కూర్మ మహా పురాణము

Table of Contents

12 - అథదేవీమాహాత్మ్యమ్

ఈ విధముగా కూర్మ రూపి అయిన భగవంతుని చేత చెప్పబడిన విషయమును విని మునులు నమస్కరించి మరల ఆయనను ఇట్లు ప్రశ్నించిరి

“శంకరుని సగము శరీరమును వహించిన భగవతి, హిమవంతుని పుత్రిక, సతీదేవి, శివరూపిణి అగు ఈ దేవి ఎవరు? ఈ విషయమును ఉన్నది ఉన్నట్లుగా చెప్పుము” అని

ఆ మునుల యొక్క మాటను వినీ పురుషోత్తముడైన విష్ణువు, గొప్ప యోగీశ్వరుడు కనుక తన పరమపదమును గూర్చి ధ్యానించీ వారికిట్లు బదులు పలికెను.

పూర్వము బ్రహ్మదేవునిచేత మిక్కిలి మనోహరమైన మేరు పర్వత శిఖర భాగమున చెప్పబడిన యీ విజ్ఞానము రహస్యమైనది. ప్రత్యేకముగా దాచదగినది.

సాంఖ్య యోగులకు ముఖ్యమైన సాంఖ్య తత్త్వము, శ్రేష్ఠమైన బ్రహ్మ విజ్ఞానము, సంసారమను సముద్రములో మునిగి పోవుచున్న ప్రాణులను కాపాడు ఏకైక సాధనమైనది ఇది.

మహేశ్వర సంబంధిని అగు ఏ శక్తి కలదో అది జ్ఞానరూపమైనది, మిక్కిలి అనురాగము కలది, ఆకాశ సంజ్ఞకలది, అత్యున్నత గమ్యస్థానము, అగు ఈ హైమవతి అని పేర్కొనబడినది

శివస్వరూపిణీ, అంతట వ్యాపించి యున్నది, నాశనము లేనిది, త్రిగుణముల కతీతమైనది, మిక్కిలి విభాగ రహిత, ఏక రూప, అనేక విభాగముల యందుండునది, జ్ఞాన స్వరూప, మిక్కిలి కోరికలు కలది

భేద రహితమైన తత్వము నందున్నది, సాటియైన మరియొకటి లేనిది, స్వభావ సిద్ధమైనది, పరతత్త్వ తేజస్సుతో తన్మూలమైన, సూర్యుని కాంతి వలె స్వచ్ఛమైన ప్రభారూపయైనది

ఒకటైన మహేశ్వర సంబంధిని శక్తి, అనేకములైన ఉపాధి భేదముల వలన ఆ పరమేశ్వర సన్నిధిలో, పర అవరరూపములతో క్రీడించుచుండును

ఆ యీ మహేశ్వర శక్తి సమస్తమును చేయుచున్నది. ఈ ప్రపంచము ఆమె చే నిర్మితము. ఈశ్వరునకు కార్యభావము కాని, కారణ భావము కాని లేదని పండితులు చెప్పుదురు.

ఆ దేవి యొక్క నాలుగు శక్తులు ఆధార భేదమును బట్టి ఆయా స్వరూపములతో ఉన్నవి. మునిశ్రేష్ఠులారా! వానిని గూర్చి వినుడు.

అవి శాంతి, విద్య, ప్రతిష్ఠ, నివృత్తి అను పేర్లు కలిగి ఉన్నవి. ఈ నాలుగు శక్తులతో కూడి యున్నందుననే పరమేశ్వరుడు చతుర్వ్యూహుడు అని పిలువబడుచున్నాడు.

ఈ పరాశక్తి చేత భగవంతుడు తనను తాను నిలుపుకొనుచున్నాడు. నాలుగు మూర్తులు ధరించి మహేశ్వరుడు నాలుగు వేదముల యందు నిలిచియున్నాడు.

ఈ దేవి యొక్క ఐశ్వర్యము అనాదికాలమునుండి సిద్ధమై యున్నది. ఇది సాటి లేని గొప్పతనము కలది. పరమాత్మయగు రుద్రుని సంబంధము వలన ఈదేవి అంతము లేనిది.

ఆ యీ దేవి సమస్త భూతములను ప్రవర్తింప చేయునది, సర్వేశ్వరి అయి ఉన్నది. పూజనీయమైన కాలరూపుడు హరి అని, ప్రాణరూపుడు మహేశ్వరుడు అని చెప్పబడుచున్నాడు.

ఈ సమస్త ప్రపంచము అతనియందు అడ్డముగా, నిలువుగా విస్తరించబడినది. అతడు కాలాగ్ని, హరుడు, దేవుడు అని వేదవాదులచేత కొనియాడబడుతున్నాడు.

కాలము భూతములను సృజించును. కొలము ప్రజలను సంహరించును కూడా. లోకములో అన్నియు కాలమునకు అధీనములైనవి. కాలము దేనికినీ అధీనము కాదు

ప్రధానతత్త్వము, పురుషుడు, మహత్తత్త్వము, అహంకారము, ఇతరములైన తత్త్వములు కూడా యోగియగు పరమాత్మ చేత కాలము ద్వారా పరస్పరము సమన్వయము చెందినవి

ఆ పరమపురుషుని యొక్క శక్తి, సమస్త లోక స్వరూప, మాయ అను పేరుతో ప్రసిద్ధమైనది.

మాయాత్మిక, సర్వాకారములు కలది, అతిపురాతనమైనది అగు నీ శక్తి పరమేశ్వరుని విశ్వరూపమును ఎల్లప్పుడు ప్రకాశింప జేయగలదు.

ఆ దేవుని యొక్క మరికొన్ని శక్తులు ముఖ్యములైనవి జ్ఞానశక్తి, క్రియాశక్తి, ప్రాణశక్తి అని మూడు నిర్మింపబడినవి.

ఓ బ్రాహ్మణశ్రేష్ఠులారా! ఆ శక్తులన్నింటికి వానిని ధరించువారు కూడా సృజించబడిరి. అవి యన్నియు మాయచేతనే కల్పితములు. ఆ మాయకు ఆదీ లేదు, అంతము కూడా లేదు.

ఆ మాయ సమస్త శక్తుల స్వరూపము కలది, వారించుటకు శక్యము కానిది, నాశము లేనిదైయున్నది. కాలము మాయ కలది, సర్వ శక్తులకు ప్రభువు - ఆ కాలమును చేయువాడు పరమాత్మ.

సమస్తమును కాలము చేయుచున్నది. కాలమే అన్నిటిని నశింప చేయుచున్నది. కాలము ప్రపంచమును నిలుపు చున్నది. ఈ విశ్వమంతయు కాలమునకు వశమై యున్నది.

దేవతలకు అధిపతియైన నాశము లేని వాడు, సమస్తమునకు ప్రభువు, కాలస్వరూపుడు, ప్రభువు, పరమేష్ఠియు నగు శివుని యొక్క సాన్నీధ్యము ను పొంది;

ప్రధానతత్వము, పురుషుడు, మాయ అనునవి మూడు ముఖ్యతత్త్వములు. ఆ మాయ ఏకరూప, అన్నిటిని పొందినది, అంతము లేనిది, కేవలరూప, భేద రహిత, మంగళరూప అయినది

ఒకటే శక్తి శివ, శక్తి మంతుడు శివుడు ఒక్కడే అనీ చెప్పబడుచున్నది. ఇతరములైన శక్తులు, శక్తి మంతులు సర్వశక్తి నుండి జనించినవే.

శక్తికి, శక్తి మత్తునకు పరమార్ధ రూపములో భేదమును చెప్పుదురు. తత్త్వమును విచారించు యోగులు మాత్రము ఆ రెండింటిక భేదమును చూచుచున్నారు.

శక్తులు హిమవత్పుత్రిక యగు పార్వతి రూపములు, శక్తిమంతుడు శంకరుడు. ఈ విశేషము బ్రహ్మవేత్తల చేత పురాణములందు చెప్పుబడుచున్నది.

మహేశ్వరుని విషయమున పతివ్రత, విశ్వమునకు ప్రభ్వి అగుపార్వతీ దేవి భోగాను భవమునకు యోగ్యురాలు. కపర్దమను జటాజూటము కలవాడు, నీలలోహితుడునగు భగవంతుడగు శంకరుడు అనుభవించువాడు (భోక్త) అని చెప్పబడినది.

మన్మథుని సంహరించిన వాడు, విశ్వమునకు ప్రభువు అగు శంకర దేవుడు మననము చేయువాడు, అతని భార్య పార్వతి, బుద్ధి రూపిణి, ఆలోచన వలన తెలిసికొనదగిన దని చెప్పబడుచున్నదీ

ఓ బ్రాహ్మణులారా! శక్తి, శక్తిమంతము అనువాని పుట్టుకకుసంబంధించిన యీ విషయమంతయు అన్ని వేదముల యందు ప్రతిపాదింపబడినదై, తత్త్వమును దర్శించిన మునులచే వివరింపబడినది.

దివ్యము, ఉత్తమము అయిన ఈ దేవి యొక్క మాహాత్మము బ్రహ్మ వాదులైన ఋషుల చేత వేదాంత చర్చల యందు నిశ్చయింప బడి చక్కగా నిరూపించబడినది.

అద్వితీయము, అంతట ఉన్నది, సూక్ష్మరూపము, మూలస్థానీయము, చలనము లేనిది, స్థిరమైనది యునగు దేవి యొక్క సర్వోన్నతస్థానమును యోగులు చూడగల్లుచున్నారు.

ఆనందరూపము, నాశము లేనిది, కేవలము, భేదరహితము, పరబ్రహ్మరూపము అగు మహాదేవి యొక్క ఉన్నత పదమును యోగులు దర్శింతురు

పరము కంటే మిక్కిలి పరమైనతత్త్వము, శాశ్వతమైనది, మంగళరూపము, నాశరహితము, అంతము లేని ప్రకృతి యందు లీనమైనది దేవి యొక్క ఆ పరమపదము.

దేవి యొక్క ఆ పరమపదము శుభకరము, మాలిన్యము లేనిది, నిర్మలమైనది, గుణరహితము, భేదశూన్యము, ఆత్మసాక్షాత్కారమునకు విషయమైనదైయున్నది.

ఆ యీ దేవీ పరమానందమును పొందు వారికి ధాత్రీ, విధాత్రి కూడా అగుచున్నది. ఈశ్వరుని సంబంధము వలన సమస్తములైన సంసార సంబంధతాపములను నశింప జేయుచున్నది.

అందువలన మోక్షమును పొందగోరువాడు పరమేశ్వరియగు పార్వతిని, సర్వప్రాణులకు ఆత్మస్వరూపురాలు, శివస్వరూపిణి అగు నామెను ఆశ్రయించవలేను.

హిమవంతుడు మిక్కిలి కష్టసాధ్యమైన తపస్సు చేసి, పార్వతిని పుత్రికగా పొంది, భార్యతో కూడిన వాడై పరమేశ్వరియైన ఆమెను శరణము పొందెను.

తన ఇష్టపూర్వకముగా జన్మించుచున్న, శ్రేష్ఠమైన ముఖముకల పుత్రికను చూచి, హిమవంతుని భార్యమైనాదేవి పర్వతరాజుతో ఇట్లనెను.

