4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము
34 - జాహ్నవీ జన్మ ప్రస్తావము
శ్రీకృష్ణ ఉవాచ - శ్రీకృష్ణుడు పలికెను :
వ్యాఘ్ర చర్మము పస్త్రముగా ధరించి సర్పమే యజ్ఞోపవీతమైన వాడును బంగారము వలె మెరిసెడీ జడల ముడి పైన ఆర్థ చంద్రుని కూర్చుకొన్న వాడును త్రిశూలము పట్టీ శాయుధము ఉత్తమమైన ఖట్వాంగమును ధరించిన వాడును శ్రేష్ఠమైన రత్నముల చూర్ణముతో నిర్మించబడిన స్వరయంత్రమును (జంత్రవాద్యమును) హస్తమున ధరించిన వాడును ఐన శంకరుడు వృషభరాజము పై నెక్కి (నంది) చిరునవ్వుతో అక్కడికి వచ్చెను. భక్తితో శిరస్సు వంచి వాహనము పై నుండి దిగి కమలానాథునకు (విష్ణువుకు నమస్కరించి భక్తితో అతని ఎడమ ప్రక్కన నిలిచెను.
అక్కడికి మునులందరును ఇంద్రాది దేవతలును ఆదిత్యులు వస్తువులు రుద్రులు మనుషులు సిద్ధులు చారణులు చేరవచ్చిరి. సర్వాంగములు ఆనందముతో పులకలెత్తగా శ్రీమన్నారాయణుని స్తుతించిరి. దేవతలందరు తలలు వంచి శివునికి నమస్కరించిరి.
ఓ దేవీ! ఇంతలో అక్కడ శంకరుడు జంత్రవాద్యమును గ్రహించి మన యొక్క సుందరమైన రాసక్రీడకు సంబంధించిన మన గుణములను చెప్పునట్టి సంగీతమును పాడెను. అది మిక్కిలి యోగ్యమైన భౌళలయలతోను సమయోచితమైన రాగములతోను మనస్సులకు మోహకారణమయ్యేను. ఆ సంగీతము వైకుంఠమునకు తగిన సుందరమైన తానముతోను పద భేదములందలి విశ్రాంతితోను గురు లఘు క్రమముతోను అతి దీర్ఘముగాక మరియు హ్రస్వముగాక ఉన్నట్టి మధురమై మత్తెక్కించి గమకముతోను కూడీ సంసారములో అతి దుర్లభమై ప్రీతితో తాను సృష్టించిన, విశేషనిర్మాణ లక్షణములు గల ఆ గానమును కన్నులలో ఆనంద బాష్పములు సర్వాంగమున పులకలు మాటి మాటికేర్పడగా శివుడు పాడెను.
ఓ ప్రియరాధా! మునులందరు అతని గానము విన్నంతలోనే స్మృతి దప్పి మూర్ఛపోయిరి. ఆ తరువాత మునులు సర్వదేవతలు బ్రహ్మ శ్రీహరి యొక్క పారద్రులు నారాయణుడు లక్ష్మీదేవి శివుడు అందరును రుద్రరూపులైరి. అందరు అటువంటి (శివుని వంటి) రూపములను నిర్మించుకొనిరి. అవే రూపములు అవే ఆస్తములు, అవే వాహనములు అవే భూషణములు అదే స్వభావము అదే మనస్సు కలవారైరి. అదే విషయమందు (గానానందము) మసస్సులు గలవారై వైకుంఠము యొక్క నాలుదిక్కులందును స్థానములు నిర్మించుకొనిరి. వైకుంఠమంతయు జలపూర్ణమయ్యెను. అది చూచి నేను భయపడితిని.
