4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము
75 - అధ్యాయము
మూ॥ శ్రీభగవానువాచ:
భగవానుడిట్లన్నాడు - ఓనంద! పరమ అద్బుతమైన జ్ఞానాన్ని చెబుతాను విను. చాలా రహస్యమైనది. వేదములలో పురాణములలో లభించనిది (1) స్త్రీల యందు విశ్వాసముంచరాదు. కులటలందు ఎల్లప్పుడు ఉంచరాదు. భ్రమమాయలతో నిండిన ప్రదేశములందు మోక్షమార్గానికి బేడెమువంటివారు (అడ్డంకులు) (2) హరిభక్తికి విరుద్ధములైన, సాధ్వీమతల్లులు కానివారితో కూడిన, నాశనమునకు బీజరూపమైన స్త్రీల పై విశ్వాసముంచరాదు, ఓ వ్రజేశ్వర! (3) రోజు ప్రొద్దున్నే లేచి రాత్రికట్టిన వస్త్రాన్ని విడిచి హృదయపద్మంలో ఇష్టమైన దేవుని, బ్రహ్మరంధ్రంలో పరమైన గురువును (4) మనసారా ధ్యానించి, తప్పకుండా ప్రాతః కాలకృత్యమును చేసి, ప్రాజ్ఞుడైనవాడు నిర్మలమైన జలంలో స్నానం చేయాలి (5) కర్మనివృత్తిని కోరి, భక్తుడు సంకల్పం చేయరాదు. స్నానంచేసి హరిని స్మరించాలి. సంధ్యనాచరించి ఇంటికి వెళ్ళాలి (6) కాళ్ళు కడుగుకొని ఇంట్లో ప్రవేశించాలి. ఉతికిన వస్త్రములు ధరించాలి. ముక్తి కారణమైన నన్నే పరమాత్మయైన వాణ్ణి పూజించాలి. (7) శాలగ్రామమందు మణియందు, యంత్రమందు, ప్రతిమయందు నీటిలోకాని, బ్రహ్మణునిలో కాని, గోవుయందుకాని, విశేషించి గురువు యందుకాని పూజించాలి. (8) ఘటమందు, అష్టదళ పద్మమందు, చందనపు పాత్రయందుకాని పూజించాలి. శాలగ్రామమందు, అంతట జలంతో ఆవాహన చేయాలి. (9) మంత్రముకు తగిన ధ్యానంతో ధ్యానించి వ్రతస్థుడు, నన్ను పూజించాలి. మూలమంత్రంతో, భక్తితో షోడశోపచార ద్రవ్యములనివ్వాలి. (10) శ్రీదామ, సుదామ, వసుదాములను, వీరభాను, శూరభాను, ఈ ఐదుగురు గోపకులను పూజించాలి (11) నా పార్పదులు (అనుచరులు) సునంద నంద, కుముదులు, నా సుదర్శనమును, లక్ష్మి, సరస్వతి, దుర్గ, రాధ, గంగ, వసుంధర (12) గురువు, తులసి, శంభువు, కార్తికేయుడు,వినాయకుడు, నవగ్రహములు, దిక్పాలకులు అంతటా వీరిని పూజించాలి, బుద్ధిమంతుడు (13) అన్నిటికన్న మొదలు విఘ్నముల నివృత్తి కొరకు, గణేశుడు, సూర్యుడు, అగ్ని, విష్ణు, శివుడు, పార్వతి ఈ ఆరుగు దేవతలను పూజించాలి. (14) కర్మలను నశింపచేసే, మోక్షమునిచ్చే శృతిలో చెప్పిన దేవతల పూజించాలి. విఘ్ననాశము కొరకు గణేశుని, వ్యాధినాశనం కొరకు సూర్యుని, (15) ప్రాప్తినిమిత్తం కొరకు, శాంతియందు, శుద్ధియందు వహ్నిని పూజించాలి నిశ్చయము. మోక్షము