4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము
67 - అధ్యాయము
మూ!! శ్రీనారాయణ ఉవాచ :
రాధికోవాచ :
అను! నారాయణుడిట్లన్నాడు : కాముకులను మోహింపజేసే కృష్ణుడు, విరహవ్యాకులమైన కామినిని చూచి, ఆమెను వక్షమందుంచుకొని క్రీడాసరోవరమునకు వెళ్ళాడు. (1) రాజరాజేశ్వరియైన రాథ కృష్ణుని వక్షఃస్థలమందు, ఆకాశమందు నూతనమైన వర్షించే మేఘమందు మెరుపువలె ప్రకాశించింది, ఓముని! (2) కృపతో, కృపానిధి, ఆమెతో కూడి ఆతడు రమించాడు. రెండేసి స్వర్ణమణులయొక్క (సమాగమం) మరకతమణి ఆతడు. {3) రత్నములతో నిర్మించిన పర్యంతమందు (పడక), రత్నేంద్రముల సారముతో నిర్మింపబడిన దానియందు (ఇంద్రజాశ్రేష్ఠ),రత్నదీపములు వెలుగుతుండగా రత్నముల భూషణములతో అలంకరింపబడిన కృష్ణుడు (4) రత్నాలంకారములతో అలంకరింపబడిన ఆమెతో రాసక్రీడయందు రత్నమైన ఆతడు, ఆనందంగా రమ్యమైన రాసక్రీడ) రత్నాకరమందు ఆరసికేశ్వరుడు నిమగ్నమైనాడు. (5) రాసక్రీడయందు, రాసేశ్వరియైన రాధ, ఆమె రాసేశ్వరునితో ఇట్లా అంది. సురతము ముగిసినా, మనోరథము నెరవేరనప్పుడు అంది (6) రాథిక ఇట్లా అంది - ఓ నాధ! నీతోనేను వికసించాను. నీవులేకపోతే మృతప్రాయమైన, వాడిన, దానినైనాను. ప్రభాతమందు, సూర్యుని వల్ల మహా ఓషధుల సమూహము ఎట్లా వెలుగుతోంది అట్లా (7) నీతో కూడి రాత్రియందు దీపశిఖవలె ప్రకాశిస్తాను, నేను. నీవులేకపోతే కృష్ణపక్షంలో ప్రతిదినం చంద్రకళ క్షీణించినట్లు క్షీణిస్తాను (8) పూర్ణచంద్రుని ప్రభతో సమంగా నా ప్రభ (కాంతి=దీప్తి) నీ వక్షః స్థలమందున్నప్పుడు. నీవు విడిచి పెడితే, అమావాస్యయందు చంద్రకళవలె వెంటనే మరణిస్తాను. (9) నీతో ఉన్నప్పుడు, ఘృతము ఆహుతులతో (ఆకర్షణ) మండే అగ్నిశిఖవలె, నేనుంటాను. నీవులేకపోతే (నీతో, విడిగా) నేను, శిశిర ఋతువు యందు పద్మిని వలె నశిస్తాను.
అను!! నానుండి నీవు వేరైతే నేను చింత అనే జ్వరము, ముసలితనముతో మ్రింగబడుతాను, సూర్యచంద్రులు అస్తమిస్తే భూమి పై చీకట్లు ఆవరించినట్లు (11) నీవులేకపోతే నారూపము, యౌవనము, చైతన్యము వేషము అంతాభ్రష్టమే. అరుణోదయ మందు చుక్కలు భ్రష్టమైనట్లుగా. (12) అందరికి నీవే ఆత్మవు. విశేషించి నా నాథుడవు. ఆత్మ వెళ్ళిపోతే శరీరమెట్లాగో, నీవు లేకపోతే నేను అట్లాగా. (13) నీవు నాకు పంచప్రాణాత్మకుడవు, నీవు లేక నేను చచ్చినదానిని, బొమ్మలేకుండా, నేత్రగోళముల చూపు ఎట్లా ఉంటుందో అట్లా. (14) నీతో కలిసిన నేను బొమ్మలతో కూడిన ప్రదేశంలా ఆహ్లాదంగా ఉంటాను, నీవులేక నేను, సంస్కారంలేని, గరికతో కప్పబడిన భూప్రదేశంలా అందవిహీనంగా ఉంటాను. (15)నీతోకూడిన నేను ఓ కృష్ణ! మట్టితో చేసిన పాత్ర పై చిత్రములున్నట్లుగా ఉంటాను. నీవులేక నేను మృణ్మయమైన పాత్ర నీళ్ళతో కడుగబడి విరూపంగా ఉన్నట్లు (రూపంలేక) ఉంటాను. (16) రాసేశ్వరుడవైన నీతోనే గోపాంగనలకు