4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము

Table of Contents

129 - అధ్యాయము

మూll శ్రీనారాయణ ఉవాచ :

శ్రీభగవానువాచ :

బ్రహ్మోవాచ :

అను ॥ శ్రీనారాయణుడిట్లా –

శ్రీకృష్ణుడక్కడ భగవంతుడు, పరిపూర్ణతముడు, ప్రభువు. ఆతనిని చూస్తే గోకులవాసులకు వెంటనే సాలోక్య మోక్షము వస్తుంది. (1) ఐదుగురు గోపాలురతో భాండీర మందు వటమూలమందున్నాడు. గోకులాన్నంతా చూచాడు. గోకులం, గోకులమంతా వ్యాకులంగా ఉంది. (2) రక్షకుడు లేక విడిగా బృందావన వనము శూన్యంగా ఉంది. యోగంతో అమృతవర్షంతో, కృపతో, కృపానిధి (3) గోపికలతో, గోపాలురతో దానిని పరిపూర్ణం చేశాడు, ఆతడు. ఆట్లాగే బృందావనాన్ని చాలా రమ్యంగా, మనోహరంగా చేశాడు. (4) గోకులమందున్న వారిని గోపాలురను ఆతడు ఓదార్చాడు. దుర్లభమైన హితమైన నీతిగల వాక్యమును మధురంగా చెప్పాడు. (5) శ్రీభగవానుడిట్లా - ఓ గోప సమూహమ! ఓ మంధువులార! సుఖంగా ఉండి, స్థిరులు కండి ప్రియలతో రమణము (చేయండి) రాసమండలము చాలా రమ్యమైనది. (6) సూర్యచంద్రులున్నంత వరకు కృష్ణుడు పుణ్యమైన, బృందావన వనమందుంటాడు. ఎప్పుడూను, (7) జగత్తులకు విధాతయైన కృష్ణుడు భాండీరమునకు వెళ్ళాడు. తాను శేషుడు, ధర్ముడు, భవానితో భవుడు వెళ్ళారు. (8) సూర్యుడు, మహేంద్రుడు, చంద్రుడు, అగ్ని, కుబేరుడు, వరుణుడు, పవనుడు, యముడు వెళ్ళారు. (9) ఈశానుడు, దేవతలు, ఎనిమిది మంది వసువులు అన్ని గ్రహములు, రుద్రులు, మునులు, మనువులు వెళ్ళారు. (10) భగవాన్ ప్రభువు ఉన్నచోటికి అందరు వేగంగా వచ్చారు. దండమువలె భూమియందు పరుండి నమస్కరించి స్వయంగా విధి ఆతనితో అన్నాడు. (11) బ్రహ్మ ఇట్లా - పరిపూర్ణతమ, బ్రహ్మస్వరూప, శాశ్వతమైన విగ్రహం కలవాడ, జ్యోతిః స్వరూప, పరమ, ప్రకృతికి పరుడ, నీకు నమస్కారము.

శ్రీమహాదేవ ఉవాచ :

అనంత ఉవాచ :

