కూర్మ మహా పురాణము
30 - అథ వ్యాసార్జున సంవాదే యుగధర్మనిరూపణమ్
వ్యాసుడుపలికెను :
కలియుగంలో మనుష్యులు తమోగుణంచేత హ్యాకుల మనస్కులై, మాయను, అసూయను మునుల వధను ఎల్లప్పుడు జరుపుతుంటారు.
కలియుగంలో ప్రజలను మృత్యువశం చేసే రోగము, ఎల్లప్పుడు ఆకలిభయము, ఘోరమైన అనావృష్టిభయము, దేశాలు తారుమారగుట కలుగును.
కలియుగంలో జన్మించిన ప్రజలు అధర్మవర్తనులు, ఆహారం లభించనివారు, ఎక్కువ కోపము తక్కువతేజస్సుకలవారు, ఎల్లప్పుడు అసత్యాలాడే వారు, లోభగుణం కలవారుగా ఉంటారు.
బ్రాహ్మణుల లోపభూయిష్ఠమైన అధ్యయనంచేత, యాగకర్మలచేత, చెడు నడవడులచేత, క్షుద్రతంత్రాలచే, కర్మదోషాలచేత కూడ ప్రజలకు భయము కలుగుతుంది.
విప్రులు వేదాలు చదువరు, యజ్ఞాలు చేయరు. అల్పబుద్దికల వారు వేదాలను చదివి యాగాలు చేయుదురు.
ఆ కలియుగంలో శూద్రులకు బ్రాహ్మణులతో, మంత్రాలతో కూడ సంబంధము కలుగుతుంది. వారికి పరస్పరము శయనము, ఆసనము, భోజనము అనేకర్మలతో సంబంధమేర్పడుతుంది.
ఎక్కువగా శూద్రజాతీయులైన ప్రభువులు బ్రాహ్మణులను బాధిస్తారు. రాజులందు భ్రూణహత్య, వీరహత్యవంటి దోషాలు కలుగుతాయి.
కలియుగములో బ్రాహ్మణాది ద్విజులు స్నానమును, హోమమును, జపమును, దానమును, దేవతల పూజను, అటువంటి ఇతర ధార్మిక కార్యములను చేయరు.
కలియుగము నందు మహాదేవుడైన శంకరుని, బ్రాహ్మణులను, పురుషోత్తముడగు విష్ణువును, వేదములను, ధర్మశాస్త్రములను, పురాణములను గూడ దూషింతురు.
వేదములయందు ప్రతిపాదింపబడని అనేకవిధములైన కర్మలను చేయుదురు. బ్రాహ్మణులకు తమకులోచిత ధర్మమునందు ఆసక్తి కలుగనే కలుగదు.
చెడుస్వభావముతో కూడిన ఆచరణము కలవారై, నిరర్ధక రూపులైన పాషండులతో కూడియుండిజనులు, వివిధములైన పరస్పర యాచనలు కలవారుగా అగుదురు.
కలియుగములో గ్రామసీమలు అన్నమును విక్రయించునవిగా, నాలుగు మార్గముల కూడళ్లు నీటిని అమ్ముకునేవిగాను, స్త్రీలు తమ శిరోజాలను విక్రయించువారుగా కాగలరు.
తెల్లని దంతములు కలిగి, శిరోముండనము చేయించుకోని, కాషాయ వస్త్రములు ధరించిన జినసోమధేయముతో శూద్రులు, కలియుగాంతము సమీపించినప్పుడు ధర్మమును ఆచరింతురు.
జనులు పైర్లను దొంగిలించువారుగా, వస్త్రములను హరించువారుగాను, దొంగలనుండి దొంగతనము చేయువారు, దొంగను చంపువాడు మరొకడు గను జీవింతురు.
కలియుగములో దుఃఖములెక్కువగా కలిగిన తక్కువ ఆయుర్దాయము, వ్యాధులతో బాధపడుట శరీరము క్షీణించుట, అనునవి అధర్మమునందు పూనిక కలిగి యున్నందున తమోగుణ ప్రభావము వలన సంభవించును.
