4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము
85 - అధ్యాయము
మూ॥ నంద ఉవాచ:
శ్రీభగవానువాచ –
అను ॥ నందుడిట్లన్నాడు : ఇప్పుడు నాలు- వర్ణముల వారికి తినతగినది, తినతగనిది చెప్పండి. ప్రాణులన్నింటి కర్మ విపాకాన్ని చెప్పండి (1) కారణములన్నిటికి కారణమైన దానిని చెప్పండి, ఓ మహాభాగ! నీకన్న ఇతరులను ఎవరిని అడగను. పూర్తిగా, ఈశ్వరునిగా ఉన్న నిన్నే అడుగుతాను. (2) శ్రీ భగవానుని వచన మిట్లా - నాలుగు వర్ణముల వారికి తినతగిన, తినతగని వాటిని, తగినట్లుగా, వేదంలో చెప్పిన దానిని, చెబుతాను, సావధానంగా వినండి, ఓ తండ్రి! (3) ఇనుపదానిలో ఆవు పాలు త్రాగుట, సిద్దమైన అన్నము తినుట. వెలివేయబడ్డ మొదలగు వారి తేనె, బెల్లము, కొబ్బరి నీరు (4) పండ్లు గడ్డలు, ఏదైనా తినతగనివి అని మనువు చెప్పాడు, మాడిన అన్నము, కాల్చిన పులియబెట్టిన నీళ్ళు, తినతగనివి (తాగ) అని బ్రహ్మ ఏర్పరచాడు. (5) కాంస్య పాత్రలో కొబ్బరినీళ్ళు, రాగి పాత్రలోని తేనె రాగిపాత్రలోని ఆవుపాలు ఇవన్ని మద్యంతో సమానము, నేయి మాత్రం మద్యం కాదు. (6) తామ్రపాత్రలో పాలు తాగటం, ఎంగిలిదైననేయి అన్నాన్ని తినటం, ఉప్పుకలిసిన పాలు, ఇవన్ని వెంటనే గోమాంస భక్షణ ఫలాన్నిస్తాయి. (7) తేనె కలిసిన నెయ్యి, నూనె, బెల్లము, దారము కలిసిన అల్లము (అల్లిత్రాడా!) తినరాదని శ్రుతిలో చెప్పారు. (8) తాగగా మిగిలిన నీరు, మాఘమాసంలో మూలకములు, పడకలో జపము, వీటిని తెలివి కలవాడు ఎప్పుడూ విడువాలి. (9) పగటిపూట, రెండుసార్లు భోజనము, సంధ్యాకాలములో భోజనము, తెల్లవారుఝామున తినటము వీటిని బుద్దిమంతుడు తప్పక విడువాలి. (10) నీరు, పాయసము, పొడి, నెయ్యి, ఉప్పు, మంగళవస్తువు, బెల్లము, పాలు, చల్ల,తేనె (11) ఒకరిచేతి నుండి మరొకరు తీసుకుంటే అవి వెంటనే గోమాంసమౌతాయి. వెండిపాత్రలోని కర్పూరము తినరాదని వేదాభిప్రాయము. (12) సంచారం చేసేవాడు, తినువానిని ముర్రే, ఆ అన్నము తినరాదు అని అందరన్నారు. (పరివేత్తయా) (13) ముంగిస, గండకమృగము, దున్నపోతు, పక్షులు, పాములు, పందులు, గాడిదలు, (14) పిల్లులు, నక్కలు, కోళ్ళు, ఓవ్రజేశ్వర! వ్యాఘ్రములు, సింహములు వీని మాంసాన్ని నరులు ఎప్పుడు తినరాదు (15) నీటిలో ఉండేవాని, మొసళ్ళ, ఉడుముల, కప్పల, ఆడ ఎండ్రకాయల (లేదా కక్కెర) పక్షి. చుంచుకముల (16) గోవుల, చమరీ మృగముల, ఏనుగుల, గుర్రముల, నరుల,రాక్షసుల మాంసమును కలిలో తినరాదు, నిశ్చయము.
అను ॥ అడవియోగ, దోమ, ఈగ, చీమ, నిషిద్ధములైన ఇతరములైన వానిని లోకంలో, వేదంలో చెప్పబడ్డవానిని తినరాదు, ఓ ప్రజేశ్వర! (18) కోతులు, ఎలుగుబంట్లు, శరభములు, మృగనాభులు, గాడిదలు వీని మాంసం నిషిద్ధము. (19) బర్రెపాలు, పెరుగు, నెయ్యి తినకూడదు. స్వస్తికము (బొట్టు) అట్లాగే బ్రాహ్మణుల వెన్న తాకరాదు. (20) గుఱ్ఱపు మాంసము, పాలు మొదలగునవి తినరాదు. నాలుగు వర్ణముల వారికి తినతగనివి అని శ్రుతిలో తెలిపారు. (21) ఆదివారము రోజున అందరు అల్లం తినరాదు. పాచినీరు, అన్నము, బ్రాహ్మణుల పాలు (22) నాలుగు వర్ణముల వారు, సంతానములేని వారి అన్నమును తినుటకూడదు. ఆ అన్నము సురతో సమానము, గోమాంస భక్షణము కన్న ఎక్కువ. (23) బ్రాహ్మణుడు, జ్ఞానదుర్బలుడై సంతానం లేని వారి అన్నం తింటే వాడు చేసిన పితృదేవ అర్చనము నిష్ఫలము, అని మనువన్నాడు. (24) బ్రాహ్మణులు వైష్ణవులు చేపలు తినరాదు. ఇతరులు ఐదు పర్వదినములలో తినరాదు, నిశ్చయము (25) పితృదేవతల అవశేషమైన మాంసాన్ని తినవచ్చును తప్పుకాదు. ఐదు పర్వదినములలో అందరూ తినరాదు అని మనువు చెప్పాడు. (26) సంస్కరించకుండా ఉప్పును, నూనెను తినరాదు. అగ్ని సంస్కృతమైన వ్యంజనము అందరికి పవిత్రమైనది, తినతగినది. (27) ఒక చేతిలోనే నీరు, నేయి తినరాదు, అందరంగీకరించినది. కలుషితమైనది, పురుగులుకలది, అపరిశుద్దమైనదీ, నిర్మలం కానిది (28) బ్రాహ్మణులు, వైష్ణవులు విశేషించి తినరాదు. హరికి నివేదించని దానిని యతి బ్రహ్మచారి తినరాదు. (29) చీమలు గల తేనె, ఆవునేయి వగైరా, బెల్లము ఏకొంచం వస్తువైనా, ఓ తండ్రి! తినరాదు, అని శ్రుతిలో విన్పిస్తోంది. (30) పక్షులు తిన్న, పురుగులు తిన్న, శుద్ధమైన పండిన ఫలాన్నైనా కాకి తిన్నదాన్నైనా ఎవ్వరూ తినరాదు. అవి ముట్టిన వస్తువైనా (పదార్దము) తినరాదు. (31) నేయితో వండిన, నూనెతో వండిన శూద్ర సంస్కారము పొందిన మధురము బ్రాహ్మణుడు తినరాదు. శూద్రుని భక్ష్యమైన పీఠకమును తినరాదు. (32) అశుచులైన వారి అందరి నీరును, అన్నమును విడిచి పెట్టాలి. ఆశౌచం చివరి తరువాత, తరువాత రోజున అవి శుద్దము స్వీకార్యము. అనుమానంలేదు. (33) కర్మ పరిపాకము 'చాలా దుష్కరమైనది, అని శ్రుతిలో చెప్పారు. ఓ ప్రజేశ్వర! తినతగిన, తినతగని వాటిని గూర్చి నాకు తెలిసినంత చెప్పాను. (34) క్రమంగా నాలుగు వేదములలో చెప్పిన నాలుగు మతములను, అన్నిటి సారాన్ని చెప్తాను విను. ఓ తండ్రి! (35) శతకోటి కల్పముల కాలానికైనా కర్మ అనుభవించకుండా, క్షీణించదు. శుభమైనా, అశుభమైనా చేసిన కర్మను తప్పకుండా అనుభవించాలి. (36) తీర్దముల,దేవతల సహాయము నరుల సహాయము ఉండదు. అంతటా శరీర భాగాలతో కొద్ది సాహాయ్యం లభిస్తుంది.
