కూర్మ మహా పురాణము
20 - రాజ వంశకీర్తనమ్
కశ్యపునివలన అదితిదేవీ ఆదిత్యుని పుత్రునిగా పొందెను. ఆ ఆదిత్యునికి నలుగురు భార్యలుండిరి.
సంజ్ఞ, రాజీ, ప్రభ, ఛాయ అని ఆనలుగురి పేర్లు, వారి కుమారులను గూర్చి తెలుపుదును వినుడు. వారిలో సంజ్ఞ అనునామె త్వష్టకుమార్తె, ఆమె సూర్యునివలన శ్రేష్ఠుడైన మనువును పుత్రుడుగా పొందెను.
రాజ్ఞి అనుభార్య యముని, రేవంతుని పుత్రులుగాను, యమునను పుత్రికగాను పొందెను. ప్రభ అనుభార్య ఆదిత్యునివలన ప్రభాతుని, ఛాయ సావర్ణిని కుమారులుగా పొందిరి. ఆ ఛాయ శనిని, తపతినీ, విష్టినికూడ క్రమముగా సంతతిగా పొందినది. ఆదిత్యుని మొదటికుమారుడైన మనువుకు ఆయనతో సమానులైన తోమ్మిదిమంది కుమారులు కలిగిరి.
- ఇక్ష్వాకువు, నాభాగుడు, ధృష్ణుడు, శర్యాతి, నరిష్యంతుడు, నాభాగుడు, అరిష్టుడు, కరుషుడు, అనువారు;
గొప్పతేజస్సుకల పృషధ్రుడనుపోడు, ఈతొమ్మిదిమంది ఇంద్రునితో సమానులైన మనువు కుమారులు. పెద్దది, శ్రేష్ఠురాలును అగు ఇల చంద్రుని వంశమును పెంపొందించెను.
ఇల చంద్రునికుమారుడైన బుధునికి గృహిణిగావెళ్లి అతని సమాగమమువలన ఉత్తముడైన పురూరవసుని కుమారునిగా పొందెను.
ఆ పురూరవసుడు తనపితరులకు తృప్తి కలిగించినవాడని మాచే వినబడినది. సుద్యుమ్నుడు అనుపేర ప్రఖ్యాతుడైన మిక్కిలి నిర్మలుడైన కుమారునిపొందీ,
ఇలాదేవి మరల సీభావమును పొంది ఉత్కలుడు, గయుడు, వినతుడు అను ముగ్గురు కుమారులను పొందినది.
పోరందరు సాటిలేని ప్రసిద్ధి కలవారు. బ్రహ్మదేవునాశ్రయించిరి. ఇక్ష్వాకువలన వీరుడు, వికుక్షిఅనుపేరుగలరాజు జన్మించెను.
ఆ వికుక్షి ఇక్ష్వాకునకు పెద్దకుమారుడుగా పుట్టెను. అతనికి పదునైదుమంది కుమారులు కలిగిరి. వారందరిలో జ్యేష్ఠుడు కకుత్తుడను వాడుండెను, అతనికుమారుడు సుయోధనుడు.
సుయోధనుని వలన శ్రీమంతుడగు పృథువుపుట్టెను. ఆ పృథువుయొక్క పుత్రుడు విశ్వకుడనువాడు. అతనివలన బుద్ధిమంతుడగు ఆర్టకుడు కలిగెను. అతనికుమారుడు యువనాశ్వుడనువాడు పుట్టెను.
ప్రతాపవంతుడైన ఆయువనాశ్వుడు గోకర్ణమను క్షేత్రమును చేరి, అక్కడ తపస్సుచేయుచున్న, అగ్నితోసమానమైన తేజస్సుకలిగిన గౌతముడను బ్రాహ్మణుని చూచి,
నేలమీద కర్రవలే వ్రాలి నమస్కరించి, పుత్రుని కోరుచున్న ఆరాజు, ఎటువంటి కర్మచేత నేను ధర్మమార్గాను యాయి అయిన కుమారుని పొందుదును? అని ప్రశ్నించెను.
గౌతముడిట్లు బదులు పలికెను. “సనాతన పురుషుడు, దోషరహితుడు, ఆద్యంతములు లేనివాడు అగునారాయణదేవుని ఆరాధించి ధార్మికుడైన పుత్రుని పొందగలవు” అని.
ఆనారోయణుని తనయుడు స్వయముగా బ్రహ్మదేవుడు. నీలలోహితుడైన శంకరుడాయనకు మనుమడు. ఆది పురుషుడు, కృష్ణరూపుడు, ప్రభువైన ఆదేవుని పూజించి మంచిపుత్రుని పొందవచ్చును.