మేనక పలికెను:

రాజూ! కమలముతో సమానమైన ముఖముకల యీ బాలికను చూడుము. మనయొక్క తపస్సు చేత, సమస్త ప్రాణుల యొక్క మేలు కొరకు గూడ ఈమె జన్మించినది

ఆ హిమవంతుడు ఉదయించుచున్న సూర్యునితో సమానముగా నున్న, జటాజూటము కల, నాలుగు ముఖములు కలిగిన, మూడు కన్నులు కల, మిక్కిలి అనురాగము కలిగిస, ఎనిమిది చేతులు కలిగి విశాలమైన కన్నులు కలదై, చంద్ర కళ అలంకారముగా ధరించిన, గుణ రహిత, గుణ యుక్తయు, సత్తు అసత్తు అను విభాగము లేనటువంటీ ఆ దేవిని చూచి, శిరస్సుతో భూమిపై వంగి నమస్కరించి, ఆమె తేజస్సుతో మిక్కిలి కలత చెందినవాడై, భయపడి ఆమెకు దోసిలి జోడించి పరమేశ్వరినీ గూర్చీ యిట్లు పలికెను.

విశాలములైన కన్నులు కల ఓ దేవీ! నీవెవరవు? చంద్రునీ భాగమైన కళతో అలంకరింపబడిన దానా! వత్సా! నీవెవరో నేనెఱుగను. అడుగుచున్న నాకు యథార్థమును తెలుపుము.

పర్వత రాజగు హిమవంతుని వాక్యమును విని, అప్పుడా పరమేశ్వరి, యోగులకు అభయము నిచ్చు నట్టిది, పర్వత రాజునుద్దేశించి ఇట్లు చెప్పెను.

సన్ను మహేశ్వరుని ఆశ్రయించి యుండు పరమశక్తిగా తెలిసికొనుము. ఏ నన్ను, మోక్షమును కాంక్షించు వారు, ఇతరాపేక్షలేనిదానిగా, "నాశరహితురాలిగా, ముఖ్యురాలిగా దర్శింతురో, అట్టిదానిగా గుర్తింపుము

నేను లోకములోని అన్ని భాషములకు ఆత్మయగుదానను, అన్ని విధముల శివరూపను, శాశ్వతమైన ఐశ్వర్యము, విజ్ఞానము ఆకారముగా కలదానను, సమస్తమును ప్రవర్తింపజేయుదానను.

అంతములేని, అనంతమహిమలు కలదానను, సంసారమను సముద్రమును దాటించుదానను. నీకు దివ్యమైన నేత్రమునిత్తును. నా యొక్క ఈశ్వర సంబంధీ రూపమును దానితో చూడుము.

ఇంత మాత్రము పలికి, హిమవంతునకు స్వయముగా విజ్ఞానమును కలిగించి, దివ్యమైన, పరమేశ్వర సంబంధమైన, తన రూపమును చూపించేను.

ఆదివ్యరూపము కోటి సూర్యుల సమాన తేజము కలది, వికారము లేనిది, వేల కొలది జ్వాలల పరంపరతో కూడినది, వందల కొలది కాలనాళికలతో పోల్చదగినదిగా నుండెను.

దంష్టలతో భయంకరమై, ఎదుర్కొన శక్యము కానీది, జటల సమూహముచే అలంకరించబడినది, కిరీటము కలది, చేతి యందు గదను ధరించినది, శంఖచక్రములను ధరించినదీగా నుండెను.

త్రిశూలమును చేతియందు ధరించినది, భయంకరమైన రూపము కలిగి భీతి గొలుపు చున్నది, ప్రశాంతముగా నున్నది, ప్రసన్నమైన ముఖము కలదీ, అంతులేని ఆశ్చర్యములతో కూడి యుండెను.

చంద్ర కళ చిహ్నముగా ధరించినది, కోటి చంద్రులతో సమానమైన కాంతి కలది, కిరీటము కలిగి గదను చేతి యందు ధరించి నది, కాలి యందెలతో ప్రకాశించుచున్నది ఆ రూపము

దివ్యములైన పుష్పహారములను, వస్త్రములను ధరించినది, శ్రేష్టమైన చందనము లేపనము చేయబడినది, శంఖచక్రములను ధరించినది, కోరదగినది, మూడు నేత్రములు కలది, చర్మము వస్త్రముగా కలిగి యున్నది ఆ రూపము.

అండములో నున్నది, అండమునకు వెలుపల నుండునది, బయట, లోపల కూడా నుండునది, ఉత్తమమైనది, అన్ని శక్తులతో కూడినది, నిర్మలమైనది, అన్ని ఆకారములు కలది, అతిపురాతనమైనది

బ్రహ్మ, ఇంద్రుడు, ఉపేంద్రుడు, యోగీంద్రులు మొదలగు వారి చేత పూజింపబడు పాదకమలములు కలది, అన్నీ వైపుల చేతులు, కాళ్లు వ్యాపించి యుండునది, అంతట కన్నులు, తలలు, ముఖములు కలది

సమస్తము నావరించి ఉన్నటువంటి పరమేశ్వరిని హిమవంతుడు చూచెను. ఆ దేవి యొక్క మహేశ్వర సంబంధియగు శ్రేష్ఠమైన ఇటువంటి, రూపమును చూచి, భయముతో కూడుకున్నవాడై ఆ రాజు సంతోషించిన మనస్సు కలవాడై ఆత్మను ఆత్మ యందు నిలుపుకొని ఓం కారమును స్మరించుచు, ఒక వేయి ఎనిమిది నామములతో పరమేశ్వరిని ఇట్లు స్తోత్రము చేసెను.

శివ, ఉమ, ఉత్తమమైన శక్తి, అంతము లేనిది, విభాగములు లేనిది, నిర్మలయైనది.

శాంతురాలు, మహేశ్వర సంబంధిని, నిత్యురాలు, శాశ్వత మైనది, ఉత్తమము, నాశరహితమైనది, విచారించుటకు శక్యము కానిది, కేవల రూపిణి, చివరిది కానిది, శీవాత్మకురాలు, పరమాత్మ రూపిణి, మొదలు లేనిది, నాశము లేనిది, స్వచ్చమైనది, దేవతల కాత్మయైనది, అన్నిటిని చెందినది, చంచలమైనదీ, అద్వితీయమైనది, అనేక విభాగములు కలది, మాయకతీతమైనది, మిక్కిలి నిర్మలమైనది.

గొప్ప మహేశ్వరి, సత్యస్వరూప, మహాదేవి, మాలిన్యము లేనిది, దీగ్రూపము, అన్నిటియందు వ్యాపించియున్నది, జ్ఞానశక్తి రూప, మిక్కిలి ప్రీతి భావము కలది

సంతోషమయి, అన్నిటి నాత్మగా కలదీ, విద్యారూపిణి, తేజోరూపము కలదీ, అమృత స్వరూప, అక్షర, శాంతి రూపిణి, అందరికి ప్రతిష్టాహేతువు, నివృత్తి కారిణి, అమృతమునిచ్చునది,

ఆకాశస్వరూప, ఆకాశమునందులయించునది, ఆకాశమే ఆధారముగా కలది, నాశనము లేనిది, మరణరహిత, ఆద్యంతములు లేనిది, సార్ధకమైనది, కారణరూపురాలు, వంశము కలది, వంశరహిత కూడ

స్వయముగా మొదట జన్మించినది, అమృతమునకు నాభీ వంటిది, ఆత్మకాశ్రయమైనది, ప్రాణేశ్వరునకు ప్రియమైనది, తల్లి, గొప్పమహిషముపై వసించునది.

ప్రాణములకు ఈశ్వరి, ప్రాణస్వరూపమైనది, ప్రధాన పురుషునకు ఈశ్వరియైనది, గొప్ప మాయారూపిణి, పూరించుటకు మిక్కిలి శక్యము కానిది, మూలప్రకృతి, ఈశ్వరి అయినది.

సమస్తశక్తుల కళలు ఆకారముగా కలది, వెన్నెల, ఆకాశరూప, మహిమలకు స్థానమైనది, అన్ని కార్యములను నియమించునది, అన్ని ప్రాణుల ప్రభువులకు ప్రభ్వి అయినది.

సంసారమునకు హేతుభూత, సర్వరూపిణి, అన్ని శక్తుల కుత్పత్తిస్థానము, సంసారమును దాటించునావ, వారించుటకు శక్యము కానిది, చూచుటకు సాధ్యము కానిది, కష్టముతో పొందదగినది.

ప్రాణములకు శక్తి యైనది, ప్రాణముల విద్య, యోగము కలది, గొప్ప కళారూపము, గొప్ప ఐశ్వర్యము చేత ఎదుర్కొనుటకు శక్యము కానిది, మూల ప్రకృతి నుండి జనించినది.

పుట్టుక లేనిది, అనంతమైన వైభవము కలది, అన్నిటికి ప్రారంభమైనది, సృష్టి, స్థితిలయములను కల్గించునది, మాటలతో వర్ణించుటకు శక్యము కానిది, అతిక్రమింప రానిది, అపకర్షమును కలిగించునది.

శబ్దమునకు కారణము, శబ్దమయము, నాదము పేరుగా కలది, నాదమే శరీరముగా కలది, ప్రారంభము లేనిది, వ్యక్తము కాని గుణములు కలది, గొప్ప ఆనందము కలది, అతిపురాతనమైనది

ఆకాశము ప్రథమస్థానమైనది, యోగము నధిష్ఠించినది, గొప్పయోగేశ్వరులకు ప్రభ్వి, అధికమైన మాయలు కలది, మిక్కిలి అధిగమింప సాధ్యము కానిది, మూలప్రకృతి అయినది ఈశ్వరి

ప్రధాన, పురుషుల కతీతురాలు, ప్రధానపురుష స్వరూపురాలు, పురాతన , జ్ఞానమయి, పురుషులకు ఆదిపురుషస్వరూపిణి.

సర్వప్రాణులయం దంతర్యామి, మూలస్థానమందుండునది, మహాపురుష సంజ్ఞకలది, జననము, మరణము, వార్థకము అనువాని కతీతురాలు, అన్ని శక్తులతో కూడి యున్నది.

వ్యాపించియుండునది, దేనికినీ బద్ధురాలు కానిది, ప్రధాన తత్త్వము నందు ప్రవేశించునది, క్షేత్రజ్ఞశక్తి గలది, వ్యక్తము కాని లక్షణములు కలది, మాలిన్యము లేనిది

అనాదిగా నున్న మాయ కతీతమైనది, మూడు తత్త్వములు కలది, ప్రకృతిని అధీన మందుంచుకొనునది, గొప్ప మాయనుండి అవతరించినది, తమో గుణము కలది, పౌరుషవతీ, నిశ్చలమైనది.

వ్యక్తావ్యక్తి స్వరూపము కలది, నల్లనిది, ఎరుపురంగు , తెలుపు కలది, జననకారణము, కార్యభూతురాలు కానిది, కార్యములను పుట్టించునది, ఎల్లప్పుడు ప్రసవ కార్యమును కల్గించు స్వభావము కలది.

సృష్టి, ప్రళయముల నుండి విడువబడినది, సృష్టి స్థితిలయములను చేయునది, బ్రహ్మము గర్భమున కలది, ఇరువది నాలుగు తత్త్వముల స్వరూపము కలది, కమలము నాభియందున్నది, విష్ణుస్వరూప.

విద్యుత్స భారూపిణి, శాశ్వతమైన మూలకారణము, లోకములకు మాత, ఈశ్వరునకు ప్రియురాలు, అన్నింటి కాధారమైనది, గొప్పరూపము కలది, అన్ని టైశ్వర్యములతో కూడినది.