శోభ, బంగారంతో చేసిన హారమందు తెల్లని మణితో శోభవలె (17) ఓ వజరాజ! రాజుల సమూహమంతానీతో పాటే వెలిగిపోతున్నారు, ఆకాశమందు చంద్రునితో తారలపంక్తి ప్రకాశించినట్లుగా (18) ఓ నందనందన! నందునకు, యశోదకు నీతోనే శోభ, చెట్టులగుంపు శాఖలు, ఫలవబ, ఫలములు స్కంధములతో ఎటా ప్రకాశిస్తుందో అటా (19)లోకముల సమూహంతా ఎట్లా రాజేంద్రునితో ప్రకాశిస్తుందో అట్లా గోకుల వాసులందరికి , నీతో కూడితే శోభ, ఓ గోకులేశ! (20) స్వర్గమందు అమరావతి దేవరాజుతో ప్రకాశించినట్లు, ఓ రాసేశ! రాసక్రీడకు కూడా నీతోనే మనోహరమైన శోభ (21) ఇతర వనములకు బలవంతుడైన సింహమెట్లాగో, వృందావనమందలి వృక్షములకు నీవే శోభ, పతి, గతి (22) దూడకన్పించనందువల్ల, వ్యాకులమై, ఏడుస్తున్న సురభివలే నీవు లేక, యశోద కూడా శోకసాగరమందు మగ్నమౌతుంది. (23) వేడెక్కిన పాత్రయందు ధాన్యసమూహము ఎగిరెగిరిపడతాయో అట్లా నీవు లేక, నందుని ప్రాణములు ఆందోళన చెందుతాయి. మనస్సు దగ్ధమౌతుంది (24) అని పలికి పరమప్రేమతో ఆమె హరిపాదములందు పడింది. ఆమెను విభుడు ఆధ్యాత్మికంగానే తిరిగి మేల్కొలిపాడు.
నారద ఉవాచ :
శ్రీనారాయణ ఉవాచ:
ఆధ్యాత్మిక మహాయోగము మోహాన్ని బాగా ఛేదించటానికి కారణమౌతుంది, తీక్ష్మమైన అంచుగల గొడ్డలి వృక్షముల ఛేదించడానికి తగినట్లుగా, ఓ నారద! (26) నారదుడిట్లన్నాడు - ఓ వేదవిదశ్రేష్ఠ! ఆధ్యాత్మిక మహాయోగాన్ని చెప్పు. లోకముల దుఃఖాన్ని ఛేదించేది. వినటానికి నాకు కుతూహలంగా ఉంది. (27) శ్రీనారాయణుడిట్లన్నాడు - ఆధ్యాత్మిక మహాయోగము, యోగులకు కూడా తెలియదు. అదిఅనేక రకాలు. అన్నిటిని స్వయంగా హరియే తెలుసుకోగలడు. (28) గోలోకంలో రాధిక యొక్క ఈశ్వరుడు (ప్రభువు) కొద్ది ఆధ్యాత్మికమును, సంతోషించి త్రిపురారికి చెప్పాడు, ఓముని! (29) సహస్ర ఇంద్రుల పతనకాలము వరకు తపస్సు చేసిన ఈశ్వరునకు చెప్పాడు. ఆతడు శ్రేషుడు వైష్ణవులకు జ్యేష్ఠుడు తపస్వులకు వరిష్ఠడు కూడా (30) పద్మజుడు (బ్రహ్మ) పద్మమందు, పద్మ సంవత్సరముల కాలము (ఒక వేయిబిలియనుల కాలము) పుష్కర క్షేత్రమందు దుష్కరమైన తపస్సు చేసి,చూచి (చూడగా) ఆతనిని ఆదరించగా, ఆతడు ఆతనికి కొద్దిగానే చెప్పాడు. (31)వేయి ఇంద్రుల పతనకాలము కఠోరంగా, కృశించిన ఉదరంగలవాడై, అస్థులు మాత్రమే మిగిలి, కదలికలేనివాడు కాగా అప్పుడు కృపతో కృపానిధి చెప్పాడు. (32) ఇదివరలో సింహక్షేత్రమందు, ధర్మము కలవారిలో శ్రేష్ఠుడైన నా తండ్రి ధర్ముడు, పదునాల్గు రింద్రుల పతనకాలము తపస్సుచేయగా, కృశోదరుడు కాగా (33) కృపతో కృపానిధి కొద్దిగా ఆధ్యాత్మికమును చెప్పాడు. నూరుగురింద్రుల కాలము తపము చేయగా సూర్యునకు ఆతడు కొద్దిగా చెప్పాడు (34) చాలాకాలము, చాలా సేపు తపస్సు చేసిన సనత్కుమారునకు కొద్దిగానే చెప్పాడు. బాగా తపస్సుచేసిన అనంతునకు కొద్దిగా చెప్పాడు, ఓ నారద! (35) హిమవత్పర్వతమందు చాలాకాలము తపస్పు చేసిన కపిలునకు తపస్వికి, పుష్కరక్షేత్రమందు, సూర్యుని ఎండలో దుష్కరమైన తపస్సు చేసిన వానికి కొంచెం చెప్పాడు (36) ప్రహ్లాదునకు కొంచెము, కొద్దిగా దుర్వాసునకు, భృగువునకు చెప్పాడు. ఈ విధముగా నిగూఢమైన దానిని, భక్తునకు భక్తవత్సలుడు, కృపతో (37) దేన్ని చెప్పాడో దానిని కృపానిధియైన నేను, రమ్యమైన క్రీడా సరోవరమందు దానిని శోకార్తయైన రాధికకు చెప్తాను, విను (38) విరసను, రసికురాలిని చూచి, వక్షమందు ఉంచుకొని, యోగులకు గురువైన వాడు యోగినికి కొద్దిగా ఆధ్యాత్మికమును చెప్పాడు.
మూ!! శ్రీకృష్ణ ఉవాచ:
అను II శ్రీకృష్ణుడిట్లన్నాడు: పుట్టుకను స్మరించేటప్పుడు నిన్నుకూడా స్మరించుకో, ఓ ప్రియ! ఎట్లా విస్మరిస్తావు.గోలోక వృత్తాంతమంతా, సుదాముని శాపము (40) స్మరించు. ఓదీనురాల! శాపం తరువాత కొద్ది రోజుల్లో నాతోనీకు వియోగము ఔతుంది. ఓ మహాభాగిని! తిరిగి మనమేలనము ఔతుంది. (41) ఆ ఆలయమైన గోలోకమునకు, మళ్ళీ వెళ్తాను. వెళ్ళి, గోపాంగనలతో, గోపులతో, గోలోకవాసులతో ఉంటాను. (42) ఇప్పుడు ఆధ్యాత్మికమును కొద్దిగా నీకు చెప్తాను, విను. శోకంహరించేది, హర్షాన్నిచ్చేది, సారమైనది, మనస్సుకు సుఖమిచ్చేది (43) నేను అందరి ఆత్మలలో ఉండేవాణ్ణి. అన్ని కర్మలలోను నిర్లిపుణ్ణి (అంటదు). అన్నింటిలో ఉంటాను. అంతటా కన్పించ (కుండా ఉంటా)ను. (44) అన్ని వస్తువులలో గాలి అంతటా ఎట్లా సంచరిస్తుందో, ఎట్లాగైతే దానిని ఏమీ, అంటదో అట్లాగేనేనూను. సర్వకర్మలకు సాక్షిని. (45) అన్నిజీవులలోని జీవులంతా, నాప్రతిబింబము. శుభాశుభములను భుజించేవాణ్ణి. ఎల్లప్పుడూ కర్మలనుచే సేవాణ్ణి నేనే. (46) నీటికుండలలో చంద్రసూర్యుల మండలములు (బింబము) ఎట్లాగో, (కలిసి) ఉంటాయి, అవి పగిలిపోతే వాటిలోనే కలిసిపోతాయో (కన్పించకుండా) అట్లాగే నాలోను కలిసిపోతాయి. (47) ఓ ప్రియ! కాలంవచ్చి జీవులు చనిపోతే జీవుడట్లా నాలోకలసిపోతాడు. మేమిద్దరు (జీవుడు+నేను) ఎల్లప్పుడు సర్వప్రాణులలో ఉంటాము. (48) నేను ఆధారము, ఆధేయముకూడా, కారణం లేకుండానే కార్యమునునేను. ఓ సుందరి! అన్ని ద్రవ్యములు నశించేవి. (49) ఒకేచోట అధికంగా (నా అంశ) నా ఆవిర్భావము, ఒకచోట తక్కువగా నాఆవిర్భావము. కొందరు దేవతలు నా అంశలు. అట్లాగే కొందరు దేవతలు నా కళలు. (50) కొందరు కళలు, కళల అంశంలోని అంశలు. కొందరు ఆ అంశంలోని అంశలు కూడా. నా అంగమైన ప్రకృతి సూక్ష్మమైనది. అది రూపంలో ఐదు విధాలు (51) సరస్వతి, కమల, దుర్గ, నీవు, వేదములతెచ్చినవాడు (సృష్టించినవాడు) రూపముల ధరించిన దేవతలంతా ప్రాకృతికులు. (52) నేను ఆత్మను. భక్తుల ధ్యాన అనురాధాన్ననుసరించి దేహంలోనిత్యంగా ఉంటాను. (నిత్యుణ్ణి, దేహవాసిని), ఓ రాధ! ప్రాకృతికమైనవి ఏవేవున్నాయో అవి, ప్రాకృతలయ మందు నష్టమైనాయి.
