4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము
103 - అధ్యాయము
శ్రీనారాయణ ఉవాచ :
శ్రీకృష్ణ ఉవాచ :
శ్రీభగవానువాచ :
శ్రీనారాయణుడిట్లా –
విభువు (శ్రీకృష్ణుడు) మథుపురికి వచ్చి తండ్రికి నమస్కరించి, వట వృక్షమూల మందు బలరామునితో కూడి నిలిచి హరి గరుడుని స్మరించాడు. (1) లవణ సముద్రాన్ని ఆదరంగా, కోరిక నెరవేర్చే విశ్వకర్మను స్మరించాడు. గోపవేషమును వదలి నృపవేషమును ఆతడు ధరించాడు. (2) ఇంతలో చక్రము స్వయంగా హరిదగ్గరకు వచ్చింది. దానికి సుదర్శనమని మరో పేరు. కోటి సూర్యుల సమానమైన వెలుగు కలది. (3) తేజస్సులో హరితో సమానమైనది. ఇంకా శత్రువులను నశింపచే సేది. వ్యర్థము కాని అస్త్రము. అస్త్రములలో శ్రేష్ఠము పరమమైన వాటికన్నా పరమైనది. (4) రత్నముల విమానాన్ని ముందుంచుకొని గరుడుడు హరి సన్నిధికి చేరాడు. శిష్యులతో కూడా విశ్వకర్మ వచ్చాడు. సముద్రము వణుకుతూ వచ్చింది. (5) వారంతా భక్తిపూర్వకంగా తలవంచి హరికి నమస్కరించారు. నవ్వుతూ, ఆదరంగా ప్రయత్నపూర్వకముగా క్రమముగా విభుడు వారితో ఇట్లన్నాడు. (6) శ్రీకృష్ణుడిట్లా - ఓ సముద్ర! మహాభాగుడ! నగరము కొరకు, నాకు శతయోజన విస్తీర్ణమైన స్థలమును ఇవ్వు. తరువాత నీకిస్తాను. నిశ్చయము. (7) ఓ కారుడ! (విశ్వకర్మ ముల్లోకములలో లభించనటువంటి నగరాన్ని నిర్మించు. అందరికి రమణీయంగా (అందం) స్త్రీలకు కమనీయంగా ఉండేట్లు నిర్మించు (కోరతగినట్లు) (8) భక్తులకు మరోవైకుంఠములాగా కోరతగినట్లు ఉండాలి. స్వర్గములన్నింటికి పరమైన అవధి వలె ఇష్టమైనదిగా ఉండాలి. (9) ఓఖగశ్రేష్ఠ! రాత్రింబగళ్ళు విశ్వకర్మ సన్నిధిలో, ద్వారకా నగరాన్ని నిర్మించే వరకు ఉండు, ఓ మహాభాగ! (10) ఓ చక్రశ్రేష్ఠ! రాత్రింబగళ్ళు, నీవు నా సన్నిధిలో ఉండు. అందరు సరే, మంచిది అని పలికి వెళ్ళిపోయారు. ఓముని! చక్రం మాత్రం వెళ్ళలేదు. (11) భద్రుడు (మంగళము) మహాబలుడు ఐన కంసుని తండ్రిని ఉగ్రసేనుని నగరమందున్న క్షత్రియుల, సుజనుల అభిప్రాయంతో రాజుగా చేశాడు. (12) జరాసంధుని జయించి, యవనుని వధించి, ఓ మహాభాగ! ఉపాయంగా ఈశ్వరుడు నిర్మాణ క్రమమారంభించాడు. (13) భగవంతుని వచన మిట్రా - నూరు యోజనముల వరకు చాలా మనోహరమైన నగర నిర్మాణము. పద్మరాగమణులు మరకతములు చాలా ఉత్తమమైన ఇంద్రనీల మణులు (14) రుచకములు, పారిభద్రములు, పలంకములు స్యమంతకమణులు, గంధకము