4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము

Table of Contents

131 - అధ్యాయము

మూ॥ శౌనక ఉవాచ :

సూత ఉవాచ :

శౌనకుడిట్లా - చాలా అపూర్వమైన ఉపాఖ్యానాన్ని విన్నాను. చాలా అద్భుతము. దాచతగినది, దాచతగినది , రమ్యమైనది, రమ్యమైనది. నూతనమైనది (1) ఎంత అనిర్వచనీయమో, కమనీయము, మనోహరము. పురాణములలో పురాతనమైన, సుదుర్లమైన, కథ ఇది. (2) ఇట్లాంటి సుదినము మాకెప్పుడు కల్గుతుందో. వైష్ణవ సంగమమున్న జన్మసఫలము. ధన్యమైనది. (3) గర్భవాసాన్ని తొలగించేది, కర్మముల మూలాన్ని కోసివే సేది. హరిదాస్యాన్నిచ్చేది. శుద్దమైనది. భక్తుల భక్తిని పెంచేది. (4) అసాధువుల సహవాసమనే దుర్బుద్ధివల్ల కలిగే పాపాలను ఉన్మూలించడానికి కారణము. గణేశుని జన్మసంబంధమైన ఉపాఖ్యానము పురాణముల(ఇతర)లో లభించదు. (5) తులసి రాధికవీరి కథ ఎంతో అపూర్వమైనది, ఉత్తమమైనది విన్నాను. కొత్తది రహస్యమైన దానిని తెలిపారు. అవ్యక్తమైన దానిని,నాకు ఇష్టమైన దానిని తెలిపారు. ఓ మహాభాగ అంతా విన్నాను. మనోహరమైన దానిని, పరిపూర్ణంగా విన్నాను. (6) ఇష్టమైన, అగ్నిజన్మను గూర్చి ఇప్పుడు వినదలిచాను. స్వర్ణము యొక్క జన్మను వినదలిచాను, ఓమహాభాగ! దానిని నాకు వివరించ సమర్థుడవు. (7) సూతుడిట్లా - సృష్టికి సామగ్రి తయారుచేయటానికి జలమే అగ్ని. అట్లాగే ప్రకృతియే నిత్యమైనది. అట్లాగే మహాత్తు. (8) దిక్కులు, మహాకాశము, సృష్టిగోలకము అట్లాగే ప్రకృతి, మహత్తు అహంకారము అట్లాటివే. (9) శబ్దతన్మాత్రము లాగే హుతాశనుడు నిత్యము. ఐనా హుతాశనుని ఉత్పత్తిని చెబుతాను విను. (10) ఒకసారి సృష్టికాలమందు బ్రహ్మ అనంత మహేశ్వరులు అంతా శ్వేత ద్వీపానికి వెళ్ళారు. జగత్పతియైన విష్ణువును చూడవెళ్ళారు. (1) పరస్పరం పలకరించుకొని అందరు సభమధ్యలో అందమైన దానియందు, విభువుముందు సింహాసనములందు కూర్చున్నారు. (12) విష్ణువు శరీరమునుండి పుట్టిన, కమలతో సమానకాంతిగల స్త్రీలు అక్కడ నాట్యం చేస్తున్నారు. విష్ణుగాథలను చక్కని స్వరంతో పాడుతున్నారు. (13) వారి కఠినమైన పిరుదు భాగములను , కఠినమైన రొమ్ములను, చిరునవ్వుతున్న వారి ముఖపద్మాలను చూచి బ్రహ్మ మంచికాముకుడు. (14) తన మనస్సును అరికట్టుకోలేకపోయాడు. ఆ బ్రహ్మ, వీర్యం పడిపోయింది. దానిని, సిగ్గుతో, ఆవిభువు బట్టతో కప్పాడు. (15) ఆవీర్యము వస్త్రముతో కూడా కామతాపంతో బాగా తప్తమైంది. ఓద్విజ! సంగీతము ముగిశాక వీర్యాన్ని పాలసంద్రమందు వదిలాడు. (16) ఒక పురుషుడు, బ్రహ్మతేజస్సుతో వెలిగిపోతూ నీటి నుండి లేచి, సభలో సిగ్గుపడుతున్న బ్రహ్మ వక్షః స్థలమందున్నాడు. (17) ఇంతలో, కోపంతో నీటినుండి లేచి, త్వరగా వరుణదేవుడు నమస్కరించి ఆ బాలుని తీసుకోవటానికి సిద్దపడ్డాడు. (18) భయంతో ఏడుస్తు ఆ బాలుడు బ్రహ్మను చేతులతో పట్టుకున్నాడు. ఓద్విజ! సిగ్గుతో బ్రహ్మ లోకానికి ఏమీ చెప్పలేదు. (19) బాలుని చేతులను పట్టుకొని కోపంతో లాగాడు, వరుణుడు. ప్రజాపతి వరుణుని సభామధ్యమందు పడవేశాడు.