తీర్థయాత్రలు చేసినా అవి నాకు వ్యతిరేకమే, నిశ్చయము. ఓ తండ్రి! కల్లుకుండను నదులు పవిత్రం చేయనట్టే, పవిత్రం చేయవు. (38) ప్రాయశ్చిత్తం వల్ల కలిగే పుణ్యంతో మానవులు పరిశుద్ధులుకారు. ఓ వైశ్యేంద్ర! అన్ని ఆరంభములతో దానంతో కాని యోగంతో కాని (39) శుభాశుభమైన కర్మఏదైనా అనుభవించకుండా నాశమందదు. అనుభవంతో పరిశుద్దినందుతాడు. ఆపై నరులకు ముక్తి లభిస్తుంది. (40) పుణ్యకర్మతో పాపకర్మ నశించదు. చేసిన దుష్కర్మతో సుకృతకర్మ నశించదు. (41) యజ్ఞము, తపస్సు, వ్రతము, నిరాహారము, తీర్థస్నానము, దానము, జపము, నియమము (42) భూప్రదక్షిణము, పురాణశ్రవణము, ఉపదేశము, పుణ్యము, పూజ్య గురు దేవతలది (43) స్వధర్మాచరణము, అతిథి పూజ, బ్రాహ్మణ పూజ, విశేషించి వారికి భోజనము. (44) బ్రాహ్మణునకు ఏదిస్తాడో అదిపూర్ణంగా ప్రాప్తిస్తుంది. ఆ దానము బీజరూపము, బ్రాహ్మణుడు క్షేత్రరూపము (పొలము) (45) ఓతండ్రి! ఏదేని ఒక కర్మతో నరుడు స్వర్గాన్ని పొందుతాడు. కర్మతో మోక్షంరాదు. అదినా సేవతోనే వస్తుంది. (46) మంచిపనితో స్వర్గము, చెడు పసితో నరకము వస్తాయి. వ్యాధి, యోనియందు జన్మకుత్సిత కర్మతో వస్తాయి ఆ పిదప శుచిత్వము. (47) కావాలని బ్రాహ్మణుల ఆవును చంపినవాడు ఉపపాతకి ఔతాడు. ఆవు వెంట్రుకలెన్ని ఉన్నాయో అన్ని సంవత్సరాల కాలము సర్పమౌతాడు. (48) ఆ సర్పాకారంతో, విషజ్వాలతో భక్షింపబడుతూ, దప్పిగొని, వ్యధనందుతూ ఆహారంలేక, శరీరం కృశించి (49) ఆ పైన కుండమునుండి లేచి (నిప్పుల గుండం) వెంట్రుకల సంఖ్యతో సమానమైన సంవత్సరాలు ఆవు అవుతాడు. ఆ పిదప కుష్టురోగి, చండాల నరుడుగా లక్ష సంవత్సరాలు ఔతాడు. (50) ఆ పైన కుష్టురోగి బ్రాహ్మణుడౌతాడు, కర్మతో, లక్షబ్రాహ్మణులకు భోజనం పెట్టి, వ్యాధిరహితుడై శుచియౌతాడు. (51) పొరపాటున ఐతే అందులో సగభాగము. క్షత్రియుని గోవును ఇష్టపూర్తిగా చంపితే అందులో (బ్రాహ్మణుని దానిలో) సగము. పొరపాటున చేస్తే అందులో సగభాగము వైశ్యుని గోవునైతే నాల్గవ భాగము (52) శూద్రుని గోవునైతే చంపితే అందులో సగభాగము పాపము అనుభవిస్తాడు, అనుమానము లేదు. ప్రాయశ్చిత్తంతో శుద్ధుడై మిగిలిన కర్మశేషాన్ని అనుభవిస్తాడు (53) అనుకల్పమందు పాపంలో నాల్గవ భాగాన్ని అనుభవిస్తాడు అనుమానం లేదు. గోహత్య చేసే బ్రాహ్మణులకు పాపము నాల్గురెట్లెక్కువ. (54) బ్రహ్మహత్యచేసిన వాడు, బ్రాహ్మణుడైనా ఇతరుడైనా పాపాన్ని అనుభవిస్తాడు క్రమంగా ఇట్లా తెలుసుకోవాలి ఇష్టపూర్తిగా ఐతే, ఇట్లా ఇష్టపూర్తిగా చేయకపోతే ఇట్లా అని (55) ప్రాయశ్చిత్తమంటే జన్మ, కర్మ వ్యాధియే అనుమానం లేదు. ఆవును చంపినవాడు (సవత్సరకాలము ఆవు కూడా ఔతాడు, నిశ్చయము. (56) బ్రహ్మ హత్య చేసినవాడు వారికన్న నాల్గింతలెక్కువ పాపిఔ తాడు. మలంలో పురుగౌతాడు. అదే సంవత్సరాలు నాల్గింతలుగా ఆ పై మ్లేచ్చుడౌతాడు. (57) ఆ పైన విప్రుడు, ముందు వారికన్న నాల్గింత లెక్కువ కాలము అంధుడౌతాడు. నాల్గు లక్షల బ్రాహ్మణులకు భోజనం పెట్టి శుచిమౌతాడు. (58) అతిపాతకం నుండి ముక్తుడై కళ్ళు గలిగి, కీర్తి కలవాడౌతాడు. నాలుగు వర్ణముల వారిలో స్త్రీ హత్యచేసిన వాడు అతి పొతకియే, వేదమందు ఇదే చెప్పారు.
