4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము
132 - అధ్యాయము
మూ॥ శౌనక ఉవాచ :
సూత ఉవాచ :
శౌనకుడిట్లా - అంతా విన్నాను. ఏమీ మిగలలేదు. ఓ ధర్మేశ! బ్రాహ్మణుడనైననాకు, ఓ మహాభాగ! పురాణాన్ని మళ్ళాచెప్పు. (1) ఇటువంటి పురాణాన్ని పుట్టినప్పటినుండి వినలేదు. చూడలేదు. వినలేదు, ఓతండ్రి1 అటువంటి చెప్పే తీరును. అంత బాగుంది. (2) సూతుడిట్లా – ఓమహాభాగ1 అవధానంతో,శ్రద్దగా విను. అధ్యాయములను వింటేనే చాలు పురాణఫలం లభిస్తుంది. (3) బ్రహ్మఖండ మందు ఎక్కువగా బ్రహ్మ నిరూపణము చెప్పాను. ఎవరికైనా అది అనిర్వచనీయమే. నాకు వచ్చిన రీతి చెప్పాను. (4) బ్రహ్మసాకారము, నిరాకారము, సగుణుడు, నిర్గుణుడు విడివిడిగా చెప్పాను. ఎవరి శక్తి ఎంతో అట్లాగే ధ్యానము. (5) గోలోకాది వర్ణననుక్రమంగా విడివిడిగా చెప్పాను. ఓ విభు! అక్కడ ఉపయోగించే ఉపాఖ్యానాన్ని ప్రసంగవశాత్తు వచ్చేదాన్ని చెప్పాను. (6) జాతులనిర్ణయము. అట్లాగే సంకరముల సంగతి చెప్పాను. ప్రశ్నననుసరించి విశిష్ట ఉపాఖ్యానాలను చెప్పాను. (7) రాధామాధవుల క్రీడ, మహావిష్ణువు పుట్టుక, విశ్వేషుల నిరూపణము క్లుప్తంగా చెప్పాను, ఓ ద్విజోత్తమ (8) బ్రహ్మనారదుల సంవాదాన్ని, యధార్థానికి మునీంద్రుడైన నారదుని వివేకాన్ని చెప్పాను. (9) బ్రాహ్మణుడు ఆజ్ఞతో నరనారాయణ ఆశ్రమానికి అతనితో నారదుడు వెళ్ళుట అతనితో కలసి దర్శనము. (10) వారి సంభాషణము నారదాదుల తొలి నివేదనము. దేవ,బ్రహ్మ ఖండక్రమ ప్రకారంగా చెప్పాను, ఓద్విజోత్తమ (11) ప్రకృతి ఖండాన్ని విను. ఓముని! ఇది సుధాఖండముతో సమానము (అమృతము) ప్రకృతి లక్షణాన్ని చెప్పాను. ప్రకృతుల వర్ణనచేశాను. (12)వారిఉపాఖ్యానము, వర్ణన, పూజనాదికము, లక్ష్మి, సరస్వతి, దుర్గ, సావిత్రి, రాధిక (13) వీరి చరిత్రను, ఇతరులచరిత్రను విడివిడిగా చెప్పాము. మహాలక్ష్మి ఉపఖ్యానాన్ని అట్లాగే సరస్వతి ఉపాఖ్యానాన్ని (14) అపూర్వమైన రాధిక ఆఖ్యానాన్ని (చరిత్ర) సావిత్రి కథను, యముడు, సావిత్రి వీరల సంవాదాన్ని సత్యవంతుని ప్రాణాన్ని ఇవ్వటాన్ని చెప్పారు.
