బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)

Table of Contents

9 - సోమోత్పత్తి వర్ణనమ్‌

 ఓ విప్రులార! సోముని తండ్రి అత్రి భగవానుడు ఋషి. అయన బ్రహ్మ మానస పుత్రుడు. అతడు గొప్ప తప మొనరించిన వాడు. అతడు మూడు వేల దివ్య సంవత్సరములు తపమా చరించెనని ప్రసిద్ధి. ఆయన యొక్క తేజస్సు మీదికి జిమ్ము కొనెను. అదియె సోమ రూపము దాల్చెను. అయన కళ్ళ నుండి నీరు దిక్కుల ప్రకాశింప జేయుచు. పది తెఱంగుల స్రవించెను. దశదిశాధి దేవత లేకమై విధి యానతి నా తేజస్సును ధరింపబోయు శక్యముగాక జార విడిచిరి. వసుధపై బడిన యా సోమరూప మయిన వీర్యమును జూచి లోక పితా మహుడైన బ్రహ్మ లోకహితమునకై తన రథ మెక్కించు కొనియె అత్రి కుమారు డట్లు బడుట చూచి బ్రహ్మ కుమారులు దేవతలు మరి ముని వరులు పొగడిరి. అట్లు స్తుతింపబడు సోముని తేజస్సు లోకముల నాప్యాయ నముసేయ నెల్లడల నలము కొనియె. అ సోముడు బ్రహ్మ యొక్క రథము నందధష్టించి సాగర పరీవృతయైన యివ్వసుంధర నిరువది యొక్క మారులు బ్రదక్షణము సేసెను. అయన తేజస్సు భూమియందు బ్రవేశించెను. అందుండి సర్వౌషధులు సర్వ జగదాధార భూతములై మొలచినవి. ఆ సోముడు స్తుతులచే స్వకీయ సత్కృతులచే తేజస్సు వడసి పద్మ దర్శనమునకై తప మొనరించెను. బ్రహ్మ విదగ్ర గణ్యుడగు బ్రహ్మ యతనికి బీజౌషధుల యొక్కయు విప్రుల యొక్కయు జలము యొక్కయు సామ్రాజ్య మొసంగెను.

సౌమ్యులకెల్ల సౌమ్యుడగు నాతడది వడసి, సహస్రశత దక్షిణముగ రాజ సూయము చేసెను. ముల్లోకములను నాకైరవ బంధువు దక్షిణ యిచ్చెనని వినన య్యెడిని. ఆ రాజసూయా ధ్వరమున సదస్యులై బ్రహ్మర్షులు దక్షిణల నందు కొనిరట. హిరణ్య గర్భుడు (బ్రహ్మ) అత్రి భృగువు నందు ఋత్విజు లైరి. బహుముని పరివృతుడై హరి యందు సదస్యు డయ్యెను. ఆ సోముని సినీకుహువు, ద్యుతి, పుష్టి, వ్రభ, వసువు, కీర్తి, ధృతి, లక్ష్మియను తొమ్మండ్రు దేవతా సుందరీ మణులు సేవించిరి. అవబృథ స్నాతుడై సర్వ దేవర్షి పూజితుడై పది విధముల దిక్కులను ద్భాసింప జేయుచు సోమ రాజేంద్రుడు వెలుగొందెను. ఏరికి బడయరాని యైశ్వర్య మంది ఋషి సత్కార నంభృతమై దనకు లభించెనని యుప్పొంగి యవినయము ననయమునకు (అనీతి) లోబడి యాతని మతి పోయినంత నతడమి తైశ్వర్య మద మోహితుడై కానక బృహస్పతి భార్యను తారను బలాత్కారమున హరించెను.

దేవతలు దేవర్షులు మఱిమఱి యాచించినను నతడు వినక తార నాంగిరనునికి అప్పగింపక య పోయెను. అపుడు యంగిరను మడమలం ద్రొక్కికొని ఉశనసుడు (శుక్రుడు) వచ్చెను. రుద్రుడు అజగవమ్మను విల్లుకొని పార్ష్ణి గ్రాహు డయ్యెను. అతడు బ్రహ్మ శిరోనామ కాస్త్రము గొని దేవతలపైకి విసరెను. దానిచే నవ్వేల్పుల కీర్తి కళంకిత మయ్యెను. తారకా మయమును ప్రఖ్యాత మయ్యుద్ధ మక్కడ దేవ దానవ లోక క్షయకర మయ్యెను. బ్రాహ్మణులారా ! అందు మిగిలిన దేవతలు తుషి తులను దేవతలు సనాతనుడును నాది దేవుడునగు బ్రహ్మను శరణు జొచ్చిరి.

పితామహు డంతట శుక్రుని రుద్రుని (శంకరుని) వారించి స్వయముగ తారను అంగిరసుని కప్ప గించెను. బృహస్పతి, యా యిల్లాలి నంతః ప్రసవగ గమనించి (గర్భిణి యగుట గ్రహించి) క్రుద్ధుడై నాకు హక్కయిన ఈయోని యందు గర్భము దాల్చుట నీకుచితము గాదనిన నామె ముంజ గడ్డి యందుంచెను. ఈ శిశువు పుట్టి నంతనే దివ్య శరీరము నొందెను. సుర వరులంతట సంశయమంది తారంగని నిజము చెప్పుము. ఈ బాలుడు సోముని కొడుకా లేకా బృహస్పతి బిడ్డడా యనగా నామె వేల్పులకు బదులు పలకదయ్యె. అపుడు చోర హస్తకుడగు నా మారుడామెను శపింప బూనిన వారించి బ్రహ్మ, తారా! ఇందు నిజమేది చెప్పుము. వీడెవ్వని కొడుకు? అననామె ప్రాంజలియై సోముని వాడని యనెను. అయ్యడ సోముడా పావని శిరంబు మూర్కొని వానికి బుధుడని నామ కరణ మొనరించెను. అ బుధుడు గగనమున ప్రతికూలముగ నుదయించు చుండును. అతడు వైరాజ మనువు పుత్రిక యందు పుత్రుని గనెను. అ పుత్రునకు పురూరవుడను పుత్రుడు జనించెను. పురూరువున కూర్వశి యందేడ్గురు మహాత్ములైన కుమారు లుదయించిరి. ఇది సోముని జన్మ వృత్తాంతము. ఇది కీర్తంప కీర్తి కలుగును. ఈ సోమవంశ సంకీర్తనము ధన్యతను అయుష్యము, ఆరోగ్యము, పుణ్యము గూర్చును. సంకల్ప సాఫల్యము గూర్చును. సోమజన్మ వృత్తాంతము విన్న యతడు పాప విముక్తి నందు గల్గును.