4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము

Table of Contents

68 - అధ్యాయము

మూII శ్రీనారాయణ ఉవాచ –

శ్రీకృష్ణఉవాచ :

రాధికోవాచ –

అను!! శ్రీనారాయణుడన్నాడు: క్రీడించి, పురాతనుడు, పుష్పతల్పంనుండిలేచి, నిద్రించిన, ప్రాణసదృశమైన ఆమేను ఆ క్షణంలో మేల్కొలుపసాగాడు (1) చీర చెరుగుతో (అంచు) ఆమెముఖమును సంస్కరించి (తుడిచి), ముఖాన్ని నిర్మలంగా చేసి శాంతమైన ఆమెతో మధుసూదనుడు, మధురముగా, శాంతముగా, ఇట్లా అన్నాడు. (2) శ్రీకృష్ణుడిట్లన్నాడు - ఓ శుచిస్మితా! (స్వచ్ఛమైన చిరునవ్వుదాన) రాసేశ్వరి! క్షణకాలము రాసక్రీడయందు ఉండు. వృందావనానికైనా వెళ్ళు. ఓవ్రజేశ్వరి! ప్రజమునకైనావెళ్ళు (3) రాసక్రీడకు అధిష్టాన దేవతవీవు. క్షణకాలము రాసక్రీడయందు రాసము చేయి (రసముననుభవించు) ప్రతిగ్రామమందు గ్రామదేవతలున్నట్లే, (రాసాధిష్టాతవు నీవు) ప్రియమైన స్నేహితురాండ్రతో కూడి కొద్దికాలము చందన కాననమునకువెళ్ళు. క్షణకాలము చంపకవనానికి వెళ్ళు ఓ సుందరి! అక్కడ ఉండు. (5) క్షణకాలముగృహమునకు వెళ్తాను. నాకు విశిష్టమైన పని ఉంది. ఓ ప్రాణవల్లభ (ప్రియ) దయతో క్షణకాలము నాకు విరామాన్ని ఇవ్వు (6) ప్రాణాధిష్ఠాతృదేవివి నీవు. నా ప్రాణములు నీదగ్గరున్నాయి. ప్రాణి ప్రాణములను వదిలి ఎక్కడుండగల సమర్థుడు, ఓప్రియ (7) నీలో నామన స్టెప్పుడూ ఉంటుంది. నీవు నా సంసారవాసనవు. నీకన్నా నాకిష్టమైన ప్రియురాలులేదు. శంకరునికన్నా నీవే ప్రియమైనదానవు. (8) నాకు శంకరుడు ప్రాణములు. ఓ సతి! నీవు ప్రాణములకన్నా అధికమైన దానివి, నిజమీ మాట. అని పలికి ఆమెను కౌగిలించుకొని, భగవంతుడు వెళ్ళటానికి సిద్ధమైనాడు. (9) సర్వజ్ఞుడు, అన్ని సాధనములు (గా) కలవాడు (సాధించగల), అక్రూరుడు వచ్చాడని తెలుసుకొన్నాడు. ఆతడు, ఆత్మ, రక్షకుడు, అందరికి. అందరికి ఉపకారకుడు గూడా. (10) మనస్సుమారిపోయి, ఉత్సాహంగా వెళ్ళుతున్న ఆతనిని చూచి, మనుస్సులో బాధపడుతూ రాధిక! దేవి! ఇట్లా అంది (11) రాధికవచనమిట్లా - ఓనాధ! రమించుట యందు శ్రేష్టుడ ! నాకిష్టమైన వానిలో శ్రేష్ఠుడ! ఓ కృష్ణ! ఓరమానాథ! ఓ వ్రజేశ! ప్రజమునకు వెళ్ళకు (12) ఓ ప్రాణనాథ! ఇప్పుడు,నీ మనస్సు భిన్నమైనదని (వికలమైనదని) చూస్తున్నాను (గ్రహిస్తు). నీవు వెళితే నాప్రేమపోతుంది. నాసౌభాగ్యం పోతుంది. (13) గంభీరమైన శోకసాగరమందు నన్నుంచి ఎక్కడికెళ్తున్నావు. విరహవ్యాకులను, దీనురాలిని, నిన్నే శరణువేడాను. (14) తిరిగి ఇంటికి వెళ్ళను. మరో అడవికి (అడవిలోకి ) వెళ్తాను. కృష్ణ! కృష్ణ కృష్ణ అని అంటూ రాత్రింబగళ్ళు పాడుతూ, పాడుతూ వెళ్తాను (15) లేదా, అడవికి వెళ్ళను. కామసాగరానికి వెళ్లాను. అక్కడ నీకామననుతీర్చి, శరీరాన్ని వదిలివేస్తాను. (16)