కుండల వర్ణన చెప్పారు. వాటి లక్షణము చెప్పాను. జీవుల కర్మవిపాకము, భోగముల నిర్ణయము చెప్పాను. (16) పురాణములలో చాలా రహస్యమైననది. అపూర్వమైనది రాధిక ఉపాఖ్యానము సుయజ్ఞుడను రాజేంద్రుని పరమాద్భుత చరిత్రను చెప్పాను. (17) తులసి కథను, అద్భుతమైంది చెప్పాను. మ హేశ శంఖచూడుల సంవాదము, వారి మహాయుద్ధము చెప్పాను. (18) తులసి కృష్ణుల సంవాదము వారి సంభోగము చెప్పాను. శంఖ చూడుని మరణము, శ్రీరాముని శాపమోక్షము చెప్పాను. (19) దేవతలకు పదప్రాప్తి. వారి బాధలుపోవటము చెప్పాను. జీవులకు మోక్షమునకు బీజాన్ని, ఇష్టమైన గంగ ఉపాఖ్యానాన్ని చెప్పాను. (20) మిక్కిలి ఆనందాన్ని పెంచే మనస కథను చెప్పాను. స్వాహాస్వధల కథను ఇతరమైన వానిని చెప్పాను. (21) చెప్పేదానిలో వినేవారి ప్రశ్నననుసరించి ప్రాసంగిక కథను చెప్పాను. ఇది ప్రకృతి ఖండము. గణపతి ఖండాన్ని విను. (22) చాలా రమ్యమైనది, మధురమైనది అడుగడుగునా రుచికరమైనది రుచికరమైనది (చెవులకు) అది పురాణములలో చాలా గోప్యమైనది చాలా రమ్యమైనది, నిత్యనూతనమైనది. (23) ఈ ఉపాఖ్యానము చాలా దుర్లభమైనది శ్రోతలకు మిక్కిలి ప్రీతిని చేసేది. పార్వతీపరమేశుల పరమైన క్రీడను చెప్పాను. (24) తొలుత వారి క్రీడాభంగము, పిదపస్కందుని ఉత్పత్తి పిదప పార్వతిని సంతోష పెట్టుట. ఆమె అభిమానాన్ని తొలగించుట చెప్పాను. (25) పుణ్యకవ్రతాన్ని, విష్ణువు, దేవివారల ఉత్తమ చరిత్రను చెప్పాను. మంచివ్రతముగల పార్వతికి హరి వరదానమివ్వటము చెప్పాను. (26) బ్రాహ్మణ అతిథిరూపంగా హరిదర్శనము చెప్పాను. శివమందిరంలో దయతో గణేశుని ఆవిర్భావము. (27) పార్వతీపరమేశులు పుత్రుని ముఖాన్ని చూడటము పరమానంద రూపంగా శివుని ఇంట్లో గొప్ప ఉత్సవం జరగటము, (28) దేవతలు మొదలైన వారంతా ఆ పిల్లవాడిని చూడటము చెప్పాను, ఆ బాలుడు నిత్యుడు, అజుడు, విభువు. సత్యస్వరూపుడు, పరముడు, పరబ్రహ్మ స్వరూపుడు (29) అన్ని విఘ్నములను హరించేవాడు శాంతుడు అన్ని సంపదలనిచ్చేవాడు. తపస్సులకు జపయజ్ఞములకు వ్రతములకు ఫలాన్ని ఇచ్చేవాడు, విభువు.
