4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము

Table of Contents

111 - అధ్యాయము

మూ॥ రాధికోవాచ :

రాధికవచనమిట్లా –

పరమైనవాడు జ్ఞానాత్మకుడు, బ్రహ్మ, శివుడు, శేషుడు వీరితో పూజింపబడేవాడు. ఆతడు నీకు జ్ఞానాన్ని ఇవ్వలేదు, నా దగ్గరకు పంపాడు, ఓ సతి (1)ఆ నెపంతోనే తీసుకుపోవుటకు ఏమి భావార్థాన్ని బోధిస్తాను. వేదములు సజ్జనులు ఆతని భావార్థాన్ని ఎరుగరు. (2) స్త్రీజాతి అబల (బలహీనురాలు) మూఢమైనది. యధార్ధానికి అజ్ఞానమందే ఆసక్తి కలది. అందువలన ఆతని విరహంతోనే ఎల్లప్పుడు చేతనను పోగొట్టుకుంటున్నాను. (3) నేనేం చెబుతాను జ్ఞానాన్ని. ఐదు రకాల జ్ఞానములలో భక్త్యాత్మకమైనది అన్నిటికన్న పరమైనది. నీకు చెబుతున్నాను తెలుసుకో. (4) శ్రీకృష్ణుని వరముతో ఓసాధు! నీవు నిర్భయుడవుకా. కుయోగికి కూడా గోలోకమందు పడటము జరుగవచ్చు. (5) అందువల్ల అన్ని వదలి పరమేశ్వరుని భజించు. కొడుకు అనే బుద్దిని వదిలి బ్రహ్మరూపుడని తెలుసుకో. ఓ యశోద! నీవు నశ్వరమైన దీనినంతా వదలి, బృందావనమునకు వెళ్ళు. అది భారతమందు రమ్యమైన పుణ్యక్షేత్రము. (7) నిర్మలమైన యమునా నది జలమందు మూడు పూటల స్నానం చేసి, మృదువైన చందనముతో అష్టదళపద్మాన్ని చేసి, ఓ సతి!శుద్ధమైన మనస్సుతో గర్గుడిచ్చిన ధ్యానముతో, పరమానందుని పూజించి, ఆనందంగా ఆతని పదసన్నిధికి చేరు.(9) నూర్లకొలది పితరులతో కూడా కర్మలను తెంచుకొని, వైష్ణవునితో కూడా ఎల్లప్పుడూ మాట్లాడు, ఓసతి! (10) హుతవహజ్వాల (అగ్ని) శ్రేష్ఠము. దాన్ని భక్తుడు పంజరంగా కోరుకుంటాడు (ఇల్లు) ముళ్లలో, నివాసము శ్రేష్ఠము, విషభక్షణము శ్రేష్ఠము. కాని (11) హరిభక్తిలేనివారి సహవాసము వద్దు. అది నాశకారణము. భక్తిహీనుడు తాను స్వయంగా నశించాడు. అంతేకాక బుద్ధి భేదాన్ని కల్గిస్తాడు. (12) భక్తి వృక్షమనే చెట్టు మొలక భక్తుల సహవాసంతో పెరుగుతుంది. హరి యొక్క కథల భాషణమను అమృతంతో తడిపితే, మిక్కిలి వృద్ధినందుతుంది. (13) భక్తుడు కాని వాని మాటలనే దీపఅగ్ని జ్వాలమొక్క ఏఒక్క భాగంతోనైనా ఆ మొలక ఎండిపోతుంది. మళ్ళా అమృతం పోస్తే పెరుగుతుంది. (14) అందువలన భక్తులు కానివారి సహవాసాన్ని జాగ్రత్తగా విడిచి పెట్టు, నరుడు కాలసర్పాన్ని చూచి భయపడి పరుగెత్తినట్టు అభక్తుని చూచి పరుగెత్తాలి.(15)