ఆ సంగీతాధిదేవత జలరూపమున తన ఆనంద స్థానమైన వైకుంఠమునకు చేరవచ్చెను. గాన తన్మయులైన సురల శరీరములనుండి పుట్టిన ఆ రస ప్రవాహము దేవనది అయ్యెను. అది మోక్షాపేక్ష గలవారికి ముక్తిదాయినీ, భక్తులకు పారిభక్తిని కూర్చునది. పాపాత్ములయొక్క బహుజన్మల సంచితమైన పాపము ఏ నదిని స్పర్శించి వీచిన గాలి సోకగనే నశించునో ఆ నదిని దర్శించుట వలన స్పృశించుట వలన ఎంత ఫలము లభించునో! నేనెరుగను. ఇక స్నానమొనర్చుట వలన కలుగు ఫలమును ఎట్లు నిరూపించి చెప్పుదును! అన్ని తీర్థముల కంటే ఈ భూమి మీద పుష్కరము యొక్క అతిశయము వేదమున చెప్పబడినట్లు కీర్తింపబడినది. అటువంటి పుష్కర తీర్థము ఈ నదియొక్క పదునారవ భోగమునకును సరితూగదు.
భగీరథునిచేత (భూమికి) తేబడినందున భాగీరథి యనియు, వైకుంఠమందలి ప్రపోహము యొక్క అంశ వలన భూమికి వచ్చినందున గంగయనియు చెప్పబడినది. జహ్న మహర్షి కోపముతో త్రాగి జానువు (మోకాలు) ద్వారా తిరిగి ఇచ్చినందున అతని కన్యా స్వరూపమై జాహ్నవి అని కీర్తింపబడినది. వసువు స్వయముగా భీష్ముడుగా ఆమెకు జన్మించినందున “భీష్మసూ?” (భీష్ముని గన్నది) అనియు మూడు ప్రవాహధారలుగా నా ఆజ్ఞచేత స్వర్గమున భూమండలమున అతలమున ప్రవహించుచున్నందున త్రిపథగామీని అనియు వ్యవహరింపబడుచున్నది. ఒక యోజనము వెడల్సు అంతే లోతు ప్రవాహము గలిగి, మాటి మాటికి మిక్కిలి ఎత్తైన అలలు గల పొలవంటి నీరు గల ఆ నది వైకుంఠము నుండి బ్రహ్మలోకమునకు అక్కడి నుండి స్వర్గమునకు చేరవచ్చినది. అక్కడ దానికి "మందాకిని” అని వ్యవహారము. ఆ నదీ ప్రవాహమే స్వర్గము నుండి హిమవత్పర్వత మార్గమున పృధివిని జేరవచ్చినది. ఆ ప్రవాహమునకు “అలకనంద” యని పేరు. అది లవణ సముద్రముతో కలిసినది.
స్వచ్ఛమైన స్ఫటికముల వంటి వర్ణము గలదై బహవేగము గల ఈ నది పాపుల యొక్క పాపములనెడి ఎండు కట్టెలను కాల్చు అగ్ని రూపిణి. ఓహో! సగర వంశము వారికి ఆనందమును ముక్తిని యిచ్చినట్టేది. భూలోక జీవులకు శ్రేష్ఠమైన మెట్ల రూపమున ఉపయుక్తమై వైకుంఠమును పొందించును. అందువలనే పుణ్య మూర్తులైన సత్పురుషులకు మృత్యు సమయములో (మరణ కాలముందు) రెండు పాదములను శోధించి నోటిలో గంగా జలము పోయబడుచున్నది. అట్టి జీవులు గంగయనెడి మెట్లనెక్కి పాపసంబంధమైన ఆపదలు తొలగిపోయి బ్రహ్మలోకము వరకున్ను లంఘించి (దాటీ) సత్పురుషులై బాధారహితమైన ప్రదేశమునకు రథమెక్కి పోదురు (ముక్తిని పొందుదురు. దైవికముగా పూర్వజన్మకర్మవశమున పాపులై మునిగీ ఉన్నను (గంగా జలపానము అంత్యకాలమున చేసినందువలన) శరీరమున రోమములెన్నీ ఉండునో అన్ని సంవత్సరముల కాలము హరి మందిరములో (వైకుంఠములో) ఆనందింతురు. తరువాత వారికి అంతవరకే నిశ్చితమై యున్న పాపపుణ్యముల యొక్క అనుభవము కొద్దికాలములోనే పూర్తియగును. తరువాత భారత వర్షములో పుణ్యాత్ముల యింట జన్మించి నిశ్చలమైన భగవద్భక్తిని పొంది హరీ రూపులగుదురు (సాయుజ్య ముక్తిని పొందుదురు.