అను ॥ మిక్కిలి కమనీయమైనది. స్త్రీలకు రమణీయమైనది. పార్వతీపరమేశులకు ప్రాణముకన్న అధికమైనది, ప్రియతమమైనది. (31) పరమాత్మస్వరూపము. భగవంతము (ఐశ్వర్యం). సనాతనము. అన్నిటికి ఈశము, అన్నిటికి బీజము. సాక్షాత్తు నారాయణాత్మకము. (32) ఆతని దర్శనం వలన స్తవనం వలన, ప్రణామం వలన, పూజనం వలన పాపానాశనమౌతుంది. ఆతడు ధ్యానమునకు అసాధ్యుడు, ఆరాధనం చేయటం కష్టం అతని వల్ల కోటి జన్మల పాపం నశిస్తుంది. (33) కార్తికుని ఉద్దరణము ఆతని అభిషేకము చెప్పాను గణేశ పూజ వల్ల అన్ని విఘ్నములు నశిస్తాయి. (34) కార్తవీర్యార్జునునితో జమదగ్నియుద్ధము, సురభిని హరించుట, మునియొక్క మరణము (35) పతివ్రతయైన రేణుక యొక్క చితి ఆరోహణము, దారుణము, చాలా దారుణము ఐన భృగువు (పరశురాముని) ప్రతిజ్ఞ చెప్పాను. (36) " ఓద్విజ! ఇరవై యొక్క మారులు క్షత్రియులు లేకుండ చేయుట, సంవాదము, గణేశపరశురాముల వాదముతో జ్ఞానలాభము (37) వారి దారుణమైన యుద్దము హేరంబుని పన్ను (దంతము) విరుగగొట్టుట, దుర్గ విలాపము, ఆమె భార్గవుని శపించుట (38) పరశురాముని స్మరణతో హరి ఆవిర్భవించుట, స్వయంగా ప్రభువు నారాయణుడు పార్వతికి బోధించుట (39) పరమాశ్చర్యకరమైన, ఇష్టమైన శివలోక వర్ణనము, శంకరుడు మహాస్త్రాన్ని పరశురామునకిచ్చుట (40) మంత్రము, కవచము ఇచ్చుట, పరమాత్మయైన కృష్ణుని వరదానము, అభయదానము అన్ని సంపదలనిచ్చుట, (41) చెప్పాము. ఆతడు ఇరవై ఒక్క మారులు రాజులనుచంపాడు. ఓవిప్ర! భృగునివల్ల భూమియొక్క భారమును హరించుట జరిగింది. (42) ప్రశ్నించే క్రమాన్ననుసరించి పూర్వకథ చెప్పబడింది. ఓద్విజోత్తమ! ఈ విధంగా సంక్షిప్తంగా గణపతి ఖండం చెప్పాను. (43) శ్రీకృష్ణు జన్మఖండాన్ని సావధానంగా విను. జన్మమృత్యుజరావ్యాధులను తొలగించేది, మోక్షమిచ్చేది, పరమైనది (44) హరిదాస్యాన్ని కూర్చేది, శుద్ధమైనది. వినసొంపైనది. అమృతము వంటిది. చాలా అపూర్వమైనది ఈ కథ చాలా .రమ్యమైనదీ. నిత్యనూతనమైనది.
జన్మనుండి వినని విషయాన్ని విన్నాను. అడుగడుగునా రుచికరము, రుచికరము. అన్ని ప్రాణులకు దీపం వంటిది. పరమైనది. సంసార సముద్రాన్ని దాటించేది. (46) కర్మలను అనుభవించటమనే రోగాలను నశింపచేసే రసాయనము. శ్రీకృష్ణుని చరణాంభోజములను పొందటానికి మెట్టులా కారణమైనది . (47) ఓద్విజ! దారుణమైన శ్రీరామ, రాధ వీరల కలహవర్ణనము, వారి శాపాన్ని చెప్పటము ఆపై వారిని విడిచి పెట్టుట చెప్పాను. (48) బ్రహ్మప్రార్ధించాకనే భూమి పై హరి అవతారము. పరమ అద్భుతమైన జన్మఖండాన్ని చెప్పాను. (49) వసుదేవుని మందిరంలో హరి జన్మ. కంసుడనే రాక్షసుని భయంతోనే హరిగోకులానికి వెళ్ళటము. (50) శ్రీరాముని శాపకారణంగా