కూర్మ మహా పురాణము
31వ అధ్యాయము
ఋషులు పలికిరి.
పూర్వము అమిత తేజస్వియగు రుద్రుడు బ్రహ్మ శరీర సంభవమగు కపాలమును భూమిపై ఎట్లు స్థాపించెను.
సూత ఉవాచ-
సూత మహర్షి పలికెను.
ఋషులారా పవిత్రము పాపనాశకము జ్ఞాన రూపుడగు దేవదేవుడు మహాదేవుని కథను మాహాత్మ్యమును వినుడు.
పూర్వము ఋషులందరూ మీరు శృంగమునకు వెళ్ళి బ్రహ్మకు నమస్కరించి సకల జగత్కారణము అవ్యయ తత్త్వమేది అని అడిగిరి. అంతట సకల జగత్తును సృజించు ఆ బ్రహ్మ మహాదేవుని మాయతో మోహించబడి ఋషుల అభిప్రాయమును తెలియజాలక అభిమాన పూర్వకముగా నేనే ఈ జగత్తును ధరించువాడను. జగత్కారణుడను. స్వయంభువుడను. అద్వితీయుడను. ఈశ్వరుడను, నేనే ఆది లేని పరతత్త్వమును. నన్ను పూజించి ముక్తులగుదురు. నేనీ సకల దేవతలను ప్రవర్తింప చేయుచున్నాను. నివర్తింప చేయుచున్నాను. లోకములలో నాకంటే అధికుడింకొకడు లేడు.
బ్రహ్మ ఇట్లు చెప్పుచుండగనే నారాయణాంశతో ఉత్పన్నుడైన భగవానుడు కోపముతో కనులు ఎర్ర చేయుచు నవ్వుతూ ఇట్లు పలికెను. ఓ బ్రహ్మా నీ వెందుకిట్లు పలుకుచున్నావు: అజ్ఞానముతో మాటలాడుచున్నావు. నీకిది తగదు. నేనే ఈ లోకములను ధరించువాడను యజ్ఞ స్వరూపుడను. నారాయణుడను నేను లేకుండా ఈ జగత్తుకు ఉనికే లేదు. నేనే పరం జ్యోతిని. నేనే పరాగతిని. నా ప్రేరణతోనే నీవు జగత్తును సృజించితివి. ఇట్లు నారాయణుడు బ్రహ్మ పరస్పర జిగీషతో వివదించుకొనుచుండగా అచటికి నాలుగు వేదములు వచ్చినవి. ఆ వేదములు బ్రహ్మదేవుని, యజ్ఞ రూపుడగు విష్ణువును చూచి కలత చెందిన మనసు కలవై బ్రహ్మతో తత్త్వయాథార్థమును ఇట్లు చెప్ప సాగెను.
ఋగ్వేదము పలికెను.
సకల ప్రాణులను తనలో నిలుపుకొనినవాడు, సకల జగత్తును ప్రవర్తింప చేయువాడు పరతత్వముగా ప్రసిద్ధి నొందినవాడు మహేశ్వరుడనీ తెలియుడు,
యజుర్వేదము పలికెను.
సకల యజ్ఞములతో యోగములతో అర్చించబడువాడు ఈశ్వరునిగా పిలువబడువాడు శంకరుడు మాత్రమే.
సామవేదము పలికెను.
సకల జగత్తును ప్రవర్తింప చేయువాడు, పరమాకాశరూపుడు యోగులచే తెలియబడు పరతత్త్వము మహాదేవుడగు శంకరుడే.
అధర్వ వేదము పలికెను.
యజ్ఞము చేయుచు యతులు సాక్షాత్కరించుకొనునది ఆ మహాదేవుడు భవుడగు రుద్రుడే అని తెలియును.
ఇట్లు వేదముల పలుకులను వినినవాడై విశ్వ స్వరూపుడైన బ్రహ్మ మోహింపబడి నవ్వుచూ పలికెను. అతను పరము బ్రహ్మైనచో సర్వసంగ వర్జితుడగుచో అతి గర్వితులగు ప్రమథులతో కలిసిఎట్లుండును. భార్యతో కలిసి ఎట్లు రమీంచుచుండును.
బ్రహ్మ ఇట్లు పలుకగా సనాతనుడగు ప్రణవము మూర్తి రహితుడైననూ ఆకారమును ధరించి బ్రహ్మతో ఇట్లు పలికెను.
ప్రణవము పలికెను.
