4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము
57 - అధ్యాయము
మూII నారాయణ ఉవాచ:
మహాలక్ష్మీ రువాచ:
అను! నారాయణుడిట్లన్నాడు - దేవతలస్తోత్రాన్ని విని, సతి, రోదనమునుమాని వారి స్తోత్రంతో మిక్కిలి ప్రసన్నురాలై వారితో ఇట్లా అంది, నారద! (1) మహాలక్ష్మి ఇట్లా అంది - నా శరీరాన్ని కోపంతో విడువటం లేదు. వైరాగ్యంతోనూ ఇప్పుడు వదలటం లేదు. దీనిని హృదయంలో ఆలోచించాను, ఓ దేవతలారా! దానిని వినండి అని అంది (2) సర్వసామ్యుడు, నిర్గుణుడు, గొప్పనైన ఏ ఈశుడుండగా అన్ని ఆత్మలు ఎల్లప్పుడు ఆనందమందుండగా, తృణము పర్వతము ఈరెంటికి సమమై యుండగా (3) తనకను బొమల కదలికల లీలతో లక్షల లక్ష్మిలను (లక్ష్మిలాంటివారిని) సృష్టించ సమర్థుడైయుండగా, భృత్యుని యందు, స్త్రీయందును ఎవడు సమంగా ప్రవర్తిస్తాడో, అతని సేవచేసి ప్రయోజనమేమి (4) నేను ఆతని భార్యలలో ప్రధానురాలిని. ఇప్పుడు ద్వారపాలకునితో వారింపబడ్డాను. ఆతని భృత్యుని భృత్యుని భృత్యునితో వారింపబడి పరిపూర్ణునితో కోరబడలేదు. (5) అందువల్ల నా జీవితాన్ని వదిలేస్తున్నాను. దురదృష్టవంతురాలైన యజమానురాలిని. అగ్ని యందు కోరికను ఏర్పరచుకొని ముందు మంచి జరిగేందుకై వదిలేస్తున్నాను. (6) ఏ స్త్రీ భర్తకు సౌభాగ్యురాలు కాదో, ఆమె అన్ని విధముల అసౌభాగ్యురాలు 'శయనమందు, భోజనమందు ఆమెకు సుఖంలేదు. ఆమె బ్రతుకు వ్యర్థము. (7) ప్రియుని ప్రేమలేని స్త్రీ జన్మ నిరర్థకము. అలాంటప్పుడు పుత్రుడు, ధనము, రూపము, సంపద, యౌవనము ఉండి ఏం ప్రయోజనము. (8) ఇతరమంతా ప్రియమైనదై కాంత(స్త్రీ)యందు భక్తిలేకపోతే, ఆమె అశుచురాలు, ధర్మహీనురాలు, అన్ని కోరికలతో వర్ణింపబడినది. (9) పతియే బంధువు, గతి, భర్తయే దైవతము, గురువు కూడా. అన్నింటి కన్నను స్వామి పరుడు. గురువు స్వామికన్న గొప్పవాడు కాడు. (10) తండ్రి తల్లి సుతుడు భాత వీరంత ఈ ధనమివ్వటానికి కష్టపడుతారు. మూడులైన స్త్రీలకు దేవతలు సర్వస్వదాత, స్వామి (11) ఎవతో ఒకతె మాత్రమే మహాసాధ్వి స్వామిని గుర్తించగలుగుతుంది. మిక్కిలి గొప్పకులంలో పుట్టినది మాత్రమే, మంచి శీలము గలది, కులపాలిక మాత్రమే గుర్తిస్తుంది.(12) అసద్వంశంలో జన్మించింది, దుఃశీల, ధర్మం విడిచి పెట్టింది, నోటిదుష్టతనం, యోనిదుష్టతనంగలది కోపంతో పతిని నిందిస్తుంది.