రంగువి, గాలిమములు చంద్రకాంతాదీమణులు , (15) సూర్యకాంతాదిమణులు, స్ఫటికాకృతిగల చిన్నచిన్న రాళ్ళు, పసుపువర్ణముగల మణులు, శ్యామలవర్ణము, తెలుపు వర్ణముగలవి (16) గోరోచనములు పచ్చమణులు, దానిమ్మగింజల వంటివి, పద్మము యొక్క బీజముల వంటివి, నీలమువి, కమలవర్ణము గలవి. (17) కాటుక వర్ణముగల మణులు, ఉజ్జ్వలములు, సంస్కరింపబడిన మణులు, తెల్లని చంపక వర్ణముగలవి, కాల్చిన బంగారు రంగు గలవి (18) బంగారు వెలకన్న నూరు రెట్లెక్కువైనవి కొద్ది ఎరుపు గలవి, మంచిశోభ గలవి, పెద్దవి, శ్రేష్ఠమైనవి, మణిశ్రేష్టములు పూజింపబడ్డవి (19) విధాన ప్రకారముగా ఏది తగునో దానిని ఎక్కడదేన్ని వదిలేయాలో దాన్ని విడిచి పెడుతూ, మణులను యక్షసంఘములు హిమాలయం నుండి తెస్తున్నారు. (20)
విశ్వకర్మఉవాచ :
శ్రీభగవానువాచ :
రాత్రింబగళ్ళు నిర్మాణము జరుగుతున్నంత సేపు పనులు చేస్తారు. ఏడులక్షల యక్షులు, కుబేరునితో పంపబడ్డవారు. (21) శంకరునిచే పంపబడ్డవారు లక్షభేతాళులు.. లక్ష కూష్మాండులు, పార్వతి ఏర్పరచినవారు దానవులు, బ్రహ్మ రక్షస్సులు (22) వీరితో కలిసి పదహారు వేల పత్నులకు దివ్యమైన భవనాలు నిర్మించు. నూట ఎనిమిది మంది ఇతరుల భార్యలకు గూడ వసతి ఏర్పరచు(23) పరిఖలు, ఎత్తైన ప్రాకారములు గల పన్నెండు శాలలు గలిగిన, సింహద్వారముతో తీర్చిదిద్దబడ్డ శిబిరం నిర్మించు. (24) చిత్రవిచిత్రములైన కృత్రిమ ద్వారములుగల నిషిద్ధ వృక్షములు లేని, ప్రసిద్ధమైన వృక్షముల కర్రలు గలిగిన దానిని నిర్మించు (25) సులక్షణమైన చంద్ర వేధను, అట్లాగే ప్రాంగణాన్ని యదువులకు దివ్యమైన ఆశ్రమాన్ని అట్లాగే కింకరులకు ఆశ్రమాలు (26) ఉగ్రసేన మహారాజుకు అంతటా సిద్దంగా ఉన్న(అన్ని వసతులు గల) ఇంటిని, నా తండ్రియైన వసుదేవునకు అన్ని విధముల (రక్షణగల) శుభకరమైన ఆశ్రమాన్ని నిర్మించు అని అనగా (27) విశ్వకర్మ ఇట్లా - ప్రశస్తమైన వృక్షాలు ఏవి? నిషిద్ధమైనవి ఏవి. శుభకరమైనవి, అశుభం కలిగించేవి ఏవో వాటిని గూర్చి చెప్పు. ఓ జగద్గురు! (28) వేటి ఎముకలతో కూర్చబడ్డ శిబిరములు శుభప్రదము. ఏది అశుభప్రదము. ఏదిక్కులో నీరు శుభప్రదము, ఏది అశుభప్రదము ఓ ప్రభు! చెప్పు. (29) ఏ వృక్షము శుభప్రదమైనది. అది ఏ దిక్కులో ఉన్నది. ఇళ్ళకు ప్రాంగణములకు కొలత (ప్రమాణం) ఎంత, ఓ సురేశ్వర! చెప్పు. (30) పూల వనము ఏదిక్కున ఉండాలి అట్లాగే