దేవాఊచుః

చాలా నిర్లిప్తుడ, నిరాకారుడ, ధ్యానంకారణంగా సాకారమైనవాడ! స్వేచ్చామయ, పరంధామ, పరమాత్మ నీకు నమస్కారము. (13) సర్వకార్యముల స్వరూపమునకు, ఈశుడ, కారణములకు కారణుడ, బ్రహ్మేశ,శేష, దేవేశ, సర్వేశ నీకు నమస్కారము. (14) సరస్వతీశ. పద్మేశ, పార్వతీశ, పరాత్పర, ఓసావిత్రీశ, రాధేశ, రాసేశ్వర, నీకు నమస్కారము. (15) అందరికి నీవు ఆదియైన వాడవు. సర్వము. సర్వేశ్వరుడవు, అందరిని రక్షించేవాడవు, సంహరించేవాడవు, సృష్టిరూపుడవు, నీకు నమస్కారము. (16) నీపాద పద్మముల ధూళితో ఈ భూమి ధన్యమైనది, పవిత్రమైనది ఓనాథ! నీవు పరమపదమునకు పోతే ఇది శూన్యరూపము. (17) ఇరువది ఐదు నూర్ల సంవత్సరాల కన్న ఎక్కువైన కాలం గడిచాక ఏడుస్తున్న విరహాతురురాలైన ఈమెను వదిలి నీస్థానానికి వెళ్తున్నావు. (18) మహాదేవుడిట్లా - బ్రహ్మ ప్రార్థించగా నీవు భూమి పైకి వచ్చి, భూమికి భారాన్ని లేకుండా చేసి నీస్థానానికి పోతున్నావు, ఓవిభు, (19) ముల్లోకములలో ఈభూమి ధన్యురాలు. నీపాద చిహ్నములతో వెంటనే పవిత్రురాలైంది. మేము మునులమునీ పదాంబుజములను సాక్షాత్తుగా చూచి ధన్యులమైనాము. (20) ఊర్థ్వరేతసులైనమునుల ధ్యానమునకు అసాధ్యుడవు. దురారాధ్యుడవు, మాకు ఈశుడవు. పాపరహితుడవు అట్టి నీవు ఇప్పుడు భూమి పై కళ్లెదుట ఉన్నావు. (21) వాసువువు, అంతటా ఉండేవాడివి ఆతని వెంట్రుకలందు విశ్వములన్ని ఉన్నాయి. ఆదేవుడు మహావిష్ణువు, భూమి పై వాసుదేవుడు. (22) సిద్ధేంద్రులకు చాలా కాలము తపస్సు చేస్తే లభించేవాడు, చాలా దుర్లభుడవు. అట్టిసాటిలేని నీపాదపద్మములు ప్రాణులన్నిటికి కళ్ళ ఎదుట కన్పించాయి. (23) అనంతుడిట్లో - ఓ భగవాన్! నీవు అనంతుడవు. నేను కాను. నేను కళలోని అంశ భాగాన్ని విశ్వమంతా ఒకచోట క్షుద్రకూర్మమందుండగా అక్కడ నేను, ఏనుగు పైన దోమలాంటి వాడిని (24) అసంఖ్యమైన శేషులు, కూర్మములు బ్రహ్మ విష్ణు శివులలాంటి వారు విశ్వములు అసంఖ్యాకమైనవి. వాటికి నీవు స్వయంగా ఈశుడవు. (25) ఓనాథ! మాకు ఇటువంటి మంచిరోజు ఎప్పుడు గలుగుతుంది భవిష్యత్తులో. కలలోకూడా ఏదేవుడు కన్పించడో ఆదేవుడు, ప్రాణులందరికి కన్పించాడు. (26) ఓనాథ! ఈభూమిని పవిత్రురాలను చేసి గోలోకానికి వెళ్తున్నావు. ఆ అనాథను, ఏడుస్తున్నదాన్ని, శోక సాగరమందు మునిగిన దానిని వదిలివెళ్తున్నావు. (27) దేవేతలిట్లా వేదములు స్తుతించలేకపోయాయి. బ్రహ్మ ఈశానాదులు కూడా అట్లాగే స్తుతించడానికి అశక్తులైనారు. అదే స్తుతిని మేమేమి చేస్తాము. నీకు నమస్కారము (28) అని పలికి ఆ దేవతలు ద్వారకాపురికి వెళ్ళారు. అక్కడున్న భగవంతుని చూడటానికి త్వరగా ఆనందంతో వెళ్ళారు. (29) ఆ గోపాలురు ఉత్తమమైన గోలోకానికి వెళ్ళారు. పృథివి భయపడి వణికింది. ఏడు సముద్రములు కదలినాయి. (30) బ్రహ్మ శాపం వల్ల శోభను కోల్పోయిన ద్వారకను వదిలి, రాధికేశ్వరుడు కదంబ మూలమందున్న మూర్తిని ప్రవేశించాడు. (31) వారంతా కొంతకాలంలో జరిగే యుద్ధంలో యాదవులంతా పడిపోతారు. దేవేరులంతా, చింత నొంది స్వాములతో (యజమానులతో) సహావెళ్ళారు. (32) అర్జునుడు తన పురానికి వెళ్ళి యుధిష్ఠిరునితో అన్నాడు. ఆ రాజు సోదరులతో భార్యతో కూడి స్వర్గానికి వెళ్ళాడు. (33) కదంబ మూలమందుకూర్చున్న పరమేశ్వరుని చూచి ఆ బ్రహ్మాది దేవతలంతా భక్తిపూర్వకముగా నమస్కరించారు.

