కూర్మ మహా పురాణము
33వ అధ్యాయము
వ్యాస మహర్షి పలికెను.
మనుష్యులను, స్త్రీలను వాపీకూపతటాకములను హరించినచో చాంద్రాయణముతో శుద్ధి కలుగును. ఇతరుల ఇండ్ల నుండి అల్పసారములగు వస్తువులను హరించినచో సాంతపనవ్రతమున శుద్దీకలుగును. బ్రాహ్మణుడు బుద్ధి పూర్వకముగా సజాతీయుల ఇండ్ల నుండి ధాన్యరత్నధనాదులను అపహరించినచో అర్థకృచ్ఛవ్రతముతో శుద్ధిపొందును. భక్ష్య భోజ్యములను వాహన శయ్యాసనములను పుష్పఫలమూలములను కాష్ఠములను వృక్షములను శుష్కిన్నములను గుడమును వస్త్రమును చర్మములను మాంసమును అపహరించినచో మూడురోత్రములుఉపవసించవలయును. మణులను ముత్యములను పగడములను రాగినీ వెండిని ఉక్కును ఇనుమును పాషాణములను అపహరించినో 12 దినములు నూకలన్నమును తీనవలయును. పత్తి ఊలు పట్టులను, రెండు గిట్టల పశువులను ఒక గిట్ట పశువులను పక్షులను గంధమును ఔషధములను త్రాడును అపహరించినచో మూడు దినములు పాలతో గడపవలయును.
నరమాంసాశనమున చోంద్రాయణవ్రతమాచరించవలయును. కాకిని శునకమును ఏనుగును వరాహమును కుక్కుటమును భక్షించినచో తప్త కృచ్చవ్రతముతో శుద్ధి పొందును. మాంసమును భుజించు మృగములను మలమూత్రములను, నక్కలు కోతులను భుజించినచో తప్తకచ్చువ్రతము నాచరించవలయును. 12 దినములుపవసించి కూష్మాండమంత్రములతో ఘృతముతో హోమము గావించవలయును. ముంగీస గుడ్ల గూబ పిల్లలను భుజించినచో సాంతపనము నాచరించవలయును. తోడేలు ఒంటె గాడిదలను భుజించినచో తప్తకృచ్చవ్రతముతో శుద్ధి పొందును. వ్రతముతో పాటు పూర్వోక్తవిధినుసరించిన సంస్కారమును కూడా చేసుకొనవలయును.
ఒక బలాక హంస కారండవ చక్రపోక ప్లవములను పక్షులను భుజించినచో 12 దీనములు ఉపవసించవలయును. కపోత కూర్మ, శుక, సారస, ఉలూక, కలహంసాదులను భుజించినను పైన చెప్పిన వ్రతమే పరిశుద్ధి (12 దినముల 6 భోజనములు) ముసలిపిట్ట మత్స్య మాంసములు భుజించిననూ ఇదే వ్రతము. కోకిల మత్స్య మండూక భుజగములను భుజించినచో గోమూత్రమున నానబెట్టిన యవలను ఆహారముగా ఒకనెల భుజించవలయును. జలచరములు జలభవములు ముక్కుతో చూసి తినునవి, నఖములతో చూసితినునవి, రక్తపొద జంతువులను భుజించినచో 7 దినములు గోమూత్రయవ భోజనముతో శుద్ధి, శునకమాంసమును శుష్కమాంసమును బద్దీ పూర్వకముగా తనకోరకు వండుకొనితినుచో ఒకనెల గోమూత్రయవకవ్రతమునాచరించవలయును.
వంకాయ భూతృణము శిగ్రు, కరకములను భుజించినచో ప్రాజాపత్య వ్రతము నాచరించవలయును. శంఖ కుంభీనకములను, ఉల్లినీ వెల్లుల్లినీ భుజించినచో చాంద్రాయణవ్రతమునాచరించవలయును. నాలిక తండులీయములను తినినచో ప్రాజాపత్యమునాచరించవలయును. అశ్మాంతక పోతకములకు తప్త కృచ్చవ్రతము, కుక్కుభాండమునకు ప్రాజాపత్యము, (సొరకాయ) అలోబు కింశుక భక్షణమున ప్రాజాపత్యవ్రతము, మేడిపండు భక్షించిన తప్త కృచ్ఛవ్రతమును ఆచరించవలయును.