చెట్లు ఎటు ఉండాలి. ప్రాకారములు, పరిఖలు, వాని కొలత ఎంత, ఓ సురేశ్వర, చెప్పు. (31) ద్వారములు, గృహములు, ప్రాకారములు వాని ప్రమాణం చెప్పు. ఏఏ చెట్ల కర్రలు ప్రశస్తమైనవి శిబిరమందు, ఓ ప్రభు! చెప్పు. (32) ఏవి అమంగళమైనవి అన్ని నాకు చెప్పండి. (33) భగవంతుడిట్లా - గృహస్థుల ఆశ్రమంలో నారికేళము ధనప్రదము. శిబిరమునకు ఈశాన్యంలో. పూర్వభాగంలో ఐతే చెట్టు పుత్రప్రదమైనది. (34) మనోహరమైన తాళవృక్షము అంతట మంగళార్హమైనదే. మామిడిచెట్టు పూర్వదిక్కుయందు రాజులకు సంపదనిచ్చేది (35) అంతటా శుభప్రదమైనదే, ఓ సురకార! విను. బిల్వము, పనస, జంబీరము (నిమ్మ), రేగు (36) ఇవి పూర్వ దిక్కులో సంతానాన్ని ఇచ్చేవి. దక్షిణంలో ధనమిచ్చేవి. అంతటా సంపదనిచ్చేవి. వీటితో గృహస్థుడు వృద్ధి చెందుతాడు. (37) అల్లనేరేడు, దానిమ్మ, అరటి, ఆమ్రతకు పూర్వదిక్కులో బంధువులను కూరుస్తాయి. దక్షిణ దిశలో మిత్రులనిస్తాయి. (38) అంతట శుభమిచ్చేది ధనము, పుత్రులు, శుభమిచ్చేది. హర్షమునిచ్చేది. సువాకము దక్షిణ పశ్చిమాలలో ఆనందాన్నిచ్చేది. (39) ఈశాన్యంలోనూ సుఖమిచ్చేది అంతట మంచి చేసేది, విను. అంతట సంపెంగ శుద్దమైనది భూమి పై శుభమునిచ్చేది కూడా. (40)
సొరకాయ, అతికూష్మాండము, ఆయాంబు, మోదుగ, ఖర్జూరము, దోస ఇవి శిబిరమందుంటే మంగళప్రదములు. (41) వాస్తూకము, కారము, మారేడు, వంకాయ ఇవి శుభప్రదములు. తీగల ఫలములు, అన్ని అంతట శుభదమే. ఇది నిశ్చయము. (42) ఓకారు! ప్రశస్తమైన వాటిని చెప్పాను. నిషిద్దమైన వాటిని విను. శిబిరంలో, నగరంలోనైనా అడవిచెట్లు నిషిద్ధము. (43) శిబిరంలో వటవృక్షము నిషిద్ధము. దానివల్ల రోజు దొంగల భయముకలుతుంది. నగరంలో ప్రసిద్ధమైనది. దర్శనం వల్ల పుణ్యప్రదము. (44) శిబిరంలో, నగరంలో, పురంలో భూరుగు చెట్టు నిషిద్ధము. ఎల్లప్పుడు దుఃఖప్రదమది. రాజులకు ఎప్పుడూ కూడా దుః ఖప్రదమే. (45) గ్రామములందు నగరములందు నిషిద్ధము కాదు ప్రసిద్ధమైనది కూడా విద్యామతి నిషిద్ధము. ఎప్పుడూ దుః ఖాన్నిచ్చేది. (46) ఓకారు! చింతచెట్టును ప్రయత్నపూర్వకముగా దాన్ని విడువాలి. నూరు విధాల ధనహాని అట్లాగే ప్రజాహాని కూడ, నిశ్చయము. (47) శిబిరంలో మిక్కిలి నిషిద్ధమైనది. నగరంలో కొద్దిగా నిషిద్ధమైంది. గ్రామములందు నగరములందు నిషిద్ధముకాదు. ప్రసిద్ధమైనది. (48) విద్యామతి నిషిద్ధమైంది. ప్రాజ్ఞుడు దానిని వదలాలి. ఖర్జూరము, గహు (వేళ్ళు లోతుకుపోయే చెట్టు)ను శిబిరంలో ఉంచరాదు. (49) గ్రామమందు నగరమమందు నిషిద్ధంకాదు, ప్రసిద్ధమైనది. శనగలు మొదలగు ధాన్యము, ఆ చెట్లు మంగళప్రదము. (50) గ్రామమందు నగరమందు, శిబిరమందు చెరుకుచెట్టు శుభదము.