4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము

Table of Contents

31 - మోహినీస్తోత్ర వర్ణనము

 శ్రీరాధికోవాచ - రాధాదెవి అనెను

నాథా! ఎంతటి మనోహరము ఆశ్చర్యకరము ఐన చరిత్ర ఏంటినీ? ప్రస్తుతము బ్రహ్మయొక్క శాపకారణము వినగోరుచున్నాను. ముల్లోకముల సృష్టికర్త తపస్సులకు ఫలదాత ఐన బ్రహ్మ ఒక కులట శాపము వలన ఎట్లు అపూజ్యుడయ్యెను ?

శ్రీకృష్ణ ఉవాచ - శ్రీకృష్ణుడు పలికెను :

ఓ ప్రియురాలా! రైవత మన్వంతర కాలములో సుచంద్రుడను రాజవరుడు మిక్కిలి ధర్మబుద్ధిగలవాడు తపస్వి జోనీ వైష్ణవ శ్రేష్ఠుడు (విష్ణు భక్తవరుడు) ఉండెను. అతడు తపస్సు చేయుచు భారతవర్షములో మనోహరమైన ఈ మలయద్రోణికి వచ్చెను. ఇక్కడ ఆ రాజు వేయి సంవత్సరములు తపస్సు చేసెను. కఠోరమైన తపస్సు వలన అతని శరీరము ప్రాతబడీ శీథిలమయ్యెను. ఆ దేహముఫై పుట్టి పెరిగి పోయెను. దయానిధియైన బ్రహ్మ అది చూచి వరమిచ్చుటకు ఏకాంతమైన ఆ తపః స్థానమునకు వచ్చెను. తన కమండలములోని నా పాదము నుండి పుట్టిన గంగాజలము గ్రహించి ఆ యోగవేత్త (బ్రహ్మ) నేనుపదేశించిన మంత్రముతో బాటు చల్లెను. ఆ కమండలు జలము సోకగనే సుచంద్రరాజు స్వయముగా లేచి తన ముందు నిలిచియున్న జగత్కర్తకు భక్తితో నమస్కరించెను. నమస్కరించెడి రాజును చూచి కమలోద్భవుడు (నా నాభి కమలమందు జన్మించిన బ్రహ్మ) “రాజేంద్రా! నీ మనస్సు గల కోరిక ఏదియో దానిని పరముగా కోరుకొనుము” అన్న ఆ వాక్కు వీనీ ఆ రాజు నా పాదభక్తిని నా దాస్యముక్తిని (“శ్రీహరి పాదములయందు నీతభక్తిని శ్రీహరి దాస్య స్థితిని”) వరముగా వరించెను. బ్రహ్మదయతో కోరిన వరమిచ్చెను. ఆ రాజు మన్మధుని వంటి కాంతితో బ్రహ్మ ముందు నిలిచియుండెను.

ఇంతలో శతసూర్యుల తేజస్సు వంటి ప్రభగలదీయు, పది దిక్కులను తన తేజస్సుతో కప్పి పుచ్చు కాంతిగలదియు, శ్రేష్ఠ రత్నముల సారము (చూర్ణము) తో నిర్మించబడినదియు, శత చక్రములు గలదియు, అమూల్యమైన రత్నములతో నిర్మితమైన విచిత్ర కలశములతో వెలుగుచున్నదియు, ముత్యములు మణులు వజ్రముల యొక్క మాలలతో ప్రకాశించునదియు, రత్నాల అద్దములతో మనోహరముగా నున్నదియు, దివ్య వస్త్రముల చేత శ్వేతచామరముల చేత అలంకరింపబడినదియు, పారిజాత పుష్పమాలలతో శోభిల్లునదియు, నోనా చిత్రముల చేత చిత్రించబడినదియు (వర్ణ చిత్రములు) మిక్కిలి ఆశ్చర్యకరమగు మనస్సు వలె ప్రయాణము చేయునదియునగు ఆకాశమునుండి దీగుచున్న ఉత్తమ రథమును రాజు చూచెను. అందులో రత్నభూషణ భూషితులు చతుర్భుజులు నీలవర్ణులు స్థిరమౌవనముతో ప్రకాశించువారు, చందనము అగురు ద్రవ్యము శరీరములందు పులుముకొన్నవారు పీతాంబరధారులు అగు గోలోకనాధుని పార్షదులు చుట్టుకొని ఉండిరి. రాజు రథమందున్న దేవగణములను చూచి ముదముతో నమస్కరించెను.