ఈ శంకరుడు తనకంటే భిన్నమగు పత్నితో ఎప్పుడూ రమించుట లేదు. మహేశ్వరుడనగా ఆత్మారాముడు ఈ శంకర భగవానుడు సనాతనుడు స్వయం ప్రకాశ స్వరూపుడు. పార్వతీ అనగా అతని ఆత్మయే. అతని ఆనందమే అట్లు రూపు దాల్చినది కానీ కొత్తగా వచ్చినది కాదు.
ఇట్లు ప్రణవము చెప్పిననూ ఈశ్వరుని మాయతో బ్రహ్మకు యజ్ఞమూర్తికి అజ్ఞానము తొలగలేదు. ఇంతలో విశ్వసష్ట ఆకాశ మధ్యమున నిలుచున్న దీవ్యము అద్భుతమగు జ్యోతిని చూచేను. ఆ జ్యోతి మధ్యలో పరిశుద్ధమైనది. తేజస్సుతో ప్రకాశించునదీ ఆకాశ మధ్యమున ఒక దివ్య మండలము ప్రాదుర్భవించెను. ఆ మండలము అన్నిటి కంటే ఉన్నతమున నుండెను. ఆకాశమున నున్న ఆ జ్యోతి కాంతిలో తన ముఖమును తాను చూచు కొనెను. ఇంతలో అజ్ఞానముతో కోపించిన బ్రహ్మ కోపముతోనే బ్రహ్మ ఐదవ శిరము కాలుచుండెను. అంతలో ఒక క్షణకాలమున నీలలోహితుడు మహా పురుషుడు త్రిశూలధారి పింగల వర్ణుడు నాగ యజ్ఞోపవీతధారీ మహేశ్వర గణములలో ఒక దేవుడు ఆవిర్భవించెను. అట్లు అవిర్భవించిన నీలలోహితుని శంకరుని చూచి బ్రహ్మ ఇట్లు పలికెను. ఓ శంకరా నీవు పూర్వము నా లలాటము నుండి పుట్టితివని తెలియుదును. కావున నన్ను శరణువేడుము. ఇట్లు బ్రహ్మ పలికిన గర్వపు మాటలను వినిన శంకరుడు లోక దాహకుడగు కాలభైరవుని పంపెను. ఆ కాల భైరవుడు బ్రహ్మతో ఘోర యుద్ధమును చేసి బ్రహ్మ ఐదవ శిరమును ఖండించేను.
ఇట్లు కాలభైరవునితో శిరస్సు ఖండించబడిన బ్రహ్మ మధ్యణీంచి ఈశ్వరానుగ్రహము వలన మరల జీవించేను. తరువాత ఆ దివ్య మండల మధ్యమున మహాదేవితో కలిసి కూర్చోనియున్న సనాతనుడగు మహాదేవుని చూచెను. ఆ మహాదేవుడు నాగరాజ కంకణుడు. చంద్రరేఖా భూషణుడు కోటి సూర్య సమానభాసుడు జటాజూట శోభితుడు శార్దూల చర్మ వస్తుడు దివ్య మాలాధారి త్రిశూలపాణి చూడ శక్యము కానీవాడు, పరమయోగి, వీభూతి భూషణుడు, సర్వదా యోగులు తమ హృదయమున సేవించు ఈశ్వరుని ఆది దేవుని బ్రహ్మ మహాదేవుని చూచెను. అతని శక్తియే ఆకాశముననున్న పరమదేవి. ఆ మహేశ్వరుడు అనంతైశ్వర్య యోగములతో చూడబడుచుండును. ఇతనికి ఒకసారి నమస్కరించినంత మాత్రమున సకల సంసార బీజమగు మోహము సమూలముగా నశించును. అట్టి రుద్రుడు సాక్షాత్కరించెను. లోకనాయకుడగు ఆ రుద్రుడు ఆచార నిరతులు కోకున్ననూ తన భక్తులుగా నున్నంత మాత్రమున పరిరక్షించు పరమేశ్వరుడు కనపడిను. వేదవిదులు శాంతులు ద్వంద్వ రహితులు బ్రహ్మచారులు మాత్రమే తెలియగలుగు పరిశుద్ధమగు రూపము గల శంకరుని చూడగలిగెను. బ్రహ్మాది సకల దేవతలు బ్రహ్మ వాదులగు ఋషులు అర్చించు లింగ స్వరూపుడగు విశ్వేశ్వరుడు కనిపించెను.
