కూర్మ మహా పురాణము

Table of Contents

17వ అధ్యాయము

వ్యాస మహర్షి పలికెను.

మోహము వలన కాని ఇతర కారణముల వలన కానీ బ్రాహ్మణుడు శూద్రుని అన్నమును భుజించరాదు. ఆపదలేనపుడు శూద్రాన్నమును భుజించినచో శూద్రునిగా పుట్టును. ఆరునెలలు శూద్రాన్నమును భుజించినచో బ్రతికుండగానే శూద్రుడగును. మరణించిన తరువాత శునకముగా పుట్టును.

బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాన్నములలో ఎవరి అన్నము కడుపులో నుండగా మృతి చెందునో ఆ జాతిలో పుట్టును.

రాజాన్నమును నర్తకాన్నమును వడ్రంగి అన్నమును చర్మకారుల అన్నమును, బ్రాహ్మణ సమూహాన్నమును, వేశ్యాన్నమును, నపుంసకుని అన్నమును విడువ వలయును. గానుగతో బ్రతుకు వారి అన్నమును, రజకుల, తస్కరుల, మద్య విక్రేతల గాయకుల లోహికుల, సూతకుల అన్నమును విసర్జించ వలయును.

కుమ్మరి, చిత్రకారీ, వడ్డీ వ్యాపారి, పతితుల అన్నమును, భర్త చనిపోయిన తరువాత ద్వితీయ వివాహము చేసుకున్న స్త్రీ అన్నమును, మంగలి అన్నమును, నిందితుని అన్నమును విసర్జించవలయును. స్వర్ణకారుల, నటులు, వ్యాధుల, బంధనము పొందిన వాని, వ్యాధితుని, వైద్యుని పుంశ్చలి అన్నమును దండించు వాని అన్నమును భుజించరాదు. చోరుని అన్నమును నాస్తికుల అన్నమును దేవతానించకుల అన్నమును సోమ లతను విక్రయించు వారీ ఆన్నమును, విశేషించి చండాలుని అన్నమును, భార్యా విధేయుని అన్నమును ఉపపతి ఇంటిలోనే ఉన్న భార్యా విధేయుని అన్నముసు, సమాజ బహిష్కృతుని అన్నమును, లోభి అన్నమును, ఉచ్చిష్టమును భుజించువాని అన్నమును భుజించరాదు.

పంక్తి బహిష్కృతుని అన్నమును, సమూహాన్నమును, శస్త్ర జీవి అన్నమును, నపుంసకుని అన్నమును, సన్యాసి అన్నమును, మత్తుని ఉన్మత్తుని అన్నమును, భయపడుచున్న బౌనీ అన్నమును, ఏడ్చుచున్న వాని అన్నమును అభిశప్మనీ అన్నమును, తుమ్ము వలన అపవిత్రనుగు అన్నమును, బ్రాహ్మణులను ద్వేషించు వారి అన్నమును, పాపమునందు అభిరుచిగల వారీ అన్నమును, శ్రిద్యోన్నమును, సూతకాన్నమును, ప్రయోజన శూన్యముగా వండిన అన్నమును భుజించరాదు. (భగవన్నివేదితము కానిది) శవములు మోసి జీవించువారీ అన్నమును సోమరిగా వృత్తి శూన్యునిగా నుంటూ మామ గారింటిలో భోజనమును, సంతానము లేని స్త్రీ అన్నమును భృత్యుల భోజనమును, శిల్ప కారుల అన్నమును, విశేషించి శస్త్రముల నమ్మువాని అన్నమును భుజించరాదు.

మద్యమును చేయువారి అన్నమును, సుతీగాయకుల అన్నమును, వైద్యుల అన్నమును, విద్ధలింగుల అన్నమును అన్నకు వివాహము కాకుండగా వివాహము చేసుకున్న తమ్ముని అన్నమును భుజించరాదు. రెండవ వివాహము చేసుకున్న స్త్రీ అన్నమును రెండవ వివాహము చేసుకున్న స్త్రీ భర్త అన్నమును విశ్లేషించి పరిత్యజించవలయును. అనాదరముతో ఇచ్చినది, తిరస్కారముతో ఇచ్చినది, కోపముతో ఇచ్చినది, ఆశ్చర్యముతో ఇచ్చినది అన్నము గురువుదైననూ భుజించరాదు. సంస్కార హీనమగు అన్నమును భుజించరాదు. మనుష్యుని పాపమంతయూ అన్నములోనే ఉండును. ఎవరి అన్నమును తినునో వారి పాపము కూడో అనుభవించవలసి వచ్చును.

బ్రాహ్మణుని పొలమును సేద్యము చేసి డబ్బు సంపాదించు కొనిన వానీ అన్నమును, తాత ముత్తాతల నుండి బ్రాహ్మణుని ఇంటిలో ఉంటున్న వాని భోజనమును, తమ ఆవులను పాలించువాని అన్నమును, మంగలి అన్నమును తనను సంపూర్ణముగా బ్రాహ్మణులకు అర్పించిన వారి అన్నమును భుజించవచ్చును.

గాయకుల కుంభకారుల, రైతుల అన్నమును కొద్దిగా మూల్యమునిచ్చి భుజించవలయును. పాయసమును, నేతితో వండిన దానిని, పాలు పెరుగు వెన్న నెయ్యి మొదలగు వానిని, సత్తు పిండిని, తెలక పిండి, నూనె ఇవి శూద్రుల నుండి గ్రహించవచ్చును.

