఓ భద్రురాల! ద్వారకా నగరం నుండి శ్రీకృష్ణుని సన్నిధానము నుండి, నీదగ్గరకు నేను వచ్చాను. ఓ సతి! హరి నన్ను పంపించాడు. (34) మంగళవార్తను, గదాధారియైన వాని మంగళమును (క్షేమము) విను. దగ్గరలోనే ఆ కృష్ణుని చూస్తావు. ఓ దేవి! చేతనత్వాన్ని పొందు (35) నాకు భక్త్యాత్మకమైన పరిజ్ఞానాన్ని ఇప్పుడు ఇవ్వు. నీ భర్త ఉపదేశంతో నీ దగ్గరకు వచ్చాము. (36) తరువాత హరివస్తాడు. ఓ వరానన! (కోరతగిన ముఖం) నీ దగ్గరకు ముహూర్తకాలంలో వస్తాడు. త్వరలోనే శ్రీరామునకు శాపమోచనము ఔతుంది. (37) యశోద మాటను విని, గదాధరుని వార్తను పొందింది. శ్రీకృష్ణనామస్మరణతో అమంగళము తొలగిపోయింది. (38) రాధ చేతనను పొందింది. కృష్ణుడు తనలో ఉన్నట్లు భావించి, శాంతురాలైన ఆమె లౌకికమైన ఉత్తమ భక్తిని మధురముగా చెప్పింది. (39)
అని బ్రహ్మవైవర్త మహాపురాణ శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధ మందు నారాయణ నారద సంవాదమందు, రాధ యశోద సంవాదమందు నూటపదవ అధ్యాయము.