ప్రపంచమే స్వరూపముగా కలది, గొప్ప గర్భము కలది, జగత్తునకు ప్రభువైన పరమేశ్వరుని ఇచ్ఛననుసరించి ప్రవర్తించునది, చాల గొప్పతనము కలది, బ్రహ్మకు జన్మకారణమైనది, మహాలక్ష్మినుండి ఉద్భవించినదీ;

పెద్ద విమానము యొక్క మధ్యభాగమందున్నది, మహానిద్రరూపమైనది, ఆత్మకారణముగా కలది, అందరికి సులభమైనది, సూక్ష్మరూప, అవిద్య పరమార్ధముగాకలది;

అనంతములైన రూపములుకలది, అనంతునిపై నివసించునది, పురుషులను మోహింపజేయుదేవి, అనేకములైన ఆకారములు, సంస్థానములు కలది, మూడుకాలముల భేదములేనిదీ.

బ్రహ్మమునుండి పుట్టినది, విష్ణువు యొక్క ఆకారము, బ్రహ్మవిష్ణు శివస్వరూప, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు జన్మకారణము, బ్రహ్మనామము కలది, బ్రహ్మము నాశ్రయించినది.

వ్యక్తరూపముకలది, మొదట జనించినది, బ్రహ్మమయము, గొప్పనైనది, బ్రహ్మ స్వరూపిణి, వైరాగ్యము, ఐశ్వర్యము, ధర్మము ఆత్మలుగాకలది, బ్రహ్మమూర్తి, హృదయమందుండునది.

జలములకు ఉత్పత్తి కారణము, స్వయముగా ఆవిర్భవించినది, మనస్సుకు గోచరమగునది, మూలతత్త్వమునుండి సంభవించినది, ఈశ్వరుని భార్య, శర్వాణి, శంకరుని సగము శరీరమును ధరించినది;

భవాని, రుద్రాణి, మహాలక్ష్మి మరియు అంబికా రూపిణీ, మహేశ్వరుని వలన జనించినదీ, భోగానుభవము, మోక్షము అను ఫలము నిచ్చునది.

సమస్తమునకు ప్రభ్వి, అందరిచే నమస్కరింపదగినదీ, విల్లప్పుడు సంతోషించు మనస్సు కలది, బ్రహ్మ, ఇంద్రుడు, ఉపేంద్రుడు అను వారి చేత నమస్కరింపబడునది, శంకరుని కోరిక ననుసరించి ప్రవర్తించునది;

ఈశ్వరుని ఆసనములో సగభాగమును పొందినది, మహేశ్వరుని విషయములో పాతివ్రత్యమును ధరించునది, ఒక్కసారిగా ప్రకాశించునది, సర్వజనుల బాధలనేది సముద్రమును శోషింపజేయునది.

హిమవంతుని పుత్రిక యగు పార్వతి, గొప్ప ఆనందమును కలిగించునది, గుణములతో సంపన్నమైనది, యోగమువలన జనించినది, యోగ్యత కలది, జ్ఞాన స్వరూపురాలు, వికసించు స్వభావముకలది;

సావిత్రి, కమల, లక్ష్మి, నారాయణుని వక్ష స్థలమందున్న శ్రీదేవి, కమలము నిపొసరుగా కలది, గంగా రూపిణి, యోగనిద్ర, రాక్షసులను పీడించునది.

సరస్వతి, అన్ని విద్యల సారము, ప్రపంచమునకు జ్యేష్ఠురాలు, మిక్కిలి మంగళరూప యైనది, వాక్కులదేవత, వరములనిచ్చునది, మాటలతో వర్ణింప దగినది, కీర్తి, అన్ని కార్యములను సాధించునది.

యోగులకు ప్రభ్వి, వేదాంత విద్యా స్వరూప, గొప్పవిద్య, మిక్కిలి మంగళకారి, రహస్య విద్య, ఆత్మ విద్యారూపిణి, ధర్మవిద్య, ఆత్మయందు భావింపబడునది.

స్వాహా, విశ్వమును భరించునది, సిద్ధిరూప, స్వధ, మేధ, ధృతి, శ్రుతి, నీతి, సునీతి, సుకృతి, మాధవుని పత్ని, నరవాహనముకలది.

పూజింపదగినది, తేజస్సు కలది, సాధు స్వరూప, భోగములుకలది, సర్పముపై శయనించునది, సౌందర్య రూప, శంకరి, చంచల, మాలను ధరించునది, పరమేష్ఠిని.

ముల్లోకముల యందు అందమైనది, నమస్కరింపదగినది, సుందర రూపిణి, ఇష్టానుసారము చరించునది, మహానుభావురాలు, సత్త్వగుణము నందునిలచినది, మహిషాసురుని మర్దించినది.

కమలము నాభియందు కలది, పాపములను తొలగించునది, విచిత్రములైన కిరీటము, అంగదములు కలదీ, మనోహర, విచిత్ర వస్త్రములను ధరించునది, శ్రేష్టములైన ఆభరణములతో అలంకరింప బడునది.

హంస పేరుకలది, ఆకాశ నివాసిని, ప్రపంచము యొక్క సృష్టిని పెంపొందించునది, నియమించునది, యంత్ర మధ్యములో నుండునది, సంతోష పరచునది, భద్రకాళి స్వరూప.

సూర్యుని వంటి కాంతి కలది, కుబేరునికి సంబంధించినది, శ్రేష్టమైన నెమలి వాహనము కలది, వృషభాసనమును పొందినది, గౌరి, మహాకాళి, దేవతలచే పూజింపబడునది.

అదితి, నియమముకలది, రౌద్రస్వరూప, పద్మము గర్భమునందుకలది, పక్షివాహన, విరూపాక్షి, ఆస్వాదించునుడు, గొప్ప రాక్షసులను నశింప జేయునది.

గొప్ప ఫలము కలది, దోషరహితశరీరము కలది, స్వేచ్ఛారూపమును ధరించునది, రాత్రి స్వరూపిణీ, అద్భుతములైన రత్నముల కిరీటముకలది, ఆశ్రయించినవారి బాధలను తొలగించునది.

కౌశికి, కరణము చేయునది, రాత్రిరూప, దేవతల ఆర్తిని నశింపజేయునది, అనేకరూపములు కలది, నీజరూపము కలది, రూపము లేనిదీ, రూపము చే విడువబడినదీ.

భక్తుల ఆపదలను పోగొట్టునది, భవ్యురాలు, సంసారతాపమును నశింపజేయునది, గుణములు లేనిది, శాశ్వత వైభవము కలది, సారములేనిది, లజ్జారహితయైనది,

తపస్సుకలది, సామగానరూప, శంకరుని అంకము నివాసముగాకలది, నాశములేనిది, దీక్ష, విద్యలనుధరించునదీ, ప్రకాశించునది, మహేంద్రుని పదవి నుండి తొలగించునది.

అన్నిటిని అతిశయించునది, ప్రపంచరూప, అన్ని సిద్ధులను ఇచ్చునది, సర్వేశ్వరునకు ప్రియమైన భార్య, సముద్ర మధ్యమందునివసించునది.

కలంకములేనిది, ఆధార రహితమైనది, శాశ్వత సిద్ధికలది, రోగబాధలేనిది, కామధేనువు, పెద్ద గర్భముకలది, బుద్ధి కలది, మోహమును నశింప జేయునది.

సంకల్పరహిత, భయములేనిదీ, వినయస్వరూప, వినయమునందుప్రీతికలది, వేలకొలది జ్వాలా పరంపరతో కూడినది, దేవులకు దేవి, మనోమయ స్వరూప.

మిక్కిలి పూజనీయురాలు, భర్గ, వాసుదేవునివలన జనించినది, మహేంద్రునకు, ఉపేంద్రునకు సోదరి, భక్తిచేత పొందదగినది, ఉత్తమ న్యూనరూపమైనది.

జ్ఞానముచేత తెలియదగినది, జరకు అతీతమైనది, వేదాంతమునకు విషయమైనది, గమ్యము, దక్షిణ, దహించునది, పొడవైనది, అందరు ప్రాణులచేత నమస్కరింపబడునది.

యోగమాయ, విభాగములను తెలిసినది-గోప్పమోహముకలది, మిక్కిలి గొప్పది, సంధ్యారూప. అన్నిటికి ఉత్పత్తి స్థానము, ఆశ్రయాదుల చేత బ్రహ్మవిద్యవంటిది.

బీజముల అంకురములకు జన్మస్థానము, గొప్పశక్తిరూప, గొప్పబుద్ధికలది, క్షమాస్వరూప, స్వయంప్రకాశము, జ్ఞానాత్మక, సత్యజ్ఞానరూప, పెద్దసర్పరాజుపై శయనించునది.

వీకార రూప, శంకర సంబంధిని, శాంతి, గణములచే, గంధర్వుల చే సేవింపబడునది, అగ్నిహోత్ర స్వరూప, గొప్పశాల, మహాసేనకలది, కుమారస్వామికిష్టమైనది.

దీర్ఘరాత్రి, శివునకానందము కలిగించునది, శచీదేవి చెడ్డకలలను నశింపజేయునది, హోమము, పూజచేయదగినది, జగత్తునుధరించునదీ, కష్టముచే తెలిసికొనదగినది, చక్కనీరూపముకలది.

తపస్సు చేయునది, సమాధియందున్నట్టిది, మూడు కన్నులుకలది, స్వర్గమందుండునది, గుహునకు తల్లి, గుణములకుత్పత్తి స్థానము, గొప్పపీఠముకలది, మరుత్తుకు పుత్రిక.

హవ్యవాహుని యందంతమగు రాగాదులు కలది, అగ్నిహోత్రునినుండి పుట్టినది, ప్రపంచమునకు కారణభూత, జగత్తులకు తల్లి, జననమరణ జరలనతీక్రమించినది.

బుద్ధిరూప, గోప్పబుద్ధి కలది, జీవుల హృదయములందుండునది, వేగముకలదీ, సమాధియందుండునది, మూడు నేత్రములు కలది, స్వర్గలోకము నందుండునదీ.

అన్ని ఇంద్రియములకు, మనస్సుకు తల్లి వంటిదీ, సమస్త ప్రాణుల హృదయములందుండునది, సంసారమునుండి తరింపజేయు విద్య, బ్రహ్మ వాదుల మనస్సులందు లీనమైయుండునది;

బ్రహ్మకు సంబంధించినది, విస్తార రూపముకలది, బ్రహ్మమయము, బ్రహ్మస్వరూప, సంసార బంధమునకు అరణి వంటిది, హిరణ్మయరూప, మహారాత్రి, సంసారమును పరిణమింపజేయునది.

చక్కని మాలను ధరించునది, మంచిరూపముకలది, భావించునది, మనస్సును హరించునది, కాంతి స్వరూప, వికసించునది, అన్నిటిని సహించునది, సమస్త ప్రత్యయములకు సాక్షిణి.

మిక్కిలి సౌమ్యరూప, చంద్రుని వంటి ముఖముకలది, తాండవ మందాసక్తమైన మనస్సుకలది, సత్వశుద్ధి కలిగించునది, శుద్దిస్వరూప, మూడువిధముల మాలిన్యాన్నీ నశింపజేయునది.

లోకములకు ప్రియమైనది, ప్రపంచమే ఆకారముగా కలదీ, మూడు మూర్తులు కలది, అమృతమునకాశ్రయమైనది, ఆధారము లేనిది , ఆహారములేనిది, నిరంకుశ స్థానము ఉత్పత్తిగాకలది ; 

చంద్రుడు హస్తమందుకలది, విచిత్రమైన శరీరముకలది, పుష్పహారమును ధరించినది, కమలమును ధరించినది, పర-అపర విధానములను తెలిసినది, మహాపురుషునికి పూర్వమందు పుట్టినది.