భాగీరథ్యువాచ :

శ్రీభగవానువాచ :

పరమాత్మయైన, దేవుని, ప్రభువును, నారాయణుని స్తుతించారు. ఆతడు, శ్యామలవర్ణుడు, చిన్నపిల్లవాని వయసు. రత్నాలంకారములతో అలంకరించుకున్నాడు. (35) వహ్నిశుద్దమైన వస్త్రమును ధరించాడు. వనమాలతో శోభిస్తున్నాడు. చాలా సుందరుడు శాంతుడు. లక్ష్మీకాంతుడు. మనోహరమైనవాడు. (36) పద్మాదులు నమస్కరించిన పాదపద్మములందువ్యాధుని అస్త్రము ఉంది. ఆ బ్రహ్మాది దేవతలను చూచి నవ్వుతూ అభయమిచ్చాడు. (37) ప్రేమ విహ్వలయై ఏడుస్తున్న ఆ భూమిని ఓదార్చి, వ్యాధుని పరమైన, ఉత్తమమైన తన స్థానానికి బయల్దేరదీశాడు.(రా) (38) బలరాముని తేజస్సు శేషుని యందు చాలా అద్భుతంగా ప్రవేశించింది. ప్రద్యమ్నుని తేజస్సు కాముని యందు, అనిరుద్ధుని తేజస్సు బ్రహ్మయందు చేరింది. (39) అయోని సంభవ, దేవి మహాలక్ష్మి రుక్మిణి, సాక్షాత్తు తన శరీరంతో వైకుంఠానికి వెళ్ళింది. ఓనారద! (40) సత్యభామ, కమలాలయ పృథివిలో ప్రవేశించింది. స్వయంగా జాంబవతిదేవి విశ్వమాతయైన పార్వతిలో చేరింది. (41) ఏఏ దేవతలు ఎవరెవరి అంగరూపంగా భూమి పై ఉన్నారో, వారంతా విడివిడిగా వారివారిలో ప్రవేశించారు. (42) సాంబుని తేజస్సు స్కందునిలో పరమాద్భుతంగా ప్రవేశించింది. వసుదేవుని తేజస్సు కశ్యపునిలో, అతిదిలో దేవకి ప్రవేశించింది. (43) రుక్మిణి మందిరాన్ని వదలి సమస్త ద్వారకాపురాన్ని సముద్రుడు, వికసించిన ముఖము చూపులు కలవాడై ఆతడు స్వీకరించాడు. (44) సముద్రుడు వచ్చి పురుషోత్తమునిస్తుతించాడు. పరమాత్మ వియోగంతో, కళ్ళనీళ్లు పెట్టుకొని విహ్వలుడై ఏడ్చాడు. (45) గంగ, సరస్వతి, పద్మావతి, యమున, గోదావరి, స్వర్ణరేఖ, కావేరి, నర్మద, ఓముని! (46) శరావతి బాహుద, కృతమాల, పుణ్యద, ఈ నదులన్నీ వచ్చి పరమేశ్వరునకు నమస్కరించాయి. (47) జాహ్నవిదేవి ఏడుస్తుపరమేశ్వరునితో ఇట్లా అన్నది. ఆమె కళ్ళనీళ్ళతో అతి దీనంగా, విరహజ్వరంతో చంచలురాలై అంది (48) భాగీరథి ఇట్లా - ఓనాథ ! రమణ! శ్రేష్ఠ! ఉత్తమమైన గోలోకానికి వెళ్తున్నావు. కలియుగంలో మాగతేమిటి ఇక్కడ. ఏమౌతుంది. (49) శ్రీభగవంతుడిట్లా - కలిలో ఐదువేల సంవత్సరాల వరకు భూమి పై ఉండు. పాపులు తమ పాపాలను స్నానంతో నీకిస్తారు. (50) నామంత్రాన్ని ఉపాసించేవాని స్పర్శతో ఆపాపాలు ఆక్షణంలోనే భస్మమౌతాయి. వాని దర్శనం వలన, స్నానం వలన నశిస్తాయి ఓ జాహ్నవి (51) హరినామాలు ఉన్నచోటకు పురాణాలు జరిగేచోటకు వెళ్ళి సావధానంగా వీరితో కూడా స్త్రీ) వింటావు. (52) పురాణం వినటం వలన, హరినామాన్ని కీర్తించటం వల్ల,బ్రహ్మ హత్యాదికమైన పాపములు భస్మమౌతాయి. (53) అవే వైష్ణవుని ఆలింగనముతో భస్మమౌతాయి, అగ్ని, గడ్డిని ఎండుకట్టెను కాల్చినట్టు నశిస్తాయి. (54) లోకంలో వైష్ణవులు పాపుల పాపాలను భస్మం చేస్తారు. భూమి పై ఎన్ని తీర్థాలున్నాయో, పుణ్యమైనవి అవన్నీ, ఓ జాహ్నవి! (55) నా భక్తుల . శరీరమందున్నాయి. పవిత్రమైన వారి యందున్నాయి. వసుంధర, నా భక్తుల పాదధూళితో వెంటనే పవిత్రమౌతుంది. (56) నా ఎంగిలిని తినే, నా మంత్రాన్నుపాసించే విప్రులతో తీర్థములు వెంటనే పవిత్రమౌతాయి. జగత్తు వెంటనే పవిత్రమౌతుంది.

