కూర్మ మహా పురాణము

Table of Contents

19 – ఋషివంశకథనము-

సూతుడిట్లు చెప్పెను :-

పూర్వము చెప్పబడిన వీరికి ప్రజాసంతతి కొరకు జన్మనిచ్చి కశ్యపుడు, తరువాత పుత్రునికోరినవాడై చాలగొప్పతపస్సుచేసెను.

అతడేవిధముగా మిక్కిలి తీవ్రముగా తపస్సుచేయుచుండగా, వత్సరుడు, అసితుడు అను ఇద్దరు పుత్రులుగా సాక్షాత్కరించిరి. వారిద్దరు కూడ వేదాంత విద్యను తెలిసినవారు.

వత్సరుడను కుమారునివలన నైధ్రువుడు, గొప్పకీర్తి కలరైభ్యుడు అనువారు పుత్రులు కలిగి, రైభ్యునికి వేదవేత్తలలో శ్రేష్ఠులు, శూద్రులగు పుత్రులు జన్మించిరి. చ్యవనముని యొక్క కూతురు సుమేధ మహాత్ముడగు నైధ్రువునికి భార్య అయి కుండపాయులగు కునూరులను కనెను.

కశ్యప పుత్రులలో రెండవవాడైన అసితునికి ఏకపర్ణ అను భార్యయందు బ్రహ్మజ్ఞానము కలవారిలో శ్రేష్ఠుడు, గొప్పతపశ్శక్తికలవాడు, యోగవిద్యాపండితుడు, దేవలుడను పేరుకల పుత్రుడు కలిగెను.

శాండిల్యుడనువాడు ఉత్తముడు, శ్రీమంతుడు, సమస్తతత్త్వరహస్యములు తెలిసినవాడు, పవిత్రుడు. అతడు పార్వతీపతియగు శివుని అనుగ్రహమువలన యోగముద్వారా మోక్షమును పొందినాడు.

శాండిల్యుడు, నైధ్రువుడు, రైభ్యుడు అను ముగ్గురు మానవప్రకృతి కల కశ్యప ప్రజాపతి కుమారులు. ఓ బ్రాహ్మణులారా ఇక పులస్త్యుని సంతతిని గూర్చి మీకు తెలుపుదును.

విప్రులారా తృణబిందువు పుత్రులు ఐలబిలులు అను పేరుతో ప్రసిద్ధులు. వారిలో రాజర్షియగు ఒకరు పులస్త్యునకు తనకన్యను భార్యగా ఇచ్చెను.

బిలబిలుడైన ఋషి తన కన్యనీయగా ఆమెయందు విశ్రవసువు జన్మించెను. అతనికి పౌలస్త్యవంశమును వృద్ధిపొందించగల నలుగురు భర్యలుండిరి.

పుష్పోత్కట, వాక, కైకసి, దేవవర్ణిని అనివారి పేర్లు. ఆ నలుగురుకూడ సొందర్యము, లావణ్యముతో కూడి యుండిరి. వారి సంతానమును గూర్చి వినుడు. దేవవర్ణిని అనుభార్య పులస్త్యునికీ పెద్ద కుమారునిగా కుబేరునకు జన్మనిచ్చేను, కైకసి అనునామై రాక్షసరాజైన రావణుని ప్రసవించేను.

పుష్పోత్కట కూడ కుంభకర్ణుని, విభీషణుని పుత్రులుగాను, శూర్పణఖను కూతురుగాను పొందెను.

పోక అను భార్యయందు మహోదరుడు, ప్రహస్తుడు, మహాపార్వుడు, ఖరుడు అనుకుమారులు, కుంభీనసి అను కన్య జననమందిరి.

త్రిశిరుడు, దూషణుడు, విద్యుజ్జిహ్వుడు, అనుగొప్పబలశాలి - వీరందరు పులస్త్యసంతతియగు పదిమంది క్రూరకార్యములు చేయు రాక్షసులైరి.