విశ్వేశ్వరునకు ప్రియమైనదీ, మెరుపుతీగరూపమైనది, విద్యుత్తు నాలుకగా కలది, శ్రమను జయించినది, విద్యలమయమైనదీ, అనంతమైన కన్నులు కలది, అనంతముఖములు కలది, స్వయముగా అవతరించినది.

వేలకొలది కీరణములు కలది, సత్వము నందున్నది, మహేశ్వరస్థానమునాశ్రయించినది, క్షాళన చేయునది, మృత్తికామయ, వ్యాపించి యున్నది, తేజోమయి, పద్మములను వికసింపజేయునది.

గొప్ప మాయనాశ్రయించినది, పూజింపదగినది, మహాదేవుని మనస్సును రంజింప జేయునది, ఆకాశలక్ష్మి, సింహమువాహనముగాకలది, అమీతమైన కాంతికలది, అధికజ్ఞానము కలది.

వీరేశ్వరి, విమానమందుండునది, శోకములేనిది, శోకమునునశింపజేయునది, అనాహతయోగరూప, కుండలిని, కమలముకలది, పద్మమువలె ప్రకాశించునది.

   ఎల్లప్పుడు ఆనందముతో కూడినది, శాశ్వతకీర్తికలదీ, సమస్తభూతముల కాశ్రయస్థానముగా నున్నది, వాగ్రూపమైన దేవత, బ్రహ్మయొక్క కళ, కళల కతీతమైనది.

బ్రహ్మము యొక్క సంపద, బ్రహ్మహృదయమునగలది, బ్రహ్మవిష్ణుశివులకు ముగ్గురికి ఇష్టమైనది, ఆకాశ శక్తిరూపిణి, క్రియా శక్తి, జ్ఞానరూపశక్తి, సర్వోత్తమమైన ప్రాప్యస్థానము.  క్షోభము కలిగించునది, మంధించునది, భేదించుటకు శక్యము కానిది, భేదము -అభేదము అనువానిచే విడువబడినది, భిన్నముకానిది, భిన్నములైన సంస్థానములుకలది, వశమునందున్నది, వంశమును హరించునది.

రహస్యశక్తిరూప, గుణత్రయమునకతీతురాలు, అన్నిటినిచ్చునది, అన్నివైపుల ముఖముకలది, ఐశ్వర్యము కలది, భగవంతుని భార్య, కళలతో యుక్తమైనది, కాలుని నశింపజేయునది.

అన్నివిషయములు తెలిసినది, అంతట భద్రము కలది, రహస్యములకతీతమైనదీ, గుహల సమూహముకలది, ప్రకృష్టమైనక్రీయ, యోగమాత, గంగారూప, విశ్వేశ్వరుని పత్ని .

   సమూహరూప, కపిల వర్ణముకలది, మనోహరమైనది, పద్మము వంటికాంతికలది, కళల యొక్క విశేషముకలది, పుణ్యురాలు, తామరపూవును ధరించినది, భుజించునది, ఇంద్రునకు ముందు నడచునది. ,

పోషించునది, గొప్ప ఐశ్వర్యము నిచ్చునది, భూతియే అలంకారముగాకలది, అయిదుగురు బ్రహ్మలకుత్పత్తి కారణము, పరమార్ధ భూతురాలు, అర్ధ శరీరము కలది.

ధర్మము యొక్క ఉదయము కలదీ, కీరణములు కలది, యోగులచే తెలిసికొనదగినది, మనస్సుయొక్క వేగముకలది, మనస్సును రమింప జేయునది, తాపసరూపిణి, వేదస్వరూపురాలు.

వేదముల శక్తిరూపిణి, వేదములకు తల్లి వంటిది, వేదవిద్యలను ప్రకాశింప జేయునది, యోగేశ్వరులకు ప్రభ్వి, గొప్పశక్తికల మనోమయి యగు తల్లి.

విశ్వము యొక్క అధిష్టానము, ఆకాశ రూపిణి, విద్యుత్తుల మాలవంటిది, వ్యాపించి యుండునది, కిన్నరి, సురభి స్వరూప, విద్యాదేవత, సందీనీ, నందికి ప్రీతిపాత్రురాలు.

భారతీ, గోప్ప ఆనందరూపిణి, పరము అపరము అనువానిని భేదింప జేయునది, అన్ని ఆయుధములతో కూడినది, కోరదగినది, కామేశ్వరునకు పత్నియైనదీ.

  ఆలోచించుటకు శక్యము కానిది, అనంతమైన విభవముకలది, భూమి యొక్క రేఖవంటిదీ బంగారము వంటి కాంతి కలది, కూష్మాండరూపిణి, ధనరత్నములతో సంపన్నమైనది, మంచి గంధము కలది, పరిమళము నిచ్చునది.

త్రివిక్రముని పాదమునుండి పుట్టినది, ధనుస్సు చేతియందు కలది, మంగళకరమైన ఉదయము కలది, మిక్కిలి క్లేశముతో పొంద దగినది, ధనమునకధిపతీ, ధన్యురాలు, పింగళ వర్ణపు కన్నులు కలదీ,

శాంతిరూప, కాంతి కలది, తేజస్వరూప, పద్మముల వలె విశాలమైన కన్నులు కలది, మొదటి స్థానము, కమలమునుండి జన్మించినది, గోవులకు తల్లి, రణము నందు ప్రీతి కలది.

మంచి అనుష్టానముకలది, గిరిశయన, శుద్దిరూప, ఎల్లప్పుడు పుష్పములు కలిగి యుండునది, భేదము లేనిది, దుర్గ, కాత్యాయని, చండి, అలంకృత శరీరముకలది, చక్కని విగ్రహము కలది.

బంగారు రంగుకలది, లోకరూపిణి, ప్రపంచమను యంత్రమును నడుపునది, మందరపర్వతము నివాసముగా కలది, విషమును హరించునది, సువర్ణమాల ధరించునది.  

 రత్నముల మాలను ధరించినది, రత్నములు గర్భమందు కలది, బలము కలిగించునది, విశ్వమును నిగ్రహించునది, కమలము నాభియందు కలది, పద్మముతో సమానమైనది, ఎల్లప్పుడు కోపించునది, అమృతము నుండి జనించినది.

కంపింప జేయునది, ఇతరులచే కంపింప జేయరానిది, సూర్యునకు తల్లి, మహేంద్రునకు సోదరి, సాధుస్వభావము కలది, శ్రేష్ఠురాలు, వరముల నిచ్చునది.

మంగళరూపిణి, కమలము నివాసముగా కలది, అయిదు శిఖలు కలది, వరముల నిచ్చునది, వర్ణించదగినది, దేవతలకు ప్రభ్వి, విద్యారూపిణి, జయించుటకు శక్యము కానిది, అతి క్రమించరానిది.

ప్రళయ రాత్రి వంటిది, గొప్పవేగము కలది, వీరభద్రునకు ఇష్టురాలు, హితురాలు, భద్రమును కలిగించు కాళీదేవి, లోకములకు తల్లి, భక్తులకు శుభముల నిచ్చునది.

భయంకర రూపము కలదీ, పింగళ వర్ణపు ఆకారము కలదీ, మన్మధుని భేదించినది, గొప్ప ధ్వని కలది, కీర్తికలది, కీర్తిని ఇచ్చునది, ఆరు మార్గములను ప్రవర్తింప జేయునది.  

  శంఖమును ధరించినది, కమలముకలది, సాంఖ్యరూప, సాంఖ్మయోగమును ప్రవర్తింప జేయునది, చైత్రరూప, సంవత్సరమునధిరోహించు. నది, లోకములను పరిపూర్ణము చేయునదీ, ధ్వజరూపిణి.

 శుంభరాక్షసునకు శత్రువు, ఆకాశసంచారిణి, స్వస్థురాలు, శంఖము వంటిమెడ కలది, కలిపురుషునకిష్టమైనది, పక్షిధ్వజముగాకలది, పక్షి వాహనముకలది, పరాహరూపిణి, పోకలమాల ధరించునది.

ఐశ్వర్యరూప పద్మము నివాసముగా కలది, వైరాగ్యము కలది, గరుడుడు వాహనముగా కలది, జయించునది, హృదయమను గుహయందు పొందదగినది, గుహవంటి పెదవులు కలది, గణమునకు అధీశ్వరురాలు.

సిద్దించిన సంకల్పములు కలది, సమభావమున నీలిచి యుండునది, సమస్తవిజ్ఞానముల నందించునది, శూరురాలు, పాపమును నశింపజేయునది, రహస్యములైన ఉపనిషత్తులలో చెప్పబడుశ్రేష్ఠురాలు.

నిషారూపిణి, జ్ఞానరూప, స్మరణము, వ్యాప్తి, పుష్టి, తుష్టి, అనుష్టానము కలది, ప్రపంచమునకు, దేవేంద్రునకు గూడ అధికారిణి, భుక్తి ముక్తి కలిగించునది, మంగళరూప, అమృత స్వరూపిణి.  

   ఎఱ్ఱనిది, సర్పముల మాలను ధరించినది, భయంకరమైనది, వనమాలను తాల్చినది, అనంతుడు శయ్యగా కలది, నాశములేనిది, నరనారాయణుల వలన పుట్టుకకలదీ.

నరసింహాకారముకలదీ, రాక్షసులను మధించునది, శంఖచక్రములను గదను ధరించునది, శత్రువులను జయించునది, జగత్తుకు మూలకారణము, మాతృరూప, తనపాదములే లోకమునకాశ్రయముగా కలది.

గొప్పతేజస్సుకలది, దివ్యమైన ఆకారముకలది, చక్కని రూపము కలదీ, అన్నికోరికలను ఇచ్చునది, నిర్మలమైనది, సుందరమైన స్తనములు కలది, సూర్యునకు సంబంధించినది, ధర్మకామార్ధములను మోక్షమును ఇచ్చునది.

కనుబొమల మధ్య వసించునది, మొట్టమొదటిది, పురాణపురుషునకు అరణి వంటిది, గొప్పవిభూతి నిచ్చునదీ, మధ్యస్థురాలు, కమలములవంటి కన్నులు కలది, సాటిలేనిది.

పదునెనిమిది భుజములు కలది, పుట్టుకలేనిది, నల్లకలువ రేకులవంటి కాంతీ కలది, సమస్తశక్తులనెడు ఆసనములనధిరోహించునది, ధర్మాధర్మవిభేదమునకు దూరమైనది.

 వైరాగ్యముతో కూడిన జ్ఞానము సందాసక్తి కలది, కాంతిని మించినది, ఇంద్రియములకతీతురాలు, అద్భుతమైన గహనము ఆధారముగాకలది, శాశ్వతమైన స్థానమునందు వసించునది.  

 స్థానములకు ప్రభ్వి, ఆనందమున కతీతురాలు, శ్రేష్ఠమైన త్రిశూలమును ధరించునది, సమస్తదేవతలు తన రూపముగాకలది, దేవతా శ్రేష్ఠురాలు.

గణములకు తల్లి, పర్వతపుత్రిక, నిశుంభుని సంహరించినది, వర్ణములేనిది, భేదరహిత, మూడు అక్షరములచే ప్రతిపాద్యురాలు, ప్రాణులకు జన్మదాయిని.