దైవికముగా బ్రాహ్మణ శవములను శూద్రులు మోసికొని పోయిన యెడల ఇరవై ఐదు దేవర్షముల కాలము వారికి నరకమందునికి సంభవించును. ఆ తరువాత పాపహారిణి (హరిరూపిణి). యెన, దయామయియైన ఆ నది వారికి గూడ సహాయము చేసి క్రమముగా ముక్తినిచ్చును. భారతవర్షములో పుణ్యాత్ముల ఇంట బుట్టించి మూడు జన్మలలో వారికి వైకుంఠమున స్థానమిచ్చును. ఇది నిశ్చితము. తీర్థయాత్రలు చేయుచు శుక్ల పక్షమున ఏ వ్యక్తి గంగాస్నానము చేయబోవునో వాడు శరీర రోమముల సంఖ్యలో సాల్గవ వంతు సంవత్సరములు వైకుంఠమున మోదమనుభవించును. పాపియైన మానవుడు గూడ {యాత్రగా గాక) ఏదో ఒక కారణముగా గంగలో స్నానము చేసినను స్నానకోలానంతరము తిరిగి పాపముచేయకున్నచో సర్వ పాపముల నుండి విముక్తుడగును. భారత ఖండములో కలియుగమున ఐదువేల సంవత్సరముల వరకు గంగానది యొక్క (మహిమ) ఉనికి ఉండును. ఇక ఆ నది యుండగా కలి ప్రభవ మెక్కడిది! కలియుగములో పదివేల సంవత్సరముల కాలము నా విగ్రహములు {ప్రతిమలు) పురాణములు నిలిచియుండును. ఆ స్థితిలో భారత వర్షములో కలి ప్రభవ మెక్కడుండును
నీటి నురుగు వంటి రంగు గలదియు ఎల్లప్పుడు అతివేగముగా ప్రవహించునదియు ఐన ఆ గంగా ప్రవాహము అతలమును పొంది భోగవతీయని చెప్పబడుచున్నది. ఆ లోకములో ఆ నదీతీరమున అమూల్యమైన పెద్ద పెద్ద రత్నములు శ్రేష్ఠమైన ఇతర మణులుండును. స్థిరమైన యావనము గల నాగకన్యలు ఆ తీరమున క్రీడింతురు. గంగాదేవి వైకుంఠములో వేయి యోజనముల లోతు లక్షయోజనముల పొడవుతో వైకుంఠమును చుట్టిముట్టి ఎప్పుడును ప్రవహించుచుండును. ఆ నదీ తీరము దివ్యమైన నానా విధ రత్నములకు నిలయము. మిక్కిలి మనోహరము. నా పుత్రియైన ఆ నదికి ప్రళయమునందును నాశము లేదు. ఇట్లు మొత్తము పుణ్యప్రదమైన జాహ్నవీ జన్మము చెప్పబడినది. ఇక మోహినీ శాపము వలన బ్రహ్మకు జరిగిన ప్రతీకారము వినుము.
ఇది బ్రహ్మవైవర్త మహాపురాణములోని శ్రీకృష్ణ జన్మఖండమందు వారాయణ వారదసంవాదరూపమైన జాహ్నవీ జన్న ప్రస్తావమనెడి ముప్పది నాల్గవ అధ్యాయము నమాప్తము.
