బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)

Table of Contents

5 - మన్వంతర కీర్తనము

ఓ బుద్ధిశాలీ లోమహర్షణ! మన్వంతరముల నన్నింటిని వాని యొక్క విశేష సృష్టిని వర్ణింపుము. మనుపు లెందరో వారి కాల మేదియో వారి సమయ మందు జరిగిన విశేషము లేవియో స్పష్టమున నెఱుగ గోరెదము.

ఋషుడుగ నూతుడు మన్వంతరములను గూర్చిన చరిత్ర సంక్షేపముగ చెప్పెద. వేయేండ్ల యిననిది తెలుప నలవి కానిది స్వాయంభువుడు, స్వారోచిషుడు, ఉత్తముడు, తామసుడు, రైవతుడు, చాక్షువుడు, పైవస్వతుడు. సావర్ణి (తర్వాత) రైభ్యుడు, రౌచ్యుడు, మేరుసావర్ణి, ఇపుడు వైవస్వత మన్వంతరము జరుగు చున్నది. అయా మన్వంతరము లందలి సప్తర్షులను పుత్రపౌత్ర పరంపరను దేవ గణములను తెలుపు చున్నాము.

స్వాయంభువ మనువు కాలమున సప్తర్షులు మరీచి, అత్రి, అంగిరస్సు, పులహుడు, క్రతువు, పులస్త్యుడు, వశిష్ఠుడు, వీరు బ్రహ్మ కుమారులు. ఉత్తర దిక్కు నందుందురు. ఆగ్నీధ్రుడు, అగ్ని బాహుడు, మేధ్యుడు, మేధాతిథి, వసువు, జ్యోతిష్మంతుడు, ద్యుతిమంతుడు, హవ్యుడు, సబలుడు, పుత్రుడు అను పది మంది స్వాయంభువు కుమారులు. ఈ యది ప్రథమ మన్వంతరము.

స్వరోచి మనువు కాలమున ఋషులు ఉర్వుడు, స్తంబుడు, కశ్యపుడు, ప్రాణుడు, బృహస్పతి, దత్తుడు, అత్రి, చ్యవనుడు. మహా వ్రతులైన యేడ్వురు దేవతలు తుషితులు, హవిఘ్నుడు, సుకృతి, జ్యాతి, ఆపుడు, మూర్తి ప్రతీతుడు, నభస్యడు, నభస్సు ఊర్జస్సు యనువారు స్వారోచి కుమారులు. ఇది రెండవ మన్వంతర విషయము.

ఉత్తముని కాలమున వశిష్ఠ కుమారులు (వాశిష్టులు) యేడ్వురు ఋషులు. హిరణ్య గర్ఛుని కుమారులు ఊర్జులు. ఉత్తముని కుమారులు పది మంది. ఇషుడు, ఊర్జస్సు, తనూర్జుడు, మధువు, మాధవుడు, శుచి, శుక్రుడు, నహుడు, నభస్యుడు. నభుడు, దేవత లిందు భానువులు ఇది తృతీయ మన్వంతర విషయము.

వశిష్ట కుమారులు, (వాశిష్టులు) యేడ్వురు ఋషులు. హిరణ్య గర్భుని కుమారులు ఊర్జులు. ఉత్తమునిన కుమారులు పదిమంది. ఇషుడు, ఊర్జస్సు. తనూర్జుడు, మధువు మాధవుడు, శుచి, శుక్రుడు, సహుడు, నభస్యుడు, నభుడు, దేవతలిందు భానువులు. ఇది చతుర్థ మన్వంతర విషయము.

తామన మన్వంతరమున కావ్యుడు, పృథువు, అగ్ని, జహ్నువు, ధాత, కపీవంతుడు, అకపీవంతుడు యనువారు సప్తర్షులు. ఇందు దేవగణములు. ద్యుతి, తపస్యుడు, సుతవుడు, తపోభూతుడు, సనాతనుడు, తపోరతి, అకల్మాషుడు, తన్వీ, పరంతవుడు అనువారు పది మంది వాయువుచే చెప్ప బడిన వారు.

దేవబాహువు యదుధ్రుడు, (ముని) వేదశిరస్సు హిరణ్యరోముడు, పర్జన్యుడు, ఊర్ధ్వబాహువు, (సోమజుడు) సత్యనేత్రుడు (ఆత్రేయుడు)నను వారు రైవతమనువు కాలమున సప్తర్షులు.

ఇందు దేవ గణములు అభూత రజస్సు ప్రకృతి, వారిప్లవుడు, రైభ్యుడు, ధృతి మంతుడు, అవ్యయుడు, యుక్తుడు, తత్త్వదర్శి, నిరుత్సుకుడు, అరణ్యుడు, ప్రకాశుడు నిర్మోహుడు, సత్యవాక్కు, కృతి ఐదవ రైవత మన్వంతరము నుందు రైవతుని కుమారులు. ఆఱవ మనువు చాక్షుషుడు, ఈయన కాలమున సప్తర్షులు. భృగువు, నభస్సు, వివస్వంతుడు, సుధాముడు, విరజుడు, సహిష్ణువు అనువారు (అప్రసూతులు) ఆ బాల ప్రఖ్యాతులు. లేఖులను వారు దేవ గణము లైదుగురు. అంగిర కుమారులు అతినాముడు, నాడ్వులేయులు పది మంది. చాక్షుష మనువు పుత్రులు రురుప్రభృతులు.