ఎప్పుడు శుభకరాలే. (51) అశోకము, శిరీషము, కదంబము (చెట్టు) శుభప్రదము. పసుపు ఒక్కచోట శుభదము. అల్లము శుభకరమైనదే. (52) గ్రామంలో నగరంలో హరితకి (కరక్కాయ చెట్టు) శుభకరము. నవాద్య ఎల్లప్పుడు శుభం కలిగించేదే. అట్లాగే వుసిరికాయ చెట్టుకూడా. (53) ఏనుగ ఎముక, గుర్రపు ఎముక క్షేమము. ఉచ్చైశ్రవాన్ని(గుఱ్ఱన్ని) ఇంట్లో ఉంచుకున్న వారికి కళ్యాణము జరుగుతుంది. (54) ఇతరమైన వాటిని ఉంచుట శుభప్రదం కాదు. పైగా నాశకారణము వానరులు, నరులు, గాడిదలు, ఆవులు (55) కోళ్ళు, నక్కలు,పిల్లులు వీటిని ఇంట్లో ఉంచుట క్షేమకరం కాదు. పంది, గొఱ్ఱలను ఉంచుట అందరికి శుభప్రదమే. (56) శిబిరానికి ఈశాన భాగంలో పూర్వదిక్కులో పశ్చిమ భాగంలో నో జలముంచుట క్షేమము. ఇతరత్ర క్షేమముకాదు. (57) బుధుడు దీర్ఘమందు వెడల్పుయందు ఇంటిని సమానంగా చేయరాదు. ఓకారు! గృహస్థులకు చతురస్ర గృహంలో ధననాశనము జరుగుతుంది. (58) వెడల్పు అధికంగా ఉండి, రెండుతో గుణించినప్పుడు శూన్యం రాకపోతే శుభప్రదము. శూన్యం వస్తే శూన్యాన్ని ఇస్తుంది. నరులకు (రాజులకు) (59) వెడల్పులో హస్తద్వయంకన్నతక్కువై పొడవులో మూడు చేతులుంటే ఆ ద్వారము గృహములకు శుభమిస్తుంది. ప్రాకారానికి గృహానికి శుభమే. (60)
మధ్యదేశంలో చేయరాదు. కొద్ది తక్కువో, ఎక్కువో ఐనచోట శుభము. శిబిరమందు చంద్రవేధ చతురస్రంగా ఉంటే మంగళకారి (61) అభద్రమునిచ్చే సూర్యవేధ కల శిబిరము మంగళ ప్రదము. అభద్రమునిచ్చే సూర్యవేధకల ప్రాంగణము అట్లాంటిదే. (62) శిబిరంలోపల ఉంచబడ్డ తులసి నరులకు శుభప్రదము. ధనము పుత్రులు వీనినిచ్చేది పుణ్యమునిచ్చేది. హరిభక్తినిచ్చేది. ప్రొద్దున్నే తులసిని చూస్తే బంగారం దానం చేసిన ఫలములభిస్తుంది. మాలతి, మొల్ల, కుందము, మాధవి, మొగిలి (64) నాగకేసరము, మల్లిక, కాంచనము, (చెట్టు) వకుళము (పొగడ) ఇవి శుభమైనవి. విష్ణుక్రాంతము శుభమునిచ్చేది. వాటిని ఉద్యానంలా పెంచినా మంచిదే. (65) తూర్పుయందో దక్షిణమందో ఐతే శుభమిస్తాయి. అనుమానం లేదు. గృహస్తుడు ఇంటిని పదహారు చేతుల పైన (పొడవులో) చేయరాదు. (66) ఇరువది చేతుల పైన ఉండే ప్రాకారము శుభప్రదము కాదు. సూత్రధారుని (వడ్రంగుని) గానుగ వానిని, అవుసలి వానిని హీరకుని (వజ్రాలవ్యాపారి) వీరిని (67) వీధుల మూలలో, గ్రామమధ్య మందు, బుధుడు ఉంచరాదు. బ్రాహ్మణుని, క్షత్రియుని, వైశ్యుని, మంచి శూద్రుని, గణకుని ఉంచటం మంచిది. (68) శిబిరం సమీపంలో భట్టును, వైద్యుని, పుష్పకారుని ఉంచాలి. వెడల్పులో పురిఖనూరు చేతులుంటే, మంచిది. (69) అంతట శిబిరముల గంభీరము (లోతు) పదిహస్తములుంటే మంచిది. (అన్ని వైపులను). పరిఖ నుండి ద్వారము సంకేతించ తగినంత దూరముండాలి (రహస్యం). (70) శత్రువునకు చొరరాకుండా, మిత్రుడు సుఖంగా వచ్చేట్లు ఉండాలి. బూరుగు, చింత, హింతాలము, (71) వేప, వావిలి, ఉంబరము? ఇవి అశుభకరములు. ఉమ్మెత్త, వటము, ఆముదము చెట్లు ఇవి కూడా ఉండరాదు. (72) వీటికన్న ఇతరమైన చెట్ల కర్రలు శిబిరంలో ఉండొచ్చు. వజ్రహస్తము వంటి (కఠినము) వృక్షాన్ని (వెళ్ళు) పర్వతాన్ని కింద ఉండకుండా చూడాలి. (వేళ్ళూనిన చెట్టుకారాదు). (73) అది పుత్రుని భార్యను ధనమును నశింప చేస్తుంది అని బ్రహ్మ అన్నాడు. లోకములకు తెలిసే కొరకు చెప్పాను. కట్టె లేకుండా నగరాన్ని నిర్మించు (74) ఇది శుభమైన కాలము. సుఖంగా వెళ్ళు అని అనగా విశ్వకర్మ హరికి నమస్కరించి పక్షితో సహా వెళ్ళాడు. (75) సముద్రం దగ్గర మనోహరమైన వటమూలాన్ని చేరి, కారువు (విశ్వకర్మ గరుడునితో సహా అక్కడ ఆ రాత్రి నిద్రపోయాడు. (76) గరుడుడు కలలో అందమైన ద్వారకా నగరాన్ని చూచాడు. పరమాత్మ కృష్ణుడు, కారునకు ఏకొంచమో చెప్పాడు. (77) ఓముని! దానినే, ఆలక్షణాలనే అంతా నగరంలో చూచాడు. ఆ శిల్పకారులంతా కలలో కారును చూచి నవ్వుతున్నారు. (78) బలవంతమైన పక్షులు, ఇతర గరుడ పక్షులు గరుడుని చూచి నవ్వుతున్నాయి. మేల్కొని గరుడుడు చూడగా విశ్వకర్మ సిగ్గుపడుతున్నాడు. (79) చాలా అందమైన ద్వారకను నూరు యోజనముల విస్తృతి కల దానిని బ్రహ్మాదుల నగరాలను జయించి ప్రకాశించే నగరాన్ని చూచాడు. (80) కాంతితో సూర్యుని కాంతిని కప్పివేస్తూ రత్నములతో నిర్మింపబడ్డ నగరాన్ని చూచాడు. (81)
అని శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమందు శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధ మందు నారాయణ నారద సంవాద మందు ద్వారకా నిర్మాణ ఆరంభమనునది నూట మూడవ అధ్యాయము.
