బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)
13 - పురు వంశ వర్ణనమ్
సూత! పురు వంశమును, ద్రుహ్యుడు అనువు యదువు తుర్వసుడు నను వారి వంశములను వేర వేర వినవల తునుని కోరుచున్నాము.
ముని పుంగవులరా! మొదట మహాత్ముడైన పూరువు వంశమును గూర్చి మొదటి నుండి విస్తారముగా జెప్పు చున్నాను. వినుడు.
పూరువు కుమారుడు సువీరుడు, వానికి మనుస్యుడు, వానికి అభయదుడు. వానికి సుధన్వుడు, వానికి సుబాహువు, వానికి రౌద్రాశ్వుడు, రౌద్రాశ్వునకు దశార్ణేయుడు, కృకణేయువు, కక్షేయువు, స్థండిలేయువు, నన్నతేయువు, ఋచేయువు, జలేయువు, బలశాలి యగు స్థలేయువు, ధనేయువు, వనేయువు నను పది మంది గల్గిరి. మరియు భద్ర, శూద్ర, మద్ర, శలద, మలద, ఖలద, నలద, సురస, గోచవల, స్త్రిరత్నకూట యను పది మంది కుమార్తెలు జనించిరి. అత్రి వంశ మందు దయించిన ప్రభాకరుడను ఋషి వారందరకు భర్త యయ్యెను.
అతడు భద్ర యందు యశస్వియగు సోముని గనెను. సూర్యుడు రాహువుచే నిహతుడై (గ్రహణ మందు) యాకాశము నుండి పడి పోవుచున్న తఱి, లోక మంధకార బంధురమైన యెడ యీ ప్రభాకరుని వలననే వెలుగేర్పడెను. నీకు స్వస్తి (శుభము) గలుగు గాక యని ప్రభాకరు డన్నంత, సూర్యు డంతరిక్షము నుండి క్రిందికింబడ డయ్యెను. ప్రభాకరుడత్రి ప్రధానము లయిన అత్రేయస గోత్రములకు కర్తయయ్యె. యజ్ఞము లందత్రికి బలము దేవతలచే కల్పింప బడెను. (ఇప్పటికిని యజ్ఞ సదస్సు నందాత్రేయన గోత్రుల కగ్రపూజ యిచ్చుట సంప్రదాయ సిద్ధ మైనది.) ప్రభాకరుడా పది మంది పత్నుల యందు పది మంది కుమారులను వేద పారగులను గోత్ర కర్తలను గాంచెను. వారు స్వస్త్యాత్రేయ లనుపేర ప్రఖ్యాతి గనిరి.
త్రివిధ ధన శూన్యులు. (సూర్యుడు పడిపోవుట జూచి ఆత్రేయుడగు ప్రభాకరు డాయనకు స్వస్తి యగుగాక యన్నందున నా గోత్రము వారికీ బిరిదు వచ్చిన దన్న మాట) కక్షేయుని కుమారులు మువ్వురు. మహారధులు సభానరుడు, చాక్షుషువు, పరమన్యువు ననువారు. సభానరుని కుమారుడు విద్యాంసుడగు కాలానలుడు. వాని కుమారుడు ధర్మజ్ఞుడగు సృంజయుడు వాని పుత్రుడు వీరుడు, మహా రాజునగు పురంజయుడు వాని కుమారుడు జనమేజయుడు. మహాశాలుడు జనమేజయిని పుత్రుడు. మహాశాలుడు దేవతలలో విఖ్యాతుడు. సుప్రతిష్ట గన్నవాడు, నయ్యెను. మహాశాలుని కుమారుడు మహామనుడు దేవ పూజితుడు. మిక్కిలి గొప్ప మనస్సు గలవాడు. ఆయన కొడుకులు ధర్మజ్ఞుడగు ఉశీనరుడు, మహా బలశాలి యగు తితిక్షుడు నను వారిద్దరు. ఉశీనరుని పత్ను నైదుగురు. రాజర్షి వంశము వారు. నృగ, కృమి, నవ, దర్వ, దృషద్వతి యనువారు. వారి యందు ఉశీనరునకు వార్ధక దశలో తపః ప్రభావముచే కులోద్వహులైన కుమారు లైదుగురు. నృగకు నృగుడు, కృమకి కృమి, నవకు నవుడు, దర్వకు సువ్రతుడు, దృషద్వతికి శిబియనుజౌశినర ప్రభువు జన్మించిరి. శిబికి శిబులయుడను నల్గురు కొడుకులు నృగునికి యౌధేయులు గల్గిరి. నవునిది నవయను రాష్ట్రము. కృమిది కృమిలాపురి, సువ్రతుని కంబష్టులు గల్గురి. శిబ యొక్క నల్గురు కుమారులు వృషదర్భుడు, సువీరుడు, కేకయుడు, మద్రకుడునను వారు, వారిదేళములు సర్వ సంవత్స మృద్ధములగు కేకయములు, మద్రకములు వృషదార్భములు సువీరములు నను ప్రసిద్ధి నందినవి. తితిక్షువు పూర్వ దిక్కునకు రాజయ్యెను.
