కూర్మ మహా పురాణము

Table of Contents

25 - యదువంశ కృష్ణకీర్తి వర్ణనము

తరువాత భగవంతుడు, విష్ణువు యొక్క అవతారము, ఇంద్రియములకధిపతి యగు కృష్ణుడు, తపస్సుకు తానేనిధి వంటి వాడైనను పుత్రలాభము కొరకు ఘోరమైన తపస్సును చేసెను.

తనఇచ్ఛాపూర్వకముగా భూమీయందవతరించినవాడైనను, కృతార్థుడు, విశ్వమును సృజించువాడును అయినప్పటికి ఆ కృష్ణుడు పరమేశ్వరుడైన రుద్రుని తన యాత్మకు మూలమైనవానిగా తెలుపుచు. తపస్సు చేసెను.

ఆ కృష్ణుడు, యోగులచే నివసింపబడినది, వివిధపక్షి సమూహముతో కూడినది, మహాత్ముడైన ఉపమన్యువనుముని శ్రేష్టుని యొక్క ఆశ్రమమును గూర్చివెళ్లెను.

అతడు మిక్కిలి తేజస్సుతో కూడిన పక్షిరాజైన గరుత్మంతుని అధిరోహించి, శంఖము చక్రము గదలను చేతులయందు ధరించినవాడై, శ్రీ వత్సమను అంకముతో కూడియున్నవాడునై ఉండెను.

అనేకములైన చెట్లతో, తీగలతో నిండియున్నది, వివిధములైన పుష్పములతో ప్రకాశించుచున్నది, ఋషులయొక్క ఆశ్రమాలతో కూడి యున్నది, వేదమంత్రోచ్చారణతో ప్రతిధ్వనించునది అగు ఆశ్రమానికి కృష్ణుడు వెళ్లెను.

సింహములు, ఎలుగుబంట్లు, శరభములు అను మృగములతో కూడియున్నది, పెద్దపులులు, ఏనుగులతో కూడినది, నిర్మలములు రుచికరములైన జలములుగల కొలనులతో ఒప్పుచున్నదై ఆశ్రమప్రదేశముండెను.

అనేకవిధములైన తోటలతో, మంగళకరములైన దేవతామందిరాలతో కూడియున్నది; ఋషులు, వారికుమారులు, గొప్పమునుల సమూహములతో కూడియున్నది ఆ ఆశ్రమప్రదేశము.

వేదముయొక్క అధ్యయనముతో పరిపూర్ణులైనవారు, నిత్యాగ్నిహోత్రులు, యోగులు, ధ్యానమందునిమగ్నులైనపోరు, నాసికాగ్రభాగమున నిలిపిన చూపుకల వారీతో కూడియున్నదో ఆశ్రమము.

పరతత్త్వస్వరూపమును దర్శించిన జ్ఞానులైన వారితో కూడియున్నది. అంతట పుణ్యమయమైనది, చుట్టుపట్లనదులతో బ్రహ్మవాదులైన జపకర్తలతో సేవింపబడిన ఆశ్రమ స్థానము.

ఈశ్వరుని ఆరాధించుటయందు శ్రద్ధకల పుణ్యాత్ములైన మునులచేత సేవింపబడినది, మిక్కిలి శాంతప్రవృత్తి కలవారు, సత్యమైన సంకల్పము కలవారు, శోకరహితులు, ఉపద్రవరహితులు అగు మునులతో కూడినదాప్రదేశము.

 భస్మలేపనముతో తెల్లనైన సమస్తావయవములు కలపోగు, రుద్రమంత్రజపమునందు ఆసక్తికలవారు, జడలనుధరించినవారు, కేశఖండనము చేయించుకున్నవారు, పరిశుద్దులు, శిఖలను జడలను ధరించినవారును అగు మునులతో కూడిన ఆశ్రమమునకు కృష్ణుడు వెళ్లెను.  