వీరందరు కూడ తపోబలముచేత మేటివారు, జీవునీయందు భక్తికలవారు, మీక్కిలి భయంకరులుగా నుండిరి. పులహుడనువానికి పుత్రులుగా మృగములు, కోరలు గల సమస్త క్రూర జంతువులు,

భూతములు, పిశాచములు, ఎలుగుబంట్లు, వరాహములు, ఏనుగులు జనించెను. ఆ వైవస్వత మన్వంతరములో క్రతువు అనువాడు సంతాన హీనుడుగా పేర్కొనబడినాడు,

మరీచికి కశ్యపుడు కుమారుడై అతడు స్వయముగా ప్రజాపతి పదమును పొందెను. భృగువునకు, రాక్షసులగురువు, గొప్పతపశ్శక్తి కలవాడును అగు శుక్రుడు పుత్రుడాయెను.

వేదాధ్యయనము, యోగవిద్య అనువానియందాసక్తి కలిగి, శివునిభక్తుడు, గొప్పతేజస్సుకలపోడగు వహ్ని అత్రిమహామునికి పుత్రుడుగా పుట్టెను. నైధ్రువుడతనికి సోదరుడుగా పుట్టెను. ఆ నైధ్రువుడు కృశాశ్వునకు ఘృతాచియందు కలిగినాడని మేము విన్నాము. అతడు ఆమెయందు గొప్పబలశాలులైన స్వస్వాత్రేయులను పోగీని కుమారులుగా పొందెను.

నారు వేదములయందు, వేదాంగములయందు శ్రద్దకలవారు, తపస్సుచేత నశింపజేయబడిన పాపములు కలపోరు. నారదుడు అరుంధతీ దేవినీ వసిష్ఠునకు భార్యగా అర్పించెను.

సొరదుడు దక్షుని శాపమువలన అక్కడనే ఊర్థ్వరేతసుడుగా మారెను. నారదుని మాయచేత అశ్వములు సష్టములు అయినందున కోపముతో ఎట్టబడిన కన్నులు గల దక్షుడు నారదుని శపించెను. ఓ విప్రుడా ఏకారణమువలన నాపుత్రులందరు నీ మాయచేత,

సంపూర్ణముగా సోశముపొందింపబడిరో, ఆకారణము వలన నీవు సంతానరహితుడపు కాగలవు అని శపించెను. వసిష్ఠుడు అరుంధతి యందు శక్తి అనుకుమారునికి జన్మనిచ్చెను.

ఆశక్తికి కుమారుడుగా అన్నియు తెలిసినవాడు, తపస్వులలో శ్రేష్ఠుడు, శ్రీమంతుడు అగు పరాశరుడు జన్మించెను. అతడు దేవతలకు దేవుడైన, త్రిపురాసురులను సంహరించిన యీశ్వరుని పూజించి,

 సాటిలేని కుమారుడుగా ప్రభువైన వ్యాసుని పొందెను. అకృష్ణద్వైపాయనుడనబడు వ్యాసునివలన సాక్షాత్తు భగవంతుడగు శంకరుడే శుకుడుగా జన్మించెను.

ఆ శంకరుడు అంశరూపములో భూమియందు జన్మించి, తరువాత తన శ్రేష్టమైన స్థానానికి చేరుకున్నాడు. ఆశుకునికి అయిదుగురు కుమారులు మిక్కిలి తపోబలము కలవారు కలిగిరి.

భూరిశ్రవుడు, ప్రభువు, శంభువు, కృష్ణుడు, గౌరుడు అనుపోరుఆకుమారులు. కీర్తీకలది, యోగసాధనచేసినది, వ్రతములను అవలంబించినది అగు ఒకపుత్రికకూడ కలిగెను.

అత్రిముని వంశానికి సంబంధించిన యీ వంశస్థులనుగూర్చి బ్రహ్మచేత బ్రహ్మవాదులకు చెప్పబడినది. దీని తరువాత కశ్యపుని వలన కలిగిన రాజసంతతిని గూర్చి వినుడు,

శ్రీ కూర్మపురాణములో పందొమ్మిదవ అధ్యాయము సమాప్తము.