తితిక్షుని కుమారుడు ఉషద్రధుడు. వాని కుమారుడు ఫేనుడు, వానికి సుతవుడు వానికి బలి కలిగిరి. బలి మనుష్య జన్మ మెత్తెను. అతడు బంగారపు తూణీరము (అమ్ముల పొది) గలవాడు. మహా యోగియై రాజ్య మేలెను. వంశోద్దారకులగు నైదుగురు కుమారులను భూమి యందు గనెను. వారు అంగుడు, వంగుడు, సుహ్ముడు, పుండ్రుడు, కళింగుడు ననువారు, వారి పరంపర బాలేయ మనుపేర క్షత్ర వంశము ప్రసిద్ధి గాంచెను. లేయాలను, బ్రాహ్మణులను, బలి వంశోద్ధారకులును, గూడ నైరట. బ్రాహ్మ సంతోషించిన వాడై బలికి మహా యోగిత్వము కల్ప పూర్ణాయువు, ధర్మతత్తార్ధ మెఱుంగుడి సాటి లేని బలమును సంగ్రామ మంద జేయత్వము ధర్మ ప్రాధాన్యము, తైలోక్య దర్శనము, సంతాన ప్రాధాన్యము చాతుర్వర్ణ్య వ్యవస్థాపనము నను లక్షణములను వరముగ నొసంగెను; ఇందు వలన బలి పరమ శాంతి వడసెను. కాలక్రమమున నతడు స్వస్థానమును (పాతాళమును) చేరెను. అంగాదుల పేర నాయా దేశములు ప్రసిద్ధినంది యున్నవి. అంగుని కొడుకు దధివాహనుడు. వాని కొడుకు దివిరధుడు. వాని పుత్రుడు ఇంద్రతుల్య పరాక్రముడు విద్వాంసుడు నగు ధర్మరధుడు వాని పుత్రుడు చిత్రరథుడు, ధర్మరథుడు కొలం జరాద్రిపై యజ్ఞము చేసి యింద్రునితో గూడి సోమ పానము జేసెను. చిత్రరథుని తనయుడు దశరధుడు, లోమ పాదుడను ఖ్యాతి నందెను. ఆయన కూతురు శాంత. ఆ దశరధునికి శాంతా భర్తయైన ఋష్యశృంగుని యనుగ్రహముచే చతురంగు డనువాడు వంశోద్ధారకుడై జనించెను.
చతురంగునికి పృధులాక్షుడు, వానికి చంపుడు గలిగెను (ఈతని రాజధానియే చంపాపురి. ఇంతకు మున్నీ నగరము ‘మాలిని’ యన బడెను.) అతనికి పూర్ణభ్రదుని ప్రసాదమున హర్యంగుడు గల్గెను. వైభాండకి (ఋష్య శృంగముని) మంత్రములతో నింద్రుని ఉత్తమ వాహనమైన ఐరావతమును ఆ హర్యంగుని యేనుగుగా భూమికి దింపెను. హర్యంగుని తనయుడు ఛద్రరధుడను రాజు. వాని కోడుకు బృహత్కర్మ యను నరేంద్రుడు, వాని పుత్రుడు బృహద్దర్భుడు వాని తనయుడు బృహన్మనుడు, రాజేంద్రుడగు వాని కుమారుడు జయద్రధుడు వాని పుత్రుడు దృఢరథ మహారాజు, వాని సుతుడు విశ్వ జిత్తయిన జనమేజయుడు. వాని కుమారుడు వైకర్ణుడు. వాని పుత్రుడు వికర్ణుడు వానికి నూర్గురు కొడుకులు గల్గిరి. వారంగవంశ వర్ధనులు, ఆంగ వంశరాజుల నందరిని తెల్పి యుంటిని, వారందరు సత్యవ్రతులు, మహత్ములు, సంతాన వంతులు, మహారదులు, రౌద్రాశ్వ తనయుడైన ఋచేయుని వంశమిక వర్ణించెద, వినుడు.
