4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము
89 - అధాయ్యము
మూII శ్రీకృష్ణఉవాచ:
అను ॥ శ్రీ కృష్ణుడిట్లన్నాడు : వెళ్ళు వెళ్లు ఇంటికి వెళ్ళు. ఓవ్రజమునకు రాజ! ప్రజమునకు వెళ్ళు. తత్వమంతా నీకు తెలిసింది. మునులు, సురలు వీరిని చూశావు. (1) ధన్యమైన ఆఖ్యానమును నేను నీకు విన్పించాను. అనేక ఆఖ్యానములు (కలది) సుదుర్లభమైనది. దుర్గయొక్క స్తోత్రరాజము జన్మమనే పాపమును తొలగించేది. (2) హర్షంతో సుఖంగా ఉన్నదానిని నీకు చెప్పాను. చిన్నపిల్లవాడిగా నేను చేసిన తప్పులను క్షమించు. (3) ఓ తండ్రి! నృపమందిరంలో, తండ్రిగారి మందిరంలో ఏ సుఖాన్ని పొందలేదు? (అన్నీ పొందాను) 'ఇక్కడ పొందిన సుఖము పరమైనది స్వర్గంలో కూడా దుర్లభమైనది . (4) నా తీయని మాటలు, వినయము, నయము (మృదుత) ప్రహ్వము (ఆసక్తి) పరిహాసము, యశోదతో, గోపికా గణంతో ఎక్కువగా నేను చేసినది (5) పిల్లల సమూహము, విశేషించి రాధను గూర్చి నది. కర్మవల్ల ఆ బంధు వర్గంతో ఒక చోట ఉన్నాను. (6) ఇక్కడ కూడా సుఖాన్ని అనుభవించి ఉత్తమమైన గోలోకానికి వెళ్ళు. ఓ తండ్రి! యశోదతో, రోహిణితో, గోపికా గణంతో కూడా వెళ్ళు. (7) గోపబాలకులతో, వృషభములు గల గోపకులతో సహా వెళ్ళు. కళావతి రాధామాతతో, రాధతో కూడా వెళ్ళు. (8) ఓ తండ్రి! గోలోకం నుండీ, శతలక్ష రథములు వచ్చాయి. అమూల్యమైన రత్నములతో నిర్మింపబడింది, వజ్రముల హారములతో అలంకరింపబడ్డాయి. (9) మణులు, మాణిక్యములు ముత్యములు మాలల సమూహంతో అలంకరింపబడ్డాయి. అగ్ని తప్తమైన వస్త్రములతో అందమైన పచ్చని వస్త్రములతో చుట్టబడ్డాయి. (10) ప్రక్కలలో తెల్లని చామరలు ధరించి పార్షదులు (ప్రక్కల నుండు వారు) అందంగా ఉన్నారు. రత్నములు పొదిగిన అద్దములు అందంగా ఉన్నాయి. వానిని ధరించి గోపికలు గోపాలురు అందంగా ఉన్నారు. అట్లా ఉన్న దానిని ఎక్కి, ఉత్సాహంగా వెళ్తావు, నిశ్చయము. (11) పార్థివశరీరాన్ని వదలి, దివ్య దేహం ధరించి, అయోనిజయైన రాధ, రాధ తల్లి కళావతి (12) దానితోనే వెళ్తుంది. నిత్యదేహంతో వెళ్తుంది, నిశ్చయము. పితరుల మానసిక కన్య కళావతి ధన్యురాలు, మాన్యురాలు. (13) సీత, దుర్గ, మేనక ఈ తల్లులు ధన్యురాండ్రు. దుర్గ, తార, సుందరి సీత వీరు అయోని సంభవలు. (14) వారు అయోని సంభవలు ధన్యలు, కళావతి, మేన ధన్యలు అని, ఓ తండ్రి! దాచదగిన, చాలా దుర్లభమైన దానిని ఇట్లా చెప్పాను. నీకీ వరమిచ్చాను నేను, దుర్గకూడా ఇచ్చింది.
నంద ఉవాచ
అను ॥ శ్రీకృష్ణుని మాటను విని ప్రజేశ్వరుడు (వ్రజమునకు అధిపతి) భక్తవత్సలునితో జగన్నాధనితో భక్తుడు మళ్లా ఇట్లన్నాడు. (16) నందుని వచనమిట్లా - నాలుగు యుగములకు ఏఏ ధర్మము సనాతనమైనదో దానిని, క్రమంగా విస్తరించి నాకు చెప్పు ప్రభూ (17) కలిశేషమందు ఏమేమి జరుగుతుందో, కలియొక్క గుణదోషము లేమిటో, పృథివి యొక్క గతి ఏమిటి, ధర్మము గతి, ప్రాణులగతి ఏమిటో వివరించండి. (18) అనిన నందుని మాటను విని, కమలలోచనుడు ఆనందించి విచిత్రమైన, మధురమైన కథను చెప్పనారంభించాడు. (19) అని శ్రీబ్రహ్మవైవర్త మహా పురాణ శ్రీకృష్ణ జన్మఖండమందు ఉత్తర భాగమందు నారాయణ నారద సంవాదమందు భగవంతుడునందుడు వారిద్దరి సంవాదమందు ఎనుబది తొమ్మిదవ అధాయ్యము .