వెంటనే అతని శిరస్సు మీద పుష్పవర్షము కురీ సెను. స్వర్గములో నగారాలు కొమ్ములు మనోహరములు మ్రోగెను. సంతోష పూర్ణులై సురలు ఋషులు మునులు సిద్ధులు ఆశీర్వదించి రాజును ప్రశంసించిరి. రాజు కూడ ఆ పార్షదులను ధ్యానించి తాను అదే రూపమును పొందెను. అతనిని రథమందు చేర్చుకొని పొర్షదులు అతనిని నా నివాసమునకు (గోలోకము) కొనిపోయిరి. అతడిట్లు నా పారద్రుడై సమీపమున నిలిచెను.

ఆ పిదప తన లోకమునకు పోవుచున్న బ్రహ్మను ఆ పుష్పోద్యోనములో మోహిని చూచెను. అతనిని చూడగానే మదనాగ్నులతో మిక్కిలి దగ్గురాలై పుష్ప పరిమళ వాయువులు తన పై సోకగనే వ్యామోహితురాలయ్యెను. వంకర చూపులతో అతనిని చూచి ఆమె కస్తూరి చుక్కతో బాటు సిందూర తిలకము ధరించిన తన ముఖమును చిరునవ్వుతో దాచుకొనెను. (ఇది ఒక శృంగార లీల) సుందరమైన చంపక పుష్పము వంటి శరీర కాంతీ గలదియు, స్థిర యావనము గలదియు, పెద్ద నితంబము (నడుము క్రింది భాగము) పుష్టిగా నున్న స్తనములు పిరుదులు గలదియు, శరత్పూర్ణిమనాటి చంద్రుని కాంతిని దొంగిలించిన ముఖమండలము గలదియు సన్నని వస్త్రము ధరించినదియు రత్నాలంకార భూషితయు ఐన ఆమె ముల్లోకములను తన కడగంటి చూపుతోనే లీలగా మోహింపజేయుటకు సమర్గురాలు. మిక్కిలి కాముకురాలును గజేంద్రుని వలె మందగమనము గలదియైన ఆ మోహిని అన్ని అవయవములు పులకలెత్తగా ఆ బాటలోనే మూర్ఛిల్లెను. బ్రహ్మ ఆమెను చూచి (పరిస్థితిని గమనించి) శ్రీహరిని స్మరించుచు వెళ్లిపోయెను.

ఆత్మారాముడు జితేంద్రియుడును జగత్కర్త ఐన బ్రహ్మ - ఏ మాత్రము మనోవికారము పొందక తన లోకమును చేరబోయేను. కాముకురాలైన ఆ కులట (కులమును చెరచు రంకులాడి) వివేక చన్యురాలై రాత్రింబగళ్లు నిద్రలో మెలకువలో బ్రహ్మనే తలపోయుచు సృష్టి అంతయు తన ఊరునిగానే తలంచెను. తన ప్రభువగు శ్రీహరిని వదిలి వేసెను. లేచుచు కూర్చుండుచు క్షణము పండుకొనుచు కాలుచున్న మంగలములోని పేలపు గింజవలే బ్రహ్మ వెనుక మార్గమున పోవుచుండెను.

ఇంతలో అప్సరసలలో మిక్కిలి నేర్పుగలదైన రంభ ఆ మార్గముననే కామముతో కామలోకమునకు పోవుచు ఎండిపోయిన పెదవులు దవడలు కంఠము గల తన సహచరినీ (మోహినిని) చూచి ఆమె స్థితిని బట్టి ఊహతో సర్వము తెలిసికొని నవ్వుచు ఇట్లడిగెను.