ఋచేయుని తనయుడు మతినారుడు, వాని కొడుకులు పరమ ధార్మికులు ముగ్గురు. వసురోధుడు, సుబాహువు అనువారు. అందరు వేదవిదులు, బ్రహ్మణ్యులు, సత్యసంగరులు, మతినారుని కూతురు ఇల ఆమె స్త్రీయయ్యు బ్రహ్మ వాదిని యయ్యె. ఆమె తంసుని భార్య. వారి కొడుకు రాజర్షి ప్రతాప శాలియైన ధర్మనేత్రుడు అయిన బ్రహ్మావాది, పరాక్రమ వంతుడు అతని భార్య ఉపదాసవి. వారి కుమారులు నల్వురు దుష్యంతుడు, సుష్మంతుడు, ప్రవీరుడు, అనఘడు ననువారు.
దుష్యంతునికి శకుంతల యందు దయించిన వాఁడు భరతుడు. సర్వదమనుడను ఖ్యాతి నందెను. అతడు పదివేల యేనుగుల బలము గలవాడు. చక్రవర్తి, అయన పేరనే భారత వర్షము ఆందలి ప్రజలు భారతులను పేరును పొందిరి. భరతుని తనయులు మాతృ శాపమున నశించిరి. ఆ కథ మున్న తెలిపితిని. బృహస్పతి (అంగిరస్సు) యొక్క కుమారుడు భరద్వాజుడు భరతునిచే బెక్కు యాగములు చేయించెను. కాని అవి పుత్ర సంతానము విషయములో వితధములు (వ్యర్థములు) కాగా భరద్వాజుని వలన (నియోగము వలన) అతనికి వితథుడను పుత్రుడు కలిఁగెను. వాడు కలిగిన వెంటనే భరతుడు దివమునకు వెళ్ళెను. అతనికి పట్టము గట్టి భరద్వాజుడు వనంబున కేగెను.
వితధునికి అయిదుగురు సుతులు గల్గిరి, సుహోత్రుడు, సుహోత, గయుడు, గర్గురు, కపిలుడు ననువారు. సుహోత్రుని కొడుకులు సత్యవాదియగు కాశికుడు, నరపతి యగు గృత్సమతి. గృత్సమతి పుత్రులు బ్రాహ్మలు, క్షత్రియులు, వైశ్యులును. కాశికుని కుమారుడు (కాశేయుడు) దీర్ఘతపుడు. దీర్ఘతపుని కుమారుడు విద్వాంసుడైన ధన్వంతరి. ఆయన కుమారుడు కేతుమంతుడు వాని కుమారుడు విద్వాంసుడైన భీమరధుడు, వాని కుమారుడు వారణాసి ప్రభువగు దిశోదానుడు, దిశోదాను కొడుకు వ్రతర్ధనుడు వీరుడైన ప్రభువు అతని కుమారులు వత్సడు, బార్గవుడు, వత్స రాజు పుత్రుడగు అలర్కుడను ఠాణు బుద్ధిమంతుడు. హైహయుని దాయాద్యమును (రాజ్యమును) హరించెను అంతియ గాక దివోదానుడు హరించిన పితృ రాజ్యమును తిరిగి సంపాదించు కొనెను.
అలర్కుడు కాశీ రాజు బ్రహ్మణ్ముడు సత్యసంగరుడు అరువది ఆరు వేలేండ్ల యువకుడై రూప సంపన్నుడై యుండెను. లోపాముద్ర ప్రసాదమున దీర్ఘాయువు నొందినాడు. చివరి వయస్సున క్షేమక రాక్షసుని జంపి రమ్యమైన వారాణసీ నగర నిర్మాణము సేసెను. అలర్కుని కొడుకు క్షేమకుడు వాని సుతుడు వర్షకేతుడు, వాని తనయుడు విభువు. విభుని కొడుకు ఆనర్తుడు. నుకుమారుడు వాని కొడుకు, వాని తనయుడు సత్యకేతువు ధర్మమూర్తి. వత్సునకు వత్సభూమి, భార్గవుని వలన భర్గభూమియు కలిగెను, భార్గవ వంశము నందు అంగిరసుని పుత్రులు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు గలరు.