అనంతములైన వర్ణములుకలది, పరాధీనముకానిది, శంకరునికి సంబంధించినది, ప్రశాంతమైన మనస్సు కలది, వంశములేనిది, గోవులుకలది, రక్షకురాలు, రహస్యాకారముకలది, గుణములచే శ్రేష్ఠురాలు.

గోరూపిణి, వాక్కు గవ్యము నందు ప్రీతి కలది, త్రిగుణములకు సంబంధించినది, గణేశ్వరునిచేత నమస్కరింపబడునది, సత్యభామారూపిణి, సత్యమైన ప్రతిజ్ఞ కలది, మూడు సంధ్యలు కలది, విభాగములు లేనిది.  

   అన్ని వాదముల కాశ్రయమైనది, ఆత్మజ్ఞానమునకు చెందినది, సాంఖ్యయోగము నుండి పుట్టినది, లెక్కించుటకు శక్యముకానిది, పరిమాణము తెలియగానిది, శూన్యరూప, నిర్మల వంశమున జన్మించినది,

బిందునాదమునకుత్పత్తి స్థానము, శివునకు వామ భాగమందుండునది, చంద్రునివంటి కాంతి కలదీ, పిశంగవర్ణము కలది, భేదములు లేనిది, మనోహరమైనది, మధురాక్షసుని నశింపజేయునది.

గొప్పలక్ష్మి, సంపదలకు జన్మస్థానము, తమస్సు యొక్క ఆవలి భాగమున స్థాపించబడినది, తత్త్వత్రయమునకు తల్లివంటిది, మూడువిధములైనది, మిక్కిలి సూక్ష్మములైన పదముల నాశ్రయించినది.

శాంతురాలు, భయములేనిది, మాలిన్యమునకు దూరమైనది, వికారములు లేనిది, శివునాశ్రయించి యుండునది, శివనామము కలది, మనస్సే మందిరముగా కలది, శివజ్ఞాన స్వరూపురాలు.

దైత్యులను, దానవులను సంహరించినది, కశ్యపునకు సంబంధించినది, కాలమునకు కర్ణిక వంటిది, శాస్త్రములకు మూలకారణము, క్రియానుషానరూపిణి, నాలుగు వర్గములను ప్రదర్శించునది.

నారాయణునకు సంబంధించినది, మనుష్యుల ఉత్పత్తి కారణము, వెన్నెల రూపమైనదీ, లింగమును ధరించునదీ, కామములు కలది, అభావయుక్తమైనది, పర, అపర అను విభూతుల నిచ్చునది.

పరాంగము వలన కలిగిన మహిమ కలది, అశ్వరూపిణి, అందమైన కన్నులు కలది, మంచి భద్రములు కలది, దేవకీ సీతాస్వరూపిణి, వేదముల వేదాంగముల సారమును చూచినది.

అభిమానము కలది, మన్యువునకు తల్లి, గొప్పమన్యువు నుండి సంభవించినది, దుఃఖము లేనిది, అమృతమునాస్వాదించునది, యజ్ఞముల యందు పిలువ బడునది, స్తోత్రము చేయబడునది.

శోకింపదగనిది, భిన్నవిషయములు కలది, సువర్ణము, వెండి ప్రియములుగా కలది, బంగారమును రంజింప జేయునది, బంగారు రంగు కలది, సువర్ణాభరణములచే అలంకరింపబడినది.

ఎక్కువగా ప్రకాశించునది, తెలిసి కోనుటకు కష్ట సాధ్యమైనది, జ్యోతి షోమయాగము యొక్క ఫలమునిచ్చునది, గొప్ప నిద్రకు జన్మకారణము, నిద్రలేనిది, సత్యమైన దేవత.

   పొడవైనది, రాజచిహ్నములు కలది, మనోహరమైనదీ, శాంతి నిచ్చునది, శాంతిని పెంపొందించునది, లక్ష్మీ మొదలగు శక్తులకు తల్లి వంటిది, శక్తులయొక్క చక్రమును ప్రవర్తింప జేయునది.  .

 మూడు శక్తులకు తల్లి, పుట్టుక కలది, ఆరువిధముల ఊర్ముల నుండి విడువబడినదీ, బాగుగా శుభ్రమైనది, కర్మలను చేయించునది, ప్రళయకాలపు అగ్ని వంటి స్వరూపము కలది.

శత్రువులను జయించునది, లోకములను ధరించునది, కోరికలకు కారణ భూతురాలు, కిరీటము కలది, ఇంద్రునికి సంబంధించినది, ముల్లోకములచే నమస్కరింప బడునది, విష్ణు సంబంధముకల పరమేశ్వరి.

ప్రద్యుమ్నునకు ప్రియురాలు, దానముచేయునది, జంట చూపులు కలదీ, మూడు కన్నులు కలది, మదముతో శోభించునది, హంసగమనము కలది, తీక్ష స్వభావము కలది, తీవ్ర పరాక్రమ వంతురాలు.

వృషభము నావేశించినది, ఆకాశమునకు జనని, వింధ్య పర్వతము నందు నివసించునది, హిమాలయము, మేరుపర్వతము నివాసములుగా కలది, కైలాస పర్వతము నందు వసించునది.  

   చాణూరుని చంపిన వాని కూతురు, నీతిశాస్త్రము తెలిసినది, స్వేచ్ఛా రూపము ధరించునది, వేదవిద్యల యందవబ్బధస్నానము జరిపినది, బ్రహ్మపర్వతమునందు నివసించునది. ,

వీరభద్రుడు సంతతిగా కలది, వీరురాలు, గొప్పదైన కామమున కుత్పత్తి స్థానము, విద్యాధరులకు ప్రియమైనది, సిద్ధురాలు, విద్యాధరులను నిరాకరింపగలది.

ప్రీతిని కలిగించునది, హరించునది, పవిత్రమైనది, పోషించు కళారూపయైనది, మాతృక, మన్మథునినుండి పుట్టినది, జలమునుండి పుట్టినదీ,వాహనమందు ప్రీతి కలది.   కరీషమును ధరించునది, అమృతము వంటి మాటలు కలది, వీణను మ్రోగించుట యందాసక్తి కలది, సేవింపబడునది, సేవించునది, సేవింపదగినది, సినీవాలి రూప, రెక్కలు కలది.

అరుంధతి, బంగారము వంటి కన్నులు కలది, మృగము గుర్తుగా కలది, గౌరవము నిచ్చునది, ధనమును కలిగించునది, ఐశ్వర్యముకలది, వసువు యొక్కధార, బంగారమును ధరించునది.

   ధారను ధరించునది, శ్రేష్టమైన ఊరువులు కలది, వేలకొలది ఉన్నతమైన ఆశ్రయముల నిచ్చునది, సంపద ఫలముగా కలదీ, సంపదకలది, సంపదకు ప్రభ్వి, శ్రీకి నివాసము, శివునకు ఇష్టమైనది

శ్రీని ధరించునది, సంపదను కల్గించునది, శ్రీధరుని సగము శరీరము కలది, అనంతమైన చూపులు కలది, క్షుద్రత్వము లేనిదీ, భూమికి అధికారిణి, కుబేరునకు ప్రియమైనది, ,

రాక్షససమూహములను చంపునది, సింహము వాహనముగా కలది, సింహరూపిణీ, మంచి తేజస్సుకలది, అందమైన నితంబము కలది, మంచి కీర్తి కలదీ, తొలగింపబడిన సంశయములు కలది. ,

రసము నెరిగినది, రసము నిచ్చునది, రమించునది, ఆస్వాదించునది, అమృతమును స్రవించునది, మంగళమున కరమైనది, మంగళరూప, మాలారూప, నిర్మలమైనదీ, మాలిన్యమును హరించునది.  

   గంధర్వసంబంధిని, చంద్రునికి చెందినది, కంబలము, కంచర గాడిద ఇష్టముగా కలది, మేరుపుతీగ రూపము, జనులకానందము కలిగించునది, బొమముడి చేత వంకరయైనముఖము కలది.

కోండ గోగు పూవు చేతియందు కలది, కంసుని ప్రాణముల నపహరించినది, యుగములను ధరించునది, యుగములను మరలించునది, మూడు సంధ్యలు కలది, సంతోషమును పెంచునది.

ప్రత్యక్షమైన దేవత, దివ్యురాలు, దివ్యమైన గంధము కలది, స్వర్గము కంటే విశిష్టమైనది, ఇంద్రుని ఆసనమునధిష్టించినది, శక్రునకు సంబంధించినది, సాధనయోగ్య, దివ్యమైన ధనుస్సు కలది.

ఇష్టమైనది, విశిష్టురాలు, శిష్టులైన వారి కభీష్టురాలు, శిష్టులచేత అశిష్టుల చేత కూడ పూజింపబడునది, అనేక రూపములు కలది, అనంతావర్తము కలది, వినత, సురభి, దేవతారూపిణి.   

దేవేంద్రునకు తల్లి, మంచి శక్తి కలది, సుషుమ్న నాడీ స్వరూపిణి, సూర్యమండల మందధిష్ఠించి యుండునది, చక్కగా పరిశీలించి తెలియ దగినదీ, మంచి ప్రతిష్ఠ కలదీ, నివృత్తి రూపయైనది, జ్ఞానము యొక్క అంతమును పొందినది.

ధర్మ శాస్త్ర విషయములందు నేర్పు కలది, ధర్మము తెలిసినది, ధర్మమే వాహనముగా కలది, ధర్మాధర్మములను నిర్ధారించునది, ధర్మ స్వభావము కలవారికి శుభముల నిచ్చునది;

ధర్మము శక్తిగా కలది, ధర్మ స్వరూపిణి, ధర్మముస కతీతమైనది, విశ్వధర్మము కలది, ధర్మమందు వసించునది, ధర్మమయి, ధర్మహేతుకమైనది, ధనము నిచ్చునది;

ధర్మమునుపదేశించునది, ధర్మ స్వభావము కలది, ధర్మముచేత పొంద దగినది, భూమిని ధరించునది, కపాలమును ధరించునది, అంశావతారమైనది, కళలతో కూడిన విగ్రహము కలది ;

అన్ని శక్తుల నుండి ముక్తురాలైనది, సమస్త శక్తుల కాశ్రయమైనది, ఆధారభూత, సర్వమునకీశ్వరి, సూక్ష్మరూపిణి, సూక్ష్మజ్ఞాన స్వరూపము కలది ;

ప్రధానపురుషునికి శేషభూతురాలు, మహాదేవునికి ముఖ్యసాక్షీణి, సదాశివరూప, ఆకాశ శరీరిణి, వేదరూపిణి, మూర్తి రహిత ;

ఇట్లు హిమవంతుడు వేయినామాలతో స్తుతించి, మరల నమస్కరించి, భయముతో చేతులు జోడించి మరల ఇట్లనెను.

ఓ పరమేశ్వరీ  భయంకరమైన, ఈశ్వర సంబంధియైన ఈ రూపమేది కలదో, దానిని చూచి ఇప్పుడు నేను భయము చెందినాను. అందువలన దీనికి భిన్నమైన రూపమును చూపుము.

ఆ పార్వతీ దేవి పర్వత రాజు చేత ఇట్లు చెప్పబడినదై , తన అప్పటీ రూపమును ఉపసంహరించి ఇతరమైన రూపమును మరల ప్రదర్శించెను.

నల్లకలువ రేకులతో సమానమైనది, నల్లకలువల పరిమళము వంటి సుగంధము కలది, రెండు కన్నులు, రెండు చేతులు కలది, సల్లని ముంగురులతో కూడినది, ప్రసన్నమైనది.

