కూర్మ మహా పురాణము

Table of Contents

44వ అధ్యాయము

 

కూర్మము పలికెను.

ఇక ఇపుడు ప్రాకృత ప్రలయమును సంగ్రహముగా చెప్పెదను వినుడు. ద్వీతీయ పరార్థము గడువగా లోకములను నశింప చేయుకాలము కాలాగ్ని రూపముగా సకల జగత్తును భస్మము చేయుటకు సంకల్పించును. మహేశ్వరుడు తనలో జీవాత్మను చేర్చుకొని సదేవాసురమానుషమగు సకల బ్రహ్మాండమును దహింప చేయును. ఆ మహాదేవుడు భయంకరరూపమును దాల్చి లోకసంహారమును చేయును. సూర్యమండలమున ప్రవేశించి తనను తాను పలురూపములను దాల్చీ ఏడుకీరణములుకల సూర్యరూపమును దాల్చి అఖిల లోకమును దహింప చేయును. ఇట్లు పదార్థములనన్నింటిని దహించి బ్రహ్మశిరోసోమకాస్త్రమును దేవతాశరీరములందు విడుచును. ఇట్లు సకలదేవతలు దహించి పోగా పర్వత పుత్రి యగు పార్వతీదేవి ఒక్కతే లోకసాక్షిగా నిలుచును అని శ్రుతి. దేవతల కపాలములతో అలంకరించుకొని మాలలు ధరించి, ఆదిత్య చంద్రాది గణములతో ఆకాశమండలమును సింపుచు సహాస్రనయనుడై సహస్రాకృతులు దాల్చీ, సహస్ర చరణములను దోల్చి, సహస్ర జ్వాలలు కలవాడై దంష్ట్రాకరాల వదనుడై ఊగుగా ప్రజ్వలించు నేత్రాగ్నికలవాడై, త్రిశూలమును ధరించి, చర్మాంబరధారియై ఈశ్వర యోగమున నీలిచినవాడై, పరమానంద రూపమగు ప్రభూతామృతమును ద్రావి దేవిని చూచుచు తాండవమును చేయును.

పరమమంగలయగు పార్వతి భర్త నాట్యామృతమును పానము చేసి యోగమునాశ్రయించి మహాదేవుని దేహమున ప్రవేశించును. అంతట పినాకపాణి తాండవరసమును చాలించి జ్యోతిస్వరూపుడై నిలిచి బ్రహ్మాండమండలమును దగ్గము గావించును. బ్రహ్మవిష్ణు మహేశ్వరులు శివునిలో చేరిన తరువాత సంపూర్ణగుణములతో భూమి జలములో లీనమగును. సంపూర్ణగుణములతో కూడిన జలతత్త్వము అగ్నిలో బీసమగును. తేజస్సు సకల గుణములతో పోయువులో లీనమగును. సగుణమగు వాయువు ఆకాశములో లీనమగును. గుణసంయుతమగు ఆకోశము తామసాహంకారములో లీనమగును. అన్ని ఇంద్రియములు రాజసాహంకారములో లీనమగును. దేవగణములు వైకారికములో అనగా సాత్త్వికాహం కొరములో లీనమగును. ఇట్లు సాత్త్విక రాజస తామసాహంకారములు మూడు మహత్తత్వములో లీనమగును. పృథివి నుండి అహంకారము వరకు ఉన్న సకల తత్త్వములకు మూలమగు మహత్తత్వము అమిత తేజస్వియగు బ్రహ్మయే యగును. ఇట్టి అహంకార తత్త్వమును ప్రకృతి తత్త్వము ఉపసంహరించును. ఇట్లు భూతములను తత్త్వములను మహేశ్వరుడుపసంహరించి ప్రధాన పురుషులను వేరు చేయును. ఇదియే ప్రకృతి పురుషుల సంహారము. ఈ సంహారము కూడో మహేశ్వరునీ ఇచ్చోపూర్వకముగానే జరుగును. కాని తనంతతానుగా రాజాలదు. గుణసామ్యవస్థయే ప్రకృతి అవ్యక్తము అనబడును. జగత్తుకు మూలకారణము ప్రధానమే. ఇది అచేతనము మాయారూపముగా నుండును.