సకల జగత్తును సృజించు విజ్ఞాన రూపిణి యగు శక్తి ఎప్పుడు ప్రక్కనే యుండు శంకరుడు సాక్షాత్కరించెను. సరస్వతీ దేవితో కలిసి బ్రహ్మను తన మండలములోనే నివసింప చేసుకొని శంకరుడు కనిపించేను. పాద పద్మములపై పుష్పమును కానీ పత్రమును కానీ చివరకు జలము సమర్పించిననూ సంసారమును తరింప చేయు రుద్రుడు సాక్షాత్కరించెను. తన సాన్నిధ్యమున సకలమునకు అనుగుణముగా నియమించు కాలమునకు కాలరూపుడు శంకరుడు దర్శనమిచ్చేను. సకల లోకమునకు జీవనము, మూడు లోకములకు అలంకారము, చంద్ర భూషణుడు
ఉమాసహితుడగు శంకరుడు దర్శనమిచ్చెను, ఎపుడూ సహజముగానే పార్వతితో కలిసిఉండువాడు, ముక్తిని సర్వదా అందించువాడు దర్శన మీచ్చెను. యోగతత్త్వజ్ఞులగు యోగులచే ఎపుడూ దేవితో కలిసిఉన్ననూ వైరాగ్యభూషణిగా యోగరూపునిగా ధ్యానించబడు యోగి దర్శన మిచ్చెను. ఇట్లు మహాదేవితో కలిసి ఆసనముపై ఆసీనుడగు మహాదేవుని చూచి పరమ స్మృతిని పొందెను. ఇట్లు దీవ్యమగు మాహేశ్వర స్మృతిని పొందిన బ్రహ్మ చంద్ర భూషణుడు ఉమా సహితుడు అగు వరదుడగు శంకరుని స్తుతించెను.
బ్రహ్మ పలికెను.
మహాదేవునికి నమస్కారము. మహాదేవికి నమస్కారము. శాంతునికి శివునికి నమస్కారము. శీవకు నమస్కారము. బ్రహ్మ స్వరూపుడవగు నీకు సరస్వతీరూపునకు నమస్కారము. మహేశునకు నమస్కారము. మూల ప్రకృతికి నమస్కారము. విజ్ఞాన దేహునకు చింతా రూపునకు నమస్కారము. కాలకాలునకు ఈశ్వరునికి నమస్కారము. రుద్రునికి రుద్రోణికి నమస్కారము. కాలరూపునికి మాయకు నమస్కారము. సర్వ కార్యములను నియమించువానికి, క్షోభింపచేయుదానికి నమస్కారము. నారాయణునకు ప్రకృతికి నమస్కారము. యోగమునిచ్చు వానీకి యోగి గురువునకు నమస్కారము. నిత్యానందునకు ఆనందమూర్తికి నమస్కారము. కార్య విహీనునకు విశ్వ ప్రకృతికి నమస్కారము. ఓంకార స్వరూపునికి, ఓంకారమున నుండు వానికి నమస్కారము. వ్యోమస్థితునకు వ్యోమ శక్తికి నమస్కారము. ఇట్లు సోమాష్టకముతో ఈశ్వరుని స్తుతించి బ్రహ్మ శత రుద్రీయమును పఠించుచు దండమువలే భూమిపై పడేను. అంతట ప్రణతార్తిహరుడగు 'మహాదేవుడు చేతులతో బ్రహ్మను లేపి ఇపుడునీకు ప్రసన్నుడనైతిని అని పలికెను.
బ్రహ్మకు సాటిలేని గొప్ప ప్రభావము కల ఈశ్వర యోగమును ప్రసాదించి ఎదురుగా నిలిచియున్న నీలలోహిత రుద్రునితో ఇట్లు పలికేను, ఈ జగత్తునకు ఇతడు బ్రహ్మ. మొదటివాడు, పూజింపదగినవాడు. గుణ జ్యేషుడు నీకు తండ్రి, కావున నీవు ఇతనిని రక్షించు చుండ వలయును. ఇతడు పురాణ పురుషుడు కావున నీవు చంపరాదు. ఇతడు యోగైశ్వర్యముతో నన్నే శరణు పొందెను. గర్వముతోనున్న ఈ యజ్ఞ రూపుని నీవు శాసించవలయును. నీవు బ్రహ్మ శీరమును ధరించియుండవలయును. లోకమున బ్రహ్మ హత్యను తొలగించుకోనుటకు ఆచరించవలసిన
వ్రతమును బోధించుచు భిక్షాటన గావించుము. సురులను ద్విజులను నిలుపుము. ఇట్లు పలికిన పరమేశ్వరుడు తన పరమ నివాసమునకు వెడలెను. అంతట ఆనీల లోహితుడగు రుద్రుడు కాలభైరవునితో ఆ బ్రహ్మ శిరస్సును గ్రహింపచేసి నీవు హితము కలిగించు వ్రతమును లోకమున నాచరించుము. పాపనాశమును పొందుము. కపాల హస్తముతో అంతట భిక్షను స్వీకరించుము. అని పలికెను. తరువాత జ్వాలా మాలా భూషిత దంష్ట్రా కరాల వదన బ్రహ్మహత్య అనుకన్యను ఇతడు వారాణసీపురినీ చేరువరకు ఈ భయంకరాకారముతో ఈ త్రిశూలిని, అనుసరించుము అని పలికి పంపెను.
