కూర్మ మహా పురాణము

Table of Contents

16 - అథదక్షకన్యావంశకథనమ్

సూతుడిట్లనెను :-

ప్రజలను సృజింపుమని పూర్వము బ్రహ్మచేత ఆదేశింపబడిన దక్షుడు, దేవతలను, గంధర్వులను, ఋషులను, అసురులను, సర్పములను గూడ సృజించెను.

ఇంతకుముందు ఇతడు సృజించిన ప్రజలు వృద్ధి పొందకపోవుట వలన, దక్షుడు తరువాత స్త్రీ పురుషసంయోగము ద్వారానే ప్రజలను అంతట సృష్టించెను.

ప్రజాపతియగు వీరణుని పుత్రిక, ధర్మమార్గానుసారిణి యుసగు అశిక్నియందు వేయిమంది పుత్రులనతడు సృజించెను.

ఆ పుత్రులు నారదుని యొక్క మాయచేత నశించగా దక్షప్రజాపతి వైరిణీ అనుస్త్రీయందు మరల అరువది కన్యలను సృజించెను.  వారిలో పదిమందిని అతడు ధర్మునికిచ్చెను. కశ్యపుసకు పదమూడు మందినిచ్చెను. ఇరువదియేడుగురు కన్యలను చంద్రునకర్పించెను అరిష్టనేమియునువానికి నలుగురినిచ్చెను.

ఇద్దరు కన్యలను బహుపుత్రునికి, బుద్ధిమంతుడైన కృశాశ్వునకు ఇద్దరిని, అంగిరసునకు ఇద్దరి కన్యలను అట్లే ఇచ్చెను. ఆ కన్యల వంశవృద్ధిని చెప్పుదును వినుడు.

మరుత్వతి, పసువు, యామీ, లంబ, భానువు, అరుంధతి, సంకల్ప, ముహూర్త, సాధ్య, విశ్వ అను స్త్రీ ;

ఈ పదిమంది ధర్ముని భార్యలైన దక్షకన్యలు, కోరికీ గలిగిన కుమారులను గూర్చి తెలుపుదును, వినుడు. విశ్వ అను తరుణీ యందు విశ్వేదేవులు, సాధ్యయందు సాధ్యులు అనుదేవజాతివారు జన్మించిరి.  

మరుత్వతియందు మరుద్వంతులు, వస్తువునకు వసువులు భానువను నామెకు భానవులు, ముహూర్తకు ముహూర్తులను పోరు జన్మించిరి.

ఇక లంబయను భార్యకు ఘోషుడు, యామి యందు నాగవీధి, భూమికి సంబంధించిన సర్వవస్తు ఊతము కూడ అరుంధతి యందు జన్మించెను.

ధర్మునికి సంకల్పయను పత్నియందు సంకల్పుడు - ఈ విధముగా అతనికి దశభార్యలయందు కలిగిన సంతానము వీరు. ఎవరైతే అనేక వస్తువులు ప్రాణములుగా కలదేవతలు, జ్యోతిస్సుముందుగా కలవారు కలరో వారు ధర్మపుత్రులు కలరు.

వారు వస్తువులు ఎనిమిది మందిగా ప్రసిద్ధులు, వారి విషయకమైన వ్యాప్తిని చెప్పుదును. ఆపుడు, ధ్రువుడు, సోముడు, ధరుడు, అనలుడు, అనీలుడు;  ప్రత్యూషుడు, ప్రభాసుడు అను నీ యెనిమిదిమంది వసువులుగా పేర్కొనబడిపోరు. ఆపుని కుమారులు వైతండ్యుడు, శ్రముడు, శాంతుడు, ధ్వని అనువారు కలిగిరి.

ధ్రువుని కుమారుడు, లోకములను ప్రకాశింపజేయువాడు, పూజ్యుడైన కాలుడు. సోమునకు పూజ్యుడైన వర్చసుడు, ధరునకు ద్రవిణుడు పుత్రులుగా జన్మించిరి.

అనిలునకు మనోజవుడనుపుత్రుడు, తెలియరాని గమనవేగముకలవాడు కలిగెను. అనలునకు సేనాపతి అనుపేరుగల కుమారుడు పుట్టెను.

మహనీయుడు, యోగియునగు దేవలుడు ప్రత్యూషుని కుమారుడుగా పుట్టెను. ప్రభాసునకు శిల్పకారుడు, ప్రజాపతి అని చెప్పదగిన విశ్వకర్మ పుత్రుడాయెను.

అదితి, దితి, దనువు ఆరిష్ట, సురస, సురభి, వినత, తామ, క్రోధవశ, ఇర;

కద్రువు, ముని, ధర్మజ్ఞ అనువారు పదుముగ్గురు కశ్యపుని భార్యలు, వారి కుమారులను గూర్చి తెలిసికోనుడు. అంశుడు, ధాత, భగుడు, త్వష్ట, మిత్రుడు, వరుణుడు, అర్యముడు;

వివస్వంతుడు, సీత, పూష, అంశుమంతుడు మరియు విష్ణువు అనువారు పూర్వము చాక్షుష మన్వంతరములో తుషితులను పేరున ప్రసీదులుగా నుండిరి.  

అదితికుమారులైనపోరు వైవస్వతమన్వంతరములో ఆదిత్యులుగా పేర్కొనబడుచున్నారు. దితి కశ్యపునివలన, బలముతో గర్వితులైన ఇద్దరు పుత్రులను పొందినది.

వారిలో పెద్దవాడు హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అతని తమ్ముడు. దితిపుత్రుడైన హిరణ్యకశిపుడు గొప్పబలపరాక్రమములు కలవాడై యుండెను.

అతడు తపస్సుచేత పరమేశ్వరుడైన బ్రహ్మను ఆరాధించి, సాక్షాత్కారముపొంది, బహువిధస్తోత్రములతో పొగిడి గొప్పవరముల నాయసపలస పొందెను.

తరువాత అతని బలమువలన దేవతలు, మహరులందరు బాధలను, హింసను పొంది దేవదేవుడైన బ్రహ్మవద్దకువెళ్లిరి.

శరణుపొందదగినవాడు, శరణ్యుడు, శుభమును కలిగించువాడు, సర్వలోకస్వరూపుడు, లోకకర్త, రక్షించువాడు, పరమ పురుషుడు అగు, ఆ బ్రహ్మను పోరు చేరిరి.

లోకములకు మూలభూతుడు, అద్వితీయుడు, సనాతనుడు, పురుషోత్తముడు అగు విష్ణువువద్దకు, ఓ మునీంద్రులారా దేవతాశ్రేష్ఠులచేత, మునులచేత కూడప్రార్థింపబడి;

దేవతలందరి హితముకొరకు కమలాసనుడైన బ్రహ్మ తనకు నమస్కరించుచున్నమునివర్యులచేత, దేవతలచేతను కొనియాడబడుచు;

హరిఎక్కడ నివసించియున్నాడో, ఆ క్షీరసముద్రముయొక్క ఉత్తర తీరమునకు వెళ్లెను. ప్రపంచమునకు కారణభూతుడు, విశ్వమునకుగురువు, మంగళరూపుడు అగు నారాయణదేవునిచూచి;

ఆయనపాదములకు శిరసువంచినమస్కరించెను. వినయముతో చేతులు జోడించియిట్లనెను. “నీవు సమస్తప్రాణులకు రక్షకుడవు, అంతములేని వాడవు, సమస్తము ఆత్మగాకలవాడవు.

ప్రపంచమంతటా వ్యాపించినవాడవు, సమస్తదేవతలు శరీరముగా కలవాడవు, గొప్పయోగీశ్వరుడపు, అనాధీపురుషుడవు, నీవు సమస్త భూతములకాత్మయైనవాడవు, ప్రధానప్రకృతివి.  