కూటస్థుడు చిన్మయుడు అగు ఆత్మ 25వ తత్త్వరూపము. ఈ ఆత్మనే మునిగణము సాక్షి అని మహాన్ అని పితామహుడని యందురు. ఇట్లు మహేశ్వరుని శాశ్వతమగు శక్తి సంహారమును గావించును. ప్రధానమునుండి విశేషము వరకు దహింపబడునని శ్రుతి చెప్పుచున్నది. జ్ఞానులగు యోగులకు అత్యంతిక ప్రలయమును కూడా శంకరుడే చేయును.

సకల జగమును తన వశములో నుంచుకున్న రుద్రుడు ఇట్లు జగత్సంహారమును గావించును. శ్రుతిని అనుసరించి సకల జగత్తును స్థాపించు శివుని మోహినీ అనబడు శక్తినే సొరాయణుడందురు. 25వ తత్త్వమగు పురుషుని స్వరూపమగు హిరణ్యగర్భుడు సద సదాత్మకమగు సకల జగత్తును సృజించును. మహేశ్వరునిలో నుండు మూడు శక్తులు సర్వజ్ఞులు, సర్వవ్యాపులు, శాంతులు, బ్రహ్మ, విష్ణు ఈశ్వరుని రూపమున నామముతో నుండునవి భుక్తిని ముక్తిని ప్రసాదించును. ఈ శక్తులే సర్వేశ్వరరూపములు అందరిచే నమస్కరింపబడును. శాశ్వతములు అనన్త భోగములతో కూడుకొనియుండునవి. అద్వితీయమగు అక్షరతత్త్వమే పురుష ప్రధాన ఈశ్వర రూపముగా నుండును.

ఈ పరమాత్మలో అనగా అవ్యక్తమగు అక్షరతత్వములో ఇతరములగు శక్తులు వేలకొలదీ కలవు. ఈ శక్తులను కూడా పలు విధములగు యజ్ఞములద్వారా ఆరాధింతురు. వీటిలో ఇంద్ర ఆదిత్యాదులుగానుండు ఒకొక్క శక్తికి నూరులు వేలు దేహములుండును అని చెప్పబడుచున్ననూ ఈ అన్నిటికీ మూలమగు శక్తి ఒకటే నిర్గుణము. మహాదేవుడు స్వయముగా ఆయాశక్తులను స్వీకరించి పలు దేహములను సృజించును. అట్లే విలాసముగా సంహరించును కూడా. వేదవాదులగు బ్రాహ్మణులు అన్నియజ్ఞములతో ఈశక్తులను పూజింతురు. రుద్రుడే సర్వకామప్రదుడు అనునది వైదిక శ్రుతి. మహేశ్వర శక్తులన్నిటిలో ప్రధానమగు శక్తులు బ్రహ్మ విష్ణు శివాత్మకములు.

శూలపాణీయగు మహేశ్వరుడే ఆద్యము, జ్ఞాన శక్త్యాది గుణవిశిష్టము, అందరికంటే పరుడు, పరమాత్మ, సనాతనుడు సర్వశక్త్యాత్ముడుగా కీర్తించబడుచున్నాడు. ఇతనికే కొందరు అగ్ని అని మరికొందరు నారాయణుడని ఇతరులు ఇంద్రుడని మరికొందరు విశ్వేదేవులని ఇతరులు బ్రహ్మయని అందురు. బ్రహ్మ విష్ణు అగ్ని వరుణులు ఇతర దేవతలు ఋషులు ఇందరూ ఒకే రుద్రుని భేదములుగా (అంశములుగా) కీర్తించబడుదురు. పరమేశ్వరుని ఏరూపమునాశ్రయించి పూజింతురో, శివుడు పోరి వారికి ఆయారూపములో ఫలములనిచ్చును. కావున ఇన్ని భేదములలో ఏ ఒక్క అంశను ఆశ్రయించి పూజించిననూ ఆ పరమపదమును పొందును. అయిననూ మహాదేవుడు సర్వశక్తీ ధరుడు సనాతనుడు అగు శివుని సగుణిగా లేదా నిర్గుణునిగా ఆరాధించవలయును. నిర్గుణయోగమును మొదటనే చేప్పియుంటిని. సగుణోపాసన చేయదలచినవాడు కూడా