బ్రహ్మణోత్తములారా! అజమీడుని వంశము వినబడు గాక! సుహోత్రుని పుత్రుడు బృహన్నామకుడు వాని తనయులు ముగ్గురు. అజమీఢుడు, ద్విమీఢుడు, పురుమీఢుడు. అజమీఢుని భార్యలు నీలిని, కేశిని, ధూమీని యను వారు. అజమీఢునకు కేశిని యందు ప్రతాప వంతుడగు జహ్నువు కలిగెను, అతడు సర్వమేధ మను మహాసత్ర యాగ మొనరించెను. గంగాదేవి యాయనను భర్తగా రించి వినీతురాలి వలె నభిసరించెను. అతడు యిష్ట పడకున్నంత నాతని యజ్ఞ సదస్సును ముంచెత్తెను. జహ్ను వందులకు కోపించి యిదిగో నీ నీరమును సంక్షేపించి త్రాగెదను చూడుమని త్రాగి వైచెను. ఋషులు చూచి యామె నాతని కుమార్తెగా నొనర్చిరి. యువనాశ్వుని కూతురగు కావేరి నాతడు పరిణయ మయ్యెను. గంగా శాపమున నవ్వల కావేరి యొక్క సగము మేను నదీ రూప మయ్యెను. జహ్నుని తనయుడు అజకుడు, వాని కుమారుడు బలాకాశ్వుడు, వాని సుతుడు మృగయా ప్రియుడు కుశికుడు, అడవి జాతులతో పెరిగి నాడు. అత డింద్రతుల్యు డగు సుతుడు కావలె నని తపము జేసెను. ఇంద్రుడ డలి గాధియను పేరుతో దానే స్వయముగ వాని కుద యించెను. గాధి తనయుడు విశ్వామితుడు, అష్టకుడాతని కొడుకు, వాని కొడుకు తౌహీ, ఇది జహ్ను గణము.
అజమిఢుని రెండవ వంశము. అజమీఢునికి నీలి యందు సుశాంతి పుట్టెను. వానికి పురుజాతి, వానికి వాహ్యాశ్వుడు వానికి అయిదుగురు కల్గిరి. ముద్గలుడు సృంజయుడు, బృహదిషు రాజు. పరాక్రమ శాలి యగు యువీనరుడు, కృమిలాశ్వుడు. ఈ అయుదుగురు దేశములను రక్షింప జాలుదురు. అని ప్రసిద్ధి.
ముద్గలుని దాయాదుడు మౌద్గల్యుడు, ఆయన వలన ఇంద్రసేన బ్రధ్నశ్వుడును కోమరుం గన్నది. సృంజయుని కుమారుడు పంచజనుడను వాడు. వాని కొడుకు సోమదత్తుడు. వాని కొడుకు కీర్తిశాలి సహదేవుడు. వాని పుత్రుడు సోమకుడు. అజమీడు వంశము యొక్క క్షీణదశలో సోమకుడు పుట్టెను. వాని కొడుకు జంతువు. వానికి నూర్గురు కుమారులు. వారిలో చిన్నవాడు వృషతుండు. వాని కొడుకు ద్రుపదుడు. ఇంత వరకు అజమీఢ వంశము. వారు సోమకులను పేరుతో ప్రఖ్యాతి గనిరి.
మునిశ్రేష్టులారా! అజమాఢుని మహిషి ధూమిని పతివ్రత. వ్రతాచరణ పరాయణ. సంతతికై పదివేలేండ్లు దుశ్చరమైన తప మాచరించి అగ్ని హోత్రము సేయుచు మిత భోజనయై అగ్నిహోత్ర సమీప దర్భలందు శయించెను.
అమెతో అజమీఢుడు నమావేశమంది ధూమ్రవర్ణుడు చక్కని వాడునగు ఋక్షుడను కుమారుని గాంచెను. ఋక్షుని వలన సంవరణుడు వానికి కురువు గల్గెను. అతడు ప్రయాగ నుండి వెళ్ళి కురుక్షేత్రము నిర్మించెను. అది పవిత్రము, రమణీయము, పుణ్య వంతులచె సేవింప బడునది. ఆయన వంశీయులే కౌరువులు. కురుని కుమారులు నల్వురు, సుధన్వుడు, సుధనుడు, పరీక్షిత్తు మహాపరాక్రమ వంతుడగు అరిమేజయుడు. పరీక్షిత్తు కొడుకులు జనమేజయుడు, శ్రుతసేనుడు, అగ్రసేనుడు, భీమసేనుడు, వీరందరు శూరులు, బలశాలురు. జనమేజయుని తనయుడు బుద్ధి శాలియగు సురధుడు. వాని సుతుడు విదూరథుడు, వాని కొడుకు మహారథుడగు ఋక్షుడు. రెండవ వాడు భరధ్వాజుని వలన నదే పేర ప్రఖ్యాతి వడెసెను. సోమ వంశ మందిద్దరు ఋక్షులు, ఇద్దరు పరీక్షిత్తులు, ముగ్గురు భీమసేనులు, ఇద్దరు జనమేజయులు గల్గిరి.
రెండవ ఋక్షునికి భీమసేను ముదయించెను, వానికి ప్రతీవుడు. వానికి శాంతనుడు, దేవాపి, బాహ్లీకుడు అను మువ్వురు గల్గిరి. శాంతసునికి భీష్ముడు దయించెను.