కాషాయము కలవారు, కాపాలికులు, గ్రంధశూన్యులుగా ఉండువారు కొందరు, వేదములను అమ్ముకొనువారు ఇతరులు, తీర్ధములను విక్రయించుపోరు మరికొందరు గాను ఉందురు.
అల్పబుద్ది కలజనులు బ్రాహ్మణులు ఆసనములపై కూర్చుని యుండగా చూచి, వారిని తొలగింతురు. రాజులనాశ్రయించి బ్రతుకుచున్న శూద్రులు బ్రాహ్మణశ్రేష్టులను దెబ్బలతో బాధింతురు.
శత్రువులను తపింపజేయు అర్జునా ! బ్రాహ్మణుల మధ్యలో శూద్రులు ఉన్నతమైన ఆసనములో కూర్చుని యుందురు. కలియుగమున కాలము యొక్క బలముచేత రాజు ద్విజులను అగౌరవపరచువాడుగా నుండును.
బ్రాహ్మణులు తక్కువవిద్య, అదృష్టము, బలము కలవారై, పూవులతో, నగలతో, ఇతరములైన మంగళద్రవ్యములతో శూద్రులను సేవింతురు.
ఓ రాజా ! పూజింపదగీన బ్రాహ్మణశ్రేష్ఠులను శూద్రులు గమనింపరు. సేవించుటకు తగిన సమయమును ప్రతీక్షించుచు విప్రులు శూద్రుల ద్వారములందు నిలిచి యుందురు.
కలియుగమందు శూద్రులపై ఆధారపడి జీవించు బ్రాహ్మణులు వాహనములందున్న శూద్రుల సమీపమందుచేరి సేవింతురు. వారిని స్తోత్ర వాక్యములతో కొనియాడుదురు.
శూద్రుల వలన జీవనము సాగించు వారై శూద్రులతో వేదములను చదివింతురు. ఇట్లు వేద విరుద్ధములైన అనర్ధములను, భయంకరమైన నాస్తికత్వము నవలంబించినవారగుదురు.
బ్రాహ్మణోత్తములైనవారు తమ తపస్సును, యజ్ఞములను, కళలను అమ్ముకొని జీవింతురు. కలియుగములో వందల, వేలకొలదిగా సన్న్యాసులు కూడ సిద్దమగుదురు.
తమతమ ధర్మములను నశింపజేయుచు ఆస్థానమును పొందుదురు. ఓ రాజా! దేవతలను గూర్చి లౌకికములైన గీతములు పాడుదురు.
అటువంటి కలి యుగములో బ్రాహ్మణులు మరియు క్షత్రియులు కూడ వామాచారములు, పాశుపతాచారములు కలవారుగా, పాంచరాత్ర ధర్మము కలవారు గాను అగుదురు.
జ్ఞానమార్గము, కర్మయోగము తొలగిపోయి, లోకమంతయుక్రీయాశూన్యముకాగా పురుగులు, ఎలుకలు, పాములు మనుష్యులను భయపెట్టిబాధించును.
పూర్వము దక్షునియజ్ఞములో సతీదేవి శాపముచేత కాల్చబడిన బ్రాహ్మణులు, బ్రాహ్మణుల వంశములలో భూమిపై జన్మింతురు.
తమోగుణముచేత ఆక్రమింపబడిన మనస్సు కలవారై మహాదేవుడగు శివుని నిందింతురు. ఆ కలియుగపు చివరి కాలములో నిరర్ధకమైన ధర్మము నాచరింతురు.
