బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)

Table of Contents

199 - రుక్మిణీ కల్యాణమ్‌ శంబరాసుర వధ

భీష్మకుడు విదర్భ దేశాధిపతి కుండిన నగరము రాజధానిగ రాజ్య పరిపాలన చేసెను. అతని కుమార్తె రుక్మిణి. కుమారుడు రుక్మి యనువాడు. రుక్మిణిని కృష్ణుడును కృష్ణుని రుక్మిణియు నొండరులు వరించు కొనిరి. కాని రుక్మి ద్వేషము గొని చక్రా యుధున కతడీయ డయ్యెను. జరాసంధుని ప్రేరణచే శిశుపాలునకు వాగ్ధానము చేసెను. భీష్మకుడును రుక్మితో నట్లే యనెను. అవ్వల జరాసంధాదులు కళ్యాణార్ధము భీష్మ నగరమునకు వచ్చిరి. శిశుపాలుడును వచ్చెను. కృష్ణుడు బలభద్రుడు మొదలగు యాదవులుతో గూడి యవ్వివాహము జూచుట కని వచ్చెను. రేపు వివాహము కానున్న సమయమున హరి యాకన్యం గొంపోయెను. దానికి బలరామాది బంధువుల యెడ శతృత్వము గొని శ్రీమంతుడగు పౌండ్రకుడు దంత వక్తృడు విదూరథుడు శిశుపాలుడు జరాసంధుడు శాల్వాది రాజులు కోపించి హరిని జంపుటకు తీవ్రమైన యత్నము సేసిర. అట్లెత్తి వచ్చిన యా బలగము రామాదులచే నోడి పోయిరి. రుక్మి రణమున కేశ వుంగూల్పక పురమునం బ్రవేశింప నని ప్రతిజ్ఞ చేసి కృష్ణునిం జంప దూకెను. చక్రాయుధుడు వాని చతురంగ సైన్యమును లీలగ కూల్చి రుక్మిని బడ గొట్టెను. వాడోడి పోయెను. అట్లు రుక్మిం గెలిచి శ్రీకృష్ణుడు శ్రీరుక్మిణీ దేవిని రాక్షస వివాహ విధానమున పరిణయ మాడెను. కృష్ణున కామె యందు మన్మథాంశమున ప్రద్యుమ్నుడు జన్మించెను. శంబరుడా తనిని దొంగిలించు కొని పోయెను. అతడా శంబరుని సంహరించెను.