అకాశము, ఆత్మ చంద్రుడు, సూర్యుడు ఎట్లా ఉన్నారో అట్లాగేనీవు నా వసనాంచలమందు (చీరచెంగు) నాపక్కలో బంధింపబడి ఉంటున్నావు (17) ఓదీనవత్సల ! ఇప్పుడు, నీవు నన్ను నిరాశపరచి వెళ్తున్నావు. దీనురాలిని, శరణాగతురాలిని ఐన నన్ను విడిచి పెట్టుట తగదు. (18) ఏనీపాదపద్మములను బ్రహ్మవిష్ణు శివాదులు ధ్యానిస్తారో అట్టి నిన్ను, మాయగా, గోపవేషంలో ఉన్నవాణ్ణి, మాత్సర్యం గల నేను ఎట్లా తెలుసుకోగలను (19) ఓ దేవ! చెడుగా చేయబడిన, వేలకొలది అపరాధము లేవున్నాయో, అభిమానంతో, పతివి అనే భావంతోనేను, నిన్నే మన్నానో, వాటిని క్షమించు (20) నాగర్వము చూర్ణమైంది. నామనోరథము దూరమైంది. ఆత్మ సౌభాగ్యాన్ని తెలుసుకోవటానికి వేరే ఇంకేం చెప్పాలి నీకు. (21) తెలుసుకొనీ, గర్గుని ముఖం నుండి వినీ, నీమాయతో మోహింపబడ్డాను. ప్రేమతో కాని, భక్తిపాశంతోకాని నీకు చెప్పలేకపోతున్నాను. (22) నన్ను విడిచివెళితే కలంకుడవౌతావు. బ్రహ్మకోపానలముచే (అగ్ని) నీ పుత్రపౌత్రులు నశిస్తారు. (23) ప్రాణవల్లభుడవైన నిన్ను విడిచిన, క్షణంను నూరుయుగాలుగా భావిస్తాను. ఓ ప్రభు! శతాబ్దము కాలము నిన్ను విడిచి, జీవితాన్ని ఎట్లా భరిస్తాను (24) అని పలికి రాధిక, కోపంతో భూమిపై పడింది. త్వరలోనే మూర్ఛపోయింది. ఓ ముని! చేతనను కోల్పోయింది. (25) మూర్ఛితమైన ఆమెను కృష్ణుడు చూచి, కృపానిధి దయతో, చైతన్యవంతురాలిని చేసి, వక్షమందుంచుకున్నాడు. (26) శోకమును తొలగించే యోగములతో రకరకాలుగా బోధించాడు. ఐనా, ఆ శుచిస్మిత! శోకమును విడువలేకపోయింది (27) సామాన్యవస్తువుతో వినియోగము, నరులకు దుఃఖమును మాత్రమే కల్గిస్తుంది. దేహాత్మ విచ్ఛేదము జరిగితే సుఖమెక్కడుంటుంది. (28) ప్రజరాజు అప్పుడు దివసంలో ప్రజమునకు వెళ్ళలేదు. రాధతోకూడి క్రీడా సరోవరం దరికి వెళ్ళాడు. (29) అక్కడికి వెళ్ళి ఆమెతో కూడి మరల క్రీడించాడు. రాసేశ్వరి, రాసక్రీడయందు, ఆనందంతో, విరహ జ్వాలను పోగొట్టుకుంది (30) ఆ రాధ, స్వామితో కూడి పుష్పచందనములతో అలంకరించుకొని, రహస్యంలో, పుష్పచందన తల్పమందు, ఉంది, ఓ నారద! (31) అని బ్రహ్మవైవర్త మహాపురాణమందు శ్రీకృష్ణజన్మ ఖండ ఉత్తరార్ధమందు నారాయణ నారద సంవాదమందు రాధ శోకమును తొలగించుట అనునది అరువది ఎనిమిదవ అధ్యాయము.