బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)
52 - మార్కండేయ వట దర్శనమ్
ఓ మునివరు లార! కల్పాంత మందు బ్రళయమైన తఱి సూర్య చంద్రులు వాయువు చరాచర ప్రపంచము నశించి ప్రచండ ప్రలయా దిత్యుడు దయింప మేఘము లురుమ విద్యుదుత్పామున బిడుగులు వడి చెట్లు గుట్టలు భగ్నమై యెల్ల లోకము నుల్కలు పడి నశింప నెల్ల నదులు సరస్సు లింకిపోవ సంవర్త కాగ్ని వాయువుతో గూడ యాదిత్య శోభితమైన లోకమున బ్రవేశించును. అవ్వల భూమిం బ్రద్దలు గొట్టి పాతాలముం బ్రవేశించి దేవదానవ యక్షాదులకు భయము కూర్చెను. అది నాగ లోకముం దహించి యీ మేదిని నేకొంచె మేని లేకుండ గాల్చి యీ క్రింద నంతయు క్షణములో నశింప జేయును. అవ్వల నూరు వేల యోజనముల మేర వాయువు విజృంభించిన ప్రళయాగ్ని దేవాసుర గంధర్వ నాగ రాక్షసముగ సర్వముం దహించును. భయంకర జ్వాలలతో మహాధ్వనితో ప్రజ్వలించునీ రౌద్రాగ్ని కల్పాగ్ని యని శ్రుతుల వినబడును. ఇది కోటి సూర్య ప్రభతో విజృభించును. ముల్లోకములం దహించును.
ఇట్టి మహాదారుణ ప్రలయ మందు మార్కండేయుడను పరమ ధర్మాత్ముడు ఋషి ధ్యాన యోగనిష్ఠ నుండెను. ఆయన యొక్కడే యిప్పుడుండు నని శ్రుతి దెల్పును. ఆయన మోహ పాశములం గట్టువడి ఆకలి దప్పుల కింద్రియములు చెదర నమ్మహాగ్నిం గని కంఠము పెదవులు నాలుకయు నెండ భయమొంది తడ పడుచు నెల్ల భూమిం గాందిశీకుడై దిఱు గాడుచు విశ్రమించుట కించుక చోటు గానక ఏమి చేయుదు నెవ్వని శరణంద వలయునో తెలియ కున్నాను. అన నాతమని బురుషోత్తము నెట్లు కనుగొందు నని యేకాగ్ర మనస్కుడై ధ్యానించి యా దివ్యమైన పరమ పదమును మహాప్రళయ కారణమైన దాని పురుషోత్తమ నామకమైన సుప్రసిద్ధ వట రాజమును జేరెను. తొందరతో నమ్ముని యా మఱ్ఱి దరికేగి దాని మొదలున గూర్చుండెను. అక్కడ కాలాగ్ని భయము లేదు. అక్కడ నిప్పులు గురియవు. సంవర్తాగ్ని యిక్కడకు జోరదు. అచ్చట పిడుగులు పడవు. అట్టి యభయ స్థాన మందా సనాతన ఋషి విశ్రమించెను.
