కూర్మ మహా పురాణము
24 - వంశకీర్తి వర్ణనము
సూతుడిట్లు చెప్పెను :-
క్రోష్ణువునకు వజ్రవంతుడని ప్రసిద్ధుడైన ఒకకుమారుడు కలిగెను. అతనికి శాంతి అనుపుత్రుడు, వానికి కుశికుడను కుమారుడు కలిగెను.
ఆ కుశునివలన చిత్రరధుడనుపేరుగల బలవంతుడైన కుమారుడు పుట్టెను. తరువాత చిత్రరథుని పుత్రుడు శశబిందువు అనువాడు కలిగెను.
అతనికి పృధుయశుడను ధర్మమునందు శ్రద్ధకలగాజు పుట్టెను. ఆరాజునకు పృథుకర్మఅనుపుత్రుడు, అతనివలస పృథుజయుడు కుమారుడుగా పుట్టెను.
వానివలన పృథుకీర్తి అనువాడు పుట్టెను. అతనికి పృథుదాసుడను పుత్రుడు, అతనికి పృథుశ్రవుడు అనుకుమారుడు, అతనికి పృధుసత్తముడను పుత్రుడు కలిగిరి.
అప్పడుసత్తమునకు ఉశనసుడు పుత్రుడాయెను. అతనికి శతేషువు, అతనికి రుక్క కవచుడు అనువారు సంతానముగా కలిగిరి. రుక్మకవచునికి పరావృత్తుడు పుత్రుడుగా జన్మించెను.
పరావృత్తునకు యామఘుడనిలోకమందు ప్రఖ్యాతుడైన కుమారుడు కలిగెను. అతనివలన విదర్భుడు పుట్టెను. వానివలన కథకౌశికులను కుమారులు పుట్టిరి.
మూడవ వాడుగా అతనికి లోమపాదుడు కలిగెను. ఆ లోమపాదునకు బభ్రువనువాడు పుత్రుడాయెను. అతనికి ధృతి అనుకుమారుడు, శ్వేతుడను సుతుడు కలిగిరి.
శ్వేతునకు బలవంతుడు, విశ్వసహుడను పేరుతో ప్రసిద్దుడగు. కుమారుడు కలిగెను. అతనిపుత్రుడు గోప్పపరాక్రమము కలవాడు, ప్రభావము వలన కౌశికుడని చెప్పబడినాడు.
ఆ కౌశికునకు బుద్ధిమంతుడైన సుమంతుడను కొడుకు పుట్టెను అతనివలన అనలుడు, ఆ అనలునకు శ్వేని అనుకుమారుడు కలుగగా, శ్వేనికి కొందరు పుత్రులు పుట్టినారు.
వారిలో ముఖ్యుడైన వాడు ద్యుతిమంతుడనువాడు. అతనికి వపుష్మంతుడను పుత్రుడు జన్మించినాడు, ఆ వపుష్మంతునకు బృహన్మేధ అనుకుమారుడు, అతనికీ శ్రీదేవుడు అనుకుమారుడు పుట్టెను.
బ్రాహ్మణులారా ఆ శ్రీదేవునకు వీతరథుడను కుమారుడు, గొప్పబలముకలవాడు, శిపునియందు భక్తికలపోడు జన్మించెను. క్రథుడను వానికి కుని అనుపోడు జన్మించగా, అతనికి వృష్టి అనుకుమారుడు పుట్టెను.
ఆ వృష్టికి మిక్కిలి బలవంతుడైన నవరథుడను పుత్రుడు కలిగీసోడు. అతడొకమారు వేటమార్గముగా బయలుదేరినవాడై అక్కడ మహా బలవంతుడు, క్రూరుడైన ఒకరోక్షసుని చూచి మిక్కిలి భయమును పొందినవాడై పలాయనము చేసెను. ఓ మునీశ్రేష్ఠులారా అది చూచి గొప్పబలము కల ఆరాక్షసుడు కోపించినవాడై ఆ నవరథుని వెంబడించి తరుచుసాగెను.