తిలాన్నమును గంజిని పాయసమును అపూపములను నిష్ప్రయోజనముగా భుజించినచో మూడు రాత్రులు ప్రతమునాచరించవలయును. బ్రహ్మచారి త్రాగరాని పాలను తాగినచో ఒకనెల గోమూత్రయపభక్షణముతో శుద్ధీ జరుగును. ప్రసవించిన తరువాత పదిదినములలోపు గోక్షీరములు గేదెపాలు, మేకపాలు, గర్భముతోనున్నవాటిపాలు, దూడలేనిపాలు త్రాగినచో ఈవ్రతమునాచరించవలయును. వీటిపాలవలన ఏర్పడిన పెరుగు వెన్న నెయ్యి జున్ను మొదలగువాటిని ఆహారముగా తీసుకున్నచో 7 దీనములు గోమూత్రయావకాహారి కావలయును. నవశ్రాద్ధమునకాని, మృతకుని శ్రాద్ధములోకాని జుతాశాచ మృతాశౌచములలోకాని భుజించిన బ్రాహ్మణుడు చాంద్రాయణవ్రతముతో శుద్ధిపొందును. అగ్నిలో హవనము చేయనివానీ, అతిధికి పెట్టనివానీ గోగ్రానమీయనీ వాని భోజనము చేసినచో చాంద్రాయణవ్రతమునాచరించవలయును. అభోజ్యములను భుజించిననూ అన్యజుల భోజనము భుజించిననూ తప్త కృచ్చవ్రతమునాచరించవలయును. చాండాల భోజనము చేసినచో చాంద్రాయణవ్రతము నాచరించ వలయును. బుద్ధిపూర్వకముగా చేసినచో కృఛాబ్దము నాచరించి సంస్కారమును చేసుకొనవలయును. సురాకంటే (కల్లు) భిన్నమగు మద్యపానము చేసినచో చాంద్రాయణ వ్రతమాచరించవలయును. తీనరాని అన్నమును తినినచో ప్రాజాపత్యమునాచరించవలయును. ఇంకా చేప్పబడని పాపముల శుద్ధికి ఏకాహోపవాసము చేయవలయును.
గ్రామసూకర ఖర ఉష్ట్రశృగాల వానర కాకమలమూత్రపురీషములను తినినచో ద్విజుడు చాంద్రాయణము నాచరించవలయును. తెలియక మలమూత్రములను భుజించినచో సురాస్పర్శగావించిననూ ద్వీజులు సంస్కారమును చేయవలయును. మాంసాశనములగు పక్షుల మూత్ర పురీషముల భుజించిన మహాసొంతపన ప్రతము చేయవలయును. గద్ద కప్ప కురర మలమూత్రముల భక్షణమున కృచ్ఛము నాచరించవలయును. బ్రాహ్మణుడు ఉచ్చిష్టభోజనము చేసినచో ప్రాజాపత్యము నాచరించవలయును. క్షత్రియునికి తప్త కృచ్ఛవ్రతము, వైశ్యునికి అతికృచ్చవ్రతము చేయవలయును. ద్విజుడు శూద్రోచ్చిష్టమును భుజించి చోద్రాయణ వ్రతము నాచరించవలయును. సుహాభాండములోని నీరు త్రాగిననూ చాంద్రాయణ వ్రతము. కుక్కఎంగిలి తినిన ద్విజుడు మూడు రాత్రులుపవసించవలయును. తెలిసి చేసినచో మూడు దినములు గోమూత్రయవ కాహారి కావలయును. మూత్రపురీషాదులతో దుష్టమైన జలమును త్రాగినచో సొంతపన వ్రతమాచరించవలయును. చండాల కూపముతో కానీ భాండములతోకాని తెలిసి జలపానము గావించినచో సాంతపనము నాచరించవలయును. చాండాలస్పర్శగల జలము త్రాగినచో మూడు రాత్రులు ఉపవసించి పంచగవ్యప్రొసనముతో శుద్ధి కలుగును. సుహాపాతకులు తాపీనా బుద్ధిపూర్వకముగా స్నానము చేయకుండగనే భుజించిదో తప్తకచ్ఛ వ్రతమునాచరించ వలయును. మహాపాతకినికాని, చండాలునికాని, రజస్వలను కాని స్పృశించి పొరబాటున స్నానము చేయకుండగా భుజించినచో 3 రాత్రులు ఉపవసించవలయును.