పరమేశ్వరుని ఆరాధించవలయును. దీనికి త్రినయనుడు, జటిలుడు చర్మాంబరుడు, స్వర్ణకాంతి కలవాడు పద్మాసనాసీనునిగా యున్న శివుని ధ్యానించవలయునని వైదిక శ్రుతి. ఇది సబీజ (సగుణ) యోగముగా చెప్పబడినది. కావున బ్రహ్మాది దేవతలను విడిచి ఆది మధ్యాంతములలో నిలిచియుండు విరూపాక్షుని ఆరాధించవలయును. స్వధర్మ నిరతుడై భక్తి యోగముగా నాశ్రయించినవాడు శివుని రూపమును ధరించి శివుని వద్దకు చేరును. ఇదీ సగుణోపాసనాయోగముగా చెప్పబడినది. ఈ యోగమును యధావిధిగా ఆచరించినవాడు ఈశ్వరుని పదమును చేరును.

 ఈ ఈశ్వర తత్త్వమును ఆరాధించుశక్తిలేని వారు హరుని విష్ణువును బ్రహ్మను అర్చించవలయును. వీరిని కూడా ఆర్చించలేని పోరు వాయువు అగ్ని ఇంద్రాదులను భక్తితో ఆరాధించవలయును. పూర్వము మీకు సగుణ నిర్గుణోపొసనలు చెప్పబడినవి. అవి పరిశుద్దములు.. వాటిని నిర్బీజసబీజ ఉపాసనలుగా చెప్పబడినవి. నిర్బీజ యోగమును ఇది వరకు మీకు చెప్పియుంటిని. విష్ణురుద్ర బ్రహ్మలను సబీజో పాసనయే చేయవలయును. లేదా అగ్న్యాది దేవతలను తత్పరుడై ఇంద్రియ నిగ్రహము కలవాడై చతుర్మూర్తిధరుడగు విష్ణువును పూజించవలయును. ఇతను ఆద్యంతములులేనివాడు అంతటా వ్యాపించియుండువాడు. సనాతనుడు నారాయణుడు జగత్కారణుడు పరమాకాశము పరమపదము. విష్ణు చిహ్నములను ధరించి విష్ణుభక్తుడై విష్ణువుకంటే ఇతరులసొశ్రయించని వాడై పూజించవలయును. ఇదే విధినీ బ్రహ్మ నారాధించుటలోకూడా అనుసరించవలయును.

ఇట్లు మీతో భావనాశ్రయమగు జ్ఞానమును వివరించితిని. నేను పూర్వము దీనినే ఇంద్రద్యుమ్న మునికి తెలిపితిని. చేతనాచేతనాత్మకమగు ఈసకల జగత్తు అవ్యక్తము అక్షరము అగు పరమాత్మ స్వరూపమే. ఆ ఈశ్వరుడే పరబ్రహ్మ, కావున ఈ జగత్తంతయూ బ్రహ్మమాయ అనీ చెప్పబడినది.

సూత మహర్షి పలికెను.

ఇంత మాత్రము చెప్పి జనార్దన భగవానుడు విరమించెను. అంతట ఇంద్రునితో పాటు ఋషులందరూ శ్రీమన్నారాయణుని స్తుతించిరి.