అను ॥ హతురాలైన స్త్రీ వెంట్రుకలెన్నో అన్ని సంవత్సరాల కాలము కాలసూత్ర నరకానికి పోతాడు. ఆహారం లేక వ్యధ గలిగినవాడై పురుగులతో భక్షింపబడుతాడు. (60) ఆ పైన లోకంలో అన్ని సంవత్సరాలు పాతకి ఔతాడు. ఆ పైన ఆతడు పాపి ఔతాడు. కర్మవల్ల క్షయవ్యాధిగ్రస్తుడౌతాడు. (61) నూరు సంవత్సరాలు లక్ష బ్రాహ్మణులను భుజింపచేయాలి. ఆ పైన బ్రాహ్మణుడు శుద్దుడై, తపస్సుయందు నియతాత్ముడై (62) పాపశేషమును కొద్దిగా అనుభవిస్తాడు. స్వర్ణదానంతో శుచిఔతాడు. గర్భ పిండాన్ని చంపినవాడు మహాపాపి, ఆడ కుక్క ముఖాన్ని పొందుతాడు. (63) నూరు సంవత్సరాలు గుర్రమౌతాడు, నిశ్చయము. నూరు సంవత్సరాలు సూక్ష్మమైన శస్త్రంతో పీడింపబడి (64) ఆపై పాపి, ద్రవ్యంగల వైశ్యుడౌతాడు, కర్మవల్ల, ఏబది సంవత్సరాల వరకు బంగారు దానంచేసిన శుచి ఔతాడు (65) ఆపిదప తన కులంలో పుట్టినా, వ్యాధిలేక, బ్రాహ్మణుగా, శుచిగా ఉంటాడు. బ్రాహ్మణుడు క్షత్రియుణ్ణి చంపినా, క్షత్రియుడు యుద్ధం లేకుండా క్షత్రియుణ్ణి చంపినా (66) వేయి సంవత్సరాలు తప్తశూలాన్ని పొందుతాడు (కాల్చిన శూలం) కాలిన లోహంతో బాగా కాల్చబడి ఆర్తనాదాన్ని చేస్తాడు. (67) ఆ పిదప నూరు సంవత్సరాలు మదించిన ఏనుగౌతాడు. ఆ పైన, రక్తరోగియై నూరు సంవత్సరాలు శూద్రుడౌతాడు. (68) ఆపిదప ద్విజుడు వ్యాధితుడైన వాడు గజదానంతో ముక్తుడౌతాడు. వైశ్యుని చంపిన వైశ్యుడు శూద్రుని చంపిన వైశ్యుడు (69) వైశ్యుని చంపిన శూద్రుడు వీరంతా ఒకే రకమైన పాపాన్ని పొందుతారు, నిశ్చయము. నూరు సంవత్సరాలు, క్రిముల కుండాన్ని పొందుతాడు. (70) పురుగులతో భక్షింపబడి, దుఃఖితుడై ఆ పైన కిరాతుడౌతాడు. నూరు సంవత్సరాలు క్రిముల వ్యాధికలవాడై (71) ఆ పైన మందగించిన జఠరాగ్ని కలవాడై బ్రాహ్మణుడు దైన్యం కలవాడౌతాడు, ఓ ప్రజ! ఏబది సంవత్సరాల వరకు దుర్బలుడు, కడుపు లోపలికి పీక్కుపోయి ఉంటాడు. (72) తగిన విధంగా, తీర్థంలో గుర్రం దానం చేయటం వల్లను ముక్తి నందుతాడు. ఇచ్ఛాపూర్వకంగా లేదా పొరపాటుననైనా బ్రాహ్మణుడు శూద్రుని చంపితే (73) గాయత్రిని లక్షన్నర జపిస్తే (అరలక్ష) శుచిమౌతాడు. నాలు వర్గాల వారు కోడిని చంపితే శివునితో శపింపబడి, (74) నూరు సంవత్సరాలు రౌరవ నరకాన్ని పొందుతారు. పదహారు సంవత్సరాలు కోడి జీవితాన్ని అనుభవిస్తాడు. (75) ఆ పిదప, కుక్కుటంతో తినబడి విప్రుడౌతాడు. గంగాస్నానంతో, బంగారందానం చేయటంతో శుచి ఔతాడు. (76) పిల్లిని చంపిన నాలు వర్గాలవారు, గంగాస్నానంతో శుచులౌతారు. బ్రాహ్మణునకు ఉప్పుదానం చేస్తే ఆరుపలముల భాగం చేస్తే ముక్తులౌతారు. (77) నాల్లువర్ణాలవారు, పామును నా కాలి గుర్తు గలదాన్ని చంపితే, బ్రహ్మహత్యపాతకంలోని నాల్గవ భాగం పాపాన్ని పొందుతారు. నిశ్చయము.(78) నూరు సంవత్సరాలు అసిపత్రమనే నరకాన్ని పొందుతారు. తీక్షణమైన అంచుగల అసిపత్రంతో కోయబడి యాతనాయుక్తుడౌతాడు. (79) ఆ పైన ఐదు సంవత్సరాలు డుండుభమనే పాము ఔతాడు.(రెండు తలలది). నరులు కొడ్తుంటే దుఃఖం పొందుతాడు. పీడింపబడి మరణిస్తాడు. (80) ఆ పిదప, పాపాత్ముడు, జ్వరంగలవాడు, దుర్బలుడు ఐన నరుడౌతాడు కర్మవల్ల ఐదు సంవత్సరాలలోనే మరణిస్తాడు. (81)