వైరోగ్యమను ఐశ్వర్యములో నిమగ్నుడవు, వాక్కులకతీతమైనవాడవు, మాలిన్యములేనివాడవు. నీవు విశ్వమునకు కర్తవు, రక్షించువాడవు, రాక్షసులను సంహరించువాడవు కూడ;

అనంతుడైనప్రభూ నీవు మమ్ములను రక్షింపదగినవాడవు. ఓ పరమేశ్వరా నీవు రక్షకుడవైఉస్నావు” అనియిట్లు బ్రహ్మచేత ప్రార్థింపబడిన వాడై ఆనారాయణుడు;

వికసించినకమలములవంటి కన్నులుకలవాడు, పచ్చనివస్త్రము ధరించినవాడునై దేవతలను గూర్చి యిట్లుపలికెను. “చాలా గొప్పపరా క్రమముకలవారు అగు దేవతలు మీరు బ్రహ్మదేవునితో కూడినవారై ఎందుకు;

ఈ ప్రదేశమునకు వచ్చితిరి? మీకు నేనేమి కార్యముచేయవలెను?” అని ప్రశ్నించగా, దేవతలు ఇట్లు బదులు పలికిరి. హిరణ్యకశిపుడను వాడు బ్రహ్మయొక్క వరములచేత గర్వముకలవాడై;

ఆరాక్షసుడు, ఓమహాత్మా దేవతలందరినీ ఋషులతో గూడ బాధీంచుచున్నాడు. అతడు, నీవు తప్ప ఇతరులందరికీ అవధ్యుడైయున్నాడు. (చంపశక్యముకానివాడు).

 లోకమయుడైన నారాయణా అతనిని నీవు చంపుటకు తగియున్నావు. నీవు అందరికి రక్షకుడవు” దేవతలు చెప్పిన ఆమాటలు విని లోకకర్తయగు ఆ విష్ణువు;

రాక్షసశ్రేష్ఠుడైన హిరణ్యకశిపుని చంపుటకు అతడొక పురుషుని సృజించెను. ఆపురుషుడు మేరు పర్వతము వంటి భయము కలిగించు ఘోరరూపము కలిగి ఉండెను.

శంఖము, చక్రము చేతులయందుగల ఆపురుషునితో గరుడధ్వజుడైన నారాయణుడిట్లుపలికెను. “రాక్షసరాజైన హిరణ్యకశిపుని చంపి మరల;

ఈ దేశమునకు శీఘ్రముగ రాదగియున్నావు” అనగా ఆమాటవిని పురుషోత్తముడు, అవ్యక్త మహాపురుషుడునగు విష్ణువునకు నమస్కరించి ఆపురుషుడు;  శంఖచక్రములను, గదను ధరించి భయంకరమైన గర్జనము చేయుచు రాక్షసుని పట్టణమునకు వెళ్లేను.

ఆ దేవుడు గరుత్ముంతునెక్కి రెండవ మేరు పర్వతముపలె వెళ్లగా, మేఘము యొక్క పెద్ద ధ్వనివంటి ఆ పురుషుని ధ్వని విని రాక్షసశ్రేష్టులు.

రాక్షసరాజువలని భయమువలన ఒక్కమారుగా బిగ్గరగా అరచిరి. “ఒకానొక గొప్ప పురుషుడు దేవతలచేత ప్రేరణపొంది మనమీదకు వచ్చుచున్నాడు.  భయంకరమైన గర్జనచేయుచున్న ఆపురుషుని జనార్దనుడైన విష్ణువుగా తెలిసికొన్నాము” అనిరి. తరువాత హిరణ్యకశిపుడు రాక్షసశ్రేష్టులతో కూడ స్వయముగా .

ఆయుధములతోకూడి, యుద్దమునకు సిద్ధమైన ప్రహ్లాదునితోకూడ, కుమారులందరితో యుద్దమునకు వెళ్లాను. కోటిమంది సూర్యులతో సమానమైన కాంతీ గలిగి, గరుడుని అధీష్టించియున్న ఆవిష్ణువును చూచి;  పర్వతమువంటి ఆకారముకల, రెండవ నారాయణునివలేస్తున్న ఆ పురుషుని చూచి కొందరు పారిపోయిరి. ఇతరులు తత్తరపాటుతో కూడిన చూపులు కలవారై తమలోతామీట్లనుకొనిరి.

ఇతడు మనకు శత్రువు, దేవతలకు రక్షకుడు, నాశరహితుడును అగు విష్ణువే నిశ్చయముగా అయి యుండును. లేదా అతని కుమారుడైన కావచ్చును.  

ఇట్లుపలికి వారు ఆపురుషునికోరకు ఆయుధవరములను కురిపించిరి. ఆపురుషుడుకూడ వారి శస్త్రములను సులభముగా భగ్నముచేసి అక్షతశరీరుడుగా ఉండెను.

ప్రసిద్ధమైన బలముకల హిరణ్యకశిపుని కుమారులునలుగురు, మేఘమువలె గంభీరధ్వనికలవారై, విష్ణువువలన పుట్టిన ఆపురుషునితో యుద్ధముచేసిరి.

ప్రహ్లాదుడు, అనుహ్లాదుడు, సంస్థదుడు, హ్లాదుడు అని ఆనలుగురి పేర్లు. వారిలో ప్రహ్లాదుడు బ్రహ్మాస్త్రమును ప్రయోగించగా, అనుహ్లాదుడు నారాయణాస్త్రమును ప్రయోగించినాడు.

సంహ్లాదుడు కౌమారాస్త్రమును, హ్లాదుడనువాడు ఆగ్నేయాస్త్రమును ప్రయోగించెను. ఆ అస్త్రములన్నియు సారాయణసంభవుడైన ఆ పురుషుని షోడశాధ్యాయము చేరి ;  అతనినీ ఏమాత్రము చలింపజేయజాలకపోయినవి. అతడు వాసుదేవుడైన విష్ణుపువలెనే గోప్ప భుజములు కల, ఆ పురుషుడు హిరణ్యకశిపుని నలుగురు పుత్రులను;

తనచేతులతో వారీ పాదములయందు పట్టుకోని విసరివైచెను, మరియు గర్జించేను. తరువాత తన కుమారులందరు పోరాటమునుండి దూరముకాగా హిరణ్యకశిపుడు స్వయముగా,

తన పాదముతో అతని రొమ్ములపై బలముగా తన్నెను. ఆ హిరణ్యకశిపునిచేత ఎక్కువగా బాధింపబడిన ఆ వైష్ణవ పురుషుడు గరుత్ముంతునితో, అనుచరులతో గూడ,

అంతర్థానమై ప్రభువైన నారాయణుడున్నచోటికి శీఘ్రముగా వెళ్లాను. అక్కడికి వెళ్లి హిరణ్యకశిపునివద్ద జరిగిన విషయ మంతయు హరికి విన్నవించెను.

ఆ విషయము విని, అఖిలజ్ఞాన స్వరూపుడు, నిర్మలుడు అగు నారాయణుడు మనసులో ఆలోచించి, సగము శరీరము మనుష్యునిది, సగము శరరీము సింహపుదిగా చేసి;  నరసింహరూపమును ధరించి అదృశ్యముగావెళ్లి హిరణ్యకశిపుని పట్టణములో అకస్మాత్తుగా సాక్షాత్కరించెను. ఆరూపముతో దైత్యులను, దానవులను అతడు మోహింపజేసెను.  

కోరలతో భయంకరరూపముకలవాడు, యోగస్వరూపుడు, ప్రళయకాలపు అగ్నితో పోల్చదగినవాడు అగు సారాయణుడు, సమస్తమును సంహరింప జేయగల తనశక్తిని అధిష్టించి, .

మధ్యాహ్నకాలములో సూర్యుడేవిధముగా ప్రకాశించునో ఆవిధముగా విష్ణువు ప్రకాశించెను. నరసింహరూపములోనున్న ఆపురుషుని చూచి తన పెద్దకుమారుడైన ప్రహ్లాదుని గూర్చి;

రాక్షసుడైన హిరణ్యకశిపుడు నరసింహుని చంపుమని ప్రేరణచే సెను. “ఈ నరసింహరూపముకల పురుషుని, పూర్వముకంటే తక్కువ శక్తి కలవానిని;

నాచేత ప్రోత్సహించబడినవాడవై, నీ తమ్ములతో కూడి శీఘ్రముగా సంహరించుము.” అని పలికిన తండ్రి ఆజ్ఞవలన అసురుడైన ప్రహ్లాదుడు నాశరహితుడైన విష్ణువును; .

