కూర్మ మహా పురాణము
48 - ఆథ జమ్బూద్వీపవర్ణనమ్
హేమకూట పర్వతము యొక్క శిఖరమునందు, మిక్కిలి మంగళకరమైన, స్ఫటికమణి రచితమైన గొప్ప శిఖరము, దేవదేవుడైన పరమేష్ఠి యొక్క విమానముగా కలదు.
అక్కడ ఎల్లప్పుడు ఋషిసమూహముతో కూడిన దేవతలు, సిద్దులు దేవాధిదేవుడైన, త్రిశూలధారి అయిన, భూతపతియైన శివుని పూజను చేయుచుందురు.
ఆ శంకరుడు, మహాదేవుడు, పినాకమును ధరించినవాడై, భూతగణములచే పరివేష్టించబడి పార్వతితోగూడ ఎల్లప్పుడు అచ్చట ప్రకాశించు చుండును.
వేరుపరచబడిన అందమైన శిఖరములు కల కైలాసపర్వతము ఎక్కడకలదో, కోటి సంఖ్యలు గల యక్షులకు కుబేరునికీ గూడ నివాస మైనది యేదో;
అక్కడకూడ దేవదేవుడైన ఈశ్వరుని గొప్పమందిరము కలదు. అచ్చట పుణ్యవతీ, అందమైనది, నిర్మలములైన జలములు కలది యగు ఆకాశగంగ కలదు.
ఆ నది బహువిధములైన పద్మములచేత అలంకరించబడి, దేవతలు, రాక్షసులు, గంధర్వులు యక్షరాక్షసకిన్నరుల చేత;
ఎల్లకాలము సేవించబడు జలముకలదై, మిక్కిలిపుణ్యదాయకముగా, మిక్కిలి మనోహరమై ప్రకాశించును. అక్కడ బంగారు కమలములతో అలంకరింపబడిన ఇతర నదులు కూడ వందలకొలదిగో కలపు. ఆ నదుల తీరప్రదేశములో భగవంతుడైన పరమేష్టి యొక్క స్థానములు, దేవఋషుల సమూహముచే సేవింపబడునవి, నారాయణదేవునికి సంబంధించినవియును;
ఆ పర్వతముయొక్క శిఖరముపైన స్వచ్ఛమైన గొప్ప పారిజాతవనము కలదు. దానిలో మణులచే అలంకరించబడిన, విశాలమైన దేవేంద్రుని భవనము కలదు.
స్పటికమణుల స్తంభములతో కూడినది, బంగారు గోపురములతో ప్రకాశించుచున్నదిగా ఆ భవనముండును. అచ్చట దేవుడు, విశ్వస్వరూపుడు, ప్రభువు అగు విష్ణువుయొక్క పుణ్యమై మనోహరమైనది, సమస్త రత్నములతో శోభించుచున్నది అగు మందిరము కలదు. దానిలో లోకములకు ప్రభువు, శ్రీమంతుడు అగు నారాయణుడు లక్ష్మీదేవితో సహ నివసించుచుండును.
అతడు సర్వేశ్వరుడు, ఉత్తముడు, పూజింపబడువాడు, సనాతనుడు కూడ. అదేవిధముగా వసుధారమను ప్రదేశములో మణులచేత అలంకరించబడిన వస్తువులయొక్క పుణ్యకరమైన, రాక్షసులకు ఎదుర్కొన శక్యముకాని ఉత్తమస్థానము కలదు. రత్నధారమను పర్వతశ్రేష్ఠమునందు మహాత్ములైన సప్తర్షులయొక్క (12, 18) పుణ్యకరములైన ఏడు ఆశ్రమములు సిద్ధుల నివాసములతో కూడినవి కలవు. అక్కడ సువర్ణ నిర్మితము, సొలుగు ద్వారములు కలది, వజ్రములు నీలమణులు మొదలగువానీతో అలంకరించబడినది, మిక్కిలి పుణ్యదాయకము, అవ్యక్తమైన పుట్టుకకల
బ్రహ్మయొక్క నివాసస్థానమున్నది. అచ్చట దేవరులు, బ్రాహ్మణులు, సిద్ధులు, ఇతర బ్రహ్మరులు,
దేవతలకుదేవుడు, పితామహుడు, జన్మరహితుడు అగు బ్రహ్మను పూజించుచుందురు. ఎల్లప్పుడు అందరిచేత పూజింబడుచు దేవితో కూడ బ్రహ్మ శాంతులగు యోగులకు పరమ ప్రాప్యుడై, లోకముల హితముకోరకు నివసించును. ఆ పర్వతము యొక్క ఒక్క శిఖరము పైభాగములో, శ్రేష్ఠములైన పద్మములచే అలంకరింపబడినదిగా, నిర్మలమైన అమృతపు నీరు కలదీ, పుణ్యకరము, మంచి పరిమళముతో నిండిన గోప్ప కొలను కలదు. అక్కడ యోగీశ్వరుల చేత సేవింపబడుచున్న, పుణ్యమైన జైగీషవ్యాశ్రమముకలదు.