బ్రాహ్మణులారా! బాహ్లీకుని వంశము వినుడు. బాహ్లీకునికి కీర్తి శాలియగు సోమదత్తుడు, వానికి భూరిశ్రవుడు శలుడు, దేవాపిముని దేవతుల కుపాధ్యాయు డయ్యె. చ్యవన పుత్రుడు కృతకు డతని కిష్టుడయ్యెను. శాంతనుడు కౌరవ శ్రేష్టుడు రాజయ్యెను.
త్రిలోక ప్రసిద్ధమైన శంతను వంశము తెల్పెద. శంతనుని వలన గంగ దేవవ్రతుని గన్నది. అతడే భీష్ముడు. (గాంగేయుడు). పాండవులకు పితా మహుడు. శంతనుని భార్య కాళి విచిత్రు వీర్యుని గాంచెను. విచిత్ర్య వీర్యుని క్షేత్రమందు (భార్య యందు) కృష్ణ ద్వైపాయనుని వలన ద్భతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు పుట్టిరి.
ధృతరాష్ట్రునికి గాంధారి యందు దుర్యోధనాదులు నూర్గురు గల్గిరి. దుర్యోధనుడు రాజయ్యెను. పాండురాజు కుమారుడు ధనంజయుడు. అయనకు సౌభద్రుడు (సుభద్ర కొడుకు) అభిమన్యుడు. వానికి పరీక్షిత్తు గల్గిరి. పరీక్షిత్తునకు పారిక్షిత్తు (జనమే జయుడు) వానికి కాశి యందు ఇద్దరు సుతులు పుట్టిరి. మహారాజగు చంద్రా పీడుడు, మోక్షజ్ఞుడగు సూర్యా పీడుడు ననువారు. చంద్రా పీడుని కొడుకులు నూర్వురు. మంచి విలుకాండ్రు. జానమేజయ మను పేర నీ క్షత్ర వంశము ప్రసిద్ధి కెక్కినది.
అందు మొదటి వాడు సత్యకర్ణుడు వారణాసీ నగర మందుండెను. ఈతడు పరాక్రమ శాలి, యజ్వ. విపుల దక్షిణుడు. వాని దాయాదుడు శ్వేతకర్ణుడు. ప్రతాప శాలి. అపుత్రకుడై వనమున కేగెను. అతని వలన వనమున యదు వంశమున పుట్టి నదియు సుచారుని కుమార్తెయు నగు మాలిని (గ్రాహమాలిని) గర్భవతి కాగా శ్వేతకర్ణుడు పూర్వము సంకల్పించిన మహా ప్రస్థానమున కేగెను. మాలినియు ప్రియుని వెంబడించి మార్గ మందు సుకుమారుడైన కుమారుం బ్రసవించెను. అ శిశువు నక్కడనే విడిచి, మహా ప్రస్థానమున పతుల ననుగమించిన ద్రౌపది వలె మహానుభావు రాలగు నామె రాజు ననుగమించెను.
ఆ విడిచి పెట్టిన శిశువు పర్వతమం దేడ్చు చుండగా దయ చూప మేఘములు ఆ మహాత్మునికి నీడ యిచ్చెను. శ్రవిష్ఠా కుమారు లిద్దరు పైప్పలాది కౌశికుడను వారు జాలిగొని యా బాలుని జలము నందు గడిగిరి. అంతకు మున్నేడ్చుచు పాషాణ మందు దొరలిన యా బాలుని రక్తసిక్తమైన శరీరము యిరు పార్శ్వములు మేకవ తెనల్పెక్కినవి. అందువలన నా బాలుని కా మునులు అజపార్శ్వుడు అను నామకరణము గావించిరి. అతడు రేమకుని యింట నిద్దరు బ్రాహ్మణులచే బెంప బడెను. రేమకుని భార్య యతనిని తన పుత్రునిగా నెత్తుకొనగా నామెకతడు కొడు కయ్యెను. అతనికా బ్రాహ్మణులు మంత్రులైరి.
వారిపుత్ర పౌత్రులు సమాన జేవనుతైరి. ఇది పౌర వంశ చరిత్ర. మహానుభావు లైన పాండవుల గథ. ఈ విషయములో పరమ ప్రీతినందిన ధీమంతుడగు నహుష కుమారుడగు యయాతిచే వార్దక దశలో నిట్లొక శ్లోకము గానము చేయ బడినది. ఈ భూమి చంద్రార్క గ్రహ శూన్యమైన కావచ్చును. కాని యెన్నటికి అ పౌరపము కాదు. అనగా పుర వంశాకుర మెన్నటికిని నుండక పోదు. ఇది పౌర వంశచరిత్ర తెలిపితిని.