ఎదుర్కొనుటకు శక్యము కానివాడు, అగ్నితో సమానతేజముకలవాడు, తనపెద్దచేతియందు శూలమును ధరించినవాడై ఆరాక్షసుడుండెను. భయమునొందిన రాజు నవరథుడు అక్కడికి కొంతదూరములో ఉన్నటువంటి సరస్వతీయొక్క రహస్యముగా కాపొడిబడిన శ్రేష్టమైన ప్రదేశమును చూచెను. వెంటనే తెలివికల ఆరోజు వేగముగా నడిచీ ఆరహస్య ప్రదేశమును చేరి,
సాక్షాత్తుగా అక్కడవెలసియున్న సరస్వతీదేవిని చూచీ తలవంచి నమస్కరించెను. శత్రువులను జయించిన ఆరోజు దోసిలి జోడించి ప్రియములైన వాక్కులతో ఆదేవిని స్తోత్రము చేసెను.
నేలమీద సాష్టాంగ నమస్కారము చేసి “నిన్ను నేను శరణము పొందుచున్నాను” అని పలికి గొప్పదేవతను సాక్షాత్తు సరస్వతీ దేవివైన నిన్ను గూర్చి నమస్కరించుచున్నాను.
ఆద్యంతములు లేని, ఈశ్వరిని, బ్రహ్మచారిణి అగువాగ్దేవతను, లోకములకు కారణభూతురాలైన, యోగిని, పరమకలారూపయగుదేవికి నమస్కరింతును.
“హిరణ్యగర్భుని వలన పుట్టినది, మూడుకన్నులు కలది, చంద్రకళ శిరోభూషణముగా కలది, పరసూనందస్వరూపురాలు, జ్ఞానకళారూపిణీ, బ్రహ్మస్వరూపము కలదేవికి నమస్కరించుచున్నాను.
ఓ పరమేశ్వరీ భయపడి నీశరణు గోరవచ్చిన సన్ను కాపాడుము” అని ప్రార్థించెను. ఇంతలో కోపమును పొందిన ఆ రాక్షసరాజు రాజును చంపుటకు, సరస్వతీదేవి నివసించియున్న స్థానమునకు చేతిలో శూలమును పైకెత్తిపట్టుకొని బలగర్వముతో కూడినవాడై చేరెను.
చంద్రసూర్యుల కాంతితో సమానముగా ప్రకాశించుచున్నట్టి, మూడులోకములకు తల్లియగు దేవియొక్క స్థానమునకు రాక్షసుడు చేరగా, ఆ సమయమున ప్రళయకాలపు సూర్యునితో సమానమైన ఒకమహాభూతము శూలముతో ఆరాక్షసుని వక్షమునందు పొడిచి వానిని క్రింద పడవైచెను. తరువాత రాజుతో, “నీవిక ఇక్కడ ఉండవలదు, వెళ్లిపొమ్ము” అని పలికెను.
“ఈ ప్రదేశములోని రాక్షసుడిప్పుడు చంపబడినాడు. ఇక నీవు భయమువగలి తొందరగా వెళ్లుము” అని పలుకగా సంతోషించినవాడై రాజు నవరథుడు నమస్కరించి,
ఇంద్రుని పట్టణముతో సమానమైన తనపురమునకు వెళ్లాను. బ్రాహ్మణోత్తములారా ఆ పట్టణములో భక్తితో కూడినవాడై ఈశ్వరియైన దేవిని ప్రతిష్టించినాడు.
అనేకములైన యజ్ఞములతో, హోమములతో సరస్వతీదేవిని ఆరాధించినాడు. ఆ నవరథునికి గొప్ప ధర్మస్వభావముకల దశరథుడను కుమారుడు కలిగినాడు.
అతనికి దేవియొక్క భక్తుడు, గొప్పతేజస్సుకలవాడును అగు శకుని పుత్రుడుగా పుట్టెను. అతనివలన కరంభుడు జన్మించెను. కరంభుని వలన దేవరాతుడను వాడు కలిగెను.