ఎఱ్ఱని పాద పద్మప్రదేశము కలది, మిక్కిలి ఎరుపైన చిగురాకుల వంటి చేతులు కలది, సంపదతో కూడిన విలాసము, సద్వర్తనము కలది, నొసటి యండు తిలకముతో ప్రకాశించుచున్నది.

సమస్తావయవములందు అందమైన భూషణములతో అలంకరించబడినది, మిక్కిలి సుకుమారమైనదీ, బంగారముతో చేయబడిన, విశాలమైన హారమును వక్షస్థలములో ధరించినది.

చిరునవ్వుతో కూడినది, చక్కని దొండపండు వంటి పెదవులు కలది, అందెల చప్పుడుతో యుక్తమైనది, నిర్మలమైన ముఖము కలది, దేవతలకు సంబంధించినది, అంతులేని మహిమలకు నెలవైనది.

ఇటు వంటి లక్షణాలతో కూడిన ఆ స్వరూపమును చూచి పర్వత శ్రేష్ఠుడు సంతోషించిన మనస్సు కలవాడై, భయమును విడిచిపెట్టి ఆ పరమేశ్వరిని గూర్చి ఇట్లు మాట్లాడెను.

ఈ రోజు నా జన్మ సఫలమైనది, సో తపస్సు ఈనాడు సార్ధకమైనది. ఎందువలన అనగా, అవ్యక్త స్వరూపము కల నీవు స్వయముగా నాచూపులకు సాక్షాత్కరించినావు.

ఈ లోక మంతయు నీ చేసృజింపబడినది. ప్రధానము మొదలగు తత్త్వ సమూహము నీ యందు నిలిచి యున్నది. ఓ దేవీ ఈ విశ్వము నీ యందే లీనమగుచున్నది. నీవే మాకు గొప్ప ప్రాప్యస్థానము.

కొందరు నిన్నే ప్రకృతి స్వరూపవని, ప్రకృతికి అతీతురాలవని చెప్పుదురు- మరికొందరు వాస్తవము నెరిగిన పోరు నీన్ను శివునాశ్రయించి యున్నందున “శివ “ అని పలుకుదురు.

నీ యందు ప్రధాన తత్వము, పురుషుడు, మహత్తు, బ్రహ్మ మరియు ఈశ్వరుడు, అవిద్య, నియతి, మాయ, కళలు మొదలగునవి వందల కొలది ఏర్పడినవి.

నీవు శ్రేష్ఠమైన ఆ శక్తివి, అంతములేని పరమేష్ఠిరూపిణివి. సమస్తమైన భేదములచేత విడువబడినదానవు. భేదమునకాశ్రయములైన వాని కన్నింటికి ఆశ్రయభూతవు.

ఓ యోగేశ్వరీ  నిన్ను ఆధారముగా చేసుకొని మహాదేవుడగు మహేశ్వరుడు, ప్రధానతత్త్వము మొదలైన లోకము నంతయు సృష్టించుచు, వికారములు కలిగించును.

నీతో చేరియున్న దేవుడు తనలో ఆత్మానుభవానందమును పొందుచున్నాడు. నీవే గొప్ప ఆనంద స్వరూపము. నీవే ఆనందము కలిగీంచుదానవు.

నీవు నాశరహితమైన పరమాకాశరూపము ; వీకారరహితమైన గొప్ప తేజోరూపము- మంగళకరము, అంతట వ్యాపించి యున్నది, సూక్ష్మరూపము, అసాదీ సిద్ధమైన పరబ్రహ్మ స్వరూపమునై యున్నావు.

నీవు దేవతలందరిలో ఇంద్రుడవు. బ్రహ్మతత్త్వము తెలిసిన వారిలో నీవు బ్రహ్మవు. ఓ దేవీ  నీవు బలవంతులలో వాయురూపవు యోగులలో నీవు కుమారకుడవు.

ఋషులలో నీవు వసిష్ఠుడవు. వేదవేత్తలలో నీవు వ్యాసుడవు. సాంఖ్యులలో కపిలదేవుడవు. రుద్రులలో నీవు శంకరుడవు.

అదితి కుమారులతో వీపు ఉపేంద్రుడవు. వసువులలో నీవు అగ్ని రూపుడవు. వేదములలో మీము సామవేదస్వరూపము. ఫణరస్సులు  నీవు గాయత్రివి.

విద్యలలో నీవు ఆత్మ విషయమిద్యవు. ప్రొష్యములలో నీవు సర్వోత్తమప్రాప్యము. సమస్తుశక్తులులో నీవు మయూడూరావు. లెక్కేణుపు చాటిలో వీపు కాలరూపమైన దానవు.  సమస్త రహవ్యములలో వీవు ఓంకార స్వరూపవు. వర్ణములలో నీవు ద్విజశ్రేష్టుడవు. ఆశ్రమములలో నీము, గమాశ్రమము. ఈశ్వయంతో నీవు మహేశ్వరుండవు.

పురుషులలో నీవు ముఖ్య పురుషుడవు సమస్త భూతముల మనస్సుల యందున్నవాడవు. ఓ దేవీ  సమన్లను ఉపనిషత్తులలో నీవు రహస్యమైన ఉపనిషత్తుగా చెప్పబడుచున్నావు.

కల్పములో నీవు ఈశాన కల్పమైన దాచపు. యుగములలో కృతయుగము నీవే. సమస్తమైను పూర్ణములకు నీవు సూర్యుడను. నాకుజ్ఞతో సరస్వతీ దేవివి.

అందమైన ఆకారము కలహరిలో మీవు లక్ష్మిమి. మయూమబతుకుతా నీవు విష్ణువు. పతివ్రతలు నీవు. అరుంధతిమి. పక్షుణతా శీను గరుత్మంతుడవు.

వేదసూక్తములలో వీపు పురుషసూక్తముపు. సామవేదములో నీవు జ్యేష్టపాముభాగము. జపించదగిన ముత్రములుటె నీవు నాయతీ మణతనువు. యజుర్వేద మంత్రములలో శతదియు భాగము మీము.

పర్వతములలో మీపు గొప్పదైన మేరు పర్వతము. పర్వములతో నీవు ఆది శేషుడవు. అన్నింటితో నిండి యున్న మగబ్రహ్మవు నీవు. ఈ నమస్తము నీతో నిండి యున్నదే.

మీ లేదక్క రూపము అన్నివిధములు వికారములు లేనిది, సాధారణముగా గోపడమరుకానిది, నిర్జలమైనది, అవయవు కుమోగతమై అఖండ. మైనది, మొడలు, మధ్య, తుది అనుమతి లేనిది, నాశము లేనిది, ఆది భూత మైనది. సత్యవ్వరూపము, తమోగుణానికి దూరమైనది అగుండడమునకు నమస్కరింశనం.

వేదాంతశాస్త్రము చదివి ఆ మిజ్ఞానము నందు విశ్యయుయుద్ధికలు పండితులు లేనిను లోకములు ఉత్పత్తి జరుణమణుగూ శరథుణమున్నా కేవలనందరూపము, ఓఓటకార వాచ్యము అయసు ఆ రుణామమనే నేను శరణు పొందును.

మొదలు, శుదలేనిది, లోకములకు ఆత్మస్వరూపమైనది, విలక్షణమైన ప్రత్యేకమైన ఉనికి కుది, ప్రతి కతీతమైనది, మూడుభూతము,. నువమంగా తెలియుగాని శరీరము కలది ఆరు వుదంను శబ్దమౌవ్యమైన నీ రూపమునకు నమస్కరించుచున్నాను.

సమస్తమున కాశ్రయభూతము, అన్నిలోకములను సృజించునది, అన్నిచోట్లకు వ్యాపించునది, జనసమరణములు లేనట్టిది, సూక్ష్మరూపము, ఆశ్చర్యకరము, సత్తాదిగుణత్రయము ప్రధానముగా కలది, రూపభేదములు లేనిది అగు నీరూపమునకు నమస్కరించుచున్నాను.

మొట్టమొదటిది, గొప్పనైనది, పురుషనామకమైనది, ప్రకృతియందు వ్యాపించినిలిచియున్నది, గుణత్రయముతో కూడిన ఆత్మ బీజముగా కలదీ, ఐశ్వర్యము, విజ్ఞానము, విరుద్ధధర్మములు అనువానితో కూడియున్న నీ రూపానికి ఓదేవీ ప్రణతుడనగుచున్నాను.

పదునాలుగులోకాలు స్వరూపముగాకలదీ, నీటిలో ఉన్నది, విచిత్రమైన భేదములు కలది, పరమపురుషుడేనాధుడుగా కలది, పొలాభేదములతో కూడి యున్నది అగు, అండ సంజ్ఞకల నీ రూపమునకు ప్రణమిల్లుచున్నాను.

సమస్తవేదస్వరూపము, కేవలము, మొదటిది, సతేజస్సుచేత నింపబడిన లోకముల భేదములు కలది, మూడు కాలములకు కారణభూతము, పరమేష్ఠిసంజ్ఞకలదీ అగు సూర్యమండలమందు వసించు నీరూపానికి నమస్కరించుచున్నాను.

వేయి తలలు కలిగి, అంతములేని శక్తికలిగి, వేయిభుజములు కలిగి, మూడు కాలములకు కారణభూతము, పరమేష్ఠి సంజ్ఞకలది అగు సూర్యమండలమందు వసించు నీరూపానికి నమస్కరించుచున్నాను.

వేయితలలు కలిగి, అంతములేని శక్తికలిగి, వేయిభుజములు కలిగీ పురాణపురుషుడవు, సముద్రములో నీటియందు శయనించియున్న నీదే అగు నారాయణనామకమైన రూపమునకు ప్రణామము చేయుచున్నాను.

కోరలతో భయంకరముగా నున్నది, దేవతలచేత పూజింపదగినది, ప్రళయకాలమందలి తీవ్రమైన అగ్నిని పుట్టించునది, సమస్తప్రాణులతో కూడిన బ్రహ్మాండము లయమునకు కారణమైనది. అగు థాలసోమకమైన నీరూపమునకు నమస్కరించుచున్నాను.

వేయి పడగలతో ప్రకాశించుచున్నది, సర్పరాజులలో ముఖ్యులైనవారిచేత కూడ పూజింపబడుచున్నది, విష్ణుమూర్తి చేత అధిష్టించబడిన శరీరము కలది, నిద్రావస్థలో నున్నది అగు శేషుడను పేరుకల నీ రూపమునకు ప్రణమిల్లుచున్నాను.

కోట్టబడని ఐశ్వర్యముకలది, బేసి కన్నులు కలది, పరబ్రహ్మమును అమృతరసాస్వాదములోని రసమును గుర్తించునది, అద్వితీయము, ప్రళయకాలములో మిగిలియుండునది, ఆకాశములో నర్తనము చేయునది అగు రుద్రనమకమైన నీరూపమునకు మొక్కుచున్నాను.

నశించినశోకముకలది, గ్రహించుటకు అగోచరమైన ఆకారముకలది, దేవదానవులచేత పూజింపబడిన కమలముల వంటి పాదములు కలదీ, మిక్కిలి సుకుమారమైనది, ప్రకాశించునది, స్వచ్ఛమైనది అగు నీరూపమునకు ఓ భవానీదేవీ నమస్కరించుచున్నాను.

ఓ మహాదేవీ పరమేశ్వరీ నీకు నా నమోవాకము. భగవతీ ఈశానునిపత్నీ శివస్వరూపమైన నీకు నమస్కారము.