కూర్మరూపుడవగునీకు నమస్కారము. పరమాత్మవగు విష్ణువునకు నమస్కారము, నారాయణునకు విశ్వునకు వాసుదేవునకు నమస్కారము. కృష్ణునకు గోవిందునకు నమస్కారము. మాధవునకు యజ్ఞేశ్వరునకు నమస్కారము, సహస్రశీర్పునకు సహస్రాక్షునకు, సహస్రహస్తునకు సహస్ర పొదునకు నమస్కారము. జ్ఞానరూపునకు పరమాత్మ స్వరూపునకు, గూఢ శరీరునకు నీర్గుణునకు నమస్కారము. పురాణపురుషునకు సత్తామాత్ర స్వరూపికీ సాంఖ్యమునకు యోగమునకు కేవలరూపుడవగు నీకు నమస్కారము. ధర్మజ్ఞానములచే పొందదగినవానికి నిషులునకు నమస్కారము. వ్యోమతత్వునకు మహాయోగేశ్వరునకు నమస్కారము. పరులకు అపరులకు ప్రభువైనవానికి వేదవేద్యునకు నమస్కారము. బుద్ధునకు శుద్దునకు యుక్తునకు హేతువునకు నమస్కారము. మాయికి బ్రహ్మస్వరూపుడవగు నీకు నమస్కారము. వరాహునకు నారసింహునకు నమస్కారము. వామనునకు హృషీకేశునకు నమస్కారము. కాలరుద్రునకు కాలరూపీకి నమస్కారము. స్వర్గమును అపవర్గమును ఇచ్చువానికీ దేవాధిపతికి దేవతాపనివారణునకు నమస్కారము. జ్ఞానశక్త్యాది షాఢుణ్యరూపా మీరా అనుగ్రహముతో సర్వసంసార నాశకమగుదాని, మోక్షమును పొందించు జ్ఞానమును పొండీనాము అనేక ధర్మములను, వంశములను, మన్వంతరములను, సర్గమును, ప్రతిసర్గమును, ఈ బ్రహ్మాండ విస్తారమును ఏంటిమి. నీవే సర్వ జగత్సాక్షివి, నీవే ప్రపంచము నీవే నారాయణుడవు నీవే పరుడవు అనంతస్వరూపీవీ మాకు నీవే శరణము. కావున మమ్ములను కాపాడుము.

సూత మహర్షి పలికెను

ఓ బ్రాహ్మణోత్తములారా సాక్షాత్తుగా గదాధరుడు చెప్పినది. యోగక్షేమములను ప్రసాదించునది అగు కూర్మపురాణమును నేను మీకు చెప్పితిని. ఈ పురాణమున పూర్వము లక్ష్మీ సంభవము చెప్పబడినది. సకల జగములను మోహింప చేయుటకు లక్ష్మినీ వాసుదేవునితో కూర్చుట చెప్పబడినది. ప్రజాపతులసృష్టి వర్ణధర్మములు, వృత్తులు, శుభప్రదమగు ధర్మార్థకామ మోక్షముల లక్షణములు శుభప్రదమగు సదాచారలక్షణమును కూడా చెప్పితినీ, శాస్త్రానుసారముగా వర్ణాశ్రమ లక్షణము చెప్పబడినది. అట్లే ఆదిసర్గము సప్తవరణములతో కూడిన బ్రహ్మాండము కూడా వివరించబడినది. ముని పుంగవులారా హిరణ్యగర్భసృష్టిని కూడా తెలిపితిమి. కాలగణనావిధి ఈశ్వర మాహాత్మ్యము, బ్రహ్మ జలమున శయనము భగవానునీ నామములకు నిరుక్తము కూడా చెప్పబడినది. మరల వరాహరూపముతో భూమిని ఉద్ధరించుట ముఖ్యాదిసర్గము మునిసర్గము రుద్ర సర్గము ఋషి సర్గము, తాపససర్గము ధర్ముని ప్రజాసర్గము చక్కగా వివరించబడినవి. బ్రహ్మ విష్ణు వివాదము ఒకరు ఇంకొకరిదేహమున ప్రవేశించుట, బ్రహ్మపద్మమున పుట్టుట, జ్ఞానియగు బ్రహ్మకు మోహము మహేశ్వర దర్శనము విష్ణువుచే చెప్పబడిన మహేశ్వర మాహాత్మ్యము మహేశ్వరుడు బ్రహ్మకు దివ్యదృష్టి నొసగుట, పరమేష్టి యగు బ్రహ్మ మహేశ్వరుని నుతించుట, శివుడు ప్రసన్నుడై బ్రహ్మకు వరమునిచ్చుట మహాత్ముడగు శంకరునికి విష్ణువుతో సంవాదము, తరువాత వరప్రదానము శివుని అంతర్థానము వర్ణించబడినవి.