ఆరాజు అశ్వమేధయాగమును చేసినాడు. అతనికుమారుడు దేవక్షత్రుడనువాడు. అతనికి మధువనువాడు పుత్రుడు కాగా, వానివలన కురువు జన్మించెను,
ఆ కురువునకు సుత్రాముడు, అనువు అను ఇరువురు కుమారులు కలిగిరి. వారిలో అనువుకు ప్రీయగోత్రుడను పుత్రుడు, అతనికి అంశువు అనువాదు సంతతిగా కలిగిరి.
ఆ అంశువునకు ప్రతాపముకలవాడు, విష్ణుభక్తుడు అగు అంధకుడు అను దానశీలుడు, విలువిద్య యందు గొప్పనేర్పుకలపాడు, మహాత్ముడగు పుత్రుడు జన్మించినాడు.
అతడు నారదునిమాట వలన వాసుదేవుని పూజించుట యందాసక్తుడాయెను. కుండుడు, గోలుడు మొదలగు వారిచేత ప్రసిద్ధమైన శాస్త్రము సతడు ప్రవర్తింపజేసెను.
అతని పేరుతో ప్రసిద్దమైనది, సాత్వతులకు శుభదాయకమైనది, కుండులు మొదలగువారికి శుభమును కలిగించునదియగు గొప్పశాస్త్రము వాడుకలోనున్నది.
అతనికి సాత్వతుడను కుమారుడు కలిగెను. అతడు అన్ని శాస్త్రములయందు నైపుణ్యము కలవాడు. పుణ్యమైన మహారాజతడు. అతనిచేత ఆశాస్త్రము ప్రవర్తింపజేయబడినది.
సత్త్వగుణసంపన్నులైన సాత్వతులను కుమారులుగా కౌశల్య పొందెను అంధకుడు, మహాభోజుడు, వృష్టి, దేవా వృధుడు, విలువిద్యనేర్చిన వారిలో శ్రేష్టుడగు వానిని జ్యేష్ఠుడుగా భజమానుడను వానిని పొందెను. వారిలో దేవావృధుడును రాజు గొప్ప తపస్సును చేసెను.
సమస్తగుణములతో కూడిన కుమారుడు నాకు కలుగవలెనని ఆరాజుతపస్సు చేసెను. అతనికి బభ్రువు అను పేరుతో ప్రసిద్ధుడైన పుణ్యశ్లోకుడగు రోజుఫుట్టెను.
ఆ బభ్రువు ధర్మాత్ముడు, అందముతోకూడినవాడు, తత్త్వజ్ఞానమునందోసక్తి కలవాడుగా నుండెను. భజమానునివలన దివ్యమైన సంపదను పొందిన కుమారులు జన్మించిరి.
వారిలోనిమి, కృకణుడు అనుహరిద్దరు ముఖ్యులు, ప్రసిద్ధులుగా నుండిరి. మహాభోజుని వంశములో వైమాతృకులగు భోజులు పుట్టిరి.
వృష్టివలన బలవంతుడగు సుమిత్రుడు, అనమిత్రుడు, తిమి అనువారు జన్మించిరి. అనమిత్రునివలన నిఘ్నుడు, నిఘ్నునకు ఇద్దరు కుమారులు కలిగిరి.
మహాభాగుడు ప్రసేనుడు, ఉత్తముడైన సత్రాజిత్తు అనువారు ఆ ఇద్దరు కుమారులు. వృష్ణకుమారుడైన అనమిత్రునీవలన సిని ఆనువాడు కనిష్టుడుగా జన్మించెను.
సత్యమైన వాక్కులు కలవాడు, సత్యముతోకూడిన వాడు అగు సత్యకుడు అతనికి కుమారుడు పుట్టెను. సాత్యకి, యుయుధానుడు అనువారు కూడ కలిగిరి. యుయుధానునకు అసంగుడను పుత్రుడు పుట్టెను.