బ్రాహ్మణులు మొదలగు జాతులవారు అందరు తమతమజాతులయందు వీరులుగా ఉందురు. మహాత్ముడైన గౌతమముని యొక్క శాపమునకు గురీయైన ఇతరులెవరు కలరో
ఆబ్రాహ్మణులందరుకూడ ఆయాజతులయందు భూమిపై జన్మింతురు. వేదాంతమును గూర్చి చర్చించు బ్రాహ్మణులు విష్ణువును నిందింతురు.
వేదములకు వ్యతిరిక్తమైన నియమములు, ఆచారములు కలవారు, చేడునడతకలవారు, అనవసరశ్రమచేయువారు, జనులందరిని ఆయాఫలములను చూపించి మోహింపజేయుదురు.
తమోగుణముచే ఆక్రమింపబడిన మనస్సుకలవారై, పిల్లీ వ్రతమువంటి ప్రవర్తనకల అధములై ప్రవర్తింతురు. కలియుగములో లోకములకు రుద్రుడే గొప్పప్రభువు, మహాదేవుడై యున్నాడు.
దేవతలందరికీ పరమదైవతమైన ఆ శివుడే మనుష్యులకు ఫలసిద్దిని కలిగించును. నీలలోహితుడైన ఆ శంకరుడు అవతారములను ధరించగలడు.
శ్రౌతములు, స్మార్తములు అగు కర్మలను నెలకొల్పుట కొరకు, భక్తులకు హితముచేయు కోరికతో శిష్యులకు గురువులు బ్రహ్మసంజ్ఞకమైన ఆ జ్ఞానమునుపదేశించగలరు.
అన్ని వేదాంతముల సారాంశమును, వేదములయందు ప్రతిపాదించబడిన ధర్మములను, బ్రాహ్మణాది వర్ణముల నుద్దేశించి ఏవైతే స్వధర్మములుగా బోధింపబడినవో, (వానినుపదేశింతురు).
ఎవరు ఆ శివుని ప్రీతి కలవారై ఏదో ఒక పద్ధతిననుసరించి సేవింతురో, అట్టివారు కలివలన కలిగిన దోషములను జయించి పరమపదమును పొందుదురు.
మనుష్యుడు ఎక్కువశ్రమలేకుండా శివుని సేవవలన చాల గొప్పపుణ్యమును పొందును. ఎక్కువ దోషములతో కూడియున్న కలియుగమునకు ఇది ఒక్కటే గొప్పగుణము.
అందువలన పూర్ణ ప్రయత్నముతో మహేశ్వరసంబంధి యుగమును పొంది, ప్రత్యేకముగా బ్రాహ్మణుడైనవాడు ఈశ్వరుడైన రుద్రుని శరణము పొందవలెను.
ఎవరైతే విషమములైన కన్నులు కలవాడు, చర్మమును వస్రముగా ధరించువాడు, ఈశ్వరుడును అగు శివుని, నిర్మలమైన మనస్సుకలవారై నమస్కరింతురో వారు పరమపదమును పొందుదురు.
రుద్రునికి చేయునమస్కారము ఎట్లు అన్నికోరికలను ఫలవంతముగా చేయునో, ఇతరదేవతలకు చేయునమస్కారమువలన అటువంటి ఫలమును నిశ్చయముగా పొందజాలడు.
ఈ విధమైన కలియుగములో దోషములను నివారించు మార్గము, మహాదేవునకు చేయు ప్రణామము, శివుని ధ్యానము, దానము అని వేదము చెప్పుచున్నది.
అందువలన ఈశ్వరునికంటె భిన్నులైన దేవతలను వదలి, పరమపదమును పొందవలెనను కోరిక కలవాడై తే విరూపాక్షుడు, మహేశ్వరుడును అగు దేవుని ఆశ్రయింవలెను.
ఎవరైతే దేవతలచే పూజింపబడుచున్న శివునిపూజింపరో, అట్టివారు చేయుదానము, తపస్సు, యజ్ఞము, మరియు వారి జీవితముకూడ నిష్పలమేఅని తెలియవలెను.
