4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము
122 - అధ్యాయము
నారద ఉవాచ :
నారాయణ ఉవాచ :
తారోవాచ :
శ్రీభగవానువాచ :
నారదుడిట్లా - అందరుస్త్రీలతో పరమాత్మయైన కృష్ణునకు వివాహమైనట్లు చెప్పారు. భగవంతుడైన మీరు సంతోషంతో చెప్పారు. (1) నాకు ఇష్టమైన స్యమంతకమణి కథను చెప్పండి. ఓ మహాభాగ! దానిని వినలేదు. దానిని నాకు వివరించగలరు. సమర్థులు మీరు (2) అనగా నారాయణుడిట్లా - భాద్రశుక్ల చతుర్థియందు తారకను, చంద్రుడు ఎత్తుకెళ్ళాడు. ఆమెను కృష్ణ పక్షమందు వదిలాడు. గురువు ఆమెను గ్రహించాడు. (3) గురువు భయ పెట్టగాతార, గర్భవతి, సిగ్గుతో ఆ స్త్రీ, కోపంతో లజ్జతో కామాతురుడైన చంద్రుని ఇదివరలో శపించింది. (4) తార ఇట్లా - నీవు శాపంతో కళంకితుడవు. నిన్ను చూచిన దేహధారి పాపం చూస్తాడు కనుక వాడు పాపి, కలంకి ఔతాడు. (5) అని దానిని విని చంద్రుడు నారాయణ సరోవరమందు, నారాయణుని గూర్చి తపస్సుచేసి, చేసిన పాపం నుండి ముక్తుడైనాడు. (6) తపస్సుతో క్లేశమందిన ఆతనిని చూసి భగవంతుడు పురుషోత్తముడు, కృపానిధి, కృపతో మహాభీతుడైన ఆతనితో ఇట్లన్నాడు. (7) శ్రీభగవంతుడిట్లా – ఓకళానిధి! ఎప్పటికీ కలంకియైన నీవు, పూర్తిగా ముక్తుడవుకా. తారక ఇచ్చిన శాపమునకు స్థానము భాద్రపద మాసంలోని శుక్లకృష్ణ పక్షములందు మాత్రమే (8) చతుర్థినాడు ఉదయించిన చంద్రుని కోరికతో చూసినవాడు, ఆపాపాన్ని పొందుతాడు. వాడు కలంకిఔతాడు. (9) హరి చేయెత్తి హెచ్చరిస్తున్నాడు, భాద్రపదమాసంలోని , శుక్లకృష్ణ పక్షములందు చవితినాడుదయించిన చంద్రుని చూడరాదు. ఎప్పుడూ తగదు. (10) స్వయంగా చూచిన తనవాక్యాన్ని పాలించాలి. భాద్రపద చవితి చంద్రుని చూచీ ఆతడు కలంకిఐనాడు. (11) కలంకం ఏరూపంలో వచ్చిందో చెప్తాను విను. లోకులకు తెలియజేసే కొరకు ఈశ్వరుడు తన కలంకం నుండి విడిపించుకున్నాడు. (12) సత్రాజిత్తు సూర్యభక్తుడు. పుష్కరక్షేత్రంలో తపస్సుచేసి, స్యమంతకమను శ్రేష్ఠమైన మణిని భాస్కరుని నుండి పొందాడు. (13) ప్రతిరోజు అది ఎనిమిది భారల సువర్ణాన్ని ఇస్తుంది. మహాపుణ్యమునిచ్చే, పవిత్రమైన ఆ మణియందు విష్ణువు అధిష్ఠించి ఉంటాడు. (14) సత్రాజిత్తు సత్యభామను కృష్ణునకు భక్తితో ఇచ్చి అరణంగా మణిని ఇవ్వటానికి గొప్పవాడైన కృష్ణునకిచ్చుటకు ఆ మహాత్ముడు ప్రయత్నించాడు. (15) ఆతనిని కాదని, దుర్మతియైన, ప్రసేనుడు కాలమువల్ల ప్రేరితుడై (పీడితుడై) మణిని తీసుకొని పుణ్యప్రదమైన వారాణసీ పురికి వెళ్ళాడు. (16) దారిలో బలము గల సింహము బలంతో ఆతనిని చంపి మణిని తీసుకున్నది. రుచిరమైన ఆమణిని దారంతో కట్టి మెడలో వేసుకుంది. (17) కలింగరాజు పుత్రుడు, చాలా దారుణమైన బ్రహ్మ శాపం పొంది బ్రాహ్మణునితో ఉత్సాహపరుపబడి ఆతడు పశుయోనిని పొందాడు.