నన్నే నిత్యం ధ్యానించేవారు నాకు నా ప్రాణములకన్న అధికులు, ప్రియులు. వారిని స్పృశిస్తే చాలు వాయువు, అగ్ని పవిత్రమౌతాయి. (58) కలిలో పదివేల సంవత్సరాలు భూమి పై నా భక్తులుంటారు. నా భక్తులు పోయాక అంతా ఒకే వర్ణం (కులం) వారౌతారు. (59) నాభక్తులులేని భూమి కలితో ఆక్రమించబడుతుంది. ఇంతలో అక్కడ కృష్ణుని శరీరం నుండి, బయటికి వచ్చిన (60) ఒక పురుషుడు, నాల్గు చేతులు కలిగి నూరుగురు చంద్రులతో సమానంగా వెలిగిపోతున్నాడు. శంఖము, చక్రము, గద, పద్మములు ధరించాడు. శ్రీవత్సము గుర్తుగా ఉంది. (61) ఆతడు సుందరమైన రథమెక్కి క్షీరసముద్రానికి వెళ్ళాడు. సింధుకన్య గూడా స్వయంగా రూపం కలిగి ఆసతి వెళ్ళింది. (62) శ్రీకృష్ణుని మనస్సు నుండి పుట్టిన, మనోహరురాలైన మర్త్య లక్ష్మి, జగత్తును పాలించటానికి కర్తయైన విష్ణువు శ్వేత ద్వీపానికి వెళ్ళాక, (63) శుద్ధసత్వ స్వరూపము రెండు రూపాలైంది. దక్షిణ భాగమున (కుడి) రెండు చేతులతో గోపబాలుని రూపం ధరించింది. (64) కొత్త వర్షామేఘము వలె శ్యామలవర్ణము గలిగి, పచ్చని పట్టు వస్త్రముతో శోభిస్తుంది. ముఖంలో వేణువుంది. శ్రీమాన్, చిరునవ్వు నవ్వుతున్నాడు. కళ్ళు పద్మాలవలె ఉన్నాయి. (65) నూరుకోట్ల చంద్రుల సౌందర్యము, నూరుకోట్ల మన్మథుల కాంతికలిగి ఉన్నాడు. ఆతడు పరమానందుడు, పరిపూర్ణతముడు, ప్రభువు. (66) పరమైన స్థానము, పరబ్రహ్మ స్వరూపుడు, స్వయంగా నిర్గుణుడు అందరికి పరమాత్మ భక్తులను అనుగ్రహించే కొరకు రూపము ధరించినవాడు. (67) నిత్యశరీరుడు, భగవంతుడు, ఈశ్వరుడు, ప్రకృతికీపరుడు. ఆతనిని యోగులు జ్యోతిరూపుడు, సనాతనుడు అని అంటారు. (68) జ్యోతిలోపల నిత్యరూపుడు అని భక్తులంటారు. వేదములు సత్యస్వరూపుడని అంటాయి. విచక్షణులు, నిత్యుడు, ఆద్యుడు అని అంటారు. (69) దేవతలంతా పరుడు, స్వేచ్ఛామయుడు, ప్రభువు అని అంటారు. సిద్దేంద్రులు, మునులు అంతా ఆతనిని సర్వరూపుడని అంటాయి. (70) శంకరుడు, యోగీంద్రుడు, అనిర్వచనీయుడన్నాడు. కారణములకు కారణమని స్వయంగా బ్రహ్మ అన్నాడు. (71) శేషుడు, అనంతుడు అని అంటాడు. ఈశ్వరునకు తొమ్మిది రూపములు. ఆరుతర్కములకు ఆరు రూపములు ఇష్టము. (72) వైష్ణవులకు ఒకే రూపము. వేదములకు ఒకే రూపము. పురాణములకొక రూపము. కనుక (6+1+1+1=9) తొమ్మిది విధాలు అని అన్నారు. (73) న్యాయము (శాస్త్రం) నిర్వచనీయుడని అది మామతమని శంకరుడన్నాడు. విచక్షణులు వైశేషికులు, ఆతనిని, నిత్యమన్నారు. (74) సాంఖ్యులు, జ్యోతిరూపుడని సనాతనుడని ఆ దేవునన్నారు. మీమాంసకులు సర్వరూపుడు అని వేదాంతము సర్వకారణమని అన్నారు. (75) పాతంజలులు అనంతుడని అన్నారు. వేదములు సత్యస్వరూపుడన్నాయి. పురాణములు స్వేచ్చామయుడన్నాయి. భక్తులు నిత్యవిగ్రహుడని అన్నారు. (76) ఆతడు గోలోకనాథుడు, రాధేశుడు, నందనందనుడు గోకులంలో పుణ్యమైన బృందావన వనములో గోపవేషము (77) వైకుంఠంలో నాలుగు చేతులు స్వయంగా మహాలక్ష్మీపతి. భగవాన్ నారాయణుడు. ఆ పేరే ముక్తికారణము. (78) ఒక్కసారి నారాయణ అని అంటే పురుషుడు మూడు నూర్ల సంవత్సరాల కాలము గంగాది సర్వతీర్థములందు స్నానం చేసిన వాడౌతాడు, ఓ నారద! (79) సునందుడు, నందుడు, కుముదుడు, అను పరివారముతో చుట్టబడి శంఖచక్రగదా పద్మధరుడై శ్రీవత్సలాంఛనం కలిగి.