అను ఇదివరలో నేనున్నాను. ముందునునేనే, తరువాతను నేనే. నేనెట్లాగో నీవు అట్లాగే. పాలు, తెలుపు ఎట్లా కలిసి ఉంటాయో అట్లా (54) వాటికి బేధం. ఎప్పుడూ రాదు నిశ్చయము. అట్లాగే మనము విడివిడిగా ఉండము. నేను మహావిరాట్టు సృష్టియందు. ఆతని వెంట్రుకలందే విశ్వములున్నాయి. (55) అక్కడ గొప్ప అంశవు నీవు. నీ అంశతో ఆతనికి, కోరతగిన దానివి. నేను క్షుద్రవిరాట్టు. సృష్టియందు విశ్వము ఆతని నాభి పద్మం నుండి వస్తుంది. (56) ఈ విష్ణువు రోమకూపమందు అంశంగా నావాసము, ఓసతి! ఆతని స్త్రీత్వము పెద్దది. తన అంశంతో భాగ్యవంతురాలు కూడా (57) ఆతని విశ్వమందు ప్రత్యేకముగా బ్రహ్మ విష్ణు శివాదులున్నారు. బ్రహ్మవిష్ణుశివులు నా అంశములు, ఇతరులు నా కళలు (58) నాకళ యొక్క అంశాంశ కళతో చరాచములన్ని ఉన్నాయి. ఓ దేవి! వైకుంఠములో నీవు మహాలక్ష్మివి, నేనక్కడ చతుర్భుజుణ్ణి. (59) ఆతడు విశ్వంకన్న బయట, పైన గోలోకంఎట్లా ఉందో అట్లా ఉన్నాడు. సత్యలోకమందు సరస్వతివి నీవు. సావిత్రి, బ్రహ్మకు ప్రియురాలు. (60) శివలోకంలో నీవు శివవు. మూలప్రకృతివి, ఈశ్వరివి.పొందకూడని దానిని, నశింపజేసి, అన్నిదుర్గతులను నశింపజేసే దుర్గవు (61)ఆమెనే దక్షకన్య, ఆమెనే పర్వతకన్య, కైలాసంలో పార్వతి ఆమె. శివుని వక్షఃస్థలమందు ఆతనితో కూడి సౌభాగ్యం నందేది. (62) నీ అంశతో నీవు సింధుకన్యవు. పాలసముద్రంలో విష్ణువు వక్షఃస్థలమందుంటావు.నేను, సృష్టియందు నా అంశంతో బ్రహ్మవిష్ణు మహేశ్వరులౌతారు. (63) నీవు లక్ష్మివి, శివవు, భూమివి, సావిత్రిని విడివిడిగా. గోలోకమందు స్వయంగా రాధవు. రాసక్రీడయందెప్పుడూ రాసేశ్వరివి. (64) రమ్యమైన వృందావనమందు వృందవు. విరజానది ఒడ్డు యందు విరజవు. అట్టి నీవు సుదాముని శాపంతో పవిత్రమైన ఈ భారత(దేశమునకు వచ్చావు (65) ఓ సుందరి! భారతదేశమును, వృందారణ్యమును పవిత్రం చేయడానికి వచ్చావు. నీకళలోని అంశాంశకళతోనే విశ్వములోని స్త్రీ లంతో (66) స్త్రీ ఎవరైనా ఆమె నీకళ, పురుషుడెవడైనా వాడు నేనే (నాకళ) . నేను కళతో అగ్నిని. నీవు స్వాహాదేవివి, కాల్చే దానివి, ప్రియవు. (67) నీతో కలిసి ఉంటేనే నేను సమర్ధుణ్ణి, నేను నీవు లేకుండా ఉంటే కాల్చడానికి అశక్తుడను. నేను దీప్తి మంతులలో సూర్యుణ్ణి. కళతో నీవు వెలుగునిచ్చే దానివి (68).