స్నానము చేసిభుజించదగినవారు స్నానము చేయకుండ భుజించినచో ఒకదినముపవాసముతో శుద్ధి. బుద్ధి పూర్వకముగా చేసినచో కృచ్చవ్రతమని బ్రహ్మచెప్పెను. శుష్కము, పాసినది గవాదీ జంతూచ్చీష్టమును భుజించినచో ఒకదినముపవాసము. కృచ్చపాదవ్రతము ఆచరించవలయును. విప్రుడు ప్రతిసంవత్సరము చివర తెలియక భుజించీనకోటి దోషపరిహారార్ధము కృచ్చవ్రతము నాచరించవలయును. తెలిసినదానికి విశేషముగా ఆచరించవలయును. సంస్కారహీనులతో యజ్ఞము చేయించుట, ఇతరులకులోభమున అంత్యకర్మ నాచరించుట అభిచారకర్మ నాచరించినచో మూడు కృచ్చవ్రతములనాచరించవలయును. బ్రాహ్మణాదులతో హతులైన వారికి అంత్యకర్మ నాచరించినచో గోమూత్ర యవాశుడై ప్రాజాపత్యవ్రతము నాచరించవలయును. నూనె ఒంటికి వ్రాసుకొని మూత్రపురీషోత్సర్జనము చేసినను క్షవరము మైధునమాచరించిననూ ఒకదినము ఉపవసించవలయును. మూడుదినములు హోమము చేయనిచో ఆదీనములుపవసించవలయును. పదీపన్నెండు దీనములు హవనముగావించనిచో కృచ్ఛ చాంద్రాయణ వ్రతమునాచరించవలయును.
పతితునితో ద్రవ్యము తీసుకొనినచో ఆద్రవ్యమును విడిచినచో శుద్ది. అట్లే సొంతపన వ్రతము నాచరించవలయును. ప్రాయోపవేశమునుండి సన్యాసము నుండీ భ్రష్టులగు వారు 3 కృచ్ఛములు 3 చాంద్రాయణములను ఆచరించవలయును.
జాతకర్మాది సంస్కారములతో సంస్కరించబడిన ద్విజులు ధర్మ వృద్ధి కొరకు వారీ వ్రతమును చక్కగా ఆచరించవలయును. సంధ్యా వందనము చేయని దీనమున భోజనము చేయరాదు. రాత్రి సంధ్య చేయనిచో రాత్రి భోజనము చేయరాదు. నిత్యగ్ని హోత్రము నాచరించనిచో, దినమున 8000ల గాయత్రి జపము చేయవలయును. గృహస్థుడు పొరబాటున సంధ్యావందనము చేయనిచో స్నానము చేసి ఉపవసించిన శుద్ధి పొందును. వేదోదిత నిత్యకర్మలను లోపింప చేసిననూ స్నాతక ప్రతలోపముననూ దినము ఉపవసించవలయును.
ఆగ్నీని విసర్జించిన ద్విజుడు ఒక సంవత్సరము కృచ్ఛవ్రతము నాచరించవలయును. సంస్కార హీనుడు చాంద్రాయణము చేసినచో గోదానముతో శుద్ధి పొందును. నాస్తిక్యమును అవలంబించిన బ్రాహ్మణుడు ప్రాజాపత్యమునాచరించవలయును. దేవ ద్రోహము గురు ద్రోహము తప్త కృచ్ఛముతో శుద్ధి పొందును. బుద్ధి పూర్వకముగా ఒంటిపైన గాడిదపైన చరించిననూ నగ్నముగా జలమున ప్రవేశించిసనూ 5 దినములుపవ సించవలయును, పంక్తి బాహ్యులైనవారు ప్రాయశ్చిత్తము చెప్పబడినవారు ఒకనెల రోజులు ప్రతి 3 దినముల కొకసారి సాయంకాలమున మాత్రము భుజించి వేద సంహీతజపమును చేయుచు శాకల హోమము (బోధాయన స్మృతి 4 ప్రశ్న 3) చేసిన శుద్ధి కలుగును. బ్రాహ్మణులు నల్ల వస్త్రమును లేదా రక్త వస్త్రములను ధరించినచో 20 దినములుపవసించి స్నానము చేసి పంచగవ్యముతో శుద్ధి జరుగును.