దేవతలకు దేవుడు, శూలమును ధరించినవాడు, గొప్పవాడును అగు రుద్రునకు నమస్కారము. మూడుకన్నులు కలవాడు, యోగులకు గురువును అగు శివునకు ప్రణామము.
అమరులందరికి దేవుడు, మహాదేవుడు, బ్రహ్మరూపుడును స్థాణువు, మంగళకరుడు, పరమేష్ఠి, ఎల్లప్పుడు మంగళరూపుడు అగు శిపునకు నమస్కారము.
సోముడు, రుద్రరూపుడు, ప్రళయకారకుడు, కారణభూతుడు అగు దేవునకు వందనము. విషమయాచసములు కలవాడు, బ్రహ్మచారి, శరణు పొందదగినవాడును అగు ఆ దేవుని నేను ఆశ్రయించుచున్నాను.
మహాదేవుడు, గొప్పయోగము కలపోడు, పార్వతీదేవికి భర్త, ఈశ్వరుడు, యోగులకు యోగమునుపదేశించువాడు, యోగమాయచేత ఆవరింపబడినవాడును,
యోగులకు గురువు, ఆచార్యస్థానీయుడు, యోగీశ్వరులకుపొందదగినవాడు, పినాకమను ధనువును ధరించినవాడు, సంసారమును తరింపజేయువాడు, బ్రహ్మరూపుడు, బ్రహ్మకు అధిపతియైనవాడు, రుద్రుడును అగు అతనీని (శరణుపొందుచున్నాను.)
సర్వకాలములయందుండువాడు, అన్నింటిని నిండియున్నవాడు, శాంతుడు, బ్రాహ్మణులకు ప్రియమైనవాడు, వేదరహస్యములు తెలిసినవాడు, కపర్దమను జటాజూటముధరించినవాడు, కాలస్వరూపుడు, మూర్తిరహితుడు, పరమేశ్వరుడును,
అఖండరూపుడు, గొప్పరూపము ధరించినవాడు, వేదములచే తెలియదగినవాడు, స్వర్గమునకు ప్రభువు, నల్లనీ కంఠము కలవాడు, విశ్వమే ఆకారముగా కలవాడు, అంతట హ్యాపీంచినవాడు, సృష్టికి మూలమైనవాడు
ప్రళయకాలపు అగ్నిరూపుడు, కాలుని దహించినవాడు, కోరికలనిచ్చువాడు, మన్మథుని సంహరించినవాడు, చంద్రకళను అలంకారముగా ధరించినవాడు, కైలాస పర్వతమందు శయనించువాడును అగు దేవునికి నమస్కరింతును.
ఎరుపురంగు కలవాడు, నాలుకనుచాచీ ఆస్వాదించువాడు, ఆదిత్యరూపుడు, పరమేష్ఠి, భయంకరుడు, పశుపతి, తీక్షరూపుడు సూర్యరూపుడు, గొప్పతపోమూర్తి యగుదేవునకు నమస్కరింతును.
ఇదీ యుగములయొక్క లక్షణము, గడచిన వాటివి, రాబోవు యుగములయొక్కయు మన్వంతర సమాప్తికాలము వరకు వర్తించునది, సంగ్రహరూపముగా చెప్పబడినది.
ఒకమన్వంతరమును వివరించుట చేత అన్నీ మన్వంతరములు వ్యాఖ్యానింపబడినట్లేలగును. దానిలో సందేహములేదు. అట్లే ఒక కల్పముచేత ఇతరకల్పము కూడ వ్యాఖ్యాతమే.
ఈ మన్వంతరములలో, గడచిన, రానున్న మన్వంతరాలలో అందరును నామరూపములతో సమానమైన అభిమానము కలవారుగా అగుదురు.
ఈ విధముగా మహాత్ముడగు వ్యాసునిచేత చెప్పబడిన, తెల్లని గుఱ్ఱములు కల అర్జునుడు ఈశ్వరుడగు శివునియందు నిశ్చలమైన, గొప్ప భక్తినీ కలవాడాయెను.