ఆ పిదప ఏనుగుకాని గుర్రం కాని ఔతాడు, ఓ వ్రజేశ్వర! ఇరువది సంవత్సరాల వరకు అట్లా ఉండి, ఆపై శూద్రుడౌతాడు, నిశ్చయము. (82) అహంకారము, వ్యాధి కలవాడై, వెండిదానం చేసిముక్తుడౌతాడు నూరుగురు బ్రాహ్మణులను భుజింపచేసి శుచిమౌతాడు. (83) క్షుద్రజంతువులను చంపిన నరుడు క్షుద్ర జంతుడౌతాడు,నూరు సంవత్సరాలు క్షుద్ర వ్యాధితో బాధపడి, ఆపై తరిస్తాడు. (84) హింసించని జంతువుల పై ఎప్పుడు సజ్జనుడు దయచూపాలి. ఓ వ్రజ్వేర! హింసించే జంతువులను హింసించటంలో దోషం లేదు. (85) నాలువర్ణముల వారెవరైనా అశ్వత్థవృక్షాన్ని కొట్టేస్తే బ్రహ్మ హత్యాపాపంలో నాల్గవ భాగం పాపం పొందుతారు. ఓ తండ్రి! అసిపత్ర నరకానికి పోతారు, నిశ్చయము. (86) తీక్షణమైన శస్త్రముతో, రాత్రింబగళ్ళు కోయబడుతూవాడు, నూరు సంవత్సరాలు, పరమ యాతనను అనుభవిస్తాడు. (87) ఆ పిదప బూరుగు వృక్షమౌతాడు, లక్ష సంవత్సరాలుంటాడు. ఆ పిదప ఛిన్నమైన అవయవములు కలిగి, రోగం కలిగిన శూద్రుడౌతాడు. (88) బ్రతికినంతకాలం అట్లా గడిపి ఆ పిదప బ్రాహ్మణుడౌతాడు, నిశ్చయము. వ్రణములు వ్యాధికలవాడై, బంగారం దానం చేస్తే ముక్తుడౌతాడు. (89) కూటసాక్ష్యం ఇచ్చేవాడు, కృతఘ్నుడు, అతికృతఘ్నుడు, విశ్వాసఘాతి, మిత్రఘ్నుడు, విప్రుల ధనం హరించేవాడు. (90) శూద్రునిశ్రాద్ద అన్నమును తినేవాడు, శూద్రుని శవం కాల్చేవాడు, శూద్రులకు వండి పెట్టేవాడు, ఎద్దులను నడి పేపాతకి (91) చాకలి, దేవలుడు (నంబి, తంబళి) వీరంతా అతి పాపులు. వీరు వేయి సంవత్సరాలు కుంభీపాక నరకంలో ఉంటారు. (92) అక్కడే కాగిన నూనెతో రాత్రింబగళ్ళు కాల్చబడుతూ, సర్పాకారం గలజంతువుతో తినబడుతూ, రోగగ్రస్తుడై ఉంటాడు. (93) వేయికోట్ల సంవత్సరాలు గద్దఔతాడు. పది జన్మలు పంది ఔతాడు. నూరు జన్మల వ్యాఘమౌతాడు. ఆ పిదప శూద్రుడు రోగిష్ఠిఔతాడు. (94) ఆకలి మందగించి, జ్వరం కలిగి ఏబది సంవత్సరాలుంటాడు. నూరు పలముల సువర్ణదానం చేసి శుద్ధుడౌతాడు, నిశ్చయము. (95) నాల్గు వర్ణముల వారు వస్త్రం హరించేవారు, గోవుల హరించే మానవులు, వెండి ముత్యములు హరించేవారు, శూద్ర ద్రవ్యాన్ని హరించేవారు (96) వేయి సంవత్సరాలు కొంగజాతి వారౌతారు, నిశ్చయము. నూరు సంవత్సరాలు మూత్రకుండాన్ని భుజించి (97)ఆ పిదప నూరు సంవత్సరాలు శూద్రజాతి వాడౌతాడు. ఓ ప్రజ! కుష్టువ్యాధి కలిగి, రసికారుతుండగా, పాతకియై (98) ఆ పిదప, కుష్టు అవశేషం కలిగి (మరుజన్మలో) బ్రాహ్మణుడౌతాడు ఆరుపలముల బంగారాన్ని దానం చేసి రోగం నుండి ముక్తుడై శుచిమౌతాడు.(99) కోశము (ధనం) నపహరించువాడు. పండ్లను హరించువాడు, యక్షుడు భూమి పై పుట్టి, విలాసానికై ద్రవ్యాన్ని అపహరిస్తూ (100) నూరు సంవత్సరాలు చాష పక్షిఔతాడు, నిశ్చయము (పాలపిట్ట) ఆ పిదప నల్లని వర్ణంతో శూద్రుడై భారత భూమి యందుపుర్తాడు (101) ఆ పిదప బ్రాహ్మణుడౌతాడు. అనేక జన్మలెత్తి, అధికాంగములు కలవాడౌతాడు, మళ్ళీ బ్రాహ్మణ జన్మనెత్తి విప్రభోజనం వల్ల (భుజింపచేసి) ముక్తుడౌతాడు (102) పండిన ద్రవ్యాన్ని హరించేవాడు పశుయోనియందు జన్మిస్తాడు, నిశ్చయము. అండకోశములో గంధము కలిగి, కస్తూరి అని పేరుగలిగిన (103) మృగంగా ఏడు జన్మలెత్తి ఆ పిదప గంధకుడౌతాడు, ఒక జన్మ. తరువాతి జన్మలో రసికారుతున్న కుషువు గల శూద్రుడౌతాడు.