ఇక తుర్వసువు ద్రుహ్యుడు. అనువు యదువు వారి వంశములు చెప్పెద. తుర్వసుని కొడుకు వహ్ని వాని కొడుకు గోభానుడు. అతని కొడుకు ఐశానుడు. ఇతడు పరాజుతడు కానిలాజు వాని కుమారుడు కరంధముడు. వాని పుత్రుడు మరత్తుడు. మఱియొక అవిక్షితుని పుత్రుడగు మరుత్త మహారాజు నాచే వెనుక చెప్పబడెను.
మరుత్తు విపుల దక్షిణ ములైన యజ్ఞము లాచరించెను. వానికి సంతతి లేదు, సంయతయను కూతురు మాత్రమే గల్గెను. అమె యజ్ఞ దక్షిణగా సంవర్తున కీయ బడినది. అమె దుష్యంతుని కుమారునిం గనెను. ఇట్లు యయాతి శాపముచే తుర్వసుపు వంశము పురు వంశములో చేరెను.
దుష్యంతుని కుమారుడు కరూరోముడను రాజు. వాని కొడుకు అహ్లీదుడు. అతనికి నల్గురు కుమారులు, పాండ్యుడు, కేరశుడు, కాలుడు, చోళరాజు ననువారు. దృహ్యుని కుమారుడు బభ్రుసేతు మహారాజు. అతని కొడుకు అంగార సేతుడు. అతడు మరుత్తులకు రాజు. ఆ వీరుడు యౌవనాశ్యునిచే అతి కష్టముతో యుద్ద మందు గూలచ్చిబడెను. పదునాలుగు మాసములా ఘోర యుద్ధము జరిగెను. అంగార సేతువు కొడుకు గాంధారుడు. అతని పేరనే గాంధారమను దేశము ప్రఖ్యాతి కెక్కెను. గాంధార దేశ మందలి గుఱ్ఱములు ప్రశస్తములు.
అనువు కొడుకు ధర్ముడు, ధర్ముని కొడుకు ద్యూతుడు. వాని కొడుకు వనదహుడు. వాని కొడుకు ప్రచేతనుడు. వాని కొడుకు సుచేతనుడు. తుర్వసు వంశీయులని చెప్ప బడిరి. యదు కుమారులు దేవ కుమార తుల్యు లైదుగురు. సహస్రాదుడు, పయోదుడు, క్రోష్ఠనీలుడు. అంజికుడు. సహస్రాదుని కొడుకులు పరమ ధార్మికులు ముగ్గురు. హైహయుడు, హయుడు వేణుహయ రాజు, హైహయుని కుమారుడు ధర్మనేత్రుడు, వాని కొడుకు కార్తుడు, వాని కొడుకు సాహంజుడు, వాని పేర “సాహంబని” యని పుర మేర్పడెను. మహిష్మతుని కొడుకు భద్రశ్రేణ్యుడు, ప్రతాపశాలి. వాన తనయుడు దుర్ధముడు. వాని తనయుడు బుద్ధి మంతుడు కనకుడు. వాని కుమారులు నల్గురు. కృతవీర్యుడు, కృతౌజనుడు, కృతథన్వుడు, కృతాగ్ని, కృతవీర్యుని తనయుడు అర్జునుడు (కార్త వీర్యార్జునుడు).
ఇతడు సప్త ద్వీములేలెను. వేయు బాహువులు కలవాడు. సూర్యునట్లు వెలుగు రథముతో నొక్కడు వసుధా మండల మెల్ల జయించే పది వేలేండ్లు దుశ్చరమైన తపము సేసి దత్తాత్రేయుల నారాధించె. దత్తగురు డాతనకి నాల్గు వరము లిచ్చెను. వేయి చేతులు గల్గుట. అధర్మము నుండి సజ్జనులు రక్షించుట, సర్వ భూమండలము జయించి ధర్మమున ప్రజా రంజనము చేయుట, రణ రంగమున బెక్కుర జయించి అక్కడే సర్వాధికుడైన వాని చేతిలో వధింప బడుట అనునవి యా వరములు. యుద్దము సేయు చుండగా యోగ శక్తిచే యోగీశ్వరుని కట్లు బాహుసహస్ర మావిర్భవించు చుండును. సప్త ద్వీపయైన వసుంధర నాతడు సముద్రములు, నగరములు, పట్టణములతో గూడిన వెల్ల గెల్చుకొనెను. ఏడు ద్వీపము లందు నేడు వందల యజ్ఞముల నతడు నిర్వహించెను. అన్ని యజ్ఞములు శత సహస్ర దక్షిణములు, అన్నియు కాంచన యూపములు, కాంచన వేదికములు, అన్నిటను సర్వ దేవతలు, గంధర్వులు, అప్సరసలు అలంకరించు కొని విమానములపై యరుదెంచి నిత్యము నాతని యజ్ఞము నలంకరించిరి. అ యజ్ఞ మందు దేవర్షియు, వరీదాసు కొడుకును గంధర్వుడును విద్వాంసుడు నగు నారదుడు అతని మహీమ కన్చెరువడి యతిని జన్న మందు ఈ గాధలను గానము చేసెను.
