కూర్మ మహా పురాణము

Table of Contents

21వ అధ్యాయము

వ్యాస మహర్షి చెప్పెను.

ద్విజుడు, అమావాస్యనాడు స్నానము చేసి శాస్త్రోక్త వీధీతో పితృదేవతలకు సంతర్పణము గావించి శుచియై శాంత మనస్కుడై పిండాన్యాహార్యక శ్రాద్ధము నాచరించవలయును. మొదటనే వేద పారగుడగు బ్రాహ్మణునీ అన్వేషించి ఉంచుకొనవలయును. వేదపారగుడగు బ్రాహ్మణుడే హవ్యకవ్య ప్రదానమునకు తగిన అతిథి.

సోమపాయి రజోగుణరహితుడు, ధర్మము తెలిసినవాడు, శాంత చిత్తుడు, వ్రతపరాయణుడు, నియమపాలకుడు ఋతుకాలమున మాత్రమే భార్యా సంగమును చేయువాడు, పంచాగ్నులను సేవించువాడు, వేదాధ్యయన శీలుడు, యజుర్వేదము తెలిసినవాడు, ఋగ్వేదము తెలిసినవాడు, ఋగ్వేద విశేష వేద భాగమును త్రిమధు భాగములు తెలిసినవాడు, యజుర్వేద విశేషాంశములు బాగా తెలిసినపొడు, సామవేదము తెలియువాడు, సామవేద విశేషము తెలిసినపొడు, అధర్వవేదము తెలిసినపోడు, రుద్రాధ్యాయి వీరందరూ పంక్తి పావనులుగా తెలియవలయును.

అగ్ని హోత్ర పరాయణుడు, విద్వాంసుడు, న్యాయవేత్త, వేదాంగములను తేలీయువాడు, మంత్రమును బ్రాహ్మణములను తెలిసినవాడు, ధర్మ శాస్త్రమును తెలిసినవాడు, ఋషి, ప్రతి, ఋషీ వంశములోనివాడు, ద్వాదశ వార్షిక వ్రతమును యజ్ఞములను ఆచరించువాడు, వివాహము ద్వారా ధర్మపత్నియందు కలిగిన సంతానము కలషాడు, గర్భాధానాది సంస్కారముతో పరిశుద్ధుడు, వేల మంది శిష్యులకు విద్యా ప్రదానము గావించినవాడు పోంద్రాయణాది వ్రతముల నాచరించువాడు, సత్యవాది, పురాణములను తెలిసినవాడు, గురుదేవ అగ్నిపూజలను జరుపుపోడు, జ్ఞాన తత్పరుడు. రాగేద్వషాదులు లేనివాడు, ధీరుడు, బ్రహ్మ స్వరూపుడు, ద్విజోత్తముడు, మహా దేవార్చనాసక్తుడు, విష్ణుభక్తుడు, పంక్తీ పావనుడగును. అహింసా నీరతుడు, పరిగ్రహము లేనివాడు, సత్రము నాచరించువారు, కూడా పంక్తి పావనులుగా నుందురు.

యువకులు, శ్రోత్రియులు, ఆరోగ్యవంతులు, మహాయజ్ఞపరాయణులు, గాయత్రీ జప నిరతులు బ్రాహ్మణులు పంక్తి పావనులగుదురు. సత్కుల సంజాతులు శాస్త్ర జ్ఞానము కలవారు, సచ్ఛీలులు, తపః పరాయణులు, నిత్యాగ్ని హోత్రులు స్నాతకులు పంక్తి పావనులుగా తెలియుడు. తల్లిదండ్రుల హితమును చింతించువాడు, ప్రాతః కాలమున స్నానము చేయువాడు, ఆధ్యాత్మిక జ్ఞానము కలవాడు, ముని, ఇంద్రియ నిగ్రహము కలవాడు పంక్తి పావనుడగును. జ్ఞాన నిష్ఠుడు, మహాయోగి, వేదాంతార్థ చింతకుడు, శ్రద్దాలువు, శ్రాద్ధనిరతుడు, పంక్తి పొవునుఁగును. వేద విద్యారతుడు, స్నానశీలుడు, బ్రహ్మచర్య పరాయణుడు, అధర్వ వేదాధ్యయనశీలి, మోక్షాసక్తి కలవాడు, పంక్తి పావనుడగును. అసమాన ప్రవరుడు, అసమాన గోత్ర సంబంధము చేయువాడు, నీషిద్ధ సంబంధము లేనివాడు పంక్తి పావనునిగా తెలియవలయును. మొట్టమొదట తత్త్వ జ్ఞాననిరతుడు యతచిత్తుడగు యోగీని శ్రాద్దమున భుజింప చేయవలయును. యతి దొరకనిచో ఇంద్రియ జయము కలవానిని నిష్టాశీలిని, బ్రహ్మచర్య వ్రతమును ముగించి గృహస్థాశ్రమము స్వీకరించిన వానిని, అతనూ లభించనిచో సంగరహితుడై మోక్షేచ్ఛ గల గృహస్థుని, ఇతనూ లభించనిచో బ్రాహ్మణ గృహస్థుని భుజింప చేయవలయును.