జ్ఞానవంతులు, వేదాంతబోధకులు అయిన మునులచేత ఎల్లప్పుడు సేవింపబడునది, సిద్ధుల ఆశ్రమములచేత అలంకరింపబడినదియు నగు మనోహరమైన ఆయాశ్రమమునందు;

పాపములను నశింపజేయునట్టి గంగానది ఎల్లప్పుడు ప్రవహించుచుండును. విశ్వరూపుడైన ఆ కృష్ణుడు అక్కడ పాపములకు దూరులైన మునులను చూచి;

నమస్కారముతో, వాక్కుతోగూడ వారిని గౌరవించెను. ఆమునులు, శంఖచక్రములను గదను ధరించువాడు, ప్రపంచమునకు మూలకారణమైనవాడును అగు అతనిని చూచి;

యోగీశ్వరులకు గొప్పగురువైన అతనికి భక్తితో వందనము చేసిరి. సనాతనుడైన అతనిని తమహృదయాలలో నిలుపుకొని వైదిక మంత్రములతో స్తోత్రము చేయసాగిరి.

వారు తమలోతాము కృష్ణునిగురించి ఆదిదేవుడని, అవ్యక్తరూపుడని, గొప్పమునీశ్వరుడని చెప్పుకొనిరి. ఇతడు సాక్షాత్తు అద్వితీయుడైన భగవంతుడనీ, సాక్షిభూతుడని, పరమపురుషుడైన నారాయణుడనికూడ ప్రశంసించిరి.

  ప్రధానపురుషుడైన భగవంతుడు ఇప్పుడు స్వయముగా ఇక్కడికి వచ్చియున్నాడు. ఇతడే నాశరహితుడు, సృష్టికర్త, రక్షించువాడు, లయకారకుడు కూడ అయియున్నాడు.

రూపరహితుడైన భగవంతుడు ఆకారమును ధరించి మునులను చూచుటకు ఇక్కడికి వచ్చినాడు.

“ఈతడు మొదలులేనివాడు, నాశరహితుడు, అంతములేనివాడు. మహాభూతస్వరూపుడు, మహేశ్వరుడుకూడ” అని పలుకుచున్న ఆమునుల మాటలను విని, వాక్కుల కగోచరుడైన హరిరూపుడగు కృష్ణుడు తన కర్తవ్యమును తలచి;

శీఘ్రముగా మహాత్ముడైన ఆమునియొక్క ఆశ్రమమునకు బయలుదేరెను. దారిలో ప్రతి తీర్ధస్థలములో మనః పూర్వకముగా ఆచమన పూర్వకముగా జలమును త్రాగి కృష్ణుడు ముందుకు సాగెను.

దేవకీపుత్రుడైన కృష్ణుడు దేవతలకు, ఋషులకు, పితరులకు తర్పణములు విడిచెను. ఆయానదులయొక్క తీర ప్రదేశముల యందు మునీశ్వరులచేత పూర్వము స్థాపించబడినటువంటి;

అధిక తేజస్సుగల శివునియొక్క లింగములను పూజించెను. తమదగ్గరకు వచ్చుచున్న శ్రీకృష్ణుని ఆయాస్థలములలో చూచి, చూచీ; 

ఆ ప్రాంతాలలో నివసించు జనులు, పూవులతో, అక్షతలతో పూజించిరి. శార్ఙమను ధనుస్సును, శంఖమును, ఖడ్గమును ధరించిన ఆవాసుదేవుడగు కృష్ణుని చూచి;