వంకాయ, నాలికా శాకము, అవిశపూవు, అశాంతకము, వుల్లి, వెల్లుల్లి, శుక్తము, చెట్టు బెరడును భుజించరాదు. పుట్టగొడుగు, ఊరు పంది, శ్లేష్మాతకము, జున్ను, విరిగిన పాలు, సుముఖమను శాక విశేషమును, కవకమును భుజించరాదు. గురివింద, మోదుగు, తంగేడు, మేడి, అల్ల నేరేడు భుజించినచో పతీతుడగును.

భగవంతునికి నివేదన చేయనీ నువ్వుల పొంగలిని, పాయసమును, అపూపములను సంస్కరీంచబడనీ మాంసము, దేవతలకు బలిగా సమర్పించిన అన్నమును పురోడాశాదీ హవ్యము, గంజి, కుడితి, సంస్కరించని మత్స్యములు, కదంబము, వెలగ, జువ్వులను, ప్రయత్న పూర్వకముగా విడువ వలయును. పిణ్యాకము (తెలగపిండీ) నెయ్యి నుండి తీసినవి దేవ ధాన్యము, రాత్రిపూట తీలసంబంధి పదార్థము, పెరుగు ప్రయత్నముతో విడువ వలయును. పాలతో కలిపి మజ్జిగ త్రాగరాదు. విత్తనముల నమ్మీ జీవించరాదు. భావ దుష్టము క్రియాదుష్టము దుస్సంగమును వీడువ వలయును.

కేశములతో కీటములతో కూడియున్నది. హృదయ చికిత్సకుపయోగించిన అన్నమును, కుక్కముట్టినది, మరల వేడి చేసినది చండాలుడు చూచినదీ రజస్వలచే, పతీతులచే, గోవుచే వాసన చూడబడినది, అనుదారముగా పెట్టినది, పొసినది, ఒకరీ అన్నమును ఇంకొకరు పెట్టినచో కొక సంస్పృష్టము, పురుగులతో కూడియున్నది, మనుష్యులు వాసన చూచినది, కుష్టువ్యాధి గలవారు తాకినది తినరాదు. రజస్వల పెట్టినది, వ్యభిచారిణీచే పెట్టబడిన, కోషించినవారు పెట్టినది, మురికి బట్టలతో పెట్టినది, ఇతరుల వస్త్రములను విడువవలయును. దూడలేని అవుపాలు, ఒంటెలు, ప్రసవించిన పదిరోజులలోపు ఆవుపాలు గొట్టిపాలు, గర్భిణీ గోవుపాలు త్రాగరాదు అని మనువు చెప్పెను.

కొంగ, హంస, దాత్యూహ, కలవింకము, చిలుక, కురరము, చకోరము, జలపాదము, కోకిల, కాకి, కాటుకపిట్ట, డేగ, గద్ద, గుడ్లగూబ, చక్రపోకము భాసము, పార్వతము పావురము, తాబేలు, ఊరు కోడీ, సింహము, పెద్దపులి, పిల్లి, కుక్క పంది, నక్క కోతి, గాడిద మాంసములను తినరాదు. అన్ని మృగములను అన్ని పక్షులను అన్ని వనచరములను భక్షించరాదు. జలచరములను స్థలచారములను ప్రాణులను తినరాదు. ఉడుము, తాబేలు, కుందేలు, ముళ్ళఏదు, ఏదు, అయిదు అయిదు గోళ్ళుకలవి తినవచ్చునని మనువు చెప్పెను. మత్స్యములను మాంసమును దేవ బ్రాహ్మణులకు నివేదించియే భక్షించ వలయును. నివేదించక తినరాదు. నెమలీ, తిత్తిరి, పావురము, కపింజలము వార్ధాణసము, ఐకము తినదగినవి. చేపలు, హంసలు, శఫరములు సింహ తుండములు తాబేలు, లేడి, చేపలు ఇవి తీనదగినవి గా పేర్కొనబడినవీ వీటి మాంసమును పరిశుద్దిగాచించి యథావిధిగా నీయమీంచబడీయే తినవలయును. ప్రాణము పోయిననూ విధిని తప్పురాదు. మాంసములను తినరాదు. దేవతా శేషము భుజించిన తప్పులేదు. మందు కొరకో, శక్తి లేనపుడో, ఆజ్ఞవలననో, యజ్ఞకారణముననో తీనవచ్చును. శ్రాద్ధ భోజనమునకు దైవకర్మకు పిలువ బడినవారు శ్రాద్ధమున మాంసమును వడ్డించినవాడు ఆపశువు రోమములన్ని సంవత్సరాలు నరకముననివసించును. బ్రాహ్మణులు మద్యమును ఈయరాదు. త్రాగరాదు, తాకరాదు, చూడరాదు. కావున అన్ని విధములుగా ఎప్పుడూ మద్యమును పరిత్యజించవలయును. మద్యపానము చేసినవాడు పతీతుడగును. పోనీతో మాట్లాడరాదు. తినకూడని వానీని తీసిన, త్రాగకూడని వాటిని త్రాగిన ద్వేజుడు సర్వకర్మలకు అయోగ్యుడగును. కావున ఎపుడు విప్రుడు అభక్ష్యములను అపేయములను విడువవలయును. అట్లు విడువనిచో గౌరవ నరకమును పొందును.

ఇదీ కూర్మపురాణమున షట్సాహాస్ర సంహితలో ఉపరి భాగమున 17వ అధ్యాయము.