బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)
- 1 - అధ్యాయము
- 2 - సృష్టికథనము
- 3 - దేవాసురాణా ముత్పత్తి కథనమ్
- 4 - పృథుప్రభృతి సర్వదేవాదీనాం రాజ్యాభిషేక వర్ణనమ్
- 5 - మన్వంతర కీర్తనము
- 6 - ఆదిత్యోత్పత్తి వర్ణనమ్
- 7 - సూర్యవంశ నిరూపణమ్
- 8 - ఆదిత్యవంశాను కీర్తనమ్
- 9 - సోమోత్పత్తి వర్ణనమ్
- 10 - సోమ వంశ వర్ణనమ్
- 11 - సోమ వంశ వర్ణనమ్
- 12 - సోమోత్పత్తి వర్ణనమ్
- 13 - పురు వంశ వర్ణనమ్
- 14 - శ్రీ కృష్ణజన్మానుకీర్తనమ్
- 15 - వృష్ణి వంశ వర్ణనమ్
- 16 - స్యమంతక ప్రత్యానయనమ్
- 17 - శ్యమంతకోపాఖ్యానము
- 18 - భువనకోశద్వీప వర్ణనమ్
- 19 – జంబూ ద్వీప వర్ణనమ్
- 20 – జంబూ ద్వీప వర్ణనమ్
- 21 - పాతాళ ప్రమాణకథనమ్
- 22 - నరకవర్ణనమ్
- 23 - భూర్ఛువస్సువరాది లోక వర్ణనమ్
- 24 - ధ్రువ సంస్థితి నిరూపణమ్
- 25 - సర్వతీర్థ మాహాత్మ్యమ్
- 26 - స్వయంభూ బ్రహ్మర్షి సంవాదః
- 27 - భారత వర్ష వర్ణనమ్
- 28 - కోణాదిత్యమాహాత్మ్యమ్
- 29 - సూర్య పూజా ప్రకరణమ్
- 30 - ఆదిత్య మహాత్మ్యమ్
- 31 - మార్తండస్యైక వింశతి నామ కీర్తనమ్ ఆదిత్య మాహాత్మ్య వర్ణనము
- 32 - మార్తాండ జన్మ శరీర లిఖన వర్ణనమ్
- 33 - మార్తండ మాహాత్మ్యమ్
- 34 - రుద్రాఖ్యానమ్
- 35 - పార్వతీ తపో వర్ణనమ్
- 36 - ఉమా మహేశ్వర కల్యాణ వైభవమ్
- 37 - ఉమా మహేశ్వర కల్యాణే బ్రహ్మాదికృత శివస్తుతిః
- 38 - మదన దహనమ్
- 39 - దక్షయజ్ఞ విధ్వంసనమ్
- 40 - దక్షకృత శివస్తుతిః
- 41 - ఏకామ్ర క్షేత్ర మాహాత్మ్యమ్
- 42 - ఉత్కల క్షేత్ర వర్ణనమ్
- 43 – అవంతీ వర్ణనమ్ (అవంతి = ఉజ్జయిని)
- 44 - పురుషోత్తమ క్షేత్రదర్శనమ్
- 45 - పురుషోత్తమ క్షేత్ర వర్ణనమ్
- 46 - పురుషోత్తమ క్షేత్ర వర్ణనమ్
- 47 - ప్రాసాదకరణమ్
- 48 - ప్రతిమా నిర్మాణ విధాన పర్యాలోచనమ్
- 49 - కారుణ్యస్తవ వర్ణనమ్
- 50 - ప్రతిమావిర్భావ నిరూపణమ్
- 51 - పురుషోత్తవర్ణనమ్
- 52 - మార్కండేయ వట దర్శనమ్
- 53 - మార్కండేయ ప్రళయ దర్శనమ్
- 54 - మార్కండేయాఖ్యానమ్
- 55 - మార్కండేయాఖ్యానమ్
- 56 - విస్తరేణ విష్ణు మార్కండేయ సంవాద కథనమ్
- 57 - పంచతీర్థవిధి వర్ణనమ్
- 58 - నృసింహ మాహాత్మ్య వర్ణనమ్
- 59 - శ్వేతమాధవ మాహాత్మ్య వర్ణనమ్
- 60 - సముద్ర స్నానవిధి వర్ణనమ్.