కొరకు విష్ణువును, జ్ఞానమువచ్చే కొరకు శంకరుని, (16) బుద్ది, ముక్తి వీనికొరకు బుద్ధిమంతుడు పార్వతిని పూజించాలి. మూడు పుష్పాంజలులనిచ్చి వారి స్తోత్రమును కవచమును పఠించాలి. (17) గురువునకు నమస్కరించి పూజించి ఆ పిదప సురను (దేవునికి) నమస్కరించాలి. సుఖకరంగా చెప్పినట్లుగా పూజించి ఆహ్నికముచేసి (18) తనకర్మ ఆచరించాలి. ఇది తన ఆత్మశుద్ధి కొరకు వేదోక్తమైన విధానము. వ్యాధికి బీజరూపమైనది మలము. ప్రాజ్ఞుడు దానిని చూడరాదు. (19) నరకమునకు ప్రధానంగా కారణము, వ్యాధికి బీజము మూత్రము. కనుక దానిని చూడరాదు (లింగము) యోని వీనిని చూడరాదు ఇవి పాపదుఃఖ వ్యాధి దారిద్యముల నిచ్చేవి. (20) ఉరోముఖం (చనుమొన) రొమ్ములు స్త్రీ కటాక్షము, హాస్యము ఇవి, వినాశబీజమైనవి. ఎల్లప్పుడు స్త్రీ రూపము ఆపదలకు కారణము.
అను తన స్త్రీలతో పగటిపూట మైథునము, తన లోపమును విడిచి పెట్టాలి (బహుశా వీర్యపాతము). కళ్ళకు, చెవులుకు (అట్లాగే) రోగముల కారణము. (22) ఒకే నక్షత్రం గల ఆకాశాన్ని చూడరాదు (రోగగ్రస్తురాలిని భయంతో చూడరాదు) రుజాభయంతో తగదు. దేవుని చూచి, హరినిస్మరించి, ఏడుసార్లు (స్మరణ) చేసి నారదుని జపించాలి. (23) అస్తమయ కాలంలో సూర్యచంద్రులను చూడరాదు వ్యాధి వస్తుంది కనుక. తునకగా ఉదయించిన చంద్రుని చూడరాదు, వ్యాధి వస్తుంది కనుక (24) నీటిలో బింబించిన సూర్యుచంద్రులను చూస్తే నరులకు శోకం ప్రాప్తమౌతుంది. ఇతరులు మైథునమాచరిస్తుంటే చూడరాదు. ఇది బంధువిచ్చేదమునకు కారణము. (25) ఒకేచోట పడక, భోజనము, కలిసి ప్రయాణము, పాపాత్మునితో కూడి చేయరాదు ఇదంతా నాశానికి లక్షణము. (26) సంభాషణ, శరీరస్పర్శ, పడక, ఆశ్రయించుట, భోజనము వీటివల్ల పాపములు నీటిలో నూనె వలె తప్పకుండా ప్రవేశిస్తాయి. (27) దుఃఖకారణం కనుక హింసాత్మక జంతువుల దరికి వెళ్ళరాదు. శోకకారణం కనుక ఖలునితో మేళనము (కలయిక) చేయరాదు. (28) బ్రాహ్మణులకు, గోవులకు, విశేషించి వైష్ణవులకు హింస, హాని చేయరాదు. ఇది సర్వనాశనమునకు కారణము. (29) దేవుని, నంబివాని, విప్రుని, వైష్ణవుని విత్తమును, ధనమును హరించరాదు. ఇది సర్వనాశనమునకు కారణము (30) తాను దానం చేసిన, ఇతరులు దానం చేసినదైనా బ్రహ్మవిత్తాన్ని హరించినవాడు, అరవై వేల సంవత్సరాలు మలమందు పురుగుగా పడ్డాడు. (31) వేయి కోట్ల సంవత్సరాలు గద్దగా, నూరుజన్మలు పందిగా, నూరు జన్మలు