వృషభానుని సుతగా రాధ జననము చెప్పాను. గోకులంలో పరమాత్మయొక్క బాలక్రీడా వర్ణన చెప్పాను. (51) హరిదైత్యాదులను చంపటం చెప్పాను. గర్గుడు రావటము, హరికి శుభమైన అన్నప్రాశన చెప్పాను. (52) పూతనవధ. క్షణంలో శకటుని భంజించుట, శ్రీకృష్ణుని బంధనము మోక్షణము, యమల అర్జునుల భంజించుట. (53) ముఖంలో ముల్లోకాలను చూపుట, గోవత్సుని హరించుట, గోవత్సముల నిర్మాణము చేయుట చూచి హరిని బ్రహ్మ స్తుతించుట. (54) త్వరగా గోకులాన్ని విడిచి పుణ్యమైన బృందావన వనానికి, వెళ్ళుట, కొడుకుతో పాటు భయంతో నందుడు వెళ్ళుట (55) చెప్పాను. బృందావన నిర్మాణాన్ని పరమాద్భుతమైన దానిని చెప్పాను. పిల్లలతో పాటు హరి ఆటలాడుట (56) హరి, బ్రాహ్మణస్త్రీల మంచి ఆహారాన్ని తినుట చెప్పాను. వారికి వరమిచ్చుట, ప్రాక్తన బంధంగా నిరూపించుట (57) క్రతువుల వర్ణన. వస్త్రాపహరణము, ఓద్విజ కృష్ణుడేగోపికలకు వరదానమిచ్చుట చెప్పాను. (58) కాత్యాయనీ వ్రతము, శ్రీదుర్గా పూజనము చెప్పాను. యమున ఒడ్డుయందు గోపికలకు పార్వతి వరమిచ్చుట చెప్పాను.(59) తాళముల (తాటిపండ్ల) భక్షణము, శక్రుని యాగాన్ని నశింపచేయుట చెప్పాను. రాధకృష్ణుల విరహము తిరిగి రాధతో కృష్ణుడు కలియుట చెప్పాను.
అను ॥ గోపికల క్రీడను చెప్పాను. కృష్ణుని రొమ్ములో రాధిక ఉన్న విషయంచెప్పాను. రాపాణుని గృహమందు ఛాయ ఉండటము ఇదంతా హరిమాయ అని చెప్పాను. (61) రాసమండలమందు ఆతనినుంచుకొని షోడశవిధ (పదహారు) శృంగారాన్ని ఆచరించటం చెప్పాను. రాధతోకూడా హరి కాననంలో అంతర్థానమందటము చెప్పాను. (62) ద్విజోత్తమ! ఆమెతో కలిసి మలయానికి రావటం చెప్పాను. ఆనిర్జనంలో రాధామాధవుల సంవాదాన్ని చెప్పాను. (63) ఓముని! గోపికలకు కల్గిన నానావిధమైన కైవల్యాన్ని చెప్పాను. తిరిగి పుణ్యమైన బృందావనవనానికి రావటము చెప్పాను. (64) శ్రీకృష్ణుని దర్శనము గోపికల ఆనందాన్ని పెంచింది. ఆతడు జలంలో స్థలంలో చేసిన రకరకాలైన క్రీడలను చెప్పాను. (65) గోపికల సౌభాగ్యాన్ని విశేషమైన రాధాసౌభాగ్యాన్ని విస్తరంగా చెప్పాను. ఆసౌందర్యము చాలా రమ్యమైనది. నిత్యనూతనమైనది. (66) ఆకాశమందున్న దేవతలు చూడటము చెప్పాను. దేవేరుల రాసమండలమందు మనస్సు స్టలించటము. (67) దేవేరులు అంశంగా జన్మనందటము, ఓద్విజ! ఇదంతా చెప్పాను. అక్రూరుడు రావటము గోపికల విలాపము. (68) అక్రూరుని భయ పెట్టటము అంతా క్రమంగా చెప్పాను. విష్ణువు మథురకు రావటము, గోకుల వాసుల శోకము (69) రాధిక యొక్క విరహజ్వాలల సమూహము అంతా తగిన విధంగా చెప్పాను. అక్రూరునకు యమున ఒడ్డున తన మూర్తి చూపటము, (70) మథురలో ప్రవేశము రజకుని చంపటము చెప్పాను. కుజ్జతో సంభోగము, ఆమెకు