నేను నీకంటే అభిన్నుడను, నీవే ఆధారముగా కలవాడను. నీవే నాకుదిక్కు ఓ పరమేశ్వరీ నిన్నే శరణు పొందుతాను. నాకు ప్రసన్నురాలవు కమ్ము.

లోకములో దేవజాతీ, లేదా దానవులలో నాతో సమానుడు మరియొకడు లేడు. ఎందువలన అనగా లోకమాత వగు నీవు నాతపస్సు చేత పుత్రికగా జన్మించినావు.

ఓ అంబికాదేవీ! ఈమేనక, సమస్తలోకములకు తల్లివైన నీ తండ్రికీ పత్నియైనది. ఇది సోయొక్క పుణ్యములగొప్పతనము.

దేవతలందరికీ ప్రభ్వి అగునీవు నాభార్యమేనకతో సహఎల్లప్పుడు నన్ను కాపాడుము. కమలము వంటి! నీపాదమునకు నమస్కరింతును. మంగళకరమైన దానిని శరణుపొందుదును.

మహాదేవి వగునిన్ను కలుసుకునే అవకాశము కలుగుట నాయొక్క గొప్పఅదృష్టము. ఓదేవీ! శంకరపత్నీ! నీకు ఏమిసేవచేయవలెనో ఆజ్ఞాపించుము.

పర్వతరాజగు హిమవంతుడు ఈవిధముగా పలికి పార్వతివైపు చూచుచు దోసిలి ఒగ్గి ప్రక్కన నిలుచుండెను.

లోకమునకు అగణివంటి ఆపార్వతీదేవి హిమవంతుని వాక్యమును విని, మనస్సుతో తనభర్తయగు శివుని స్మరించి చిరునవ్వుతో తండ్రిని గూర్చిఇట్లనెను.

పర్వతశ్రేష్ఠమా! ముందుగా రహస్యమైనది, ఈశ్వరవిషయకమైనది, బ్రహ్మవాదులగు వేదాంతుల చేత సేవింపబడుచున్నది అగు ఉపదేశమును వినుము.

ఈశ్వరసంబంధి, ఆశ్చర్యకరమైనది, సమస్తవిధశక్తులతో కూడియున్నది, అంతములేనిది, ప్రేరణకలిగించునది, లోకాతీతమైనది అగు ఏనామహత్తరరూపము చూడబడినదో,

సావధానమగు మనస్సుకలపోడవు, శాంతుడవు, అభిమానము అహంకారములను విడిచినవాడవు అయి ఆరూపమునందే శ్రద్దకలవాడవై, దానియందే నిమగ్నుడవై దానీనే శరణము పొందుము.

ఓతండ్రీ! అసాధారణమైన భక్తితో శ్రేష్ఠమైన సాయందలి భావమును పొంది, ఎల్లప్పుడు యజ్ఞములు, తపస్సు, దానములు మొద!! అన్నింటితో ఆరూపమునే పూజింపుము.

దానినే నీమనస్సుతో దర్శించుము. దానినే ధ్యానించుము. దానిని పూజింపుము. ఓ పుణ్యాత్ముడా! నాయొక్క ఉపదేశమువలన నీ సంసార బంధమును నశింపజేయుదును.

శ్రేష్టమైన భక్తితో ఈశ్వరసంబంధియగు యోగము నవలంబించిన నిన్ను, తొందరలోనే ఈ సంసారమనెడు సముద్రము నుండి ఉద్దరింతును.

ఓ పర్వతరాజా! ధ్యానమార్గముతో, కర్మయోగముతో, భక్తితో జ్ఞానయోగముతో నేను నీకు పొందుటకు శక్యురాలను, ఇతరరీశులలో కోళ్లట్లకూలురు కర్మలచేత కూడ అది సాధ్యముకోడు.

వేదములలో, ధర్మశాస్త్రములలో చెప్పబడిన వర్ణాశ్రమ సంబంధియగు కర్మను, ఆత్మవిషయాసకజ్ఞానముతో కూడచేర్చి మోక్షము కొరకు ఎల్లష్టుడు మేము.

థర్మము వలన భక్తి కలుగును. భక్తిచేత పరమాత్మజ్ఞానము కలుగును. వేదములచేత, ధర్మశాస్త్రములచేత చెప్పబడిన యజ్ఞాదిక మే ధర్మమని చెప్పబడును.

వేదమునుండి థర్మము ప్రకాశించినది. ఇతరమునుండి అది కలుగదు. కావున మోక్షార్టియై ధర్మమును కోరుచాడు నారూపమైన వేదము నాశ్రయించవలెను.

వేదవబుజ్ఞకులు, ప్రామీసమైన, యీఉత్కృష్టమైన శక్తినాకు చెందినదే. ఋక్కు, యజుస్సు, సామము అనుపేర్లతో సృష్టి ప్రారంభములో ప్రవర్తించివరి ఈశక్తి.

అవేదముల రక్షణ కొరకే భగవంతుడగు బ్రహ్మ, బ్రాహ్మణాదివర్ణములను సృష్టించి, వారిని తమతమకర్మలతో వియుమించినాడు.

ఎవరైతే, అణువుకే బ్రహ్మచేత సృష్టింపబడిన నా ధర్మము ననుకొంచరో అటువంటివారికి తామిస్రము మొదలగు వరకలోకములను అధోభాగమున నృష్టించెను.

వేదముకంటె ఇతరమైనది, ధర్మమును బోధించునది మరొకశాస్త్రమేదియులేదు. ఎవడు వేదములకంటే ఇతర విషయములందు ఆసక్తికల వాడై ప్రవర్తించవో, అట్టివాడు ద్వీజాతి వారిచే భాషింపబడుటకు తగినపొడుకోదు.

ఈలోకముతో వేదములకు, ధర్మశాస్త్రములకు విరుద్ధములైన ఏశాస్త్రములు బహువిధములుగా చూడబడుచున్నవో, వాని యొక్క ప్రధాన "అక్ష్యమయి మొగుణమునకు సంబంధించినది.

కాపాలము, భైరవము, యామలము, కామము, ఆర్హతము, ఇటువంటివే మరికొన్ని ఇతరశాస్త్ర సంప్రదాయములు లోకమును మోహింప జేరుటకమవుయొగించునవిగా తెలియవలెను.

ఎవరైతే రుబన్ల ములైన శాస్త్రముల ప్రకారముతో గణలోకములో మనుష్యులను మోహింపజేయుదురో, అటువంటివారిని జన్మాంతరములో మోహింపజేయుటకు శకముసశాస్త్రములు నాచే సృష్టింపబడినవి.

వేదార్థమును తెలిసినశ్రేష్మణచేత చేయుదుగినదిఠాయ వైదికకర్మ చెప్పబడినదో దానిని, నాకిష్టులైన మనుష్యులెవరో పోరు ప్రయత్నపూర్వకముగా అనుష్ఠిణయమన్నారు.

వర్ణములయందు దయచూపుటుకొరకు వా అజ్ఞవలన విరాట్పురుషుడగు స్వాయంభువమనువు పూర్వము మునులకు ధర్మములను బోధించెను.

ఆయననోటినుండి శ్రేష్టమైన ధర్మమును వివి ఇతర మునులు కూడ లోకములో ధర్మప్రతిష్టాపనకొరకు ధర్మశాస్త్రములను రచించిరి.

అవి మరల యుగాంత ప్రళయకాలములో లుప్తములు కాగా, బ్రహ్మవచనము ననుసరించి మహర్షులు ప్రతియుగములో మరల మరల రచింతురు.

బ్రహ్మయొక్క ఆదేశము ననుసరించి వ్యాసుడు మొదలగు మహరులచేత అష్టాదశపురాణములు చెప్పబడినవి. వానిలో ధర్మము ప్రతిష్ఠించ బడినది.

ఇతరములైన ఉపపురాణములు ఆమహరుల శిష్యులచేత చెప్పబడినవి. ప్రతియుగములో కూడ ఈలోకములో ధర్మశాస్త్రములు తెలిసినవాడే కర్తగా ఉండును.

శిక్ష, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, ఛందస్సు, జ్యోతిషశాస్త్రము, న్యాయవిద్య అనునవి అన్ని విద్యలకు సహకరించునవి.

ఈ విధముగా నాలుగు వేదములతో కలిపి పదునాలుగు విద్యలు చెప్పబడినవి. ఓ బ్రాహ్మణశ్రేష్ఠులారా! ధర్మమువీని యందు కాక ఇతరములందు ఉండదు.

ఇట్లు పీతామహుని నుండి వచ్చుచున్న శ్రేష్ఠ ధర్మమును మనువు, వ్యాసుడు మొదలగువారు, నా ఆజ్ఞననుసరించి సర్వప్రాణులు నశించు ప్రళయకాల పర్యంతము స్థాపించుచున్నారు.

వారందరుకూడ బ్రహ్మతోపాటు వారివారి నియతకాలపర్యంతము ప్రతిపర్యాయము తమవిధులను నిర్వర్తించి అవధియగు పరము సమాప్తముకాగా కృతార్థులై పరమ పదమును చేరుకొందురు.

అందువలన సంపూర్ణ ప్రయత్నముతో ధర్మము కొరకు వేదమును ఆశ్రయించవలెను. ధర్మముతో కూడిన జ్ఞానము పరబ్రహ్మ స్వరూపమును వెల్లడి చేయును.

ఎవరైతే సంసార సంబంధాలను విడిచి నన్నే శరణుపొందుదురో, ఎల్లప్పుడు భక్తితో ఈశ్వర విషయకమైన యోగము నవలంబించి సేవింతురో,

అన్ని భూతముల యందు దయకలవారై, శాంత స్వభావము కలిగి ఇంద్రియ నిగ్రహము కలవారై, అసూయ లేనివారు, గర్వరహితులు, మంచి వివేకము కలవారు, శ్రేష్ఠమైన వ్రతము నవలంబించిన మునులు.

నా యందు మనస్సు నిలిపినవారు, నా యందే తమ ప్రాణములను పొందించినవారు, నా విషయకమైన జ్ఞానమును బోధించుటలో ఆసక్తి కలవారు అగు సన్యాసులు, గృహస్థులు, వానప్రస్థులు, బ్రహ్మచారులు ఎవరు కలరో.

అటువంటి ఎల్లప్పుడూ పూనికతో ఉండు వారియొక్క మాయా ప్రభావము వలన కలిగిన అజ్ఞానాంధకారమును జ్ఞానమను దీపముతో తొందరలోనే సమూలముగా నశింపజేయుదును.

అట్టివారు ముఖ్యమైన జ్ఞానముచేత కడిగివేయబడిన చీకటి కలవారై సోయందే నిమగ్నులై సర్వదా ఆనందానుభవము పొందుచు మరల మరల జన్మించకుండా ముక్తిని పొందుదురు.

అందువలన నీవు అన్నివిధముల నాయందు భక్తి కలిగి, నన్నే ఆశ్రయించిన వాడవై, మనస్సుతోనన్ను శరణుపొంది అన్నిచోట్ల నన్నే పూజించుచుండుము.

ఒకవేళ నాయొక్క ఈశ్వర సంబంధి, నాశరహితము అయిన రూపమును ధ్యానించుటకు శక్తుడవు కానిచో, అప్పుడు నాయొక్క కాలాది రూపమైన పరమ రూపమును శరణు పొందుము.