చండాలునకు వేద ధర్మ పురాణములను ఉపదేశించిన వానికి చాంద్రాయణముతో శుద్ధి జరుగును. ఉరి మొదలగు పోటీతో చనిపోయిన వానీనీ స్పృశించినచో చాంద్రాయణముతో కానీ ప్రాజాపత్యముతో కానీ శుద్ది జరుగును. ఉచ్ఛిష్ణుడు ఆచమనము చేయకనే చండాలాదులను స్పృశించినచో స్నానము చేసి 8000 గాయత్రీ జపము చేయవలయును. బ్రహ్మచారి అయినచో సావధానుడై మూడు దినములు ఉపవసించి ద్రుపదా మంత్రమును 100 మార్లు జపించీ పంచగవ్య ప్రాశనముతో శుద్ది పొందును. బుద్ది పూర్వకముగా ఉచ్ఛిష్ట ముఖముతో చండాల పతీతాదులను స్పృశించినచో శుద్ధి కొరకు ప్రాజాపత్య వ్రతము సాచరించవలయును.
చండాలునీ, ఆశౌచయుక్తుని, శవమును, రజస్వలయగు స్త్రీని కొని, వీరిచే స్పృశించబడిన వానిని కాని, పతితుని కాని స్పృశించినచో శుద్ధి కొరకు స్నానము చేయవలయును. పొరబాటున చండాల సూతక శవములను తాకిన వారిని తాకినచో స్నానము చేసి ఆచమనము చేసి సావధానముతో గాయత్రీ జపమును చేయవలయును. చండాల అశాచ శవాదులను తాకిన వారిని బుద్ధి పూర్వకముగా తాకినచో స్నానము చేసి ఆచమనము చేయవలయును. అని బ్రహ్మ తెలిపేను. భోజనము చేయుచుండగా మలుస్రావము జరిగినచో శౌచము పూర్తి చేసుకొని స్నానమాచరించి ఉపవసించి ఘృతముతో హోమము చేయవలయును. చందోల శవమును అంత్యజుల శవమును స్పృశించినచో శుద్ధి కొరకు కృచ్చవ్రతమును చేయవలయును. నూనె వంటికి వ్రాసుకొనిన తరువాత స్పృశించరాని వానిని స్పృశించినచో ఒక దీనముపవసించినచో శుద్ది కలుగును.
సురను స్పృశించిన ద్విజుడు మూడు ప్రాణాయామములను చేయవలయును, ఉల్లిని వెల్లుల్లిని స్పృశించినచో మృతప్రాశనము చేయవలయును. బ్రాహ్మణుని కుక్క కరిచినచో మూడు దినములు సాయంకాలము పాలు మాత్రమే త్రాగ వలయును. నాభికి పై భాగమున కరిచినచో ఈ దినములు సాయంకాలము పాలు త్రాగవలయును. బాహువులకు కరిచినచో 9 దినములు శిరమున కరిచినచో 12 దినములు సోయంకాలము పాలు త్రాగవలయును. కుక్క కరిచిన ద్వేజుడు స్నానము చేసి గాయత్రీ జపము చేయవలయును.