సంపూర్ణ ప్రయత్నముతో ఎదుర్కొని పోరాడేసు. చివరకు ఆనరసింహునిచేత ఓడింపబడినాడు. అప్పుడు హిరణ్యకశిపుని తమ్ముడు హిరణ్యాక్షుడు మోహపరవశుడై;

పాశుపతాస్త్రమును ధ్యానించి నరసింహునిపై ప్రయోగించి బిగ్గరగా అరచెను. పరిమితి లేని తేజస్సుకల, దేవతలందరికీ ప్రభువైన ఆనారాయణునికీ;

శివునికి సంబంధించిన ఆ అస్త్రము ఎటువంటి హానినికూడ కలిగించలేదు. ఆ అస్త్రము విష్ణువుచే విఫలము చేయబడుటను చూచిన ప్రహ్లాదుడు, తనయొక్క అదృష్టవిశేషమువలన;

ఆవిష్ణువును, సనాతనుడు, సమస్త జగత్స్వరూపుడు, అగుదేవునిగా తలచేను. అప్పుడా ప్రహ్లాదుడు తన ఆయుధములన్నిటిని వదలి సత్త్వగుణయుక్తమైన మనస్సుతో;

యోగీశ్వరుల హృదయములందు శయనించు ఆదేవునికీ శిరస్సుతో ప్రణమిల్లెను. ఋగ్యజుస్సామవేదములకు సంబంధించిన మంత్రరూప స్తోత్రములతో నారాయణుని స్తుతించి;

తనతండ్రిని, సోదరులను, హిరణ్యాక్షునికూడ యుద్దమునుండి వారించి అతడిట్లనెను. “ఈ సొరాయణుడు అంతములేనివాడు, శాశ్వతుడు, పుట్టుకలేనివాడు అగుభగవంతుడు.  

ఇతడు పురాణపురుషుడు, గొప్పయోగీశ్వరుడు, లోకాత్మకుడు. ఇతడే ధాత, విధాతకూడ. స్వయముగా ప్రకాశించువాడు, మాలిన్యము లేని వాడును అగుదేవుడు.

ఈ విష్ణువే ప్రధానమైన పురుషతత్త్వము, సౌశరహితమైన మూలప్రకృతిరూపుడు. సమస్తప్రాణులకు ఈశ్వరుడు, అంతటవ్యాపించి ఉన్నవాడు, త్రిగుణములకతీతుడైయున్నాడు.

అటువంటి అవ్యక్తరూపుడైన, నాశరహితుడైన ఇతనిని శరణుపొందుడు". అనియిట్లు ప్రహ్లాదునిచే చెప్పబడిన, మిక్కిలి దుష్టమైన బుద్ధికల హిరణ్యకశిపుడు స్వయముగా;

విష్ణుమాయచేత మోహమును పొందించబడినవాడై కుమారుని గూర్చి ఇట్లుపలికెను. “అల్పమైన పరాక్రమముకల ఈనరసింహరూపియైన పురుషుడు అన్ని విధముల చంపదగినవాడు,

ఇతడిప్పుడు మృత్యువుచేత ప్రేరణపొంది మనభవనమునకు వచ్చినాడు”. అని పలికిన తండ్రిని చూచి నవీ, కుమారుడైన గొప్పబుద్దికల ప్రహ్లాదుడు ఈమాట పలికెను.

సమస్తభూతములకు ప్రభువు, అద్వితీయుడు, నాశరహితుడు అయిన ఇతనిని దూషించకుము. శాశ్వతుడు, కాలమునకతీతుడు, భగవంతుడు, మహాదేవుడు అగు;

విష్ణువు ఎట్లు కాలునిచేత చంపబడును? ఇతడుకాల స్వరూపుడు, కాలరూపమును ధరించినవాడు" అని పలుకగా దుష్టస్వభావుడైన హిరణ్యకశిపుడు కాలముచేత ప్రేరణపొందినవాడై అప్పుడు,

తనకుమారునిచేత వలదని వారింపబడికూడ నాశరహితుడైన విష్ణువుతో యుద్ధముచేసెను. ఎఱ్ఱని కన్నులుగల ఆవిష్ణువు హిరణ్యాక్షుని అన్నయగు హిరణ్యకశిపుని,

అతనిపుత్రుడగు ప్రహ్లాదుడుచూచుచుండగనే గోళ్లతో చీల్చిచంపెను. హిరణ్యకశిపుడు చంపబడగా గొప్పబలము కలిగిన హిరణ్యాక్షుడు;

భయముతోకలతచెంది కుమారుడైన ప్రహ్లాదుని అక్కడనే వదలి పారిపోయెను. ఆనుహ్లాదుడు మొదలగు తక్కిన కుమారులు, వందలకొలది ఇతర రాక్షసులుకూడ,

నరసింహుని శరీరమునుండి పుట్టిన సింహముచేత యమలోకమును పొందించబడిరి తరువాత విష్ణువు భయంకరమైన ఆరూపమునుప సంహరించి; 

  తనదైన నారాయణనామముగల శ్రేష్టమైన ఆకారమును పొందెను, భగవంతుడగు నారాయణుడక్కడినుండి వెడలిపోగా రాక్షసశ్రేష్ఠుడైన ప్రహ్లాదుడు.  ఉచితమైన పట్టాభిషేకముతో హిరణ్యాక్షునిప్రభువుగా చేసెను. తరువాత అతడు యుద్ధముతో జయించి దేవతలను, మునులను గూడ బాధలు పెట్టెను. .

తపస్సుతో శంకరుని పూజించి అంధకుడను పేరుగల గొప్ప కుమారునిపొంది, దేవేంద్రునితో కూడ దేవతలందరిని జయించి ఈభూమిని కలత చెందించి,

వేదములను పాతాళమునకు తీసికొనివెళ్లి కాంతిహీసములుగా చేసెను. తరువాత బ్రహ్మతోకూడిన దేవతలందరు వాడిపోయిన ముఖకాంతి కలవారై, .

వైకుంఠమున విష్ణునివాసమునకువెళ్లి ఆదేవునకీ విషయమును విన్నవించిరి. విశ్వరూపుడు, నాశరహితుడును అగు ఆనారాయణుడు వానినీ చంపుటకు తగిన ఉపాయమునాలోచించి, 

సమస్తదేవతామయము, నిర్మలమైనదియగు వరాహరూపమును ధరించెను. తరువాత పురుషోత్తముడైన విష్ణువు వెళ్లి హిరణ్యాక్షుని చంపి;  తనయొక్క కోరతో కల్పాదిసమయములో ఈభూమిని పైకి తెచ్చాను. తరువాత వరాహరూపమును విడిచిపెట్టి, రాక్షసులను అక్కడ అధికారములో నెలకొల్పి;  ఆవిష్ణువు, దివ్యమైన తననీజరూపమును పొంది పరమపదమునకు వెళ్లాను. ఆహిరణ్యాక్షుడు మరణించగా, విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడు;

రాక్షసభావమును విడిచిపెట్టి తనరాజ్యమును పరిపాలించెను. భగవంతుడగు నారాయణుని పూజయందాసక్తికలిగి, శాస్త్రపద్దతితో దేవతలకు యజ్ఞములు చేసెను.

అతనిరాజ్యము విష్ణువు మహిమవలన శత్రురహితముగా ఉండెను. తరువాత ఒకప్పుడు ప్రహ్లాదుడు తనయింటికి వచ్చిన బ్రాహ్మణునితో;

దేవతలమాయచేత మాట్లాడలేదు. ఆతాపసుడు మోహితుడైన ప్రహ్లాదునిచేత మిక్కిలిగ అవమానించబడినవాడై;

కోపముతో ఎర్రబడిన కన్నులు కలవాడై రాక్షసరాజునిట్లు శపించెను. ఏబలమునాశ్రయించి నీవు బ్రాహ్మణుల నవమానించుచున్నావో,ఆ విష్ణుసంబంధీనియైన నీ దివ్యశక్తి నశించిపోవుగాక. ఇట్లు పలికి ఆ బ్రాహ్మణుడు శీఘ్రముగా ప్రహ్లాదుని యింటినుండి వెడలిపోయెను.

తరువాత శాపబలమువలన ఆరాక్షసరాజు రాజకార్యముల యందొసక్తుడై, మోహమును పొందెను. బ్రాహ్మణోత్తములను బాధించెను. విష్ణువును గుర్తించడాయెను.

తనతండ్రి హత్యను స్మరించుకొనీ హరినిగూర్చి కోపమును తెచ్చుకొనెను. అప్పుడు వారిద్దరికి భయంకరమైన, రోమాంచమును కల్గించు గొప్పయుద్ధము జరిగెను.  భగవంతుడగు నారాయణునకు, దేవతావిరోధియగు ప్రహ్లాదునకు గొప్పయుద్ధముజరిగి దానిలో విష్ణువుచేత ప్రహ్లాదుడు జయింపబడెను.