ఎవని ప్రభావమును భగవంతుడైన బ్రహ్మదేవుడు కూడ యథార్థముగా తెలియలేడో, అటువంటి హృషీకేశుడైన విష్ణువు నారాధించి ధార్మికుడైన కుమారుని పొందుదువు.
ఆయువనాశ్వమహారాజు గౌతముని మాటనువిని, హృషీకేశుడు, వాసుదేవుడు, సనాతనుడు అగునారాయణదేవుని ఆరాధించేను.
అతనికి వీరుడైన సావస్తి అనుపేరుతో ప్రసిద్ధుడైన కుమారుడు కలిగెను. అతనిచేత గౌడదేశములో సావస్తి అను పేరుగల పెద్ద పట్టణము నిర్మించబడినది.
అతనివలన బృహదశ్వుడు జన్మించెను. అతనికి కువలయాశ్వకుడను పుత్రుడు కలిగెను. అతడు ధుంధుడు అనుగోప్పరాక్షసుని చంకీ ధుంధుమారుడను పేరు కలవాడాయెను.
ఓ బ్రాహ్మణులారా!
అ ధుంధుమారునికి దృశాశ్వుడు, దండోశ్వుడు, కపిలాశ్వుడు అనుపేర్లుకల ముగ్గురు కుమారులు కలిగిరి.
వారిలో దృఢశ్వునికి ప్రమోదుడు, అతనికి హర్యశ్వుడు అనువారు పుత్రులుగా పుట్టిరి. హర్యశ్వునికి నికుంభుడు అనుపుత్రుడు, అతనికి సంహతాశ్వకుడు అనువాడు జన్మించిరి. సంహితాశ్వునకు కృతాశ్వుడు, రణాశ్వుడు అను ఇద్దరు కుమారులు కలిగిరి. వారిలో రణాశ్వునికి యువనాశ్వుడను పుత్రుడు, యుద్ధములో ఇంద్రసమాన బలముకలవాడు. కలిగెను.
అతడు ఋషుల అనుగ్రహముతో వరుణదేవతాకమైన ఇష్టినిచేసి, సాటిలేని విష్ణుభక్తుడు, శ్రేష్ఠుడు అగు పుత్రుని పొందెను.
అతడే మిక్కిలి బుద్ధిశాలి, ఆయుధధారులందరిలో శ్రేష్ఠుడగు మాంధాత, అతనికి పురుకుత్సుడు, పరాక్రమవంతుడైన అంబరీషుడు కూడ జన్మించిరి.
పుణ్యాత్ముడైన ముచుకుందుడు కూడ అతని పుత్రుడే. వారందరు యుద్ధరంగములో ఇంద్రునితో సమానులు. అంబరీషునికి దాయాదుడైన మరొక యువనాశ్వుడు కలడు.
ఆయువనాశ్వునికి హరితుడు, అతనికీ హారీతుడు అనువారు పుత్రులుగా పుట్టిరి. పురుకుత్సుని దాయాదుడైన త్రసదస్యుడు అనుగొప్ప కీర్తికలవాడు,
నర్మద అనుస్త్రీయందు జన్మించెను. అతని కుమారుడు సంభూతీఅనువాడు, అతనికి విష్ణువృద్దుడనుపుత్రుడు కలిగెను. వానివలన అనరణ్యుడు పుట్టేను.
అనరణ్యునికి బృహదశ్వుడు, అతనికి హర్యశ్వుడు అనువారు కుమారులుగా జన్మించిరి. మిక్కిలి ధర్మాత్ముడైన ఆహర్యశ్వుడనురాజు కర్దమ ప్రజాపతియొక్క
అనుగ్రహమువలన సూర్యునీయందు భక్తికల ధార్మికుడైన కుమారుని పొందెను. వసుమనసుడు అనబడు ఆరాజు శుభకరుడైన సూర్యుని పూజించి;
సాటిలేని, శత్రువులను జయించునట్టి త్రిధన్వుడను కుమారుని పొందెను. ఓ విప్రులారా అతడు శత్రువులను గెలిచి అశ్వమేథయాగమును కూడ చేసెను.
పులస్త్యఉవాచః-
వేదముల నధ్యయనముచేసినవాడు, దానముచేయుస్వభావము కలవాడు, సంసార సముద్రమును దాటగోరువాడు, ధర్మమునందాసక్తి కలవాడుగా ఆరాజుండెను. ఆమహాత్ముని యజ్ఞమంటపమువద్దకు ఋషులు వచ్చిరి.