ప్రకృతి గుణ తత్త్వములను చక్కగా తెలిసినపోడు, ఇంద్రియ నిగ్రహము కల యతి భుజించినచో డజ్ఞుని భుజింప చేయు దానికంటే వేయిరెట్లు ఫలము లభించును. కావున సర్వ ప్రయత్నముతో ఈశ్వర జ్ఞాన తత్పరుడగు యోగీంద్రుని హవ్య కవ్యములందు భుజింప చేయవలయును. లభించనిచో ఇతరులను భుజింప చేయవలయును.

హవ్య కవ్య ప్రదానమున ఇది ప్రథమ కల్పము. ఈ కల్పము సజ్జనులు అనుష్టించిన సర్వాను మత మగు అను కల్పమును తెలియుము. తల్లితండ్రి మేనమామ, మేనల్లుడు, మామ, గురువు, దౌహిత్రుడు, అల్లుడు, బంధువు, ఋత్విజుని, యజమానుని భుజింప చేయవలయును.

 శ్రాద్ధమున మిత్రుని భుజింప చేయరాదు. ధనదాన ప్రదానము ద్వారా మిత్రుని రక్షించుకొనవలయును. శ్రాద్దమున మీత్రుని భుజింపచేసి దక్షిణ ఇచ్చినచో అది పైశాచీ దక్షిణ యనబడును ఇహపరములలో ఫలము నీయ జాలదు. ఎవరూ లభించనపుడు మిత్రుడైననూ భుజింప చేయవచ్చును కాని యోగ్యుడైననూ శత్రువును భుజింప చేయరాదు. శత్రువు భుజించిన హవిస్సు పరలోకమున నిష్ఫలమగును.  

వేదాధ్యయనము చేయని బ్రాహ్మణుడు గడ్డిలో పడిన అగ్నివలె త్వరలో చల్లారును. అట్టి వానికి హవ్యము కవ్యములను ఈయరాదు. అట్లిచ్చిన అగ్నిలోని బూడిదలో హోమము చేసినట్లగును. చౌట భూమిలో విత్తనము వేసినపోడు ఫలమును పొందనట్లు అధ్యయనము చేయని పోనికీ భోజనము పెట్టినవాడు ఫలమును పొందడు. మంత్రజ్ఞుడుకాని వాడు పితృకార్యములలో భుజించిన పిండముల సంఖ్యలో పరలోకమున శూల తప్త అయః పిండములను భుజించవలసి వచ్చును.

విద్యా వంశములున్ననూ నీచ ప్రవర్తన కల నరాధములను భుజింప చేసినచో అది ఆసుర భోజనమగును. మూడు పురుషాంతరములు వేదము యజ్ఞములు విచ్ఛిన్నములగు వాడు దుస్రాహ్మణుడనబడును. శ్రాద్ధాదులకు యోగ్యుడు కాజాలడు, శూద్ర సేవకుడు, రాజుచే వేతనము తీసుకొనువాడు, పతితుడు, గ్రామ పురోహితుడు, వధ బంధనములతో జీవించువాడు ఈ ఆరుగురు బ్రహ్మ బంధువులనబడుదురు.  

బ్రతుకు తెరువు కొరకు ఉద్యోగము చేయువాడు పతితుడని మనువు చెప్పెను. వీరు వేదమును అమ్ముకొను వారు శ్రాద్ధాదులందు అర్హులు కాజాలరు. వేదముల నమ్ముకొనువారు, హీన ఉచ్చవర్ష స్త్రీల యందు పుట్టినవారు, సమాన వర్ణులు కాని వారిని యజ్ఞము చేయించుపొరీని పతితులందురు. సంస్కారములేని వారినీ చదీవించువారు వేతనము తీసుకొని చదీవించువారు, వేతనము తీసుకోని చదువుపోరు కూడా పతితులే అగుదురు. బౌద్ధులు, జైనులు, పాంచరాత్రులు, కాపాలికులు, పాశుపతులు, పాషండులు వారిని అనుసరించువారు ఈ దుర్మార్గులు ఎవరి హవ్య కవ్యములను భుజింతురో వారు చేసిన శ్రాద్ధము ఇహపరములందు ఫలప్రదము కాజాలదు.  