అను ॥ యశోద! ప్రయత్నపూర్వకముగా నీ కొడుకును, ఈశ్వరుని, రామ, నారాయణ, అనంత, ముకుంద, మధుసూదన (16) కృష్ణ, కేశవ, కంసారి, హరి, వైకుంఠ, వామన, అనే ఈ పదకొండు నామములను చదువుటో లేదా చదవించుటో చేయాలి అని. అట్లా చేస్తే సహస్ర కోట్ల జన్మల పాపం నుండి కూడా ముక్తుడౌతాడు. (17) రా అనగా విశ్వము మఅనగా ఈశ్వరుడు. విశ్వములకు ఈశ్వరుడెవడో వాడు ఆ కారణంగా రాముడనబడ్డాడు. (18) రమతో కలిసి రమిస్తాడు కనుక రాముడు అని బుధులన్నారు రమకు, రమణ స్థానము. అందుకే రాముని ఎరిగినవారు రాముడని అన్నారు. (19) రా అనగా లక్ష్మి మఅనగా ఈశ్వరుడు. కనుక లక్ష్మీపతియైన రాముని విద్వాంసులు, గతిగా చెప్పారు. (గమ్యస్థానం) (20) వేయి దివ్య నామముల స్మరణతో వచ్చే ఫలమును రామ శబ్దాన్ని ఉచ్చరించినంత మాత్రమున పొందుతారు (21) నిశ్చయము. నారమనగా సారూప్య ముక్తి అని అర్థం. అని బుధులన్నారు. ఏ దేవుడు దానికి స్థానమో ఆతడు నారాయణుడన్నారు. (22) నారములనగా పాపం చేసినవారు. అయన మనగా పోవుట అని అర్థము. ఎవని స్మరణ వలన అవి పోతాయో వాడు నారాయణుడని అన్నారు. (23) ఒక్కసారి నారాయణ అను శబ్దాన్ని పలికితే నరుడు మూడు వందల కల్పముల వరకు, గంగాది సర్వతీర్ధములందు స్నాతుడౌతాడు. నిశ్చయము (24) నారమనగా మోక్షము, పుణ్యప్రదము. అయన మనగా జ్ఞానము కోరతగినది. ఆరెంటి జ్ఞానము (మోక్ష జ్ఞానము) దేని వలన కలుతుదో ఆతడు నారాయణుడు, ప్రభువు (25) నాల్గు వేదములందు, పురాణములందు, శాస్త్రములందు, ఇతర యోగములందు ఎవనికి అంతము లేదో ఆతడు అనంతుడు అని బుధులన్నారు. (26) ముకుం అనగా చదువుట సృష్టి, మోక్షము అని అర్థాలు. దానినిచ్చే దేవుడు ముకుందుడనబడ్డాడు. (27) ముకుం అనగా వేదసమ్మతమైన భక్తిరస ప్రేమ వచనమని అర్థము దానిని భక్తులకిచ్చేవాడు మకుందుడనబడ్డాడు (28) మధు అను రాక్షసుణ్ణి చంపిన వాడు కనుక ఆతడు మధుసూదనుడు, అని సజ్జనులు ఈశుని గూర్చి చెబుతారు. వేదంలో భిన్నమైన అర్థము చెప్పబడింది. (29) మధు అనగా నపుంసకము. ఇప్పపువ్వు సారం, చేసిన శుభాశుభకర్మలు. భక్తుల కర్మలకు స్థానము, మధుసూదనుడు అని అన్నారు. (30) పరిణామంలో శుభమునిచ్చే కర్మ భ్రాంతులకు మధురము. అదే మధు. దానిని ఎవడు నశింపచేస్తాడో వాడు మధుసూదనుడు. (31)