  పూర్వసంస్కారము యొక్క విశేషమువలన అతనికి పరమపురుషుడైన ఆవిష్ణువునందు భక్తిపూర్వకజ్ఞానము కలిగినది. అందువలన శరణు పొందదగిన ఆనారాయణునీశరణు పొందెను.

అప్పటినుండి రాక్షసరాజైన ప్రహ్లాదుడు పురుషోత్తముడైన నారాయణునియందు సాటిలేని గొప్పభక్తిని కలిగి గొప్పయోగసిద్ధిని పొందెను.  హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు యోగసాధనలో ఆసక్తుడుకాగా, ఆతని గొప్పరాజ్యమును రాక్షసశ్రేష్ఠుడైన అంధకుడు స్వీకరించెను.

ఆ అంధకుడు హిరణ్యాక్షుని కుమారుడు, శివునియొక్క శరీరము నుండి పుట్టినవాడు. వాడొకమారు పర్వతరాజు కూతురు, మందర పర్వతమందున్నది అగు ఉమాదేవిని కామించెను.  పూర్వకాలములో పవిత్రమైన దారువనములో గృహస్థులైన మునులు వేలమంది, ఈశ్వరుని ఆరాధించుకొరకు తపస్సు నాచరించిరి.  

తరువాత కొంతకాలమునకు ఒకప్పుడు కాలప్రభావముచేత దాటుటకు శక్యముకొనీది, ప్రాణులను నశింపజేయునది, మిక్కిలిభయంకరమైనది అగు అనావృష్టియేర్పడెను.  

అప్పుడు అక్కడి మునులందరు ఒకచోట చేరి తపస్సులకు నిధివంటివాడైన గౌతమమునినిచేరి, ఆకలిచే పీడింపబడినందున ప్రాణములను నిలుపునట్టి ఆహారమునీమ్మని యాచించిరి.

విద్వాంసుడైన ఆగౌతముడు వారికి రుచికరమైన అన్నమును అనేకవిధముల దానీని పెట్టించెను. ఆ బ్రాహ్మణులందరు ఎటువంటి అనుమానములేని మనస్సుతో అన్నమును భుజించిరి.

పండ్రెండవ సంవత్సరము గడువగా, అప్పుడు ప్రళయకాలములో శంకరునిచేత కల్పింపబడు వర్షమువలే గొప్పవర్షము కురిసెను. తరువాత ప్రపంచము మరల పూర్వమువలె ఆయెను.

తరువాత ఆమునిశ్రేష్ఠులందరు ఒకరితోనొకరు ఆలోచించుకొని గౌతమ మహర్షి దగ్గరకు వచ్చి, వెళ్లుదుము అని వేగముగా చెప్పిరి.

ఆగౌతమముని వారినీ, కొంతకాలము సుఖముగా మా యింటిలో నివసించి తరువాత వెళ్లుడు అనీ వారిని ప్రయాణము నుండి వారించెను.

తరువాత ఆమునులు మాయచే కల్పితమైన నల్లని గోవును సృజించి మహాత్ముడైన ఆ గౌతమమునియొక్క సమీపమునకు చేర్చిరి.

ఆగౌతముడు దానిని చూచి, దయకలిగినవాడై, దానినికాపాడుట యందాసక్తికలవాడై తనపశువులశాలలో దానిని కట్టివేసెను, ఆగోవుఅతనిచేత తాకబడినంత మాత్రముచేతనే మరణించినది.

దానిమరణముతో గౌతముడు చాలా పరితాపము చెందినవాడై, ఏదికార్యము, ఏది అకార్యము అను విషయమును శీఘ్రముగా తెలిసికొనజాలని పరిస్థితిలో పడిపోయెను. అప్పుడు మునులు ఆఋషితో ఇట్లనిరి.

ఓ బ్రాహ్మణశ్రేష్టుడా ఈ గోవధవలన కలిగిన పాపము నీ శరీరమును ఎంతవరకు ఆశ్రయించి ఉండునో, అప్పటి వరకు నీ అన్నమును మేము తినకూడదు. అందువలన మేమువేళ్లుచున్నాము.

అతనిచేత అనుమతినిపొందినవారై ఆమునులు మంగళకరమైన దేవదారు వనమును గూర్చి వెళ్లిరి. వారు తమపాపఫలమును వెంట తీసుకొని, పూర్వమువలే తపస్సుచేయుటకు వెళ్లిరి.

ఆ గౌతమమునీ, తనకు కలిగిన గోవధపాతకము ఆమునుల మాయచేత కలిగినదని ఒకానొక కారణముచేత తెలిసికొని చాల కోపము కలిగీవారినీ శపించెను.

 “ఈమునులు వేదత్రయమునకు దూరులై, మహాపాతకములు చేసినవారితో సమానులై ఉండగలరు” అని శపించెను. ఆమునులు అతని శాపమువలన చాలమారులు మగలమరలపుట్టుచున్నవారై;

వారందరు దేవతలకు ప్రభువైన శంకరునీ, విష్ణువును కూడచేరి, అంతట నిండియున్నవారిని ఎంగిలిపడినవారు వలె లౌకికములైన స్తోత్రములతో కొనియాడిరి. (వైదికమంత్రములతోకాకుండా)

ఆ విష్ణువు, శంకరుడుకూడ దేవతలకుదేవులు, భక్తులబాధలను తొలగించు గొప్పదేవులు, స్వేచ్ఛాప్రవృత్తి చేత గొప్పయోగమును ధరించిన వారుకసుక పాపమునుండి మమ్ములను కాపాడదగియున్నారు.

అప్పుడు వృషభధ్వజుడైన శంకరుడు, తనప్రక్కన నిలిచియున్న విష్ణువును చూచి, పుణ్యమును కోరుచున్న వీరి విషయములో చేయదగిన కార్యమేమి? అని ప్రశ్నించెను.

అప్పుడు భక్తులయందు ప్రేమకలవాడు, శరణుపొందినవారిని కాపాడువాడు, భగవంతుడు అగు విష్ణువు, సమస్కరించుచున్న బ్రాహ్మణులను చూచి శివునిగూర్చి ఇట్లు పలికెను.

ఓ శంకరా లోకములో వేదములనుండి వెలియైన మనుష్యునీయందు కొంచెముపుణ్యముకూడ చేరియుండదు. ధర్మమనునది వేదము నుండి ఆవిర్భవించి ప్రకాశించినది.

ఓ మహేశ్వరా అటైనను మనకుభక్తులయందుండు పొత్సల్యముచేత వీరు కాపాడదగినవారు. వీరందరు తమ పాపమువలన నరకమునకు వెళ్లదగినవారైనను మనచేతరక్షింప దగినవారు.

అందువలన వేదములకు దూరులైన పాపాత్ములను కాపాడుటకొరకు, జనులను మోహింపజేయుటకు కొన్ని శాస్త్రములను సృజించెదము. ఓ వృభధ్వజా ఇదీమనకర్తవ్యము.

ఈవిధముగా రాక్షసులశత్రువైన విష్ణువుచేత బోధింపబడినశివుడు మోహకారకములైన శాస్త్రములను నిర్మించెను. శివునిచే చెప్పబడి హరికూడ కొన్ని అటువంటి శాస్త్రములను రచించెను.

ఆ మోహశాస్త్రాలు - కాపాలము, సోకులము, వామము, భైరవము, పూర్వపశ్చిమము, పంచరాత్రము, పాశుపతము, ఇవికాక ఇతరములు కూడ వేలకొలది శాస్త్రములను; సృజించి, ఆ బ్రాహ్మణులను గూర్చి పలికెను- “మీరు వేదబాహ్యులై, శాస్త్రములచేత విధింపబడిన కార్యములు చేయుచు భయంకరమైన నరకములలో చోలా కల్పములవరకు మరలమరల పడుచున్నవారై;

మనుష్యలోకములో పుట్టుచు, తరువాత నశించిన పాపముకలవారై, ఈశ్వరుని పూజించిన బలమువలన పుణ్యలోకగతిని పొందగలరు.