అతనికి బుద్ధిమంతుడైన కుణి అనుపుత్రుడు, అతనికి యుగంధరుడను కుమారుడు కలిగెను. అతనికి మాద్రియను భార్యయందు పృష్ఠి పుట్టెను. వృష్టివలన యదునందనుడు కలిగెను.
వృష్టికి, శ్వఫలుడు, చిత్రకుడు అను ఇద్దరుకుమారులు పుట్టిరి. వారిలో శ్వఫలుడు కాశిరాజ పుత్రికను భార్యనుగా పొందెను.
ఆమె యందు శ్వఫలుడు అక్రూరుడను ధర్మస్వభావము కల కుమారునీ కనెను. ఉపమంగుడు, మంగుడు, ఇంకను ఇతరులు చాలా మంది కొడుకులు కలిగిరి. అక్రూరుని కుమారుడు దేవవంతుడని ప్రసిద్ధుడైనవాడు కలిగెను. ఉపదేవుడు అను దేవస్వభావము కలవాడు కూడా పుత్రుడాయెను. వారిద్దరికి విశ్వుడు, ప్రమాథి అనుకుమారులు కలిగిరి.
చీత్రకునకు పృథువు, విపృథువు, అశ్వగ్రీవుడు, సుబాహుడు, సుధాశ్వకగవేక్షకులు అనుపొరు పుత్రులుగా జన్మించిరి.
అంధకుని పుత్రికయందు నలుగురు కుమారులను పొందెను. వారు కుకురుడు, భజమానుడు, శమీకుడు, బలగర్వితుడు అనువారు.
కుకురుని పుత్రుడు వృష్టి అనువాడు. అతనికి కపోతరోముడని ప్రసిద్ధుడైన కుమారుడు కలిగెను. అతని కుమారుడు వీటోమకుడు.
ఆ విలోమకునికీ, తుంబురుని మిత్రుడు, పండితుడు అగు తముడు అను పుత్రుడు కలిగెను. ఆ తమునికి ఆనకదుందుభి అనుపేరు కల పుత్రుడు పుట్టెను.
ఆ ఆనకదుందుభి గోవర్ధనపర్వతమును చేరుకొని చాలదీర్ఘమైన తపస్సును చేసెను. అతనికి లోకములకు ప్రభువైన బ్రహ్మదేవుడు వరము నిచ్చెను.
నీ వంశమునకు నాశములేని కీర్తి, గురువుకంటే ఎక్కువగా శ్రేష్ఠమైన జ్ఞానయోగము, కామరూపము కలిగియుండుటను కూడ;
శ్రేష్ఠుడైన అతడు వరముగా పొంది సావధానుడై వృషభవాహనుడు, దేవతలచేత పూజింపబడు వాడును అగు శివుని తనగానముతో పూజించెను.
గానములో నిమగ్నమైయున్న ఆనకదుందుభికి, భగవంతుడైన పార్వతీపతి దేవతలచేత గూడ పొందుటకు శక్యము కాని కన్యారత్నమును ఇచ్చెను.
శత్రునాశకుడైన ఆ రాజు ఆమెతో కలిసి, చంచలమైన కన్నులు గల ఆమెకు శ్రేష్ఠతమమైన గానవిద్యా తత్త్వమును ఉపదేశించెను.
అతడొమెయందు సుభుజుడను పేరుగల మంచికుమారుని, సౌందర్య విలాసముతో కూడిన ప్రీమతి అను కన్యకను గూడ సంతానముగా పొందెను.
తరువాత వారితల్లి కుమారునికి, కూతురికి గూడ బాల్యదశలో సంగీత విద్యను చక్కగా శాస్త్రపద్ధతి ప్రకారము నేర్పెను.
ఆ కుమారుడు తండ్రిచేత ఉపనయనము చేయబడి వేదములను విధానము ప్రకారము అధ్యయనము చేసి, గంధర్వులయొక్క మానస సంభవమగు కన్యకను వివాహమాడెను.
ఆ సుభుజుడా గంధర్వపుత్రియగు భార్యయందు, వీణావాదన మర్మము తెలిసినవారు, సంగీతశాస్త్రమునందు నైపుణ్యము కలవారును అగు అయిదుగురు సత్పుత్రులను పొందెను.