బ్రహ్మోవాచ:
అను/ఏ స్త్రీ అందరికంటే పరుడైన పతిని, విష్ణువుతో సమానమైనవాణ్ణి, గురువును ద్వేషిస్తుందో ఆ స్త్రీ పదునాల్గురింద్రు లున్నంతకాలం కుంభీపాకనరకంలో వండబడుతుంది. (14) వ్రతం, భోజనం చేయకపోవటము, దానము, సత్యము, పుణ్యం చిరకాల తపస్సు, ఇవన్నీ పతిభక్తి లేని స్త్రీకి భస్మమౌతాయి, వ్యర్థము కూడా. (15) అందువల్ల నిష్టురుడైన పతియైన, ఈశ్వరుని (ప్రభువు) ఏమీ అనటంలేదు (కఠినంగా). దేవుని యొక్క భృత్యుల అపరాధం వల్ల తప్పకుండా ప్రాణములను వదులుతాను (16) పతిదోషమందు మహాసాధ్వి పతిని నిష్టురంగా పలుకరాదు. ఒకవేళ సహించడానికి అశక్తురాలైతే ధర్మంగా ప్రాణాలను వదలాలి. (17) స్త్రీలకు పతి సేవ వ్రతము, పతిసేవ పరమైన తపస్సు. పతి సేవ పరమమైన ధర్మము, పతి సేవ దేవపూజ కూడ. (18) పతి సేవ ఉత్తమమైన సత్యము. దానతీర్థముల ప్రకటనము. స్వామి అన్ని దైవతములు కలవాడు, సర్వదేవమయుడు శుచి. (19) సర్వపుణ్యస్వరూపుడు, ప్రతిరూపంలోనున్న జనార్దనుడు. ఏసతి భర్త ఎంగిలిని తింటుందో, ఎప్పుడూ భర్త పాదోదకాన్ని సేవిస్తుందో (20) ఆమె ధర్శనాన్ని స్పర్శనురోజు దేవతలు కోరుకుంటారు. అందువల్ల పాపుల పాపం నుండి అన్ని తీర్థములు పవిత్రమౌతాయి. (21) అని పలికి ఆ మహాసాధ్వి మాటిమాటికి ఏడ్చింది. అప్పుడు బ్రహ్మ భయపడి భక్తితో తన తలను వంచుకొని ఇట్లన్నాడు. (22) బ్రహ్మఇట్లన్నాడుజయునకు విజయునకు క్షేమం కలగదు. ప్రియునకు అపరాధమౌతుందనే భీతితో నీవు ఆ మూఢులను శపించలేదు. (23) ధర్మిష్ణుడు, ఓర్పుతో అపరాధం చేసిన వానిని కూడా శపించకపోతే వాని సర్వనాశమౌతుంది. తప్పదు. ఓ సతి త్వరలో ఔతుంది (24) శపించుటకు అశక్తుడై దండించటానికి సమర్థుడు కాకపోతే, సాపరాధుడైన పురుషుని ధర్ముడు దండిస్తాడు. (25) ఓ తల్లి! అన్నింటిని క్షమించు. ప్రియుని సమీపానికి వెళ్ళు. నీ స్వామిభక్తుడనైన నన్ను సృష్టికర్మయందు నియోగించ తగినవాణ్ణి, క్షమించు(26)
శ్రీభగవానువాచ :
జయ ఉవాచ:
అను! అని పలికి ఆమెను ముందుంచుకొని దేవతలతో మునీంద్రులతో కూడి వైకుంఠుని స్తుతించుటకై ఈశ్వరుడు (బ్రహ్మ) వేగంగా వైకుంఠమునకు వెళ్ళాడు. (27) అక్కడికి వెళ్ళి కమలాసనుడు జగన్నాథుని స్తుతించాడు, నాల్గు ముఖములవాడు, నాలు ముఖములతో నాలుగు వేదముల నెరిగిన గురువును స్తుతించాడు. (28) బ్రహ్మయొక్త స్తుతిని విని, ముందున్న లక్ష్మిని చూచి, కమలాపతి, ఏడుస్తున్న, తలవంచుకున్న ఆమెతో ఇట్లన్నాడు. (29) శ్రీభగవంతుని మాట ఇట్లా- నేను సర్వజ్ఞు, నాకంతా తెలుసు అన్ని ఆత్మలలో ఉన్నాను, అందరిని పాలిస్తున్నాను. అన్నిటిని శాసించేవాణ్ణి, అన్నిటికి ఆది కారణమును, ఓ కమలోద్భవ! (30) భక్తుని యందు, భార్య యందు బంధువు యందు అంతటా నాకు సమబుద్ధి. విశేషించి అతిగా నా భక్తుడైన వాడు భార్యకన్నా పరుడే (ఎక్కువే). (31) నాభక్తులు నీ పుత్రులు ద్వారపాలురు అంతంచేయుటకు సాధ్యం కాని వారు, వారు. నన్ను భక్తి పూర్ణులైన వారి అపరాధమును సహించు (32) నా భక్తిపూర్ణుడైనవాడు బలవంతుడు, రాక్షసుల నుండి భయపడడు. భక్తి అనే ఇప్పకల్లుతో బాగా మదించినవాడు నా చక్రంతో రక్షింపబడతాడు. (33) అని పలికి జగన్నాథుడు లక్ష్మిని తన వక్షమందుంచుకొని, ద్వారపాలుని పిలిచి, అతనితో ఇదే అన్నాడు. (34) ఓ వత్స! భయపడొద్దు. సుఖంగా ఉండు. నేనుండగా నీకు భయమెందుకు నా భక్తులను శాసించేవాడెవడు. ఓ వత్స! నీ స్థానానికి వెళ్ళు (35) అని పిలికి ఓ మహాముని, అక్కడ భగవంతుడు విరమించాడు. దేవతలు, స్వస్థానానికి, జగదీశ్వరుని నమస్కరించి వెళ్ళారు. (36) నారాయణుని మాటలను విని ద్వారపాలురు ఆతనితో ఇట్లా అన్నారు. అన్ని అవయవములందు, పులకాంకురములెత్తగా, భక్తితో తమతల వంచుకున్నవారై అన్నారు. (37) జయుడిట్లా - నేను దేవతలకు, లక్ష్మికి, మునిగణములకు భయపడను. నీ పాదాంభోజముల ధ్యానమందే లగ్నమైన మనస్సు కలవాణ్ణి, అని అన్నాడు. (38) అని శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణ మందు శ్రీకృష్ణ జన్య ఖండమందు నారాయణ నారద సంవాదమందు ఉత్తరార్ధ మందు వైరాగ్య మోచనమనునది ఏబడి ఏడవ అధ్యాయము సమాప్తము. (57)