నా అనుగ్రహముతో ప్రవర్తించుడు. ఇంకొకవిధముగా మీ పాపమునకు ప్రాయశ్చిత్తములేదు. అని శివుని చేత, నారాయణునిచేత గూడ ప్రోత్సహించబడినవారై ఆ మహారులు; రాక్షసులకు శత్రువైన శివుని ఆజ్ఞను ఆచరించిరి. వారుకూడ మరల ఆయా విషయములందో సక్తులై ఇతరములైన శాస్త్రములను కొన్నిటిని నిర్మించిరి.

తమ శిష్యులకు సకల విద్యలనభ్యసింపజేయుచు ఫలములను నిరూపించిరి. మోహముతో నిండియున్న లోకములో భూమండలమందవత రెంచి,

శంకరుడు వారి శుభముకొరకు బ్రాహ్మణులతో కూడ కలిసి భిక్షనాచరించెను. కపాలముల మాలను ఆభరణముగా ధరించినవాడై, శ్మశానములోని భస్మము లేపనము చేసికొన్నవాడై;

జడలసమూహముచేత అలంకరింపబడినవాడై, లోకమును మోహింపజేయుచు, తనభార్యయగు పార్వతీదేవిని గొప్పతేజస్సు కల విష్ణుదేవుని అధీనములో ఉంచి భగవంతుడగు శివుడు దుష్టులను శిక్షించు కార్యములో భైరవుని నియమించి, దేవీరూపమును ధరించిన నారాయణునియందు కులమునకానందమును కలిగించు కుమారుని కలిగించి అక్కడ ఇంద్రుడు మొదలగు దేవతలను, గణములను నెలకొల్పిమహాదేవుడగు శివుడు బయలుదేరివెళ్ళగా, ప్రపంచమే శరీరముగా కలిగిన విష్ణువు స్వయముగా;

ఆడురూపమును ధరించినవాడై ఎల్లప్పుడు మహేశ్వరదేవుని సేవించుచుండెను. బ్రహ్మదేవుడు, అగ్నిహోత్రుడు, ఇంద్రుడు, యమధర్మరాజు, ఇతరదేవతాశ్రేష్ఠులు;

మంగళకరమైన స్త్రీ రూపమును ధరించినవారై మహాదేవుని సేవించిరి. పూజనీయుడు, శివున కత్యంతము ప్రేమ పాత్రుడైన నందీశ్వరుడు కూడ, గణములకధిపతిగా పూర్వమువలెనే ద్వార ప్రదేశమునందు నిలిచెను. ఇంతలో అంధకుడను పేరుగల దుష్టబుద్దీగల రాక్షసుడు; పార్వతీదేవిని అపహరించుకోరికగలవాడై 1అప్పుడు మందరము వద్దకు వచ్చెను. అక్కడికివచ్చిన అంధకాసురుని చూచీ ప్రళయకాలభయం కరుడై శివుడు యమధర్మరాజు వంటి ఆకారమును ధరించినవాడై అతనిని అడ్డగించెను. అప్పుడు శంకరునికి, అంధకాసురునికి మధ్య మిక్కిలి క్రూరమైన, గగురోటు కలిగించు గోప్పయుద్దముజరిగెను.

వృషభము ధ్వజముగా కల శివుడు తనశూలముతో ఆరాక్షసుని రొమ్మున పొడిచెను. అప్పుడా అంధకుని శరీరమునుండి వేలకొలది అంధకసంజ్ఞకల రాక్షసులావిర్భవించిరి.

ఆ అంధక రాక్షసులచేత యుద్దములో నందీశ్వరుడుమొదలగువారు ఓడింపబడిరి. ఘంటాకర్ణుడు, మేఘనాదుడు, చండేశుడు, చండతాపనుడు అనువారు వినాయకుడు, మేఘవాహుడు, సోమనంది, వైద్యుతుడు అను గొప్పబలము కలవారందరు రాక్షసశ్రేష్ఠుడైన అంధకుని సమీపించి శూలములు, శక్తి, ఋష్టి అనుఖడ్గములు కొండచరియలు, గొడ్డళ్లు అను ఆయుధములతో, తమ చేతులతో వారి రెండుపాదములను పట్టుకొని త్రిప్పుచు యుద్ధముచేసిరి.

మిక్కిలి బలవంతుడైన ఆ అంధకునిచేత వారందరు నూరు యోజనములదూరము విసిరివేయబడిరి. తరువాత అంధకునిచే సృజింపబడిన వేలకొలది రాక్షసులు.

ప్రళయకాలపు సూర్యునితో సమానులై భైరవునికెదురుగో పరుగులు పెట్టిరి. అప్పుడచట మహాశబ్దము మిక్కిలి భయంకరముగా పెద్దగా వ్యాపించేను.

భైరవదేవుడు భయంకరమైన శూలమును గ్రహించి పోరాడేను. జయింప శక్యముకాని, అంధకుల గొప్పబలమును చూచి వారిచే గెలువబడిన శివుడు, జన్మరహితుడు, విభువునగు పోసుదేవుని శరణముపొందెను. ఆ భగవంతుడు విష్ణువు శ్రేష్ఠులైన వందమంది డేవీగణమును సృష్టించెను.

భగవంతుడు దేవీ గణము పార్వభాగమున నీలచి రాక్షసుల వినాశముకోరకు, వేయిమంది అంధకాసురగణము దేవులచేత యమలోకము నకు యుద్ధరంగములో సులభముగా పంపబడెను, వారిచేత చంపబడిన తన సైన్యమును చూచి అంధకమహాసురుడు;

గోప్పవేగముకల అంధకుడు ఆయుద్ధరంగమునుండి తప్పుకున్నవాడై పలాయనముచేసెను. తరువాత మహాదేవుడు శంకరుడు పండ్రెండు సంవత్సరాలపాటు ఒకక్రీడా వినోదమును జరీపీ భక్తజనుల యొక్కమేలు కొరకు మరల మందరమువద్దకు వచ్చి చేరెను. ఈశ్వరుడు తిరిగి వచ్చిన విషయము తెలిసికొని అందరు గణాధిపతులు; సమూహాముగాచేరి, బ్రాహ్మణులు సూర్యునివలె సమీపించి నిలిచిరి. అయోగ్యులకు చేరుటకు శక్యముకానీ పుణ్యయుక్తమైన భవనమును ప్రవేశించి; శివుడు అక్కడ నందీశ్వరుని, భైరవుని, విష్ణువును చూచెను. తరువాత భక్తితో నమస్కరింప బూనుకున్న నందీశ్వరుని అనుగ్రహించి పరమేశ్వరుడు

ముందుగా ప్రేమతో శంకరుడు విష్ణువు నాలింగనము చేసికొనెను. తరుపోత ఆదేవుడు అనురాగముతో వికసించిన కన్నులుగల దేవిని చూచి,

ఆదేవి పాదములకు శిరస్సుతో నమస్కరించి, ఈశ్వరునికి గూడ ప్రణమిల్లి ఆశంకరునకు శంకరుడైన భగవంతుడు కేశవుడు, జయమును తెలిపెను.

భైరవుడు విష్ణువుయొక్క గొప్పతనమును గుర్తించిన వాడై ప్రక్కభాగమున నిలబడెను. కేశవుని పరాక్రమమును, యుద్ధవిజయమునుగూడ విని శివుడు దేవితో కూడ శ్రేష్ఠమైన ఆసనమందుకూర్చుని ఉండెను. తరువాత అందరు దేవతలు, మరీచి ప్రభృతులగు బ్రాహ్మణులు దేవదేవుడైన, త్రిలోచనుడైన శివుని దర్శించుటకచటికి వచ్చిరి. ఆయన చేత పూర్వము జయింపబడిన మందరమను పేరుగల శ్రేష్టమైన వందమంది దేవీ సమూహమును గూడ చూడగోరివచ్చిరి.

దేవదర్శనపు కోరికతో వచ్చిన రాక్షససైన్యము దేవితో గూడ శ్రేష్ఠమైన ఆసనముపై కూర్చున్న చంద్రభూషణుడగు శివునకు నమస్కరించెను. ఆయనవామ భాగమందున్న పార్వతికిగూడ ప్రణామము చేసిరి.

