4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము

Table of Contents

106 - అధ్యాయము

మూII శ్రీనారాయణ ఉవాచ :

అను ॥ శ్రీనారాయణుడిట్లా :

ఇంతలో మహాబలుడైన కకుద్మి అనురాజు కన్యకకు వరుని కొరకై బ్రహ్మలోకమునుండి వచ్చాడు. (1) ఎప్పుడూ సుస్థిరంగా ఉండే వనంగల కన్యను, రేవతిని, అమూల్యమైన రత్నభూషణములు కలదానిని, ముల్లోకములలో దుర్లభమైన దానిని (2) ఆనందంగా బలవంతుడైన బలదేవునకు దానపూర్వకముగా ఇచ్చాడు. సత్యయుగంలో ఆమె వయస్సు ఇరవై ఏడు యుగములు గడించింది. (3) మునులు దేవేంద్రులు ఉన్న సభలో కన్యను విధానపూర్వకముగా ఇచ్చాడు. మూడు లక్షల ఏనుగులను అల్లునకు అరణంగా ఇచ్చాడు. (మౌతుకం) (4) పది లక్షల గుజ్జాలు, లక్ష రథములు, రత్నముల అలంకారములతో కూడిన దాసి జనాన్ని లక్ష, (5) లక్ష మణులు, లక్ష రత్నాలు, కోటి బంగారము ఆదరంగా ఇచ్చాడు. రమ్యమైన వహ్నిశుద్ధమైన వస్త్రములు, ముత్యములు, మాణిక్యములు, వజ్రములు (6) ఇచ్చి, రాజేంద్రుడు బలశాలియైన బలరామునకు కన్యను ఇచ్చాడు. శ్రేష్ఠరత్నముల సారముతో నిర్మించిన పల్లకి పై వారితో కూడి కుండినకు వచ్చాడు. (7) ఇంతలో ప్రార్థించి సాంగమైన మంగళకర్మయందు, కలమ, కలయైన రేవతి వనితను అలంకరించారు. (8) దేవకి, రోహిణి, యశోద, (నందుని భార్య), అదితి, దితి శాంతి వీరంతా మందిరాన్ని అలంకరించి (9) బ్రాహ్మణులకు భోజనం పెట్టించారు. వారికి ఆనందంగా ధనమిచ్చారు. వల్లభుడు (రాజు) వసుదేవునకు మంగలకార్యం చేయించాడు. (10) ఇంతలో దేవతలు, మునులు, రాజేంద్రులు, తమతమ సైన్యంతో అనుకున్నంతలో, ఆనందంతో కుండిన నగరానికి వచ్చారు. (11) చాలా సుమనోహరమైన నగరాన్ని అందరు చూచారు. లోతైన ఏడు కందకములతో చుట్టబడినది. (12) ఏడుప్రాకారములు గలది, నూరు ద్వారాలు గలది. విశ్వకర్మ రకరకాల రత్నాలతో, మణులతో నిర్మించాడు. (13) కోరతగిన యాత్రికులంతా నగర బహిర్ ద్వారాన్ని చూచారు. మహారథులైనవారు నలుగురు, అట్లాగే రక్షకులతో రక్షించబడినదది. (14)

రుక్మిరువాచ :

శాల్వ ఉవాచ :


 

శిశుపాల ఉవాచ :

దంతవక్త్ర ఉవాచ :

రుక్మి శిశుపాలుడు, మహాబలవంతుడైన దంతవక్రుడు, శాల్వుడు మాయావులలో శ్రేష్ఠుడైనవాడు, యుద్ధశాస్త్ర విశారదుడు (వాడు) వీరంతా (15) రకరకాల శస్త్రాస్త్రములతో, రథం మీద కూర్చొని, యుద్దోన్ముఖమైన కృష్ణ సైన్యాన్ని చూచి, రాకుమారుడు కోపించాడు. (16) వినకఠినమైన, అనరాని మాటలను, నిష్టురంగా పలికాడు. మునీంద్రులను, దేవతలను, మునిపుంగవులను వెక్కిరించే మాటలన్నాడు. (17) రుక్మివనచమిట్లా - ఆహా! కాలం చేసిన పని, దైవాన్ని ఎవడు తప్పించగలడు దేవేంద్రుల సభలో నేనేం మాట్లాడాలి. (18) దేవతలకు యోగ్యమైన, మనోహరమైన, రుక్మిణి అను కన్యను స్వీకరించడానికి దేవతలతో మునులతో కలసి నందుని పశురక్షకుడు వస్తున్నాడు. (19) సాక్షాత్తు గోపికలజారుడు, గోపకుల ఎంగిలిని తినేవాడు. జాతిని నిర్ణయించలేము. తినేవి, సంగమమును, (స్త్రీ సంగమానికి హద్దులేదు) నిర్ణయించలేము. (20) ఈతడు రాజేంద్రపుత్రుడా? మునిపుత్రుడా? వసుదేవుడు క్షత్రియుడు. తిండి వైశ్యుని ఇంట్లో (21) చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు స్త్రీని చంపాడు ఈ దురాత్ముడు. వీడి సంభోగంతో కుబ చనిపోయింది. వస్త్రముతో చాకలివాడు చచ్చాడు. (22) రాజేంద్రుని చంపటం చాలా చెడ్డది. అందుకు బ్రహ్మహత్యపాపాన్ని పొందుతాడు. మథురలో ధర్మిష్ఠుడైన కంసుని అప్పుడే చంపేశాడు. (23) శాల్వుడిట్లా - ఓ దేవ! రుక్మి చెప్పిన దానిలో ఏమైనా అబద్ధముందా? రుక్మిణి భర్త ఎవరు? అనగానే నందుని పశురక్షకుడు అని గదా సమాధానం . (24) శిశుపాలుడిట్లా - ఓ ఈభూమి పై ఎంత ఆశ్చర్యము. దేవతలు బ్రహ్మాదులు మునీంద్రులు, బ్రహ్మపుత్రులు, వీరంతా ఒకమనిషి ఆజ్ఞతో వచ్చారు. (25) దంత వక్రుడిట్లా - ఎల్లప్పుడూ బ్రాహ్మణులు లుబ్ధులు, దేవతలు భక్తవత్సలులు. బ్రహ్మపుత్రులు, నందపుత్రుని ఆజ్ఞతో ఎట్లా వచ్చారు. (26) వారి మాటలు విని దేవతల సమూహమంతా కోపించింది. మునుల రాజేంద్రుల సంఘములు, బలరాముడు మొదలగు వారంతాను కోపగించారు. (27)

అని బ్రహ్మవైవర్త మహాపురాణ శ్రీకృష్ణజన్మఖండ ఉత్తరార్ధమందు నారాయణ నారద సంవాదమందు రుక్మిణి వివాహమందు నూట ఆరవ అధ్యాయము.