ఏ రోగము లేక వలయు ధనముండియు పంచ మహా యజ్ఞములను చేయకనే భుజించినచో అర్థ కృచ్ఛ వ్రతము నాచరించవలయును. ఆహితాగ్నీయగుపాడు పర్వకాలమున అగ్న్యుపస్థానము చేయకున్ననూ ఋతుకాలమున భార్యా సంగమము చేయకున్ననూ అర్థ కృచ్ఛము సౌచరించవలయును. మలమూత్ర వేగ వశమున నీరు లేకుండగా కానీ, లేదా నీటిలో కాని మల మూత్రములను విడిచినచో ధరించిన వస్త్రము లతోనే స్నానము చేసి గోవును స్పృశించవలయును. బుద్ధి పూర్వకముగా సూర్యోదయము వరకు నిదురించిన ద్విజుడు సూర్యో దయ కాలీన అనుష్టానము చేయనివాడు సూర్యోదయ కాలమున జలమున ప్రవేశించి 8000 గాయత్రీ జపమును చేసి మూడు దినములు పవసించవలయును.
బుద్ధి పూర్వకముగా శూద్రశవము వెంటవెళ్ళీన ద్విజుడు స్నానము చేసి నదీ తీరమున 8000ల గాయత్రీ జపము చేయవలయును. బ్రాహ్మణుని చంపుటకు అసత్య ప్రతిజ్ఞ చేసిన వాడు యవ్వన్నముతో చాంద్రాయణమును ఆచరించవలయును. పంక్తిలో కూర్చున్న బ్రాహ్మణులకు భేదము పక్షపాత బుద్ధితో వడ్డించినవాడు కృచ్ఛవ్రతము నాచరించవలయును. చండాలుని ఛాయను తాకినచో స్నానము చేసి నేయిని తినవలయును.
అశుచిగా అగ్నిని కానీ చంద్రునికాని చూచినచో శుద్ధి కొరకు సూర్యుని దర్శించవలయును. మానవుని ఎముకలను తాకినచో స్నానముతో శుద్ధి కలుగును. దంభ పూర్వకముగా అధ్యయనము గావించినచో ఒక సంవత్సరము భిక్షాటన చేయవలయును. కృతఘ్నుడు బ్రాహ్మణ గృహమున బ్రహ్మచర్యములో అయిదు సంవత్సరములుండవలయును. బ్రాహ్మణునీ విషయమున గురువుల యెడ హుంకారమును నీవు అని కానీ అనాదరముతో వ్యవహరించినచో స్నానము చేసి ఒక దినముపవసించి వారికి ప్రణామము గావించి ప్రసన్నులను చేసుకోనవలయును. గడ్డి పోచతో కొట్టిననూ వస్త్రముతో కంఠమును చుట్టి పీడించిననూ వివాదముతో గెలీకాని ప్రణాము పూర్వకముగా ప్రసన్నుల చేయవలయును. బ్రాహ్మణుని ఢీకొన్నచో కృచ్చ వ్రతమును, పడవేసినచో అతి కృచ్ఛ్భతము నాచరించవలయును. డ్రాహ్మణునికి రక్తము రప్పించినచో కృచ్ఛాతికృచ్ఛముల సోచరించ పలయును.
గురువును అధిక్షేపించిననూ, అబద్ధము పలికినాడని చెప్పినచో ఒక దినము కానీ మూడు దీసములు కాని ఉపవాసముండవలయును, దేవతలవైపు ఋషులవైపు ఉమ్మివేసినకాని వారిని ఆక్షేపించినకొని కోరీవితో నాలుక కొల్చుకొనవలయును. బంగారమును దానము చేయ వలయును. దేవోడ్యానమున ఒక్క మారు మూత్రము చేసిననూ శిశ్నమును ఛేదించుకొనవలయును. లేదా చాంద్రాయణ వ్రతము నోచరించ వలయును. దేవాలయమున మలమూత్ర విసర్జనము చేసిననూ ఇదే ప్రాయశ్చిత్తము నాచరించుకొనవలయును. దేవతలను ఋషులను దైవమును దైవతుల్యులను నిందించిన ద్విజుడు ప్రాజాపత్య వ్రతము నాచరించవలయును. అట్లు నిందీంచిన వారితో సంభాషించినచో స్నానము చేసి దేవతార్చన గావించవలయును. అట్టి వారిని చూచినచో సూర్య దర్శనము చేసుకొనవలయును. వారిని స్మరించినచో విశ్వేశ్వరుని స్మరించవలయును.