- 61 - పూజా విధి కథనమ్
- 62 - సముద్ర స్నాన మాహాత్మ్యం
- 63 - పంచతీర్థమాహాతమ్యం
- 64 - మహాజ్యైష్ఠీ ప్రశంస
- 65 - కృష్ణస్నాన మాహాత్మ్య వర్ణనమ్
- 67 - ద్వాదశ యాత్రా మాహాత్మ్యమ్
- 68 - విష్ణులోక వర్ణనమ్
- 69 - పురుషోత్తమ క్షేత్ర మాహాత్మ్యమ్
- 176 - అనంత వాసుదేవ మాహాత్య్యమ్
- 177 - పురుషోత్తమ క్షేత్ర మాహాత్మ్య వర్ణనమ్
- 178 - కండూపాఖ్యానమ్
- 179 - ఋషిప్రశ్న నిరూపణమ్
- 180 - శ్రీకృష్ణ చరితే - చతుర్వ్యూహ వర్ణనమ్
- 181 - హరేరంశావతార నిరూపణమ్
- 182 - శ్రీ కృష్ణ జనన కథనమ్
- 183 - కంస విచార కథనమ్
- 184 - బృందావన గమనమ్
- 185 - కాలీయ దమనమ్
- 186 - ధేనుకవధాఖ్యానమ్
- 187 - రామ కృష్ణ కృత బహువిధ లీలా వర్ణనమ్
- 188 - గోవర్ధ నోద్ధరణమ్
- 189 - రాసక్రీడా విలాసము. అరిష్టవధ.
- 190 - కేశివధ నిరూపణమ్
- 191 - బాలకృష్ణ చరితే అక్రూర గమన వర్ణనమ్
- 192 - అక్రూర ప్రత్యాత గమనమ్
- 193 - కుబ్జోద్ధార వర్ణనమ్
- 194 - దేవకీ వాసుదేవాభ్యాం సహ కృష్ణ సంవాదః
- 195 - జరాసంధేన సహ రామ జనార్దన యుద్ధ వర్ణనమ్
- 196 - కాలయవనో పాఖ్యానమ్
- 197 - గోకులే బల ప్రత్యాగమన వర్ణనమ్
- 198 - బలరామ క్రీడా వర్ణనమ్
- 199 - రుక్మిణీ కల్యాణమ్ శంబరాసుర వధ
- 200 - ప్రద్యుమ్నాఖ్యానమ్
- 201 - అనిరుద్ధ వివాహే రుక్మి వధ నిరూపణమ్
- 202 - నరకాసుర వధ వర్ణనమ్
- 203 - అదితి కృతా భగవత్త్సుతిః
- 204 - ఇంద్ర కృష్ణ సంవాదః షోడశ సహస్ర స్త్రీ పరిగ్రహ వర్ణనమ్
- 205 - అనిరుద్ధ చరిత్ర వర్ణనమ్
- 206 - బాణ యుద్ధ వర్ణనమ్
- 207 - పౌండ్రక వాసుదేవ వర్ణనమ్
- 208 - బలదేవ మాహాత్మ్యవర్ణనమ్
- 209 - ద్వివిదవానరవధ వర్ణనమ్
- 210 - కృష్ణ నిర్యాణ కథనమ్
- 211 - కృష్ణ నిర్యాణ కథనమ్
- 212 - రుక్మిణ్యాదీనాం పరలోక గమనమ్
- 213 - వరాహావతార వర్ణనమ్
- 214 - యమలోక మార్గ స్వరూప వర్ణనమ్
- 215 - దక్షిణ మార్గ వర్ణనమ్
- 216 - నరక దుఃఖ నివారణాయ ధర్మాచరణ వర్ణనమ్
- 217 - ధర్మశ్రైష్ఠ్య వర్ణనమ్
- 218 - అన్నదాన ప్రశంసా
- 219 - శ్రాద్ధవిధి వర్ణనమ్
- 220 - శ్రాద్ధ విధి వర్ణనమ్
- 221 - సదాచార వర్ణనమ్
- 222 - వర్ణాశ్రమ ధర్మ వర్ణనమ్.