వసిష్టుడు కశ్యపుడు మొదలగు ఋషులు, ఇంద్రుడు మొదలైన దేవతలు తన యజ్ఞశాలకు రాగా, ఆరోజువారికి నమస్కరించి వినయముతో కూడినవాడై కుశలప్రశ్నలువేసెను.
విధానము ప్రకారము యజ్ఞమును పూర్తిచేసి, వసిష్టుడు మొదలగు బ్రాహ్మణశ్రేష్ఠులను వసుమనసుడు ఇట్లు ప్రశ్నించెను. “ఓ బ్రాహ్మణ శ్రేష్ఠులారా ఈలోకములో ఏది ఎక్కువ శ్రేయస్సును కలిగించునది?
యజ్ఞము, తపస్సు, సంన్యాసము వీనిలో ఏది శ్రేష్ఠమో అన్ని తెలిసిన మీరు సొకు చెప్పుడు". అని పలుకగా వసిష్టుడాతనితో, వేదములను నియమపూర్వకమగా అధ్యయనముచేసి, తరువాత గృహస్థుడై పుత్రులనుకని; యజ్ఞములతో యజ్ఞేశ్వరుని పూజించి, తరువాత ఆత్మ బలము కలవాడై వనమునకు వెళ్లవలెను. అప్పుడు పులస్త్యుడిట్లు పలికెను. తపస్సుతో యోగియగు పరమేశ్వరుని పూజించి;
శాస్త్రవిధీతో యజ్ఞములు చేసి ముందుగా దేవతలను పూజించి సన్న్యసించవలెను”
పులహుడిట్లనెను” ఎవనిని అద్వితీయుడైన పురాణపురుషుడని, పరమేశ్వరుడని అందురో ఆ సహస్రకిరణుడగు భగవంతుని తపస్సుద్వారా పూజించి మోక్షము పొందవలెను.”
జమదగ్ని ఇట్లనెను. పుట్టుకలేనివాడు, ప్రపంచమును సృష్టించువాడు, జగత్తుకు బీజమువంటివాడు, సనాతనుడు, సమస్త ప్రాణులలో వ్యాపించి యున్న అదేవుడు తపస్సుచేత పూజింపబడును.
విశ్వామిత్రుడిట్లుపలికేను. “ఏ అగ్ని సమస్తము తనరూపముగా కలవాడు, అంతములేనివాడు, తనంతట తాను ఆవిర్భవించినవాడు, ప్రపంచమంతట నిండినవాడో;
ఆ రుద్రుడు తీవ్రమైన తపస్సుచేత పూజింపబడును. ఇతర యజ్ఞములచేత అతడు పూజింపబడడు.” భరద్వజుడనెను. “సనాతనుడైన ఎవడు యజ్ఞములచేత పూజింపబడునో, భగవంతుడగు ఆ వాసుదేవుడు;
అత్రిరువాచ:-
క్రతురువాచ:-
సమస్తదేవతలు శరీరముగా కల అతడు పరమేశ్వరుడుగా పూజింపబడును". అత్రిఇట్లనెను. ఎవనివలన ఈసమస్తము పుట్టినదో, బ్రహ్మదేవుడు ఎవనీ సంతానమో; ఆ మహేశ్వరుడు చాలాగొప్పతపస్సునవలంబించీ పూజింపబడుచున్నాడు”. గౌతముడిట్లుచెప్పెను :- “ఎవని వలన ప్రధానతత్త్వము, పురుషుడు కలిగెనో, ఈ విశ్వమంతయు ఎవని శక్తిరూపమో; ఆ సనాతనుడైన దేవదేవుడు తపస్సుచేత పూజింపదగినవాడు.” కశ్యపముని ఇట్లు పలికెను. “వేయి కన్నులు కలదేవుడు, సమస్తమునకు సాక్షిభూతుడు, ప్రజాపతి, శంభుడు; గొప్పయోగీశ్వరుడగు ఆదేవుడు తపస్సుచేత పూజింపబడి ప్రసన్నుడగును”. క్రతువు ఈవిధముగా అనేను :
వేదాధ్యయనమును యజ్ఞమును పొందిన వానికి, పుత్ర సంతానము కలిగిన వానికి కూడ;
తపమాచరించుటకన్న మరొకవిధ ధర్మశాస్త్రములందు కన్పించదు”. ఈ విధముగా ఆమునుల మాటలువిని రాజర్షి వారికి నమస్కరించి, మిక్కిలిసంతోషించిన మనస్సుకలవాడై;
వారిని పూజించి, వీడ్కొలిపి తరువాత త్రిధన్వునితో ఇట్లు పలికెను”. ఏకాక్షర ప్రణవ స్వరూపుడైన భగవంతుని నేను తపస్సుతో ఆరాధింతును.