అందరు మంగళశరీరుడైన అతనియందు లగ్నమైనమనస్సు కలవారై చలనము లేనివారై నిలిచిపోయిరి, ఉన్నతస్థానమును పొందగోరు వారి మనస్సులు ఆ శ్రీకృష్ణుని.  చూచి సమాధానమును పొందినవయ్యెను. పూర్వము హారినుండి విముఖముగా నున్న మనస్సులు ఇప్పుడు అభిముఖములాయెను. తరువాత గంగానదియందు స్నానముచేసి, దేవతలకు, ఋషులకు తర్పణములిచ్చి,  శ్రేష్టములైన పూవులను తీసుకొని మునీంద్రుని గృహమును ప్రవేశించెను. యోగులలో శ్రేష్టుని, భస్మముతో పూయబడిన శరీరముకల వానిని, జడలను, నారబట్టలను ధరించిన వానిని, శాంతుని ఆమునినిగూర్చి నమస్కరించెను. తత్త్వవేత్తయగు నతడు తన దగ్గరకు వచ్చుచున్న కృష్ణుని చూచి పూజించెను.

యోగులకు మొదటి అతిథియగు కృష్ణుని ఆసనమునందు కూర్చొని నియోగించెను. “వాక్కులకు కారణభూతుడవు, సర్వోత్తమమైన స్థానభూతుడువుగా తెలిసికొనుచున్నాము” అని పలికెను.

ఇంద్రియములకు గోచరముకాని స్వరూపము కల విష్ణుడవని, శిష్యభావముతో ఇప్పుడు నిలిచియున్నావని గుర్తించినాము. ఇంద్రియముల కధీశ్వరుడైన స్వామీ నీకు స్వాగతము. మాతపస్సులు సఫలములైనవి.

జగద్రూపుడైన విష్ణువే స్వయముగా మా యింటికి వచ్చినాడు. ఎంత ప్రయత్నించినప్పటికీ యోగీశ్వరులు, మునులు కూడ నిన్ను చూడ జోలకపోవుచున్నారు.

అటువంటి మహాపురుషుడవగు నీకు ఇక్కడికి వచ్చుటలో కారణమేమిటి? అని పలికిన ఉపమన్యుముని యొక్క వాక్యమును విని భగవంతుడు, దేవకీకుమారుడైన శ్రీకృష్ణుడు;

గొప్పయోగీశ్వరుడగునతడు నిర్మలుడైన ఆ మునికి నమస్కరించి ఇట్లనెను. “మహాత్మా నేను చర్మధారీ, గిరీశుడు అగుశివుని దర్శింప గోరుచున్నాను.

భగవంతుని చూచుటయందు కుతూహలము కలవాడనై నీ వద్దకువచ్చినాను. యోగవేత్తలలో శ్రేష్ఠుడగు, భగవంతుడు శివుడు ఏ విధముగా చూడదగినవాడు?

అచిరకాలములో ఆ ఉమాపతిని నేను ఎక్కడ చూడగలను? పూజ్యుడగు ముని బదులు పలికెను. పరమేశ్వరుడు భక్తిచేతనే కాని, తీవ్రమైన తపస్సుచేతగానీ చూడబడును. అందువలన నీవు నియమవంతుడవై ఇక్కడ తపస్సుచేయము. ఇక్కడ బ్రహ్మపోదులగు మునిశ్రేష్ఠులు దేవదేవుడగు ఈశ్వరుని  ధ్యానింతురు, ఆరాధింతురు కూడ. యోగులు, మునులు కూడ ఆయస నర్చింతురు. వృషభధ్వజుడైన శివుడు ఇక్కడ భార్య యగు పార్వతితో కూడ, యోగులచేత పరివేష్టింపబడి భూతగణముతో క్రీడించుచుండును. ఈ ఆశ్రమమందు పూర్వము రుద్రునిగూర్చి మిక్కిలీ తీవ్రమైన తపస్సును చేసి