కృష్ణద్వైపాయనుడు, సమర్థుడు అగు ఆ వ్యాసమహర్షికి ప్రణామము చేసెను. ఆ వ్యాసుడు సర్వజ్ఞుడు, అన్నిటిని చేయువాడు, స్వయముగా శ్రీవిష్ణుస్వరూపుడై అవతరించి ఉన్నాడు.
శత్రుసంహారకుడయిన ఆ అర్జునుని తనకు నమస్కరించుచున్న పోనిని గూర్చి వ్యాసమునీ, మంగళకరము లైన తనచేతులతో అతనిని తొకుచు మరల ఇట్లు ఉపదేశించేను.
శత్రు పట్టణములను జయించు ఓ అర్జునా ! నీవు ధన్యుడవైనావు, అనుగ్రహింపబడినావు. మూడులోకముల యందు గూడ. శంకరుని యందుభక్తి కలపోడు నీతో సమానుడు మరియొకడులేడు.
ప్రపంచము కన్నులుగాకల, ప్రపంచమంతటా వ్యాపించి యున్న, సమస్తలోకొత్మకుడైన ఆ రుద్రదేవుని నీవు ప్రత్యక్షముగా చూచియున్నావు.
ఈశ్వరసంబంధియైన ఆ దివ్యజ్ఞానము నీచేత నిజతత్త్వ రూపముతో తెలియబడినది. సనాతనుడైన నారాయణుడు సంతోషముతో స్వయముగా ఇట్లనెను.
నీస్థానమును గూర్చి వెంటనే వెళ్లుము. దుఃఖపడుట నీకు తగదు. గొప్పభక్తితో శరణుకోరదగిన శివుని శరణుగోరుము.
భగవంతుడగు ఆ వ్యాసుడు ఇట్లు పలికీ అర్జునుని అనుగ్రహించి, శివుని ఆరాధించుటకుగాను శివుని సంబంధియగు కాశీపట్టణమునకు వెళ్లెను.
పాండు కుమారుడగు అర్జునుడు కూడ ఆ వ్యాసుని వాక్యము వలన శివుని శరణు పొందినవాడై, అన్ని కర్మములను వదలి, శివ తత్త్వము తెలిసికొని అతని యందు శ్రద్ధకలవాడాయెను.
భక్తితో శివుని పూజించుటతో సమానమైనది ఇంతకు పూర్వములేదు. ఇకముందుండబోదు. సత్యవతి కుమారుడైన వ్యాసుని, దేవకీ కుమారుడైన కృష్ణుని విడిచిన అతనీతో సమానుడు ఇతరుడు లేడు.
శాంతరూపుడు, బుద్ధిమంతుడు, పూజనీయుడు, పరాశరుని కుమారుడు, అమితమైన తేజస్సు కల వ్యాసమహామునికి ఎల్లప్పుడు నమస్కురింతును.
కృష్ణద్వైపాయనుడగు వ్యాసముని సాక్షాత్తుగా సనాతనుడైన విష్ణుమూర్తియే పరమేశ్వరుడైప రుద్రుని తత్త్వమును ఆయన కాక ఇతరుడెవ్వడు తెలిసికొనగలడు ?
సత్యవతి కుమారుడు, కృష్ణవర్ణుడు, పరాశరముని పుత్రుడు, యోగీశ్వరుడు, మహాత్ముడు, నాశరహితుడైన విష్ణుస్వరూపుడైన ఆ వ్యాస ఋషీకి నమస్కరించుడు.
ఆ మునులందరు ఇట్లుపలికి సావధానులై మహాత్ముడు, సత్యవతికుమారుడునగు వ్యాసమునికి నమస్కరించిరి.
శ్రీకూర్మ పురాణములో వ్యాసార్జున సంవాదమునందు యుగధర్మ నిరూపణ మను ముప్పదవ అధ్యాయము సమాప్తము.