శ్రీ మహావిష్ణువు వలన మధుకైటభవధ, విష్ణునాభికమలమునుండి బ్రహ్మ అవతరించుట, విష్ణువులో బ్రహ్మాఐక్యమును చెందుట, బ్రహ్మ మోహము మరల విష్ణువు వలన తెలివి తెచ్చుకొనుట వర్ణించబడినది. బ్రహ్మతపమునోచరించుట, బ్రహ్మలలాటమునుండీ మహేశ్వరుని ఆవిర్భావము, రుద్రులసృష్టి, బ్రహ్మద్వారా ఆసృష్టిని నిషేధించుట, దేవాధిదేవుడగు శంకరుని ఐశ్వర్యవర్ణనము, బ్రహ్మకు వరమునిచ్చుట, ఉపదేశమునిచ్చుట, రుద్రుని అంతర్థానము, బ్రహ్మతపమాచరించుట,దేవాధిదేవుడగు శంకరునిదర్శనము, నరనారీరూపము (అర్థనారీశ్వరు) దాల్చుట. శంకరుని నుండి పార్వతివేరగుట, పార్వతీ పూర్వము దక్షపుత్రిగా ఉన్న ఇతి వృత్తము తరువాత హిమవంతుని పుత్రిక యగుట, దేవీ మాహాత్మ్యము, దివ్యరూపదర్శనము, విశ్వరూప దర్శనము, తండ్రియగు హిమవంతుడు స్వయముగా సహస్ర నామములను తెలుపుట. మహాదేవి చేసిన ఉపదేశము, వరప్రసాదము కూడా వివరించబడినవి. భృగ్వాది ఋషుల ప్రజాసృష్టి రాజుల వంశవర్ణనము వంశ విస్తారము, దక్షప్రజాపతి ప్రచేతపుత్రుడగుట, దక్షయజ్ఞ ధ్వంసము, దక్ష దధీచి వివాదము, మునుల శాపము వర్ణించబడినవి.

తరువాత రుద్రునిరాక, అనుగ్రహము, శంకరుని అంతర్థానము, దక్షుని రక్షించుటకు పితామహోపదేశము, కశ్యపుని ప్రజాసృష్టి వర్ణించబడినవి, హిరణ్యకశ్యపుని వధ, హిరణ్యాక్షవధ, దేవదారువనవాసుల శాపము అంధక నిగ్రహము, అంధక గాణాపత్యము ప్రహ్లాదనిగ్రహము, బలి బంధనము, బాణుని నిగ్రహము మరల శంకరుని అనుగ్రహము, ఋషి వంశ విస్తారము, రాజుల వంశ విస్తారము, శ్రీహరి వసుదేవుని పుత్రునిగా పుట్టుట ఉపమన్యుదర్శనము, తపస్సునాచరించుట, తరువాత దేవీ సహితుడగు శంకరుని దర్శనము, వరలాభము, శ్రీహరి కైలాసమునకు వచ్చుట, కైలాసమున నివసించుట, ద్వారకలో నుండు వారీ భయము గరుడుడు మహాబలులగు శత్రువులను జయించి ద్వారకావాసులను రక్షించుట. నారదుని ఆగమనము గరుత్మంతుని యాత్ర, తరువాత కృష్ణునిరాక, మునులరాక, వాసుదేవుడు నిత్యమాచరించు శివలింగార్చన వర్ణనము, మార్కండేయుడు లింగార్చన విషయమున శ్రీకృష్ణుని అడుగుట, శ్రీకృష్ణుడు వివరించుట, శివుని లింగస్వరూప నిరూపణము వివరించబడినవి.

బ్రహ్మ విష్ణువుల మధ్య జ్యోతిర్లింగావిర్భావము, జ్యోతిర్లింగ యధార్ధస్వరూపము, బ్రహ్మ విష్ణువుల మోహము, లింగ పరిమాణమును తెలియుటకు బ్రహ్మ విష్ణువులు ఊర్ధ్వాధో భాగములకు వెళ్ళుట, శివుని స్తుతించుట శివుడు వారిని అనుగ్రహించుట వివరించబడినవి.

 శివలింగాంతర్థానము, సాంబుని ఉత్పత్తి అనిరుద్ధుని ఉత్పత్తి, కృష్ణుడు స్వలోకమునకు వెళ్ళుటకు నిశ్చయించుకొనుట, ఋషులరాక, కృష్ణభగవానుడు ఋషులకు ఉపదేశమును, వరములను అనుగ్రహించుట, కృష్ణభగవానుడు స్వధామమునకు వెళ్ళుట, అర్జునుడు కృష్ణద్వైపాయనుని దర్శించుట, కృష్ణద్వైపాయనుడు సనాతనమగు యుగధర్మములను ఉపదేశించుట, అర్జునుని అనుగ్రహించుట, అధ్భుత కర్ముడగు వ్యాసుడు వారాణసీ నగరమునకు వెళ్ళుట వర్ణించబడినవి.

