4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము
66 - అధ్యాయము
మూ॥శ్రీ నారాయణ ఉవాచ:
రాధికోవాచ:
రాధికోవాచ:
అను!! శ్రీనారాయణుడిట్లన్నాడు: ఇకరాసేశ్వరితో కూడి రాసక్రీడయందు, స్వయంగా రాసేశ్వరుడు, మిక్కిలి రమించుటయందు ఉత్సుకుడై ఆమెతో కూడి ఆతడు క్రీడించాడు. (1) సుఖసంభోగమాత్రముతోనే రాధిక నిద్రపోయింది. నిద్రలో ఒక స్వప్నాన్ని చూచి, లేచి పగటిపూట ప్రియునితో దీనంగా ఇట్లా అంది. (2) రాధిక వచనమిట్లా - ఓస్వామి! ఇక్కడికిరా. నిన్ను నావక్షః స్థలమందుంచుకుంటాను. పరిణామంలో (ముందు ముందు) విధాత, నాకేం చేస్తాడో, తెలియదు (3) అని పలికి ఆ మహాభాగ ప్రియుని తన వక్షమందుంచుకొని, మనస్సుకలత చెంది (పరితపిస్తూ) తనదుఃస్వప్నాన్ని చెప్పసాగింది. (4) రాధిక ఇట్లా । రత్నసింహాసనంలో నీవు, రత్నఛత్రమును ధరించిన నేను ఉండగా, అప్పుడు ఓ ప్రభూ! నా చేతిలోని ఛత్రాన్ని ఒక విప్రుడు కోపంతో తీసుకున్నాడు. (5) మహాఘోరమైనదాటరాని, కాటుకలాగా ఉన్న సాగరమందు గంభీరమైన దాని యందు పడటానికి దుర్బలురాలనైన నన్ను ఆతడు ప్రేరేపించసాగాడు. (16) అక్కడ ప్రవాహంలో దుఃఖిస్తూ మాటిమాటికి తిరుగుతున్నాను. గొప్ప అలలవేగంతో అది వ్యాకులంగా ఉంది. మొసళ్ళతో సంకులమై ఉంది.(7) ఓనాధ! రక్షించు రక్షించు అని నిన్ను మాటిమాటికి పిలుస్తున్నాను. నీవు కన్పించనందువల్ల చాలా భయపడి దేవుని ప్రార్ధిస్తున్నాను. (8) ఓ కృష్ణ! అక్కడ చంద్రమండలము మునిగిపోవటము చూచాను. ఆకాశం నుండి భూమి పై నూరు తునుకలు పడటం చూచాను. (9) మరుక్షణంలో ఆకాశంనుండి సూర్యమండలము, నాలుగు తునకలైనట్లు భూమి పై పడ్డట్టు చూచాను. (10) ఒకే కాలంలో ఆకాశంలో, చంద్ర సూర్య మండలములు, బాగా కాటుకలాగా ఐనట్లు, అంతా రాహువు మింగినట్లు చూచాను. (11) మరుక్షణంలో బ్రాహ్మణుని దీప్తిమంతునిగా చూచాను. నా వక్షఃస్థలంలోని అమృతకుంభమును ఛేదించి, కోపంతో వెళ్ళటము చూచాను. (12) మరుక్షణంలో మహాకోపంతో ఉన్న బ్రాహ్మణుని చూచాను. నా పురుషుని, తీసుకొని వెళ్తున్న బ్రాహ్మణుని, నాకళ్ళతో చూచాను.
అసహ్యమైన కపాలము, దండము, చేతినుండి మూరెడు చేయినాది, ఓ ప్రభు! ఆయుధంతో త్వరలో ఖండఖండములుగా ఐంది. (14) హస్తమునుండి హస్తము ఉన్న, తొందరగా సత్ రత్నముల సారమైన దర్పణము నిర్మలమైంది, కాటుకలాగాఐ, ఖండఖండములుగా ఐంది. (15) నా, రత్నములసారమైన హారము వక్షఃస్థలము నుండి ఛిన్నమైంది. పద్మము చాలా మలినమై భూమి పై పడింది. (16) మేడలోని బొమ్మలన్ని నాట్యం చేస్తున్నాయి, నవ్వుతున్నాయి. చరుచుకుంటూ క్షణక్షణము పాడుతున్నాయి, ఏడుస్తున్నాయి. (17) నల్లని వర్ణముగల గొప్ప చక్రమును మాటిమాటికి ఆకాశంలో తిరుగుతున్న దానిని, కిందపడగా, పైకెగురగాను, భయంకరంగా ఉండటం చూచాను. (18) నా అంతఃపురం నుండి ప్రాణాధిదేవుడైన పురుషుడు వెడలి, రాధ! చీల్చి ఇవ్వు అని, అటు పిమ్మట వెళ్తున్నా అని పలికాడు. (19) నల్లని రూపంగల ప్రతిమ నన్ను కౌగిలిస్తోంది, ముద్దాడుతోంది. నల్లని వస్త్రం కట్టుకుందిఅనికూడా ఇప్పుడు అనుకుంటున్నాను. (20) ఓ ప్రాణవల్లభ! అని ఈ విధంగా విపరీతాలు చూచి, నా కుడి అవయవములు కదులుతున్నాయి, నా ప్రాణములు ఆందోళన చెందుతున్నాయి. (21) దుఃఖంతో రోదిస్తున్నాయి. పైకిలాగుతున్నాయి, మనస్సు ఎంతో ఉద్విగ్నంగా ఉంది. ఓనాథ! వేదవిదులలో శ్రేష్ఠుడ! ఇదేమి ఇదేమిటో చెప్పు (22) అని పలికి రాధిక! దేవి! కంఠము, పెదవులు, తాలు భాగము ఎండిపోగా భయపడి, శోకంతో చలించిపోయి, ఆమె కృష్ణుని పాదాంభోజములందు పడినది (23) జగన్నాథుడు ఆ స్వప్నాన్ని విని, దేవిని, తనవక్షమందుంచుకొని , అప్పుడే ఆధ్యాత్మిక యోగంతో బోధించసాగాడు. (24) నిర్మలమైన జ్ఞానాన్ని పొంది ఆదేవి దుఃఖాన్ని విడిచింది. శాంతుడైన కాంతుని భగవంతుని తన వక్షమందుంచుకొన్నది (25) అని శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణమందు శ్రీకృష్ణ జన్మఖండమందు ఉత్తరార్ధమందు నారాయణ నారద సంవాదమందు శ్రీరాధ దుఃఖమును పోగొట్టుటమనేది అరువది ఆరవ అధ్యాయము.