అచ్చట భగవంతుడగు జైగీషవ్యుడు శిష్యులందరితో కూడి ఎల్లప్పుడు నివసించుచుండును. ఆ శిష్యులు దోషములు తొలగినపోరు, ఉత్తములు, బ్రహ్మజ్ఞానము కలవారు, మహాత్ములు నైయుండిరి.
శంఖుడు, మనోహరుడు, కౌశికుడు, కృష్ణుడు, సుమనసుడు, వేదవాదుడు అనువారు ఆమహాత్ముని శిష్యులు. ఆయన అనుగ్రహము వలన
సమస్తయోగములందాసక్తులై, శాంతస్వభావులై, భస్మముచేత లేపనము చేయబడిన శరీరములు కలవారై, వేదాంతవిద్య యందు నిష్ఠకల గొప్ప ఆచార్యులు సేవించుచుందురు.
వారందరిని అనుగ్రహించుట కొరకు మహేశ్వరుడు దేవితోకూడి శాంతమైన మనస్సుకల ఆయోగులకు సాన్నిధ్యముననుగ్రహించి వసించును.
పర్వతశ్రేష్ఠమైన దానియందు అనేకములైన ఆశ్రమములు కలవు. యోగనిష్టులగు మునులకు సంబంధించినవి. సరస్సులు, సెలయేర్లు కూడకలవు.
ఆ యాశ్రమములందు యోగమునందు తత్పరులు, జపనిష్టులు, ఇంద్రియముల జయించినవారు, పరబ్రహ్మమునందు మనస్సు మగ్నము చేసినవారు, జ్ఞానతత్పరులు అగు బ్రాహ్మణులు సంతోషముగా గడుపుదురు.
ఆత్మయందాత్మను నిలిపి శీఖాగ్రభాగములో నిలిచియున్న దేవుని, ఎవనిచేత ఈవిశ్వమంతయు వ్యాప్తమైయున్నదో ఆయీశ్వరుని ధ్యానింతురు. వేయిసూర్యులతో సమానకాంతిగల సుమేఘమను పోసవస్థానములో భగవంతుడగు ఇంద్రుడు శచీదేవితోసహ నివసించును.
గజశైలమునందు మణుల తోరణముతో కూడిన దుర్గాదేవి భవనమున్నది. అక్కడ సాక్షాత్తు మహేశ్వరియగు దుర్గాదేవి నివసించును.
ఆమే వివిధములైన శక్తి భేదములచేత అన్నివైపుల సేవింపబడుచున్నదై, యోగమను అమృతమును పానము చేసి ఈశ్వర సంబంధి అమృతమును పొంది నీలిచియున్నది.
అనేకములైన ధాతువులతో ప్రకాశించుచున్న సునీల పర్వతము యొక్క శిఖరమునందు రాక్షసుల పట్టణములు, కొలనులు వందల కొలదిగా కలవు.
బ్రాహ్మణులారా శతశృంగమను పెద్ద పర్వతముపైన, స్ఫటికమణి నిర్మితములైన స్తంభములతో కూడిన, గొప్ప బలముకల యక్షుల యొక్క వంద పట్టణములు కలవు.
శ్వేతోదరపర్వతము యొక్క శృంగముపై, మహాత్ముడైన గరుడునియొక్క ప్రాకారములతో, గోపురములతో కూడిన, మణితోరణములతో అలంకరింపబడిన పురమున్నది.
అక్కడ శ్రీమంతుడగు గరుడుడు, సాక్షాత్తు రెండవ విష్ణువువలె, అపరంజ్యోతిని ధ్యానించి, నాశరహితుడైన బ్రహ్మను ఆత్మయందు ధ్యానించుచు వసించును.