దివ్యమైన ఆసనమునధిష్ఠించినటువంటి నారాయణుని మనస్సునందు నిలిచియున్నదేవిని చూచి, మరియు సింహాసనాసీనుడై యున్న నారాయణునికూడ చూచిఆడేవతాస్త్రీలు భగవంతుడైన ఈశానునికి నమస్కరీంచి యిట్లు ప్రశ్నించిరి. కాంతితో ప్రకాశించుచున్న నీవెవరవు? సూర్యుని కాంతివంటి కాంతిగల యీ బాలఎవరు? పద్మములవలే వెడల్పయిన కన్నులు కలిగి శరీరకాంతితో ప్రకాశించుచున్నఇతడెవరు?

ఆదేవాంగనల మాటను విని మహాయోగీశ్వరుడు, నాశరహితుడు, భూతాధిపతి, వృషభవాహనుడైన శివుడు ఇట్లు పలికెను. ఇతడు సనాతనుడైన నారాయణుడు, ఈమెలోకమాతయగు పార్వతి.

భగవంతుడగు ఈశ్వరుడు తనను తాను అనేకవిధముల వీభజించుకొని ఉన్నాడు. నాయొక్కమూల తత్వమును, దేవియొక్క స్వరూపమును గూడ మహారులు తెలియజాలరు.

 భవాని, విష్ణువు కూడ విశ్వాత్మకుడైన యీఒక్కడే అని తెలియదగును. నేను కోరికలు లేనివాడను, శాంతుడను, అద్వితీయుడను

నన్నే కేశవుడని అందురు. లక్ష్మీదేవినీ, పార్వతీదేవిని కూడ నొరూపములుగా చెప్పుదురు. ఇతడే ధాతమరియు విధాత, కారణకార్యములు కూడనైయున్నాడు.

చేయువాడు, చేయించువాడు, భుక్తిముక్తులను, ఫలములనిచ్చువాడు విష్ణువు. భుజించువాడు, తెలిసికొనుటకు శక్యముకానిపురుషుడు, కాలునీరూపముధరించి సంహరించుపోడుకూడ అతడే.

సృజించువాడు, కాపాడువాడు వాసుదేవుడు. అతడు విశ్వాత్మకుడు, అంతటా వ్యాపించినవాడు, కూటస్థుడు, నాశరహితుడు, వ్యాపించువాడు, యోగి, అవ్యయుడగు నారాయణుడతడే

తరింపజేయు పురుషుడు, ఆత్మరూపుడు, కేవలమైన పరమపదస్థానము. ఆయీమాహేశ్వరియగు గౌరి నాయొక్క శక్తివంటిది. మాలిన్యము లేనిది.

ఈగౌరీ శాంతురాలు, సత్యస్వరూప, ఎల్లప్పుడు ఆనందము కలది, పరమమైన స్థానమని వేదము చెప్పుచున్నది. ఈసమస్తము ఈమెయందే జనించి ఇక్కడనే సొశమును పొందును.

ఈమెయే సమస్తభూతములకు, గతులలో శ్రేష్టమైన గతియైనది. ఆదేవితో కూడియున్ననేను కేవలుడను, భేదరహితుడను, శ్రేష్ఠుడను.

నేను నాశరహితుడు, పరమాత్మయునగుపాడు, పుట్టుకలేనివాడు, భేదములేనివాడు, ఆత్మస్వరూపుడు, ఈశ్వరుడునగు విష్ణువును సంపూర్ణముగా దర్శించుచున్నాను.

ఈశ్వరుని, విష్ణువును ఒక్కనిగానే తెలిసికొనుడు, దానివలన మీరు శాంతిని పొందగలరు. శ్రద్ధతో కూడినవారు విష్ణువును అవ్యక్తాత్మరూపునిగా భావింతురు.

ఎవరైతే భేదదృష్టితో శివుని పూజింతురో వారు నాకు ప్రియులుకారు. ప్రపంచమునకు కారణభూతుడైన దేవుని ఎవరు మోహితులై ద్వేషింతురో వారు రౌరవాదులగు;

నరకములందు బాధింపబడువారై కోట్లసంఖ్యగల కల్పములచేత గూడ వీడునబడరు. అందువలన సమస్త ప్రాణులకుగూడ, నాశములేని విష్ణువు రక్షకుడు.

ఈలోకమున యథార్టరూపముతో తెలిసికొని, అన్నియాపదలందును ప్రభువు విష్ణువు ధ్యానింపదగినవాడు. భగవంతుని వాక్యమును విని భగవంతుడగు నారాయణునకు, హిమగిరితనయయగు పార్వతికిని నమస్కరించిరి. భక్తజనుల కిష్టుడైన ఈశ్వరునియందు తమకు భక్తిని కల్గించు మని కూడ ప్రార్థించిరి.

పార్వతీదేవి పాదములజంటయందు, సారాయణుని పాదకమలములందు నమస్కరించి తరువాత గణేశ్వరులు, మాతృగణములు కూడ, లోకమూల కారణభూతుడైన సొరాయణదేవుని చూడలేకపోయిరి. అది చాల ఆశ్చర్యము వలె జరిగినది. ఇంతలో ఆంధకుడను గొప్పరాక్షసుడు మన్మథవికారముచేత గ్రుడ్డివాడై,

మోహపరవశుడై పార్వతీదేవి నపహరించుటకు కైలాసపర్వతమునకు వచ్చెను. తరువాత అనంతములైన శరీరములుకల శ్రీమంతుడు, యోగీశ్వరుడు, నిర్మలుడు అగునారాయణుడు రాక్షసులతో యుద్ధము చేయుటకొరకు అక్కడనే సాక్షాత్కరించెను.

అప్పుడు భగవంతుడగు విష్ణువును తన పార్వభాగమందుంచుకొని, గణదేవముఖ్యులతో, శిలాదుని కుమారునితో, మాతృకాసమూహముతో కూడి దేవదేవుడగు శివుడు కాలరుద్రుడై యుద్ధమునకు వెడలెను.

అగ్నితోసమానమైన త్రిశూలమును ధరించి ఆదేవదేవుడు ముందునడచెను. ఆయనను గణాధిపతులు అనుసరించిరి. వేయిభుజములు కల భగవంతుడు బయలుదేరివెడలెను.

పక్షివాహనుడు, తామరాకువంటి రంగుకలిగిన భగవంతుడైన విష్ణువు అప్పుడుదేవతల మధ్యలో, సుమేరు పర్వతము యొక్క శిఖరము నధిష్ఠించిన, ముల్లోకములకు నేత్రరూపుడైన సూర్యభగవానునివలె ప్రకాశించెను.

పుట్టుకలేనివాడు, కొలుచుటకు శక్యముకానివాడు జయశీలుడగుహరుడు అనంతములైన ఆకృతులు కలవాడుగా సాక్షాత్కరించెను. త్రిశూలపాణియగుదేవుడావిర్భవించగా ఆకాశమందు గొప్పధ్వనితోకూడిన పూలవరము ఆదేవుని పై కురిసెను.

అప్పుడక్కడికివచ్చిన గణేశ్వరుని చూచి, గణేశులతో ఆవరింపబడియున్న రాక్షసశత్రువైన విష్ణువును చూచి మాతృకలతో, దేవతాప్రధానులైన గణములతో, ఇంద్రునితో కూడి యుద్ధముచేసెను.

తనభుజపరాక్రమమువలన యుద్దములో అందరిని జయించి, అనంతమైన తేజస్సుకల శివుడు, ఎక్కడకాలరుద్రుడు నశించిన బలముకలవాడై యున్నాడో అక్కడికీ విమానమునెక్కివచ్చెను.

తనవైపు వచ్చుచున్న అంధకాసురుని చూచి భగవంతుడగు గరుడధ్వజుడు, భస్మము అలంకారముగా ధరించిన భయంకరమైన మహాదేవుని గూర్చి యిట్లుపలికెను.

లోకములకు కంటకప్రాయుడైన అంధకాసురునీ నీవుచంపదగియున్నావు. మహానుభావా! నీవుకాకమరియొకడు ఇతనిని చంపగలవాడు లోకములోలేడు.

నీవు సమస్తలోకములనులయింప జేయువాడవు, ఈశ్వర శరీరము కాలుని స్వరూపముకదా! ఆరూపము వివేకముకల, వేదవిదులచేత బహువిధమంత్రములచేత కొనియాడబడుచున్నది.

భగవంతుడగు ఆశివుడు వాసుదేవుని మాటను విని, విష్ణువువైపు చూచి, రాక్షసరాజును చంపుటకు నిశ్చయము చేసికొనెను.