గానమందు నైపుణ్యము కల ఆ రోజు, తనభార్యతో, కుమారులతో, మనుమలతో గూడ తనగానవిద్యతో త్రిపురాసురసంహారకుడైన శివుని పూజించెను.
సుందరమైన సమస్తావయవములు కలిగినది, లక్ష్మీదేవివలె విశాలమైన కన్నులు కలది అగు హీమతి అను కన్యను, సుబాహుడను పేరుగల గంధర్వుడు తీసుకొని తన పట్టణమునకు వెళ్ళెను.
మంచితేజస్సుగల ఆ గంధర్వునికి ఆమెయందు, సుషేణుడు, ధీరుడు, సుగ్రీవుడు, సుభోజుడు, నరవాహనుడు అను పేర్లు కలిగిన అయిదుగురు పుత్రులు కలిగిరి.
తరువాత చందనోదకదుందుభికి అభిజిత్తు అనుకుమారుడు పుట్టెను. అభిజిత్తుకు పునర్వసు అనువాడు, అతనికి ఆహుకుడనువాడు పుత్రులుగా పుట్టిరి.
బ్రాహ్మణోత్తములారా ఆపుకునికి ఉగ్రసేనుడు, దేవకుడు అనుకుమారులు పుట్టిరి. దేవునికి దేవతలతోసమానులైన వీరులగు పుత్రులు జన్మించిరి.
దేవవంతుడు, ఉపదేవుడు, సుదేవుడు, దేవరక్షితుడు అని ఆ పుత్రుల పేర్లు. వారితోడ బుట్టిన స్త్రీలు ఏడుగురు ఉండిరి. వారందరినీ వసుదేవునికి భార్యలుగా ఇచ్చెను.
ఆ కన్యల పేర్లు వరుసగా ధృతదేష, ఉపదేవ, దేవరక్షిత, శ్రీదేవ, శాంతిదేవ, సహదేవ, సువ్రత అగుదేవకి. వారందరిలో చక్కని నడుము కల దేవకి శ్రేష్ఠురాలైయుండెను. ఉగ్రసేనునికి న్యగ్రోధుడు, కంసుడు. అను కుమారులు కలిగిరి. సుభూమి, రాష్ట్రపాలుడు, తుష్టిమంతుడు, శంకువు అనువారు కూడ అతని కుమారులుగా పుట్టిరి. భజమానుని వలన ప్రసిద్ధుడైన విదూరథుడను పుత్రుడు జన్మించెను.
అతనికి సూరసముడనువాడు, అతనివలన ప్రతిక్షత్రుడనువాడు కుమారులుగా జన్మించిది. ప్రతిక్షత్రునివలన స్వయంభోజుడను కుమారుడు, అతనికి శత్రువులను తపింపజేయు ధాత్రీకుడు జన్మించిరి.
ఆ ధాత్రీకునికి కృతవర్మ, అతనికి శూరసేనుడు కుమారులుగా పుట్టిరి. ఆ శూరసేనుని పుత్రుడు వసుదేవుడు. అతడెల్లప్పుడు ధర్మమునందు శ్రద్ద కలిగి యుండువాడు.
వసుదేవుని వలన గొప్ప భుజములు కలిగిన, లోకమునకు గురువైన నారాయణుడు, దేవతల చేత ప్రార్థింపబడి దేవకీ దేవి యందు పుత్రుడుగా పుట్టెను.
వసుదేవుని మరియొకభార్య, శ్రేష్ఠురాలైన రోహిణి, నాగలి ఆయుధముగా ధరించు సంకర్షణుడను రాముని పెద్దకుమారునిగా ప్రసవించెను.
ఆ వసుదేవుని కుమారుడైన కృష్ణుడే విశ్వము ఆత్మగా కల పరమాత్మ స్వరూపుడు. హలాయుధుడు, సంకర్షణుడు అగురాముడు స్వయముగా శ్రీవిష్ణు శయ్యారూపుడైన శేషుని అవతారమే.