మునిశ్రేష్ఠులారా శ్రీశృంగమునందు అన్ని రత్నములతో సంపన్నమైన, బంగారుమయమైన, మణితోరణములతో కూడిన లక్ష్మీదేవి యొక్క మరియొక భవనము కలదు.
అక్కడ విష్ణువునకు అతిప్రియమైన, పరమశక్తిరూపమైన, అనంతమైనవీభవముకల లక్ష్మీదేవి జగత్తును సంమోహింపజేయుటయందాసక్తి కలదై, దేవతలు, గంధర్వులు, సిద్దులు మరియు చారణులచేత పూజింపబడుచు, లోకమునకు కారణభూతురాలైన తనశక్తియొక్క కిరణములచే ప్రకాశించునదై నివసించియుండును.
అక్కడనే దేవదేవుడైన విష్ణువుయొక్క గొప్పమందిరమున్నది. విచిత్రములైన పద్మముల కాశ్రయములైన నాలుగు సరస్సులు కూడ కలవు.
అట్లే సహస్రశిఖరపర్వతముపై విద్యాధరుల ఎనిమిది పట్టణములు కలవు. ఆ పట్టణ సమూహము మణి సోపానములతో కూడి కొలనులతో ప్రకాశించునదై యుండును.
నిర్మలమైన జలముతోకూడిన నదులు, విచిత్రములైన నల్లకలువలకాశ్రయములై యుండును. ఒక కర్ణికారవనము కలదు. అక్కడ శంకరుడు స్వయముగా నివసించును.
పారిజాతమను పర్వతముపై మహాలక్ష్మియొక్క మంగళకరమైన పట్టణముకలదు. అది అందములైన ప్రాసాదములతో కూడి ఘంటలు, చామరములచేత అలంకరింపబడినదై యుండును.
ఇంకను, నోట్యముచేయు అప్సరసల సమూహముతో అన్నివైపుల ప్రకాశించునది, మృదంగము, పణవము అను వాద్యములతో ధ్వనించునది, వేణువు, వీణ యొక్క నాదములతో కూడినదిగాను ఉండును. గంధర్వులు, కిన్నరులతోనిండి, సిద్దులతో కూడి, గొప్ప ప్రాసాదములతో నీండినదై మిక్కిలి ప్రకాశవంతముగా నుండును.
ఆ పురము మహాగణేశ్వరులతో కూడి, ధర్మాత్ములకు మిక్కిలి చూడదగినదై యొప్పును. ఆ లక్ష్మీదేవి అక్కడ ఎల్లప్పుడు యోగపరాయణురాలై నీవసించును.
ఆ మహాలక్ష్మి మహాదేవిగా, త్రిశూలమును ధరించునదిగా, మూడు కన్నులు కలదై, అన్ని శక్తుల సమూహముతో నిండియున్నదై తన్మయ రూపముతో ప్రకాశించును. .
సుపార్శ్వ పర్వతమున కుత్తర భాగములో సరస్వతీయొక్క ఉత్తమమైన పురము కలదు, అక్కడ సిద్ధులు, బ్రహ్మవాదులైన మునులు దర్శింతురు.
మునీశ్వరులారా సిద్ధులచే సేవింపబడునవి, దేవతలకు అనుభవ యోగ్యములు అయిన కొలనులు అక్కడ కలవు. పాండురగిరి యొక్క శిఖరము మీద విచిత్రములైన వృక్షములతో వ్యాపించియున్నది, దేవతాస్త్రీలతో ఆవరింపబడియున్న గంధర్వుల పట్టణ శతము కలదు. అక్కడ ఎల్లప్పుడు మదముచే ప్రేరితులై పురుషులు మరియు స్త్రీలు సుఖానుభవమునందాసక్తి కలవారై, సంతోషపూర్ణులై, విలాసములతో విహరించు చుందురు. అంజన పర్వతముయొక్క శిఖరము మీద శ్రేష్టమైన నారీపురము కలదు.
అక్కడ శృంగార క్రీడలయందాసక్తికల రంభమొదలగు అప్సరసలు నివసింతురు. అక్కడికి వారీ సమాగమమును కోరువారై చిత్రసేనుడు మొదలగు గంధర్వరాజులు ఎల్లప్పుడు వచ్చుచుందురు.