రంభోవాచ - రంభ అనెను:

ఓ ముల్లోకములందలి జనుల చిత్తములను మోహింపజేయుదానా! నీవిట్లున్నావేమి? ఓ అదృష్టవంతురాలా! త్వరగా చెప్పుము. నేను రంభను. స్మృతికి తెచ్చుకొనుము. ఎవనిని గూర్చి కామము పూనితివి? కోరుకొన్న ప్రియుని జేరబొమ్ము, జారిణి సర్వసౌభాగ్యములు గలది. మనము వివాహిత స్త్రీలము కాము - ముల్లోకములలో అందరును ఇంద్రియ సుఖము కొరకు ఏకాగ్ర మనస్సు గలవారే. ఏ సుఖాపేక్ష కారణముగా ప్రాణములు లేచి పోవుచున్నవో ఆ విషయములో జీవులకు లజ్జ ఎక్కడిది? భువనత్రయమునందు తనకు ఆత్మ కంటె (తనకంటే) ప్రియుడు వేరొకడెవ్వడును లేడు. భర్తయందు, సంతానము నందు, తన బంధువు నందు, స్నేహమేది యున్నది అది తన మూలమైనది. తన కెంతవరకు వారీతో ప్రయోజనమో అంతవరకే వారి యందు స్నేహముండును. ఎవరి యందు మనస్సు లగ్నమై యుండునో అంతవరకు ప్రేమించినవారే ప్రాణములు. ప్రియా! కోరికతో కామలోకమునకు పోవుచున్న నన్ను చూడుము.

సఖివైన నాతో నీవాలోచించి - కోకముడి బిగించి వెండ్రుకలు కొప్పుగా ముడిచి కోరిన సువేషము ధరించి ఆ ప్రియుని వద్దకు నీండు మనస్సుతో పొమ్ము. ఓ మోహినీ! నీ మోహమును మునులకు మోహము కల్గించునదిగా చేసికొనుము. ఓ మహాభాగురాలా! నీ హృదయములోని మాట చెప్పుము. జగత్రయమందలి స్త్రీల యొక్క ప్రభావమును మరియు నిన్ను రక్షించుకొనుము. సురతమందలి కోరికను స్త్రీ ఎప్పుడును ప్రకటించగూడదు. మిక్కిలి తన యందనురక్తుడైన ప్రియుని యందును నిష్కపటియైన జీవిత సహచరి యందు మాత్రమే అది తగును. అందువలన హృదయమందలి మాటను ప్రియుని వద్ద చాల ప్రయత్నముతో జాగ్రత్తగా ప్రకటించవలేను. లేనిచో అది నవ్వుల పాలగుటకు మరణమునకు త్రోవదీయును. రంభ మాటలు విని మిక్కిలి సిగ్గుపడినదియు చిరునవ్వు గలదియు అగు మోహిని ఏ హేతువు వలన తన కిట్టి స్థితి ఏర్పడెనో - ఆ మనోరథమును చెప్పెను.

మోహిన్యువాచ - మోహిని అనెను

రంభా! నిర్జన ప్రదేశమందు బ్రహ్మ (చతుర్ముఖుడు) నాకు కన్పించగనే మాటి మాటికి మన్మధాగ్నితో నా మనస్సు మిక్కిలి కాల్చబడినది. నా కొరకర్పించబడిన భోజనము రుచించుట లేదు. సూర్యచంద్రుల ఉదయాస్తమయములు తెలియుట లేదు. ప్రస్తుతము నాకు స్వప్న జాగ్రదావస్థల భేదము లేదు (రెండు సమానమే) నా ప్రాణములు అతని ఆలింగనమున కెదురు చూచుచున్నవి. ఒక్క క్షణమైనను అతనిని విడిచి నా ప్రాణము లింకొక వైపు పోవుట లేదు. మన్మధ జ్వాలల చేతను ఆహారము తీసుకొనక పోవుట వలనను బంగారము వలె మెరిసి పోయెడి నా శరీరము ప్రస్తుతము కాలిపోయిన పర్వతము వలె ఐ పోయినది.