ఇట్లు పలికి కాలాగ్నియగు లోక మహేశ్వరులతో సొ ఆజ్ఞతో భీక్షను కోరుచు అన్ని లోకములను సంచరించుము. అనామయుడగు సొరాయణుని దర్శించినపుడు అతను' పాప శోధనమగు ఉపాయమును తెలుపగలడు. ఇట్లు దేవదేవుని వాక్యమును వీనిన హార భగవానుడు బ్రహ్మ కపాల పాణియై విశ్వరూపుని మూడు లోకములను సంచరించెను. వీకృత వేషమును ధరించి తన తేజస్సుతో ప్రకాశించుచు శోభాయుతము పవిత్రము, సాటిలేనిది జటాజూటములతో శోభించుచున్నదీ, కోటి సూర్య సమాన కాంతీయు అతి గర్వితులగు ప్రమధులతో కలిసి కాలాగ్ని నయనుడగు మహాదేవుడు విరాజిల్లు చుండెను. పరబ్రహ్మానంద రసామృతమును పానము చేసి లీలావిలాసము కలవాడై ఈశ్వరుడు లోకుల వద్దకు వచ్చెను. కాల వదనుడు శంకరుడు కాలభైరవుడు అగు రూపలావణ్య సంపన్నుని చూచి యువతీ మండలము వెంట వచ్చెను. ఆ యువతులు గానము చేసిరి. స్వామిముందు నాట్యము చేసిరి, కాల భైరవుని చిరునవ్వు ముఖమును చూచి కనుబొమలతో హావభావములను చూపసాగిరి. ఇట్లు తిరుగుచున్న కాలభైరవుడు దేవదానవాదుల ప్రదేశములను తిరిగి మధుసూదనుడు నివసించు భవనమునకు వెడలెను. లోకములకుశుభములను కలిగించు శంకరుడు ఆ దివ్య భవసమును చూచి ప్రమథ గణములతో కలిసి భవనమున ప్రవేశించ సాగెను.
ఆ పరమేశ్వరుని దివ్య ప్రభావమును తెలియక మహాబలుడగు ద్వారపాలకుడు- కాలభైరవుని ప్రవేశించరాదని వారించెను. అతడే శంఖ చక్రగదాపాణి పీతాంబరధారీ, మహా పరాక్రమశాలి విష్ణ్వంశ సంభూతుడగు విష్వక్సేనుడు. అంతట కాలబైరవుని ఆదేశముతో కాలవేగమును భయంకరమగు శంకర గణము విష్వక్సేనునితో యుద్దము చేయసాగిరి. విష్వక్సేనుడు ఆ కాలవేగుని ఓడించి క్రోధ సంరక్తలోచనుడై రుద్రాభి ముఖముగా భయంకరమగు సుదర్శన చక్రమును ప్రయోగించెను. త్రిపురారి త్రిశూలధారీ మహాదేవుడగు కాలభైరవుడు వచ్చుచున్న ఆ సుదర్శనమును నిరాదరముతో చూచెను. అంతట కాలభైరవుడు యుగాంతాన్నీ వంటి విష్వక్సేనుని వక్షః స్థలమున శూలముతో పొడిచి పడద్రోసెను. ఇట్లు శూలముతో కొట్టబడిన విష్వక్సేనుడు తన పరమ బలమును బోనాడి మృత్యువును చూచి వ్యాధిగ్రస్తులవలె ప్రాణములను విడిచెను. కాల భైరవుడు ఇట్లు విష్వక్సేనుని చంపి అతని మృతదేహమును తీసుకొని ప్రమథ గణములతో కలిసి ఆభ్యంతర భవనమున ప్రవేశించేను. ఇట్లు ప్రవేశించిన జగద్గతువగు శంకరునిచూచీ శ్రీ విష్ణుభగవానుడు లలాటము నుండి శిరమును ఛేదించుకొని రక్త ధారసు కురిపించి ఇట్లు పలికెను.
అప్రమేయ తేజశ్శలీ! భగవన్! నా ఈ భిక్షను స్వీకరించుము. త్రిపుర మర్దన ఇచట తమకు అమంగలమగు భిక్ష ఏదీ లేదు.