ఆ పిదప మిగిలిన రోగంతో ఉండి, కృశించిన బ్రాహ్మణుడౌతాడు.ఆరుపలముల బంగారం దానం చేస్తే ముక్తుడౌతాడు, అనుమానం లేదు. (105) ధాన్యమునపహరించిన వాడు,దుఃఖంతో కృపణుడై ఏడు జన్మలెత్తుతాడు. నూరు సంవత్సరాలు మల కుండ మును చేరి, భయంతో విడువబడుతాడు (106) బంగారం దొంగతనం చేసినవాడు, కుషుగలనరుడై పతితుడౌతాడు. స్వర్ణ దానాన్ని తీసుకున్నవాడు మల కుండమును చేరుతాడు (107) ఆ పిదప నూరు సంవత్సరాలు, రాత్రింబగళ్ళుపురీషను తిని ఆ పిదప వ్యాధుడుగా శూద్రుడౌతాడు, రక్త సంబంధి రోగముంటుంది (108) ఆ జన్మపాతకమును అనుభవించి తిరిగి బ్రాహ్మణుడౌతాడు. వ్యాధి శేషాన్ని కలిగియుండి, బంగారము దానం చేసినట్లైతే ముక్తుడౌతాడు (109) చేరరాని వారిని చేరితే ముందు చెప్పిన రౌరవనరకానికి వెళ్తాడు లెక్కలేనన్ని సంవత్సరాలు మహాఘోరమైన కుంభీపాక నరకాన్ని పొందుతాడు (110) ఆ పిదప కులటాస్త్రీల యోనులందు పురుగుగా జన్మిస్తాడు సహస్ర వర్షాలుండి ఆపై లక్ష సంవత్సరాలు మలంలో పురుగౌతాడు. (111) ఆపై పశుయోనిలోను, ఆపై క్షుద్రజంతువుగాను, ఆపై మేచ్ఛజాతివానిగాను ఆ పై శూద్రులలో అధమునిగాను (112) ఆపై విప్రునిగాను, రోగంతో, నపుంసకుడై జన్మిస్తాడు, తిరగి బ్రాహ్మణుడై, తీర్థయాత్రచేసి, (113) క్రమంగా శుద్ధుడౌతాడు, పాతకం వల్ల వంశహీనుడౌతాడు. లక్ష బ్రాహ్మణులకు భోజనం పెట్టి శుచియై పుత్రుని పొందుతాడు (114) కోపంగల నరుడు ఏడు జన్మలు గాడిదౌతాడు. తగాదాలు పెట్టుకునేవాడు ఏడు జన్మలు కాకి ఔతాడు (115) శాలగ్రామమును దానంగా స్వీకరించినవాడు యమపాశానికి గురౌతాడు కాలసూత్ర నరకానికి పోతాడు. నిశ్చయము. ఆపై నూరు సంవత్సరాలు కాటుక పిట్టఔతాడు (116) లోహాన్ని దొంగిలించినవాడు వంశహీనుడౌతాడు, బొగ్గు (సిర) దొంగిలించినవాడు కోకిల ఔతాడు. కాటుక దొంగిలించినవాడు చిలుక ఔతాడు తీపి ఆహారాన్ని (చక్కరపొంగలి) దొంగిలించినవాడు పురుగుఔతాడు.(117) విప్రద్వేషి, గురుద్వేషి వీరలు శిరస్సులు (లో) గల కృమి( పేను) ఔతాడు. కులటయైన స్త్రీని అనుభవించి గౌరవ నరకానికి పోతాడు, ఓ తండ్రీ! (118) ఆ పై వ్యర్థంగా పురుగై నూరు సంవత్సరాలుంటాడు. ఆ పై విధవగా, గొడ్రాలిగా ఏడు జన్మలుంటాడు. (119) అస్పృశ్యస్త్రీగా జాతిహీనురాలిగా,ముక్కుకోయబడిన స్త్రీగా క్రమంగా ఔతాడు. ఎర్రని వస్తువును దొంగిలించినవాడు రక్తదోషం (రోగం) కలవాడౌతాడు (120) ఆచారహీనుడు యవనుడుగా హింసించేవాడు కాటుక పిట్టగా ఔతాడు. దీక్షితుడుగా కొనివాడు, ఎప్పుడూ తిరిగేవాడుగా (వం)దుష్టమైనది చూసేవాడు, అడవి మనిషిగా (121) అహంకారి, చెవులు లేనివాడుగా, వేదనిందకుడు చెవిటివానిగా ఔతారు. వాక్యం హరించేవాడు మూగగా, హింసకుడు వెంట్రుకలులేనివాడుగా ఔతారు. (122) అబద్దాలాడేవాడు మీసాలు, గడ్డంలేనివాడుగా, చెడుమాట్లాడేవాడు, పళ్ళులేనివానిగా, సత్యంను దాచేవాడు నాలుకలేనివానిగా, దుష్టుడు అంగుళులు లేని వారుగా జన్మిస్తారు (123) గ్రంథములు అపహరించేవాడు మూర్ఖుడుగా, రోగగ్రస్తుడుగా ఔతాడు, నిశ్చయము. అశ్వమును గ్రహించేవాడు (దానంగా) దానిని దొంగిలించేవాడు, లాల, మూత్రము ఔతాడు అని (124) నూరు సంవత్సరాలు అట్లా ఉండి, గుర్రమౌతాడు, నిశ్చయము. గజమును తీసుకున్నవాడు (దానంగా) దొంగిలించినవాడు మలకుండంలో వేయి సంవత్సరాలు.
ఉండి ఏనుగు రూపంగా ఒక సంవత్సరముండి ఆ పిదప వృషలుడౌతాడు. యజ్ఞం లేకుండానే మేకను చంపేవాడు ఛాగమును దొంగిలించినట్లు, దానం తీసుకున్నట్లు (126) మలకుండమందు నూరు సంవత్సరాలుండి చండాలుడౌతాడు. ఛాగముగా సంవత్సర పర్యంతము ఉండి ఆ పైమానవుడౌతాడు (127) శత్రువు ఆయుధంతో కోయబడి ఆ పైముక్తుడై ద్విజుడౌతాడు. ఇచ్చిన దానిని అపహరించేవాడు, వాగ్దానం చేసి తిరిగి అపహరించేవాడు (128) వాడు మేచ్చయోనియందుండి అనుభవించి, నరకానికి వెళ్తాడు. ఒంటరిగా తీపితినేవాడు, త్వరగా మరణిస్తాడు (కాలసూత్ర నరకానికి పోతాడు) (129) అక్కడ నూరు సంవత్సరాలుండి ప్రేతగా వేయి సంవత్సరాలు ఉంటాడు. ఆపై ఒక జన్మ ఈగగా, ఒక జన్మ చీమగా ఉంటాడు. (130) ఒకజన్మ తుమ్మెద, ఒక జన్మతేనె టీగగా, ఒక జన్మ కందిరీగగా (వరల) ఒక జన్మ అడవి ఈగగా, (131) ఒక జన్మ దోమగా, ఒక జన్మ దుర్గంధంలో పురుగుగా, ఒక జన్మపడకలో పురుగుగా (నల్లా?) ఆ పైశూద్రుడుగా జన్మిస్తాడు (132) సద్బుద్ధిలేనివాడుగా, రోగగ్రస్తుడుగా ఆపై ముక్తుడైద్విజుడౌతాడు. నూనె దొంగిలించినవాడు నూనె చేసేవాడు మూడు జన్మలు తలలో పురుగౌతాడు (పేను, ఈడు) (133) ఆ పై స్వర్ణకారుడుగా, దుష్టమైనమనస్సుగలవాడుగా ఒక జన్మ ఎత్తుతాడు. ప్రపంచలో ఒక లేఖకుడుగా మారి తినతగినవానిని, దాతధనమును హరిస్తాడు (134) తమఃకుండ మందు నూరు సంవత్సరాలుండి బంగారు వ్యాపారి ఔతాడు. ఒక జన్మదురాచారుడుగా, ఒక జన్మకరణంగా ఔతాడు. (135) కాయస్థుడై (లేఖకుడు, క్షత్రియ, శూద్ర సంకరం వల్ల పుట్టినవాడు) పొట్టగలవాడై (అత్యాశ) తల్లి మాంసం మాత్రం