గణములకు సంతోషమును పెంపొందించునట్టి దేవతాసమూహము వెడలిపోయెను, ఆకాశమందుసంచరించుజనులు భైరవదేవుని ప్రశంసింప సాగిరి.

అంతములేనివాడా! మహాదేవా! కాలరూపుడా, సనాతనా నీకుజయము. నీవు అగ్నివీ. సమస్తభావముల అంతరంగములో సర్వగుడవై యుందువు.

నీవు అంతకుడవు, లోకములను సృజించువాడవు, నీవు బ్రహ్మవు, నాశరహితుడైన విష్ణుపువు. నీవు పరబ్రహ్మము, నీవు శివుడవు, నీవు పరమపదస్థానమైనపొడవు.

నీవు ఓంకారరూపుడవు, యోగాత్ముడవు, మూడువేదములు కన్నులుగాగలవాడవు, గొప్పవిభూతివి, విశ్వమునకు ప్రభువువు, అనంతుడగు లోకపతీ! నీకు జయము.

తరువాత ప్రళయకాలపు అగ్నివంటీ రుద్రుడు, సత్పురుషులకు ప్రాప్యమైన ఈశ్వరుడు ఆ అంధకాసురుని పట్టుకుని తన త్రిశూలపు కొనల యందునిలిపి బాగుగా నృత్యము చేసెను.

శూలమునకు కట్టబడిన అంధకుని చూచి దేవతాసమూహములు, బ్రహ్మదేవుడు, సంసారబంధమునువిడిపించువాడు, భయంకరుడు అగు ఈశ్వరునికి నమస్కరించిరి.

మునులు, సిద్దులు ఆయనను స్తుతించిరి, గంధర్వులు, కిన్నరులు పాటలు పాడిరి. ఆకాశములో అందమైన అప్సరసల గుంపులు సృత్యము చేయసాగినవి.

శూలముయొక్క కొనయందునీలుపబడిన అంధకుడు పాపములన్నీ కాల్చబడగా, సమస్త విషయకమైన విజ్ఞానము తనలోకలిగి ఆపరమేశ్వరుని స్తుతించెను.

సావధానుడనైననేను, అద్వితీయుడు, భగవంతుడు, పురాతసుడు, పుణ్యస్వరూపుడు, అంతములేనిరూపము కలవాడు, కాలుడు, కవి, విశ్వముయొక్క సంయోగవియోగములకు కారణభూతుడైనవాడు, పండితులు ఎవనిని భగవత్తత్త్వముగా తెలిసికొందురో ఆఈశ్వరునికీ శిరస్సుతో నమస్కరించుచున్నాను.

దంతములతోభయంకరముగానున్నవాడు, ఆకాశమందు నృత్యము చేయుచున్నవాడు, ముఖమునందు అగ్నినిధరించినవాడు, మండుచున్న సూర్యునివంటి రూపముకలవాడు, వేయిపాదములు, కన్నులు, తలలతో కూడియున్నవాడును అగు రుద్రుడవైన నీకు నమస్కరించుచున్నాను.

ఓ ఆదిదేవుడా దేవతలచేత పూజింపబడు పాదములు కలవాడా అవయవవిభాగములేనివాడా నీర్మలమైన తత్త్వస్వరూపుడా నీకు జయము. నీవు కేవలాగ్ని రూపుడవు. అనేక ప్రకారముల పూజింపదగినవాడవు. బాహ్యములైన భేదములచేత సర్వాత్మస్వరూపుడవై యున్నావు.

నిన్ను అద్వితీయుడైన పురాణపురుషుడవని, సూర్యునివంటి తేజస్సుకలవాడవనీ, అంధకారమున కతీతుడవని చెప్పుదురు. నీవు ఈవిశ్వమును ఎల్లప్పుడు చూచుచూ కాపాడుచున్నావు. నీవు యోగిసమూహములచే సేవింపబడు ప్రళయకారకుడవు.

నీవు కేవలరూపుడవు. అంతరాత్మస్వరూపుడపై లోకములోని అనేక శరీరములయందు బహుప్రకారముల నిలిచి ఉన్నావు. నీకు దేహాది భేదములులేవు. నీవు ఆత్మతత్త్వము. పరమాత్మశబ్దవాచ్యుడవునీవు కొందరునీన్ను శివునిగానే పేర్కొందురు.

నీవు నాశరహితమైన పరబ్రహ్మస్వరూపుడవు. పవిత్రుడవు. ఓంకారశబ్దవాచ్యుడవు, ఆనందస్వరూపుడవు. నీవు వేదవేత్తలైనవారికి ఈశ్వరుడుగా ప్రసిద్ధమైనవాడవు. సమస్తభేదశూన్యుడవైన స్వాయంభువుడవునీవు.

నీవు ఇంద్రస్వరూపుడవు, వరుణ, అగ్నిస్వరూపుడవు, హంసప్రజాపతివి, ప్రాణ, మృత్యు, యజ్ఞరూపుడవు ఏకాకారుడవైన భగవంతుడవు, నల్లనికంఠము కలవాడవు. వేదవేత్తలచే కొనియాడబడుచున్నావు.

లోకములకు ఆదిలేని నారాయణుడవునీవు. పితామహుడు, ప్రపితామహుడు కూడనీవే. వేదాంతరహస్యములతో నిండిన ఉపనిషత్తుల యందుగానము చేయబడువాడవు, సదాశివుడవు, పరమేశ్వరుడవు నీవైయున్నావు.

తమస్సుకతీతమైన, పరమపురుషుడైన పరాత్మకు వందనము. మూడువిధములగు శక్తుల కతీతుడవు, మాలిన్యరహితుడవు, వేయివిధముల శక్తిస్థానములయందు నిలిచియున్న నీకు నమస్కారము.

త్రిమూర్తీస్వరూపుడు, అనంతములైన పదములు, ఆత్మలుకలమూర్తీ, లోకములకు నివాసమైనవాడు, లోకమయుడు, జనులయొక్క హృదయములందు నివసించువాడు, నాగరాజు ఆభరణముగా కలవాడును అగునీకు నమస్కారము.

మునిశ్రేష్ఠులచేత, సిద్ధులచేత పూజింపబడిన పాదకమలములు కలిగి, ఐశ్వర్యమను ధర్మాసనమందు ఉపవిష్టుడవై, ప్రళయకారకుడవు, భపునకు జన్మకారకుడవు, వేయి సూర్యచంద్రుల కాంతిగల స్వరూపముధరించినవాడా!

మంచినడుముకలసోమునకు నమస్కారము. హిరణ్యబాహువైన దేవునకు నమస్కారము. అగ్ని, చంద్ర, సూర్యులు కన్నులుగా కలపానికి వందనము. పార్వతీపతియగు మృడునకు ప్రణామము.

రహస్యరూపుడు, గుహయందుండువాడు, వేదాంతశాస్త్రవిజ్ఞానముచేత నిశ్చయింపబడినవాడు, కొలత్రయభేదములేని నిర్మలతేజస్సుకల మహేశునకు, శివునకు నమోవాకము.

ఈ విధముగా కొనియాడబడిన ఆభగవంతుడగు శంకరుడు త్రిశూలముకొననుండి అతనిని దించి, సంతోషించినవాడై, చేతులతో అతనిని తాకి యిట్లు పలికెను.

ఓ దైత్యుడా! నీయీస్తోత్రముచేత నేను ఇప్పుడు అన్నివిధాల తృప్తిపొందిసాను. నీవు గణపతిగా అధికారపదవిని పొంది నాసన్నిధిలో ఎల్లప్పుడు నివసించుము.

రోగములు లేనివాడవై, సంశయములన్ని తొలగిపోయి, దేవతలచేత గూడ బాగుగా పూజింపబడుచు, ననీశ్వరునికి అనుచరుడుగా, అన్ని వీధముల దుఃఖములనుండి విడువబడినపోడపై; వసించుము

దేపదేవుడైన శంకరునిచేత ఈవిధముగా చెప్పబడినంతనే దేవతలందరు, గణాధిపతియైన గొప్పరొక్షసుడగు అంధకుని శివుని సన్నిధియందు;

వేయిసూర్యుల తేజస్సుతో సమానుడుగానున్నవాడు, మూడుకన్నులుకలవాడు, చంద్రకళ గుర్తుగాకలవాడు, నల్లనికంఠముకలవాడు, జడలతో కూడినశిరస్సుకలపోడు, శూలమందాసక్తికల హస్తముకలపోడుగా చూచిరి.