కృషి అనగా ఉత్కృష్టమైనది. ణ అనగా సద్భక్తి అ అనగా ఇచ్చేవాడు (ఉత్కృష్ట భక్తినిచ్చేవాడు) కావున కృష్ణుడు అని అన్నారు బుధులు. (32) కృషి అనగా పరమానందము. ణ అనగా అతనికి దాస్యము చేయుట. వాటినిచ్చే దేవుడు కృష్ణుడనబడ్డాడు. (పరమానందునకు దాస్య చేయుట నిస్తాడు. (33) కోటి జన్మలలో సంపాదించిన పాపము నందు కృషి అనగా క్లేశము ఉన్నది. భక్తులకు ఇ అనగా నిర్వాణము. అందువలన కృష్ణుడన్నారు. (లేకుండా చేయటం) (34) దివ్య సహస్రనామములను మూడు సార్లు అవృత్తి చేస్తే వచ్చే ఫలము ఒకసారి కృష్ణ శబ్దాన్ని పలికితే ఆఫలితం వస్తుంది. (35) కృష్ణ అనే పేరున్న ఉత్తమమైన నామము గతంలో లేదు, భవిష్యత్తులో రాదు. అన్నిటికన్న ఉత్తమమైన నామము కృష్ణ అనేది అని వైదికులు తెలిపారు. (36) ఓగోపి! ప్రతిరోజు కృష్ణ, కృష్ణ అని ఆతనిని స్మరిస్తే ఆతడు నరకాన్నుండి ఉద్ధరిస్తాడు, నీటిని చీల్చుకొని పద్మం వచ్చినట్టు ఉద్ధరిస్తాడు. (37) కృష్ణ అనే మంగళకర నామము ఎవని నోట ఉంటే ఆతని మహా పాతకములు కోట్లకొలది వెంటనే భస్మమౌతాయి. (38) వేయి అశ్వమేధముల ఫలము కృష్ణ నామజపం వల్ల వస్తుంది. వాటికన్న ఇది శ్రేష్ఠము. పునర్జన్మ లేదు. అందువలన భక్తుడు తిరిగి పుట్టడు. (39) అన్ని యజ్ఞములు, లక్షల కొలది వ్రతాలు, అన్ని తీర్థముల స్నానము, అన్ని రకాల తపస్సులు, భుజింపకుండుట (ఉపవాసము) (40) వేలసార్లు వేదపఠనము, భూమికి నూరుసార్లు ప్రదక్షిణలు చేయటము ఇవన్నీ కృష్ణ అను నామాన్ని జపిస్తే వచ్చే ఫలంలో పదహారవ భాగానికి సరిపోవు. (41) వాటి పై లోభం వలన నరులకు త్వరలో స్వర్గఫలము వస్తుంది. స్వర్గమునుండి తప్పక జపం చేసే పురుషునకు హరిస్థానం లభిస్తుంది. (42) కే అనగా నీరు, సర్వ శరీరము. ఇందులో ఎవడు తనను నిద్రింపచేసుకుంటాడో ఆ దేవుని అందరు కేశవుడని పరుడని అంటారు. వైదికులు ఇదే అన్నారు. (43) కంసమనగా పాతకము, విఘ్నము, రోగము, శోకము, దానవుడు అని అర్ధము. వాటికి అరి అన వాటిని నశింపచేసేవాడు వాడుకంసారి అని అన్నారు. (44) రుద్రుని రూపంతో ఎల్లప్పుడు విశ్వములను నశింపచేసేవాడు, భక్తుల పాతకాలను హరించేవాడు అందువలన హరి అని పిలువబడ్డాడు. (45) మా అనగా బ్రహ్మ స్వరూపము, మూలప్రకృతి, ఈశ్వరి. నారాయణి అని ప్రసిద్ది చెందింది. విష్ణుమాయ, సనాతనమైంది. (46) మహాలక్ష్మీ స్వరూపురాలు, వేదమాత సరస్వతి, రాధ, వసుంధర, గంగ వారందరికి స్వామి, మాధవుడు అని. (47)

యశోదోవాచ :

శ్రీరాధికోవాచ :