సప్తమము వైవస్వంత మన్వంతరము. అత్రి, వశిష్ఠుడు, కశ్యపుడు, గౌతముడు, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, (ఋచీకుని కుమారుడు) జమదగ్ని అను వారిపుడు సప్తర్షులు. సాధ్యులు, రుద్రులు, విశ్వేదేవులు, వసువులు, మరుత్తులు, ఆదిత్యులు, అశ్వినులు, వైవస్వత మనువు కాలమున దేవతలు. ఇక్ష్వాకు మొదలగు వారు పదిమంది కుమారులు. వారివారి సంతానము లనంతము లయి సర్వ మన్వంతరము లందు సప్త సప్తకులు 7x7 = 49 మంది ధర్మ వ్యవస్థ కొఱకు లోరక్షణ కొరకు (సప్త గణములు) వర్తించి కర్మా నుష్ఠాన మొనరించి శాశ్వత బ్రహ్మ లోకము నలంకరింతురు. ఆమీద వారివారి స్థానములను తపస్సంపన్నులు మరి యొక రధిష్ఠింతురు. ఇట్లు అతీతులు వర్తమాను లనైన వారి వారిని పేర్కొంటిమి.

ఇక రాగల మన్వంతరములలో సావర్ణి మనువు కాలమున రాముడు, వ్యాసుడు, (ఆత్రేయుడు) అశ్వత్థామ (భారద్వాజుడు, ద్రౌణి) అజరుడు శరద్వంతుడు (గౌతముడు) గాలవుడు (కౌశికుడు) ఔర్వుడు (కాశ్యపుడు) వీరేడ్వురు ఋషు లయ్యెదరు. వైరి అధ్వరీవంతుడు. శమనుడు, ధృతిమంతుడు. వసువు అరిష్టుడు, అధృష్టుడు, వాజి, సుమతియను వారు. సావర్ణి మనువు కుమారులు. వీరిని వేకువవేళ మేల్కొని కీర్తించిన సుఖ సమృద్ధి యగును కీర్తి కల్గును. ఆయుర్భాగ్యాము పట్టును. సావర్ణులయిన, మనువులలో నొకడు వైవస్వతుడు నల్గురు ప్రజాపతి సంతతి వారు. పరమేష్ఠి కుమారులు మేరు సావర్ణ్యు లయిరి. మేరు గిరిపై తపోనిరతి నుండు వారు ప్రజాపతి పుత్రుడు రౌచ్యుడు. ( మనువు) రుచికి భూతిదేవి యందు గల్గిన వాడు. వీరి శ్వేత వరాహ కల్పము నందు రాగల మనువు లేడుగురు. ఈ పదు నాల్గురు మనువుల వలన సప్త ద్వీపయైన యీ పృథివి యెల్ల పట్టణములతో గూడ వేయి యుగములు పరిపాలింప బడగలదు. డెబ్బది యొక్క మహా యుగములు ప్రజాపతి యొక్క పూర్ణా యుర్దాయము. వీరు మనువులు పదునల్వురు కీర్తి వర్ధనులు. వేదము లందు పురాణము లందు వినిపింతురు. ప్రజాపతులు వీరు. వీరి సంకీర్తనము ధన్యతా సంపాదకము. మన్వంతరము లందు సంహారము, సంహారంతమున (లయ యందు) సృష్టి, ఈ లెక్క వర్ణింప నలవి గాదు. ప్రళయా వసానమున సప్తర్షుల తోడ తపో బలముచే బ్రహ్మచర్య సంపత్తిచే శ్రుతముచే (జ్ఞానముచే) కొందరు మహర్షులు శేషించి యుందురు. వారినే శిష్టు లందురు. యుగ సహస్ర సంపూర్తి యందు కల్ప సమాప్తియై జగత్తు నిశ్శేష మగును. అపుడెల్ల భూతము లాదిత్య కిరణముల దగ్ధము లగును. వీరు బ్రహ్మను ముందిడుకొని ఆదిత్య గణములతో సుర శ్రేష్ఠుడైన నారాయణ ప్రభువు నందు జొచ్చును. కల్పాంతము నందు పునస్సృష్టి సేయు మహానుభావు డాయన. అవ్యక్తము, శాశ్వతము, నైనతత్త్వము, ఆయనయే యీ జగత్తంతము. ఇక వైవస్వత మనువు యొక్క విసర్గ వృత్తాంతము వినిపించెద. పురాణ లక్షణములం దొకటైన వంశ లక్షణముగ ప్రసంగ వశమున శ్రీహరి యవతరించిన వృష్టి వంశమునటుపై వర్ణించెద వినుండు.