సూర్యమండల మధ్యమందున్నవాడు, బృహత్రాణస్వరూపుడు, అగు పరమ పురుషుని పూజింతును. నీవు మాత్రము ధర్మము నందాసక్తి
కలపొడవై, ఎల్లప్పుడు సావధానుడవుగా ఈరాజ్యమును పాలింపుము.
నాలుగు వర్ణముల జనులతో కూడియున్న యీ సకల భూమండలమును పరిపాలించుము” అని చెప్పి ఆ రాజు తనరాజ్యమును కుమారున కప్పగించి;
పుణ్యాత్ముడైన అతడు శ్రేష్ఠమైన తపస్సునాచరించుటకు దేవదారు వృక్షముల కాశ్రయమైన, మనోహరమైన హిమాలయ శిఖర ప్రదేశ మందలి అరణ్యమునకు వెళ్లాను.
సహజముగా లభ్యములైన దుంపలు, వేళ్లు, పండ్లు అను ఆహారములతో దేవతలను పూజించెను. ఈ విధముగా నూరు సంవత్సరముల కాలము తపస్సుచేసి, తన పాపములను తొలగించుకున్నవాడై; వేదములకు మాతృరూపిణియగు సావిత్రీదేవిని మనః పూర్వకముగా జపించెను. ఇట్లు అతడు తపస్సు చేయుచుండగా స్వయంభువు, పరమేశ్వరుడును; హిరణ్యగర్భుడు, విశ్వస్వరూపుడు అగు భగవంతుడా ప్రదేశమునకు వచ్చెను. అన్నివైపుల ప్రసరించిన ముఖముకల బ్రహ్మదేవుడు తనవద్దకు వచ్చుచుండగా చూచి;
నామసంకీర్తనము చేయుచు శిరస్సువంచి ఆయన పాదములకు నమస్కరించేను. దేవతల కందరికి ఆధిపతివి, పరమాత్మస్వరూపుడవు, బ్రహ్మపుఅగు నీకు నమస్కారము. హిరణ్యరూపముకలవాడవు, అనంతములైన కన్నులు కల బ్రహ్మవగు నీకు వందనము. ధాతవు, విధాతవు, దేవతలకాత్మ రూపుడవును అయిన నీకు నమస్కారము.
సాంఖ్యతత్వజ్ఞానముచే తెలిసికొనదగినవాడవు, జ్ఞాకారుడవు, మూడుమూర్తులతో ప్రకాశించువాడవు, సృజించువాడవు, సమస్త విషయముల నెరిగినవాడవును అగునీకు ప్రణామము.
పురాణపురుషుడవు, యోగీశ్వరులకు గురువును అయిన నీకు నమస్కారము. అనీ వందనపూర్వకముగా స్తుతించగా విశ్వభావనుడు, భగవంతుడు బ్రహ్మ అతనికి ప్రసన్నుడై;
“నీకు శుభమగుగాక ఏదైన వరమును కోరుకొనుము. నేను నీకు వరమునీత్తును” అని పలికెను. అప్పుడు రాజిట్లనెను. “దేవతలకు దేవుడవైన ఓ ప్రభూ వేదమాతయగు గాయత్రీదేవిని గూర్చి జపింతును. మరల వందసంవత్సరముల కాలము జపించుటకుగాను నాకు అంతవరకు ఆయువుననుగ్రహించుము”. అని పలుకగా విశ్వాత్ముడైన బ్రహ్మ రాజును చూచి” అభ్యగుగాక” అని పలికెను.
మిగుల సంతోషించినవాడై భగవంతుడు చేతులతో రాజును తాకి అక్కడనే అదృశ్యమయ్యెను. రోజుకూడ వరమును పొంది నిర్మలబుద్ధికలవాడై గాయత్రీ మంత్రమును జపించెను.