వారాణసీ మాహాత్మ్యము తీర్థముల ప్రభావము, వ్యాసమహర్షి తీర్థయాత్రల వర్ణన, దేవీదర్శనము, దేవి వ్యాసుని కాశీనగరము నుండి పంపించుట, మరల అనుగ్రహించుట, ప్రయాగ మాహాత్మ్యము, ఇతర క్షేత్రముల ప్రభావము, తీర్థయాత్ర ఫలము, మార్కండేయుని నిర్గమనము సకల లోకముల స్వరూపము, గ్రహముల నక్షత్రముల స్థితి, వరముల నదుల నిర్ణయము, పర్వతములను దేవతల స్థానములను వర్ణించుట ద్వీపముల విభాగము శ్వేతద్వీప వర్ణనము చేయబడినది.

శ్రీమన్నారాయణునియోగనిద్ర, శ్రీహరీ మాహత్మ్యము, మన్వంతర కథనము, శ్రీవిష్ణుమహిమ, వేదశాభారచన, వ్యాసుల నామపరిగణసము, వేదబాహ్య సిద్దాంతములను చెప్పుట, వేదమును వివరించుట, యోగేశ్వరుల కథనము, శిష్యుల కథనము, ఈశ్వరునికి సంబంధించిన రహస్య గీతాలు, వర్ణాశ్రమాచారవీధి, ప్రాయశ్చిత్త విధి, రుద్రుడు కపాలీయగుట, భిక్షను చరించుట, పతివ్రతల ప్రభావము, తీర్థముల నిర్ణయము, మంజనుని నిగ్రహము, కొలుని వధ, దేవదారువనమున శివమాధవుల ప్రవేశము, షట్కులీయులకు శంభుదర్శనము, నందికి చేసిన వరదానము, నైమిత్తికప్రలయము, ప్రాకృత ప్రలయము, సబీజ నిర్బీజయోగములు చెప్పబడినవి. ఇట్లు కూర్మ పురాణ సంక్షేపమును తెలిసి వివరించినవాడు సర్వపాప వినిర్ముక్తుడై బ్రహ్మలోకమును చేరును. ఇట్లు పురాణమును మునులకు వివరించిన శ్రీహరి తనకూర్మరూపమును పరిత్యజించి లక్ష్మితో కలిసి స్వస్థానమునకు వెళ్ళెను.

సకల దేవతలు సకల మునులు తమతమ స్థానములను చేరిరి. జ్ఞానామృతమును పొంది శ్రీ మహావిష్ణువును నమస్కరించి వెడలిరి.

సకల జగత్కారణుడు దేవాదిదేవుడగు శ్రీమహావిష్ణువు కూర్మరూపమును ధరించి ఈపురాణమును వినిపించెను. నియమముతో సావధానముతో ఈపురాణమును పఠించినవాడు, సర్వపాపవినిర్ముక్తుడై బ్రహ్మలోకమున నివసించును. వైశాఖ మాసమున వ్రతమును స్వీకరించిన విప్రుడు ఈ పురాణమును ప్రాసీ వేదవిదుడగు బ్రాహ్మణునకు దానము చేసిన కలుగు ఫలమును తెలియుము. సర్వపాపములు తొలగి సర్వైశ్వర్యములు కలిగి, స్వర్గమున దివ్యములు శోభనములు విపులములగు భోగములను అనుభవించును.

స్వర్గమునుండి పరిభ్రష్టుడై విప్రకులమున పుట్టును. పూర్వసంస్కార ప్రభావమువలన బ్రహ్మవిద్యను పొందును. ఈ పురాణమున ఒక అధ్యాయమును చదివిననూ సర్వపాపములు తొలగును. చక్కగా అర్థమును పరిశీలించినవాడు పరమపదమును పొందును. ఎల్లపుడు ఈ పురాణమును, బ్రాహ్మణులు ప్రతి పర్వమున పఠించవలయును. మహాపాతకమును నశింపచేయు ఈ పురాణమును తప్పక వినవలయును. సకల పురాణేతిహాసములొక ఎత్తు. ఇదొక్కటీ ఒక ఎత్తు. అన్నిటికంటే ఈ పురాణమే అతిశయించును. ధర్మములలో ఉత్తమత్వము నిష్ణాత త్వమును కోరువారికి ఈ పురాణమునకు సాటి మరొకటి లేదు.