పార్వత్యువాచ :

మణిశ్రేష్ఠమైన కౌస్తుభమణితో, వనమాలతో అలంకరింపబడ్డాడు. వేదములతో స్తుతింపబడుతూ విమానంలో తన స్థానమైన వైకుంఠానికి వెళ్లాడు. (81) వైకుంఠనాథుడు, రాధేశుడు, స్వయంగా ప్రభువుఐన స్వామి వెళ్లాక, ముల్లోకముల మోహింపచేసే, పరమైన, వేణుధ్వనిని చేశాడు. (82) ఓనారద! మునులు, దేవగణములు మూర్చపొందారు. పార్వతి తప్ప,ఆ మాయతో అంతా అచేతనులయ్యారు. (83) సనాతనుడైన భగవంతునితో దేవి పార్వతి ఇట్లా అంది. భగవంతుని విష్ణుమాయ అన్ని రూపములు కలది. సనాతనమైనది (84) పరబ్రహ్మ స్వరూపమైనది. పరమాత్మ స్వరూపమైనది. సగుణము; నిరుణము, పరమైనది. స్వేచ్ఛామయమైన సతి. (85) పార్వతి ఇట్లా - గోలోకంలో రాసమండలమందు రాధిక రూపురాలను ఒక్కదాన్నే. ఓప్రభు! గోలోకం రాసశూన్యమైంది. దానిని పరిపూర్ణం చేయి. (86) ముత్యములు మాణిక్యములతో అలంకరింపబడ్డ రథాన్ని ఎక్కి నీవు వెళ్ళు. నీ వక్షఃస్థలమందున్న నేను పరిపూర్ణతమురాలను. (87) నీ ఆజ్ఞతో నేను మహాలక్ష్మిని వైకుంఠానికి వెళ్ళేదాన్ని. హరికి ఎడమభాగంలో అక్కడే సరస్వతిని. (88) నేను నీమనస్సునుండి పుట్టినదానిని. నీ ఆజ్ఞతో సింధుకన్యను. ఒకకళతో విధి సన్నిధిలో నేను వేదమాత సావిత్రిని. (89) తేజస్సులలో సర్వవేదములకు ముందు నీ ఆజ్ఞతో సత్యను, అక్కడ అధిష్టానము చేశాను. దేవి శరీరాన్ని ధరించాను. (90) అవలీలగా శుంభాది దైత్యులను చంపాను. దుర్గను చంపి దుర్గనయ్యాను నేను. త్రిపుర వధయందు నేను త్రిపురను. (91) రక్తబీజుని చంపి రక్తబీజనాశిని నయ్యాను. నీ ఆజ్ఞతో దక్షకన్యను, సతిని, సత్యస్వరూపిణిని. (92) యోగంతో శరీరాన్ని విడిచినీ ఆజ్ఞతో శైలజనయ్యాను నేను. నీతో శంకరునకివ్వబడ్డాను. గోలోకంలో రాసమండలమందు (93) నేను విష్ణుభక్తిని. అందువల్ల విష్ణుమాయను, వైష్ణవిని. నారాయణుని మాయను నేను అందువల్ల నారాయణి అని అనబడ్డాను. (94) కృష్ణునకు ప్రాణంకన్న అధికురాలను నేను. ప్రాణఅధిష్ఠాతృ దేవతను. మహావిష్ణువునకు,వాసునకు తల్లిని, స్వయంగా రాధికను.

