బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)

Table of Contents

56 - విస్తరేణ విష్ణు మార్కండేయ సంవాద కథనమ్‌

భగవంతుడట్లు మార్కండేయునిచే వినుతింప బడి మధుర గంభీరముగ నిట్లనియె.

నీ మనసునం గల కోర్కెయేమి? తెలుపుము. అదెల్ల నిచ్చెదను

అది విని ముని యాదేవుని యెడ మనసు నిలిపి యిట్లనియె.

స్వామి! తామెవ్వరో నీ మాయ యెట్టిదో నీ దయచే నెఱుంగ గోరెదను. నా జ్ఞాపక శక్తి పోలేదు. నీయుదర మందేమేమి వింతలు గంటినో యవి నా మనసులో మెదలు చున్నవి. ఇచట చిన్ని శిశువువై యాడుకొను చున్నావు. ఈ జగత్తెల్ల నీ గర్భ మందెందుల కున్నది. ఎంతకాల మిట నుందువు. దేవేశ! విస్తరముగ తెలుపుము. తెలియ గోరెదను. నేను చూచినది యూహ కందునది గాదు.

అన దేవదేవుం జోదార్చుచు నిట్లనియె.

“వేల్పులు కూడ నన్నచ్చముగ తెలయ లేరు. నీకు ప్రీతి కూర్చుటకు తెల్పెదను. నీవు పితృ భక్తుడవు. నన్ను శరణందితివి. నీ బ్రహ్మ చర్య దీక్ష చూచి యున్నాను. “నారములు” అనగా నీరు ‘ఆయనము’ అనగా స్థానముగా గలవాడను గాన నారాయణుడను. నేనే జగత్కారణము. నాకు నాశము లేదు. భూత విధాతను భూత సంహర్తను నేనే. విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు, శివుడు, కుబేరుడు, యముడు, సోముడు, కశ్యప ప్రజాపతి, యజ్ఞము నేనే.

“నాకగ్ని ముఖము. భూమి పాదము. సూర్య చంద్రులు నేత్రములు”

ఇట్లు వానికి వేయి యుగములు ముగియ గనే స్వామి “మఱి యేమి కోరెదవన” నా పురాణమని యిట్లనియె.

నీ దయచే లోక హితము గోరి భేద భావము నశించుటకు శివ వైష్ణవవాద భేదము లంతరింప జేయుటకు నిక్కడ శివాలయము నిర్మించెదను. అందు నీ క్షేత్రమున శంకర ప్రతిష్ఠ జేసేదను. హరిహరు లొక్కటే యని లోక మెఱుంగు గాక.” అని జగన్నాధుడు భువనేశ్వర రూప మయిన లింగము జగత్కారణము. నా యాన గొని వెంటనే యిట నీశ్వరుని ప్రతిష్ఠింపుము. మా యిర్వురకు నంతరము లేదు. లోక మెఱుంగక వాదు లాడును. నా ఆలయ మిది నీ పేర నిర్మించుము. దాని కుత్తరముగ మార్కండేయ ‘హ్రదము’ అను పేర నొక తీర్థము కూడ నేర్పడును. అది సర్వపాప హరమగును. అని సర్వవ్యాపియైన జనార్దనుడు పల్కి తిరోహితు డయ్యెను.