తినడు, ఆమెకడుపులో ఉండి, వాడికి తల్లిమీదకూడా దయలేదు, పండ్లులేవు కాబట్టి తల్లి మాంసం తినడు. (136) అవుసలివాడు, బంగారు వ్యాపారి, కాయస్థుడు, వీరు ఓ ప్రజేశ్వర! మనషుల మధ్యలో వీళ్ళు ధూర్తులు, భూమి పై, దయలేని మనుషులు వీళ్ళు (137) వాళ్ళ హృదయము కత్తి అంచులాంటిది. వారికి ఆదరం లేదు. కాయస్థులలో, నూటికి ఎవడో ఒక్కడు మంచివాడు, కాని స్వర్ణకార, స్వర్ణవణిక్కులలో ఆమాత్రం కూడా లేరు (138) మంచి బుద్ధి, వేదం చదివిన వాడు, శాస్త్రజ్ఞుడు, ధర్మము యందు మనస్సుకలవాడు, ఇట్టివారిని, ఓ తండ్రి తన కళ్యాణాన్ని కోరుకునేవాడు నమ్మరాదు. (139) సీమను (సరిహద్దు) అపహరించేవాడు, దుష్టుడు, భూమిచోరుడు, హిసకుడు, దానం చేసిన భూమిని అపహరించేవాడు, వీరుకాలసూత్ర నరకానికి వెళ్తారు,ధ్రువము (140) అరవైవేల సంవత్సరాలు, ఆకలి దప్పులతో బాధపడుతూ ఉంటాడు. ఆపై అన్ని పేర్లతో (సార్లు) మలమందు పురుగైపుత్తాడు (141) ఆ పైన చెడు శూద్రుడౌతాడు. అట్లా ఒక జన్మఉండి ఆ పైన శుచిమౌతాడు. ఆ పైన జ్ఞానుల వద్ద అవధానంతో ఉండి, ప్రయత్నపూర్వకంగా ప్రాజ్ఞుడౌతాడు (142) ఎర్రని వస్త్రాన్ని దొంగిలించినవాడు ఒక జన్మ ఎర్రని పురుగుగౌతాడు. ఒక జన్మశూద్రుడౌతాడు ఆ పై శుచియై విప్రుడౌతాడు. (143) మూడు సంధ్యలను వార్వని విప్రుడు, ప్రొద్దున నిద్రించే నరుడు పగలు, సంధ్యలందు నిద్రించే నరుడు, యజ్ఞసూత్రం అపహరించినవాడు (ఉపవీతం) (144) అశుద్ధిగా సంధ్యచేసినవాడు, వేద వేదాంగముల నిందించినవాడు, అందుకు విరుద్దమైనవాడు, స్వర్గమార్గంలో ఉంటూ, మూడు జన్మలలో పతితుడై బ్రాహ్మణుడు ఔతాడు (145) శూద్రుడై బ్రాహ్మణస్త్రీని పొందినవాడు కుంభీపాక నరకానికి పోతారు, నిశ్చయము. మూడు లక్షల సంవత్సరాలు అక్కడ పీడింపబడుతూ, వండబడుతాడు (146) రాత్రింబగళ్ళుకాల్చబడుతూ కాగిన నూనెలో, భయంకరమైన దానిలో కాలుతూ, ఆ పై ఆ పాతకి, కులటల యోనిలో కీటకమౌతాడు.
అను ॥ అరువదివేల సంవత్సరాలు వానికి ఆ మలమే ఆహారము. ఆపై క్రమంగా లక్ష జన్మలు చండాలుడౌతాడు (148) ఆ పై ఒక జన్మ రక్తం స్రవిస్తున్న కుష్టువ్యాధి కలవాడై శూద్రుడుగా జన్మించి ఆ పైశుచిఔతాడు. ఆతడు, బ్రాహ్మణుడుగా మిగిలిన వ్యాధితో బాధపడుతూ తీర్థ పర్యటనము చేసి శుచిమౌతాడు (149) నరుడు దేవునకు అపవిత్రమైన నైవేద్యాన్ని ఇచ్చి, స్థానంకానీ చోట, అసుర పూజితమైన చోట ఇచ్చి అసచ్ఛూద్రుడౌతాడు (150) వెంట్రుకలు గల పార్థివలింగాన్ని పూజించి యవనుడౌతాడు. దుర్బలుడైతే అంధుడౌతాడు, కుత్సితుడైతే తరువాత కుత్సితుడౌతాడు (151) నరుడు, అంగహీనుడు, దరిద్రుడు వ్యాధియుక్తుడౌతాడు. అశ్రద్దగా నిర్మిస్తే, నిర్మాణానికి తగ్గ ఫలాన్ని అనుభవిస్తాడు (152) మట్టి, భస్మము, ఆవు పేడ ముద్దలు, ఇసుక వీటితో దేనితోనైనా లింగాన్ని చేసి ఒకసారి పూజిస్తే కల్పసంవత్సరాల ఆయుస్సుకలవాడై దేవలోకమందుంటాడు. (153) ఆ పైన విప్రుడు , మహాప్రజ్ఞావంతుడు, భూమికలవాడౌతాడు. భారతదేశమందు నూరు లింగాలను పూజిస్తే రాజౌతాడు (154) వేయి లింగాలను పూజిస్తే ఆతడు కూడా నిశ్చితమైన ఫలాన్ని పొందుతాడు. చాలా కాలం స్వర్గంలో ఉండి భారతం(దేశ)లో రాజేంద్రుడౌతాడు (155) పది వేల లింగాల పూజిస్తే వానికి ఈశుడౌతాడు, లక్ష పూజిస్తే పృథివికి ఈశ్వరుడౌతాడు. అతిభక్తితో పూజిస్తే, ఎక్కువ ఫలం లభిస్తుంది (156) తీర్ఘస్నానంతో, దానంతో, విప్రులకు భోజనం పెడే నారాయణుని అర్చిస్తే కర్మవల్ల విప్రజాతివాడౌతాడు, (157) అధికమైన తపస్సుతో పండితుడు, బ్రాహ్మణుడౌతాడు. పండితుడు బ్రాహ్మణుడు, వైష్ణవుడు, జితేంద్రియుడుఐ (158) అనేక జన్మల పుణ్యంతో భారత భూమియందు జన్మిస్తాడు. ఆతని పాదస్పర్శతోనే, భూమి వెంటనే పవిత్రమౌతుంది (159) తీర్థములు పుణ్యతీర్ధములౌతాయి. వైష్ణవులు జీవన్ముక్తులు. వేయిమంది తమ పురుషులను పవిత్రులను చేస్తారు, వీరు అని వేదం (శ్రుతి) ద్వారా వింటున్నాం (160) పాపంతో వైద్య జన్మ చెడ్డవైద్యుడైన బ్రాహ్మణుడౌతాడు. చెడు చికిత్స చేసే, వైద్యుడు మూడు జన్మలలో సర్పంతో గ్రహింపబడతాడు (161) అతిక్రూరుడు, దురాచారుడు, సురవిప్రులను ద్వేషించేవాడు ఆతడు వేయి సంవత్సరాలు కుటిల సర్పమౌతాడు. (162) ఓప్రజ! కులటాలంపటులకు దూతియైన స్త్రీ కాలసూత్రనరకంలో నూరు సంవత్సరాలుండి, ఉడుముఔతుంది (163) ఒకజన్మ ఉడుమై మూడు జన్మలు జింక ఔతుంది. ఒక జన్మ బర్తెగా జన్మించి, ఒక జన్మ భల్లూకమౌతుంది (164) ఒక జన్మగండక మృగమై మూడు జన్మలు నక్కఔతుంది. ఇతరుల చెరువు నీటితో, చచ్చు ధాన్యం ఇచ్చేవాడు (165) మొసలి జాతివాడౌతాడు. మూడు జన్మలు తాబేలు ఔతాడు. అనవసరంగా మాంసం తినేవాడు, చేపలమీది ఆశగల బ్రాహ్మణుడు (166) ఇవ్వకుండా తీసుకుని) మాంసం తినేవాడు చేప, మృగము ఔతాడు. ఓ తండ్రి! వేయి సంవత్సరాలు పాపాన్ని భుజిస్తూ (167) కర్మభోగం అయ్యాక శుచియైవాడు తిరిగి బ్రాహ్మణుడౌతాడు. ఏకాదశి ఆచరించనివాడు, బ్రాహ్మణుడు పతితుడౌతాడు.