వ్యాఘ్రముగా, ఏడు జన్మలు గాడిదగా (34) ఏడు జన్మలు పిల్లిగా, మూడు జన్మలు ముంగిసగా, నూరు జన్మలు ఖడ్గమృగముగా (32) ఏడు జన్మలు గుఱ్ఱముగా, ఐదు జన్మలు మొసలిగా, కులట యోనిలో పురుగుగా నూరు జన్మలు తప్పక జన్మిస్తారు. (33) ఓ నారద! వారికి నూరు జన్మలు బ్రహ్మకీట (పురుగు) జన్మ, ఏడు జన్మలు గోపికా జన్మ (ఏజంతువో) ఏడు జన్మలు గాడిదగా, (34) ఏడు జన్మలు పిల్లిగా, మూడు జన్మలు ముంగిసగా, నూరు జన్మలు ఉచ్చైశ్రవముగా (గుర్రం) అట్లాగే నూరుజన్మలు గాడిదగా (35) ఏడు జన్మలు క్రూరసర్పము, శార్దూలము, మహిషములుగా నూరు జన్మలు కప్పగా ఏడు జన్మలు మేకపోతుగా (36) నూరు జన్మలు ఎలుగుబంటుగా, లక్ష జన్మలు నక్కగా, ఆపిదప జలగ ఔతాడు. ఇవన్ని జన్మలు బ్రాహ్మణ ధనాన్ని హరించినందు వల్ల కలిగేవి, నిశ్చయము. (37) పాపులు, కుంభీపాకనరకమందు బ్రహ్మయొక్క నూరు సంవత్సరాల కాలము వండబడుతారు. బ్రాహ్మణునుద్దేశించి వెంటనే దక్షిణ ఇవ్వకపోతే (38) ఒకరాత్రి గడిస్తే ఆ దానం రెట్టింపు ఔతుంది. నెలకు నూరింతలౌతుంది. రెండు నెలలకు వేయింతలౌతుంది. (39) సంవత్సరం గడిస్తే ఆదాత నరకాన్ని పొందుతాడు. మూర్ఖుడైదాత ఇవ్వకపోయినా, తీసుకునేవాడు అడగకపోయినా (40) వారిద్దరూ నరకానికి వెళ్తారు. దాత రోగగ్రస్తుడౌతాడు. విప్రులను హింసించిన వంశహాని జరుగుతుంది, నిశ్చయము. (41) ధనము, లక్ష్మి వీనిని పోగొట్టుకొనివెళ్తూ భిక్షుకుడౌతాడు. దేవుని బ్రాహ్మణుని చూచి నమస్కరించనివాడు దుఃఖాన్ని పొందుతాడు. (42)
అనుగురుభక్తి లేనివాడు రౌరవనరకదుఃఖాన్ని పొందుతాడు. మూడురాలు, దురాచారుచాలు ఐన స్త్రీ హరిరూపియైన తన భర్తను (43) తర్జని (వేలు) చూపిస్తూ (బెదిరిస్తూ) చూడరాదు. అట్లాచేస్తే కుంభీపాక నరకంలో పడుతుంది, నిశ్చయము. మాటతో బెదిరి స్త్రీకాకి ఔతుంది. హింసిస్తే పంది ఔతుంది. (44) కోపగిస్తే ఏమౌతుంది.అహంకరిస్తే గాడిద ఔతుంది. చెడుగా మాట్లాడితే ఆడకుక్క ఔతుంది. విషపు చూపులతో చూస్తే గుడ్డిది ఔతుంది. (45) పతివ్రత ఐతే భర్తతో పాటు వైకుంఠమునకు వెళ్తుంది, నిశ్చయము. శివుని,దుర్గను, గణపతిని, సూర్యుని, విప్రుని, వైష్ణవుని (46) విష్ణువును, నిందించే మూఢుడు మహారౌరవ నరకానికి పోతాడు. తండ్రిని, తల్లిని, పుత్రుని, భార్యను, గురువును (47) అనాధను, చెల్లెలును, కన్యను నిందిస్తే నరకానికి వెళ్తాడు. బ్రాహ్మణ భక్తిలేని క్షత్రియ వైశ్య శూద్ర జన్ములు (48) హరిభక్తి విహీనులు, నరకంలో వండబడుతారు, నిశ్చయము. పతిభక్తిలేని యువతులు, నరాధములు నరకంలో పడుతారు. (49) శాలగ్రామజలమును, విష్ణుప్రసాదమును భుజించిన బ్రాహ్మణులు, తీర్ధములను, నూర్గురు మనుజులను, భూమిని పవిత్రం చేస్తారు. (తీర్థము వలె పవిత్రులు లేదా) (50) పితరులను, దేవతలను పూజించి, మాంసం భుజించిన బ్రాహ్మణుడు శుచి (నివేదించిన) అనవసరంగా మాంసం తిన్నవాడు మహారౌరవ నరకానికి పోతాడు. (51) మనస్పూర్తిగా (అకారణంగా) చేపలను కాలిస్తే ద్విజుడు ఉపవాసం చేయాలి. ఆ పిదపప్రాయశ్చిత్తం చేసుకోవాలి. చాంద్రాయణ వ్రతమాచరించాలి. (52) వాడు ఎల్లప్పుడూ అశుచియే, ఓ నందుడ! పూర్వం చేసిన పుణ్యాన్ని పోగొట్టుకుంటాడు (నశిస్తుంది). జ్ఞానదుర్బలుడై ఇష్టంగా చేపను తిన్న బ్రాహ్మణుడు అశుచి (53) విష్ణువు శేషాన్ని (ఎంగిలి) (నివేదనను) భుజించేవాడు మత్స్యమాంసములను తినడు(తినరాదు). అడుగడుగున అశ్వమేధయాగ ఫలాన్ని పొందుతాడు, నిశ్చయము. (54) ఏకాదశిని, కృష్ణ జన్మాష్టమి వ్రతాన్ని చేసిన (ఆచరించిన) వారు నూరు జన్మలలో చేసిన పాపం నుండి ముక్తులౌతారు, (నిశ్చయము) అనుమానం లేదు. (55) బాల్యంలో, కౌమార వయస్సులో , వృద్ధాప్యంలో, యౌవ్వనంలో చేసిన పాపాలన్నీ ఏకాదశి కృష్ణాష్టమీ వ్రతాచరణ వల్ల భస్మమౌతాయి. (56) ఏకాదశిరోజున, కృష్ణ జన్మాష్టమి రోజున తిన్నవాడు ముల్లోకములలో కల్గిన పాపమును తింటాడు(అనుభవిస్తాడు) అనుమానం లేదు. (57) ఆతురునకు (రోగి), వృద్ధునకు, బాలకునకు ఈ నియమం లేదు. తిన్నదానికి రెట్టింపుగా బ్రాహ్మణునకు దానం చేస్తే శుచి ఔతారు వీరు. (58) శివరాత్రి రోజున, శ్రీరామనవమి రోజున, ఉపవాసం ఉండగలిగీ, తిన్నవారు మహారౌరవానికి పోతారు. (59) అమావాస్య, పూర్ణిమ, సంక్రాంతి, చతుర్దశి, అష్టమి ఈ తిథులలో స్త్రీని సంభోగించిన, తైలపక్వం భుజించినా, (పిండి వంటలు) మాంసం తిన్నా, నరుడు చండాలయోని యందు జన్మిస్తారు. (60) మత్స్యము, మాంసము, చిరు సెనగలు, కాంస్య పాత్రలో భోజనము, ఎర్రని కూర (రంగు) వీటిని ఆదివారం రోజునతినరాదు. (61) లేనిచో కుంభీపాక నరకానికి పోతాడు, అనుమానం లేదు. ఓప్రజేశ్వర! రజస్వల పెట్టిన అన్నాన్ని, వేశ్యాన్నాన్ని, కల్లుతో కూడిన అన్నాన్ని (62) తిన్న బ్రాహ్మణుడు , విధివశాత్తున జరిగితే వాడు మలభోజి ఔతాడు, నిశ్చయము. ఆనాటి నుండి చేసిన (ఆనాడు) కర్మ అతనికి ఫలితాన్నివ్వదు.