మహాత్ముడగు వసిష్ఠఋషి మహేశ్వరునివలన యోగవిద్యను పొందెను. ఇక్కడనే కృష్ణద్వైపాయనుడగు భగవంతుడు వ్యాసుడు స్వయముగా ఆ పరమేశ్వరుని దర్శించుకొని ఈశ్వర సంబంధీ జ్ఞానమును పొందినాడు. శివునియొక్క మనోహరమైన ఈ యాశ్రమ స్థానంలో తపస్సుచేసి  భక్తితో కూడిన పండితులు రుద్రునివలన పుత్రులను పొందిరి. ఇక్కడ దేవతలు, మహాదేవి, మహేశ్వరి అగు పార్వతీదేవిని స్తోత్రముచేయుచున్నవారై, మహాదేవునీ కూడ భజించి భయములేనివారై నిత్యానందమును పొందిరి. తపస్వులలో శ్రేష్టుడైన సావర్ణి ఇచ్చట మహాదేవుని పూజించీ ఉత్తమమైన యోగసిద్ధిని పొందెను. శ్రేష్టమైన గ్రంథకర్తృత్వమును గూడ లభించేను. ఆ సావర్ణి తాను రచించిన మంగళప్రదమైన సంహితను లోకమునందు ప్రవర్తింపజేసెను. పురుషోత్తమా ఈ ప్రదేశంలోనే కాపేయుడైన శాంశపాయనుడు మహాదేవుణ్ణి దర్శించి అతని ఆజ్ఞనుపొంది పన్నెండువేల శ్లోకాలు గలిగిన ఈ పురాణ సంహితను విరచించినాడు. వేదసమ్మితమైనది, పుణ్యమును కలిగించునది అయిన వాయవీయపురాణ సంహీతయొక్క పదహారు వేల శ్లోకాలుగల ఉత్తరభాగము ఇక్కడే ప్రవర్తితమైనది. ఇక్కడనే విప్రులు, విప్రోత్తములు శాంశపాయనునిచేత చెప్పబడినది, పుణ్యమును కలిగించునది అయిన పురాణమును అతనీ అనుగ్రహముచే విస్తరించిరి, మహాయోగి అయిన యాజ్ఞవల్క్యుడు ఇక్కడే తపస్సుచేసి పరమశివుని దర్శించి అతని ఆజ్ఞచేత అత్యుత్తమమైన యోగశాస్త్రమును రచించేను. పూర్వము భృగుమహర్షి కూడా ఇక్కడే గొప్ప తపస్సుచేసి పరమశివుని అనుగ్రహముచేత యోగవేత్తలలో శ్రేష్ఠుడైన పుత్రుడిని పొందెను.

అందువలన దేవా నీవు ఇక్కడనే మిక్కిలి కష్టసాధ్యమైన తపస్సు నాచరించి, ఉగ్రుడు, భయంకరుడు, కపర్దము కలవాడగు నీశ్వరుని చూచుటకు తగియున్నావు.

ఇట్లు పలికి గొప్పమునీయగు ఉపమన్యువు అద్భుతకర్మలు కలిగిన కృష్ణునకు జ్ఞానమును, నియమమును, పాశుపతయోగమును ఇచ్చెను.

మధువును చంపిన ఆనారాయణుడు ఆ మునిశ్రేష్ఠునిచేత చెప్పబడినవాడై సమర్థుడగునాతడు అక్కడనే తపస్సుచేత రుద్రుని ఆరాధించేను.

భస్మలేపనము చేయబడిన అన్ని అవయవములు కలవాడు, కేశఖండనము చేయించుకొని, నారబట్టలు ధరించినవాడై, శివునియందే లగ్నము చేయబడిన మనస్సుకలవాడై నిరంతరముగా శివుని గూర్చి జపించెను.

తరువాత చాలా కాలము గడువగా, చంద్రకళను అలంకారముగా ధరించిన శివుడు ఆకాశమార్గమున దేవితో కూడ కృష్ణునకు సాక్షాత్కరించెను.  

కిరీటము కలపోడు, గదను ధరించినవాడు, చిత్రమైన మాలకలవాడు, పినాకమనుధనుస్సును ధరించినవాడు, శూలము కలవాడు, దేవతలకు దేవుడు, పులిచర్మమనేడు వస్త్రముతో కప్పబడిన శరీరముకలవాడు అగు మహాదేవుని దేవితో కూడ కృష్ణుడు దర్శించేను.