ఓతండ్రీ! ఏనా స్వరూపము నీ చిత్తమునకు గోచరమగునో, దానియందే నిష్ఠకలవాడవై, దానియందు శ్రద్ధనుంచి, దానినే పూజించు ఆసక్తి కల వాడవుకమ్ము.

భేదరహితము, జ్ఞానమాత్ర రూపము, అద్వితీయము, మంగళకరము అయిన నా రూపమేది కలదో, అది అన్నివిధముల ఉపాధుల నుండి దూరమైనది, అంతములేనిది, అమృత స్వరూపము, సర్వోన్నతము.

ఆ పరమ పదము ఒక్క జ్ఞాన సాధనముచేతనే అతికష్టముతో పొందుటకు శక్యమైనది. జ్ఞానమునే దర్శించునట్టివారు నన్నే చేరుకుందురు.

ఆ పరమపదమునందే బుద్ది నిలిపినవారై దానియందు నిష్ఠకలిగి, శ్రద్దకలవారై అదియే స్వరూపముగా కలిగి, జ్ఞానముచేత తొలగించబడిన పాపములు కలవారై పునర్జన్మరాహిత్యమును పొందుదురు.

ఓరాజోత్తమా! నన్ను ఆశ్రయించక శ్రేష్ఠము, నిర్మలము అగు మోక్షపదము పొందబడదు. అందువలన నన్నే శరణుపొందుము.

అద్వైత భావనతోకానీ, భేదభావముతోకాని రెండు విధములచేతగాని, ఓరాజా! నన్ను సేవించినచో తరువాత నీవు ఆ పరమపదమును పొందగలవు.

ఓరాజశ్రేష్టుడా! సహజముగా స్వచ్ఛమైనది, మంగళకరము అగు ఆ పరతత్వము నన్నాశ్రయించక తెలియబడదు. అందువలన నన్ను శరణుపొందుము.

అందువలన నీవు నాశరహితము, నిత్యము అగు ఈశ్వరసంబంధి రూపమును ప్రయత్నపూర్వకముగా పూజింపుము. దానివలన నీవు అంధత్వమును పోగొట్టుకుందువు.

కర్మాచరణచేత, మనస్సుచేత, వాక్కుచేత, అంతట ఎల్లప్పుడు మంగళరూపమైన ఆ తత్త్వమును శ్రద్ధాభావముతో ఆరాధించుము. అప్పుడు ఆ పరమపదమును చేరగలవు.

నాయొక్క మాయచేత మోహము పొందింపబడినవారు ఆ పరతత్త్వమును ఆద్యంతములు లేని శ్రేష్ఠమైన జన్మరహితుడైన దేవుడగు మహేశ్వరుని పొందజాలరు.

సమస్తభూతముల ఆత్మలయందున్నది, అన్నింటికాధారభూతమైనది, మాలిన్యములేనిది, సదాఆనందరూపము, ఆభాసము లేనిది, గుణములు లేనిదీ, తమోగుణమున కతీతమైనది.

భేదరహితము, నిశ్చలము, బ్రహ్మరూపము, కలారహితము, ప్రపంచంబంధములేని, స్వయముగా తెలియదగినది, తెలియరానిది, పరమాకాశమునందునిలిచియున్నది.

నాయొక్క మాయచేత ఎల్లప్పుడు సూక్ష్మమైన అజ్ఞానమను చీకటిచే కప్పబడినవారై భయంకరమైన సంసారమను సముద్రమునందు మాటిమాటికి జన్మించుచుందురు.

ఓరాజా! అసాధారణమైన భక్తితో, శ్రేష్ఠమైన జ్ఞానముతో, జన్మలను బంధములనుండి విడుదలకొరకు ఆపరబ్రహ్మరూపము వెదుక దగి యున్నది.

అహంకారమును, అసూయను, కోరికను, కోపమును, అధర్మమునందు పూనికను గూడ వదలి వైరాగ్యభావము నవలంబించి;

సమస్తభూతముల యందు తన ఆత్మను, తనయందు సర్వభూతములను చూచి, తనలో ఆత్మరూపాన్ని దర్శించి పరబ్రహ్మసాయుజ్యమున కరుడగును.

పరబ్రహ్మస్వరూపుడై, నిర్మలమైన ఆత్మకలవాడై, సమస్తభూతముల కభయమునిచ్చువాడై, ఈశ్వరభావమును, అనితర సాధారణమైన గొప్ప భక్తిని పొందగలడు.

కలారహితమైన, ఈశ్వరసంబంధ ఆపరతత్త్వము దర్శింపబడును. అట్లు చూచినవాడు అన్ని సంసారబంధముల నుండి విడువబడి బ్రహ్మమునందే నివసించును.

ఈ పరమశివుడు పరబ్రహ్మముయొక్క ఆశ్రయస్థానము. ఈ మహేశ్వరుడు అద్వితీయుడు, నాశరహితుడు, ఒంటరివాడు, ఆత్మలకాధార భూతమైనవాడునై ఉన్నాడు.

ఓరాజా! జ్ఞానముచేతగాని, కర్మయోగముచేతగాని, భక్తి, యోగముచేతనైన అన్ని సంసారబంధములనుండి విడుదలకొరకు ఈశ్వరుని శరణుపొందుము.

ఓ పర్వతరాజా! ఈరహస్యమైన ఉపదేశము నాచేత నీ కొసగబడినది. దీని నంతయు చక్కగా ఆలోచించి, నీ యిష్ట ప్రకారము కర్తవ్యము నాచరింపుము.

పరమేశ్వరుని వలన సంభవించిన నేను, మహేశ్వరుని దూషించిన నా తండ్రియగు దక్షుని నిందించి, దేవతలచేత ప్రార్ధింపబడితిని.

ధర్మమును స్థాపించుటకొరకు, నిన్నారాధించవలెనను కారణము వలన హిమవంతుని భార్యయగు మేనాదేవి శరీరమునుండి పుట్టి నిన్న తండ్రిగా ఆశ్రయించితిని.

నీవు పరమాత్మయగు బ్రహ్మదేవుని యొక్క శాసనమువలన పరంపర సమావేశములో నన్ను రుద్రునికి భార్యగా ఆర్చించగలవు.

ఓరాజా! ఆ సంబంధకారణమున ఇంద్రునితో కూడ దేవతలందరు నీకు నమవంతురు - దానివలన శంకరుడు కూడ ప్రసన్నుడగును.

అందువలన సంపూర్ణ ప్రయత్నముతో నన్ను ఈశ్వరునికి లక్ష్యమైన దామినిగా గుర్తించుము. భగవంతుడైన ఈశానుని పూజించి శరణు పొందదగిన అతనిని శరణు పొందుము.

దేవతలకు దేవతయగు ఆపార్వతిచేత ఈ విధముగా చెప్పబడిన పర్వతరాజుగు హిమవంతుడు దేవికి శిరస్సుతో నమస్కరించి చేతులు జోడించి మరల ఇట్లనెను.

ఓ మహేశ్వరీ! శ్రేష్ఠమైన, మహేశ్వర సంబంధమైన యోగమును, జ్ఞానమును, ఆత్మయోగమును, వాని సాధనములను గూర్చి విస్తరముగా నాకు తెలుపుము.

ఆ యీశ్వరుని యొక్క యీ గొప్ప జ్ఞానమును, ఉత్తమమైన ఆత్మయోగమును, వాని సాధనములను గురించీ సమర్ధురాలవైన నీవు ఉన్నదున్నట్లుగా వివరించి చెప్పుము.

లోకమాతయగు పార్వతియొక్క ముఖ పద్మము నుండి ఉత్తమమైన జ్ఞానమార్గమును గూర్చి విని లోకముచే పూజింపబడు పర్వతరాజు మరల యోగము నందాసక్తుడాయెను.

ఆ హీమవంతుడు, అదృష్టము నందలి గౌరవము వలన బ్రహ్మదేవుని ఆజ్ఞ వలన సాధ్వియుగు పార్వతిని, దేవతల సన్నిధిలో మహేశ్వరునకు కన్యాదానము చేసెను.

దేవి యొక్క మాహాత్యమును వర్ణించునట్టి యీ అధ్యాయమును, శుచియై, శివుని సన్నిధి యందు, అతని ముందే భావమును నిలిపి ఎవడు భక్తితో పఠించునో

దివ్యమైన యోగవిద్యతో కూడి, అన్ని పాపముల నుండి తొలగింపబడి, బ్రహ్మలోకమును దాటి దేవి యొక్క స్థానమును పొందగలడు.

ఎవడు ఈస్తోత్రమును బ్రాహ్మణుల సమీపములో చదువునో, ఏకాగ్రత కలిగిన మనస్సుతో కూడి అతడు కూడా అన్ని పాపముల చేత విడువబడుచున్నాడు.

దేవి యొక్క ఒక వేయి పైన ఎనిమిది నామములు ఏవైతే చెప్పబడినవో, వానిని తెలిసికొని, సూర్యమండల మందు చేరి యున్న పరమేశ్వరిని ఆవాహనము చేసి.

భక్తియోగముతో కూడుకొని, చందసము పూలు మొదలగు వానితో పూజించి, దేవి యొక్క మహేశ్వర సంబంధమైన దివ్యభావమును, ఆమె ఉన్నతస్థానమును స్మరించుచు,

ఇతరము నందు మనస్సు నిలుపక బ్రాహ్మణుడైన వాడు మరణ పర్యంతము ఎల్లపుడు జపించవలెను. అట్టివాడు అవసాన కాలములో స్మరణను పొంది పరబ్రహ్మమును చేరుకుంటాడు.

లేదా నిర్మలమైన బ్రాహ్మణుని వంశములో విప్రుడుగా జన్మించును. పూర్వజన్మ సంస్కారపు గొప్పతనము వలన వేదాంత విద్యను సాధించగలడు.

ఉత్తమమైన, దివ్యమైన, పరమేశ్వర సంబంధియైన యోగవిద్యను పొంది, శాంతుడై, ఆత్మనిగ్రహమును పొంది చివరకు శివసాయుజ్యమును పొందును.

త్రికాలముల హోమముల యందు ప్రత్యేకముగా సోమాలతో హోమము చేయవలెను. దాని వలన మహామారి వ్యాధి వలన కలిగే దోషముల నుండి, గ్రహ సంబంధములైన దోషముల నుండి కూడా విముక్తుడగును.

ఒక సంవత్సరకాలము ప్రతిదినము ఏమరుపాటు లేక యీ నామాలను జపించుట ఐనా చేయవలెను. సంపదను కోరువాడు పార్వతీదేవిని పద్ధతి ప్రకారము పూజించి జపించవలెను.

ఆ దేవికి పార్యభాగములో మూడు నేత్రములు కల శివుని భక్తి శ్రద్ధలతో పూజించి, ఆ మహాదేవుని అనుగ్రహము వలన గొప్ప సంపదను పొందగలడు.

 

అందువలన అన్ని విధముల ప్రయత్నముతో బ్రాహ్మణుల చేత, అన్ని పాపములను తొలగించుకొనుట కొరకు దేవి యొక్క వేయి నామములు జపీంచదగినవి.

సూతుడు పలికెను -

బ్రాహ్మణులారా! దేవి యొక్క గొప్పనైన యీ మాహాత్మ్యము మీకు తెలుపబడినది. దీని తరువాత భృగువు మొదలగు వారి ప్రజాసృష్టి క్రమమును గూర్చి తెలిసికొనుడు.

శ్రీ కూర్మపురాణములో దేవీ మాహాత్మ్యవర్ణనమను ద్వాదశాధ్యాయము సమాప్తము.