అను!! వాడెల్లప్పుడు అశుచియే. వాడికి, వాడు బూడిదయ్యేదాకా (చచ్చేదాకా) సూతకమే. స్త్రీ, వేశ్య అంగీకరింపతగినది (వివాహం కావటానికి) నలుగురు పురుషులతో పోయేది (64) వీరు పితృదేవతల పాకమందు అధికారులు కారు. గ్రామయాజి (యజింపచేయువాడు) అన్నమును, శూద్రుని శ్రాదాన్నమును భుజించినవాడు (65) సూర్యచంద్రులున్నంత వరకు నరకానికి వెళ్తాడు. శూద్రుని శ్రాద్దదివస మందు ఆ అన్నాన్ని భుజించిన ద్విజులు (66) నూరు బ్రహ్మలకాల పర్యంతము (బ్రహ్మయొక్క నూరు సంవత్సరములు) కుంభీపాక నరకమందు వండబడుతారు. శూద్రుని అనుజ్ఞ పొంది, శ్రాద్ధ దినమందు మరోచోట భుజించిన వాడు (67) కల్లుతాగిన వానితో సమానము అని తెలుసుకోవాలి. వాడు అన్ని ధర్మకార్యములలో బహిష్కరింపతగినవాడు. ఖడ్గము పై జీవించేవాడు (వృత్తి) (సిఫాయి) సిరా మీద బ్రతికేవాడు (కరణీకం వంటిది) నంబి, ఎద్దు పై తిరిగేవాడు (వ్యాపారరీత్యా) (68) శూద్రుల శవాన్ని దాహం చేసేవాడు, శూద్ర స్త్రీకి భర్తయైన బ్రాహ్మణుడు వీరిని శూద్రుల వలె బహిష్కరించాలి. వారి అన్నము సజ్జనులకు మలముతో సమానము. (69) ఉదయంసంధ్య, సాయంసంధ్య ఆచరించనివాడు, అట్టివానిని అన్ని ద్విజకర్మల నుండి శూద్రుని వలె బహిష్కరించాలి. (70) సంధ్యనాచరించని వాడు ఎల్లప్పుడు అశుచియే. అన్ని కర్మలలోను అనర్హుడే. ఆరోజు(నుండి) చేసిన కర్మ అతనికి ఫలితాన్నివ్వదు. (71) వామమంత్రములనుపాసించే (క్షుద్ర) బ్రాహ్మణుడు నరకానికి వెళ్తాడు. నదీ గర్భమందు (నదిలో) గొయ్యిలో, చెట్టు మొదట, నీటి సమీపమందు (72) దేవుని సమీపమందు, పంటభూమియందు, బుద్ధిమంతుడు మలవిసర్జన చేయరాదు. పుట్టమన్ను, ఎలుకలు తవ్వినమన్ను, నీటిలోని మన్ను (73) శాచం చేసుకోగా మిగిలిన మన్ను, లేపము (పూసుకొనుట) చేసుకోగా, (వల్ల కల్గిన, రుద్దిన మన్ను) ఇంటికి తీసుకు రారాదు.. నాగలితో దున్నగా వచ్చిన, లోపల ప్రాణులు చీమలు గల మన్నును విడువాలి, ఓ ప్రజేశ్వర! (74) పాదుల నుండి వచ్చిన మన్నును పంటక్షేత్రము నుండి వచ్చిన మన్నును, చెట్టు మొదలు నుండి వచ్చిన మన్నును, నదీగర్భమందలి మన్నును, ఓ నంద! (75) వీటి మట్టినన్నిటిని, శౌచ విషయంలో (శుచికొరకై) విడిచి పెట్టాలి (వాడరాదు), గుమ్మడికాయను పగులగొట్టిన స్త్రీ, దీపమార్పిన