మోక్షమిచ్చుట చెప్పాను. (71) కువిందుని అనుగ్రహించుట మాలాకారునకు మోక్షము శివుని ధనుస్సును ' విరుచుట, ఏనుగులను చంపుట (72) సభలో ప్రవేశించుట, ఆనేక రూపములను ప్రదర్శించుట చెప్పాను. కంసుని చంపుట ఆతని బంధువులు ఏడ్చుట చెప్పాను. (73) అతనిని శాస్త్ర ప్రకారము సత్కరించుట, ఆతని తండ్రి రాజగుట, నందుని దుఃఖము, పరమఅద్భుతమైన ఆతని స్తోత్రము చెప్పాను. (74) నిర్జనమైన చోట తండ్రీకొడుకులైన వారి సంవాదముచెప్పాను. విభువు, వందునకు ఉత్తమమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చాడు. (75) మునులు వెళ్ళిపోవటము, ధన్య ఉపాఖ్యానము కుమారుడు చెప్పింది, చాలా దుర్లభమైన దాన్ని చెప్పాను. (76) నిర్జనమైన రాధ ఉన్న ప్రదేశానికి ఉద్ధవుడు రావటము చెప్పాను. వారి సంవాదములో శుభావహమైన జ్ఞానాన్ని చెప్పాను. (77) గురుని గృహమందు కృష్ణునకు యజ్ఞోపవీతం వేయటం, విద్యను ఇవ్వటము చెప్పాను. ఇదివరలోనే, తన గురువునకు మృతపుత్రుణ్ణి తెచ్చి ఇచ్చాడని చెప్పాను.
జరాసంధుని అణచుట, యవనునివధ, ద్వారక నిర్మాణము, 'విశ్వకారుని (కర్మ) ప్రయత్నము (79) ద్వారకలో ప్రవేశించుట, ఉగ్రసేనుని విలాపము చెప్పాను. రుక్మిణిని హరించుట రాజులనణచుట (80) స్త్రీలనందరిని వివాహమాడుట చెప్పాను. మాయావతికి మోక్షము శంబరునీవధ (81) ధర్మపుత్రుని రాజసూయ యాగమందు శిశుపాలునికి మోక్షమిచ్చుట, దంతవక్రునకు మోక్షము, శాల్వుని వధ చెప్పాను, ఓముని! (82) మణిని హరించటము, స్వర్గం నుండి పారిజాతపుష్పాన్ని తేవటము, కురుపాండవులయుద్ధంతో భూభారాన్ని తగ్గించటము చెప్పాను. (83) ఉషాపహరణము బాణునిచేతులను కోసివేయుట, బలి చేసిన స్తుతి, అనిరుద్ధుని పరాక్రమము చెప్పాను. (84) రాధయశోదల సంవాదమును, పరమదుర్లభమైన దానిని చెప్పాను. పరమ అద్భుతమైన శృగాలుడను వానికి ముక్తిని చెప్పాను. (85) తీర్థయాత్ర ప్రసంగంతో గణేశుని పూజకు,రాధికతో పాటు పరమాత్మయైన కృష్ణుని దర్శనాన్ని చెప్పాను. (86) రాధాదేవి దర్శనము రాధయొక్క తేజః ప్రకాశనము తీర్థమందు రాధతో తిరగటము, రమించటము రహస్య స్మరణము చెప్పాను. (87) ఓశౌనక! బ్రహ్మ శాపంతో యదువంశీయుల నాశనము, పాండవుల మోక్షము, హరితన స్థానానికి వెళ్ళటము చెప్పాను. (88) నారదుని వివాహము, వహ్నిసువర్ణముల ఉత్పత్తి ఇవన్నీ మళ్ళీ సంక్షిప్తంగా చెప్పాను, ఓమహాభాగ! (89) బ్రహ్మవైవర్త పురాణము నాలు భాగములు. ఇకముందు ఇంకా ఏమి వినదలిచావు, ఓమునిశ్రేష్ఠ! (90) అని బ్రహ్మవైవర్త మహాపురాణమందు శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధ మందు నారాయణ నారద సంవాదమందు అనుక్రమణిక అనునది నూటముప్పది రెండవ అధ్యాయము.