యధావిధిగా ఆశ్రమస్వీకారమును చేయనివాడు, నామమాత్రమునకు ఆశ్రమ స్వీకారము చేసినవాడు మిధ్యాశ్రమ యనబడును. వీరిరువురును పంక్తిదూషకులుగాను వికర చర్మము కలవాడు, చెడుగోళ్ళుకలవాడు, కుష్టురోగి, శ్వేత కుష్టురోగముకలవాడు, సహజముగా నలుపు దంతము కలవాడు, విద్ధలింగితస్కరుడు, నపుంసకుడు, నాస్తికుడు, మద్యపానము చేయువాడు, శూద్రస్త్రీ సక్తుడు, అగ్నిహోత్రము నశించినవాడు, విధవను వివాహము చేసుకొనినవాడు, గృహదాహకుడు, జారునిద్వారా పుట్టిన వాని అసమును భుజించువాడు, సోమలతను అమ్మువాడు వీరు శ్రాద్దారులు కారు.

అన్న వివాహము చేసుకొనకుండా తాను వివాహము చేసుకొనువాడు, హింసించువాడు, తమ్ముడు వివాహము అయిననూ తాను వివాహము చేసుకోననివాడు, పంచ మహాయజ్ఞములు చేయనివాడు, రెండవ వివాహము చేసుకొనిన స్త్రీకి కలిగిన పుత్రుడు, కపటజీవి, జ్యోతీషముతో జీవించువాడు వీరందరూ అనర్హులు. గీత వాదిత్ర నిరతులు, రోగి, ఒంటికంటివాడు, వికలాంగుడు, అధికంగుడు, స్త్రీ సంపర్కముతో బ్రహ్మ చర్య వ్రతమును నష్టపరచుకొనినవాడు, కన్యను చెరచువాడు, ఊరునిచే పతిజీవించి యుండగా పుట్టినపోడు, పతి మరణించిన తరుపోత పర పురుషుని వలన పుట్టినవాడు, అపనిందలను పొందినవాడు, మందిరాదులతో జీవించువాడు, మిత్రద్రోహి, లోభి, భార్యా విధేయుడు వీరందరూ శ్రాద్ధమునకు అయోగ్యులు. తల్లి తండ్రి గురువు భౌర్యవీరిని విడుచుపోడు తరిలో భేదమును సృజించువాడు, శౌచ భ్రషుడు, శస్త్ర జీవి, సంతానహీనుడు, కూట సాక్ష్యము చెప్పుకోడు, యాచకుడు, చిత్రకారుడు, నాట్యకారుడు, సముద్ర ప్రయాణము చేయువాడు, కృతఘ్నుడు, ప్రతి భంగము-చేయువాడు, దేవనిందాపరుడు, వేదనిందారకుడు, బ్రాహ్మణ నిందారకుడు, శ్రాద్ధాది కర్మలలో అనర్హులు. కృతఘ్నుడు, లోభి. క్రూరుడు, నాస్తికుడు, వేదనిందకుడు, మీత్ర ద్రోహి, కుటిలుడు వీరు విశ్లేషించి పంక్తి భోహ్యులు.  

 పైన చెప్పిన వారందరు శ్రాద్దమున భుజింప చేయదగనివారు, అన్ని కర్మలలోను దానమునకు అపాత్రులు బ్రాహ్మణత్వము నుండి భ్రష్టులు వీరినీ విశ్లేషించి విడువ వలయును. శూద్రాన్నముచే పోషించబడువారు సంధ్యాహీనులు, పంచ మహాయజ్ఞములు చేయనివారు, పంక్తి దూషకులు. చదివిన దానిని మరచినవారు స్నాన హోమ శూన్యులు తామసులు రాజసులు పంక్తీ దూషకులు. ఇంకేమి చెప్పవలయును. శాస్త్ర విహితముల నాచరించక నిందీతముల నాచరించువారు విశేష ప్రయత్నముతో విడువదగినవారు.

ఇది శ్రీ కూర్మపురాణమున షట్సాహస్రి సంహితలో ఉపరి విభాగమున ఇరువది యొకటవ అధ్యాయము.