ఆకాలమున అతడు శాంతచిత్తుడు, మూడు కాలములందు స్నానముచేయుచు, కందమూలములను, పండ్లను భుజించుచు జపము చేయగా నూరు సంవత్సరములు పూర్తికాగా భగవంతుడు, తీక్షణమైన ప్రకాశము కలిగినట్టి;
మహాయోగి స్వరూపుడు సూర్యమండల మధ్యభాగము నుండి సాక్షాత్కరించెను. వేద శరీరుడైన, మండలమందున్న, సనాతనుడైన ఆదేవునీ,
స్వయంభువునీ, ఆద్యంతములు లేనివానిని, బ్రహ్మను చూచి అతడు ఆశ్చర్యమును పొందెను. విశేషముగా స్తోత్రము చేసెను.
వెంటనే రాజు, ఆపరమేశ్వరరూపమును పురుషునిగా నాలుగు ముఖములపొనిగా, జడలు తలయందు ధరించినవానిగా, ఎనిమిది చేతులు, మూడుకన్నులు కలవానిగా చూచెను.
చంద్రభాగమును అంకముగా కలవాడు, స్త్రీ పురుషద్వయ శరీరము కలవాడు, తన కాంతులతో సమస్త లోకములను ప్రకాశింప జేయుచున్నవాడు, నల్లనికంఠముగలవాడుగా దేవుని దర్శించేను.
ఎఱ్ఱనీ వస్త్రము ధరించినవాడు,ఎఱ్ఱని హారమును ధరించినవాడు, రక్తవర్ణుడగు భగవంతుని చూచి, అతనియందే శ్రద్దకలవాడై మంచి హృదయముతో;
ఆరుద్రునికి శిరస్సుతో నమస్కరించి గాయత్రీ మంత్రముతో స్తుతించెను. నీలకంఠుడవు, ప్రకాశించువాడవు, పరమేష్ఠివి అగు నీకు నమస్కారము.
మూడువేదముల ఆత్మరూపుడవు, కాలరూపుడవు, కారణభూతుడవు, రుద్రుడవును అగునీకు వందనము.” అప్పుడాతని స్తుతికి సంతోషించిన మనస్సుకల శివుడు రాజును గూర్చి ఇట్లుపలికెను. పుణ్యాత్ముడా ఇవి నా నామములు, రహస్యములైనవి. వేదములన్నిటి యందు కీర్తింపబడినవీ, సంసారబంధమును తొలగించునవి వీనిని వినుము.
ఓ రోజా ఈ నామములతో, శుచిపై, ఎల్లప్పుడు నాకు నమస్కరించుము. యజుర్వేద మంత్రములనుండి తీయబడిన సారభూతమైన శత రుద్రీయమును అధ్యయనము చేయుము,
రాజా నాయందు ఆసక్తికల మనస్సుతో, ఏకాగ్రమైన మనస్సుకలవాడవై బ్రహ్మచర్యము నవలంబించి, నిరాహారుడవై, భస్మమును ధరించి, సావధానుడవై జపము చేయుము.
మరణపర్యంతము జపము చేసినచో అట్టివాడు పరమైన మోక్షప్రదమును పొందును. భగవంతుడైన రుద్రుడు, భక్తులననుగ్రహించు కోరికతో, ఇట్లుపలికి, మరల నూరు సంవత్సరముల కాలము;
రాజున కాయువును కల్పించెను. పరమేశ్వరుడు అతనికి ఉత్తమమైన జ్ఞానమునిచ్చి, వైరాగ్యమును కల్గించి, క్షణములో అంతర్థానము చెందెను. అదియొక ఆశ్చర్యముగా జరిగెను. ఆ రాజుకూడ అనన్యమనస్కుడై తపస్సుతో రుద్రుని గూర్చి జపించెను.
ఆ రాజు భస్మలేపనము చేసికొన్నవాడై మూడుకాలముల యందు స్నానము చేయుచు, శాంతుడై, సావధానుడై జపముచేయుచుండగా నూరు సంవత్సరములు పూర్తిగా గడవగా, యోగప్రవృత్తి కలిగెను. కాలవశమున కాలునికంటే భిన్నమైన గొప్పస్థానమును చేరేను. తరువాత వేదసారభూతమైన పరమేష్టియొక్క స్థానమును పొందెను.
పిమ్మట సూర్యునియొక్క శుభ్రమైన మండలమును పొంది, తరువాత మహేశ్వరుని సాయుజ్యము సందెను. ఉత్తమమైన రాజు యొక్క చరిత్రను ఎవరు చదివినను, విన్నను అన్ని పాపములనుండి విడుదల పొంది బ్రహ్మలోకమున గౌరవింపబడును.
శ్రీ కూర్మపురాణములో రాజవంశకీర్తనమను ఇరువదవ అధ్యాయము సమాప్తము.