శ్రీ మహావిష్ణు లలాటము నుండి రక్తధార దివ్య వర్ష సహస్రము ప్రవహించసాగెను. అయిననూ ఆబ్రహ్మ కపాలము నిండలేదు. తరువాత శ్రీ మన్నారాయణుడు గౌరవ పురస్సరముగా వైదిక మంత్రములతో కాలబైరవుని స్తుతించి ఇట్లు పలికెను. మీరీ బ్రహ్మ కపాలము నెందుకు ధరించుచున్నారు అని. దానికీ కాలభైరవుడు జరిగిన వృత్తాంతమంతయు వివరించెను. అంతట హృషీకేశుడు బ్రహ్మహత్యను పిలిచి కాలభైరవుని వీడువుమని ప్రార్థించెను. అయిననూ ఆ బ్రహ్మహత్య శంకరుని విడువలేదు. అంతట జగత్కారణుడు సర్వజ్ఞుడగు శ్రీ మహావిష్ణువు చాలా సేపు ధ్యానించి శంకరునితో ఇట్లు పలికెను. భగవాన్ కొలభైరవా సకల దోషములను శంకరుడు స్వయముగా నశింప చేయు వారణాసీ పురమును వెళ్ళుము అని
తరుపోత కాలభైరవుడు రహస్యములు పరమ పవిత్రములును సకల పుణ్య తీర్థములను పుణ్యక్షేత్రములను లోకములకు హితమును చేయగోరి సంచరించెను. చేతిలో కపాలమును ధరించి నాట్యము చేయుచు మహా యోగులగు ప్రమథులచే స్తుతించబడుచు తిరుగసాగెను. కాలభైరవునీ నృత్యమును చూడగోరి శ్రీహరి మరియొక రూపమును ధరించి అతని వెంట నడువసాగెను. అనంత యోగ రూపుడు వృషభధ్వజుడగు కాలభైరవుడు గోవిందుని చూచి ప్రసన్నుడై చిరునవ్వుతో మాటిమాటికి నృత్యము చేయసాగెను. తరుపోత శ్రీహరితో అనుచరులతో కూడిన వృషభవాహనుడగు కాలభైరవుడు వారణాసి యను పేరుగల మహాదేవుని పురమును చేరెను.
ఇట్లు కాలభైరవుడు వారణాసిలో ప్రవేశించినంత మాత్రముననే హా హా అని పెద్దగా అరచుచు దుఃఖితురాలై బ్రహ్మహత్య పాతాలమున ప్రవేశించెను. తరువాత కాలభైరవుడు ఉత్తమ స్థానమున చేరి ప్రమథ గణములు చూచుచుండగా బ్రహ్మ కపాలమును ప్రతిష్టించేను. ఇట్లు బ్రహ్మకపాలమును ప్రతిష్ఠించి విష్వక్సేనుని మృత దేహమును బ్రతుకుగాక అనీ పలికి కరుణానిధి శ్రీ మహావిష్ణువున కిచ్చివేసెను.
ఇట్లు నా కపాలధారి రూపమును స్మరించిన వారికి ఇహ పరములలో అన్ని పాపములు నశించును. ఈ కపాల తీర్థమునకు వచ్చి యధా విధిగా స్నానము చేసి దేవతలను పితృదేవతలను తృప్తి పరచినవారు బ్రహ్మ హత్యా పాతకమును బోసోడుదురు. ఈ జగత్తు అశాశ్వతమని తెలిసీ ఈ క్షేత్రమున నివసించువారు పరమ జ్ఞానమును పొందీ దేహావసానమున పరమ పదమును నాచే పొందుదురు. ఇట్లు పలికిన కాలభైరవుడు జనార్దనుని ఆలింగనము చేసుకొని ప్రమథ గణముతో ఆ క్షణకాలములోనే అంతర్థానమును చెందెను.
ఇట్లు శ్రీహరి కాలభైరవుని నుండి మహా విష్వక్సేనునీ పొంది తన పరమరూపమును ధరించీ తన లోకమునకు చేరెను. ఇది శంకరునికి ప్రీతికరమైనది. సకల పాప నాశకము పరమ పావనమగు కపాలమోచన తీర్థమును గూర్చి మీకు తెలిపితిని, ఈశ్వరాధ్యాయమును బ్రాహ్మణుల సమీపమున చదివిన వారికీ కాయిక వాచిక మానసిక పాపములు తొలగిపోవును.
ఇది శ్రీ కూర్మపురాణమున షట్సాహస్ర సంహితలో ఉపరి విభాగమున 31వ అధ్యాయము.