పురుషుడు (76) వీరిద్దరూ ఏడుజన్మలు రోగిషులౌతారు. ప్రతిజన్మలో దరిద్రులౌతారు. దీపము, శివలింగము, సాలగ్రామము, మణి (77) ప్రతిమ, యజ్ఞోపవీతము, బంగారము, శంఖము, వజ్రము, ముత్యము, గోమూత్రము, గోమయము, నెయ్యి (78) శాలగ్రామశిల యొక్క నీరు వీటిని భూమి పై వదిలిన వారు అధః పతితులౌతారు. దరిద్రుడు, కృపణుడు, కుష్టురోగి, వంశహీనుడు, భార్యగతించిన (లేని) వాడౌతాడు. (79) భూమిలేని వాడు, బంధువులు లేనివాడు, సంతానం లేనివాడు, కుత్సితుడు, గుడ్డివాడు, కుంటివాడు (ఈచబోయిన కాలువాడు) పొట్టివాడు, కుంటివాడు, అంగహీనుడు ఔతాడు. (80) వీటిని భూమి పై వదిలినవాడు క్రమంగా పాపిఔతాడు. పగటిపూట, సంధ్యాకాలములందు నిద్ర, సీసంభోగము చేసినవాడు (81) ఏడు జన్మలు రోగగ్రస్తుడౌతాడు. ఏడు జన్మలు దరిద్రుడౌతాడు. సూర్యుడు ఉదయిస్తుండగా పండ్లు తోముకునే వాడు (82) పాపిష్టుడు. వాడు నేను జనార్ధనుని పూజిస్తున్నానని చెప్పవీలులేదు (ఉదయం కన్న ముందే దంతధావన చేయాలి) మట్టి, భస్మము, ఆవు పేడ పిండము (పిడుకలు) ఇసుక (83) వీనితో లింగం చేసి ఒకసారి పూజించిన యెడల నూరు కల్పముల కాలము దేవలోకమందుంటాడు. ఆతడే, వేయిసార్లు పూజిస్తే, కోరిన ఫలాన్ని పొందుతాడు.
లక్షసార్లు పూజించిన వాడు శివత్వాన్ని పొందుతాడు, నిశ్చయము. లింగమును పూజించిన బ్రాహ్మణుడు జీవన్ముక్తుడౌతాడు. (85) శివపూజను చేయని బ్రాహ్మణుడు నరకానికి పోతాడు. నాచేపూజించబడే, ప్రియతముడైన శివుని నిందించే నరులు (86) బ్రహ్మయొక్క నూరు సంవత్సరముల కాలము నరకమున వండబడతారు. శివలింగ పూజింప బడుతున్నప్పుడు ఇసుక, వెంట్రుక ఉన్నా (87) ఇసుకతో గుడ్డివాడౌతాడు. కేశముతో యవనుడౌతాడు. క్షుద్రుడు, దరిద్రుడు, కృపణుడు, రోగి, కుత్సితుడు ఔతాడు. (88) అందరివలన మానహాని జరుగుతుంది. నీచయోనులలో జన్మిస్తాడు. ప్రియమైన వారందరిలో బ్రాహ్మణుడు నాకు ప్రియుడు. (89) బ్రాహ్మణుని కన్న లక్ష్మి, ఎల్లప్పుడు వక్షఃస్థలంలో ఉండేది. ప్రియమైనది. ఆమెకన్న అధికప్రియమైనది రాధ. ఆమెకన్న భక్తులు అధిక ప్రియులు. (90) అంతకన్న శంకరుడు నాకు అధిక ప్రియుడు. నాకు శంకరుని కన్న ప్రియమైన వాడు లేదు. మహాదేవ! మహాదేవ! మహాదేవ అని అనేవారు (91) న్నారే, వారి వెంట