భృగుమహాముని శాపమను వ్యాజముతో మానవశరీరమును ధరించి లక్ష్మీపతియగు నారాయణుడు దేవకీ దేవియందు, రోహిణీ యందు కూడ భూమిపై అవతరించెను.
పార్వతీదేవి శరీరము నుండి పుట్టిన కోశికి అనబడు యోగనిద్రకూడ వాసుదేవుని ఆదేశముననుసరించి యశోదకు పుత్రికగా జన్మించెను.
ఓ మునీంద్రులారా కృష్ణుని కంటే ముందు పుట్టిన వసుదేవుని కుమారు లెవరుండిరో, వారందరిని కంసుడు పూర్వమే చంపివైచెను.
సుషేణుడు, భద్రసేనుడు, మహాబలుడు, వజ్రదంభుడు, భద్రసేనుడు, కీర్తిమంతుడు, పూజితుడు. అను ఏడుగురు కృష్ణునికంటే ముందు జన్మించిన కుమారులు.
ఈ కుమారులందరు కంసునిచే చంపబడగా, రోహిణీదేవి వసుదేవునివలన హలాయుధుడు, లోకప్రభువు అగురాముని పుత్రునిగా పొందెను.
దేవతలకు మొదటి ఆత్మస్వరూపుడైన, అచ్యుతుడైనరాముడు పుట్టినతరువాత దేవకీదేవి శ్రీవత్సచిహ్నముతో కూడిన వక్షముకల కృష్ణుని పుత్రునిగా కనెను.
మంచి గుణములతో కూడిన రేవతి అను కన్యబలరామునికి భార్య అయెను. ఆమె యందు బలరామునికీ నిశితుడు, ఉల్ముకుడు అను ఇద్దరు పుత్రులు కలిగిరి.
దుష్టముకానీ కర్మలు కల కృష్ణునికి పదునారువేల మంది స్త్రీలు భార్యలుగా ఉండిరి. వారియందతనికి వందల, వేలకొలదిగా కుమారులు జన్మించిరి.
చారుదేష్ణుడు, సుబాహువు, చారువేషుడు, యశోధరుడు, చారుశ్రవుడు, చారుయశుడు, ప్రద్యుమ్నుడు మరియు సాంబుడను వాడును;
కృష్ణునికీ రుక్మిణీదేవియందు గొప్పణలపరాక్రమములు కలపుత్రులుగా ఉదయించిరి. ఈకుమారులు అతనిపుత్రులందరిలో విశిష్టులైన వారుగా పరిగణింపబడినారు.
కృష్ణునియందు రుక్మిణీదేవికి కలిగిన వీరులైన ఆకుమారులనుచూచి, కృష్ణుని మరియొకభార్య, స్వచ్ఛమైన నవ్వు కలిగిన జాంబవతి కృష్ణునితో ఇట్లు పలికెను.
పద్మములవంటి కన్నులుకల ఓస్వామీ రాక్షససంహారకా నీవు నాకు శ్రేష్ఠములైన గుణములు కలవాడు, దేవేంద్రునితో పోల్చదగినవాడు అగు కుమారునొకనిని అనుగ్రహించుము.
విశ్వమునకు ప్రభువగు శ్రీకృష్ణుడు జుంబవతి మాటనువిని, శత్రువులను నిగ్రహింపగలవాడు, తపస్సులకు స్థానమైన వాడైనను స్వయముగా తపస్సుచేయుటకు ప్రారంభించెను.
ఓమునిసత్తములారా దేపకి పుత్రుడైన ఆకృష్ణుడు, తీవ్రమైన గొప్పతపస్సునుచేసి, శివుని సాక్షాత్కారమును పొంది ఏ విధముగా కుమారుని పొందేనో మీరు వినుడు.
శ్రీ కూర్మపురాణములో యదువంశాను కీర్తనమను ఇరువది నాలుగవ అధ్యాయము సమాప్తము.