సర్వభూతాధిపతియగు విశ్వేశ్వరుని నిందించు వానికి నూరు వరములకు కూడా నిష్కృతి చేయజాలము. మొదట పశ్చాత్తాపముతో చాంద్రాయణమును ఆచరించవలయును. తరువాత కృచ్చొతి కృచ్చముల చరించవలయును. తరువాత ఆదిదేవుని శరణు వేడవలయును. లేదా తన సర్వస్వమును దానము చేయవలయును. యధావిధిగా చాంద్రాయణమును కృచ్ఛాతి కృచ్చమును చేయవలయును. పుణ్యక్షేత్రములను పర్యటించిన సర్వపాప నివృత్తి జరుగును. దేవతార్చన సకల పాపనాశనము చేయును. అమావాస్య నాడు శివుని ఆరాధించి బ్రాహ్మణులను భుజింప చేసినచో అన్నీ పాపములు నశించును. బహుళ అష్టమీ బహుల చతుర్దశినాడు బ్రాహ్మణ ముఖముగా శివునారాధించిన సర్వపాప నివృత్తి కలుగును. కృష్ణ త్రయోదశి రాత్రి మొదటి ఝామున ఉపహార పూర్వకముగా (కానుకలు) త్రిలోచనుని దర్శించిన సర్వపాపములు తొలగును. కృష్ణ చతుర్దశినాడు మొదటి జామున స్నానమాడి ఉపవసించి యమధర్మరాజునకు, మృత్యువునకు, అంతకునకు, వైవస్వతునకు, కాలునకు సర్వభూతనాశకునకు ఒక్కొక్కరికి నువ్వులతో 7 ఉదకాంజలులను విడువ వలయును.
ప్రాయశ్చిత్తము కొరకు చేయు వ్రతములలో బ్రహ్మచర్యము అథశ్శయ్య ఉపవాసము ద్విజార్చనములను ప్రశాంత మనస్కుడై ఆచరించవలయును, అపహాస్యనాడు పితామహుడగు బ్రహ్మనుద్దేశించి ముగ్గురు బ్రాహ్మణులను పూజించిన అన్ని పాపములు తొలగును. శుక్లషష్ఠినాడు సావధానుడై ఉపవాసమునుండీ సప్తమినాడు సూర్యభగవానుని ఆరాధించినచో సకలపాపములు నశించును. భరణీనక్షత్రమున చతుర్థిన శనివారమున యముని పూజించినచో ఏడు జన్మల పాపములు తొలగును. ఏకాదశినాడు నిరాహారముగానుండి ద్వాదశినాడు జనార్ధనుని పూజించినచో మహాపాపములు కూడ తొలగును. గ్రహణాది పర్వదినములలో తపము జపము తీర్థసేవ దేవ బ్రాహ్మణపూజనము మహాపాతకములను నశింపచేయును అన్ని పాపములు చేసి యున్ననూ పుణ్యతీర్దములలో నియమపూర్వకముగా ప్రాణత్యాగముగావించినచో అన్ని పాపములు తొలగును. భర్తతో కలిసి అగ్నిలో సహప్రవేశము చేసిన స్త్రీ. భర్త బ్రహ్మమ్నుడు కృతఘ్నుడు మహాపాతక దూషితుడైననూ పరిశుద్దుడగును. స్త్రీలకు అన్ని పాపములకు పాతివ్రత్యమే పరమ ప్రాయశ్చిత్తము. భర్త శుశ్రూషచేయు పతివ్రతకు ఇహపరములలో ఏ పాపమూ ఉండదు.