యజ్ఞ దాన తపస్సులచే, విక్రమముచే, శ్రుతముచే (పాండిత్య ముచే) కార్తవీర్యార్జునుని స్థితినే రాజును పొంద జాలడు, సప్త ధ్వీపము లందును జనముల కాతడు, డాలు, కత్తి, రథము కలవాడై యోగియై యెట్ట యెదుట కనబడు చుండును. ద్రవ్య నష్టము, శోకము, విభ్రమము ననునవి ధర్మపాలనలో నుండు ఆతనికి లేవు. సర్వరత్న భాజనుడు, సమ్రాట్టు, చక్రవర్తియు నై యతడే పశు పాలకుడు, క్షేత్ర పాలుడును గూడ నయ్యెను. యోగి యగుటచే నా కార్త వీర్యార్జునుడు వర్షించుటలో వర్జన్యు డాయెను. మేఘము తానే యయ్యెను. వింటి నారి దెబ్బలచే కఠినమైన చర్మము గల బాహు సహస్రముచే నాతడు శరత్కాల మందు వేయి కిరణములచే వెలుగొందు భాస్కరుడట్లు తేజరిల్లెను.
మాహిష్మతీ నగర మందు కర్కౌటకుని కొడుకులను నాగులను జయించి వారి నా నగర మందే మనుష్యులలో నుంచెను. పద్మ నయను డగు నతడు వర్షాకాలము నందు విలాసముగా తన బాహువులచే నుబికిన సముద్ర వేగము నడ నీటి వాలు నెదు రెక్కించెను. క్రీడించు చున్న ఆ కార్తవీర్యార్జునిచే తిరస్క్రతయై యాతడేలు గ్రామమును మాలా కారమున చుట్టుకొని పారు నర్మదా నది చలించు వేల కొలది కెరటములతో భయ పడుచు అతనికీ అభి ముఖముగా వచ్చెను. అతడు వేయి చేతులచే సముద్రమును క్షోభింప చేయగా పాతాళ వాసులగు మహాసురులు భయపడి నిశ్చేష్ఠులయి సముద్ర మందు నక్కినక్కి దాగిరి. మహా తరంగములు చూర్ణితము లాయెను. మహామీన తిమింగ లాది జల జంతువులు చలించి పోయొను. నురుగు రాసులు గాలిచే భగ్న మాయెను. సుడులు సంకుల ములయ్యెను. ఇట్లాతడు మందర గిరి మథన పరిక్షిప్త మగు క్షీరాభ్ధి నట్లుబ్ధిని సంక్షోభ పరచెను. అమృత మథన మందువలె శంకితులయి వేల కొలది నాగులు తటాలున లేచి వెఱచుచు రాజవరుల దిలకించి పడగలు వంచి వినతులై సాయాహ్న మందు వాయు కంపిత ములైన అరటి బోదెల గుంపులట్లు వణంకుచు నాతని శరణ మందిరి. అతడు శర పంచకముచే రక్తము గారి తడిసి పోయిన సేనా సమేతుడైన లంకేశ్వరుని అల్లెత్రాళ్ళతో బంధించి మోహింప జేసి లోగొని మాహిష్మతీ నగరమున బంధించెను.