అను II తిన్నదానికి రెట్టింపు దానం చేస్తే ఆపాపం నుండి ముక్తుడౌతాడు. నాజన్మదినం రోజున భుజించే మానవాధముడు (169) ముల్లోకములలో పుట్టిన పాపాన్ని వాడు భుజిస్తాడు, అనుమానం లేదు. తిని, నరకమంతా అనుభవించి ఆపై చండాలుడౌతాడు (170) ఇట్లా శివరాత్రి యందు, శ్రీరామనవమి దినమందును ఉపవాసం చేయాలి. ఉపవాసం చేతకాకపోతే హవిష్యాన్నాన్ని తినాలి (171) దానికి అశుక్తుడైతే దుర్భలుడైతే బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. నా పుణ్యమైన మహోత్సవాన్ని చేసి పాతకముక్తుడై శుచియౌతాడు (172) అందువల్ల ప్రయత్నపూర్వకముగా నా నామసంకీర్తన చేయాలి. వేయి కోట్ల సంవత్సరాలు గద్ద ఔతాడు, నూరు జన్మలు పంది ఔతాడు (173) నూరు జన్మలు వ్యాఘ్రమౌతాడు, రాత్రికనుక భుజిస్తే (ఏకాదశిన). దీక్షితుడు కాని బ్రాహ్మణుడు శంఖము, (సర్పము), చిల్లము, (పిట్ట) చిలుక ఔతాడు (174) వివాహంకాని బ్రాహ్మణుడు రాజహంస ఔతాడు నిశ్చయము. చిత్ర వస్త్రముల హరించే (అమ్మే వాడు మూడు జన్మలు నెమిలి ఔతాడు (175) తేజః పాత్రను అపహరించేవాడు (స్పిరిట్, రేతస్సు) చాలా కాలము కన్నె లేడి ఔతాడు. దేవతల ప్రతిమ దొంగిలించువాడు, ఏడు జన్మలలో అంధుడౌతాడు (176) దరిద్రుడు, రోగగ్రస్తుడు, చెవిటి, గూనివాడౌతాడు. స్త్రీ, తైలము,మధువు, మాంసము వీనిని ఆదివారం నాడు, అయిదు పర్వములందు భక్షించేవాడు (177) మహామూఢుడు వజ్రదంష్ట్రమును (పురుగు) పొందుతాడు, (నరకము) నిశ్చయము. పాతకి, దుఃఖితుడై, అక్కడ వేల సంవత్సరాలు ఉంటాడు (178) ఆపై మ్లేచ్ఛుడౌతాడు, ఏడు జన్మలు చాండాలుడౌతాడు. ఆపై రోగగ్రస్తుడైన శూద్రుడౌతాడు, ఆపై శుచియైన బ్రాహ్మణుడౌతాడు (179) అందువల్ల భారత దేశ) మందు, ధర్మభీరుడై ప్రయత్నించియైనా తినరాదు. బ్రాహ్మణుని దేవుని చూచి నమస్కరించని నరాధముడు (180) జీవితాంతము అశుచిమౌతాడు, యవనుడౌతాడు. వచ్చిన బ్రాహ్మణుని చూచి, లేచి నిలువనివాడు (181) వాడు ఏడు జన్మలలో బ్రహ్మఘాతి ఔతాడు నిశ్చయము. శివునిద్వేషించేవాడు కోడి ఔతాడు. ఏడు జన్మలలో నంబి లేదా తంబళి ఔతాడు. (182) వేదోక్తమైన జ్ఞానం లేని వాని పితృ దేవతల అర్చనము వ్యర్థము. వాడు ఆపాపి వేయి సంవత్సరాలు నరకానికి పోతాడు. (183) ఆపైన రౌరవ నరకాన్ని అనుభవించి మూడు జన్మలు తీర్థ ప్రదేశములలో కాకి ఔతాడు. మూడు జన్మలు నక్కఐ తీరమందు శవాన్ని తింటాడు. ఓ ప్రజ! (184) వాడూ కూడా మూడు జన్మలు తీర్ధములలో శవరక్షకుడౌతాడు. పాపంచేసినవాడు, ఆకర్మతో శవముల చేతిని (పైపన్ను) గ్రహిస్తాడు. (185) జ్ఞానం లేకుండా దంభంగా సురార్చన చేసినవాడు, భక్తితో గురువును పూజించకుండా, ఆతనికి అన్నం పెట్టనివాడు. (186) వాడు దేవలుడౌతాడు, (తంబళి) దేవశాపంతో పాతకి, దుఁ :ఖి ఔతాడు. జ్ఞానంతో బలహీనుడు, దాంభికుడై రోజు దేవార్చన చేసేవాడు (187) పూజా ఫలాన్ని పొందడువాడు దేవద్రోహి, దారుణమైనవాడు. దీపం ఆర్పినవాడు ఏడు జన్మలు మిణుగురుపురుగు ఔతాడు (188) ఎక్కువగా చేపలమీద ఆశకలవాడు, నివేదన చేయకుండా తినేవాడు వాడు, బెస్తల రాజౌతాడు. ఏడు జన్మలు పిల్లి ఔతాడు (189) ఎద్దును హరించినవాడు పావురమౌతాడు, మాలను హరించినవాడు పక్షిఔతాడు, ధాన్యం హరించినవాడు పిచ్చుకఔతాడు, మాంసము దొంగిలించినవాడు ఏనుగఔతాడు.