ధర్మపరాయణురాలగు పతివ్రత సాక్షాత్తుపార్వతీమాతయే. ఇందులో ఏ మాత్రము సందియము లేదు. ఇట్టి పతివ్రతకు ఎవ్వడూ పరాభవము చేయజాలడు. రాముని భార్యయగు సీత త్రైలోక్య విఖ్యాత పతివ్రత రావణాసురుని గెలిచెను. పరిశుద్ధురాలగు రామ పత్నిసీత విశాలసయననురాక్షస రాజగు రావణుడు కొమించెను. ఏజనారణ్యమున సంచరించుసుందరీని మాయాయతి వేషమును ధరించి అపహరించ సంకల్పించేను. రావణాసురుని అభిప్రాయమును గ్రహించగలిగిన సీతాదేవీ భర్తయగు శ్రీరామచంద్రుని స్మరించి గార్హపత్యాగ్నిని శరణువేడెను. రామపత్నియగు సీత సర్వదోష వినాశకుడు, మహాయోగపరుడు అగు అగ్నిని చేతులు జోడించి శరణువేడెను. పరమగహనుడు, మహాయోగస్వరూపుడు, కృతాంతుడు, సర్వభూతదాహకుడు కాలరూపుడగు ఈశ్వరుడగు అగ్నిని నమస్కరించుచున్నాను. విశ్వతోముఖుడు సకలసాక్షియగు పావకునికి నమస్కారము. సర్వప్రాణుల హృదయమునందుండువాడు, ప్రకాశించుదేహము కలవాడు, ఆత్మస్వరూపుడు, బ్రహ్మరూపి బ్రాహ్మణప్రియుడు అగు అగ్నిని వేడు చున్నాను. చర్మవసయడు, భూతపతి శరణ్యుడు, పరమ పదరూపుడగు అగ్నీని శరణువేడుచున్నాను.
జగద్యోని సర్వతేజోకారణభూతుడు, మహాయోగేశ్వరుడు, ఆదిత్య పరమేష్ఠిస్వరూపుని శరణు పొందుచున్నాను.
మహాగ్రాసుడు, త్రిశూలీ, భోగమోక్ష ఫలప్రదుని యోగేశునీ, రుద్రుని, కాలాగ్ని రూపుని శరణు పొందుచున్నాను.
వ్యాహృతి త్రయస్వరూపుని విరూపాక్షునీ, హిరణ్మయ గృహమున దాగియున్నవానిని నిన్ను శరణు వేడుచున్నాను.
అన్ని ప్రాణులలోనుండు వైశ్వానరుని శరణువేడుచున్నాను. హవ్యకవ్యములను వహించు ఈశ్వరుని వహ్నిని శరణువేడుచున్నాను. పరతత్త్వమును ఉత్తమ సవితృతత్త్వమును తేజస్సును, జ్యోతిస్వరూపుడగు అగ్నిని శరణువేడెదను. హవ్యపోహనా నన్ను కాపాడుము. ఇట్లు యశస్వినియగు రామపత్నీ వహ్న్యష్టకమును జపించి మనసున సొమునీ ధ్యానించుచునిలిచెను, అంతలో గార్హపత్యాగ్నినుండి మహేశ్వరుడగు హవ్యవాహనుడు తేజస్సుతో ప్రవహించుచున్నట్లు జ్యోతిస్వరూపునిగా ఆవిర్భవించేను. అచట అగ్నిదేవుడు రావణవధను కోరి మాయామయ సీతను సృజించి ధర్మిష్ణురాలగు సీతను గొని అంతర్థానమును చెందెను. ఆ మాయామయ సీతను చూచీ రాక్షసాధిపతి యగు రావణుడు ఆమెను తీసుకొని సాగరమధ్యలోనున్న లంకకు గొనిపోయెను. తరువాత లక్ష్మణునితో కూడిన రాముడు రావణాసురుని చూసి సీతనుగొని సందేహించు చుండెను. జగములకు నమ్మకము కలిగించుటకు మాయామయిసీత అగ్నిలో ప్రవేశించేను. అగ్ని కూడా మాయాసీతను దహించివేసెను. తరువాత అసలు సీతను రామునికి చూపెను. అంతట అగ్నిదేవుడు దేవతలకు ప్రీతి పాత్రుడాయెను. అపుడు ఆసీత తన చేతులతో భర్తపాదములను పట్టుకోని రామునికి భూమిమీద ప్రణమిల్లెను. అట్లు సీతను చూచిన రాముడు విస్మయలోచనుడై సంతోషించిన మనసుతో అగ్నిదేవుని శిరసానమస్కరించి అగ్నిని సంతోషింపచేసేను. తరువాత రాముడు అగ్నిభగపోనునితో ఇట్లు పలికేసు. ఇంతకుముందు నేను ఇప్పుడు నా ప్రక్కన ఉన్న ఈసీతను నీలోలీనమగుట చూచితిని అని. అంతట అగ్నివారందరిముందే జరిగినదంతయూ తెలిపెను.