ప్రభువు, పురాణపురుషుడు, సనాతనుడు, యోగి, ఈశ్వరుడు, అణువుకంటే చిన్ననైనవాడు, అనంతమైన శక్తికలవాడు, ప్రాణములకు ప్రభువు అగుశంభునీ అతడు దర్శించెను.

గండ్రగొడ్డలి చేతియందుధరించినవాడు, మూడు కన్నులు కలపాడు, నరసింహచర్మముచేత కప్పబడిన భస్మ శరీరము కలవాడు, ఓంకార నాదము చేయువాడు, వేయి సూర్యులతో సమాన తేజము కలవాడు, బృహద్రూపుడును అగు ఆదేవుని చూచెను.

ఎవని ప్రభావమును బ్రహ్మదేవుడు కాని, ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, మృత్యువు కానీ ఇప్పటికిని చెప్పజాలరో, అటువంటి ఆదిదేవుడగు రుద్రుని తన యెదురుగా చూచెను.  

అప్పుడా కృష్ణుడు శివుని వామభాగములో, అవ్యక్తరూపుడు, అనంతరూపములు కలవాడు, ఈశ్వరుని స్తోత్రము చేయుచున్నవాడు, శంఖ చక్రములు ఖడ్గము చేతులయందు కలవాడు, ఆద్యుడు అగు తన రూపమును చూచేను.

దక్షిణభాగములో అంజలీపట్టి నిలచీన దేవేంద్రుని చూచెను. హంసనధిష్టించిన, ఈశ్వరుని గొప్ప ప్రభావమును పొగడుచున్న, లోకగురువైన పీతామహుని ఆకాశమందు చూచెను. 

వేలకొలది సూర్యులతో సమానులైన గణేశ్వరులను, నందీశ్వరుడు మొదలగు అమిత ప్రభావము కలవారిని, కుమారస్వామిని, అగ్నీతో సమానుడైన గణేశ్వరుని త్రిలోకభర్తయగు శివుని ముందు భాగమున చూచెను. 

మరీచిని, అత్రీని, పులహుని, పులస్త్యుని, ప్రచేతసుని, దక్షుని, కణ్వుని, పరాశరుని, వసిష్ఠుని, స్వాయంభువ మనువును కూడ అక్కడ  క్రమముగా చూచెను.

అప్పుడు గొప్పబుద్ధీ కలిగిన విష్ణువు అంజలి పట్టినవాడై దేవితోగూడ శివునకు భక్తితో నమస్కరించి, ఆత్మయందు ఆత్మ తత్త్వమును విచారించి, దేవతలలో ప్రధానుడైన ఈశ్వరుని మంత్రములతో స్తుతించెను.  

కృష్ణుడు పలికెను :-

శాశ్వతుడా సమస్తయోగస్వరూపా బ్రహ్మాదులు, ఋషులు నిన్నుగూర్చి సత్త్వరజస్తమోగుణాత్మకుడని, నీవే సమస్తవిశ్వమని చెప్పుదురు నీకు నమస్కారము.

రుద్రా నీవు బ్రహ్మవు, విష్ణుడవు, సృష్టికర్తవు, సంహరించువాడవు. సూర్యమండలము నధిష్టించినవాడవు. నీవు ప్రాణస్వరూపుడవు, అగ్నీంద్రాది భేదములతో కన్పించు అద్వితీయుడవైన నిన్ను శరణము పొందుచున్నాను.

సాంఖ్యులు నిన్ను గుణరహితుడని, ఏకకారుడవని, యోగస్తుడవని ఎల్లప్పుడు మనస్సులో ధ్యానింతురు. వేదములు నిన్ను రుద్రుడని, నుతించదగిన వాడవని చెప్పుచున్నవి. అటువంటి దేవుడవు, ఈశుడవైన నిన్ను శరణు పొందుచున్నాను.  