అను ॥ నీ ఆజ్ఞతోనేను ఐదు రకాలుగా పంచప్రకృతి రూపిణిని. కళ, కళాంశలతో నేను ప్రతి ఇంట్లో దేవతల పత్నిని (96) ఓమహాభాగ! శీఘ్రంగా వెళ్ళు. అక్కడ నేను విరహాతురురాలను గోపికలతో కూడి ఎప్పుడూ అంతటా రాసంలో తిరిగేదాన్ని (97)పార్వతి మాటను విని రసికేశ్వరుడు నవ్వి, రత్న విమానాన్ని ఎక్కి ఉత్తమమైన గోలోకానికి వెళ్లాడు. (98) పార్వతి స్వయంగా దేవగణానికి బోధించసాగింది. మాయా వంశీరవముతో అంతాకలత చెందింది. విష్ణుమాయ సనాతనమైంది. (99) వారు హరి శబ్దాన్ని చేసి తమ గృహాలకు ఆశ్చర్యంగా వెళ్ళారు. శివునితో పాటు ఆ దుర్గ ఆనందించి తన పురానికి వెళ్ళింది (100) వస్తున్న కృష్ణుని చూచి రాధ గోపీగణములతో కూడా ఆనందంతో ప్రజాన్ని అనుసరిస్తూ వెళ్ళింది. ఆ సర్వజ్ఞురాలు ప్రాణవల్లభుడు రాగా (101) చూచి దగ్గరకు వస్తున్న వానిని చూచి రథం నుండి ఆసతిదిగి, శిరస్సుతో సఖురాండ్రతో కలిసి జగన్నాథునకు నమస్కరించింది (102) గోపాలురు గోపికలు ఆనందించి ముఖాలు చూపులు వికసించగా ఈశ్వరుని రాకతో ఉత్సుకులై దుందుభిని వాయించారు (103) విరజను దాటి జగత్పతి రాధను చూసి త్వరగా రథం నుండి దిగిరాధిక చేతిని పట్టుకొని (104) శతశృంగమందు తిరిగాడు. చాలా రమ్యమైన రాసమండలాన్ని పుణ్యప్రదమైన అక్షయ వటాన్ని, పుణ్యప్రదమైన బృందావనాన్ని చూసి (105) తులసి కాననాన్ని చూసి మాలతీ వనానికి వెళ్ళాడు. మాధవి వనాన్ని, కుందవనాన్ని ఎడమ ప్రక్కన ఉంచుకొని (ఉండగా) (106) కుడివైపు ఇష్టమైన చంపకారణ్యముండగా కృష్ణుడు వెళ్ళాడు. ఆ పిదప త్వరగా అందమైన చందన కాననాన్ని వెనుక చేసుకొని (107) ఎదురుగా పరమైన, రమ్యమైన రాధికా భవనాన్ని చూచాడు. వరమైన రత్నసింహాసనమందు రాధతో కలిసి ఉన్నాడు (108) కర్పూరంతో కూడిన తాంబూలాన్ని తిన్నాడు. వాసనగల నీరు తాగాడు. మంచివాసనగల చందనం పూయబడిన పుష్పతల్పమందు పరున్నాడు (109) ఆరామతో కలిసి ఆతడు రమించాడు. రససాగరమందు మునిగాడు. అని ఈరకంగా ధర్ముని నోటినుండి విన్నదానినిఅంతా చెప్పాను (110) రమ్యమైన గోలోక ఆరోహణమును (ఎక్కటం) చెప్పాను. ఇంకేమి వినదలిచావు (111) అని శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణమందు శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధ మందు నారాయణ నారద సంవాదమందు గోలోకా రోహణమనునది నూట ఇరువది తొమ్మిదవ అధ్యాయము.