కూర్మ మహా పురాణము

Table of Contents

35వ అధ్యాయము

 సూతమహర్షి పలికెను.

పరమేష్టియగు రుద్రుని క్షేత్రము రుద్రకోటియనునది పవిత్రమైనది విస్తారమైనది మూడు లోకములలో ప్రసిద్ధిగాంచినది. పూర్వము పరమ పుణ్యకాలమున దేవదేవుడగు శంకరుని దర్శించతలచి కోటిమంది బ్రహ్మరులు పరమనిష్టాగరిష్ఠులు ఆదేశమునకువచ్చిరి. పినాకియగు గిరీశునినేను ముందు చూచెదను. నేను ముందు చూచెదను అని వారిలో పెద్ద వివాదము చేలరేగెను. వారి ఉత్తమ భక్తిని చూచిన రుద్రుడు కోటిరూపములను దాల్చెను. అందువలన అక్షేత్రమునకు రుద్రకోటియను పేరువచ్చినది. మహాదేవుడు గిరీశుడు పార్వతీనాధుడగు శివుని చూచి వీరందరు ఆనందముతో నిండిన బుద్దీకలవారైరి. ఆద్యస్తములు లేని మహాదేవుని నేను ముందు చూచితినీ అని భక్తితో వారందరు రుద్రుని యందే మనసును నిలిపిరి. అంతట పరమ పదమును గోరుచున్న ఆ ఋషులందరు అచటనే ఆకాశమున విశుద్దమగు జ్యోతిని దర్శించిరి. ఈ క్షేత్రము ఈశ్వరుడు నివసించినదేశము, శుభప్రదము, పరమపవిత్రము, ఇచట రుద్రుని దర్శించి చక్కగా పూజించి రుద్రసామీప్యమును పొందును.

 మధువన మను పేరుకల మరియొక ఉత్తమతీర్థము కలదు. ఆ తీర్థమును సేవించినవాడు ఇంద్రుని అర్ధాసనమును పొందును. పుప్పునగరి యను ఇంకొక పుణ్యతమక్షేత్రము కలదు. ఇచటికి వెళ్ళీ పితృదేవతలను పూజించి నూరుతరములను తరింపచేయును.

లోకమునకు సుప్రసిద్ధమగు మరియొక క్షేత్రము కొలంజరమను పేరుకలది కలదు. ఇచట మహేశ్వరుడగు రుద్రుడు భక్తప్రియుడు కాలుని జీర్ణించుకొనెను, పూర్వము శ్వేతుడను రాజర్షి ప్రవరుడు శివభక్తుడు శంకరునే ధ్యానించుచు నమస్కరించుచు శూలినిపూజించుచుండెను. యథావిధిగా లింగమును స్థాపించి భక్తియోగ పురస్సరముగా శివునియందే మనసు నుంచి సర్వకాలములందు రుద్రుని జపించుచుండెను. అంతట అచటికీ తేజోరూపుడగు కోలుడు భయంకరమగు శూలమును ధరించి శ్వేత రాజరిని తీసుకొని పోవుటకు వచ్చెను.

కాలకరుడు, క్రూరుడు, భయంకరుడు, తీక్ష తేజము కలవాడు, శూలహస్తుడై వచ్చిన కాలుని చూచి భయము చెంది రెండు చేతులతో శివలింగమును స్పృశించుచు శతరుద్రీయమును జపించుచు శిరసు వంచి రుద్రునికి నమస్కరించెను. ఇట్లు జపించుచు రుద్రునికీ నమస్కరించుచున్న రాజును కృతాంతుడు ముందు నిలిచి నవ్వుచున్నవానీవలె రమ్ము రమ్ము అని పలికెను. అంతట భయావిష్టుడగు రుద్రభక్తుడగు ఆరాజు భయముతో శంకరుని పూజించు వ్యక్తిని విడిచి ఇతరులను వధించుము అని పలికెను. ఇట్లు పలికిన రాజును భయపడినవానిని చూచీ కాలుడు ఇట్లు పలికెను. రుద్రార్చన పరుడు కాని ఇతరుడు కానీ సోవశమున నుండని వాడెవ్వడు? ఇట్లు పలికి లోకసంహారకుడగు హాలుడు ఆరాజును పాశములతో బంధించెను. రాజుకూడా శతరుద్రీయమును జపించుచుండెను.