నీపాదమునందు ఒక్కపుష్పముకాని, ఆకునుకాని అర్పించినవాడు సంసారబంధమునుండి విముక్తుడగును. సిద్దులచే, యోగులచేత సేవింపబడు నీపాదములజంటను స్మరించి నీయనుగ్రహమువలన సర్వపాపములను తొలగించుకొనుము.

బహువిభాగములులేనిది, నిర్మలమైనది, హృదయాంతరాళములో నుండునది, అంతములేనిదీ, అద్వితీయము, నిశ్చలము, సత్యస్వరూపము, అంతట వ్యాపించినది, శ్రేష్ఠమైనది, కోరణభూతమైనది, ఆదిమధ్యాంతరహితమైనదీ అగు నీస్థానమును గూర్చి చెప్పుదురు. దేనివలన ఇదియంతయు జనించునో అది నీపదము. సత్యవిభవము కల, విశ్వేశ్వరుడగు శివుని నిన్ను నేను ఎల్లప్పుడు సేవింతును.

నీల కంఠుడు, త్రినేత్రుడు, వేగముకలపోడు, మహాదేవుడు, ఈశానుడును అగు నీకు నమోవాకములు.

 పినాకధారియైన నీకునమస్కారము. దండముధరించిన సన్యాసివగునీకు వందనము. వజ్రము చేతియందుకల, దిగంబరుడు, కపర్దముకల వాడగు నీకు ప్రణామము.  

భయంకరమైన నాదము కలిగిన, కాలరూపుడైన, దంష్ట్రాలు కలిగియున్న, సర్పములు యజ్ఞోపవీతములుగా ధరించిన, అగ్నిరేతస్సుగా కలిగిన వాడవగు నీకు ప్రణామము.

గిరీశుడవు, స్వాహాకార రూపుడవు అగునీకు నమస్కారము. అట్టహాసము కలిగిన, భీమరూపుడవగు నీకు వందనము.  మన్మథ సంహారివి, యముని నీర్జించినవాడవు, భయంకర వేషముకలవాడవు, ధనుర్ధారివగు హరునకు నీకు సమోవాకము.

మూడుకన్నులు కల నీకు వందనము. చర్మమును వస్త్రముగా ధరించిన నీకు ప్రణామము. పార్వతీపతివీ, పశుపతివి ఆగు నీకు నమస్సులు.

ఆకాశస్వరూపుడవైన నీకు నమస్కారము. ఆకాశమునకధిపతివైన నీకు వందనము. స్త్రీ పురుష శరీరభాగములు కలవాడవు, సాంఖ్య యోగమును ప్రవర్తింప జేసినవాడవగు నీకు నమస్కారము.  

భైరవగణమునకధిపతివి, దేవతలచే పూజింపబడు లింగరూపీవి, కుమారస్వామికి తండ్రివి దేవతలకు దేవుడవగు నీకు నమోవాకములు.

 యజ్ఞముల కధిపతివి, బ్రహ్మచర్యము కలవాడవు, మృగములను వేటాడు కిరాతరూపధారివి, బ్రహ్మమున కధిపతి అగు గొప్పవాడవగు నీకు ప్రణామము.

హంస రూపుడవు, విశ్వాత్మకుడవు, మోహింపజేయు వాడవగునీకు నమస్సులు. యోగివి, యోగముచే తెలియదగినవాడవు, యోగ మాయా స్వరూపుడవు నగు నీకు వందనము.

ప్రాణరక్షకుడవు, ఘంటానాదమునందు ప్రీతికలవాడవు, కపాలధారివి, జ్యోతిస్సులకు ప్రభువైన నీకు వందనము.  

ఓ దేవా నీకు మరలమరల నమస్కారము లందించుచున్నాను. పరమేశ్వరా నాకు అన్నివిధముల అభీష్టములను అనుగ్రహించుము. 

సూతుడిట్లు చెప్పెను :-

విప్రులారా ఆ మాధవుడు ఈ విధముగా భక్తితో దేవేశుని కొనియాడి పార్వతీపరమేశ్వరుల పాదములయందు దండవత్ర్పణామ మాచరించెను.