ఈ పురాణమున శ్రీ మన్నారాయణ భగవానుడు శ్రీహరి విష్ణుదేవుడు చెప్పబడినట్లు ఇతర పురాణములలో చెప్పబడలేదు. ఇది పౌరాణికీ బ్రాహ్మీసంహిత. సకల పాపనాశిని. ఈ పురాణమున యథార్థముగా పరమబ్రహ్మ కీర్తించబడెను. ఈ పురాణము అన్ని తీర్దములలో ఉత్తమ తీర్థము. తపములలో ఉత్తమతపము. జ్ఞానములలో పరమ జ్ఞానము. వ్రతములలో ఉత్తమ వ్రతము. ఈ పురాణమును శూద్రుని సమీపమున చదువరాదు. అట్లు చదివిన మోహితుడు బహునరకములను పొందును. శ్రాద్దమున కాని దైవకార్యమున కానీ ద్విజులు వినవలయును. యజ్ఞ సమాప్తిలో ఈ పురాణమును చదివినచో సర్వదోషములు తొలగును. మోక్షముకోరు వారు తప్పక ఈ పురాణమును విశేషించి చదువ వలయును. వేదార్థమును విస్తరింప చేయు ఈ పురాణమును వినవలయును. మననము చేయవలయును. చక్కగా తెలుసుకొని భక్తిగల బ్రాహ్మణోత్తములకు వినిపించినచో సర్వపాపములు తొలగి బ్రహ్మ సాయుజ్యమును పొందును. శ్రద్ధారపొతునికి అధార్మికునకు ఈపురాణమును వినిపించినచో మరణించిన తరువాత బహునరకములపాలై మరల కుక్కగా పుట్టును.

 జగత్కారణభూతుడు సనాతనుడు అగు శ్రీమహావిష్ణువునకు నమస్కరించీ, అట్లే కృష్ణ ద్వైపాయనునకు కూడా నమస్కరించి ఈ పురాణ శాస్త్రమును అధ్యయనము చేయవలయును. ఇది అమీతతేజస్వి దేవదేవుడగు శ్రీ మహావిష్ణువాజ్ఞ మరియు బ్రహ్మర్షి, మహాత్ముడు, పారాశర్యుడగు వేదవ్యాస భగవానుని ఆజ్ఞకూడా.

శ్రీ కూర్మమహాపురాణమును శ్రీమన్నారాయణుని వలన నారదభగవానుడు విని గౌతమమహర్షికి చేప్పేను. గౌతమమహర్షి పరాశర మహర్షికి బోధించెను. పరాశరభగవానుడు కూడా గంగాద్వారమున ధర్మార్థ కామ మోక్ష ప్రదమగు ఈ పురాణమును మునులకు బోధించెను.

అట్లే పూర్వము బ్రహ్మ సనక మహర్షికి సనత్కుమారునకు సర్వపాప ప్రణాశనమగు ఈ పురాణమును బోధించెను. సనక మహర్షి యోగ విత్తముడగు దేవలునకు దేవలుడు పంచశిఖునకు బోధించెను. సనత్కుమారుని వలన సత్యవతీసుతుడగు వ్యాసభగవానుడు, సర్వార్థ సంచయము పరమమగు ఈ పురాణమును పొందెను. ఆ వ్యాస భగవానుని వలన వినిన నేను పాపనాశకమగు ఈ పురాణమును మీకు చెప్పితిని. మీరు కూడో ఛార్మీకునకు ఈయవలయును.

సర్వజ్ఞుడు, మహర్షి, గురువు, పరాశరపుత్రుడు, శాంతుడు నారాయణ స్వరూపుడగు వ్యాసభగవానునకు నమస్కారము. ఈ సకల జగత్తును సృజించి మరలతనలోనే లీనము చేసుకొను దేవాధినాధుడు కూర్మ రూపియగు శ్రీ మహావిష్ణువునకు నమోవాకములు.

ఇది శ్రీకూర్మపురాణమున షట్ సాహస్ర సం హితలో ఉపరి విభాగమున 44వ అధ్యాయము సమాప్తము.

శ్రీ కూర్మపురాణము సమాప్తము