- 223 - సంకర జాతి లక్షణ వర్ణనమ్
- 224 - ఉమా మహేశ్వర సంవాదే మానవానా ముత్తమ గతి ప్రాప్తి వర్ణనమ్
- 225 - ఉమా మహేశ్వర సంవాదే దేవలోక ప్రాప్తి కారణ కథనమ్
- 226 - ముని మహేశ్వర సంవాదే వాసుదేవ మహిమ వర్ణనమ్
- 227 - ముని వ్యాస సంవాదే విష్ణుపూజా కథనే వైష్ణవానాం గతిఖ్యాపన వర్ణనమ్
- 228 - ప్రజాగరేణ విష్ణు మహిమ గాన ఫలమ్
- 229 - వ్యాస ముని సంవాదే విష్ణు భక్తి హేతు కథనమ్
- 230 - వ్యాస ముని సంవాదే మహాప్రళయ వర్ణనమ్
- 231 - వ్యాస ముని సంవాదే ద్వాపర యుగాంత కథనమ్
- 232 - వ్యాస ముని సంవాదే ప్రాకృత ప్రతిసంచర కథనమ్
- 233 - ప్రాకృతలయ నిరూపణమ్
- 234 - ఆత్యంతి కలయ నిరూపణమ్
- 235 - యోగాభ్యాస నిరూపణమ్
- 236 - సాంఖ్య యోగ నిరూపణమ్
- 237 - జ్ఞానినాం మోక్షప్రాప్తి నిరూపణమ్
- 238 - గుణ సర్జన కథనమ్
- 239 - యోగవిధి నిరూపణమ్
- 240 - సాంఖ్యవిధి నిరూపణమ్
- 241 - వసిష్టకరాల జనక సంవాదే క్షరాక్షర విచార నిరూపణమ్
- 242 - వసిష్ఠ కరాల జనక సంవాద వర్ణనమ్
- 243 - వసిష్ఠం ప్రతి మోక్షధర్మ విషయకో జనక ప్రశ్నః
- 244 - విద్యావిద్యయోః స్వరూప కథనమ్
- 245 - అజస్యాపి విక్రియయా నానాభవనమ్
- 246 - అస్య శ్రవణ పఠన కర్తౄణాం ఫలప్రాప్తి కథనమ్
211 - కృష్ణ నిర్యాణ కథనమ్
కృష్ణునిచే నిట్లు తెలుప బడి దారుకుడు స్వామికి మఱిమఱి నమస్కరించి ప్రదక్షిణ మొనరించి యాయన చెప్పి నట్లేగెను. ఏగి ద్వారక కర్జునుని గొని వచ్చి వజ్రుని రాజుం జేసెను. భగవంతుడగు గోవిందుడు వాసుదేవాత్మక మయిన తన యంశమును బ్రహ్మ మందారోపించి సర్వ భూతము లందు ధరించెను. సర్వాత్మ భావము నందె నన్నమాట. మున్ను దుర్వాసుడు చెప్పినట్లు (అది ద్విజుడు బ్రాహ్మణుడు చెప్పిన మాట యైనందున) దానిం గౌరవింని మోకాలి పై పాదముంచి యోగ సమాధిం గొని నిల్చెను. అంతట జరుడు అను వ్యాధుడు (బోయ) అచటికి వచ్చెను. వాడు మునుపటి రోకలి యందు మిగిలిన యినుప ముక్కతో తయారైన బాణముం గొని యొక లేడి కాలి యడుగు వలెనున్న హరి పాదముం జూచి బాణముతో గొట్టెను. కొట్టి యాదరికి వెళ్ళి నాలుగు బాహువులతో నున్న యొక నరమూర్తిం జూచెను. ఆయనకు ప్రణామము సేసి క్షమింపు మని మఱిమఱి వేడుకొనెను. తెలియక యొక లేడి యనుకొని కొట్టితిని. నా పాప కర్మము చేత తగల బడుచున్న నన్ను నీవు తగలబెట్ట వలదు అనెను. వానింగని భగవంతుడు నీకణు మాత్రమేని భయము లేదు. నా ప్రసాదముచే దేవేంద్ర లోకమున కేగుమని హరి పలికెను.
శ్రీహరి వాక్యానంతర మప్పుడే విమాన మేతెంచెను. ఆ బోయ హరి ప్రసాదము వలన నది యెక్కి స్వర్గమున కేగెను. అతడేగి నంతట భగవంతుడు నారాయణుడు మనసున కందని యమేయము అమలము జన్మ జరా మరణములు లేనిది సర్వాత్మకము నైన యాత్మ యందు (తన యందు) ఆత్మను (తనను) వాసుదేవ రూపమూర్తి యందు సంయోజించి మానుష దేహముం బాసి త్రివిధ మయిన గతిని బొందెను. సాలోక్య సారూప్య సాయుజ్య రూపమైన పరమ ముక్తిని బొందెను.
