కూర్మ మహా పురాణము
44 - భువనకోశ వర్ణనం
సూతుడిట్లుపలికెను :-
ధ్రువస్థానమునకుపైన కోటియోజనముల విస్తారము కలిగిన మహర్లోకముకలదు. బ్రాహ్మణోత్తములారా ఆ లోకములో కల్పముల కధికారులైన పోరు నివసించియున్నారు.
మహర్లోకమునకు పైన రెండు కోట్ల యోజనముల పరిమాణము కలిగిన జనలోకమున్నది. అక్కడ బ్రహ్మదేవుని కుమారులైన సనకాది మునులు నివసింతురు. జనలోకమునకు పైన తపోలోకము మూడుకోట్ల యోజనముల విస్తారము కలిగియుండును. ఆలోకములో తేజోమూర్తులైన దేవతలు, దాహములేనివారై నిలిచియున్నారు. ప్రాజాపత్యముకంటె సత్యలోకము ఆరుకోట్ల యోజనముల దూరమందున్నది. అపునర్మారకమను పేరుగల అది బ్రహ్మలోకముగా ప్రసిద్ధము. ఈ లోకములో విశ్వాత్ముడు, విశ్వభావనుడు, లోకగురువు అగు బ్రహ్మ యోగులతో కూడి యోగామృతమును త్రాగీ వసించును.
శాంతస్వభావులు, నీష్ఠకలవారు అగు సన్యాసులు, బ్రహ్మచారులు, యోగులు, మునులు, సిద్ధులు, పరమేష్ఠినిగూర్చి జపించువారు అక్కడ నివసింతురు.
ఆ స్థానము పరమపదమును పొందు యోగులకు ఏకైకద్వారము. అక్కడికి వెళ్లినవారు ఎవ్వరును దుఃఖమును పొందరు. అతడు నారాయణరూపుడు, శంకరుడు కూడ.
ఆదేవుని పట్టణము కోటి సూర్యులతో సమానతేజము కలది. అది పొందుటకు దుర్లభమైనది. జ్వాలల సమూహములతో కూడిన ఆ స్థానమును వర్ణించుట సాకు శక్యము కాదు.
అక్కడ బ్రహ్మదేవుని పట్టణములో నారాయణదేవునీ భవనమున్నది. దానిలో మాయామయుడు, యోగీశ్వరుడు, పరమపురుషుడును అగు శ్రీమహావిష్ణువు శయనించి యుండును.
అది విష్ణులోకముగా చెప్పబడుచున్నది. అక్కడికి వెళ్లిన వారికి మరల జనన మరణాదులుండవు. జనార్దనుడగునారాయణుని ఆశ్రయించిన మహాత్ములు ఆలోకమునకు వెళ్లుదురు.
ఆబ్రహ్మలోకముకంటెపై భాగమున తేజోమయమైన, మంగళదాయకమైన పురము కలదు. అది అగ్నిహెూత్రముచేత ఆవరించబడి యుండును. అక్కడ భగవంతుడైన శివుడు నివాసముండును.
అక్కడ శంకరుడు బుద్ధిమంతులైన మహాత్ములచేత సేవింపబడుచు వేలకొలది యోగులతో, భూతగణముతో, రుద్రులతో, పార్వతీదేవితో కూడ నెలకొనియుండును.
ఆ లోకమునకు ఆసక్తులైన భక్తులు, బ్రహ్మచర్యము నవలంబించినవారు, మహాదేవుని యందు శ్రద్ధకలవారు, శాంతులు, సత్యవాదులైన మునులు వెళ్లుదురు.
అహంకారమమకారములు లేనివారు, కామము క్రోధము విడిచినవారు, యోగ్యులు అయిన బ్రాహ్మణులు ఆలోకమును చూడగలరు. అది రుద్రలోకముగా చెప్పబడుచున్నది.
ఇవి భూమికి సంబంధించిన ఏడు మహాలోకములుగా పేర్కొనబడినవి. బ్రాహ్మణులారా క్రింది భాగములో మహాతలముమొదలగు పాతాలలోకములు కలవు.
మహాతలమనబడు క్రిందీలోకము సమస్తములతో ప్రకాశించునది, సోసోవిధములైన స్వచ్చములైన సౌధములతో, దేవమందీరములతో అది కూడియుండును.
అనంతునితో, బుద్ధిమంతుడైన ముచుకుందునితో, స్వర్గవాసియగు బలిరాజుతో పాతాళము కూడియున్నది.
ద్విజులారా రసాతలము శిలామయముగా, తలాతలము మొరపనేల కలదీగా, సుతలము పసుపుపచ్చ నేలకలదిగా, వితలము పగడాల రంగు కలదై ఉండును.
వితలము తెలుపురంగుగాను, తలము నల్లరంగుతోను ఉండును. ఈలోకములు గరుత్మంతునితో, వాసుకితో, ఇంకను ఇతరులతో కూడి రసాతలమను పేర ప్రసిద్ధమైనవి. అది విరోచనుడు, హిరణ్యాక్షుడు మరియు తారకాది రాక్షసులచేత ఆశ్రయించబడినది.
తలాతలమనుపేర ప్రఖ్యాతమైన, అన్ని సౌందర్యాలతో కూడియున్న లోకము వైనతేయుడు, కాలనేమి ప్రభృతులచే సేవింపబడి యుండును.
సుతలము పూర్వదేవులచే వ్యాపించబడి, ఇతరులతో కూడ కూడియున్నది. వితలము యవనాదులచేత, తారకాగ్ని ప్రభృతులతో కూడి యుండును.
జంభకుడు మొదలగునాగులచేత, అసురుడైన ప్రహ్లాదునితోకూడ కంబలసొమక సర్పరాజుచేత సేవింపబడునది వితలమనీ ప్రసిద్ధమైనది.
వీరుడైన మహాజంభునితో, బుద్ధిశాలియైన హయగ్రీవునితో శంకుకర్ణునితో కూడి మరియు నముచి మొదలుగా కల ఇతర వివిధ నాగజాతులతో మిక్కిలి అందమైన తలము ఒప్పుచున్నది. ఆలోకాలకు క్రిందిభాగాన కూర్మాది నరకములు పేర్కొనబడినవి.
ఆ నరకములలో పాపాత్ములు శిక్షింపబడుదురు. వారిని వర్ణించుట శక్యముకాదు. పాతాళలోకములకు అడుగుభాగములో శేషనామకమైన విష్ణుసంబంధీ శరీరము కలదు.
ఆ శేషమూర్తి కాలాగ్నిరుద్రుడని, యోగాత్ముడని,నారసింహుడు, మాధవుడు, అనంతుడు అనియు, నాగరూపము ధరించిన జనార్దనుడనియు ప్రస్తుతింపబడుచున్నాడు.
ఈ సమస్తము ఆయనపై ఆధారపడియున్నది. అతడు కాలాగ్నిని ఆశ్రయించి ఉన్నాడు. గొప్పయోగియగు కాలుడు అతని సొవేశించి ముఖమునందు నివసించుచు, విషజ్వాలలతో నిండిన ఈశ్వరరూపుడై స్వయముగా విశ్వమును సంహరించును. వేయి మారిదేవతల సమానుడైన శంకరుడు సంహరించువాడగుచున్నాడు. తమోగుణ ప్రధానమైన, శంభునికి సంబంధించిన మూర్తియే లోకములను లయింపజేయు కాలరూపుడు.
శ్రీ కూర్మపురాణములో భువన విన్యాసవర్ణనలో నలుబది నాలుగవ అధ్యాయము సమాప్తము.