కేశిరాక్షసుని సంహరించిన కృష్ణుని పైకిలేపి భగవంతుడగు శంకరుడు మేఘము వంటి గంభీర స్వరము కలపొడై, తీయని మాటలనిట్లు పలికెను.

ఓ కృష్ణా నీచేత ఎందుకొరకు తపము చేయబడుచున్నది? నీవు స్వయముగా అందరి కోర్కెలను, కర్మఫలములను ఇచ్చువాడవుకదా  

నీవు నారాయణ నామముకల నాయొక్క శ్రేష్ఠమైన మూర్తి భేదము. ఓ పురుషోత్తమా నీవు లేకుండా ఈ ప్రపంచము నిలువదు.  

కేశవా నిన్ను అనంతుడుగా, పరమేశ్వరునిగా తెలిసికొనుము. నీ యోగముచేత మహాదేవునిగా, మహాయోగిగా గుర్తించుము.

ఆ వాక్యమును వీని కృష్ణుడు చిరునవ్వుతో పార్వతీదేవిని, విశ్వేశుడగు రుద్రుని చూచి యిట్లు పలికేను.  

ఓ శంకరా నీచేత స్వకీయ యోగముచేత సమస్తము తెలియబడునుకదా నాతో సమాసుడు, నీకు భక్తుడును అగుపుత్రునీ కోరుచున్నాను. అను గ్రహించుము.

విశ్వాత్మకుడైన శివుడు సంతోషించిన మనస్సుతో అట్లేయగు గాక అని పలికెను. తన భార్యయగు పార్వతివైపు చూచి విష్ణువు సాలింగసము చేసికొనెను.

తరువాత, శంకరుని అర్థశరీరమును పొందినది, లోకమాత, హిమవంతుని పుత్రిక యగు పార్వతీ హృషికేశుడగు కృష్ణుని గూర్చి యిట్లు పలికెను.

అచ్యుతా కేశవా నీయొక్క నిశ్చలమైన, అనంతమైన, అనన్యమైన, ఈశ్వరుని యందు నాయందు కూడ గల భక్తిని నేను ఎరుగుదును.

నీవు సాక్షాత్తు నారాయణుడవు, పురుషోత్తముడవు, సర్వాత్మకుడవు, పూర్వము దేవతలచేత ప్రార్థింపబడి దేవకీ పుత్రుడుగా జన్మించినావు.

నీవు ఇప్పుడు ఆత్మతో ఆత్మ స్వరూపమును చూడుము. సన్నుగూడ దర్శించుము. మన ఇర్వురిలో భేదము లేదు. పండితులు మనను ఒక్క రూపముగానే చూతురు.  

కేశవా  నీకు ఇష్టములైన వరములను నానుండి స్వీకరించుము. సర్వజ్ఞత్వము, ఐశ్వర్యము, పరమేశ్వరసంబంధి యగు జ్ఞానము, ఈశ్వరుని యందునిశ్చలమైన భక్తి, నీ యందుసర్వోత్తమమైనశక్తి అను వరములను గ్రహించుము. ఇట్లు ఆ మహాదేవిచేతచెప్పబడిన జనార్దనుడగు కృష్ణుడు, ఆమె ఆదేశమును శిరసుతో స్వీకరించి ఈశ్వరుని గూర్చి అట్లేయనీపలికెను.

పిమ్మట భగవంతుడగు శంకరుడు పార్వతీదేవితో కూడినవాడై, తనచేతితో కృష్ణునిపట్టుకోని, మునులచేత, దేవతలచేత పూజింపబడుచు కైలాస పర్వతమును గూర్చివెళ్లెను.

శ్రీ కూర్మ మహా పురాణములో యదువంశానుకీర్తనయందు కృష్ణుని తపశ్చరణమను ఇరువది యైదవ అధ్యాయము సమాప్తము.