మిథిలాపతియగు జనకుడు పార్వతిని చక్కగా ఆరాధించి పార్వతికి అత్యంత ప్రీతిపాత్రురాలగు సీతను పుత్రికగా బడసెను. రావణాసురుడు ఈమెను కోరినపుడు సుశీల, పతివ్రత, భర్త శుశ్రూషణ పరాయణురాలగు ఈమెను పార్వతి సన్నిధికి చేర్చితిని, రావణుని వధను కోరిన నేను మాయామసీతను సృజించీ అచట ఉంచితిని. ఆ మాయ సీతనే రావణుడు గొని పోయేను. ఆమెనే నీవు ఇపుడు రావణుని చంపి బడసితివి. ఇపుడునేను ఆమాయాసీతను ఉపసంహరించితిని. ఇపుడు నామాలతో పరిశుద్ధురాలగు ఈమెను గ్రహించుము. తమకు తాము నారాయణదేపునిగా తెలియుము. అగ్నిదేవుడిట్లు పలికి రామునిచే అచట సకల భూతములచేపూజించబడి అచటనే అంతర్థానమాయెను. ఇట్లు మీకు పతివ్రతల మాహాత్యమును తెలిపితిని. స్త్రీలకు సర్వపాపములను నశింపచేయు ప్రాయశ్చిత్తము పాతివ్రత్యమే. సకల పాపయుక్తుడగు పురుషుడు కూడా మనో నిగ్రహము కలవాడై పుణ్యతీర్థములలో తనదేహమును విడిచినచో పాపనిర్ముక్తుడగును. భూమీలోకల సకల తీర్థములలో స్నానము చేసినవాడు సకల పాపములచే విషక్తుడగును,
వ్యాస మహర్షిపలికెను.
ఇట్లు మీకు సకల మానవ ధర్మములను తెలిపితిని. మహేశుని ఆరాధించు జ్ఞానయోగమును కూడా తెలిపితిని. ఇట్లు ఈవిధిని అనుసరించి జ్ఞానయోగము నాచరించువాడు మహేశుని సాక్షాత్కారమును పొందగలడు. ఇతరులు నూరుకల్పములకు కూడ పొందజాలరు. ఈ భూమండలమున ఈపరమ ధర్మమును పరమేశ్వరజ్ఞానమును స్థాపించువానికంటే ఉత్తముడు ఇంకనుండడు. అతడే పరమయోగి అనబడును. ఇట్లు ఈధర్మ జ్ఞానములను స్థాపించగలిగి కూడా మోహముతో స్థాపించనిచో అతడు యోగయుక్తుడైనను భగవత్ప్రియుడు కాజాలడు. ధర్మము, శాంతము, శ్రద్ధ కలవారికి విశేషించి బ్రాహ్మణులకు ఈధర్మజ్ఞాన యోగమును ఉపదేశించవలయును. ఇట్లు మనమధ్య జరిగిన ఈ సంవాదమును వినినవాడుకూడా సర్వపాప వినిర్ముక్తుడగును. పరమపదమును పొందును. శ్రాద్ధమున దేవకార్యమున కానీ బ్రాహ్మణ సన్నిధిలో మనోనియమముతో చదువవలయును. ద్వీజులు వినవలయుసుకూడా. మనోనిగ్రహముతో అర్థమును చక్కగా విచారించి పవిత్రులగు బ్రాహ్మణులకు వినిపించినచో సకల దోషములు తొలగి మహేశ్వరుని సన్నిధికి చేరును. సత్యవతీసుతుడగు వ్యాసభగవానుడు ఇట్లు చెప్పి సూత మహర్షిని మునులను ఓదార్చి వచ్చీన దారినే వేడలెను.
ఇది శ్రీ కూర్మ పురాణమున షట్సాహస్రసంహితలో ఉపరివిభాగమున 33వ అధ్యాయము.