నడచుటకు గాని నీలచుటకు గానీ పండుకొనుటకు గాని ప్రయత్నించియు శక్తిరాలనగుచు లేను, ఛ! పుంశ్చలీ జాతి (జారిణీ జాతి) త్యాజ్యము, నన్ను గూర్చి చెప్పుచున్నాను (ఈ స్థితి వ్యర్థమని) రంభా! ప్రస్తుతమే ఉపాయము ప్రయోగించవలెనో చెప్పుము. ఒక వైపు లజ్జ (స్త్రీ మర్యాద) ఇంకొకవైపు కోరిక గల ఈ శరీరము. రెంటిలో దేనిని త్యజించవలెను. మోహిని మాటలు విని అప్సర శ్శ్రేష్ఠ యగురంభ బిగ్గరగా నవ్వీ శుభమూలము హితమైన ఒక ఉపాయమును చెప్పెను.

రంభోవాచ - రంభ పలికెను

ఓ భద్రురాలా! నీ క్షేమమునకు మూలమీది సుమా! భయము వదిలీ ఉపాయము వినుము. నీ విచారము తొలగింతును. అపూర్వమైన వేషాలంకారము ధరించి మొదలు మన్మథునారాధించి అతనితో గలిసి నీవు పోయి (నీవు కోరిన కౌనిని) వ్యామోహింప జేయుము. జితేంద్రియులలో శ్రేష్టుడు సాక్షాత్తుగా నారాయణాత్మకుడు ఐన కాముని సహాయము లేకుండ ఈశ్వరుని (బ్రహ్మను) జయించుటకైవతే శక్తురాలగును! మోహినీ! పుష్కర క్షేత్రమున కేగి తపస్సు చేసి కొముని భజింపుము. స్త్రీలకు ప్రభువు దయాళువు ఐన మన్మధుడు వెంటనే నీకు సాక్షాత్కరించును అని యిట్లు రంభ చెప్పి తన ఇంద్రియ తృప్తి కొరకు మన్మధుని వద్ద కేగెను. మోహినీ పుష్కరమున కేగెను.

పుష్కర క్షేత్రమందు తపస్సొనర్చి మోహిని మన్మధుని పొంది అతనితో బాటు దోషరహితమైన బ్రహ్మలోకమున కేగెను.

ఏకాంతమున నున్న కమలోద్భవుని మోహిని చూచి అతని ముందు నిలిచి అతని మోహింపజేయుటకు పూనుకొనెను. కొంత సేపు నర్తించెను. మరికొంత సేపు చక్కగా గానము చేసెను. రాధాదేవీ! సంగీతము నాకు సంబంధించిన కళ. అది భక్తులకును చిత్త మోహనము. సృష్టికర్త మనోహరమైన ఆమె సంగీతము విని కన్నుల నీరు నింపుచు సర్వాంగములు-పులకలెత్తగా వ్యామోహము పొందెను. చతుర్ముఖుడు అట్లు వ్యామోహితుడగుట చూచి మోహిని సంతోషించిన మనస్సుతో అతని ముందు విలాసముగా శృంగార రసభావములను సంగీత ప్రమాణముతో ప్రకటించేను. చిరునవ్వు బోమముడి పాటుతో తన శృంగారావయవములను చూపించెను. మన్మధుని వలన హతబుద్ధులైన వారికి మనస్సు చెడిన వారికి ఈ ప్రపంచమున లజ్ఞ యెక్కడిది? బ్రహ్మ ఆమె భావము గ్రహించి ముఖము వంచుకొని ఆమెకు కానుకలిచ్చి (ఒక ప్రభువు కళల సత్కరించినట్లు) శ్రీహరిని స్మరించుచు ఫ్యామోహము వదిలెను.

బ్రహ్మ మనోభావమును తెలిసికొన్న మోహిని కంఠము పెదవులు దవడలు ఎండిపోగా ప్రయత్నము వ్యర్థమైనందున కోరికలు తీర్చు మన్మథుని స్తుతించెను.