బలవంతుడైన జాంబవంతుడను భల్లూకము సింహమును అడవిలో చంపి మణిని తీసుకుని రత్న నిర్మితమైన తనపట్టణానికి వెళ్ళాడు. (19) ద్వారకలో అంతా మాధవుడు మణిని తీసుకున్నాడు అని అన్నారు. ఆతని బుద్ధిమనకు తెలియదు. ఏ ఉపాయంతో తీసుకున్నాడో అని. (20) అనే ఈ మాటను భగవంతుడు విని, కలంకాన్ని తొలగించుకునే కొరకు, చోరులు గుర్తించిన మార్గం గుండా ఘోరమైన అడవికి వెళ్ళాడు. (21) చచ్చిపోయిన ప్రసేనుని చూచి దుఃఖించాడు. ఆతడు ఆపై సింహాన్ని చూచాడు. మణి లేని సింహాన్ని చూచి మాధవుడు విచారించాడు. (22) అన్నీ తెలిసి ఆ సర్వజ్ఞుడు భల్లూక భవనానికి వెళ్ళాడు. ఆతడక్కడ ధాత్రియొక్క (దాది) రొమ్ముపై ఏడుస్తున్న పిల్లవాడిని చూచాడు. (23) కరుణతో ధాత్రి ఆబాలకునితో ఇట్లా అంటోంది. ఓబాల! మణిని తీసుకో, ఈ స్యమంతకమునీదే, అని (24) ప్రస సేనుణ్ణి సింహం చంపింది. సింహాన్ని జాంబవంతుడు చంపాడు. ఓ సుకుమారుడ! ఏడవకు, ఈ స్యమంతకనీ.. (25) అని. ధాత్రి చెప్పిన శ్లోకాన్ని విని, స్మరించి నీరు తాగితే అనుకోకుండా, దైవవశాత్తుచూచిన నష్టచంద్ర దోషం నుండి విడువబడుతారు. (26) కావాలని చూస్తే, దాంభికులైన వారు వేదనిందకులు, కలంకితులౌతారు. ఇట్లాగే అని కమలోద్భవుడు చెప్పాడు. (27) కృష్ణుడు ధాత్రిమాటను విని బాలకుని నుండి మణిని తీసుకున్నాడు. ధాత్రి వెళ్ళికోపంతో భల్లూకానికి చెప్పింది. (28) జాంబవంతుడు వచ్చి ఆతడు నమస్కరించి, స్తుతించాడు. జాంబవతి యను కన్యను ఆతనికిచ్చి అరణంగా మణిని ఇచ్చాడు. (29) ద్వారకకు మణిని తెచ్చి యాదవులకు చూపాడు కృష్ణుడు. ప్రభువు అన్ని విధాల శుద్దుడు. అతడు నిష్కలంకుడైనాడు. (30) మణి యొక్క ఉత్తమమైన కథను, ఓవత్స! దీనిని నీకు చెప్పాను. అధ్యాయము విన్న మాత్రాన నరుడు నిష్కలంకుడౌతాడు. (31) ధర్మాత్ముని ముఖం నుండి విన్నది, జరిగింది జరిగినట్లుగా చెప్పినట్లు. చాలా దుర్లభమైన ఉపాఖ్యానాన్ని ఇంకా దేన్ని మళ్ళీ వినదలిచావు. (32) అని బ్రహ్మవైవర్త మహాపురాణమందు శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధ మందు నారాయణ నారద సంవాదమందు స్యమంతకమణి హరణమనునది నూట ఇరవై రెండవ అధ్యాయము.