అటువంటి అంధకునీ చూచి గొప్పఆశ్చర్యమును పొందినవారై అతనినికోని యాడిరి. అప్పుడు భగవంతుడగు విష్ణువు చిరునవ్వు కలవానీ వలే దేవదేవునిగూర్చి ఇట్లుపలికెను.

ఓ మహాదేవా నీ ప్రభావము చాలాగొప్పది. అదీ ఉచితమైనది. గొప్ప పురుషుడు తమవారీ దోషములను చూడడు. వారిలోని గుణాలను గ్రహించును.

ఇట్లు పలుకబడిన గణేశదేవతాశ్రేష్ఠుడైన భైరవుడు విష్ణువుతో, అంధకునితోకూడి శంకరుని దగ్గరికి వెళ్లాను. అంధకునితో గూడ తనవద్దకు వచ్చిన విష్ణువునుచూచి మాతృగణాలతోకూడ శివుడు సంతోషమును పొందెను.

హిరణ్యాక్షునికుమారుడైన అంధకుని ఈశ్వరుడు తనచేతితో స్వీకరించి పార్వతి నివసించియున్న విమానము వద్దకు వెళ్లాను. ఆ పార్వతి, తనవద్దకు వచ్చిన భర్తను, సంసారతాపమును నివారించువానిని చూచి, అంధకసహితుడైన అతనిని సుఖప్రశ్నవేసెను. అంధకునిపై అనుగ్రహ దృష్టిని ప్రసరించెను.

తరువాత అంధకుడు భగవంతుని ప్రక్కభాగముననున్నమహేశ్వరిని చూచెను. భూమిమీద దండమువలె పడిపోయెను. ఆమె పాదకమలము లకు నమస్కరించెను. ఈశ్వరునికి ప్రియురాలైన, జన్మరహితయగు పర్వత పుత్రికకు నమస్కరింతును. ఏదేవివలన ప్రధానతత్వము, పురుషుడు కలుగుదురో, ఎవరు సమస్తజగత్తును లయింపజేయునో, ఏదేవిశివునిఅర్థాసనమున బంగారముతో చేయబడిన, అతినిర్మలమైన దానిపై శివునితో కూడి ప్రకాశించునో, హిమవంతునికూతురగు ఆమెకు నమస్కరింతును. ఏదేవిమూలముగా లోకములన్నియు సృజింపబబడి నశించునో, సమస్తదోషరహితయగు ఆఉమాదేవికి నమస్కరింతును.

ఆమేలేనిచోపుట్టుట, క్షీణించుట, వృద్ధిపొందుట అనునవి జరుగవు. అటువంటి, గుణముల కతీతురాలైన పర్వతరాజపుత్రికయుగు ఈదేవికి నమస్కరింతును. ఓ పార్వతీ నేను భ్రాంతుడనైచేసిన అపరాధమును క్షమించుము. దేవదానవులచేత కూడ నమస్కరింపబడు నీపాదపద్మములకు నమస్కరింతును.

ఈ విధముగా భగవతియైన పార్వతీదేవి, భక్తితోవినీతుడైన రాక్షసపతి అంధకునిచేత స్తోత్రముచేయబడి, ఆ అంధకుని పుత్రభావముతో స్వీకరించెను.

తరువాత శంకరునివలన పుట్టిన ఆ భైరవుడు మాతలతో కూడ శివుని ఆజ్ఞతో పాతాళమునకు వెళ్లెను.

ఎక్కడ, విష్ణువుయొక్క సంహారముచేయుశక్తిగల తమోగుణప్రధానమైన రూపము ఉండునో, ఎచ్చట ప్రభువైన హరి నరసింహరూపము కలపోడుగా, అవ్యక్తరూపుడుగా ఉండునో;

తరువాత అనంతుని రూపముధరించిన శంకరుడు శేషునిచేత బాగుగాపూజింపబడి, ప్రళయకాలపు అగ్నివంటి రుద్రరూపుడై స్వస్వరూపమును ఆత్మయందు సంయోజనముచేసెను.

ఆత్మసంయోజనముచేయుచున్న ఆపరమేశ్వరునిగూర్చి మాతృగణదేవతలందరు ఆకలిగొన్నవారై, మూడుకన్నులుకల మహాదేవునికి నమస్కరించి ఇట్లనిరి.

ఓ మహాదేవీ! మేముబాగుగా ఆకలితో ఉన్నాము. నీవు మాకనుజ్ఞనిమ్ము. మేము మూడులోకములను భక్షింతుము. లేనిచోమాకు తృప్తి కలుగదు.

విష్ణువువలన జనించిన ఆమాతృదేవతలు ఈవిధముగా పలికి చరాచరయుక్తమైన లోకత్రయము సమస్తమును భక్షించిరి.

పిమ్మట ఆభైరవరూపిదేవుడు, నరసింహరూపములోనున్న నారాయణదేవునికి నమస్కరించి చేతులు జోడించినపోడై ధ్యానించెను.

పార్వతీశుడగు శివుని ఆలోచనను గుర్తించి విష్ణువువెంటనే అక్కడ సాక్షాత్కరించెను. అతనితోభైరవుడు, ‘ఈమాతలు లోకమును భక్షించు చున్నా’రని విన్నవించెను.

 “ఓ భగవంతుడా! ఈ భక్షణమును శీఘ్రముగా నివారించుము. ఈ ముల్లోకములు నీయధీనములోనివి”. అని అతడుచెప్పుగా నరసింహ శరీరముదాల్చిన హరిచేత స్మరింపబడినవారై ఆమాతృదేవతలు;

తరువాత నరసింహరూపమును ధరించిన మహాదేవుని, సమస్తమును సంహరింపగలశక్తులు విష్ణువుయొక్కసన్నిధిని చేరి ఆశ్రయించేను.

మిక్కిలితేజస్సుగల భైరవునకు, శివునకు శక్తిని అందజేసిరి. లోకములకు జన్మకారకుడు, మిక్కిలి భయంకరుడు అగు నరసింహుని ఆ మాతలు చూచిరి.

ఆ మాతృదేవతలు క్షణకోలములో ఏకత్వమును పొందిన సర్పరాజు శేషునిగూడ చూచిరి. అప్పుడు హృషీకేశుడు ఇట్లు పలికెను. ఎవరు శివునకు భక్తులో, ఎవరు ఇక్కడనన్ను తలంతురో వారు ప్రయత్న పూర్వకముగా రక్షింపదగినవారు. సమస్త సంహారకార్యమును జరిపించునట్టి, సాటిలేని సాయొక్కశరీరమే మహేశ్వరుని శరీరముతో సంబంధించినదై, భుక్తిని,ముక్తిని ప్రసాదించునది. మహనీయమైన, అంతములేని కాలము, రెండు విధముల విభక్తమై, నాయొక్క తామసరాజసమూర్తులుగా వెలయును.

నాలుగు ముఖములు గల దేవదేవుడగు బ్రహ్మకూడనేనే. ఇతరులచే ఎదిరింపబడజాలని, లోకమును లయింపజేయగల యముడను.

కల్పముయొక్క అంతములో రౌద్రరూపముతో సమస్తసోరాయణుడను పేరుగల ఏనా ఆకారము కలదో, అది సత్త్వగుణాతిశయముకలపై ఎల్లప్పుడు జగత్తును స్థాపించుచుండును. ఆ విష్ణువు పరమ బ్రహ్మరూపుడు, పరమాత్మ, ఉత్తమ ప్రాప్యస్థానము.

అవ్యక్తరూపయగు మూలప్రకృతి సదానందరూప అనిచెప్పబడును. ఈ విధముగా విష్ణుమాతృదేవతలు విష్ణువుచేత బోధింపబడిరి.

తరువాత వారందరు పరనుశరణభూతుడైన మహాదేవుని శరణుపొందిరి. అంధకసంహారవృత్తాంతమిదియంతయు నాచే మీకు చెప్పబడినది. దేవదేవుడు, గొప్పశక్తికల భైరవస్వామియొక్క మాహాత్మ్యమిది.

శ్రీ కూర్మపురాణములో అంధకనిబర్హణమను పదునారవ అధ్యాయము సమాప్తము.