బ్రహ్మ, ఈశుడు, శేషుడు మొదలగు భవులతో (దేవతలు) నమస్కరించతగినవాడు, ధ్యానముతో ప్రయోజనం లేదు. సనకాదులు వేదములు, పురాణములు ఆతడు (శక్తి) నిరూపించబడలేదు. భక్తితో నవనీత చోరుని భజించు. (48) ఒకచోపాలు, ఒకచో పెరుగు, నేయో కొత్తగా తీసినదేదైనా ఇష్టమైనమజ్జిగతో తీస్తాడు. వారికి ఈ చోరుడు ఎక్కడో తెలియదు, ఎక్కడో, పుట్టుకకు కారణమైన దాని మధ్యలో నున్న నీకు ఆతడు కట్టుబడటమేమిటి. (49) యోగులు, సిద్ధగణాలు, మునీంద్రులు, భవమనే పద్మంలో మిగిలిన భక్త సంఘాలు కట్టేయలేదు. యోగులు, రక్షణకు సమర్థులైనా వారికి కట్టుబడలేదు. అట్టివాడు, కారణమైన దాని మధ్యనున్న నీకు ఆతడెట్లా కట్టుబడ్డాడు. (50) ప్రేమతో, భక్తితో, పూజతో, స్తుతితో భారతమందు త్వరగా పుత్రుని భజించు, హృదయ పద్మమందున్న ఈశ్వరుని, పరుని ధ్యానముతో ప్రయత్నపూర్వకంగా ఎల్లప్పుడు భజించు, ఓసతి! (51) నీ మనసులో ఏ కోరిక ఉందో దానిని వరంగా కోరుకో, నీకు భద్రమగుగాక, దేవతలకు దుర్లభమైన దానినైనా జగత్తులో ఉన్నదంతా ఇస్తాను. (52) యశోద ఇట్లా - హరియందు నిశ్చలమైన భక్తి ఆతని దాస్యము ఇవి నా కోరిక. నీ పేరునకు వ్యుత్పత్తి ఏమిటో దానినినాకు చెప్పండి. (53) రాధిక ఇట్లా - నీ భక్తి నిశ్చలముగా ఉండనీ. హరిదాస్యము దుర్లభమైనది. నా వరంతో దానిని కూడా పొందు. మంచి నిర్ణయాన్ని చెబుతాను. (54) భాండీర మందు (అత్తిచెట్టు) వటమూలమందు ఇదివరలో నన్నునందుడు చూచాడు. నేను నందునితో ఇట్లన్నాను. ప్రజేశ్వరుడు ని షేధింపబడ్డాడు. (55) నేనే రాధను స్వయంగా ఛాయను రాపాణుని కామినిని. రాపాణుడు శ్రీహరి యొక్క అంశ. హరికి ప్రక్కనుండే వారిలో ముఖ్యుడు గొప్పవాడు. (56) రా అనగా విష్ణువు ఆతని రోమములందు విశ్వమున్నది. విశ్వమందలి ప్రాణులయందు, విశ్వములయందు అర్థము ధా అనగా ధాత్రి మాతృవాచకము. (57) ధాత్రి అనగా నేను వీరందరికి తల్లిని మూలప్రకృతిని, ఈశ్వరిని. అందువల్ల రాధా అని హరి, ఇదివరలో బుధులు నన్ను పిలిచారు. (ప్రాణులకు తల్లి రాధ) (58) నేను ఇప్పుడు సుదాముని శాపంతో వృషభానుని కూతురుగా ఉన్నాను. ఇప్పుడు హరితో నాకు నూరు సంవత్సరాలు విచ్చేదము. (59) వృషభానుడు కూడా కృష్ణుని యొక్క పారదులలో శ్రేష్ఠుడు గొప్పవాడు. నా తల్లి కలావతి పితరులకు మానసికమైనకన్య (60) నేను అయోని సంభవను. నా తల్లికూడా ఈ భారతమందు అయోని సంభవ. తిరిగి మీతోపాటు శ్రీహరి స్థానానికి వెళ్లాను. (61) ఇట్లా నీకు అంతా చెప్పాను. ఓ ప్రజేశ్వరి! ప్రజమునకు వెళ్ళు. ఓ సతి! జ్ఞానియైన, స్వామియైన వ్రజేశ్వరునితో కలిసి ఉండు. (62) నాకు ఇప్పుడు మీరు నాధ్యానానికి అడ్డంకి. ధ్యానాన్ని భంగపరచటం మహా దోషము నరులు కూడా చేయరాదు, ఓసుందరి! (63)

అని బ్రహ్మవైవర్త మహాపురాణమందు శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధ మందు నారాయణ నారద సంవాదమందు రాధ యశోద సంవాదమందు నూట పదకొండవ అధ్యాయము.