వరుణ ఉవాచ :

బ్రహ్మోవాచ :

శ్రీభగవానువాచ :

శ్రీ మహాదేవ ఉవాచ :

వరుణుడు దుర్బలుడు . అందువల్ల ఆతడు దూరంగా పడ్డాడు. విధికోపదృష్టితో మృతునివలె మూర్చను పొందాడు. (21) అమృత దృష్టితో శంకరుడు వరుణుని చైతన్యుని చేశాడు. చైతన్యం పొంది బ్రహ్మతో వరుణిడిట్లన్నాడు. (22) వరుణుడిట్లా - బాలుడు నీటిలో పుట్టాడు. కనుక నాకొడుకు నాకిష్టమైనవాడు. నేను తీసుకొని వెత్తాను. బ్రహ్మనన్నెందుకు కొట్టాలి అని. (23) బ్రహ్మ ఇట్లా - ఓవిష్ణు। మహేశ్వర! బాలకుడు నన్ను శరణుపొందాడు. భయపడుతున్న, ఏడుస్తున్న, శరణాగతుడైన ఈ బాలుని ఎట్లా ఇస్తాను. (24) శరణాగతుడు, దీనుడు, ఆర్తుడైన వాణ్ణి, అ పండితుడు తప్పఎవడు రక్షించడు. రక్షించకపోతే సూర్యుచంద్రులున్నంత వరకు నరకంలో వండబడుతాడు. (25) ఇద్దరి మాటవిని విష్ణువు నవ్వి, సర్వజ్ఞుడు సర్వేశుడైన మధుసూదనుడు తగిన విధంగా ఇట్లా చెప్పాడు. (26) శ్రీభగవానుడిట్లా - ఆడదాని తొడ కన్పించగానే బ్రహ్మ వీర్యం పడిపోయింది. నిర్మలమైన నీరు కలపాలసంద్రమందు సిగ్గుతో దానిని పడవేశాడు. (27) అందుండి ఈపిల్లవాడు పుట్టాడు. కనుక ధర్మంగా విధి కొడుకు, వరుణునకు గౌణంగా (సెకండరీ) క్షేత్రజుడు కొడుకే అని శాస్త్రం అని అన్నాడు. (28) మహాదేవుడిట్లా - విద్యాసంబంధము యోని సంబంధము కూడా వేదాల్లో చెప్పబడింది. శిష్యుడు (విద్యవల్ల) పుత్రుడు (యోనివల్ల) సమానమే అని వేదవిదులన్నారు. (29) మంత్రమును, విద్యను పిల్లవాడికి ఇవ్వటానికి వరుణుడున్నాడు. విధాతకు వహ్నిపుత్రుడు. వరుణునకు శిష్యుడు (30) పిల్లవాడికి విష్ణువు కాల్చేశక్తిని ఉజ్జ్వలమైన దాన్నివ్వని. అన్నిటిని కాల్చిన అగ్నికి వరుణునితో చల్లార్పు (31) శివుని ఆజ్ఞతో బాలునకు విష్ణువు కాల్చేశక్తి నిచ్చాడు. మంత్రమును విద్యను, మనోహరమైన రత్నమాలను వరుణుడిచ్చాడు. (32) మాయతో ఆదేవత రొమ్ముపై ఉంచుకొని ఆ బాలుని ముద్దాడాడు. విష్ణు శంకరులకు బ్రహ్మకు ఇచ్చాడు. (33) విష్ణువునకు బ్రహ్మకు నమస్కరించి శివుడు తన మందిరానికి వెళ్లాడు. అగ్ని జన్మను చెప్పారు. స్వర్ణ ఉత్పత్తి కథను వినిపించు. (34) దేవతలంతా ఒకసారి స్వర్గసభలో కూర్చున్నారు. అక్కడ అప్సరస గణములు నాట్యమాడి, పాటలు పాడుతున్నారు. (35) మంచి పిరుదులు గల రంభను చూచి అగ్నికి కామం కలిగింది. వీర్యం పడిపోయింది. సిగ్గుతో దాన్ని బట్టతో కప్పాడు. (36) వస్త్రాన్ని తొలగించి , కాంతితో వెలిగిపోతూ బంగారు సమూహం లేచింది. క్షణంలో పెరిగింది. అది సుమేరువైంది. (37) విద్వాంసులు అగ్నికి హిరణ్యరేతసుడు అని అంటారు. అని నీకు అంతా చెప్పాను. ఇంకా ఏం వినదలచావు. (38) అని బ్రహ్మవైవర్త మహాపురాణ శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధ మందు నారాయణ నారద సంవాద మందు అగ్ని బంగారముల ఉత్పత్తి అనునది నూటముప్పది ఒకటవ అధ్యాయము.