నీవు సంజ్ఞవు. నీతోనే వెలుగుతున్నాను. నీవు లేకుండానేను కాంతిమంతుణ్ణి కాదు. నేను కళతో చంద్రుణ్ణి, నీవు శోభనిచ్చే రోహిణివి (69) నీతో కూడితే మనోహరుణ్ణి, నీవు లేకుండా సుందరుణ్ణి కాదు. నేను కళతో ఇంద్రుణ్ణి, నీవు స్వర్గలక్ష్మియైన శచివి. (70) నీతో కూడి నేను దేవరాజును. నీవు లేక నేను లక్ష్మిహీనుణ్ణి. కళతోనేను ధర్మాన్ని. నీవు రూపమెత్తిన ధర్మానివి. (71) నీ ధర్మక్రియలేకుండా ధర్మకృత్యమందు నేను అసమర్థుణ్ణి. నేను కళతో యజ్ఞాన్ని నీవు స్వాహవు అంశముతో దక్షిణవు. (72) నీతో ఉంటే నేనుఫలితాన్నిస్తాను. ఐనా నీవులేకుంటే నేనసమర్ధుణ్ణి. కళతోనేను పితృలోకాన్ని నీ అంశతో నీవు స్వధవుసతివి. (73) నీతోకూడినప్పుడు కవ్యదానమందు సమర్ధుణ్ణి, నీవు లేకుండా ఎప్పుడూ అసమర్ధుణ్ణి. నేను పురుషుణ్ణి నీవు ప్రకృతివి. నీవు లేకుండానేను సృష్టించలేను. (74) నీవు సంపదలస్వరూపానివి. నీతో కూడి నేను ఈశ్వరుణ్ణి. లక్ష్మివైన నీతో కూడి నేను లక్ష్మీయుక్తుణ్ణి. నీవు లేకుండానేను సంపదహీనుణ్ణి. (75) మట్టిలేకుండా కుమ్మరివాడు కుండచేయటానికి అసమర్థుడైనట్లే. నేనుకళతో శేషుణ్ణి, నీ అంశంతోనీవు వసుంధరవు. (76) ఓ సుందరి! సస్యరత్నములధారవైన నిన్ను తల పై ధరిస్తున్నాను. నీవు కాంతివి, శాంతివి, భూతివి (ఐశ్వర్యము) రూ పెత్తిన సతివి (పతివ్రతవు) (77) తుష్టివి, పుష్టివి, క్షమవు లజ్జవు, క్షుధవు, తృష్ణవు పరవు, దయవు, నిద్రవు, శ్రద్ధవు (పుష్టి-సమృద్ధి), తంద్రవు (కునిపాటు) మూర్ఛవు, గౌరవారవు, క్రియారూపవు. (78) మూర్తిరూపవు, భక్తిరూపవు, ప్రాణులకు దేహరూపిణివి. ఎప్పుడూ నీవు నాకు ఆధారానివి. నీ ఆత్మను నేను. పరస్పరం మన మిట్లా ఒకరికొకరు (79) నీకెట్లాగో నేనట్లాగా మనమిద్దరము ప్రకృతిపురుషులము సమానము. మనిద్దరిలో ఒకరులేక పోయినా ఓదేవి! సృష్టిజరుగదు (80) అని పలికి పరమాత్మ, ప్రాణాధికమైన ప్రియను, రాధను వక్షస్సుయందుంచుకొని చాలా ఆనందపడి బోధించసాగాడు, ఓనారద! (81) ఆతడు రత్నమందిరమందు ఆ రాధతో కూడి కాముకితో కూడి ఆ కాముకుడు క్రీడయందు నియుక్తుడైనాడు. (82) అని బ్రహ్మవైవర్త మహాపురాణమందు శ్రీకృష్ణజన్మ ఖండ ఉత్తరార్ధ యందు నారాయణ నారద సంవాదమందు ఆధ్యాత్మిక యోగమును చెప్పటమనేది అరువది ఏడవ అధ్యాయము.