ఇంతలో శ్వేతరాజర్షి సకల జీవేశ్వరుడు మహాదేవుడగు రుద్రుని పరిశుద్ధము, ప్రకాశించునది, సనాతనము, జ్వాలా మాలాసంవృతము అగు తేజోరాశీని సకల జగత్తును వ్యాపించి యున్నదానీని ఆకాశమున ప్రాదుర్భవించి నీలచిన దానిని చూచెను. ఆతేజోరాశి మధ్యలో సువర్ణవర్ణుడు చంద్రలేఖతో ప్రకాశించువాడు దేవితో గూడుకొనినవాడు అగు పురుషునీ చూచెను. నా ప్రభువు వచ్చుచున్నాడని తలచేనుకూడా. ఇట్లు వచ్చుచున్న వాడిని దేవేరితో కూడియున్నవానిని దగ్గరలో రాజర్షి అఖిలజగన్నాధుని చూచి భయము తొలగినవాడాయెను. అయిననూ కాలుడు కూడా భయపడక రాజును గొనిపోవుటకు వచ్చెను. భయంకరములగు కర్మలనాచరించుపోడు భూతపతీ సనాతనుడు అగు రుద్రదేవుడు కోలుని చూచి నా భక్తుని నన్నే స్మరించుచున్నవానిని ఈ ఒక్కనిని నాకిమ్మని పలికెను. గోపతియగు రుద్రుని మాటలు విని ఉగ్రస్వభావరూపుడగు కాలుడు తన స్వభావమునకు గర్వించుచు శివభక్తుని పాశములతో బంధించి కోపముతో రుద్రునివైపే వేగముగా వచ్చుచుండెను. విశ్వమాయావిధిని తెలిసిన శంకరుడు పార్వతిని చూచీ తనవైపే వచ్చుచున్న కొలుని చూచి నీరాదరణతో వామపాదముతో తన్ని శ్వేతుడు చూచుచుండగా చంపెను. ఇట్లు మహేశుని పాదముతో కొట్టబడిన కాలుడు మరణించెను. పార్వతితో కూడియున్న పినాకపాణి శ్వేతునిరక్షణతో ప్రసన్నుడాయెను. అవ్యయుడు అంబతో కూడియున్న శంకరుని చూచిన శ్వేతుడను రాజర్షి ప్రసన్నమనస్కుడై నమస్కరించెను.

జగద్ధేతువునకు, భవునకు, జగత్సష్టయగు హరునకు నమస్కారము జ్ఞానరూపుడగు శివునకు అప వర్గదాయికి నమస్కారము. మహావిభూతి యగు నీకు ముమ్మారు నమస్కారము. అఖండరూపునకు, నరాధిపునకు, గణాధిపునకు, ప్రపన్నదుఃఖనాశనునకు నమస్కారము. అనాదినిత్య భూతికి వరాహశృంగధారికి నమస్కారము. వృషధ్వజునికి కపాలమాలికి నమస్కారము. మహానటునకు వృషధ్వజునకు నమస్కారము.

ఇట్లు నమస్కరించుచున్న శ్వేతరాజర్షిని అనుగ్రహించిన శంకరుడు తన గాణపత్యపదమును సారూప్యమును ప్రసాదించెను. పార్వతీతో పార్పదులతో రాజపుంగవునితో కలిసి హరుడు మునీంద్రులతో సిద్దులతో నమస్కరించబడుచు క్షణములో అదృశ్యమాయెను. ఇట్లు రుద్రునిచే వధింపబడిన కాలునిచూచి లోకనాధుడగు పితామహుడు ఇతని జీవించనిమ్మని వరమును కోరెను. పృషధ్వజా ఇందులో కాలుని దోషము కొంచెము కూడా లేదు. అతనిని జీవుల ప్రాణములు గొనిపోవుపనిలో నియమించినదిమీరే ఇట్లు పలికిన బ్రహ్మపలుకులను వీనిన శంకరుడు అట్లే కానిమ్మని పలికెను. అట్లే కాలుడు కూడా బ్రతికెను. ఇది కాలంజర తీర్థ ప్రభావము చెప్పబడినది. ఈ తీర్థమునకు వెళ్ళి మహాదేవుని పూజించినవాడు గాణపత్యమును పొందును.

ఇది శ్రీ కూర్మపురాణమున షట్సాహస్రసంహితలో ఉపరి విభాగమున 35వ అధ్యాయము.