ఆ పట్టణము సమస్తములైన రత్నములతో సంపన్నమై, అనేక జలాశయములతో కూడి యుండును. విప్రులారా కౌముద పర్వతము నందు అనేకములగు పురములు కలవు.
అవీ రజోగుణము తొలగిపోయి, ఈశ్వరుని యందు మనస్సులగ్నమైన రుద్రగణములకు చెందినవి. ఆపట్టణములయందు గొప్పయోగము కలవారు, మహేశ్వరునకు ఆంతరంగికులైన అనుచరులు అగు రుద్రగణములవారు, ఈశ్వరసంబంధి స్థానమునధిరోహించి తేజోరూపమైన పురము నాశ్రయించి ఉందురు. పింజరమను పర్వతము యొక్క శిఖరముపై గణేశుల యొక్క మూడు పట్టణములు కలవు.
నందీశ్వరుని యొక్క కపిలధేనువు అక్కడ నివసించును. ఆనందీశ్వరుడు గొప్ప బుద్ధికలవాడు మరియు జారుధిపర్వతము యొక్క శృంగమునందు, దేవదేవుడు, గొప్ప ధీమంతుడు, అమితమైన బలము కలిగిన సూర్యునియొక్క ప్రకాశవంతము, పుణ్యకరము అగు నివాసస్థానము కలదు. దానీకుత్తర దిగ్భాగములో సర్వశ్రేష్టమైన చంద్రుని స్థానము కలదు.
అచ్చట సుందరమైన రూపము కలవాడు, పూజనీయుడు, చల్లని కిరణములు కలవాడు అగు చంద్రుడు నివసించును. మహరులారా మరియొకచోట హంసశైలము నందు దివ్యమైన, వేయియోజనముల పొడవుకలది, బంగారము, మణులతో చేయబడిన తోరణములు కలది అగు భవనము కలదు. అక్కడ భగవంతుడగు బ్రహ్మ, సిద్దుల సమూహములచేత కొనియాడబడుచు వెలసియుండును.
విశ్వాత్మకుడగు ఆ బ్రహ్మ, విష్ణుదేవుడు మొదలగువారితో కూడి, సావిత్రీ దేవితో సహా అక్కడ వసించి యుండును. దానికి దక్షిణ దిక్కున సిద్ధులయొక్క శ్రేష్ఠమైన పట్టణముండును.
అక్కడ సనందనుడు మొదలగు మునిశ్రేష్ఠులు నివసించి యుందురు. పంచశైలము యొక్క శిఖరముమీద దానవులయొక్క మూడు పట్టణములు కలవు.
వానికి కొద్దిదూరములో బుద్ధిమంతుడు, రాక్షసులకు గురువు అగు శుక్రాచార్యునియొక్క నివాసము కలదు. సుగంధపర్వతముయొక్క శృంగముమీద నదులతో ప్రకాశించుచున్నట్టి, కర్డమమునీ యొక్క పుణ్యవంతమైన ఆశ్రమస్థానము కలదు.
అక్కడ భగవానుడగు కర్దమఋషి నివసించును. దానికి తూర్పుదిక్కున కొంచెము దక్షిణభాగము నాశ్రయించిన ప్రదేశములో పూజ్యుడైన, బ్రహ్మవేత్తలలో ఉత్తముడైన సనత్కుమారుడు నివసించును. ఓ మునీంద్రులారా ఈ అన్ని పర్వతములయందును, ఇంకను ఇతరములయందును, (59, 60) కొలనులు, నిర్మలములైన నదులు, దేవతల యొక్క మందిరములును, పుణ్యదాయకములు, మునులచేత ప్రతిష్ఠించబడిన సిద్ధ లింగములును కలవు.
ఆ మందిరములను శీఘ్రముగా లెక్కించుటకు శక్యముకాదు. ఇంతవరకు జంబూద్వీపముయొక్క విస్తారమును గూర్చి సంక్షేపముగా నాచే తెలుపబడినది. ఇంతకంటే విపులముగా నూరు సంవత్సరాల కాలములో గూడ నాకు చెప్పుటకు శక్తి చాలదు.
శ్రీ కూర్మపురాణములో జంబూద్వీప వర్ణనమను నలుబది యెనిమిదవ అధ్యాయము సమాప్తము.