సంతృప్తిగా వెళ్తాను. నామ శ్రవణం మీద, లోభంతో సంతృప్తుడనౌతాను. వెళ్తాను. నామనస్సు భక్తుల మూలమందు, నా ప్రాణములు రాధాత్మికము నిశ్చయము. (92) నా ఆత్మ శంకరుని స్థానమందు, శివుడు ప్రాణాధికుడు నాకు. తోలుతది నారాయణీశక్తి సృష్టిస్థితి అంతములనుచేసేది. (93) ఆమెవల్లనే సృష్టిని చేస్తున్నాను. ఆమె వల్లనే బ్రహ్మాదిదేవతలు. ఆమె వల్లనే విశ్వాన్ని జయిస్తున్నాను. ఆమె వల్లనే సృష్టి కలుతోంది. (94) ఆమె లేకపోతే జగత్తు లేదు. నేను ఆమెను శివునకిచ్చాను. దయ, నిద్ర, ఆకలి, తృప్తి, తృష్ణ, శ్రద్ధ, క్షయ,ధృతి (95) తుష్టి, పుష్టి, శాంతి, సిగ్గు వీటికి అధిదేవత ఆమె. వైకుంఠంలో ఆమె మహాలక్ష్మి, గోలోకంలో రాధిక. (96) మర్త్యలోకంలో సతి, పాలసంద్రంలో లక్ష్మి, దక్షకన్య,సతి ఆమె. ఆమెదుర్గ, మేనక కూతురు. దైన్యమనే దుర్గమమైన ఆర్తిని నశింపచే సేది ఆమె. (97) ఆమె స్వర్గలక్ష్మి, ఆమె దుర్గ శక్రాదులకు, ఇంటింటిలో ఆమె వాణి, ఆమె సావిత్రి, విద్యకు అధిష్టాన దేవత. (98) అగ్నిలో కాల్చేశక్తి ఆమె, సూర్యునిలో కాంతిరూపిణి. పూర్ణచంద్రునిలో శోభాశక్తి. జలంలో చల్లదనమామె. (99) పంటలో ఉత్పత్తి శక్తి భూమియందు ఆమె ధారణశక్తి. విప్రులలో బ్రహ్మణ్యశక్తి, దేవతలలో ఆమె దేవశక్తి (100) తపస్వులలో తపస్సు ఆమె. గృహస్థులకు గృహదేవత. ముక్తులకు ముక్తిశక్తి. సాంసారికులకు ఆమె ఆశాశక్తి (101) నా భక్తులకు భక్తిశక్తి. నాయందు ఎప్పుడూ భక్తిగలది. రాజులకురాజ్యలక్ష్మి వణిజులకు లాభరూపమామే (102) సంసార సముద్రం వారికి ఒడ్డుయందు త్రయీతత్వరూపిణి, తరింపజేసేది. సజ్జనులలో సద్బుద్దిరూపిణి, మేధాశక్తి స్వరూపురాలు (103) శృతియందు శాస్త్రమందు వ్యాఖ్యాశక్తి ఆమె. దాతలలో దానశక్తి. క్షత్రాదులకు విప్రభక్తి రూపమామె. సతులలో పతిభక్తి ఆమె. ఇటువంటి రూపము గల శక్తిని నేను శివునకిచ్చాను (104) ఈ విధంగా నీకు అంతా చెప్పాను. ఇంకా ఏమి వినదలచావు. నీవు ఏదేది అడిగితే దాన్నంతా నీకు చెబుతాను (105) అని శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణమందు శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధ మందు నారాయణ నారద సంవాదమందు భగవంతుని నందుని సంవాదమందు డెబ్బది ఐదవ అధ్యాయము.