అను!! కవి, పండితుల నిందించేవాడు (కొట్టటం) ఏడు జన్మలు కప్పఔతాడు. దుష్టకవి, గ్రామమందలి విప్రుడు ఏడు జన్మలు ముంగిస ఔతాడు, (191) ఒక జన్మకుష్టురోగి, మూడు జన్మలు తొండ ఔతాడు. ఒక జన్మ ఈగ (అడవిది) ఆ పైన చెట్టు పై చీమ ఔతాడు, (192) ఆ పై శూద్రుడు, వైశ్యుడు, క్షత్రియుడు, బ్రాహ్మణుడౌతాడు, నాలుగు వర్ణములలోను కన్యను అమ్మే నరుడు, (193) చంద్ర సూర్యులున్నంతకాలం, వెంటనే తామిస్ర నరకమునకు వెళ్లాడు. ఆపై వ్యాధుడౌతాడు మాంస మమ్మేవాడు, (194) ఔతాడు ఆపై ముందు జన్మలో ఎట్లున్నాడో అట్లా వ్యాధుడౌతాడు. నా నామాన్ని అమ్మే బ్రాహ్మణుడు (దేవుని పేరు చెప్పి బతకటం)ముక్తుడుకాడు నిశ్చయము, (195) మృత్యులోకమందు నానామము (పేరు) స్మృతిలో కూడా ఉండదు. ఆ పైవాడు గోవుయోని యందు ఒక జన్మ నంది జ్ఞాన దుర్బలుడౌతాడు, (196) ఆపై మేకపోతుగా, మేకగా, దున్నపోతుగా ఏడు జన్మలుంటాడు. గొప్పగాండ్లవాడు, (నూనె తీసేవాడు) కుటిలుడు ధర్మహీనుడైన మానవుడు (197) ఒక జన్మ నూనె తీసేవాడుగా, ఆపై కుమ్మరి వానిగా జన్మిస్తాడు. (చక్రి=గాండ్ల, కుమ్మరి). అబద్దంగా ఇతరుల పై నిందమో పేవాడు దేవ, బ్రాహ్మణుల నిందించేవాడు (198) వాడు అముసలివాడౌతాడు. ఏడు జన్మలు చాకలిఔతాడు. బ్రాహ్మణ క్షత్రియవైశ్య శూద్రులు, కుత్సితులు, శుచిత్వం లేనివారు (199) పదివేల సంవత్సరాలు మేచ్చయోనులందు జన్మిస్తారు. ఇచ్ఛాపూర్వకంగా, స్త్రీల పిరుదులు, రొమ్ములు, ముఖము చూచేవాడు (200) దృష్టిహీనుడౌతాడు, నపుంసకుడౌతాడు. అభిచార హోమం చేసే (శత్రునాశంకై యజ్ఞం) విప్రుడు, హింస చేసేవాడు, జ్ఞాన దుర్బలుడు (201) పదివేల సంవత్సరాలు అంధతామిస్ర నరకానికి పోతాడు. ఆ పైన దైవజ్ఞుడౌతాడు (జోస్యుడు), చచ్చిన వాళ్ళకై ఇచ్చేదానం పట్టే వాడు, దుర్మతి ఔతాడు (202) ఆ పై శూద్రుడు ఔతాడు. అట్లాగే కర్మ అనుభవం పొంది విప్రుడౌతాడు. శాస్త్ర మెరిగినవాడు జోస్యుడై లోభంతో అబద్ధం చెబితే (203) వాడు తప్పకుండా బల్లి ఔతాడు, ఆపై ఏడు జన్మలు కోతి ఔతాడు. అనేక జన్మలలో తపస్సు చేసి భారతదేశ) మందు బ్రాహ్మణుడౌతాడు. (204) మంచి బుద్ధిగలవాడు అతి ధర్మమాచరిస్తాడు. ధర్మహీనుడు మహాపాతకి. స్వధర్మ మందున్న విప్రుడు అగ్నికన్న పరముడు, (205) పవిత్రుడు, అతితేజస్వి అతని చూచి దేవతలెప్పుడూ భయపడుతారు. నదులలో గంగవలె తీర్థములలో పుష్కరము వలె (206) నగరములలో కాశివలె, జ్ఞానులలో శంకరునివలె, శాస్త్రములలో వేదముల వలె, వృక్షములలో అశ్వత్థము వలె (రావి) (207) తపస్సులలో నాపూజవలె వ్రతములలో ఉపవాసం వలె, అట్లా జాతులన్నిటిలో బ్రాహ్మణుడు శ్రేష్ఠుడే. (208) బ్రాహ్మణుని పాదములు తీర్థము వంటివి, పుణ్యప్రదమైనవి. వ్రతముచేసినంత పుణ్యప్రదమైనవి. విప్రుని పాదధూళి శుద్ధమైనది పాపమును, వ్యాధిని నశింపచేసేది. (209) శుభమైన ఆశీర్వచనము. (సోకినవారికి) అన్ని కళ్యాణములనిచ్చేది. ఓ తండ్రి! దీనిని నీకు చెప్పాను. కర్మల పరిపాకమిట్లా ఉంటుంది. (210) విన్నది విన్నట్లు, తెలిసింది తెలిసినట్లు చెప్పాను. దానినంతా విన్పించాను. విన్నావు. ధర్మ విపాకమును విన్నాక చెప్పిన వానికి బంగారం (211) ఇవ్వాలి, ఆతనికి వెండి, వస్త్రము, తాంబూలము, నూరు రూపాయలు (బంగారువి) ఇవ్వాలి. ఇస్తే, ప్రాణి గోకులానికి వెళ్తాడు. వెండి, వస్త్రము, తాంబూలము నాకు సంతోషం కలిగే కొరకు బ్రాహ్మణునకివ్వాలి (212) అని శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమందు శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధమందు నారాయణ నారద సంవాద మందు భగవంతుడు, నందుడు వారిద్దరి సంవాదమందు ఎనుబది ఐదవ అధ్యాయము.