తన కుమారుడట్లు కార్తవీర్యార్జునిచే బంధితు డగుట విని పులస్త్య బ్రహ్మ కార్తవీర్యార్జునుని దర్శించి యాచించిన మీదట రావణు నతడు విడిచి పుచ్చెను. వాని బాహు సహస్రముచే నొనరింప బడిన ధనుష్టంకారము ప్రళయ సమయ పర్జన్య ఘోషణ భీషణమ్మై పిడుగులు పడినట్లు బెట్టద మాయెను. ఏమి అశ్చర్యము! భార్గవ రాముని వీర్యంబు కార్త్యవీర్యుని బాహు సహస్రమును హేమతాళ వనంబు నట్లు భేదించెను. దప్పిక గొని యనులుండొ కప్పుడా కార్తవీర్యుని భిక్షమడుగ నవ్వీరు డాయనకు పురములు గ్రామముల ఘోషములు, పల్లెలు, దేశముల తోడి సప్త ద్వీపములను భిక్షగ నొసంగెను. అగ్నియ వ్వినోద మరయం గోరి యన్నిటిని దహించి వైచెను. కర్త్యావీర్యుని ప్రభావముచే నగ్ని యట్లు పర్వతములు వనములతో గూడ దహించెను. వరుణ కుమారు డాపపుడను వాని యాశ్రమముం గూడ కార్తవీర్యునితో గూడి మసి సేసెను. వరుణ కుమారుడు తేజస్వియు నుత్తముడు నగు వశిష్ఠుడను వాడు. ఆ ముని ఆపవుడను ప్రఖ్యాతి నంచెను, అపవుడు కోపించి అర్జునుని శపించెన. ఓరీ! హైహయ! నా నివసించు వనమును గూడ విడువ వైతివి. కావున నీ చేసిన దుష్కర్మమును మరొక్కడు నాశనము సేయ గలడు. రాముడను పేర నతడు మహావీరుడు జమదగ్నికి కుమారు యుదయించి నీ వేయు బాహువులు నరికి యా బ్రాహ్మణ తపస్యి నిన్ను సంహరింప గల డనెను ప్రతాపముతో శత్రు సంహార మోనర్చును ధర్మముతో ప్రజా పాలన మొనర్చు చున్న యే కార్తవీర్యునకు ద్రవ్య నాశనము లేదో! ఆ కార్తవీర్యార్జునుడు మున్ను పొందిన వరము లన్నియు నీరీతి ఫలించెను. ప్రబలుడైన వాని చేతిలో మరణము నతడు కోరు కొనెను. కోరినట్లు అపవ మహాముని శాపము వలన పరశురాముని చేతిలో నతడు వీరస్వర్గ మందినాడు.
అ కార్తవీర్యునకు కుమారులు నూర్గురు. అందై దుగురు మిగిలిరి. వారు బలశాలురు, శూరులు, ధర్మవరులు, కీర్తి శాలురు శూరశేనుడు, శూరుడు, వృషణుడు, మధుపద్వజుడు, జయధ్వజుడు అనువారు. జయధ్వజుడు అవంతీ దేశము నేలిన వాడు, జయధ్వజుని తనయుడు తాలజంఘడు. వాని కుమారులు నూర్గురు “తాలజంఘలు” అను పేర బరగిరి. మహానుభావులగు హెహయుల వంశ మందు నీతిహోత్రులు, సువ్రతులు, భోజులు, అవంతులు, తౌండికేరులు, తాళజంఘులు ప్రసిద్ధులు, భరతులు, సుజాతులు మొదలగు వారు పెక్కు మంది కావున పేర్కొన శక్యము గారు. విప్రులారా! వృషుడు మొదలయి నవ యాదవులు పుణ్యాచరణ పరాయణులు, వృషుడు, వంశధరుడు (మూల పురుషుడు), వాని కుమారుడు మధువు వానికి నూర్గురు కుమారులు, అందు వృషణుడు వంశకర్త. వాని సంతతి వృష్టులు, మధువను వాని సంతతి మాధవు లైరి. యదవు పేర యాదవులని హైహయులు పేరందిరి. కార్తవీర్యుని జన్మ చరిత్ర కధనము నిత్యము చేయు వానికి విత్త నాశనము కలుగదు. పోయిన సొత్తు దొరుకును. బ్రాహ్మణులారా! ఇవి యయాతి కుమారు లయిదుగురి వంశములు.
యయాతి కుమారు లయిదుగురు పంచ భూతముల వలె లోక ములను ధరించినారు. కావున వారి చరిత్ర సంకీర్తనముచే పంచభూత జగత్తు చరాచరాత్మక మిదియెల్ల ధరింప బడును. ఉద్దరింప బడును. ఈ పంచవంశ విసర్గము విన్న రాజు ధర్మార్థ నిపుణుడు వశియును (జితేంద్రియుడు) కాగలడు. అయిదు వరములంద గలడు. అవి ఆయువు, కీర్తి, పుత్రులు, ఐశ్వర్యము, విభూతి, ఈ పవిత్ర చరిత్ర. ధారణము వలన, శ్రవణము వలన, నీ చెప్పిన ఫలము నిశ్చయమ. కోష్టు వంశ మిక తెల్పెద. వినుండు, యజ్ఞకర్త ధర్మాత్ముడు వంశ ధారకుడ నగు యదు క్రోష్టుపుల వంశముల వృత్తాంతము సర్వ పాప విమోచకము. ఈ వృష్టి వంశము మందు శ్రీమహా విష్ణువు శ్రీ కృష్ణ రూపమున నవతరించెను.