మోహిన్యువాచ - మోహిని ఇట్లనెను :

విష్ణువు యొక్క అంశమైన మనస్సు సర్వేంద్రియములలో శ్రేష్టమైనది. అదియే అన్ని కర్మలకు కర్మఫలములకు బీజము. అట్టి మనస్సునందు ఉద్భవించువాడా నీకు నమస్కారము. జ్ఞాన రూపుడైన భగవానుడు మహేశ్వరుడు స్వయముగా నీ ఆత్మ. అంతట వ్యాపించెడి జగత్కర్తి నీకు నమస్కారము. ఓ జగన్నాధుని పుత్రుడా! నీకు నమస్కారము. సర్వ జీవులయందు సృష్టియు యోగుల దృష్టియు నీవే. ఓ జగత్తు చేత సాధింపబడువాడా! ఆరాధింప శక్యము గానీవాడా! వారింప శక్యము గానివాడా! నీకు నమస్కారము. ఎల్లజీవుల చేత గెలువబడనివాడా! జగజ్జేతా! జీవరూపా! జీవుల మనస్సు హరించువాడా! కోరికలకు బీజమైన వాడా! రతీనాథా! రతిప్రియా! నీకు నమస్కారము. ఎల్లప్పుడు స్త్రీ జనమునకధిష్టానమైన వాడా! స్త్రీలకు ప్రాణముల కన్న అధిక ప్రియుడా! స్త్రీలు వాహనమైన వాడా! స్త్రీలే అస్త్రములైనవాడా! స్త్రీ జనబంధూ! నీకు నమస్కారము. పతిని స్వాధీనమొనర్చునట్టి మొత్తము రూపసౌందర్యమున కాధారమైనవాడా! శుభగుణాశ్రయుడా! సుగంధ వాయువే సచివుడు (మంత్రి) గా గలవాడా! వసంతమిత్రుడా! నీకు నమస్కారము. అనేక జన్మల కాధారమైనవాడా! స్త్రీ సందర్శనము వలన పురుషులలో వర్ధిల్లువాడా! ప్రీయా వియోగము చేత మిక్కిలి తపించు విరహ జనులకు ప్రాణాంతకుడా! నీకు నమస్కారము. ఎవరి యందు నీ కృపలేదో వారికి అనర్థములేర్పడును. వారీ జ్ఞానము నశించును. ఊహకందని రూపము గలవాడా! భక్తుల విషయములో కృపా సముద్రుడా! నీకు నమస్కారము. తపస్వి జనుల యొక్క తపస్సులకు అవలీలగా (శ్రమపడకుండ) విఘ్న బీజమైనవాడా! ముక్త జనుల మనస్సును కూడ కామము గలదానీగా చేయుటకు శక్తి గలవాడా! నీకు నమస్కారము. పాంచ భౌతికములైన శరీరములు ఎల్లప్పుడును పూర్వతపస్సు చేత (ఆరోగ్య సౌందర్యములు గలవిగా) సాధింపబడునవి ఆరాధింపబడునవి. ఇట్లు పంచేంద్రియములే ఆధారముగా చేయబడినవాడా! పంచబాణుడా! నీకు నమస్కారము. బ్రహ్మ ముందు మోహిని ఇట్లు పలికి (మానసికముగా మన్మథుని స్తుతించి) ధ్యానతత్పరమై ముఖము వంచుకొని మౌనము పూనెను.

ఓ మనోహరీ! ఈ మనోహరమైన ఈ స్తోత్రమును గంధమాదన పర్వతమందు దుర్వాసముని పూర్వము మధ్యాహ్న కాలమున మోహినికుపదేశించెను. మహాపుణ్యవంతమైన ఈ స్తోత్రమును కాముకుడు భక్తితో పఠించినచో అతడు కోరిన దానిని తప్పక పొందగల్గును. నిశ్చయముగా వీచారము (చింత) లేని వాడగును. మన్మధుడు ప్రియ భక్తుని ఎప్పుడు గూడ ఉపేక్షించడు. కామదేవుని అనుగ్రహము వలన ఆ భక్తుడు ఆరోగ్యవంతుడు శ్రీమంతుడు అగును. ముల్లోకములను మోహింప జేయు సౌందర్యము గల వనితను సాధ్విని భార్యగా పొందును.

ఇది బ్రహ్మవైవర్త మహాపురాణములోని శ్రీకృష్ణ జన్మఖండమందు నారాయణ నారదసంవాదరూపమైన మోహినీ స్తోత్ర వర్ణనమసడి ముప్పది ఒకటవ అధ్యాయము సమాప్తము.